నోయిడా: దేశంలో అత్యాచారాలను నివారించడానికి ఎన్ని చట్టాలు తెస్తున్నప్పటికీ.. అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. బాలికపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించిన రెండు రోజులకే నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై సమీప బంధువు, స్నేహితులే అత్యాచారం చేశారు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకి చెందిన 16 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది.
ఈ నెల 18న స్కూల్‌కి వెళ్లిన బాలిక తిరిగి వచ్చే క్రమంలో స్కూల్‌బస్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇంటికి నడుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో అదే దారిలో కారులో వస్తున్న ముగ్గురు అబ్బాయిలు తనను ఇంటి వద్ద దించుతామని కారులో ఎక్కించుకున్నారు. కారెక్కిన ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించారు. ఆ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారు.
తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరు వారి సమీప బంధువు అని, మరొకరు తన క్లాస్‌మేట్ కాగా, మూడో వ్యక్తి తెలియదని చెప్పింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment