ప్రేమ నిరాకరించిందని యాసిడ్ దాడి | Spurned lover throws acid at classmate | Sakshi
Sakshi News home page

ప్రేమ నిరాకరించిందని యాసిడ్ దాడి

Published Mon, Apr 6 2015 1:08 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

Spurned lover throws acid at classmate

పశ్చిమ బెంగాల్: మరోసారి యాసిడ్ దాడి తలెత్తింది. సహచర విద్యార్థిని అని కూడా చూడకుండా తన ప్రేమను నిరాకరించిందనే అక్రోషంతో ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. దీంతో ఆ బాలిక కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో ఓ విద్యార్థిని బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఆమె ఆదివారం బెలగాచ్చి అనే గ్రామంలో ట్యూషన్ క్లాసులకు వెళ్లొస్తుండగా మధ్యలో క్లాస్మేట్ అయిన ఎనాముల్ సర్దార్ అనే యువకుడు అడ్డుకున్నాడు. తాను ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించాలని వాదులాడాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో తనతో తెచ్చుకున్న యాసిడ్ను ఆమెపై పోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.  కానీ, గ్రామస్థులు అతడిని పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement