‘చిత్తశుద్ధితో అత్యాచార నిందితుల్ని పట్టుకోండి’  | BJP MP Soyam Bapu Rao Demands CBI Enquiry Over Jubilee Hills Gangrape Case | Sakshi
Sakshi News home page

‘చిత్తశుద్ధితో అత్యాచార నిందితుల్ని పట్టుకోండి’ 

Published Mon, Jun 6 2022 4:56 AM | Last Updated on Mon, Jun 6 2022 3:57 PM

BJP MP Soyam Bapu Rao Demands CBI Enquiry Over Jubilee Hills Gangrape Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని.. నిందితులు ఏ మూల దాగి ఉన్నా అరెస్ట్‌ చేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, మజ్లిస్‌ నేతల అరాచకాలు, అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోందని పేర్కొన్నారు. కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అఘాయిత్యాలు జరిగినా అందులో టీఆర్‌ఎస్‌ నేతల హస్తం ఉంటోందని ఆరోపించారు.

మంథనిలో లాయర్‌ వామన్‌ రావు హత్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర ఆగడాలకు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య, ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ నేతల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య, సూర్యాపేట జిల్లా కోదాడలో పేదింటి ఆడబిడ్డపై టీఆర్‌ఎస్‌ నేతల గ్యాంగ్‌ రేప్, రామాయంపేటలో టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ వేధింపులు తాళలేక తల్లీ కొడుకు లాడ్జిలో ఆత్మహత్య, నిర్మల్‌లో బాలికపై టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అత్యాచారం వంటి సంఘటనలు కోకొల్లలని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement