
ట్యూషన్లో కాల్పులు జరిపిన విద్యార్థి అరెస్ట్
ముజఫర్ నగర్:
సహచర విద్యార్థిపై సోమవారం కాల్పులు జరిపిన అనంత్ త్యాగి అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదకొండవ తరగతి చదువుతున్న అకాష్ కుమార్, అనంత్ త్యాగిలు ఇద్దరూ సోమవారం పర్కజీ టౌన్లోని ట్యూషన్కు వెళ్లారు. అదే సమయంలో తనతో తీసుకొచ్చిన గన్తో అనంత్ త్యాగి, అకాష్ పై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో గాయపడ్డ ఆకాష్ను వెంటనే అస్పత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు.
అనంత త్యాగిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందనే అంశం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను ఉపయోగించిన గన్తో పాటూ క్యాట్రిడ్జ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యాయత్నం కింద అతని పై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.