Soyam Bapu Rao
-
నడ్డాను కలిసిన ‘సోయం’
సాక్షి,ఆదిలాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు శుక్రవారం ఢిల్లీలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని నడ్డా హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్వ తంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని సోయం ప్రకటించిన నేపథ్యంలో అధిష్టానం ఆయనను బుజ్జగించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. రాజీకి రాష్ట్ర నేతల యత్నం.. బీజేపీ ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా గొడం నగేశ్‌ను ప్రకటించిన తర్వాత సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోయంను బుజ్జగించే యత్నం చేశారు. కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి హామీ ఇచ్చారు. అప్పు డే సోయం తనకు నడ్డా లేనిపక్షంలో బీఎల్ సంతోష్ ద్వారా హామీ ఇచ్చినట్లయితే పరిశీలన చేస్తానన్నారు. విషయాన్ని కొద్ది రోజులు నాన్చడంతో ఈ హామీ లభించకపోవచ్చనే ప్రచారం జరిగింది. ఇది లా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ బాధ్యులతో కిషన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ రోజు తెలంగాణ ఇన్చార్జి సునిల్ బన్సల్ కూడా అందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోయంను పార్టీ ఆఫీస్‌లో చర్చలకు పిలిచినా ఆయన హాజరుకాలేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యే ద్వారా రాయబారం.. ఎంపీ సోయంతో రాష్ట్ర నేతల రాజీయత్నాలు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి.. మహా రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవిస్ ద్వారా ఎంపీ సోయం బంధువు అయిన కిన్వట్ ఎమ్మెల్యే కేరం భీంరావుతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగి సోయంను చర్చల కోసం శుక్రవారం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నడ్డాను ఈ నేతలు కలిశారు. ఈ విషయంపై సోయం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను ఢిల్లీ వచ్చినట్లు పేర్కొన్నా రు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నామినేటెడ్ పదవి విషయంలో హామీ ఇచ్చారని వివరించారు. ఇవి చదవండి: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి -
పార్టీ ఏదైనా.. పోటీలో ఉండటం ఖాయం! : సోయం బాపూరావు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. హస్తం పార్టీ హైకమాండ్ కూడా పాజిటివ్‌గా ఉందనే టాక్ మొదలైంది. గురువారం రాత్రి రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ స్థానం పెండింగ్ పెట్టడం వెనక ఇదే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ టికెట్ గొడం నగేశ్‌కు కేటాయించిన తర్వాత సోయం కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే చేరికలు, అభ్యర్థి ఎంపిక పరిశీలన వేగవంతం చేయడంతో ఇక కాంగ్రెస్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే తాజా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయమై సోయం బాపూరావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినప్పుడు.. ‘పార్టీ ఏదైనా.. తాను పోటీలో ఉండటం ఖాయం..’ అని పేర్కొనడం గమనార్హం. సీనియర్ నేతలను ఢీకొట్టగలరా.. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొద్ది రోజులుగా పరిణామాలు వేగంగా మారు తూ వచ్చాయి. చివరకు ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ తమ పోస్టులకు స్వచ్ఛంద విరమణ ప్రకటించి సీఎం సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరిన తెలిసిన విదితమే. ఈ ఇద్దరి నుంచే ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. సుగుణ అనుచరులు సంబరాలు సైతం చేసుకున్నారు. అయితే ఒక్కరోజుకే పరిస్థితి మారిపోయింది. తాజాగా సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం వారి అభ్యర్థిత్వం విషయంలో బ్రేక్ పడినట్టేననే చర్చ సాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, ఈ సీనియర్ నేతలను కొత్త నేతలు ఢీకొట్టగలుగుతారా.. అనే సమీకరణాల్లోనూ పార్టీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో గోండు సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ సోయంనే పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలని హైకమాండ్ పాజిటివ్‌గా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా మనస్సు మార్చుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోయం బాపూరావుకు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శనివా రం రావాలని పిలుపు అందింది. గొడం నగేశ్‌కు సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ కోరేందుకే పిలిచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోయం పార్టీ కార్యాలయానికి వెళ్తారా.. లేదా అనేది ఆసక్తికరం. పోటీలో ఉండటం ఖాయమని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఆయన కలవకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. మరోవైపు లంబాడాకు ఇస్తారనే చర్చ.. రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ విషయంలో చివరి క్షణంలో పెండింగ్ పెట్టిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుంది. కాగా ఈ పెండింగ్ విషయంలో లంబాడా సామాజికవర్గ కాంగ్రెస్ నేతలు మరో రకంగా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఆదివాసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన దృష్ట్యా లంబాడా సామాజిక వర్గానికి కాంగ్రెస్కేటాయించే యోచనలో ఉండడంతోనే పెండింగ్ పెట్టిందని చెబుతుండటం గమనార్హం. మహబూబాబాద్ టికె ట్ లంబాడాకు కేటాయించడంతో ఆదిలాబాద్ స్థా నం సమీకరణాల్లో భాగంగా ఆదివాసీకే కేటాయిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న బంజారా జనాభా దృష్ట్యా పార్టీ ప్రయోజనాల కోసం లంబాడాకు ఇవ్వాలని యోచిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా పార్టీ పరిశీలిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్‌లలో ఎవరికైనా టికెట్ దక్కవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయ్యేవరకు ఈ చర్చలు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే హోలీ పండగ తర్వాత నిర్ణయం వెలువడవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత.. ఈరోజు అప్డేట్స్ -
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో..? కొనసాగుతున్న ఉత్కంఠ!
సాక్షి, ఆదిలాబాద్: లోక్‌సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినబడుతున్నప్పటికీ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతనే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే ఈ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు నిరాశ తప్పదని అంటున్నారు. కాగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును రంగంలోకి దించాలని అధిష్టానం ఆసక్తితో ఉన్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన ఆయన ఇప్పుడే పార్లమెంట్‌కు పోటీ చేసే విషయంలో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయన పోటీకి ముందుకు రాకపోతే ఆశావహుల్లో ఎవరికై నా టికెట్ లభించవచ్చనే చర్చ సాగుతోంది. ఆశావహుల ముమ్మర యత్నాలు.. కాంగ్రెస్ టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఎల్ఐసీ ఉద్యోగానికి ఇటీవలే రాజీనామా చేసి పార్టీలో చేరిన కోవ దౌలత్‌రావు మొకాశి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్న మర్సుకోల సరస్వతి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఆసిఫాబాద్ టికెట్‌ను ఆశించిన ఆమె దక్కకపోవడంతో పార్టీ వీడారు. తాజాగా ఆమె పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఆదివాసీలకే టికెట్ ఇవ్వాలని మెజార్టీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదివాసీ అభ్యర్థికే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గాల ఇన్చార్జీల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేయగా ఆశావహుల్లోని ఓ అధికారి పేరు ఎక్కువ మంది చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ విషయంలో సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. అపాయింట్మెంట్ ఫిక్స్ అనే ప్రచారం.. బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే శనివారం సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదనేది స్పష్టమవుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. మరోపక్క ఎన్నికల నోటిఫికేషన్ నేడు రానుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికను త్వరగా ముగించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇవి చదవండి: కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి -
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సాయం బాపురావు సంచలన వ్యాఖ్యలు
-
బీజేపీ లిస్ట్‌లో ‘నో’ ప్లేస్.. సోయం బాపురావు సంచలన కామెంట్స్
సాక్షి, ఆదిలాబాద్: తనకు లోక్‌సభ స్థానం నుంచి టికెట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్ చేశారు. నా బలం.. బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ హైకమాండ్ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు, తెలంగాణలో కూడా తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి లిస్టులో రాలేదు. ఆదిలాబాద్ గురించి హైకమాండ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బాపురావు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో బాపురావు ఆదివారం మీడియాతో మాట్లాడూతూ.. నాకు టికట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారు. ఆదివాసీ నేతకు టికెట్ రాకుండా పావులు కదిపారు. నేను ఎక్కడో గెలుస్తానో అనే భయం వాళ్లకు ఉంది. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను.. రెక్కల మీద ఆధారపడిన పక్షిని.. నేను స్వతహాగా ఎగురగలను. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే.. గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలి. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీపడుతున్నారు. ఏ బలంలేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించాను. జడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించాను. నా బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది. రెండో లిస్ట్‌లో నాకు టికెట్ వస్తుందని భావిస్తున్నాను. ఎవరి మీద ఆధారపడే నేతను నేను కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
సిట్టింగ్గా మరోసారి పోటీకి సిద్ధమవుతున్న ‘సోయం’
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో లుకలుకలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వర్సెస్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి పాయల్ శంకర్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. సిట్టింగ్గా మరోసారి సోయం పోటీకి సిద్ధమవుతున్నారు. మరోపక్క ఇతర పార్టీల్లోని ఆశావహుల్ని పార్టీలోకి రప్పించేందుకు పాయల్ శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోయంకు పోటీగా ఇతరులను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు శంకర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో ప్రచారం ఉంది. ఇటీవల వరుసగా వేర్వేరు చోట్ల జరుగుతున్న పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం బీజేపీలో లుకలుకలను స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోయంకు పోటీగా.. ఎంపీ సోయం బాపూరావుకు పోటీగా పార్టీలో ఇతర ఆశావహులను తెరపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యే శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇతర పార్టీల్లోనూ ఆశవాహులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మరో ఆదివాసీ ముఖ్యనేతను పార్టీలో చేర్పించేందుకు నేరుగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లినట్టుగా చర్చ సాగుతోంది. టికెట్ హామీ కండీషన్‌తో పార్టీలో చేరే విషయంలో ఢిల్లీ పెద్దలు హామీ ఇవ్వకపోగా, హైదరాబాద్‌లోనే ఆ నేతలను చేర్పించాలని తిరిగి పంపించారని ప్రచారం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇటీవల చేరారు. మరో ముఖ్య నేత మాత్రం టికెట్‌పై హామీ లేకపోవడంతో చేరకుండానే జిల్లాకు తిరిగి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మళ్లీ బీఆర్ఎస్ సమావేశాల్లో ఆ నేత యాక్టీవ్‌గా పాల్గొనడంతో పార్టీని వీడే యత్నాలు ముగిసినట్టేనా.. లేనిపక్షంలో మున్ముందు ఎలాంటి నిర్ణయం ఆ నేత తీసుకుంటారనే విషయంలో పార్టీలో సందిగ్ధం నెలకొంది. సిద్ధాంతాలు ఎటుపోయాయి.. సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకునే బీజేపీలో అవి మచ్చుకు కనబడటం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం. ప్రధానంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి మార్పు చోటుచేసుకోగా, అనూహ్యంగా పార్టీలో సీనియర్లను కాదని గుడిహత్నూర్ జెడ్పీటీసీ పతంగే బ్రహ్మానందంను ఎంపిక చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకులు సుహాసినిరెడ్డి, ఆదినాథ్ వంటి వారికి అవకాశం ఇవ్వకుండా జెడ్పీటీసీకి ఆ పదవి కట్టబెట్టడం వెనుక పార్టీలో ముఖ్య నేతల మధ్య తీవ్ర విభేదాలే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేశ్‌బాబు ప్రచార రథం నియోజకవర్గాల్లో తిరుగుతుండడంపై పార్టీ కార్యకర్తలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు ఎటుపోతున్నాయన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీకి నష్టం జరిగించే విధంగా పార్టీలో కార్యక్రమాలు జరుగుతుండడంతో పలువురు సీనియర్ నేతలు సైతం నిరుత్సాహంగా ఉన్నట్లు సమాచారం. -
కోర్ మీటింగ్‌లో ‘సోయం’ వ్యాఖ్యల దుమారం!
సాక్షి,ఆదిలాబాద్: బీజేపీలో రచ్చ మొదలైంది.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ అభ్యర్థి ఎవరనే విషయంలోనే ముఖ్య నేతల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. మొన్నటివరకు సిట్టింగ్ ఎంపీకే టిక్కె ట్ అనే ప్రచారం జరిగింది. దానిపై ప్రస్తుతం పార్టీ లో ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. మంగళవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అటు ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు దుమారం లేపుతుండగా ఇటు ఎమ్మెల్యేలు అభ్యర్థి విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా మాట్లాడటం విభేదాలను స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్‌లో జరగవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు తిరిగి పోటీ చేస్తారని కొద్దిరోజుల కిందట పార్టీలో చర్చ జరిగింది. తాజాగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇటు పార్టీలో ఉన్న ఎస్టీ ముఖ్య నేతలు, పార్టీతో సంబంధం లేని ఇతరులు కూడా బీజేపీ నుంచి టిక్కెట్ ఆశిస్తూ ఆయా ఎమ్మెల్యేల ఫొటోలతో అన్నిచోట్ల ఫ్లెక్సీలు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా నేతల ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుందనే ప్రచారం ఉంది. ఎన్నికలు సమీపిస్తుండగా పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నది స్పష్టమవుతోంది. అయితే ఆయా ఎమ్మెల్యేలు వేర్వేరు అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలుగానే దీన్ని పరిగణించాలా? ఎమ్మెల్యేల మధ్య కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం ఉందా? అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆదిలా బాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభ్యర్థి ఎంపిక విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయం సా ధించగలుగుతారా? అనేది వేచిచూడాల్సిందే. వ్యాఖ్యల దుమారం.. బీజేపీ కోర్ కమిటీ సమావేశం మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర నేతలూ పాల్గొన్నారు. ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎంపీ సోయం మాట్లాడుతూ తాను బాగా పనిచేశానని పార్టీ భావిస్తే టిక్కెట్ ఇస్తుందని.. అలా కాదనుకుంటే ఇవ్వదని వ్యాఖ్యానించారు. ఈ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు డిమాండ్ పెరిగిందన్నారు. అయితే కొత్తగా కొందరు పోస్టర్లు వేసి, డిన్నర్లు ఇస్తున్నారని, అలాంటి వారిని పార్టీ గుర్తించదని, ఇతర పార్టీలో ఇది సాధ్యమని అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఎంపీగా ఉన్నందునే పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారని, మిగిలిన చోట్ల గట్టి పోటీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థి ఎవరనేది మా చేతిలో లేదనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభ్యర్థి ఎవరైనా పెద్ద ఎత్తున మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఎంపీ, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయంగా మారాయి. మొత్తంగా ఎన్నికలకు ముందు పార్టీలో ముఖ్య నేతల మధ్య విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. ఇవి చదవండి: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -
విద్యార్థులు లక్ష్యంతో ముందుకుసాగాలి : ఎంపీ సోయం బాపూరావ్
ఆదిలాబాద్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగితే విజయం సాధిస్తారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థులు తోడసం వెంకటలక్ష్మి, నరసింహస్వామిలు ఆగాఖాన్ అకాడమీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీటు వచ్చిందుకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పాఠశాలలో సమస్యలపై ప్రిన్సిపాల్ కాంబ్లే అనిల్, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనం పూర్తయినా అనుమతి ఇవ్వలేదని నిర్వాహకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల.. -
'ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఒకప్పుడు ఉపాధ్యాయులే..'
సాక్షి, ఆదిలాబాద్: బోథ్ ఎస్టీ అసెంబ్లీ రిజర్వుడ్ స్థానంలో 38ఏళ్ల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 14మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా దీంట్లో నలుగురు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారే కావడం విశేషం. ► బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామానికి చెందిన గోడం రామారావు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మొదటిసారిగా 1985లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. ► రామారావు తనయుడు గోడం నగేష్ 1986లో బజార్హత్నూర్ మండలంలోని విఠల్‌గూడలో గిరిజన పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. 1994లో బోథ్ మండలంలోని పార్డీ ఆశ్రమ పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో గిరిజన శాఖ మంత్రిగా పనిచేశాడు. 1999లో రెండోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర జీసీసీ చైర్మన్‌గా పనిచేశాడు. 2009 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించాడు. నాల్గోసారి 2004 టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందాడు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చెందాడు. ► నార్నూర్ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ బాపురావు 1986లో ఆదిలాబాద్ మండలంలోని చింతగూడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యాడు. 2009లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014 టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 2018లో రెండోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్కి రాజీనామా చేశారు. ► బోథ్ మండలంలోని నాగుగూడ గ్రామానికి చెందిన సోయం బాపూరావు 1987లో మహదుగూడలో గిరిజన శాఖ ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. వివిద పాఠశాల్లో విధులు నిర్వహిస్తూనే తుడుం దెబ్బలో ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేశాడు. 2004 ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందాడు. 2014లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ గెలుపొందాడు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నాడు. -
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
-
ఎంపీ ఎదుటే తగువులాట..!
ఆదిలాబాద్: భైంసా బీజేపీలో ఇప్పటికే అంతర్గత కలహాలు కలవరపెడుతుండగా, శనివారం పట్టణంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ సోయం బాపురావు ఎదుటే స్థానిక నాయకులు తగువులాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. శనివారం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం విలేకరుల సమావేశం సందర్భంగా వేదికపై ఎంపీ సోయం, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రామారావుపటేల్, మోహన్‌రావుపటేల్, రవిపాండే, నారాయణ్‌రెడ్డి, కౌన్సెలర్ అనిత సూత్రావేతో పాటు ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బాజీరావు కూర్చోగా అక్కడే ఉన్న అసెంబ్లీ కన్వీనర్ సాయినాథ్, గాలి రవి తదితరులు బాజీరావును వారించారు. దీంతో ఎంపీ ఎదుటే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాను ఓబీసీ నాయకుడినని ప్రొటోకాల్ ప్రకారం కూర్చుంటే తప్పేంటని బాజీరావు ప్రశ్నించగా, పార్టీ కోసం ఏ పని చేశావంటూ అతడిని నిలదీశారు. ఇంత జరుగుతున్నా ఎంపీ సోయం వారిని సముదాయించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కనిపించని జిల్లా అధ్యక్షురాలు... భైంసాలో పార్టీ నియోజకవర్గ కార్యాలయ ప్రారంభోత్సవంలో జిల్లా అధ్యక్షురాలు రమాదేవి గైర్హాజరయ్యారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆమెకు తెలియకుండానే హడావిడిగా చేశారని సమాచారం. ఈ కారణంగానే ఆమె ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎంపీ సోయం బాపురావును ప్రశ్నించగా ఈనెల 3న ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆమె బిజీగా ఉన్నారని, అందుకే కార్యక్రమానికి రాలేదని చెప్పడం విశేషం. -
బుజ్జగింపా.. మూడు రోజులుగా ఢిల్లీలోనే ఎంపీ ‘సోయం
సాక్షి, ఆదిలాబాద్: ఎంపీ సోయం బాపూరావు మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నారు. హైకమాండ్ పిలుపుతోనే ఆయన గత శనివారం ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఆయనను బుజ్జగించేందుకు పిలిచారా.. లేని పక్షంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలో ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆయనకు సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకే ఈ పిలుపని పార్టీలో రెండు రకాల ప్రచారాలు సాగుతున్నాయి. తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉందని, ఇందులో ఎస్టీ కోటాలో సోయంకు పదవి దక్కనుందనే ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా ఈ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రచారాలకు ఊతం ఇలా.. కొద్ది రోజుల క్రితం ఎంపీ ల్యాడ్స్ విషయంలో సోయం బాపూరావు వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఇప్పటి వరకు ఆ నిధులు పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు కేటాయించలేకపోయానని, తన కొడుకు పెళ్లి.. ఇంటి నిర్మాణంలో వాటిని వాడుకోవాల్సి వచ్చిందని ఆయన అంటున్నటువంటి వీడియో క్లిప్ వైరల్ అయింది. ఆ తర్వాత సోయం బాపూరావు వైరల్ అయిన వీడియోలోని మాటలను ఖండించారు. పార్టీలో కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌పై ఆరోపణలు సంధించారు. వీటి తర్వాత ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ బుజ్జగించేందుకే ఢిల్లీకి పిలిచిందా అనే ప్రచారం సాగుతోంది. మరో వైపు తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కడం ఖాయమని ప్రచారం సాగుతుండగా బీసీ కోటాలో ఒకరికి, ఎస్టీ కోటాలో సోయంను వరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పార్టీ పరిణామాలపై స్తబ్ధత.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయడం, ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని హైకమాండ్ నియమించడంపై జిల్లా పార్టీ వర్గాల్లో బాహాటంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే ఓ వర్గం ఈ పరిణామాలతో నారాజ్ ఉండగా, మరో వర్గం పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనన్న రీతిలో ఉన్నారు. ఇదిలా ఉంటే కొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు వాట్సాప్ స్టేటస్‌లో బండి సంజయ్‌తోనే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయిందని ఆయన తొలగింపు సరికాదనే విధంగా పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా రెండు రోజులుగా కమలం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అటు సాధారణ జనంతో పాటు ఇటు పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
కమలం పార్టీ శ్రేణుల్లో గుబులు.. నిధుల వాడకం వ్యాఖ్యలతో మైనస్ కానుందా?
ఒక సీటు కోసం ఒకే పార్టీలోని ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటే కొట్లాట తప్పదు. ఇప్పుడు ఆదివాసీల జిల్లాలోని కమలం పార్టీలో ఇదే జరుగుతోంది. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం బీజేపీలో కుస్తీపట్లు మొదలయ్యాయి. ఆదివాసీ ఎంపీ, గిరిజన నేతల మధ్య ఫైట్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కమలం పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీ సోయం బాపురావు ఎంపీ ల్యాడ్స్ నిధుల దుర్వినియోగ వివాదం అటు జిల్లాలో, ఇటు పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఎంపీకి కేటాయించిన నిధుల వినియోగంపై బీజేపీ ప్రజా ప్రతినిధులతో సోయం బాపురావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిదులు ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెళ్లి కోసం వాడుకున్నట్లు చెప్పారు. ఆ వీడియో బయటకి వచ్చి మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిధుల వాడకంపై ఎంపీ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసాయి. నిధుల దుర్వినియోగం పై ఎంపీ సోయం బాపురావు స్పందించారు. తాను ల్యాడ్స్ నిధులు వాడుకోలేదన్నారు.. ఇల్లు నిర్మాణం, కొడుకు పెళ్లి కోసం అణా పైసా వాడుకోలేదని స్పష్టం చేశారు. తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. పార్టీలోనే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ చెప్పారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తనమీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే వారిద్దరికీ గిట్టడంలేదని విమర్శించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తాను ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నానని, అందుకే ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు తనను బీజేపీ నుంచి సాగనంపడానికి ఇదంతా చేస్తున్నారని ఎంపీ సోయం అన్నారు. అదే విధంగా తన ఎంపీ సీటుకు కూడా ఎసరు పెట్టేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మధ్య విభేదాలకు చాలా కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి రమేష్ రాథోడ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం కూడా పూర్తి చేసుకున్నారు. కాని అక్కడి నుంచి రమేష్ రాథోడ్ కాకుండా జడ్పీటీసీ జానుబాయి, హరి నాయక్‌లకు ఎంపీ సోయం మద్దతిస్తున్నారని సమాచారం. ఇక్కడి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు చివరికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయట. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ సీటు కోసం జిల్లా పరిషత్ చైర్మన్ సుహసిని రెడ్డి కూడా పోటీపడుతున్నారు. ఇక్కడ కూడా ఎంపీ బాపురావు జిల్లా అధ్యక్షుడికి మద్దతివ్వడంలేదట. వీరిద్దరి మధ్యా గతంలో ఒక భూ వివాదం కూడా చోటు చేసుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయంటున్నారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ స్పందించారు. తనపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఎంపీకి తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఎంపీని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీతో కలిసి పనిచేయడానికి తాను సిద్దమన్నారు రమేష్ రాథోడ్. జిల్లాలో పార్టీ ఎంపీ, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగితే ఫైనల్‌గా నష్టపోయేది పార్టీయేనని అక్కడి కాషాయ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నేతల మధ్య విభేదాలు తొలగించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. -
ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా.. పెళ్లి చేశా..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నానని, పెళ్లి చేశానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యల వీడియో కల కలం రేపింది. కానీ తాను అలా అనలేదని, ఓర్వలేక దు్రష్పచారం చేస్తున్నారని ఆయన ఖండించ డం గమనార్హం. సోయం బాపురావు ఈ నెల 16న ఆదిలాబాద్‌లోని తన నివాసంలో స్థానిక బీజేపీ నేతలతో ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై మా ట్లాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సో మవారం వైరల్‌గా మారింది. అందులో.. ‘మొదటిసారి పార్టీ బలోపేతం కోసం, రెండోసారి రెండున్నర కోట్లలో ఇల్లు, కొడుకు పెళ్లి కోసం ఎంపీ ల్యాడ్స్ వాడిన. ఈ మాటను ఏ నాయకుడు కూడా ఒప్పుకోడు. ఇంకోసారి నా స్వార్థం కోసం వాడను. అంత కుముందు దద్దమ్మ ఎంపీలు మొత్తం వాడుకున్నారు. ఈసారి ఇంకా ఏ ఎంపీకి కూడా నిధులు రాలేదు. ఈసారి వచ్చే రూ.5 కోట్లు మీకే.. ఒక్కొక్కరికి రూ.ఐదేసి లక్షల చొప్పున నిధులు ఇస్తా..’అని బాపురావు పేర్కొన్నట్టుగా ఉంది. తెలివిలేని ఆరోపణలు: సోయం బాపురావు సోమవారం సోయం బాపురావు దీనిపై స్పందించారు. ‘నేను ఇల్లు కట్టుకోవడం, కొడుకు పెళ్లిలో బి జీగా ఉన్నానని చెప్పానే తప్ప.. ఇంటికోసం ని ధు లు వాడినట్టు చెప్పలేదు. ఎంపీ నిధుల వినియోగానికి ఒక సిస్టం ఉంటుంది. కొందరి ఆటలు సాగక ఆరోపణలు చేస్తున్నారు’అని పేర్కొన్నారు. -
పార్టీకి ఊపు తెచ్చిన సోయంకు ప్రాధాన్యత ఇవ్వటంలేదా..!
-
బీజేపీలో సైలెంట్ వార్.. కార్యకర్తల్లో కొత్త టెన్షన్!
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో ఇద్దరు ముఖ్య నేత ల మధ్య సైలెంట్ వార్ ప్రచారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పైకి ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం బలంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌ల మధ్య ఇటీవల జరి గిన పరిణామాలు ఈ సైలెంట్ వార్‌ను స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విభేదాలకు ప్రత్యేకంగా కారణం కనిపించకపోయినా రాను న్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఇద్దరి మధ్య ఎడమొహం.. పెడమొహం అన్నట్టుగా వ్యవహారాలు సాగుతున్నాయని వినిపిస్తుంది. పట్టు కోసం యత్నాలు.. రాజకీయంగా అనేక ఉత్తానపథనాలు చూసిన రమేశ్‌రాథోడ్ 2021 జూన్‌లో ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరారు. తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో ఆయన చేరికను ఎంపీ సోయం బాపూరావు వ్యతిరేకించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తొలిగి పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. అయితే కొంత కాలంగా మళ్లీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని ప్రచారం సాగుతుంది. ఐదు నెలల క్రితం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగోస–బీజేపీ భరోసా యాత్ర అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో రమేశ్‌రాథోడ్ ఆధ్వర్యంలో ఆ యాత్ర ఈటల రాజేందర్‌తో నిర్వహిస్తున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఆ యాత్ర నిలిచిపోయింది. ఈ ఇరువురి మధ్యలో విభేదాల కారణంగానే ఈ యాత్ర జరగలేదని పార్టీలో కార్యకర్తల మధ్య చర్చ సాగింది. ఎడమొహం.. పెడమొహం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రమేశ్‌రాథోడ్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల కు కొద్ది నెలల ముందు కాంగ్రెస్‌లో చేరి ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పుడు రేఖానాయక్ చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ పరంగా టికెట్‌ను ఆశిస్తూ అక్కడ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకులు హరినాయక్, పెంబీ జెడ్పీటీసీ జానుబాయిలను అంతర్గతంగా ఎంపీ సోయం బాపురావు ప్రో త్సాహం అందిస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం కమలం పార్టీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విభేదాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. -
భయం మొదలైందా..? ఇన్నాళ్లకు ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగిందా?
ఆ సంఘం ఓ వ్యక్తికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఒకసారి ఎమ్మెల్యేను చేసింది. మరోసారి ఎంపీని చేసింది. ఎంపీ కాగానే రాజకీయ జన్మనిచ్చిన సంఘాన్ని వదిలేశారాయన. జనానికి దూరమై రాజకీయంగా బలహీనమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగింది. మళ్లీ తనకు జీవితాన్నిచ్చిన సంఘానికి సారథ్యం వహించాలని అనుకుంటున్నారు. ఆదివాసీలకు దగ్గర కావాలంటే ఆ సంఘం నాయకత్వం ఎంత అవసరమో గ్రహించారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆ సంఘం సంగతేంటి? ఉద్యమం నుంచి ఢిల్లీ దాకా తెలంగాణలో అణగారిన వర్గంగా ఉన్న గోండు తెగ ఆదివాసీల్లో చైతన్యాన్ని రగిల్చిన సంస్థ తుడుం దెబ్బ. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు గుర్తింపు లభించింది. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ తరపున విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం వరకు తుడుం దెబ్బకు నాయకత్వం వహించిన సోయం బాపూరావు.. ఎంపీ బాధ్యతల కారణంగా సంఘం నాయకత్వాన్ని వదులుకున్నారు. ఉద్యమ సారథిగా ఉన్న కాలంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం నడిపారు. ఆదివాసీల హక్కుల కోసం బలమైన ఉద్యమం నిర్మించడం ద్వారానే నాయకుడిగా గుర్తింపు పొందారాయన. మమ్మల్ని దూరం పెడతారా? ఆదివాసీల మద్దతుతోనే పార్లమెంట్లో అడుగు పెట్టిన సోయం బాపూరావు.. లంబడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పోరాటం చేశారు. పోరాటం అగిపోయింది. సంఘం బాధ్యతల నుంచి కూడా ఏడాదిన్నర క్రితం తప్పుకున్నారు. తాము నమ్మి ఎంపీనీ చేసిన నాయకుడు ఉద్యమం నుండి వైదొలగడం అదివాసీలను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందట. ఎంపీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఆయన వైఖరితోనే ఉద్యమ కాలంలో బాపూరావు వెన్నంటి ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన్ను వీడిపోయారట. ఏడాదిరన్నరలోగానే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఆదివాసీలు దూరం కావడంతో.. ఎంపీకి జ్ఞానోదయం కలిగిందంటున్నారు. ఆదివాసీలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని సర్వేల్లో తేలిందట. మీ మాట వింట.. మీ వెంట ఉంటా.! పరిస్థితి అర్థం కావడంతో ఎంపీకి దడ మొదలైందట. గతంలో ఒక పిలుపునిస్తే చాలు... వేలాదిగా రోడ్ల మీదకు వచ్చేవారు. వారి వల్లే ఢిల్లీ వరకు వెళ్ళగలిగిన తాను.. ఇప్పుడు ఓడి పోవడం ఖాయమనే భయం మొదలైందట. దీంతో మళ్ళీ తన సామాజిక వర్గమైన ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అందులో భాగంగానే తుడుం దెబ్బ అధ్యక్ష పదవి మళ్లీ చేపట్టాలని భావిస్తున్నారని సమాచారం. తనకు అనుకూలంగా ఉన్నవారి ద్వారా తిరిగి పదవి దక్కించుకోవడానికి సోయం బాపూరావు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తనకు పదవి అప్పగిస్తే చాలు అదివాసీల హక్కుల కోసం మళ్లీ పోరాటం సాగిస్తానని హామీ ఇస్తున్నారట. ఆదిలాబాద్ ఎంపీ గోండులకు దగ్గర కావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా.. తుడుం దెబ్బ బాధ్యతలను తిరిగి బాపూరావుకు అప్పగించడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధంగా లేదని తెలుస్తోంది. సోయం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో... ఆదివాసీలు మద్దతు ఎంతవరకు కూడగడతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీజేపీని అప్రదిష్టపాల్జేసే ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారంలో శ్రీనివాస్ అనే వ్యక్తికి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, సీహెచ్ విఠల్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. సిట్ కాదు.. సిల్లీ దర్యాప్తు ఇదని, ఎవరికో నోటీసులిస్తే బండి సంజయ్‌కు ఏం సంబంధమని అరుణ ప్రశ్నించారు. కేసీఆర్ బంధువులు చేసే తప్పులన్నింటికీ ఆయనే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీని అప్రదిష్ట పాల్జేసేందుకు కేసీఆర్ ఆడుతున్న దొంగ నాటకం ఇదని మండిపడ్దారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే (దొంగే దొంగ) అన్నట్లుగా కేసీఆర్ సిట్ యవ్వారం ఉందని సోయం బాపూరావు విమర్శించారు. లిక్కర్ కేసులో బిడ్డ నిందితురాలు కాదని చూపించుకోవడం కోసం కేసీఆర్ ఆడుతున్న డ్రామాలో భాగమే ఇదని రాణి రుద్రమ ఆరోపించారు. హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో జరగాల్సిన సిట్ దర్యాప్తు దారి తప్పుతోందని విఠల్ విమర్శించారు. -
Teachers' Day: ఉపాధ్యాయ వృత్తి నుంచి చట్టసభల్లోకి..
సాక్షి, ఆదిలాబాద్: వారంతా ఒకప్పటి గురువులు.. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి, ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. సమాజ మార్గనిర్దేశకులుగా సేవలందించి విద్యార్థుల అభ్యన్నతికి పాటుపడ్డారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజల ఆదరణను చూరగొని తరగతి నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల ఉన్నతికి ఏ విధంగా పాటుపడ్డారో ప్రజాప్రతినిధులుగానూ తమను గెలిపించిన ప్రజలకు అండగా నిలుస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఉపాధ్యాయులుగా నాటి జ్ఞాపకాలు మరువలేనివని చెబుతున్న పూర్వపు గురువులపై ‘టీచర్స్‌డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. ఉద్యోగాన్ని వదిలి ఎమ్మెల్యే, ఎంపీగా.. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు సైతం ఉపాధ్యా య వృత్తి నుంచే రాజకీయాల్లోకి అడుగుపె ట్టారు. 1987లో బోథ్ మండలం మహద్గాంవ్లో తొలిసారి ఐ టీడీఏ ఉపాధ్యాయుడిగా నియామకమయ్యారు. అదే మండలం రాజుపల్లి, బజార్హత్నూర్ మండలం కొత్తగూడెం, ఆసిఫాబాద్ మండలం రాయిగూడ, ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్ స్పోర్ట్స్ స్కూల్లో 1994 వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పారు. రాజకీయాలపై ఆసక్తితో 2004లో టీఆర్ఎస్లో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో పోటీచేసి పరాజయం పాలై తిరిగి బీజేపీలో చేరి 2019లో ఎంపీగా గెలుపొందారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని దాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవలో.. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 1993లో ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా తిర్యాణి మండలం గొపెరాలో నియామకమయ్యారు. ఆరేళ్లపాటు అక్కడే పనిచేసిన ఆయన 1999లో నార్నూర్ మండలం చింతగూడ ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన 2004లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ అదె పార్టీ నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపాధ్యాయుడి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా .. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1986లో ఆదిలాబాద్ మండలం చింతగూడలో స్పెషల్ టీచర్‌గా నియామకమయ్యారు. 1987లో పదోన్నతి పొంది ముత్యన్పేట పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాలలో నాలుగేళ్లపాటు పనిచేశారు. 1993లో గ్రేడ్–1 హింది పండిట్‌గా పదోన్నతి పొంది తలమడుగు మండలం ఝరి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఏడేళ్లపాటు పనిచేసిన ఆయన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 2000 సంవత్సరంలో తాంసి మండలం అందర్బంద్కు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు పనిచేసి, ఆదిలాబాద్ మండలం మామిడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. 2009 వరకు అక్కడే సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని కాంక్షిస్తూ 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరిన ఆయన 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురువులు బావి తరాలకు ఆదర్శమని, బాధ్యతగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ టీచర్ నుంచి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు విద్యారంగంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన రాజకీయాల్లోకి రాక ముందు 1992నుంచి 1994 వరకు శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువునందించి మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. 1996లో నెన్నెల మండల జెడ్పీటీసీగా, 2001లో ఎంపీపీగా పనిచేశారు. 2009, 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజా ప్రతినిధి అయినప్పటికీ విద్యారంగపై ఆయనకున్న మక్కువను చాటుతూనే ఉంటారు. పాఠశాలలను సందర్శించిన సమయంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి ప్రతిభాపాఠవాలను తెలుసుకుంటారు. ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబడుతూ వారితో మమేకమవుతారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, బాధ్యతగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి నుంచి క్యాబినెట్ మంత్రిగా గోడం నగేశ్ 1986లో ఎస్జీబీటీగా బజార్హత్నూర్ మండలం విఠల్గూడ ఆశ్రమ పాఠశాలలో నియామకమయ్యారు. బోథ్ మండలం పార్డి–బి యూపీఎస్ హెచ్‌ఎంగాను సేవలందించారు. 1989లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది బజార్హత్నూర్ మండలం జాతర్ల ఉన్నత పాఠశాలలో నియామకమయ్యారు. 1993లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీలో చేరిన ఆయన 1994 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లోనూ అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొంది పార్లమెంట్‌లోనూ అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించిన ఆయన జిల్లా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలకు బీజం
సాక్షి, ఆదిలాబాద్: మునుగోడు కేంద్రంగా జిల్లా బీజేపీలోనూ కొత్త సమీకరణాలకు బీజం పడుతున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిప్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కమలం తీర్థం పుచ్చుకుంటుండగా, జిల్లా నుంచి కూడా ఆ పార్టీలో చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఓ ఎన్ఆర్ఐ చకచకా చేరికకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. చూచాయగా సమాచారం.. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ ఇప్పటికే బీజేపీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతుంది. ఈక్రమంలోనే అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి కొంత కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు కదులుతున్నారు. మొదటి నుంచి బీజేపీలో చేరిక ఖాయమంటూ సంకేతాలిస్తూ వచ్చారు. తాజాగా ఆయన మునుగోడులో అమిత్‌షా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. శుక్రవారం పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులకు ఆయన ఫోన్ చేసి తాను పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఆయన చేరికకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా జోరుగా ప్రయత్నాలు సాగుతూ వస్తున్నాయి. ఈ విషయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌కు మొదట ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రయత్నలు ఓ కొలిక్కి రావడంతో జిల్లా అధ్యక్షుడికి చూచాయగా తాను పార్టీలో చేరుతున్నట్లు తెలియజేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. చదవండి: (అక్కడ ‘కారు’ జోరు పెరుగుతుందా?.. ఆ ఇద్దరు కీలక నేతల పరిస్థితేంటి?) ఆసక్తికరంగా పరిణామాలు.. కమలం పార్టీలో చేరికకు సంబంధించి ఆసక్తికరంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడులో చేరిక తర్వాత మరుసటి రోజే సోమవారం ఆదిలాబాద్ నియోజకవర్గానికి పార్టీ అదిష్టానం ద్వారా ఇన్‌చార్జీగా నియమితులైన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం ఖోడబాయి రూపాల ఆదిలాబాద్‌కు రానున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆయన ఆదిలాబాద్‌లో వ్యాపార వర్గాలు, మేధావులతో సమావేశం కానున్నారు. దీంతో ఈ వేదిక నుంచే ఆదిలాబాద్ నియోజకవర్గంలో టికెట్‌ను ఆశిస్తున్న ముఖ్య నేతల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే రెండు వర్గాలుగా కొనసాగుతుండగా, తాజాగా పార్టీలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. సైద్ధాంతిక పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కొంతమంది పాత నేతల్లో కొత్త చేరికపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయోననేది ఆసక్తి కలిగిస్తోంది. -
ఆదిలాబాద్: అప్పుడే మొదలైన ఎన్నికల పోరు..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల పోరు మొదలైంది. ఎమ్మెల్యే రామన్న ఇక్కడినుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. ఐదోసారి పోటీచేసి విజయం సాధించాలనుకుంటున్నారు. మరోసారి మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. ఎమ్మెల్యే రామన్న కొంతకాలంగా ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరిపిస్తున్నారు. తెలంగాణ తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రామన్న.. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం కల్పించారు. పట్టణంలో సుందరీకరణ సహా అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణాన్ని అభివృద్ధి చేసినా.. కొన్ని పనులు జరగకపోవడం రామన్నకు మైనస్‌గా చెబుతున్నారు. పార్టీ నాయకుల భూ కబ్జాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయంటున్నారు. దీనికి తోడు.. డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోకభూమారెడ్డి మరికొందరు రామన్నకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే మున్నూరు కాపులే నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించే సామాజికవర్గం. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన టిక్కెట్ తనకే దక్కుతుందని రామన్న భావిస్తున్నారట. ఇక రామన్నను ఓడిస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ నాయకుడు పాయల శంకర్. రామన్నను ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యూహాలను రచించినప్పటికీ ఆయన చేతిలో పాయల శంకర్ రెండుసార్లు ఓటమి చెందారు. ఈసారి బీజేపీలో టిక్కెట్ పోరు తారాస్థాయికి చేరింది. పాయల్ శంకర్‌కు టిక్కెట్ ఇవ్వవద్దని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహసిని రెడ్డి, ఎన్అర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారట. ఈ ఇద్దరు తమకే టిక్కెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. దీనితో బీజేపీలో టిక్కెట్ పోరు అసక్తికరంగా మారింది. చదవండి: మునుగోడులో సర్వేల జోరు.. ఎవరైతే బెటర్! కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ తానే పార్టీ అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిన గండ్రత్ సుజాత మళ్లీ పోటీకి సై అంటున్నారు. అయితే ఈ ఇద్దరికీ టీఆర్ఎస్, బీజేపీలను ఓడించే సత్తా లేదని భావించి మరో సమర్థుడైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ నాయకత్వం వెతుకుతోందని తెలుస్తోంది. షెడ్యూల్డు తెగలకు రిజర్వైన బోథ్ నుంచి రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి కూడా పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని బాపురావు మీద ప్రజలకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. అత్యంత మారుమూల ప్రాంతమైన బోథ్‌లోని అనేక గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. వెంటనే నిర్మాణపనులు ప్రారంభిస్తామన్న కుఫ్టీ ప్రాజెక్టు ఇంకా కాగితాలకే పరిమితమైంది. ఎమ్మెల్యే అసమర్థత వల్లనే స్థానిక సంస్థల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బాపురావు గ్రామాల్లోకి వెళితే అడ్డుకుంటూ తమ వ్యతిరేకతను ప్రజలు తెలియచేస్తున్నారు. పైగా సర్వేల్లో కూడా బోథ్ ఎమ్మెల్యే బాగా వెనుకబడినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇంతటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న రాథోడ్ బాపురావుకు వచ్చేసారి టిక్కెట్ రాదని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ సోయం బాపురావు గనుక కమలం పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే.. టీఆర్ఎస్ బాస్ ఇక్కడి ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇస్తారని మాజీ ఎంపీ నగేష్ అంటున్నారు. పార్టీలో తనకు పోటీ పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో బాపురావు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ తరపున ఎంపీ సోయం బాపూరావు బరిలోకి దిగడం ఖాయం అంటున్నారు. పార్టీ నాయకత్వం కూడా సోయంకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే...తాను ఎమ్మెల్యేగా నెగ్గితే మంత్రి పదవి ఖాయమని సోయం భావిస్తున్నారు. సోయంకు లోక్‌సభ ఎన్నికల్లో ఆదివాసీలు అండగా నిలిచారు. అందుకే ఆయన ఎంపీ అయ్యారు. ఎంపీ కాగానే తుండదెబ్బ బాధ్యతల నుంచి తప్పుకున్నారు సోయం బాపురావు. దీంతో ఆయనకు ఆదివాసీలు వ్యతిరేకంగా మారారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌కు బోథ్‌లో అభ్యర్థే కనిపించడంలేదు. టీఆర్ఎస్లో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఎంపీటీసీ అనిల్ జాదవ్...అక్కడ ఫలితం లేకపోతే కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తారని ఆశిస్తున్నారు. -
నియోజకవర్గ సమస్యపై స్పందిస్తే, ఎంపీని అరెస్టు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును అరెస్టు చేయడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సొంత నియోజకవర్గం పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ‘విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లరు, వేరేవాళ్లను వెళ్లనీయరు’అని విమర్శించారు. బాబూరావును ఎందుకు అరెస్టు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దీనావస్థలో కేసీఆర్ ఉన్నారన్నారు. బాబూరావును అరెస్టు చేయొద్దని బీజేపీ కార్యకర్తలు కోరినందుకు వారిపైకి పోలీసు జీపులు ఎక్కిస్తూ చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా మన్మధ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. చాలామంది పోలీసులకు కేసీఆర్ నైజం తెలిసిపోయి నిజాయితీగానే వ్యవహరిస్తున్నారని, కానీ కొంతమంది మాత్రం టీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ బాసర విద్యార్థులు సంయమనంతో ఉన్నారని, ప్రభుత్వం, సీఎం మొద్దునిద్రలో ఉన్నారని తెలిసే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్నారని సంజయ్ అన్నారు. బాబూరావును వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. -
మీరు తెలుసుకోరు, మమ్మల్ని తెలుసుకోనివ్వరా? వాళ్లంతా ఎమ్మెల్సీ సంబంధీకులే
ఆదిలాబాద్ రూరల్/లోకేశ్వరం (ముధోల్): సమస్యలు పరిష్కరించాల్సిందిగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నెల రోజుల నుంచి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు తెలుకోవడం లేదని.. మరో పక్క విద్యార్థులను కలవకుండా తమను అడ్డుకుంటోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఆదివారం ఆయన ఆదిలాబాద్ నుంచి బాసరకు బయల్దేరగా, లోకేశ్వరం మండలం అర్లి వంతెన వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎంపీని స్టేషన్‌కు తరలించకుండా భైంసా మార్గంలో ఆదిలాబాద్‌కు తరలించారు. నా నియోజకవర్గంలో నేను తిరగొద్దా.. పోలీసులు తనను ట్రిపుల్ ఐటీకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని ఎంపీ సోయం బాపూరావు తప్పుబ ట్టారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో తిరగొద్దా’అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీలోని మెస్ కాంట్రాక్టర్లు సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యక్తులు కావడంతోనే నాణ్యతలేని సరుకులతో భోజనం వడ్డిస్తున్నా, చివరకు ఫుడ్ పాయిజన్ జరిగినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారని ఎంపీ ఆరోపించారు. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. -
నిర్మల్ జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం
-
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్
Basara IIIT.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా ట్రిపుల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బీజేపీ నేతలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల కిత్రం బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టడంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని పట్టబట్టారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు. బాసర IIITలో మళ్లీ విద్యార్థుల ఆందోళన. ఫుడ్ పాయిజన్ అయిన మెస్ పై చర్యలు తీసుకోక పోవడంతో మెస్ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులు. అర్ధరాత్రి వరకు కొనసాగిన iiit బాసర విద్యార్థుల నిరసన.#iiitbasara@kcvenugopalmp @Allavaru @srinivasiyc @manickamtagore @revanth_anumula @IYCTelangana pic.twitter.com/0Kh4ACHBOP — Arun Valmiki (@Arun_valmiki_) July 31, 2022 ఇది కూడా చదవండి: ‘రామగుండం’లో కొలువుల స్కాం! -
‘చిత్తశుద్ధితో అత్యాచార నిందితుల్ని పట్టుకోండి’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని.. నిందితులు ఏ మూల దాగి ఉన్నా అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అరాచకాలు, అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోందని పేర్కొన్నారు. కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అఘాయిత్యాలు జరిగినా అందులో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటోందని ఆరోపించారు. మంథనిలో లాయర్ వామన్ రావు హత్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర ఆగడాలకు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య, ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య, సూర్యాపేట జిల్లా కోదాడలో పేదింటి ఆడబిడ్డపై టీఆర్ఎస్ నేతల గ్యాంగ్ రేప్, రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ వేధింపులు తాళలేక తల్లీ కొడుకు లాడ్జిలో ఆత్మహత్య, నిర్మల్‌లో బాలికపై టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అత్యాచారం వంటి సంఘటనలు కోకొల్లలని పేర్కొన్నారు. -
వన వీరులను స్మరిస్తూ..
సాక్షి, ఆదిలాబాద్: బ్రిటిష్ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు, బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుత జార్ఖండ్) ప్రాంతానికి చెందిన బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15ను జన జాతీయ గౌరవ్ దివస్‌గా పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక నుంచి గిరిజనుల విజయాలు, సంస్కృతిని స్మరించుకుంటూ ఏటా నవంబర్ 15 నుంచి వారం రోజులపాటు వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం నిర్ణయించగా, అఖిల భారత వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఇదివరకే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జనజాతి గౌరవ దినోత్సవం నిర్వహించాలని తలపెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం రావడం, మరోపక్క వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో బిర్సాముండా జయంతి రోజే ఇంద్రవెల్లిలో వనవీరులను స్మరిస్తూ బహిరంగ సభ తలపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్వాహకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆహ్వానించారు. విశిష్ట అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఆత్మీయ అతిథిగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు పాల్గొననున్నారు. జాతీయ నాయకుడిగా బిర్సాముండాకు గుర్తింపు గిరిజన యోధుడు బిర్సాముండాను జాతీయ నాయకుడిగా ప్రభుత్వం గుర్తించింది. ఎస్టీలకు ఇది గర్వకారణం. జయంతి దినోత్సవాన్ని జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించినందుకు ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు. – సోయం బాపురావు, ఆదిలాబాద్ ఎంపీ -
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై కేసు నమోదు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై భైంసా పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివిధ వర్గాల వారిని రెచ్చగొట్టేలా ఎంపీ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ మేరకు సుమోటోగా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. చదవండి: లాక్‌డౌన్‌లోనూ అద్భుత ప్రగతి సాధించాం -
పెద్ద దుష్మన్ కాంగ్రెస్సే
నిర్మల్: దేశానికి, సమాజానికి పెద్ద దుష్మన్ కాంగ్రెస్ పార్టీయేనని, కులాలు మతాలుగా ప్రజలను వీడదీసిందని, 75 ఏళ్ల నుంచి కేన్సర్ వ్యాధిలా పీడిస్తోందని ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ను మూడు నెలల్లోనే గద్దెదించవచ్చని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో శనివారం అఖండ భారత్ దివస్ సభ నిర్వహించారు. హిందూవాహిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు హరిచంద్రరెడ్డి మాట్లాడుతూ.. భైంసా ఘటనల్లో ఒకవర్గం యువకులపైనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. 1970 నుంచి 2020 వరకు భైంసా అల్లర్లలో హిందువులే నష్టపోయారని చెప్పారు. కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు మనోడే మోసం చేస్తే వంద అడుగుల బొంద తీసి పాతిపెట్టాలని కాళోజీ చెప్పారని, ఇప్పుడు రాష్ట్రంలో భయంకర హిందువునని చెప్పుకొనే సీఎం ఉన్నా భైంసాలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. పనికిరాని కొడుకును సీఎం చేసేందుకు సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను చంపింది కాంగ్రెసేనని, అదే గడ్డకు వెళ్లి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు యూనిఫాం లోపల గులాబీ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారని, అలాంటి వారి లెక్క లు రాసిపెట్టి, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్.. రాష్ట్రంలో పేరుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో 40 ఏళ్లుగా అధికార పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులు ఒక వర్గం యువతపైనే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్.. రాష్ట్రంలో పేరుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో 40 ఏళ్లుగా అధికార పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులు ఒక వర్గం యువతపైనే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. -
సీఎం హామీల వైఫల్యంపై 30న ధర్నా
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకిచ్చిన హామీల అమల్లో విఫలమైనం దుకు నిరసనగా ఈ నెల 30న ఎస్సీ, ఎస్టీ, బీసీ మోర్చాల ఆధ్వ ర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దళితబంధు కింద ఎస్టీలకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీనేతలు మనోహర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మోర్చాల నేతలు హుస్సేన్‌నాయక్, కొప్పు బాషా, ఆలె భాస్కర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు 300 ఎకరాల భూమిని కూడా పంచలేదని విమర్శించా రు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం అసెంబ్లీలో ఇచ్చిన మాటను తప్పారన్నారు. -
కాంగ్రెస్‌కు షాకివ్వనున్న సీనియర్లు..!
సాక్షి, హైదరాబాద్ : వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతూ రోజురోజుకూ దిగజారిపోతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ను కష్టాలు వదలడంలేదు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతుండగా మరికొంతమంది సైతం అదే దారిని ఎంచుకునే పనిలో పడ్డారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో దూసుకొచ్చిన కమళం పార్టీ నేతల కన్ను కాంగ్రెస్ పార్టీపై పడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగాలని పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలకు కాషాయ కండువా కప్పెపనిలో నిమగ్నమైంది. ఇప్పటికే డీకే అరుణా, విజయశాంతి లాంటి సీనియర్లు కాంగ్రెస్‌ను వీడి కాషాయతీర్థం పుచ్చుకోగా.. మరికొంత మంది కీలక నేతలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్వాయి హరీష్ రావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 14న వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాతారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల నుంచి మరి కొంతమంది టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై శనివారం నిర్వహించే మీడియా సమావేశంలో వారే స్వయంగా ప్రకటన చేస్తారని ఆదిలాబాద్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్లపై బీజేపీ గాలం వేస్తోంది. -
‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’
ఉట్నూర్‌రూరల్: ఆదిలాబాద్ ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జోగు రామన్న క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, రమేశ్, దేవి దాస్, భాగ్యలక్ష్మీ, రాజమణి, హరిప్రసాద్, రాజేందర్, మోహన్, వెంకటేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎంపీ జోలికోస్తే సహించేది లేదు ఇంద్రవెల్లి: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సోయం బాపురావు జోలికి వస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దీపక్‌సింగ్‌షెకవత్, మరప రాజు, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, మడావి భీంరావు, ఆడవ్ చంపత్‌రావ్, ఆరెల్లి రాజలింగు, గేడం భరత్ పాల్గొన్నారు. -
‘ఆర్ఆర్ఆర్’లో ఆ సీన్ తొలగించాల్సిందే
సాక్షి, కొమురం భీమ్ : ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ వేషాధారణలో ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకోవడం ఆదివాసీయులను కించపర్చడమేనని బీజేపీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. అలాంటి సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమా థియేటర్లు తగలబెడుతామని హెచ్చరించారు. శనివారం ఆయన కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహించిన కొమురం భీమ్ 80వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం నిజాం సర్కార్ తో పోరాడి అసువులు బాసిన కొమురం భీమ్ వర్ధంతిని ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఈసారి కూడా జోడేఘాట్ కు ఉమ్మడి జిల్లా లోని గిరిజనులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రల నుంచి భారీ గిరిజనులు తరలి వచ్చారు. మొదట గిరిజన సంప్రదాయ బద్దంగా పూజలు చేసిన అనంతరం భీమ్ సమాధి వద్ద నివాళులర్పించారు. (చదవండి : రాజశేఖర్ ఆరోగ్యంపై కూతురు శివాత్మిక ట్వీట్) ఈ సందర్భంగా ఎంపీ బాపురావు మట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సినిమా ట్రైలర్లో భీమ్ వేషాధారణలో ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపి పెట్టుకోవడం ఆదివాసీయులను కించపర్చడమేనని, అలాంటి సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమా థియేటర్లు తగలబెడుతామని హెచ్చరించారు. పొడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లంబాడులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఈసారి కరోనా కారణంగా దర్బార్ రద్దు కావడం పట్ల గిరిజనులు నాయకులు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సారిగా వచ్చి ఇచ్చిన హామీల్లో 25 కోట్లతో మ్యూజియం భీం విగ్రహం సమాధి పూర్తి అయ్యాయి. ఇంకా బీమ్, పోరు గ్రామాలను మరింత అభివృద్ది చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావుతో పాటు జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కొనప్ప, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కోమురం భీమ్ మనవడు సోనే రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఇందులో కొమురమ్ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఇటీవల అన్ని జాగ్రత్తలతో ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఈ నెల 22న కొమురం భీం జయంతి సందర్భంగా రామరాజు వాయిస్‌తో కూడిన ఎన్టీఆర్(కొమురం భీం) టీజర్‌ని చరణ్ విడుదల చేశారు. రామ్ చరణ్ వాయిస్‌తో ప్రారంభమైన వీడియోలో. గోండ్రు బెబ్బులి కొమురం భీంగా ఎన్టీఆర్ పాత్రల తీరుతెన్నులని పరిచయం చేశారు. చదవండి: వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’.. ఆ సన్నివేశాలు తొలగించండి అయితే సినిమాలోని కొమురం భీం పాత్ర వివాదంగా మారుతోంది. కొమురం భీంగా నటిస్తున్న తారక్‌కు ఇందులో ముస్లిం టోపీ పెట్టడంపై ఆదీవాసులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని దర్శకుడు రాజమౌళిని హెచ్చరించారు. నిజాం వ్యకులతో పోరాటం చేసిన కొమరం భీమ్‌కు ఇతర మతాలతో సంబంధం పెట్టి టోపీలు పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా టోపీ ఉన్న సన్నివేశాలని తొలగించాలని, లేకపోతే సినిమా థియేటర్లపై దాడి చేసే అవకాశం ఉదని హెచ్చరించారు. కొమరం భీమ్ తమ పాలిట దేవుడని, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని అన్నారు. అంతేగానీ కలెక్షన్ల కోసం పాత్రను వక్రీకరిస్తే బాగోదని అన్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్: రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ -
ఎంపీ సోయం బాపురావుకు అస్వస్థత!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పీఏతో పాటు ఇద్దరు గన్మెన్లు, ఒక కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం తెలిపారు. అయితే, సోయం బాపురావు అనారోగ్యానికి గల కారణాలు తెలియరాలేదు. (మా ఆదేశాలు పాటించడం లేదు: హైకోర్టు!) -
రూ.7 వేల కోట్లిచ్చాం.. ఏంచేశారు?
కైలాస్‌నగర్(ఆదిలాబాద్): కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ సోయం బాపురావు సవాల్ విసిరారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మంది కరోనా బారినపడి బాధపడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చొని తన ప్రాణాలు బాగుంటే చాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని, సరైన వైద్యం అందక ప్రతీరోజు కరోనా మరణాలు పెరుగుతున్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దోపిడీకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేంద్రం నుంచి నయాపైసా రాలేదని రాష్ట్ర మంత్రులు విమర్శిస్తూ ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ కార్మికులు, నిరుద్యోగులను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ కింద రూ.90 వేల కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. అందులోంచి తెలంగాణకు రూ.7,650 కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చూస్తోందని దుయ్యబట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు ఇబ్బంది పడకుండా జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు వేశామని..ఉచితంగా వంటగ్యాస్ ఇచ్చామని, నిరుద్యోగులకు, చిరువ్యాపారులకు స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించామన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కలిపిస్తూ.. పంట బీమా కోసం రూ.64 కోట్లు కేటాయించామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించేందుకు 14 ప్రభుత్వ ల్యాబ్‌లు, 21 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. అంతే కాకుండా 42 లక్షలు పీపీఈ కిట్లు, 6.49లక్షల మాస్కులు కేంద్రం నుంచి వచ్చాయన్నారు. ఇంత చేసినా కేంద్రం నుంచి ఏమి రాలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతోనే ఆస్పత్రి పూర్తి కాలేదు.. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి కాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. జిల్లా ప్రజలకు కరోనా సమయంలో ఇది ఎంతో ఉపయోగపడేదన్నారు. రెండేళ్ల క్రితం పూర్తి కావాల్సిన ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు మంజూరు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. కరోనా కట్టడికి నిధులు కేటాయించకుండా మూఢనమ్మకాలకు పోయి సచివాలయాన్ని కూలగొట్టి దానికి రూ.600 కోట్లు కేటాయించారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్, పార్లమెంటు కన్వీనర్ వకుళాభరణం ఆదినాథ్, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, నాయకులు జోగు రవి, లోక ప్రవీణ్‌రెడ్డి, లాలామున్న తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ?
సాక్షి, ఆదిలాబాద్ : ఈ ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య ప్రస్తుత వైరం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. భిన్న సిద్ధాంతాలు ఉన్న వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు కావడంతో సహజంగానే పార్టీల పరంగా చోటుచేసుకున్న విభేదాలా అన్న అనుమానాలు ఉన్నా అటువంటిది కాదనేది వారి మాటలను బట్టే స్పష్టమైంది. ఇరువురు నేతలు ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమకు వ్యక్తిగతంగా ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేశారు. అయినా మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. దీంతో ఈ రచ్చకు ఆజ్యం ఏమై ఉంటుందోనని అందరిని తొలుస్తుంది. కొనసాగుతున్న పర్వం.. గత నెల వివిధ వేదికల ద్వారా ఈ ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం ద్వారా మొదలైన పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వేర్వేరుగా ప్రెస్మీట్లు పెట్టి మరీ ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఖండిస్తూ నిరంతరంగా వ్యవహారం సాగుతోంది. అయితే ఇరువురు నేతల ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా జోగు రామన్న ఉన్న సమయంలో ఆ శాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు ఉండగా, పూర్తిస్థాయిలో ఖర్చు చేసినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సోయం బాపురావు సవాల్ విసిరారు. సోయం బాపురావు తాను గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి సంతకం పెడితే ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం జరుగుతుందని చెప్పడం జరిగిందని, ఇప్పుడు నెలలు దాటినా తాను ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రతిసవాల్ విసిరారు. ఇలా ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకోవడం గమనార్హం. ఆజ్యం ఎక్కడ? ఆదివాసీలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండగా, ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో చెప్పిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ రామన్న పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఇరువురు నేతల మధ్య ఇంతటి రగడకు ఆజ్యం ఎక్కడ పడిందన్న సందేహం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను తొలుస్తుంది. తొలుత ఆగస్టు చివరిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కనబడింది. అయితే అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్, రైతుబంధు విషయంలో కొనసాగడంతో అది ప్రభుత్వాల పరంగా సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అక్కడ విభేదాల స్థాయి అంతగా కనిపించలేదు. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ 9 జెడ్పీటీసీలను గెలవడం, బీజేపీ 5, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలవడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ క్రమంలో 17 జెడ్పీటీసీల్లో 9 మంది మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం ఖాయమే అయినా అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు జత కట్టడం ఆసక్తి కలిగించింది. దీనికి ఎంపీ సోయం బాపురావు నేతృత్వం వహించారు. ఇక టీఆర్ఎస్ నుంచి ఎవరినైన ఒకరిని ఇటువైపు తిప్పుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయన్న రాజకీయ వేడి జెడ్పీచైర్మన్ ఎన్నిక రోజు కనిపించింది. అయితే ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్త పడ్డ టీఆర్ఎస్ ముఖ్యంగా ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు ఉట్నూర్ కాంగ్రెస్ జెడ్పీటీసీ చారులతను టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారు. జెడ్పీచైర్మన్ ఎన్నికలో చారులత టీఆర్ఎస్కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి ఆదివాసీ అభ్యర్థిని జెడ్పీచైర్మన్ పదవి కోసం పేరు ప్రతిపాదించాక ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నకు విభేదాలు అప్పటి నుంచే పొడసూపాయా అన్న అభిప్రాయం వ్యక్తమైనా ఆ సమావేశం చివరిలో ఇరువురు నేతలు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఆసక్తి కలిగించింది. పట్టున్న నేతలే.. ఈ నేతల రాజకీయ అనుభవాన్ని పరిశీలించినా ఇరువురు పట్టున్న నేతలే. ఎంపీ సోయం బాపురావు ఆదివాసీ ఉద్యమం పరంగా తన జాతి కోసం పోరాటం చేస్తూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా గతంలో బోథ్ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశారు. ఇక ఎమ్మెల్యే జోగు రామన్న బీసీల ఆదరణతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పట్టు కలిగి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో మంత్రిగా పనిచేశారు. రాజకీయ అడుగులకు విరోధం కావడంతో ఇరువురి మధ్య ఈ విభేదాలు తలెత్తాయా.. లేదంటే మరేమైనా అయి ఉంటుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేంద్రం నక్సల్ బాధిత జిల్లాలకు ఇచ్చే నిధులను మళ్లించారని జోగు రామన్నతోపాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై కూడా సోయం బాపురావు విమర్శలు సంధించారు. అలాంటప్పుడు నిధుల మళ్లింపు విషయంలో ఈ విభేదాలా.. లేనిపక్షంలో సామాజిక కోణంలో హక్కులు, నిధుల విషయంలో ఒకరిపై మరొకరి ఆరోపణలు అగ్నికి ఆజ్యం పోసిందా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల ముందు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఇది రాజకీయ వేడి పుట్టిస్తోంది. -
సోయం పారిపోయే లీడర్ కాదు
సాక్షి, ఆదిలాబాద్ : ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ సమస్యలపై చర్చించకుండా మధ్యలో నుంచి పారిపోయాడని ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తీవ్రంగా ఖండించారు. సోయం బాపురావ్ పారిపోయే లీడర్ కాదని, ఇతరులను పారిపోయేలా చేసే లీడర్ అన్నారు. ఎంపీపై ఇకనైనా వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న పదవుల కోసం రాజకీయం చేస్తే, ఎంపీ సోయం బాపురావ్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఆదివాసీ జాతి కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాటం చేస్తున్నాడన్నారు. జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలు అధికార దురహంకారానికి నిదర్శమని విమర్శించారు. విమర్శలు చేసేముందు ఎమ్మెల్యే సోయం బాపురావ్ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే ఎంపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించమని చెబుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లాలో 243 ఆదివాసీ గ్రామాలు ఉంటే కేవలం 143 గ్రామాలకు మాత్రమే రోడ్డు సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఐఏపీ నిధులు దుర్వినియోగం చర్చపై మా ఎంపీ అవసరం లేదని పార్టీ జిల్లా అధ్యక్షునిగా తనే వస్తానని స్థలం ఎక్కడ ఎంచుకుంటారో ఎంచుకోవాలని ఆధారాలతో రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. సమావేశంలో బీజేపీ నాయకులు సునంద రెడ్డి, జ్యోతి, రవి, ప్రవీణ్, సతీష్, ప్రవీణ్ పాల్గొన్నారు. సోయం అంటే టీఆర్ఎస్కు వణుకు బోథ్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అంటే టీఆర్ఎస్ నేతలకు వెన్నులో వణుకు పుడుతుందని, ఆయన భయపడి పారిపోయే వ్యక్తి కాదని ఆత్మరాష్ట్ర మాజీ డైరెక్టర్ రాజుయాదవ్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను ఉద్దేశించి అన్నారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... ఉట్నూర్‌లో జరిగిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో ఎంపీ సోయం బాపూరావ్ సమావేశం నుంచి పారిపోయాడని ఎమ్మెల్యే జోగురామన్న గురువారం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. (చదవండి : సభలోంచి ఎందుకు పారిపోయావ్) జోగురామన్నకు ఆదివాసీలంటే ఏమిటో చూపెడతాం ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావుపై అవాకులు చవాకులు పేలితే ఆదివాసీల సత్తా ఏమిటో చూపెడతామని తుడుందెబ్బ బోథ్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేసి చేశారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంటనే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామని అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చే విధంగా చూడాలన్నారు. స్వార్థ రాజకీయాలు కాకుండా లంబాడీలు ఎస్టీ కాదనే విషయంపై స్పష్టమైన వైఖరి తెలపాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాంబన్న, సోనేరావు, కోటేశ్వర్, నాయక్‌పోడ్ సంఘం మండల అధ్యక్షుడు గంగాధర్, వివిధ గ్రామాల పటేళ్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
రసాభాసగా ఐటీడీఏ సమావేశం
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం బుధవారం రసాభాసగా జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న పట్టుబట్టారు. దీంతో చేసేదేమిలేక సోయం బాపురావు వ్యాఖ్యలపై ఆత్రం సక్కు క్షమాపణ కోరారు. దీంతో ఐటీడీఏ సమావేశంలో రాజకీయాలు ఎలా ప్రస్తావిస్తారని బాపురావు ప్రశ్నించారు. తాను క్షమాపణ చెప్పేది లేదంటూ సమావేశం నుంచి బాపూరావు వెళ్లిపోయారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో కూడా బుధవారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ‘తుడుం దెబ్బ’ ఆందోళనకారులు బయటకు వచ్చి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆదివాసి తుడుందెబ్బ నాయకులు కొమరం భీం కాంప్లెక్స్ గేట్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. -
‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతా’
సాక్షి, ఆదిలాబాద్ : తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతానని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా జరిగిన మీడియా సమావేశంలో సోయం మాట్లాడుతూ.. యురేనియం ప్రాజెక్టు పాపం అటవీశాఖ మాజీ మంత్రి జోగురామన్నదేనని ఆయన జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. నక్సలైట్ ప్రాంతాల నిధులతో టీఆర్ఎస్ నేతల పొలాలకు రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. పదివేలు ఇస్తే ఆదివాసీలు అమ్ముడుపోరని, తెలంగాణ రాష్ట్రాన్ని దళారుల చేతుల్లో పెట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు ఆదివాసీల పోరాటం ఆపేది లేదని శపథం చేశారు. పదివేలు ఇచ్చుడు కాదు.. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నేను ఒక్క పిలుపునిస్తే ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఉండదంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
బీజేపీ ‘గాంధీ సంకల్పయాత్ర’
సాక్షి,ఆదిలాబాద్: కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బుధవారం నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పాదయాత్ర ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలో 8 నుంచి 12గ్రామాల వరకు పర్యటించేలా పాదయాత్ర రూపొందించారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 2 నుంచి 31వరకు దేశ వ్యాప్తంగా గాంధీ సంకల్ప్ యాత్రను ఆ పార్టీ నిర్వహించనుంది. గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ఎంపీలు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. యాత్ర వివరాలు.. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ నుంచి ఈ సంకల్ప యాత్ర ప్రారంభమవుతోంది. ఎంపీ సోయం బాపురావు చేపడుతున్న ఈ పాదయాత్రలో భాగంగా మొదటి రోజు గాంధీచౌక్‌లో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌తో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. అక్కడి నుంచి లాండసాంగ్వి, అర్లి, అడ, కంఠ, పార్డి(బి), పార్డి(కె), రామాయి గ్రామాల మీదుగా సాగుతోంది. 3న బోథ్ నియోజకవర్గానికి చేరుకొని గొల్లపుర, పార్డి(కె) మామిడిగూడ, చింతల్బోరి, దేవుల్నాయక్తాండ, సంపత్నాయక్తాండ, పార్డి(కె), గుట్టపక్కతాండ, గుర్రాలతాండ, సొనాల గ్రామాల మీదుగా సాగుతుంది. 4న నిర్మల్ జిల్లాకు చేరుకుని మొదట ఖానాపూర్ నియోజకవర్గంలోని 12 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత 5న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకుని 11గ్రామాల్లో సంకల్ప యాత్ర కొనసాగించనున్నారు. 6న తిరిగి బోథ్‌కు చేరుకొని 11 గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు. అనంతరం దసరా పండగ నేపథ్యంలో 7, 8వ తేదీల్లో విరామం ఇచ్చి మళ్లీ 9వ తేదీన ముథోల్ నియోజకవర్గానికి చేరుకొని ఎనిమిది గ్రామాల్లో పాదయాత్ర చేపడతారు. అందులో భైంసా పట్టణంలో కూడా ఉంది. ఇక్కడి నుంచి నిర్మల్ నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాల్లో సంకల్ప యాత్ర కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోనూ ఈ యాత్ర చేపట్టనున్నారు. ఆ తర్వాత 11వ తేదీన కాగజ్‌నగర్ చేరుకుని 11 గ్రామాల్లో పాదయాత్ర చేయనున్నారు. మున్సిపోల్స్‌లో మైలేజ్ కోసం.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మైలేజ్ కోసం కూడా ఈ సంకల్ప యాత్రను బీజేపీ ఉపయోగించుకుంటుంది. ఆదిలాబాద్‌తో పాటు నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఈ యాత్ర షెడ్యూల్‌ను రూపొందించారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ సోయం బాపురావుకు ఆయా జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రజా సంబంధాలు, స్వచ్ఛమైన భారతదేశం, సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కలవడమే ధ్యేయంగా ఈ యాత్ర కొనసాగుతుంది. స్వదేశీ హాత్, ప్రభాత్ పేరి వంటి అనేక కార్యక్రమాలు దీంట్లో చేపడుతున్నాం. స్వదేశ్, స్వరాజ్, స్వాలంబన, ఖాది వినియోగం, సూత్రాలను ప్రోత్సహించడం, పాదయాత్రలో జరుగుతుంది. – ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్ -
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదివారం మండలంలోని వడగామ్ గ్రామం రాయిసెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడవి పండుగలో చెట్లు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా వడగామ్ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ వాయిద్యాల మధ్య బాపురావుకు స్వాగతం పలికారు. వడగామ్ రాయిసెంటర్ పరిధిలోని గ్రామల పటేల్‌ల ఆధ్వర్యంలో శాలువలతో సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేయడానికి ఇప్పటికే రూ.500 కోట్లతో నివేదిక పంపించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు ఆదివాసీ గ్రామాల్లో కనీస అభివృద్ధి జరగలేదని, సంక్షేమం పేరుతో రాష్ట్ర పాలకులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరానికి డిసెంబర్ 9న చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో భారీ సభ ఏర్పాటు చేసి ఆదివాసీల న్యాయమైన డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభ, ఆదివాసీ పెద్ద సిడాం భీంరావ్, పెసా చట్టం జిల్లా కోఆర్డినేటర్ వెడ్మా బోజ్జు, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, మండల అధ్యక్షుడు మెస్రం నాగ్నాథ్, సర్పంచ్‌లు ఆత్రం రత్తుబాయి, కినక జుగాదిరావ్, ఎంపీటీసీ గేడం మదుకర్, బిజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దిపక్సింగ్షేకవత్ పాల్గొన్నారు. -
‘లాలూ’కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది'
సాక్షి, జన్నారం : అవినీతికి పాల్పడి.. జైలుకు వెళ్లిన లాలూప్రసాద్యాదవ్కు పట్టిన గతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పడుతుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పైడిపెల్లిగార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎముకలేని నాలుకతో అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ‘గ్రామజ్యోతి అంటూ అధికారులను గ్రామాల్లో పరుగులు పెట్టించారు. జిల్లాకు రూ.8వేల కోట్ల వరకు అవుతుందనే భయంతో దానిని పక్కన పెట్టారు. మన ఊరు, మన ప్రణాళిక’ తీసుకొచ్చారు. అదికూడా డబ్బుతో కూడుకున్నదని గ్రహించి దానిని పక్కనబెట్టారు. ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక అని అధికారులను గ్రామాల్లో పరుగులు పెట్టిస్తున్నారు..’అని విమర్శించారు. మోసాలతో ఉద్యమాలు నడిపి, మోసాలతోనే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచదేశాలు ప్రధాని నరేంద్రమోదీని పొగుడుతున్నాయని, కానీ.. కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో బీజేపీ బలవంతంగా నాలుగు సీట్లు గెలిచాయంటూ హేళన చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు కేసీఆర్‌ను బయటకు పంపే రోజులొస్తాయని తెలిపారు. ఎన్నికల సమయంలో అందరికీ రైతుబంధు డబ్బులు జమ చేయించిన కేసీఆర్.. ఇప్పుడెందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రుణమాఫీపైనా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారన్నారు. అప్పులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని, రానున్న రోజుల్లో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎంపీ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టుల సమస్యలను ఎంపీ సోయం దృష్టికి తీసుకెళ్లారు. జన్నారం ప్రెస్‌క్లబ్ తరఫున వినతిపత్రం అందించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లు నిర్మించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, రమాదేవి, కృష్ణ జలాల కమిటీ చైర్మన్ రావుల రాంనాథ్, రాష్ట్ర నాయకుడు మున్నరాజు సిసోడియా, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సట్ల అశోక్, జన్నారం మండల అధ్యక్షుడు గోలి చందు, బీజేవైఎం నాయకులు కొండపల్లి మహేశ్, మండల నాయకులు సూర్యం, వీరాచారి, సుగుణ, కవిత తదితరులు పాల్గొన్నారు. -
బాపురావు గృహ నిర్బంధం అన్యాయం
సాక్షి, ఆసిఫాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును గృహ నిర్భందించడం అన్యాయమని ఆదివాసీలు, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కెరమెరి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ దిష్టిబొమ్మణు దహనం చేశా రు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సమస్యల పరిష్కారం, ఆత్మీయ సభకు వెళ్తున్న ఎంపీ బాపూరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది ప్రభుత్వ కుట్రలో భాగమేనన్నారు. ప్రభుత్వం లంబాడాలకు వత్తాసు పలుకుతుందని పేర్కొన్నారు. అనాథి నుంచి ఉంటున్న ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గిరిజన శాఖ మంత్రిగా ప్రమా ణం స్వీకరాం చేసిన ఒక్క రోజులోనే సత్యవతి రాథోడ్ తన ప్రతాపాన్ని చూపుతున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ ఆందోళనలో నాయకులు కోవ విజయ్, భీంరావు, తుకారాం, ప్రభాకర్, దర్మూ, భీంరావు తదితరులున్నారు. -
ఆదిలాబాద్‌లో ఢీ అంటే ఢీ
సాక్షి, ఆదిలాబాద్: ప్రతిపక్షం కయ్యానికి కాలు దువ్వడంతో అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎండగట్టాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లోపాలను ఎత్తిచూపుతాం అని ఇలా ఒకరికొకరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీదా తొలి జెడ్పీ సర్వసభ్య సమావేశం గతానికి భిన్నంగా వాడీవేడిగా జరిగింది. ప్రతిపక్షాన్ని ప్రశ్నలు సంధించకుండా అధికార పక్షం దాటవేసే ధోరణి అవలంబించింది. ఏదేమైనా జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించే గొంతు ప్రతిపక్ష రూపంలో కనిపించగా.. ఎదురు దాడి ద్వారా పైచేయి ఎలా సాధించాలో అధికార పక్షం నిరూపించింది. తొలి సమావేశం.. ఆదిలాబాద్ జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ కిషన్, జేసీ సంధ్యారాణి వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, రేఖానాయక్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు. సోయం వర్సెస్ జోగు జెడ్పీలో చైర్మన్‌తో కలుపుకొని తొమ్మిది మంది జెడ్పీటీసీలు ఉన్న టీఆర్ఎస్కు నలుగురు ఎమ్మెల్యేలు, మంత్రి పాల్గొనడంతో అధికార పక్షం బలంగా కనిపించింది. ఇక బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపురావు, ఆ పార్టీ ఐదుగురు సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్షం ముఖ్యం గా బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఉండటం తో ఆయన సమస్యలపై సమావేశంలో ప్రస్తావన తేవడం ద్వారా తొలి సమావేశంలోనే ఇరుకున పెట్టే అవకాశం ఉందని గ్రహించిన అధి కార పక్షం కేంద్ర ప్రభుత్వం పథకాల్లో లోపాలను ప్రస్తావించడం ద్వారా వ్యూహాత్మకంగా దాడికి దిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలను ఎత్తి చూపడంలో ఇటు బీజేపీ ఎంపీ సోయం బాపురావుకు, టీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్ సమ్మాన్ ద్వారా జిల్లాలోని 87 వేల మంది రైతులను అర్హులుగా గుర్తించినా సాయం కింద అందజేయాల్సిన రూ.6వేలను ఎంతమందికి ఇచ్చారని ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవసాయశాఖ అధికారులను అడగడం ద్వారా పరోక్షంగా ఎంపీ సోయం బాపురావును ఈ విషయంలో ప్రశ్నించారు. కేవలం 47 వేల మంది రైతులకే రూ.2వేల చొప్పు న ఇచ్చారని జోగు రామన్న చెప్పుకొచ్చారు. అసలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు.. రెండో విడత వస్తుందా, రాదా.. మొదటి విడత అందరికీ అందుతుందా.. అంటూ అడిగారు. కేంద్ర ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణ పరిమితి పెంచినా ఎక్కువ ఎకరాల విస్తీర్ణంలో చేను ఉన్న రైతుకు కూడా రూ.1.50లక్షల్లోపే రుణం అందిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితిని పెంచడం దేనికంటూ దెబ్బిపొడిచారు. జిల్లాలో కిసాన్ సమ్మాన్ పరిస్థితిపై రిపోర్టు తయారు చేసి కేంద్రాన్ని అడగాలని, ఎంపీ సోయం బాపురావుకు ఈ రిపోర్టును ఇవ్వడం ద్వారా అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి, లేనిపక్షంలో వ్యవసాయశాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ పరోక్షంగా సోయంను కోరారు. జెడ్పీ అధికార పక్షం దాడిని పసిగట్టిన ఎంపీ సోయం బాపురావు ఎదురుదాడికి దిగారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం«ధు పథకం కింద జిల్లాలో ఎంత మంది రైతులను గుర్తించారు, ఎంత మందికి సాయం అందాలి అంటూ వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. 1,36,409 మంది రైతులకు గాను 90,150 మంది రైతులకు మాత్రమే రైతుబంధు సాయం అందజేసినట్లు అధికారులు చెప్పారు. అయితే పెట్టుబడికి అందజేయాల్సిన సాయం పంట చేతికొచ్చే సమయంలో అందజేయడం ఏమిటని సోయం ఎద్దేవా చేశారు. ప్రస్తావనలో సామెతగా.. పదో తరగతి పిల్లాడికి పరీక్షలు అయిపోయిన తర్వాత పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు ఉందని దెబ్బిపొడిచారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఎంపీ సోయంబాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య వాడీవేడిగా సాగింది. 2018 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6వేలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇన్ని రోజులైనా సగం మంది రైతులకు కూడా ప్రయోజనం దక్కలేదని వాపోతూ సమావేశంలో ప్రస్తావించడం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించి రైతులకు ప్రయోజనం చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై సోయం బాపురావు మరో రకంగా స్పందించారు. 2018 డిసెంబర్లో నేను ఎంపీగా లేనని, టీఆర్ఎస్కే చెందిన గోడం నగేశ్ ఉన్నారని, అప్పుడు మీరెందుకు ప్రయత్నం చేయలేదంటూ ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కొంత నవ్వులు పూసాయి. అయితే అప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండటం, మళ్లీ ఎన్నికలైన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయనే ఉండడంతో ఎమ్మెల్యే జోగు రామన్న ఆ విధంగా ప్రశ్నించారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీ సోయం బాపురావుతో విషయం తమవైపు సాగేలా ప్రయత్నం చేశారు. సోయం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు రావాల్సిన సాయం అందేలా చూస్తానన్నారు. అదే సందర్భంలో జిల్లాలో నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతుంటే ఏం చేస్తున్నారని సోయం బాపురావు వ్యవసాయశాఖ అధికారులపై మండిపడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఆదిలోనే.. సమావేశం ఆది నుంచే ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షంపై గురి పెట్టారు. జెడ్పీ సమావేశంలో 42 అంశాలకు సంబంధించి మొదటి అంశంగా విద్యాశాఖతో ప్రారంభమైంది. డీఈవో రవీందర్‌రెడ్డి జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి చేపడుతున్న అంశాలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. తలమడుగు కాంగ్రెస్ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి మాట్లాడుతూ తన మండలంలో అనేక పాఠశాలల భవనాలకు పెచ్చులు ఊడిపోయాయని, సరిపడ టాయిలెట్లు లేవని, బాలికలు చదువుకునే పాఠశాలల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఆదర్శ పాఠశాలలని చెప్పుకోవడమే తప్పా పశువుల కొట్టం మాదిరి ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. దీంతో మంత్రి ఐకే రెడ్డి అన్ని అంశాలపై సభ్యులందరు మాట్లాడేది ఉందంటూ సమస్యను తక్కువ సమయంలో ప్రస్తావించాలని గణేశ్‌రెడ్డితో అన్నారు. తాను మాట్లాడి నాలుగైదు నిమిషాలు కూడా కాలేదని, మమ్మల్ని ఆపకండి.. కరెక్ట్ కాదు.. సభ్యులు చెప్పేది వినే ఓపిక ఉండాలంటూ గణేశ్ రెడ్డి మంత్రిపై మాటలతో ఎదురుదాడికి దిగారు. మంత్రి, కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా వెనక నుంచి బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ గణేశ్ రెడ్డిని.. చెప్పింది చాలు.. కూర్చో అంటూ సంబోధించారు. కొంతమంది టీఆర్ఎస్ సభ్యులు కూడా తుల శ్రీనుకు వెన్నంటి నిలిచారు. దీంతో చిర్రెత్తిన గణేశ్‌రెడ్డి నువ్వే కూర్చో అంటూ ఆగ్రహంగా ఊగిపోవడంతో సమావేశంలో వాడీవేడి కనిపించింది. ఇలా పలు సందర్భాల్లో అధికార టీఆర్ఎస్ సభ్యులు, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎజెండా అంశాలు.. జెడ్పీ సమావేశం ఎజెండాలో 42 అంశాలు ఉండగా, ఓ సందర్భంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సమావేశం కావడంతో సభ్యులందరు మాట్లాడాలని, ఈ దృష్ట్యా అందరికీ అవకాశం రావాలి అంటూ పరోక్షంగా తలమడుగు కాంగ్రెస్ జెడ్పీటీసీ గణేశ్ రెడ్డితో అన్నప్పుడు ఆయన తాము క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలను ఇక్కడ ప్రస్తావించడం ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. సమావేశ ఎజెండా అంశాలకు సమయం సరిపోకపోతే రెండు రోజులు నిర్వహించాలంటూ అధికార పక్షాన్ని ఎండగట్టారు. మొత్తం మీదా మొదట సమావేశం ప్రారంభం కాగానే సభ్యులను సన్మానించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని సన్మానించారు. ఆ తర్వాత ఏడు స్థాయీ సంఘాలకు సభ్యులను ప్రకటించారు. మంత్రి, జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. తదనంతరం ఎజెండా అంశాలతో సమావేశం ప్రారంభమైంది. అయితే మొదటి సమావేశాన్ని నామమాత్రంగా ముగించాలనుకున్న అధికార పక్షానికి సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రతిపక్షం ఉంది అనేలా సమావేశం సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి సెషన్, తిరిగి 2.30 గంటల నుంచి సాయంత్రం వరకు రెండో సెషన్‌గా ఎజెండా అంశాల ప్రస్తావనతో ముగిసింది. -
'పస్తులుండి పొలం పనిచేసేవాడిని'
‘మాది వ్యవసాయ కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి బావులు తవ్వి వచ్చిన కూలీ డబ్బులతో జొన్నలు తీసుకొస్తేనే ఇస్రాయి పెట్టి గటుక ఇస్రీ కుటుంబమంతా తినేవాళ్లం. వారానికి నాలుగు రోజుల్లో ఇప్పపువ్వు పరక కాల్చి తిని కడుపునింపుకునే పరిస్థితి. పస్తులుండి పొలంలో పని చేసేవాడిని. బాల్యమంతా కష్టాలతోనే గడిచిపోయింది. ఇంటికి పెద్దదిక్కైన మా నాన్న నాగోరావు బాల్యంలో కుటుంబ భారాన్ని మోసి అండగా నిలిచారు. మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ ఇంట్లో తిండిలేక ఆశ్రమ పాఠశాలలోనే చదువుకున్న. ఇంటర్ సెకండియర్లోనే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పుడు కడుపునిండా అన్నం దొరికింది. ఉద్యోగం చేస్తూనే ఆదివాసీల సమస్యలపై ఉద్యమాలు చేశాను. నెలజీతమంతా ఆదివాసీ ఉద్యమాల కోసమే ఖర్చయ్యేవి’ అని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. ‘సాక్షి పర్సనల్ టైం’లో ఆయన అనేక విషయాలు వెల్లడించారు. సాక్షి, ఇచ్చోడ(బోథ్) : మాది బోథ్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన అజ్జర్‌వజ్జర్. మా నాన్న నాగోరావు తల్లి లక్ష్మిబాయిలకు మేము ఏడుగురు సంతానం. అన్నలు కమ్ము, సోనేరావు, సూర్యరావు, మానిక్‌రావు, లక్ష్మణ్, తమ్ముడు రాము, చెల్లులు భూమాబాయి కుటుంబంలో నేను ఆరోవాణ్ణి. అజ్జర్వజ్జర్లో వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పంటలు పండక పొలాలన్నీ బీడుగా మారేవి. ఉన్నదాంట్లోనే కుటుంబమంతా కాయకష్టం చేసి కడుపునింపుకునేవాళ్లం. ఒకటో తరగతిలో మా నాన్న పార్డి(బి) ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు అక్కడే చదువుకున్న నేను పాఠశాల సెలవు దినాల్లో పార్డి నుంచి అజ్జర్వజ్జర్కు పన్నేండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతం నుంచి కాలినడకన ఇంటికి వెళ్లేవాడిని. సెలవు దినాల్లో పొలంలో పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడిని. ఐదో తరగతిలో బోథ్ మండలంలోని పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బోథ్ మండల కేంద్రంలో ఎస్టీ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్లో ఉట్నూర్‌లోని గిరిజన గురుకుల లాల్‌టేక్డి కళాశాలలో సీటు వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం చదువుతుండగా, 1987లో ఆదిలాబాద్ జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామరావు గిరిజన ఆదివాసీలకు కేటాయించిన వెయ్యి పోస్టుల్లో నాకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. 1988లో అజ్జర్‌వజ్జర్ పంచాయతీ పరిధిలోని మాధుగూడ గ్రామంలో ఉపాధ్యాయుడిగా వృత్తిలో చేరాను. ఏడు సంవత్సరాలు అక్కడే పని చేసి ఎనిమిదో సంవత్సరంలో బజార్హత్నూర్ మండలంలోని కొత్తగూడ పాఠశాలలకు బదిలీ అయింది. అక్కడ సంవత్సరం పాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఆసిఫాబాద్‌లోని అల్లిగూడ పాఠశాలలో ఆరు నెలల పాటు పని చేశాను. ఆ తర్వాత ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో స్పోర్ట్స్ పాఠశాలకు బదిలీ అయ్యింది. 1989లో ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కోసుగూడ అనుబం«ధ గ్రామానికి చెందిన భారతీబాయితో వివాహమైంది. నాకు వెంకటేష్, మహేష్ ఇద్దరు కుమారుతో పాటు కృష్ణవేణి అనే కూతురు ఉంది. ఈ ముగ్గురు కూడా ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా చేస్తూనే ఉద్యమం వైపు బాల్యం నుంచి ఆదివాసీలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయేవాణ్ణి. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తూనే వచ్చాను. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూనే ఆదివాసీల ఐక్యత కోసం పని చేశాను. 1992లో బోథ్ మండలానికి చెందిన భారతీబాయి అనే ఆదివాసీ వివాహిత మహిళపై అప్పట్లో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో బోథ్ డివిజన్ తుడుందెబ్బ కన్వీనర్‌గా ఆదివాసీలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలతో ప్రస్థానం ప్రారంభించాను. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు పోలీసుల తీరును ఖండించాయి. దీంతో ఉద్యమ ప్రస్థానం మొదలై నేటి వరకు కూడా కొనసాగుతూ వస్తోంది. చిన్ననాటి స్నేహితులతో.. అప్పట్లో ఆశ్రమ పాఠశాలల్లో చదువుకున్న చిన్ననాటి స్నేహితులున్నారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ మనోహర్, ప్రకాష్, దత్తు, రవి అనే స్నేహితులు నాకు ఇప్పటికీ కూడా కలుస్తుంటారు. ఉద్యమం, రాజకీయాల్లో ఇంత బీజీగా ఉన్నప్పటికీ స్నేహితులతో ఇప్పటికీ కలిసి మాట్లాడుకుంటాం. పిల్లల పెంపకం బాధ్యత ఆమెదే.. కొన్నేళ్లుగా ఉద్యమం, రాజకీయాల్లో నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటాను. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యత అంతా ఆమె చూసుకుంటుంది. కొన్నిసార్లు నెలల తరబడి కూడా ఇంటికీ వెళ్లడానికి అవకాశం దొరికేది కాదు. దీంతో పిల్లలు, ఇంటి వ్యవహారాలు అంతా భార్య భారతీబాయి చూసుకోవడంతో ఇప్పుడు మా ఆవిడే నాకు బలమైంది. నాకు అధ్యాత్మికరం అంటే ఇష్టం దేవుళ్లను నమ్ముతా. ఇంటి దైవం జంగుబాయి ఆశీర్వాదం ప్రతి రోజు తీసుకుంటా. శివుని సన్నిధిలో కూడా కొంత సమయాన్ని వెచ్చిస్తా. -
'ఢిల్లీ నుంచి భయపెడతాం'
సాక్షి, భైంసా(మంచిర్యాల) : బీజేపీ కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉండాలని, ప్రత్యర్థి పార్టీలకు భయపడవద్దని, వారు మిమ్మల్ని భయపెడితే.. వారిని మేం ఢిల్లీ నుంచి భయపెట్టిస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం భైంసా పట్టణంలోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.రమాదేవి నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే వందకుపైగా నియోజకవర్గాలు అభివృద్ధిలో అత్యంత వెనుకబాటులో ఉన్నాయని, అందులో ముథోల్ నియోజకవర్గం స్థానం దయనీయంగా ఉందన్నారు. ప్రధాని మోదీ వెనుకబడిన నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. త్వరలోనే ముథోల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ అయిన బాసర కళాశాలలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. బంగారు తెలంగాణలో కనీసం విద్యార్థులకు సౌకర్యాలు అందడం లేదని ఆయన విమర్శించారు. అధ్యాపకులు లేక ఇప్పటికీ విద్యార్థులకు సిలబస్ ప్రారంభం కాలేదని, వసతిగృహాల్లో సౌకర్యాలు లేవన్నారు. మున్సిపల్ ఎన్నికల లబ్ధి కోసమే.. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికోసమే టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఇటీవల కరీంనగర్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వాఖ్యలు అలాంటివేనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలను తమవైపు తిప్పుకునే కుట్రలో భాగమేనన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీనే గెలిపించాలన్నారు. అలాగే భైంసా మున్సిపల్లో జరిగిన వార్డుల విభజన, ఓటరు జాబితాలో తప్పులపై మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఏ పార్టీకి నష్టం లేకుండా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15వార్డులో పర్యటన పట్టణంలోని 15వ వార్డులో ఎంపీ పర్యటించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేవని, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు లేవని, పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదముందన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా 15వార్డు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏడాదిలోపు కాలనీలో సమస్యలు పరిష్కరించి, మోడల్ కాలనీగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ఉట్నూర్ : ఆదిలాబాద్ ఎకంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల్లోకి అటవీశాఖ అధికారులు వస్తే తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఉట్నూర్ మండలం మత్తడిగూడలో శనివారం జరిగిన గిరిజన నాయకుడు సిడాం శంబు మొదటి వర్థంతి సభలో ఎంపీ బాపూరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన హక్కులపై ఆయన మాట్లాడుతూ...‘హరితహారం పేరుతో మా భూముల్లోకి వస్తే చూస్తూ ఊరుకోం. అటవీ అధికారులు గిరిజనుల బతుకులను ఆగం చేస్తున్నారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల్లోకి అధికారులు వస్తే కట్టెలతో దాడి చేయండి. పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయండి.’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే గిరిజనుల హక్కుల డిసెంబర్ 9న ఢిల్లీలో ధర్నాకు ఎంపీ పిలుపునిచ్చారు. కాగా ఇటీవలే కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోని సర్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ అధికారులపట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా, తన అనుచరులతో కలిసి మహిళా ఎఫ్ఆర్వోపై ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎఫ్ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు.