మంచి సినిమా చేయాలనుకున్నాం.. కానీ..! | Fatima Sana Shaikh on Thugs of Hindostan Result | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 11:41 AM | Last Updated on Thu, Dec 20 2018 11:41 AM

Fatima Sana Shaikh on Thugs of Hindostan Result - Sakshi

థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ ఫలితం చిత్రయూనిట్‌కు గట్టి షాకే ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈసినిమాకు తొలి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. ఆమిర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ల కాంబినేషన్‌ ఫాతిమా సనా షేక్‌ సాహసాలు, కత్రిన అందాలు కూడా సినిమాను కాపాడలేకపోయాయి. దీంతో చిత్రయూనిట్ కూడా సినిమా ఫ్లాప్‌ అన్న విషయం బహిరంగంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి ఫాతిమా సనా షేక్‌. ‘అవును.. నిజంగానే థగ్స్‌ఆఫ్‌ హిందుస్థాన్‌ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఫలితం తెలిసి గుండె పగిలినంత పనైంది. మేమంత ఓ మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని చాలా కష్టపడ్డాం. కానీ మా ప్రయత్నం ఫలించలేదు. ప్రేక్షకులకు మా సినిమా నచ్చలేదు’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement