gangrape case
-
అయోధ్యలో బాలికపై గ్యాంగ్‌రేప్..నిందితుడి దుకాణాల కూల్చివేత
అయోధ్య: అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడి నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొయీద్ ఖాన్ అనే వ్యక్తి దుకాణ సముదాయాన్ని జిల్లా అధికా రులు గురువారం కూల్చి వేశారు. పురాకలంధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదర్సానగర్‌లో మొయీద్ ఖాన్ బేకరీ నడుపుతున్నాడు. మొయీద్‌తోపాటు అతడి పనిమనిషి రాజు ఖాన్ ఓ బాలికపై రెండునెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వారు వీడియో తీశారు.బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో జూలై 30న పోలీసులు మొయీద్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 3న అతడు నడిపే బేకరీని నేలమట్టం చేశారు. చెరువు స్థలం కబ్జా చేసి దానిని నిర్మించినట్లు అధికారులు అంటున్నారు. తాజాగా, గురువారం మొయీద్ ఖాన్‌కు చెందిన దుకాణ సముదాయాన్ని కూల్చి వేశారు. దానిని ప్రభుత్వ స్థలంలో నిర్మించాడన్నారు. ఆ సమయంలో భవనం ఖాళీగానే ఉందని చెప్పారు. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మొయీద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ అనుచరుడని బీజేపీ నేతలతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్: ఆటోగ్యాంగ్ గ్యాంగ్‌రేప్.. 9 ఏళ్ల తర్వాత శిక్షలు ఖరారు
హైదరాబాద్: లైంగిక దాడి కేసులో నలుగురు నిందితులకు ఉప్పర్‌పల్లి ఫోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా, పలాసాకు చెందిన యువతి 2014సెప్టెంబర్ 10న మియాపూర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచి్చంది. 11న ఆమె తన అక్క, బావతో కలిసి శిల్పారామం వెళ్లిం. రాత్రి శిల్పారామం నుంచి మియాపూర్ అంజయ్యకాలనీలోని ఇంటికి వెళ్లేందుకు అక్కడే ఉన్న వాహిద్ ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారు. మార్గమధ్యంలో వాహీద్ స్నేహితులు ముస్తాఫా, షరీఫ్, నజీర్ కూడా ఆటోలో ఎక్కారు. అంజయ్యనగర్‌కు వెళ్లే మార్గంలో కాకుండా ఆటో మరో మార్గంలో వెళ్తుండడంతో యువతి బావ వహీద్‌ను ప్రశ్నించాడు. దీంతో వారు నలుగురు అతడిని కొట్టి కిందకు తోసేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి సోదరిని కూడా ఆటోలో నుంచి గెంటేశారు. అనంతరం యువతిని పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు రోడ్డుపైకి వచ్చి స్థానికుల సహాయంతో అక్క, బావ వద్దకు చేరింది. అదే రోజు రాత్రి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ వాహీద్‌తో పాటు అతడి స్నేహితులు ముస్తాఫా, షరీఫ్, నజీర్‌లను అరెస్టు చేసి కోర్టులో చార్జిట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఉప్పర్‌పల్లి ఫోక్సో కోర్టు శుక్రవారం నిందితులు నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
టీఆర్ఎస్ ‘తెలంగాణ రేప్ సపోర్ట్ పార్టీ'గా మారింది..
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ రేప్’కేసులో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు స్పందించలేదని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, ఒక్క తెలంగాణలోనే రోజుకు ఆరు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు నిరసనగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గాం«దీభవన్‌లో చేపట్టిన మౌనదీక్షలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖలు కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డిసౌజా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేప్ సపోర్ట్ పారీ్టగా మారిపోయిందని, ఈ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మైనర్ బాలిక రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడి ప్రమేయం చూస్తే తెలంగాణలో పాలిటిక్స్ గూండాగిరీ నడుస్తోందని, మద్యం, డ్రగ్స్ పెరిగాయని ధ్వజమెత్తారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, ఆమెకు న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని డిసౌజా చెప్పారు. దీక్షలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నీలం పద్మలతో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డీజీపీకి వినతిపత్రం: అంతకుముందు మహిళా కాంగ్రెస్ నేతలు డిసౌజా, కొండా సురేఖ, సునీతారావు తదితరులు డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. -
అసాంఘిక చర్యలకు పాల్పడే పబ్‌లపై దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, నేరాలను ప్రోత్సహించే పబ్‌లపై దాడులు తప్పవని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో అలాంటి పబ్‌లపై రాబోయే రోజు ల్లో భౌతిక దాడులు చేయాలని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే రాత్రి 11:30 తర్వాత తెరిచి ఉంచే వాటిపై కూడా దాడులు తప్పవని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశ్వనగరంగా మారాల్సిన హైదరాబాద్‌ను విషనగరంగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశా రు. కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో సుమారు 150 పబ్‌లకు అనుమతినిచ్చారని, పబ్‌ల వ్యాపారం వెనుక రాష్ట్రంలోని రాజులు, యువరాజులకు సంబంధించిన వ్యక్తులు కీలకంగా ఉన్నారని ఆరోపించారు. పబ్‌లు, డ్రగ్ల సంస్కృతిని ప్రోత్సహించడం వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు హత్యలు, అత్యాచారాల్లోనూ భాగస్వాములయ్యారని రేవంత్ విమర్శించారు. మైనర్ అత్యాచారం ఘటన గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే, కొందరిని తప్పించే ప్రయత్నం చేసినట్టుగా ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా వాహనానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను, వాటి యజమానుల వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. యజమానులపై పోక్సో చట్టం ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్లలోని కీలకమైన ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. పబ్‌లపై పోలీసుల పర్యవేక్షణ కరువైందని, తనిఖీలు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని, ఇప్పటికైనా తక్షణమే ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులపై సమీక్ష జరపాలని రేవంత్‌రెడ్డి కోరారు. మైనర్లను అనుమతిస్తున్న పబ్ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మైనర్ అత్యాచార వ్యవహారంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌పై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసులో పోలీసులు రాజకీయ పరికరాలుగా మారారని, ముఖ్యమైన వ్యక్తులను రక్షించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. బుధవారం తరుణ్‌ఛుగ్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జంగిల్‌రాజ్ నడు స్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన, శాంతిభద్రతలు, ఆడపిల్లల సంరక్షణ ఇలా అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులిలా ఉంటే రూ.109 కోట్లు ఖర్చుచేసి వార్తాపత్రికల్లో తన ఫొటోతో ప్రకటనలిచ్చి ప్రచారం చేసుకోవడం గర్హనీయమన్నారు. గత ఏప్రిల్ 22 నుంచి మే 31 దాకా 11–17 ఏళ్ల వయసున్న అనేక మంది బాలికలు అత్యాచారానికి గురికావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా స్పందించేందుకు కేసీఆర్‌కు నోరు కూడా రావడం లేదని మండిపడ్డారు. ‘కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై, కేటీఆర్ ట్విటర్‌తో బిజీగా ఉంటే హోంమంత్రి అనే వ్యక్తి అసలు ఉన్నాడా లేడా? అనేది ఎవరికీ తెలియని దుస్థితి ఉంది’అని ఎద్దేవా చేశారు. ఓ ప్రభుత్వ వాహనంలో అత్యాచారం జరగ్గా అది ఏ శాఖది, ఎవరు ఉపయోగిస్తున్నారన్న వివరాలు ఆరా తీయకుండా.. దాంట్లో ఉన్న ఆధారాలను చెరిపేసే కుట్ర జరుగుతోందన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రాష్ట్రాన్ని పంచుకున్నాయి: సంజయ్ జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచారం కేసును ౖముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి వచి్చన ఆదేశాల మేరకే పోలీసులు నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లను కాపాడేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌చేశారు. ‘ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తామని.. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పసిగడతాయని చెప్పిన కేటీఆర్ ఇప్పుడేమంటారు? రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కళ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఏమైండు? చూడటానికి కేసీఆర్‌కే కళ్లు లేవు.. ఇక దోషుల కళ్లేం పీకుతడు?’అని పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పారీ్టలు కలిసి రాష్ట్రాన్ని పంచుకున్నాయని, ఎంఐఎం నాయకులు దాడులు చేస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు హత్యలు, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుల పోరాటం వల్లే కేసులు నమోదు చేశారని, బీజేపీ స్పందించకపోతే కేసును మూసేసేవారన్నారు. న్యాయం కోరుతున్న తమ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘనందన్ రావులపై కేసు పెట్టే విషయంపై ఉన్న శ్రద్ధ.. బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కేసులు పెట్టే విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ‘కేసును తప్పు దోవ పట్టించేందుకు ఇందులో హిందువు ఉన్నట్లు మొదటి ఎఫ్ఐఆర్లో సూరజ్ అనే పేరు నమోదు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్ధారణ చేసుకున్నాకే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేసి, నిందితుల జాబితాలో చివరన చేర్చారు’అని చెప్పారు. -
Amnesia Pub Case: జువైనల్ హోమ్‌కు ఎమ్మెల్యే కుమారుడు
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో మైనర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోమ్‌కు తరలించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇచి్చంది. మిగతా ఐదుగురు మైనర్లనూ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసు.. రెండు కోర్టుల పరిధిలో.. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడిన ముగ్గురు మైనర్లను సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఎమ్మెల్యే కుమారుడు, మరో మైనర్‌నూ కోర్టు ఆదేశాల మేరకు బుధవారం అదే హోమ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ఓ చిత్రమైన అంశం వెలుగులోకి వచి్చంది. సాధారణంగా ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక డిజిగ్నేటెడ్ కోర్టు ఉంటుంది. గ్యాంగ్ రేప్ జరిగిన జూబ్లీహిల్స్ ఠాణా నాంపల్లిలోని పదిహేడో అదనపు మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ ఠాణాలో నమోదైన కేసుల విచారణ, నిందితుల హాజరు వంటివన్నీ ఆ కోర్టులోనే జరుగుతాయి. అత్యాచారం వంటి తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులు మాత్రం నాంపల్లి సెషన్స్ కోర్టు పరిధిలోకి వెళ్తాయి. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన వారిని మాత్రం రెండు వేర్వేరు కోర్టుల్లో హాజరుపర్చాల్సి వచి్చంది. ఈ కేసులో పోక్సో యాక్ట్ కూడా ఉండటంతో సాదుద్దీన్‌ను దానికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. మిగతా వారంతా మైనర్లు కావడంతో వారిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని జువైనల్ జస్టిస్ కోర్టులో హాజరుపర్చారు. వీరి కస్టడీ పిటిషన్లను సైతం పోలీసులు రెండు న్యాయస్థానాల్లో వేర్వేరుగా దాఖలు చేయాల్సి వచ్చింది. రేపటి నుంచి పోలీసు కస్టడీకి.. సామూహిక అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం సాదుద్దీన్‌ను 4 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ పోక్సో కోర్టు బుధవారం నిర్ణయం తీసుకుంది. పోలీ సులు గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అతడితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు. నిందితుడిని తీసుకుని పబ్, కాన్సూ బేకరీలతోపాటు అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. నిందితుడు, మిగతా మైనర్లు ఏ సమయంలో, ఎక్కడ, ఏం చేశారనేది తెలుసుకోనున్నారు. నేరం తర్వాత వారు వెళ్లిన ప్రాంతాలు, ఇన్నోవా దాచిన చోటుకూ నిందితుడిని తీసుకువెళతామని అధికారులు తెలిపారు. నేర నిరూపణలో ఇది కీలకాంశమని వెల్లడించారు. ఇక మరో ఐదుగురు మైనర్ నిందితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు. వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ వేశారు. పొటెన్సీ టెస్ట్ చేయించి.. గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన ఆరుగురిలో ఒకరే మేజర్‌కాగా మిగతా వారంతా మైనర్లు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి ప్రభుత్వ వైద్యుల ద్వారా పొటెన్సీ టెస్ట్ చేయించనున్నారు. ఈ పరీక్ష ద్వారా నిందితులకు లైంగిక పటుత్వం ఉందా? లేదా? అనేది వైద్యపరంగా నిర్ధారిస్తారు. అభియోగపత్రం (చార్జిïÙట్) దాఖలుకు ఇది కీలకం కావడంతో ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. మరోవైపు సాదుద్దీన్ సహా ఆరుగురి గత చరిత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో ఇన్నోవా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండి ఉంటుందని.. స్వాధీనం చేసుకునేప్పుడు అది లేదని పోలీసులు చెప్తున్నారు. ఓ నిందితుడిని పోలీసులు విచారించిన సమయంలో అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్ లేదని, కేవలం తెరలతో కూడిన షీల్డ్స్ ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. దీంతో కారు అద్దాలపై ఫిల్మ్ ఉండేదా? అనేది నిపుణుల సాయంతో గుర్తించాలని నిర్ణయించారు. ఫిల్మ్ ఉండి, తర్వాత తొలగించినట్టు తేలితే.. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసిన ఆరోపణలపై ఐపీసీలోని 201 సెక్షన్‌ను జోడించాలని భావిస్తున్నారు. కారుపై రాని క్లారిటీ! బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజి్రస్టేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్ జహాన్‌తో పాటు వక్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్ కేసుపై ఎన్‌హెచ్చార్సీ, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ సరిగా స్పందించడం లేదని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ కేసులో బాధిత బాలికకు పూర్తిన్యాయం జరిగేదాకా, నిందితులను అరెస్ట్ చేసి, దోషులకు శిక్షపడేదాకా ఆందోళనలు, ధర్నాలు, ఇతర రూపాల్లో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నగర పార్టీలోని వివిధ విభాగాలు, నాయకులతోపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు సోమవారం సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. -
చట్ట పరిధిలో తప్పు చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో ఆయా అంశాలు వెల్లడించినపుడు చట్టపరిధిలో తానేమైనా తప్పు చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. తనకు చట్టం గురించి తెలుసునని, ఈ కేసు విషయంలో తాను మాట్లాడిన దాంట్లో ఎక్కడా పొరపాటు చేయలేదన్నారు. ముద్దాయిలను అరెస్టు చేసి జైలుకు పంపాలని పార్టీలన్నీ డిమాండ్ చేయాల్సిన నేపథ్యంలో తనపై కేసు పెట్టాలంటూ టార్గెట్ చేయడం వెనక ఆయా పార్టీలకు ఏం ప్రయోజనాలున్నాయోనని వ్యాఖ్యానించారు. సోమవారం రఘునందన్‌రావు టీవీ చానెళ్ల ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో తాను చట్టాన్ని అతిక్రమించినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటికే మీడియాలో వచ్చిన అంశాల గురించి విలేకరుల సమావేశంలో ప్రస్తావించానే తప్ప.. ఎక్కడా అమ్మాయి ఫొటో, పేరు వంటివి బయటపెట్టలేదన్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారంతా తాను మీడియాలో వెల్లడించిన అంశాలు తప్పు అంటున్నారే తప్ప ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరకపోవడం విడ్డూరంగా ఉందని రఘునందన్‌రావు అన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ముందు ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయాలని ధర్నా చేయాలని హితవు పలికారు. -
‘చిత్తశుద్ధితో అత్యాచార నిందితుల్ని పట్టుకోండి’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని.. నిందితులు ఏ మూల దాగి ఉన్నా అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అరాచకాలు, అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోందని పేర్కొన్నారు. కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అఘాయిత్యాలు జరిగినా అందులో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటోందని ఆరోపించారు. మంథనిలో లాయర్ వామన్ రావు హత్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర ఆగడాలకు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య, ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య, సూర్యాపేట జిల్లా కోదాడలో పేదింటి ఆడబిడ్డపై టీఆర్ఎస్ నేతల గ్యాంగ్ రేప్, రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ వేధింపులు తాళలేక తల్లీ కొడుకు లాడ్జిలో ఆత్మహత్య, నిర్మల్‌లో బాలికపై టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అత్యాచారం వంటి సంఘటనలు కోకొల్లలని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు అడ్డూఅదుపు లేదు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్, మజ్లిస్ నాయకులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ మండిపడ్డారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే భావనతో అధికారిక వాహనాలను అడ్డాగా చేసుకుని, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మే 28న ఘటన జరిగితే, ఇంతవరకు వారిని అరెస్టు చేయకపోవడం, పూర్తి స్థాయిలో విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పారీ్టలకు చెందిన ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్, ప్రముఖుల కుమారులు ఈ కేసులో ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలు, వీడియోల్లో స్పష్టంగా కన్పిస్తున్నా ఇంకా చర్యలు తీసుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. -
వాంగ్మూలం ఇస్తేనే కేసా..? జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో పోలీసుల తీరు మరింత వివాదాస్పదం అవుతోంది. బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్నాకే ఎమ్మెల్యే కుమారుడిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని చెప్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. బాలికతో ఎమ్మెల్యే కుమారుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆధారాలు లభించినా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల దర్యాప్తు తీరు, నిందితులపై చర్యలు, వాహ నాల స్వా«దీనం తదితర అంశాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ కేసుకు సంబం ధించి జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని.. జువెనైల్ హోంకు తరలించారు. ఇప్పటికే సాదుద్దీన్‌తోపాటు మరో ఇద్దరు మైనర్లను పట్టుకోగా.. పరారీలో ఉన్న ఉమేర్‌ఖాన్ కోసం గాలిస్తున్నారు. బాధితురాలు చెప్తేనే పట్టుకున్నారా? అమ్నీషియా పబ్ కేంద్రంగా మొదలైన ఈ నేరంలో.. తొలుత బెంజ్ కారులో బాలికతో అసభ్యకర ప్రవర్తనపైనే పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక తండ్రి గత నెల 31న బెంజ్ కారు నంబర్ సహా చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు కేసు నమోదు చేశారు. తీవ్ర ఆందోళన (షాక్)లో ఉన్న బాలిక పూర్తి వివరాలు వెల్లడించలేకపోతోందని కూడా పొందుపరిచారు. బెంజ్ కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు.. దాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇన్నోవాలో జరిగిన అత్యాచార దారుణాన్ని గుర్తించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడితోపాటు ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్ర కూడా ఉందని మొదటినుంచీ ఆరోపణలు ఉన్నాయి. మసీవుల్లా కుమారుడి పాత్రను నిర్ధారించిన అధికారులు.. ఎమ్మెల్యే తనయుడి అంశంపై ఆధారాలు లేవని చెప్తూ వచ్చారు. ఫొటోలు, వీడియోలు బయటికి రావడంతో.. బాలికపై అఘాయిత్యం పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంతో కేసు కీలక మలుపు తిరిగింది. బాలికతో బెంజ్ కారులో అసభ్యంగా ప్రవర్తించిన వారిలో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడంటూ ఆయన కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. దీనితో ఎమ్మెల్యే కుమారుడినీ ఈ కేసులో చేర్చక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. అయినా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కుమారుడి అంశాన్ని బాలిక తన వాంగ్మూలంలో చెప్పలేదని, మరోసారి ఆమె వాంగ్మూలం నమోదుచేశాకే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. వాస్తవానికి అసలు కేసే అసభ్య ప్రవర్తనకు సంబంధించినది అయినప్పుడు వాంగ్మూలాల పేరుతో మీనమేషాలు లెక్కించడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్ ఎందుకు తొలగించారు? బాలికను అమ్నీషియా పబ్ నుంచి బెంజ్ కారులో తీసుకువెళ్లిన నిందితులు.. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్ద ఆగారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోగా.. మిగతావారు ఇన్నోవా కారులో తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. టెంపరరీ రిజి్రస్టేషన్‌తో ఉన్న ఇన్నోవా అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉందని, ప్రభుత్వం వాహనం అన్న స్టిక్కర్ ఉందని సమాచారం. శనివారం ఇన్నోవాను స్వా«దీనం చేసుకున్న పోలీసులు.. స్టిక్కర్తోపాటు అద్దాల బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించినట్టు తెలిసింది. దీనిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు కోర్టు విచారణకు వచ్చినప్పుడు నేర నిరూపణపై ఇది ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. పారదర్శకంగా ఉన్న అద్దాలతో కూడిన వాహనంలో సాయంత్రం వేళ అత్యాచారం ఎలా జరిగిందనే అంశం ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’గా మారే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. బెంజ్‌కారులో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ ఇన్నోవా కారును స్వా«దీనం చేసుకున్న పోలీసులు శనివారమే అందులో నుంచి కొన్ని నమూనాలు, ఆధారాలు సేకరించారు. అయితే రఘునంద్‌రావు మీడియాకు విడుదల చేసిన వీడియోలో బెంజ్ కారులో నలుగురు యువకులు ఉన్నారు. ఆదివారం సోషల్ మీడియాలో మరికొన్ని వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. అందులో కారు వెనుక సీటులో కూర్చున్న ఇద్దరు మైనర్లతో బాధితురాలు సన్నిహితంగా ఉన్న దృశ్యాలున్నాయి. వీటిలో ఎమ్మెల్యే కుమారుడు లేడు. ఈ వీడియోలు తీసే సమయానికి ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయాడా? లేక అంతకు ముందే ఇది తీశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆదివారం బెంజ్ కారులో ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరించారు. – సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో పబ్ నుంచి బెంజ్ కారును నడుపుకొంటూ వస్తున్నది ఉమేర్‌ఖాన్‌గా గుర్తించారు. కారు అతడి తల్లి పేరు మీదే రిజి్రస్టేషన్ అయి ఉన్నట్టు పోలీసులు తేల్చారు. ఉమేర్ పరారీలోనే ఉన్నాడని, మూడు బృందాలు గోవా, ఊటీ తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఉమేర్ పోలీసుల అదుపులోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. – ఇప్పటివరకు పట్టుబడ్డ వారిలో సాదుద్దీన్పాటు వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు, సంగారెడ్డి మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడి కుమారుడు, రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఒక కార్పొరేటర్ కుమారుడు ఉన్నట్టు తెలిసింది. మెడపై గాయాలు.. ‘టూత్ టాటూ’లు! – విచారణలో ఓ మైనర్ వెల్లడి రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి రావడానికి మూలం ఆమె మెడపై ఉన్న గాయాలే. వీటిని చూసిన బాలిక తండ్రి నిలదీయడంతోనే బాధితురాలు జరిగింది చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవి పంటి గాట్లని గుర్తించారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన నిందితులను పోలీసులు ఈ గాయాలకు కారణాల పైనా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకర అంశం బయటపడింది. నిందితుడిగా ఉన్న ఓ మైనర్ పోలీసుల విచారణలో ఆ గాయాలు ‘టూత్ టాటూ’లు అంటూ బయటపెట్టాడని సమాచారం. బాలికతో వేర్వేరుగా సన్నిహితంగా మెలిగిన తర్వాత అలా మెడపై కొరికి గాయపరిచామని, వీటినే తాము టూత్ టాటూలు అంటామని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులే అవాక్కయ్యారు. నరగంలోని అనేక సమూహాల్లో ఈ విష సంస్కృతి ఉన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధి ఫాంహౌస్‌లో తలదాచుకుని..! జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారానికి వినియోగించిన ఇన్నోవా కారును పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్‌లో స్వా«దీనం చేసుకున్నారు. ఆ ఫామ్‌హౌజ్ మొయినాబాద్ మండలంలోని ఓ ప్రజాప్రతినిధికి చెందినదని.. నిందితులు ఘటన జరిగిన రోజు రాత్రే అక్కడికి వెళ్లి తలదాచుకున్నారని తెలిసింది. తర్వాతి రోజు నిందితులు పరారైనట్టు సమాచారం. అయితే మండలంలోని ఏ గ్రామంలో, ఏ ఫాంహౌస్‌లో కారును స్వాధీనం చేసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. జూబ్లీహిల్స్ రేప్ ఘటనపై నివేదిక ఇవ్వండి – సీఎస్, డీజీపీలకు గవర్నర్ తమిళిసై ఆదేశం సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. 17 ఏళ్ల బాలికపై దురాగతం జరగటం పట్ల గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వచి్చన వార్తలను పరిశీలించిన అనంతరం గవర్నర్ నివేదిక కోరారని రాజ్‌భవన్ అధికారులు ప్రకటించారు. -
రేప్ ఘటనపై రాజకీయ దుమారం!
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై అత్యాచార ఘటన.. అందులో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉండటం.. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు.. రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బాలికతో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ పలు ఫొటోలు, వీడియోలు బయటికి మరింత అలజడికి కారణమవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనకు సంబంధించిన ఆధారాలను, ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ.. టీఆర్ఎస్ సర్కారు, ఎంఐఎంలపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రతినిధి బృందం శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. బాలికపై రేప్ ఘటనను చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని కాంగ్రెస్ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కుమ్మౖక్కై కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని.. అందులో భాగంగానే కారులో బాలిక ఉన్న వీడియోలను రఘునందన్‌రావు విడుదల చేశారని ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు నిరసన తెలిపాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ ఘటనపై స్పందించాయి. వెంటనే సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం.. సైలెంట్! బాలికపై అత్యాచారం ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎంఐఎం ఎక్కడా స్పందించలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానీ, నాయకులు కానీ ఘటనపై నోరు మెదపలేదు. అధికార టీఆర్ఎస్ నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దంటూ మంత్రి కేటీఆర్ పోలీసులను కోరుతూ చేసిన ట్వీట్ మినహా టీఆర్ఎస్ ఈ ఘటన గురించి అధికారికంగా మాట్లాడలేదు. హోంమంత్రి మహమూద్ అలీ మాత్రం పోలీసులు ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నారని, ఘటనతో సంబంధమున్న వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన దారుణమని, దీనిపై సమగ్ర విచారణ జరి పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులు ఏ స్థాయివారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్న పబ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహ రించాలన్నారు. ఈ లైంగిక దాడి రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పిల్లలు ఉన్నారని ఆరోపించారు. అత్యాచారంపై సీబీఐ విచారణ జరపాలి బాలి కపై అత్యాచారం అమా నుషమని, ఈ ఘట నపై రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వ కుం డా సీబీఐ విచారణ జరపాలని ప్రజాశాంతి పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనపై సీబీఐ అధికా రులు, కేంద్ర హోంమంత్రి, మహిళా సంఘాల నాయకులు, ఉన్నతాధికారులతో మాట్లాడాన న్నారు. కాగా, ప్రజాశాంతి పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇప్పటి వరకు 19,000 మంది పోటీలో ఉన్నట్లు పాల్ చెప్పారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మె ల్యేలు ముగ్గురు తనతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారి తండ్రి వెంకటాచారి ప్రజాశాంతి పార్టీలో చేరినందుకు చంపేస్తా మంటూ ఆయనకు బెదిరింపులు వస్తున్నాయ న్నారు. ఆయనకు ఏదైనా జరిగితే కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అత్యాచారంపై సీబీఐ విచారణకు డిమాండ్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం సంఘటనలో అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రమేయం, సున్నితమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును సీబీఐకు బదిలీ చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎన్.రామచంద్ర రావు, బంగారు శ్రుతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయంలో మహేందర్‌రెడ్డికి బీజేపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు రావడంతో పాటు నిందితులు ఎంత పెద్దవారైనా తప్పుచేస్తే చట్టపరంగా కఠిన శిక్ష తప్పదనే సందేశం వెలువడుతుందన్నారు. ఈ సంఘటన జరిగి అయిదు రోజులు గడిచాక తప్ప పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వల్ల నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇందులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని వార్తలు రాగా, అతనికి సంబంధం లేదంటూ పోలీసులు ముందుగానే ప్రకటించడంతో ఈ ఘటనలో ఏదో జరిగిందనేది స్పష్టమౌతోందన్నారు. పబ్‌లు, రెస్టారెంట్ల నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఏర్పడుతోందని డీజీపీకి వివరించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి అశ్వాపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, పోలీసులు పని చేస్తున్నారా, హోంమంత్రి ఉన్నారా లేరా అని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన రాజ్యాధికార యాత్ర శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా అశ్వాపురంలో మాట్లాడుతూ.. గతనెల 28న హైదరాబాద్‌లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బాధాకరమన్నారు. నిందితులు అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకుల బం ధువులని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని, హోం మంత్రి, ముఖ్యమంత్రితో నిందితులు ఫొటోలు దిగినట్టు సోషల్ మీడియాలో వస్తున్నాయన్నారు. బాలికపై అత్యాచార ఘటన విషయంలో అత్యున్నత సిట్ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాబోయే బహుజన రాజ్యంలో బెల్ట్‌షాపులు పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేశ్ తదితరులు ఉన్నారు. -
దారుణం: కెన్యా దేశస్థురాలిపై గ్యాంగ్‌రేప్
గుర్గావ్ : మహిళలపై దారుణాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. తాజాగా గుర్గావ్లో చోటు చేసుకున్న ఘటన మరో నిర్భయను గుర్తుకు తెస్తుంది. ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న కెన్యా దేశస్థురాలైన మహిళలను ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికి కారు ఎక్కించుకుని ఆమెపై అత్యాచారం జరిపారు. ఈ దారణమైన ఘటన బుధవారం గుర్గావ్లో చోటుచేసుకుంది. పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్గావ్లోని బ్రిస్తోల్ చౌక్‌లో తాను నివాసం ఉండే దక్షిణ ఢిల్లీ చత్తపూర్‌కు వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న మహిళను ముగ్గురు యువకులు స్కార్పియోలో వచ్చి చత్తపూర్‌లో దింపుతామని చెప్పి కారులో ఎక్కించుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు వారి స్నేహితులను మరో ఇద్దరి ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. మొత్తం ఐదుగురు అతి దారుణంగా ఆమెపై అత్యాచారం జరిపారు. అనంతరం ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డా దుండగులు ఆమెను అపస్మారకస్థితిలోకి వెళ్లేలా త్రీవంగా కొట్టి గుర్గావ్లోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లారు. కొంత సేపటికి తెరుకున్న బాధితురాలు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కారు నెంబర్ ఆధారంగా ఐదుగురు నిందితుల్లో ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందతులు సుధీర్, మోహిత్, ప్రవీణ్‌లుగా పోలీసు గుర్తించి వారి అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళను గుర్గావ్లోని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దాంతో పోలీసు నిందితులపై ఐపీసీ సెక్షన్ 376-డీ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులో కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు తెలిపారు. -
లిఫ్ట్ ఇచ్చి కదులుతున్న కారులో విద్యార్థినిపై..
నోయిడా: దేశంలో అత్యాచారాలను నివారించడానికి ఎన్ని చట్టాలు తెస్తున్నప్పటికీ.. అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. బాలికపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించిన రెండు రోజులకే నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై సమీప బంధువు, స్నేహితులే అత్యాచారం చేశారు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకి చెందిన 16 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది. ఈ నెల 18న స్కూల్‌కి వెళ్లిన బాలిక తిరిగి వచ్చే క్రమంలో స్కూల్‌బస్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇంటికి నడుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో అదే దారిలో కారులో వస్తున్న ముగ్గురు అబ్బాయిలు తనను ఇంటి వద్ద దించుతామని కారులో ఎక్కించుకున్నారు. కారెక్కిన ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించారు. ఆ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారు. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరు వారి సమీప బంధువు అని, మరొకరు తన క్లాస్మేట్ కాగా, మూడో వ్యక్తి తెలియదని చెప్పింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ / అలహాబాద్ / చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కఠువా, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసుల్లో కదలిక వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి(17)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శుక్ర వారం అరెస్టు చేశారు. అలాగే పోలీసులు నమోదుచేసిన మూడు ఎఫ్ఐఆర్లను సీబీఐ అధికారులు రీరిజిస్టర్ చేశారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో మైనర్ బాలిక అసిఫా(8) హత్యాచారం కేసును సుప్రీంకోర్టు శుక్రవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. చార్జ్‌షీట్‌ను దాఖలుచేయడానికి యత్నించిన పోలీసుల్ని న్యాయవాదులు అడ్డుకోవడంపై బార్ కౌన్సిళ్లకు నోటీసులు జారీచేసింది. అసిఫా కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి బెదిరింపులు రావడాన్ని ఈ సందర్భంగా కొందరు లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలాఉండగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ మంత్రులు చందర్ ప్రకాశ్, లాల్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన సీబీఐ ఉన్నావ్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ను తొలుత విచారణ నిమిత్తం శుక్రవారం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు సాయంత్రానికి అరెస్ట్ చేశారు. కుల్దీప్ను ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉన్నావ్ ఘటనలో దోషులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేశామన్నారు. ‘కుల్దీప్ను వెంటనే అరెస్ట్ చేయండి’ ఉన్నావ్ ఘటనలో ప్రధాన నిందితుడు కుల్దీప్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని అంతకుముందు అలహాబాద్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. కుల్దీప్ను సీబీఐ ప్రస్తుతం విచారిస్తోందని న్యాయవాది కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి డీబీ భోసలే, జస్టిస్ సునీత్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నిందితుడు బాధితులతో పాటు విచారణను ప్రభావితం చేయొచ్చనీ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని వ్యాఖ్యానించింది. విచారణపై నివేదికను మే2 లోగా సమర్పించాలని ఆదేశించింది. బార్ కౌన్సిళ్ల తీరుపై సుప్రీం ఆగ్రహం: కఠువా కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలుచేయకుండా న్యాయవాదులే అడ్డుకోవడంపై సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎంఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణ ప్రక్రియలో జోక్యం వల్ల బాధితులకు న్యాయం అందడం ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించింది. బాధితులు, నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాదుల్ని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో లాయర్ల ప్రవర్తనపై తమ స్పందనల్ని ఏప్రిల్ 19లోగా తెలియజేయాలని కఠువా జిల్లా బార్ అసోసియేషన్, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్, జమ్మూహైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తరఫున న్యాయవాది షోయబ్ ఆలమ్ వాదనలు వినిపిస్తూ.. పోలీసుల్ని అడ్డుకున్న న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు వెల్లడించారు. కఠువా ఘటనలో మృతురాలి వివరాలు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. -
‘భోపాల్’ రేప్ దోషులకు యావజ్జీవం!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ యువతి(19)పై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ కేసులో నలుగురు దోషులకు ఇక్కడి సెషన్స్ కోర్టు శనివారం యావజ్జీవశిక్ష విధించింది. గోలూ(25), అమర్(24), రాజేశ్(26), రమేశ్ మెహ్రా(45)లు మిగిలిన తమ జీవితమంతా జైలులో గడపాలని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సవితా దూబే తీర్పునిచ్చారు. భోపాల్‌లో అక్టోబర్ 31న సివిల్స్ కోచింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న బాధితురాలిపై ఈ నలుగురు హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ సమీపంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదులో పోలీసుల అలసత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు అధికారుల్ని సస్పెండ్ చేసింది. అనంతరం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ 15 రోజుల్లో విచారణను పూర్తిచేసింది. రోజువారీ విచారణ జరపాలన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో సెషన్స్ కోర్టు రికార్డు స్థాయిలో నేరం జరిగిన 52 రోజుల్లోనే తీర్పు వెలువరించింది. -
కోపార్డి గ్యాంగ్‌రేప్ కేసులో సంచలన తీర్పు
పుణే : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కోపార్డి గ్యాంగ్ రేప్ కేసులో అహ్మద్‌నగర్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులను దోషులుగా ఖరారు చేసింది. వీరికి శిక్షలను నవంబర్ 22న ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. నిందితులు ముగ్గురు జితేంద్ర షిండే, సంతోష్ జి.భవల్, నితిన్ జి.భాయ్‌లుమేలు బాలికపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని న్యాయమూర్తి సువర్ణ కోవలె పేర్కొన్నారు . కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు.. వారు నేరానికి పాల్పడినట్లు నిరూపించాయని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేసు పూర్వపరాలు... 2016, జూలై 13న అహ్మద్‌నగర్ జిల్లా కోపార్డి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక దారుణంగా హత్యాచారానికి గురైంది. తన తాత ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. ముగ్గురు దుండగులు ఆమెను ఎత్తుకెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. బాధితురాలు మరాఠ తెగకి చెందిన యువతి కావటం.. నిందితులు దళితులు కావటంతో ఇరువర్గాల పరస్పర ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడుకిపోయింది. అదే సమయంలో నాసిక్‌లోని కొన్ని ప్రాంతాల్లో దళితులపై దాడులు కూడా జరగటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన ప్రభుత్వం, సమన్వయం పాటించాలంటూ ఇరువర్గాలను శాంతింపజేసి.. ఉజ్జల్ నికమ్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించి కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. సుమారు 6 నెలలపాటు దర్యాప్తు చేపట్టిన ప్రాసిక్యూషన్ దర్యాప్తు ఆధారంగా మొత్తం 350 పేజీల ఛార్జ్‌షీట్‌తోపాటు 24 ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అయితే ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేకపోవటంతో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలనే పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం(బాధితురాలి రక్తపు మరకలు.. నిందితుల దుస్తులపై ఉన్న మరకలతో సరిపోలటంతో) వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించినట్లు నికమ్ వెల్లడించారు. బాలిక తల్లి స్పందన... కాగా, కోర్టు తీర్పు పట్ల బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, పోరాటంలో పాలుపంచుకున్న మరాఠా ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దోషులకు మరణశిక్ష విధించాలని ఈ సందర్భంగా ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. -
దారుణ ఘటనపై ఏడు గంటల బంద్
భువనేశ్వర్(ఒడిశా): గిరిజన బాలికపై గ్యాంగ్‌రేప్ ఘటనపై విచారణ చేపట్టి, కారకులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నిర్వహించిన బంద్ విజయవంతమయింది. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాకు చెందిన 9వ తరగతి చదివే గిరిజన బాలిక ఈనెల 10వ తేదీన గ్యాంగ్‌రేప్‌నకు గురయింది. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జవానులు, మావోయిస్టులు తాము ఈ కారణం కాదంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ ఏడుగంటల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కొరాపుట్ జిల్లాలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు దుకాణాలు, బ్యాంకులు, వివిధ వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలను విడిచి బయటకు రాలేదు. బంద్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ నాయకత్వం తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిందితులను శిక్షించి బాధితురాలికి రూ.50లక్షల పరిహారం సాయంగా అందించాలని అసెంబ్లీలో కాంగ్రెస్ విప్, స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినిపతి డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దారుణ ఘటన జరిగి ఏడురోజులైనా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేకపోయారని విమర్శించారు. కాగా, ఈ కేసులో ఎటువంటి ఆధారం లభ్యం కాకపోవడంతో పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
గ్యాంగ్ రేప్ చేసినందుకు ఖరీదు కట్టారు
ఇస్లామాబాద్: ఓ బాలికను సామూహిక అత్యాచారం చేసినందుకు 12 కిలోలు గోధుమలు ఇవ్వాలని ఖరీదు కట్టారు. కేసు పెట్టకుండా ఉండేందుకు ఈ మేరకు పరిహారం చెల్లించాలని పెద్దలు తీర్మానించారు. పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో ఉమెర్ కోట్ జిల్లా గులామ్ నబీ షా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. గిరిజన తెగకు చెందిన బాలికపై ఇటీవల గ్యాంప్ రేప్ చేశారు. ఆ ప్రాంతంలో గిరిజన సంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థానిక పెద్దలు కలసి నిందితులు 12 కిలోలు గోధుమలను బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఇందుకు బాలిక కుటుంబం వ్యతిరేకించడంతో ఊరి నుంచి వెలేస్తామని హెచ్చిరించారు. జరిగిన ఘోరంపై బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసును వెనక్కు తీసుకోవాలని నిందితులు బెదిరించారు. ఈ విషయం మీడియాలో రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
‘ఎఫ్ఐఆర్ నమోదు చట్టవ్యతిరేకం’
న్యూఢిల్లీ: నిర్భయ స్నేహితుడు ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారని, ఇది చట్టవ్యతిరేకమని డిసెంబర్ 16నాటి సామూహిక అత్యాచారం కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురిలో ఇద్దరు ఢిల్లీ హైకోర్టు ముందు వాదించారు. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ రేవ కేత్రపాల్, ప్రతిభా రాణిలతో కూడిన ధర్మాసనం ముందు దోషులు ముఖేశ్, పవన్ కుమార్ గుప్తాలు సోమవారం హాజరయ్యారు. వీరి తరఫు న్యాయవాది ఎం.ఎల్.శర్మ మాట్లాడుతూ నిర్భయ వాంగ్మూలం కాకుండా ఆమె స్నేహితుడు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. అలాగే మృతురాలి శరీరంపై ఉన్న ఆరు గాయాలతో, ఇద్దరు దోషుల వేలిముద్రలతో సరిపోయాయన్నారు. అలాంటప్పుడు ముఖేశ్, పవన్‌లను దోషులుగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంగళవారం కూడా ఈ వాదనలు జరగనున్నాయి. కాగా, గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఆరుగురు అత్యాచారం చేశారు. వీరిలో నలుగురికి ఉరి శిక్ష ఖరారైంది. మరొకడు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ బాల నేరస్తుల గృహంలో శిక్ష అనుభవిస్తున్నాడు. -
వివాహితపై సామూహిక అత్యాచారం
సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వే అప్‌యార్డులో మంగళవారం ఓ ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్ శ్యామ్‌ప్రసాద్ కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఈడిగ గ్రామానికి చెందిన వివాహిత (27) హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి వెళ్లడానికి సోమవారం రాత్రి పిడుగురాళ్లలో రెలైక్కింది. రైలు విజయవాడకు చేరుకున్న తర్వాత రాజమండ్రికి ప్యాసింజర్ రైలులో వెళ్లే ఉద్దేశంతో డీజిల్ మల్టీ యూనిట్ (డీఎంఈ) ఎక్కి కూర్చుంది. ఈలోగా రైలును శుభ్రపరిచే నిమిత్తం అప్ యార్డుకు తరలించారు. రైలు వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు రైలు డ్రైవర్‌కు మొరపెట్టుకోగా ఇటువంటి సంఘటనలు సహజమని అతనికి సహకరించాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. రైలులోనే పడిఉండగా క్లీనింగ్ సిబ్బంది తనను పొదల్లోకి తీసుకువెళ్లి వారు కూడా అత్యాచారం చేసినట్లు వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చిన్నారిపై బాలుడి అఘాయిత్యం ఖమ్మం: అయిదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు(13) లైంగిక దాడి చేశాడు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలోని చిన్నారి మంగళవారం పక్కింటికి వెళ్లింది. ఆ ఇంటిలోని బాలుడు చాక్లెట్ ఇస్తానంటూ చిన్నారిని లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్దిసేపటి తరువాత చిన్నారి ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు తీవ్రంగా రక్తస్రావమవడాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, బాలుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్ చిలుకూరు: పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడిపై నల్లగొండ జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమిక విచారణ జరిపించిన అనంతరం పీఈటీ విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో జగదీష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడిపై నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేశారు. -
గ్యాంగ్‌రేప్ నిందితులకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: సంచలనం కలిగించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అభయపై గ్యాంగ్‌రే ప్ కేసులో నిందితులను మాదాపూర్ పోలీసులు బుధవారం మియాపూర్‌లోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సత్యనారాయణ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిందితులైన కారు డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లును విచారించేందుకు రెండురోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నెల 27,28 తేదీల్లో వారిని పోలీసు కస్టడీకి అనుమతించింది. అనంతరం పోలీసులు వారిని మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలోని కంది జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను.. ముసుగులు వేసి కాళ్లు, చేతులకు సంకెళ్లతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జిల్లా జైలుకు తీసుకువచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా జైలు సూపరింటెండెంట్ పి.నాగేశ్వర్‌రెడ్డి నిందితులను ప్రత్యేక సెల్‌కు తరలించారు. తోటి ఖైదీలు దాడి చేసే అవకాశముందనే అనుమానంతో ప్రత్యేక సెల్లో ఉంచి భద్రత ఏర్పాటు చేశామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. నేడు లైంగిక సామర్థ్య పరీక్షలు: కోర్టు ఆదేశాల మేరకు గురువారం నిందితులకు లైంగిక సామర్థ్య పరీ క్షలు నిర్వహించనున్నారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాల నూ సేకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అభయ షాపింగ్ చేసిన ఇనార్బిట్ షాపింగ్ మాల్ మొదలు.. మైండ్‌స్పేస్ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్‌లోని టోల్గేట్, కొల్లూరు టోల్గేట్ వద్ద గల ప్రత్యక్ష సాక్షుల వివరాలను సేకరిస్తున్నారు. కారును డ్రైవర్ ఎలా ఉపయోగిస్తున్నాడో తెలుసుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించిన సీపీ అగర్వాల్ (ట్రావెల్స్ నుంచి అద్దెకు తీసుకున్న వ్యక్తి)పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిందితుల తరఫున వాదించం: న్యాయవాదులు ఈ కేసులో నిందితుల బెయిల్‌కు సహకరించరాదని రంగారెడ్డి జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ తీర్మానించింది. అభయపై లైంగిక దాడికి నిరసనగా కొత్తపేటలోని కోర్టు భవనం ముందు బార్ అసోసియేషన్ నాయకులు, పలువురు మహిళా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజి రెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి దేవరాజ్, మహిళా సంయుక్త కార్యదర్శి సునీత, జాట్ అధ్యక్షుడు నరేష్కుమార్ పాల్గొన్నారు. నిందితుల తరఫున ఎవరూ వాదించరాదని మియాపూర్ బార్ అసోసియేషన్ తీర్మానించినట్లు నాయకులు జి.శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలు తెలిపారు. -
ముంబై గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో నిందితులు !
దేశవాణిజ్య రాజధాని ముంబైలో కలకలం సృష్టించిన మహిళ ఫోటో జర్నలిస్ట్ (23)పై సామూహిక అత్యాచార ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆ ఘటనకు సంబంధించిన కేసులో ఐదుగురి నిందితుల ఊహ చిత్రాలను ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురు నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వారు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారని, అలాగే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు పోలీసు అధికారులు వివరించారు. ఆ ఘటనకు సంబంధించిన ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని చెప్పారు. వారిలో నలుగురు తమ అదుపులోనే ఉన్నారని చెప్పారు. వారిని తమదైన శైలీలో విచారిస్తున్నామని పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం చేసిన నిందితుల వివరాలను మహిళ జర్నలిస్ట్ అసిస్టెంట్ వివరించారని ఈ సందర్బంగా పోలీసు అధికారులు తెలిపారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన మహిళ జర్నలిస్ట్ జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. అత్యాచారం వల్ల ఆమె శరీరంలో అంతర్గంతంగా గాయాలు అయ్యాయని వైద్యులు వివరించినట్లు చెప్పారు. గురువారం సాయంత్రం మహాలక్ష్మీ పరిసర ప్రాంతంలో శక్తి మిల్ ప్రాంగణంలో విధి నిర్వహణలో భాగంగా ఆమె స్నేహితుడితో కలసి ఫోటో తీసుకుంటున్న మహిళ జర్నలిస్ట్‌ను స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో మహిళ జర్నలిస్ట్ అసిస్టెంట్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అతడిని కట్టిపడేశారు. అనంతరం ఆ ఐదుగురు యువకులు ఆ మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ మహిళ ప్రస్తుతం జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.