
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం ప్రేమిస్తావా. ఈ మూవీని పంజా ఫేం విష్ణు వర్ధన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓకే స్కూల్లో చదివినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన బెంచ్‌మేట్ అయిన ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. మహేశ్ బాబుతో తన అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..' మహేశ్ బాబుతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మేమిద్దరం బెంచ్‌మేట్స్. ఆయనతో చాలా మధురమైన, సరదా క్షణాలు ఉన్నాయి. కొన్నింటిని బయటికే చెప్పలేం. మేము చెన్నైలో చదివే రోజుల్లో నేను చాలా యావరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ అనుకోండి. మహేశ్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు. ఒక ఏరియాలో ప్రశ్న పత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు. ఈ విషయం మహేశ్ బాబుతో చెప్పా. నేను వెంటనే మహేశ్ బాబును లాక్కొని అక్కడికి తీసుకెళ్లా. కానీ అక్కడకు వెళ్తే మా డబ్బులు పోయాయి కానీ క్వశ్చన్ పేపర్ అయితే దొరకలేదు. అన్నీ ఫేక్. మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేశ్ బాబు సినిమా తీస్తా' అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
నేను, #MaheshBabu డబ్బులిచ్చి QUESTION PAPER కొనేవాళ్ళం 😂 - Director #VishnuVardhan#Premisthava #TeluguFilmNagar pic.twitter.com/cq5gNxJovt
— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2025
Comments
Please login to add a commentAdd a comment