![BJP Leaders Demands MLA Jogu Ramanna To Apologization - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/28/DEMAND.jpg.webp?itok=rCh6vYa1)
ఉట్నూర్‌రూరల్: ఆదిలాబాద్ ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జోగు రామన్న క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, రమేశ్, దేవి దాస్, భాగ్యలక్ష్మీ, రాజమణి, హరిప్రసాద్, రాజేందర్, మోహన్, వెంకటేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎంపీ జోలికోస్తే సహించేది లేదు
ఇంద్రవెల్లి: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సోయం బాపురావు జోలికి వస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దీపక్‌సింగ్‌షెకవత్, మరప రాజు, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, మడావి భీంరావు, ఆడవ్ చంపత్‌రావ్, ఆరెల్లి రాజలింగు, గేడం భరత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment