పాట కోసం పాట్లు! | Katrina Kaif spills the beans about being upset with Thugs of Hindostan co-star Aamir Khan | Sakshi
Sakshi News home page

పాట కోసం పాట్లు!

Published Sun, Jan 21 2018 12:37 AM | Last Updated on Sun, Jan 21 2018 12:37 AM

Katrina Kaif spills the beans about being upset with Thugs of Hindostan co-star Aamir Khan - Sakshi

రిస్కీ ఫైట్స్‌ చేయడం కోసం ఎవరైనా మజిల్‌ ట్రైనింగ్‌ లాంటివి చేస్తారు. హెవీ ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుంటారు. కానీ కత్రినా కైఫ్‌ పాట కోసం ఇవన్నీ చేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ పాట కోసం చాలా పాట్లు పడుతున్నారీ బ్యూటీ. ఇంతకీ ఏ సినిమాలోదీ పాట? ఎందుకీ పాట్లు? అయినా ‘షీలా కీ జవానీ...’, ‘చిక్‌నీ చమేలీ..’ వంటి ఐటమ్‌ సాంగ్స్‌లో అదిరిపోయేలా స్టెప్పులు వేసిన కత్రినా కైఫ్‌కి పాట్లా అనుకుంటున్నారా? ఆ పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఈ పాట మరో ఎత్తు. అంత స్పెషల్‌ ఏంటంటే... కొన్ని స్టెప్స్‌ జిమ్నాస్టిక్స్‌ స్టైల్‌లో ఉంటాయట.

పైగా ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌. ఇక.. స్టెప్స్‌ ఎలా ఉంటాయో వేరే చెప్పాలా? ఇంతకీ ఈ పాట ఏ సినిమాలో అంటే, ఆమిర్‌ ఖాన్, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తోన్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’లో. త్వరలో ఈ పాట చిత్రీరించనున్నారు. కానీ ప్రాక్టీస్‌ కొన్ని రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సాంగ్‌ కోసం కత్రినా తన వర్కవుట్‌ స్టైల్‌ని, డైట్‌నీ మార్చేశారు. హెవీ ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుంటున్నారట. కార్డియో ఎక్సర్‌సైజులు చేస్తున్నారట. అది మాత్రమే కాదు.. రోజుకి ఐదు గంటలు ప్రాక్టీస్‌ చేస్తున్నారట. ముంబైలో వేయించిన భారీ సెట్‌లో త్వరలో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement