టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ సినిమాతో కలిసి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం మరింత ఆలస్యం కానుందట. ముందుగా ఈ థియేటర్స్‌ను థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా రిలీజ్ రోజే ప్రారంభించాలని ప్లాన్ చేశారు.
అయితే పనులు పూర్తి కాకపోవటంతో ప్రతిష్టాత్మక చిత్రం 2.ఓ రిలీజ్ సందర్భంగా నవంబర్ 29న ఓపెన్ చేయాలని భావించారు. కానీ ఇప్పటికీ లేజర్ స్క్రీనింగ్‌కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవటంతో ప్రారంభోత్సవం మరింత ఆలస్యం కానుందట. అధునాలతన సౌకర్యాలతో రూపొందించిన ఈ థియేటర్స్‌ను డిసెంబర్ 2న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నిర్వహకులు మాత్రం ఇంత వరకు ఓపెనింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment