థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ : అమితాబ్‌ లుక్‌ | Amitabh Bachchan Look In Thugs of Hindostan | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 12:01 PM | Last Updated on Tue, Sep 18 2018 12:33 PM

Amitabh Bachchan Look In Thugs of Hindostan - Sakshi

బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ధూమ్‌ 3 సినిమాతో దర్శకుడిగా ప్రూవ్‌ చేసుకున్న స్టార్‌ రైటర్‌ విజయ్‌ కృష్ణ ఆచార్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1839 కాలం నాటి నవల ‘కన్ఫెషన్స్‌ ఆఫ్ థగ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌, రోనిత్‌ రాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దీపాకళి సందర్భంగా రిలీజ్ చేయాలని  ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఇప్పటికే టైటిల్‌ లోగో మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన యూనిట్ తాజాగా సినిమాలో అమితాబ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. ఈ సినిమాలో అమితాబ్‌ ఖుదాబక్ష పాత్రలో కనిపించనున్నట్టుగా వెల్లడించారు. స్వాతంత్ర్యోధ్యమానికి పూర్వం జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యష్ రాజ్‌ ఫిలింస్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అజయ్-అతుల్‌‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement