classmate
-
మహేశ్ బాబు, నేను కలిసి క్వశ్చన్ పేపర్ కొనేవాళ్లం: టాలీవుడ్ డైరెక్టర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం ప్రేమిస్తావా. ఈ మూవీని పంజా ఫేం విష్ణు వర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓకే స్కూల్లో చదివినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన బెంచ్‌మేట్ అయిన ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. మహేశ్ బాబుతో తన అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..' మహేశ్ బాబుతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మేమిద్దరం బెంచ్‌మేట్స్. ఆయనతో చాలా మధురమైన, సరదా క్షణాలు ఉన్నాయి. కొన్నింటిని బయటికే చెప్పలేం. మేము చెన్నైలో చదివే రోజుల్లో నేను చాలా యావరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ అనుకోండి. మహేశ్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు. ఒక ఏరియాలో ప్రశ్న పత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు. ఈ విషయం మహేశ్ బాబుతో చెప్పా. నేను వెంటనే మహేశ్ బాబును లాక్కొని అక్కడికి తీసుకెళ్లా. కానీ అక్కడకు వెళ్తే మా డబ్బులు పోయాయి కానీ క్వశ్చన్ పేపర్ అయితే దొరకలేదు. అన్నీ ఫేక్. మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేశ్ బాబు సినిమా తీస్తా' అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. నేను, #MaheshBabu డబ్బులిచ్చి QUESTION PAPER కొనేవాళ్ళం 😂 - Director #VishnuVardhan#Premisthava #TeluguFilmNagar pic.twitter.com/cq5gNxJovt— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2025 -
క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవిత ఖైదు
బీజింగ్: క్లాస్‌మేట్‌ను దారుణంగా చంపిన నేరానికి గాను ఇద్దరు టీనేజర్లకు చైనా న్యాయస్థానం కఠిన జైలు శిక్షలు విధించింది. వీరిలో ఒకరికి జీవిత ఖైదు, మరొకరికి 12 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మరో టీనేజర్‌ను కరెక్షన్ సెంటర్‌కు పంపించింది. హెబీ ప్రావిన్స్‌లోని హండన్‌లో ఈ ఏడాది మార్చిలో చోటుచేసుకున్న ఈ ఘటన చైనాలో సంచలనం కలిగించింది. బాధితుడు, దోషుల వయస్సు 13 ఏళ్లు. అందుకే అధికారులు వీరిని క్లుప్తంగా ఇంటి పేర్లతో వెల్లడించారు. క్లాస్మేట్ వాంగ్‌ను కొంతకాలంగా ఝాంగ్, లి, మా అనే బాలురు వేధిస్తున్నారు. వాంగ్‌ను చంపాలని ఝాంగ్ పథకం వేశాడు. దాని ప్రకారం మార్చి 3న నగరం శివార్లలోని పాడుబడ్డ గ్రీన్ హౌస్‌కు అతడిని తీసుకెళ్లాడు. అనుకున్న ప్రకారం మిగతా ఇద్దరూ అక్కడికి వచ్చారు. వాంగ్‌ను ఝాంగ్ పారతో కొట్టడం మొదలుపెట్టగా అతడికి లి సహకరించాడు. ఇది చూడలేక మా అక్కడికి నుంచి వెళ్లిపోయాడు. దెబ్బలతో చనిపోయిన వాంగ్‌ను ఇద్దరూ కలిసి అక్కడున్న గుంతలో పూడ్చి వేశారు. మార్చి 10న పోలీసులు ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగుచూసింది. సోమవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం..ఇది చాలా హేయమైన, క్రూరమైన చర్యగా అభివరి్ణంచింది. నేరానికి ప్రధాన సూత్రధారి ఝాంగ్‌కు జీవిత ఖైదును, అతడికి సహకరించిన లి కి 12 ఏళ్ల జైలు శిక్షను విధించింది. మూడో బాలుడు మా ను పరివర్తన విద్యాకేంద్రానికి పంపించాలని తీర్పు వెలువరించింది. అయితే, వీరిని ఈ నేరానికి పురిగొలి్పన అసలు కారణాలు మాత్రం తెలియరాలేదు. కోర్టు తీర్పుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. కఠిన శిక్షల భయం లేనందునే పిల్లలు కూడా ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ నలుగురి తల్లిదండ్రులు నగరానికి పనుల నిమిత్తం వెళ్లిపోగా, అమ్మమ్మతాతల వద్ద ఉంటూ అల్లరిచిల్లరగా తిరగడం అలవాటు చేసుకున్నారని చెబుతున్నారు. 2020 నాటి గణాంకాల ప్రకారం ఇలా ‘వదిలివేయబడిన బాలలు’దేశంలో 6.70 కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. -
ఫేర్వెల్ పార్టీలో హడలెత్తించిన బాలిక.. శవపేటికలో నుంచి లేచి..
చాలామంది చిన్నారులు స్కూల్ ఫేర్వెల్ పార్టీకి అందమైన వస్త్రధారణతో వస్తుంటారు. అయితే 16 ఏళ్ల అబీ రికెట్స్ తమ స్కూల్ ఫేర్వెల్ కార్యక్రమానికి విచిత్ర రీతిలో సిద్ధమై వచ్చింది. తన క్లాస్‌మేట్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు ఒక షో-స్టాపింగ్ స్టంట్‌కు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఆమె ఒక శవపేటికతో పాటు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. స్కూల్ ఫేర్వెల్ పార్టీ రోజున ఆమె నలుపురంగు దుస్తులు ధరించింది. తరువాత ఆరడుగుల శవపేటికలో పడుకుంది. చేతులను క్రాస్‌చేసి పెట్టుకుంది. అప్పుడు ఆమెతో పాటు వచ్చిన అంత్యక్రియల నిర్వహణ సిబ్బంది ఆ శవ పేటికను రెడ్ కార్పెట్‌పై ఉంచారు. ఇంతలో ఆమె ఎంతో నాటకీయంగా తన కళ్లను తెరిచింది. అక్కడున్నవారంతా ఆమెను చూసి కేకలు పెట్టారు. చుట్టుపక్కలవారు కేకలు పెడుతూ.. ఈ ఘటన గురించి అబీ వివరిస్తూ..‘అప్పుడు నన్ను చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా ఆందోళనగా కేకలు పెట్టారని, అసలు విషయం గ్రహించి చప్పట్లు కొట్టారన్నారు. మా ఉపాధ్యాయులు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని’ అన్నారని ఆమె తెలిపింది. అబీ అంత్యక్రియల ‘షో’లో ఆమె తండ్రి, సోదరుడు కూడా ఆమెకు సహకరించారు. వారు అంత్యక్రియల నిర్వాహకుల పాత్ర పోషించారు. ఈ విధంగా అందరినీ భయపెట్టేందుకు అబీ రెండు గంటల పాటు అలంకరణ చేసుకుంది. కుమార్తె షో అద్భుతమంటూ.. తాము శవవాహనం అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించామని, అయితే ఇలాంటి షో కోసం ఎవరూ వాహనం ఇవ్వబోమని చెప్పారని అబీ తెలిపింది. దీంతో తమ ఇంటిలోని వారే తన షో కోసం అన్ని ఏర్పాట్ల చేశారని చెప్పింది. ఈ సందర్భంగా అబీ తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తె చేసిన షో విషయంలో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇది కలకాలం నిలిచిపోతుందన్నారు. ఇది కూడా చదవండి: గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..! -
వ్యాపారవేత్త కుమార్తెతో రామ్ పెళ్లి?
టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్టులో చాలా మంది హీరోలే ఉన్నారు. వారిలో రామ్ కూడా ఒకరు. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ తన చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి చదువుకోవడంతో స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమగా మారిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్) రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ పెళ్లి టాపిక్‌లోకి ఎంట్రీ ఇచ్చారని, రామ్ తరపున అమ్మాయి తండ్రితో కూడా ఆయన చర్చలు జరిపారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే రామ్ పెళ్లి జరుగుతుందని ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై తాజాగా స్రవంతి రవికిషోర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తలను ఆయన కొట్టిపారేసినట్లు సమాచారం. ఒకవేళ రామ్ పెళ్లికి రెడీ అయితే దాన్ని దాచాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్ధలు కొట్టాడట. ఈ ఏడాదే పెళ్లి జరగనుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే రామ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) -
హైదరాబాద్‌లో దారుణం.. క్లాస్‌మేట్‌పై అఘాయిత్యం.. రహస్యంగా వీడియో చిత్రీకరించి..
హిమాయత్‌నగర్(హైదరాబాద్): కాల్‌మనీ తరహా ఉదంతం హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. ఎంబీఏ విద్యార్థినికి అప్పు ఇచ్చిన ఆమె క్లాస్మేట్ తిరిగి చెల్లించలేకపోవడాన్ని అదునుగా భావించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. షీ టీమ్ ద్వారా వివరాలు తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నారాయణగూడలోని ఓ కళాశాలలో ఎంబీఏ ఫస్టియర్ చదువుతున్న యువతి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కొన్ని నెలల క్రితం తన క్లాస్మేట్ నుంచి డబ్బు తీసుకుంది. నిర్ణీత సమయంలో ఆ యువతి ఈ బకాయి తీర్చలేకపోయింది. దీంతో అతడు ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నగదు చెల్లించాలంటూ ఒత్తిడి చేసి ఆమెను నిస్సహాయురాలిని చేశాడు. ఆ డబ్బు అడగకుండా ఉండాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. గత్యంతరం లేని ఆమె అంగీకరించడంతో కొన్ని రోజుల క్రితం నారాయణగూడలోని ఓయో రూమ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా ఉండగా సదరు యువకుడు రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. దాన్ని మరుసటి రోజు తన స్నేహితులకు చూపించాడు. అప్పటి నుంచి ఇతడితోపాటు మరో నలుగురు యువకులు తమ కోరిక తీర్చాలంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. అలా చేయకుంటే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. చదవండి: అతనికి కుటుంబమే ప్రాణం.. మరి గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పేజ్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారు. మానసిక క్షోభకు గురైన యువతి ఇటీవల షీ టీమ్‌ను ఆశ్రయించింది. నిందితులపై కేసు పెట్టాలని షీటీమ్ నారాయణగూడ పోలీసులకు సిఫార్సు చేసింది. దీంతో ఐదుగురు యువకులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వీరిని గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. -
సొంత కూతురిపైనే సైబర్ వేధింపులు! ఆఖరికి కూతురి క్లాస్‌మేట్‌ను...
సొంత కూతురిపైనే సైబర్ వేధింపులకు ఒడిగట్టింది ఒక మహిళ. ఆఖరికి ఆమె బాయ్‌ఫ్రెండ్, క్లాస్మేట్లను సైతం వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలడంతో ఆమె జైలు పాలయ్యింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...42 ఏళ్ల కెన్రా గెయిల్ లికారీ అనే మహిళ తన సొంత కూతరిని, ఆమె బాయ్ప్రెండ్ని, క్లాస్మేట్స్ని వివిధ మెసేజ్‌లతో సైబర్ వేధింపులకు పాల్పడింది. ఆమె ఫేక్ ఐడింటిటీతో 2021 నుంచి ఆన్లైన్లో టీనేజర్లను ఇలా వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు టినేజర్లను వేధింపులకు గురిచేస్తున్నట్లు బీల్ సిటీ పబ్లిక్ స్కూల్స్ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును దర్యాప్తు చేసింది. విచిత్రమేమిటంటే సదరు మహిళ ఆ స్కూల్లోనే బాస్కెట్ బాల్ కోచ్‌గా పనిచేస్తోంది. ఐతే విచారణలో సదరు మహిళ ఫేక్ ఐడింటిలతో టీనేజర్లను లక్ష్యంగా వేధించే సందేశాలను పంపినట్లు పోలీసులు గుర్తించారు. తనను గుర్తుపట్టకుండా ఉండేలా సాఫ్ట్‌వేర్‌ను, వివిద ప్రాంతాల నెంబర్లను, కోడ్లను వినియోగించినట్లు తేలింది. సైబర్ పోలీసులు ఆమెను ఐపీ అడ్రస్ సాయంతో ఆమెను ట్రాక్ చేశారు. ఆమె తన కూతురికి లేదా ఆమె క్లాస్మేట్లకి పంపించిన సుమారు పదివేల టెక్స్ట్ మెసేజ్‌లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు మహిళపై ఐదు ఆరోపణలు మోపి కోర్టు ముందు హజరపరిచారు. దీంతో ఆమె సైబర్ వేధింపులకు పాల్పడినందుకుగానూ 10 ఏళ్లు జైలు శిక్ష, నేరాన్ని తారుమారు చేసేందుకు యత్నించినందుకు గానూ మరో ఐదు ఏళ్లు జైలు శిక్ష ఎదుర్కొటోంది. ఐతే ఆమె ప్రస్తుతం తాజాగా సుమారు రూ. 4 లక్షల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యింది. (చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్! కారణం ఏంటంటే..) -
విష ప్రయోగానికి గురైన బాలుడి మృతి
సాక్షి, చెన్నై: ఓ కిరాతక తల్లి చేసిన విష ప్రయోగంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం రాత్రి మృతి చెందాడు. సరైన వైద్యం అందక పోవడంతోనే ఆ బాలుడు మరణించాడని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడనే అసూయతో 8వ తరగతి విద్యార్థి బాల మణిగండన్‌పై ఓ విద్యార్థిని తల్లి శీతల పానీయంతో శుక్రవారం విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఆ బాలుడికి పుదుచ్చేరిలో అత్యవసర చికిత్స అందించారు. ఆ బాలుడు తన తల్లిదండ్రులు రాజేంద్రన్, మాలతి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పాఠశాల సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లి సహాయ రాణి విక్టోరియా చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. సరైన చికిత్స అందలేదా..? పోలీసులు కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించినా, వైద్యులు మాత్రం ఆ బాలుడికి సరైన చికిత్స అందించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత కోలుకున్నాడని భావించిన బాల మణిగండన్ ఆరోగ్యం శనివారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. విషం శరీరంలోకి కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ బాలుడు మరణించాడు. దీంతో అతడి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. అదే సమయంలో ఆస్పత్రిలో సరైన వైద్యం అందించ లేదని, నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించారని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ విద్యార్థిపై విష ప్రయోగం చేసి హతమార్చిన సహాయ రాణి విక్టోరియాపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
క్లాస్‌మేట్‌ను పెళ్లి పేరుతో ట్రాప్.. ఆ తర్వాత..
సాక్షి, హైదరాబాద్: ఒకప్పటి తన క్లాస్‌మేట్‌ను పెళ్లి పేరుతో ట్రాప్ చేశాడు. సౌదీలో వ్యాపారం ప్రారంభిస్తున్నానంటూ 2019లో రూ.6 లక్షలు తీసుకున్నాడు. అప్పటి నుంచి మాటల గారడీ చేస్తూ వచ్చాడు. మధ్యలో రూ.లక్ష తిరిగి చెల్లించాడు. చివరికి తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో అందినంత దోచుకుని.. నగరానికి చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం బ్యాంకు పరీక్షల కోసం సిద్ధమవుతూ వరంగల్‌లోని ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంది. అప్పట్లో ఈమెతో పాటే కోచింగ్ తీసుకున్న ఓ యువకుడు ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. 2019లో సోషల్‌మీడియా ద్వారా ఈమెను సంప్రదించిన అతగాడు తాను ఫలానా అంటూ పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్న ఇరువురూ కొన్నాళ్లు కాల్స్, చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపారు. తాను సౌదీ అరేబియాలో ఉంటున్నానని, తిరిగి వచ్చాక వివాహం చేసుకుందామని నమ్మించాడు. సౌదీలోనే వ్యాపారం మొదలెడతానంటూ రూ.6 లక్షలు అడిగాడు. ఈ మొత్తం ఇవ్వడానికి యువతి అంగీకరించింది. ఖాతాలో డబ్బులు వేయించుకున్నాడు. అప్పటి నుంచి ఇదిగో వస్తా... అదిగో వస్తా.. అంటూ యువతితో చెబుతూ వచ్చాడు. బాధితురాలు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో రూ.లక్ష ఆమె ఖాతాకు పంపాడు. మిగిలిన మొత్తం పంపకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నయన్‌కు క్లాస్మేట్ స్పెషల్ విషెస్ : వైరల్
సినీ రంగంలో, దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణతో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న హీరోయిన్ నయన తార. అందాల నటి నయన్‌కు అభిమానులు, సన్నిహితులతో పాటు, ఆమె ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు వేడుకని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నయన తార క్లాస్మేట్ ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు విశేషంగా నిలిచింది. 36వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కేరళకు చెందిన మహేష్ కదమ్మనిట్ట ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలోని తిరువల్లలోని మార్తోమా కాలేజీలో నయనతారకు డిగ్రీ క్లాస్మేట్ మహేష్. ఆయన ఇలా రాశారు ‘‘డిగ్రీలో తన పక్కన కూర్చున్న తన స్నేహితురాలు సూపర్ స్టార్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా పురుషాధిపత్యం, నెపోటిజం పరిశ్రమను ఏలుతున్న తరుణంలో సినిమా నేపథ్యం ఏ మాత్రం లేని ఒక మహిళ తన కాళ్ళ మీద తను గట్టిగా నిలబడటం ఆశ్చర్యం. కరియర్ ఆరంభంలో అభిమానుల కంటే విమర్శలే ఎక్కువ. అయినా వాటన్నింటినీ తట్టుకుని మొత్తం సినిమా ప్రపంచాన్ని ఏలే శక్తిగా ఎదుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ పరిశ్రమ మీద గౌరవంతో విమర్శలన్నింటినీ అధిగమించింది. పరిపూర్ణమైన కృషి అంకితభావం వల్లనే ఆమె విజయతీరాలకు చేరింది’’. 17 ఏళ్లుగా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉండటం అద్భుతం తిరువల్లలోని చిన్న గ్రామం నుండి వచ్చి, కృషి పట్టుదలతో ఇంతటి ఘనతను సాధించిన మై డియర్ డయానా(నయనతార) నీకు వేనవేల పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్బంగా మార్తోమా కాలేజీలో 2002-05 నాటి ఆంగ్ల సాహిత్య బ్యాచ్‌లో నయన తార చేతి రాతతో ఉన్న నోట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. అంతేకాదు ఇంతకాలంపాలు ఈ నోట్‌ను భద్రంగా దాచిపెట్టిన తన భార్యకు మహేష్ కృతజ్ఙతలు తెలిపారు. -
క్లాస్‌మేట్‌పై కక్షతోనే ‘పార్శిల్స్’?
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ సహా పదుల సంఖ్యలో ప్రముఖులకు ‘పార్శిల్స్’ పంపే ప్రయత్నం చేయడం వెనుక ఉద్దేశం సమాజహితం కాదని... క్లాస్‌మేట్‌పై వ్యక్తిగత కక్షేనని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ పని చేసిన కమ్మరివాడికి చెందిన ఎంబీఏ డ్రాప్‌ఔట్ వెంకట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. సదరు క్లాస్మేట్ మహిళపై ఇతడు ఎందుకు కక్ష కట్టాడు? ఆమెతో పాటు ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్ల పేరుతో వాటిని ఎందుకు పంపాడు? తదితర అంశాలను తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఉదంతంతో పోస్టాఫీసుల్లో ఉన్న భద్రత లోపాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించారు. సికింద్రాబాద్, కమ్మరివాడికి చెందిన వెంకట్ బోయిన్‌పల్లిలోని ఉస్మానియా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలో కొన్నేళ్ల క్రితం ఎంబీఏలో చేరాడు. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో డ్రాప్ఔట్గా మారాడు. అయితే తాను అన్ని పరీక్షలు సక్రమంగానే రాశానని, వర్శిటీ ప్రొఫెసర్లే ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించి అతను కోర్టులో ఓ కేసు కూడా దాఖలు చేసినట్లు తెలిసింది. ఇతడితో పాటు అదే కళాశాలలో నగరానికి చెందిన ఓ యువతి సైతం ఎంబీఏలో చేరారు. ఆమె చదువు పూర్తికావడంతో ప్రస్తుతం వేరే ప్రాంతంలో నివసిస్తున్నారు. గడిచిన కొన్నాళ్ళుగా చిత్రంగా ప్రవర్తిస్తున్న వెంకట్ శుక్రవారం సాయంత్రం కమ్మరివాడి నుంచి 62 పార్శిళ్లను ఓ ఆటోలో తీసుకుని ప్యాట్నీలోని హెడ్–పోస్టాఫీస్‌కు వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోయినట్లు సిబ్బంది చెప్పడంతో మరుసటి రోజు వస్తానని చెప్పిన అతడు వాటిని అక్కడే ఉంచి వెళ్లాడు. తిరిగి శనివారం ఉదయం 11.30 గంటలకు పోస్టాఫీస్‌కు వచ్చిన వెంకట్ ముఖ్యమంత్రికి చెందిన నాలుగు చిరునామాలు, డీజీపీతో పాటు ప్రముఖులతో కలిపి మొత్తం 62 మందికీ ఆ బాక్సులను పంపాలంటూ వారి చిరునామాలు ఇచ్చి బుక్ చేయించారు. దీనికి సంబ«ంధించి రూ.8 వేలు చెల్లించాడు. ఆ సందర్భంగా పోస్టాఫీసు అధికారులు ఆ పార్శిల్స్‌లో ఏ ముందని ప్రశ్నించగా పుస్తకాలు ఉన్నట్లు తెలిపాడు. ఎక్కడా తన గుర్తింపు బయటపడకుండా బోగస్ వివరాలు ఇచ్చాడు. సోమవారం పార్శిల్స్ పంపడానికి ప్రయత్నించిన పోస్టాఫీసు డిస్పాచ్ సిబ్బంది వాటిని తరలించే ప్రయత్నం చేశారు. ఓ బాక్సును పైకి ఎత్తగా అందులో ద్రవ పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు అన్నీ అలాగే ఉండటంతో ఓ పార్శిల్స్ తెరిచారు. అందులో రెండు బాటిళ్ళల్లో మురుగునీరు, బుదర ఉండటాన్ని చూసిన సిబ్బంది తొలుత వాటిని రసాయనాలుగా, ప్రముఖులకు పంపాలని చూడటంతో దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానించారు. దీంతో మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సైంటిఫిక్ అధికారులను రప్పించి పరీక్షలు చేయించగా, అవి డ్రైనేజ్ వాటర్, బురదగా తేలింది. దీంతో స్థానికంగా ఉన్న మురుగునీరు, మంచినీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఈ పని చేసి ఉంటారని అనుమానించారు. అయితే ముఖ్యమంత్రికి అడ్రస్ చేసిన పార్శిల్‌పై ఓ మహిళతో పాటు ఓయూ వీసీ ఎస్.రామచంద్ర, ప్రొఫెసర్ విఠల్ పేర్లు ప్రస్తావించాడు. సదరు మహిళ ‘ఏజీఏఏఆర్‌ఏఎల్‌ఆర్‌ఓ’ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నట్లు రాశాడు. దీంతో అనుమానించిన సీనియర్ పోస్టు మాస్టర్ వెంకట రమణరెడ్డి మంగళవారం మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐసీపీలోని 419, 506, 511 సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సాంకేతికంగానూ దర్యాప్తు చేసి వెంకట్‌ను గుర్తించి పట్టుకున్నారు. ఇతడు సదరు యువతి పేరుతో పాటు డాటరాఫ్ అంటూ టీఆర్ఎస్ నాయకుడి పేరు రాశాడు. అయితే ఆయన ఆమె సమీప బంధువే తప్ప తండ్రి కాదని మహంకాళి పోలీసులు నిర్థారించారు. వెంకట్‌కు తన క్లాస్మేట్ అయిన ఆ మహిళపై ఎందుకు కక్ష, ఓయూ ప్రొఫెసర్లు పేరు పార్శిల్ ఫ్రం అడ్రస్‌లో ఎందుకు రాశాడు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతంతో పోస్టల్‌శాఖ మేల్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా పోస్టాఫీసులు, పార్శిల్ సెక్షన్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాము ఈ ప్రతిపాదనలకు సంబంధించి గత నెల్లోనే ఉన్నతాధికారులకు లేఖ రాశామని, ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీనియర్ పోస్టుమాస్టర్ రమణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పోస్టాఫీసు, పార్శిల్స్ భద్రత విషయంలో ఆందో«ళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. -
ప్రియురాలి కోసం కొట్టుకున్నారు..
బంజారాహిల్స్: తన ప్రియురాలిని గత రెండు నెలలుగా మాయ మాటలు చెప్పి తన వద్ద ఉంచుకున్నాడంటూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడటమే కాకుండా ఆమెకు ఆశ్రయం ఇచ్చిన యువకుడిపై తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్ బీటెక్ చదివే సమయంలో తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల రేవంత్ ప్రవర్తన నచ్చని యువతి అతడితో బ్రేకప్ చేసుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.3 అరోరాకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు అఖిల్(26) వద్దకు వచ్చింది. కన్సల్టెంట్‌గా పని చేస్తున్న అఖిల్ తన గదిలో ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది జీర్ణించుకోలేని రేవంత్ కొద్దిరోజులుగా ఆమెను హెచ్చరిస్తున్నాడు. అక్కడి నుంచి రాకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. ఆమెను తన ఇంటికి పంపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శనివారం రాత్రి అఖిల్‌ను ఫోన్లో బెదిరించాడు. ఆదివారం 30 మంది అనుచరులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్ద గొడవ చేశాడు. అఖిల్‌కు రేవంత్‌కు మధ్య ఘర్షణ జరగడంతో అఖిల్ అతడి స్నేహితులకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రేవంత్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లిఫ్ట్ ఇచ్చి కదులుతున్న కారులో విద్యార్థినిపై..
నోయిడా: దేశంలో అత్యాచారాలను నివారించడానికి ఎన్ని చట్టాలు తెస్తున్నప్పటికీ.. అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. బాలికపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించిన రెండు రోజులకే నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై సమీప బంధువు, స్నేహితులే అత్యాచారం చేశారు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకి చెందిన 16 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది. ఈ నెల 18న స్కూల్‌కి వెళ్లిన బాలిక తిరిగి వచ్చే క్రమంలో స్కూల్‌బస్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇంటికి నడుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో అదే దారిలో కారులో వస్తున్న ముగ్గురు అబ్బాయిలు తనను ఇంటి వద్ద దించుతామని కారులో ఎక్కించుకున్నారు. కారెక్కిన ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించారు. ఆ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారు. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరు వారి సమీప బంధువు అని, మరొకరు తన క్లాస్మేట్ కాగా, మూడో వ్యక్తి తెలియదని చెప్పింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్కూల్లో చిన్నారుల ఫైట్.. ఒకరి మృతి
-
‘సైగల’తో సంఘీభావం
బధిరుడైన క్లాస్‌మేట్‌కు సంఘీభావం తెలపాలనుకున్నారు ఆ పిల్లలు. దీనికోసం వాళ్లు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కొద్ది నెలల్లోనే పట్టుదలతో సైగల భాష నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లందరూ బధిరుడైన తమ క్లాస్‌మేట్‌తో ఇంచక్కా సైగల భాషతో రోజూ తెగ కబుర్లాడేసుకుంటున్నారు. బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా రాజధాని సారాజెవోలోని నకాస్ ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరేళ్ల జెజ్ద్ ఒకటో తరగతిలో చేరాడు. అతడు పుట్టుకతోనే బధిరుడు. అలాగని ఆ పాఠశాల మూగ బధిరుల కోసం ప్రత్యేకించినదేమీ కాదు. మామూలు విద్యార్థులు చదువుకునే పాఠశాలే. దగ్గర్లో మరే పాఠశాల లేకపోవడంతో జెజ్ద్ను అతడి తల్లి ఆ పాఠశాలలో చేర్చడానికి తీసుకొచ్చింది. టీచర్లకు అతడి పరిస్థితిని వివరించింది. వారు కూడా సానుకూలంగా స్పందించి, అతడిని చేర్చుకున్నారు. కొత్తగా వచ్చిన జెజ్ద్తో స్నేహంగా ఉండాలంటూ మిగిలిన పిల్లలకు చెప్పారు. మిగిలిన పిల్లలు కూడా అతడితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ల మాటలేవీ అతడికి వినిపించకపోవడంతో మొదట్లో కాస్త నిరుత్సాహం చెందారు. అతడి సైగల భాష వాళ్లకు అర్థం కాకపోవడంతో కొన్నాళ్లు వాళ్లు అయోమయం చెందేవాళ్లు. పిల్లల ఇబ్బందిని గమనించిన వాళ్ల టీచర్ సనేలాకు ఒక ఐడియా వచ్చింది. జెజ్ద్కు ఎలాగూ మాటలు వినిపించవు కదా, అందుకే తాను సైగల భాష నేర్చుకోవడానికి సిద్ధపడింది. మిగిలిన పిల్లలను కూడా సైగల భాష నేర్చుకునేలా ప్రోత్సహించింది. కొద్ది నెలల్లోనే వాళ్లు సైగల భాషను నేర్చేసుకున్నారు. తన కోసం తన క్లాస్మేట్స్ అందరూ సైగల భాష నేర్చుకోవడంతో జెజ్ద్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక అప్పటి నుంచి క్లాస్‌లో సందడే సందడి. -
ట్యూషన్లో కాల్పులు జరిపిన విద్యార్థి అరెస్ట్
ముజఫర్ నగర్: సహచర విద్యార్థిపై సోమవారం కాల్పులు జరిపిన అనంత్ త్యాగి అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదకొండవ తరగతి చదువుతున్న అకాష్ కుమార్, అనంత్ త్యాగిలు ఇద్దరూ సోమవారం పర్కజీ టౌన్‌లోని ట్యూషన్‌కు వెళ్లారు. అదే సమయంలో తనతో తీసుకొచ్చిన గన్‌తో అనంత్ త్యాగి, అకాష్ పై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో గాయపడ్డ ఆకాష్‌ను వెంటనే అస్పత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు. అనంత త్యాగిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందనే అంశం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను ఉపయోగించిన గన్‌తో పాటూ క్యాట్రిడ్జ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యాయత్నం కింద అతని పై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమ్మాయి కోసం స్నేహితుడ్ని హత్య చేశారు!
న్యూఢిల్లీ: ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో యువకుడ్ని కొంతమంది స్నేహితులు కొట్టి చంపిన ఘటన ఢిల్లీలోని కంజావాలాలో కలకలం సృష్టించింది. దీపక్ గులియా (19 ) అనే యువకుడు సోన్ పేటలో హాస్టల్ లో ఉంటూ ఓ స్కూళ్లో చదువుతున్నాడు. అయితే గత వేసవి సెలవుల నుంచి ఓ అమ్మాయి(17) విషయంలో స్నేహితులతో వివాదాలు నెలకొన్నాయి. ఆ యువతితో దీపక్ చనువుగా ఉండటం భరించలేని అతని క్లాస్ మేట్స్ ద్వేషం పెంచుకున్నారు. అతన్ని అంతమొందించాలని ప్రణాళిక రచించిన స్నేహితులు ప్రశాంత్ విహార్ లో బర్త్ డే పార్టీకి హాజరైన దీపక్ ను కిడ్నాప్ చేశారు. అనంతరం దీపక్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లి దండ్రులు నరేలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజుల క్రితం స్నేహితుల పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్లిన దీపక్ ఆ తరువాత కనిపించ లేదంటూ తండ్రి కృష్ణ దీపక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బర్త్ డే వేడుకకు పిలిచిన అతని స్నేహితుల ఫోన్ నెంబర్లకు కాల్ చేసినా స్పందన కరువైంది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం మదనపూర్ దబ్బాస్ గ్రామంలో పొదల్లో ఓ యువకుడి మృతదేహం ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ యువకుడి మృతదేహం దీపక్ దే అని గుర్తించిన పోలీసులు అతని తల్లి దండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీటి పర్యంతమైయ్యారు. ప్రస్తుతం పరారీలో దీపక్ స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రేమ నిరాకరించిందని యాసిడ్ దాడి
పశ్చిమ బెంగాల్: మరోసారి యాసిడ్ దాడి తలెత్తింది. సహచర విద్యార్థిని అని కూడా చూడకుండా తన ప్రేమను నిరాకరించిందనే అక్రోషంతో ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. దీంతో ఆ బాలిక కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో ఓ విద్యార్థిని బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఆదివారం బెలగాచ్చి అనే గ్రామంలో ట్యూషన్ క్లాసులకు వెళ్లొస్తుండగా మధ్యలో క్లాస్మేట్ అయిన ఎనాముల్ సర్దార్ అనే యువకుడు అడ్డుకున్నాడు. తాను ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించాలని వాదులాడాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో తనతో తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై పోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, గ్రామస్థులు అతడిని పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగించారు. -
నా అబద్ధాలు... అలా ఆగిపోయాయి!
కనువిప్పు నాలో మొదటి నుంచి చిలిపితనం ఎక్కువ. అందులో భాగంగా అబద్ధాలు ఆడుతూ అందరినీ ఆట పట్టించేవాడిని. అప్పుడప్పుడూ నా అబద్ధాలు హద్దు మీరేవి. ఒకసారి ఏమైందంటే, చాలాకాలం తరువాత నా పదోతరగతి క్లాస్మేట్ శ్రీనివాస్ కలిశాడు. ఆ మాట... ఈ మాట మాట్లాడుతూ- ‘‘నాగరాజుగాడు ఎలా ఉన్నాడు?’’ అని అడిగాడు. నాగరాజు మాతో కలిసి పదోతరగతి చదువుకున్నాడు. వాడిది మా ఊరే. ‘‘నాగరాజు ఎలా ఉన్నాడు?’’ అని అడగగానే నేను రెచ్చి పోయాను. అప్పటికప్పుడు నాలో ఎన్నో అబద్ధాలు పుట్టుకొచ్చాయి. ‘‘అరే...నీకు విషయం తెలియదా? పాపం...నాగరాజు!’’ అన్నాను. ‘‘ఏమైంది వాడికి?’’ ఆసక్తిగా అడిగాడు. ‘‘ఒక యాక్సిడెంట్లో వాడి రెండు కాళ్లు పోయాయి. పాపం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఏంచేస్తాం? అలా రాసి పెట్టి ఉంది’’ అన్నాను బాధగా. ‘‘అయ్యో! అలా జరిగిందా’’ అని చాలా బాధపడిపోయాడు శ్రీను. ‘‘వీలు చూసుకొని నాగరాజు దగ్గరికి వెళ్లి చూసొస్తాను’’ అన్నాడు. ‘‘వీడిని బకరా చేశాను’’ అని నాలో నేను తెగ సంతోషపడిపోయాను. ఇది జరిగిన కొంత కాలానికి అనుకోకుండా మా ఫ్రెండ్ అన్నయ్య పెళ్లిలో నాగరాజు, శ్రీనులు కలుసుకున్నారు. ‘‘వాడిప్పటికీ మారలేదన్నమాట’’ అని నన్ను తెగతిట్టుకున్నారు. ఒకవేళ ఆ ఫంక్షన్లో నేను ఉండి ఉంటే కొట్టేవారేమో! ఇది జరిగిన చాలా కాలానికి ఒక సంఘటన జరిగింది. అప్పుడు నేను ఓ కోచింగ్సెంటర్లో ఎమ్సెట్కు ప్రిపేరవుతున్నాను. ఒకరోజు మా కోచింగ్ సెంటర్‌కు ఫోన్ వచ్చింది-‘‘మీ నాన్నగారికి సీరియస్‌గా ఉందట. వెంటనే బయలుదేరు’’ అని చెప్పారు ప్రిన్సిపాల్. ఇక నేను ఏమీ ఆలోచించలేదు. భోరుమని ఏడుస్తూ ఉరుకులు పరుగుల మీద బస్ ఎక్కాను. కొన్నిరోజులుగా నాన్న జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను తలచుకుంటే ఏడుపు ఆగడం లేదు. మా ఊరిలోకి అడుగు పెట్టగానే, దూరంగా మా నాన్న కనిపిస్తున్నారు. వాళ్ల స్నేహితులతో ఏదో చెబుతూ తెగ నవ్వుతున్నారు. నేను షాక్ అయ్యా. ఎవరో కావాలనే అబద్ధం చెప్పారనే విషయం అర్థమైంది. ఎందుకో మరి... వాళ్ల మీద కోపం రాలేదు. చీటికి మాటికి అబద్ధాలాడే నా స్వభావంపై మాత్రం విరక్తి పుట్టింది. ఒక చిన్న అబద్ధానికి గంట పాటు నేను ఎలా విలవిలలాడోనో ఆ దేవుడికే తెలుసు. అందుకే అప్పటి నుంచి ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. - ఎస్.ఎల్, నిజామాబాద్ -
అమ్మాయి ఓ అంతుపట్టని అంశం!
ఇతరుల మనసులో ఆలోచనలను నాటడం ఒక గొప్ప కళ. ఆ ఆలోచనలు ప్రేరణనిచ్చేవి అయితే మీరొక స్ఫూర్తిదాత. ఆ ఆలోచనలు దేశభక్తినో, సామాజిక స్పృహనో నింపేవి అయితే మీరొక నాయకుడు. ఆ ఆలోచనలు మీవి, మీ గురించి మరొకరిలో ప్రేమను పెంచేవి అయితే... మీరు అక్షరాలా ప్రేమికుడు! అమ్మాయి తను ఇష్టపడినవాడి వద్ద నిశ్శబ్దంగా ఉన్నా శబ్దమే... అదొక సంగీతమే! కానీ అబ్బాయి మాత్రం ఆమె హృదయాంతరాళాలలోకి చొచ్చుకుపోవాలి. ఆమెలో తన గురించి ఆలోచనలను కలిగించాలి. టీనేజ్‌లో ఫస్ట్‌లవ్‌లో ఉన్నవారి దగ్గర నుంచి కాలేజ్‌లోని క్లాస్మేట్నో, ఆఫీస్‌లోని అమ్మాయినో ప్రేమించే ప్రొఫెషనల్ దాకా ఎవరికైనా తప్పని స్థితి ఇది! ప్రేమికులుగా మారాలంటే తప్పనిసరిగా ఆలోచనను నాటడం అనే కళ తెలిసి ఉండాలి. అందుకు తొలి అస్త్రం ‘చూపు’. ప్రేమకు భాష లేదు, భావం తప్ప. ఆ భావాన్ని కళ్లలో నుంచి మొదలుపెట్టి పెదవుల చివర దాకా తీసుకెళ్లి మధుర హాసంగా ప్రవహింపజేయాలి. ఆలోచనలు నాటడానికి ఈ అస్త్రాన్ని అలా వాడుకోవచ్చు! అయితే, కళ్లలోకి సూటిగా చూడాల్సిన పని లేదు. నేల చూపులతో కూడా అమ్మాయిని ఆకర్షించవచ్చు! ప్రతిస్పందనను అర్థం చేసుకొనేదెలా?! ఆమెవి అందమైన కళ్లు. కానీ చూపులు మాత్రం ఆకర్షణతో చూసేవో, అమాయకత్వంతో చూసేవో, ఆరాధనతో చూసేవో తెలీదు. అలాంటప్పుడు ఆ చూపులను ప్రేమగా మలుచుకోవడం అబ్బాయి సామర్థ్యానికి నిదర్శనం! ఆమె చూపులు మిమ్మల్ని వెంటాడేలా చేసుకోవడమే కాదు, ఆమె ఆలోచనలు మీ గురించి వేటాడేలా చేసుకోవడంతోనే తెలుస్తుంది ప్రేమికుడిగా మీ అసలు సిసలు సత్తా! మీరేంటో అర్థం కావాలి! అమ్మాయి చూపుల్లో అమాయకత్వం అనే కోణాన్ని కూడా చూడగలం కానీ అబ్బాయిల చూపుల్లో అపార్థాలే కనిపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించడం మంచిది. మీరేంటో అర్థమవ్వాలి. మీలోని అందాలను వారు గుర్తించాలి. మీలోని తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత వాళ్లలో కలిగించాలి. అంతవరకూ మీ తొందరను కాస్త తొక్కిపెట్టాల్సిందే! పలుచన కావద్దు! ఆమె పాలరాతి శిల్పం... మనం మాత్రం నీళ్లలా పలుచన కావడం ఎందుకు? మీరు ఆమె గురించి ఎంతగా పడిచ స్తు న్నారో మొదట్లోనే చెప్పేయడం, మీరేంటో వందశాతం ఆమెకు అర్థమయ్యేలా చేసేయడం, వెనువెంటనే ఆమెకు ప్రేమిస్తున్నట్టు చెప్పేసి ‘నో’ చెప్పించేసుకోవడం... అవసరమా.. ఇదంతా? అలా చేస్తే చేజేతులారా ప్రేమకథకు క్లయిమాక్స్ రాసుకోవడమే! అందుకే... మీరు ఎంపిక చేసుకొన్న అమ్మాయి మీకు ఎంత చేరువలో ఉందో తెలుసుకొనే వరకూ మాటల్నీ, మనసులోని ఊసుల్నీ పొదుపుగా వాడటమే మంచిది. వ్యూహం ఉండాలి..! స్నేహం లేకుండా నేరుగా గురిపెడితే లక్ష్యం తప్పే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ముందు చేయి కలపండి. తర్వాత మనసు అదే కలుస్తుంది. నిజానికి స్నేహంతో అమ్మాయి మానసిక స్థితి దాదాపు అర్థమైపోవచ్చు! మనసంటే మ్యాథమేటిక్స్ కాదు! అమ్మాయి ప్రేమను గెలవడానికి ఒక యూనివర్సల్ ఫార్ములా అంటూ ఏమీ లేదు! అమ్మాయి మనసు అంటే మ్యాథమేటిక్స్ కాదు... ఎవరు ఎవరిని కాలిక్యులేట్ చేసినా ఒకే ఆన్సర్ రావడానికి! ఎన్ని చెప్పినా ఏ అమ్మాయికి ఆ అమ్మాయి ప్రత్యేకం. ఒక్క మాటలో చెప్పాలంటే... అమ్మాయంటేనే ఓ అంతుపట్టని అంశం. అది తెలిసి నడుచుకొనే వాడే ప్రేమలో విజేతలో కాగలడు! - జీవన్‌రెడ్డి. బి