Boath
-
Telangana: ప్రకృతి ఒడిలో 'పొచ్చెర' అందాలు..
ఆదిలాబాద్: పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను కట్టిçపడేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం వద్ద పెద్ద బండరాళ్లపై పడుతున్న నీరు, వచ్చే నీటి తుంపరులు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.ఆహ్లాద వాతావరణం..పొచ్చర జలపాతం అందాలు, పచ్చని వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. జలపాతాన్ని చూడటంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వచ్చిన పర్యాటకులు íవీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పొచ్చెర జలపాతం మంచి పిక్నిక్ స్పాట్‌గా ఏర్పడింది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు విగ్రహాలతో ఫొటోలు తీసుకుంటున్నారు.‘పొచ్చర’కు ఇలా చేరుకోవాలి..బోథ్ మండలంలోని పొచ్చర జలపాతానికి నిర్మల్ నుండి వచ్చే వారు జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండల కేంద్రం మీదుగా రావాలి. నేరడిగొండ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు బోథ్ ఎక్స్ రోడ్డు ఉంటుంది. ఎడమ వైపు తిరిగి అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు పొచ్చర జలపాతానికి దారి వస్తుంది. కిలో మీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వారు 44వ జాతీయ రహహదారిపై ఆదిలాబాద్ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించి బోథ్ ఎక్స్ రోడ్డు కుడివైపు రావాలి. అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు.సహజసిద్ధమైన అందాలు..పొచ్చర వద్ద సహజ సిద్ధమైన అందాలు బాగున్నాయి. జలపాతం వద్ద బండరాళ్లపై నీరు జారిపడినప్పుడు వచ్చే శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి. పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కూర్చోవడానికి కుటీరాలు ఏర్పాటు చేశారు. కుటుంబంతో వచ్చి చూడాల్సిన ప్రాంతం ఇది. – గోపిడి రమేశ్‌రెడ్డి, జగిత్యాలఆహ్లాదకరంగా ఉంది..నేను వరంగల్ నుంచి వచ్చా. జతపాతం అందాలు చాలా బాగున్నాయి. ఆహ్లదకరంగా ఉంది. వీకెండ్లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాంతం. ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మా కుటుంబంతో మళ్లీ వచ్చి చూస్తాం. – ప్రియాంక, వరంగల్ఇవి చదవండి: మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు -
బోథ్ ఎమ్మెల్యేకి తప్పిన పెను ప్రమాదం.. ఆవు అడ్డం రావడంతో
సాక్షి, అదిలాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురి కాగా.. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిర్మల్ బైపాస్ సమీపంలో కొరటికల్ కార్నర్ వద్ద అకస్మాత్తుగా ఆవు అడ్డం వచ్చింది. దీంతో ఆవును తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జు నుజ్జు కాగా.. ఎమ్మెల్యే చేతివేలికి గాయమై తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే మరో వాహనంలో ఆయనను బోథ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బాపురావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పంచాయితీ.. నిధుల వాడకం వ్యాఖ్యలు మరింత మైనస్? బీజేపీ శ్రేణుల్లో ఆందోళన! -
వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. పంచాయితీ సెక్రటరీకి బెదిరింపులు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఓ విషయంలో ఇచ్చోడ మండలం నవ్గామ్ పంచాయితీ సెక్రటరీకి ఫోన్ చేసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హెచ్చరించారు. పంచాయితీ సెక్రటరీ సురేష్‌కు ఫోన్ చేసి భార్యా, పిల్లలను బతికించుకుంటావా లేదా చెప్పాలంటూ బెదిరింపులకు గురిచేశారు. ఉద్యోగం పోతే తెలుస్తుందని, మంచి మాటతో చెప్తున్నా.. పద్దతి మార్చుకోవాలని భయపెట్టారు. ఎక్కువ మాట్లాడుతున్నావని, సర్పంచ్‌లతో కలిసి తప్పులు చేస్తున్నావని సెక్రటరినీ భయబ్రాంతులకు గురిచేశారు. అయితే తన తప్పేంటో చెప్పాలని ఎమ్మెల్యేను సెక్రటరీ ప్రాదేయపడ్డారు. తప్పుంటే రాజీనామా చేస్తానని తెలిపారు. అయినా సెక్రటరీ మాటలు పట్టించుకోని ఎమ్మెల్యే.. పద్దతి మారకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శేజల్ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని వాపోయారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. శేజల్‌ను పరామర్శించిన మాజీ మంత్రి గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్‌ను మాజీ మంత్రి గడ్డం వినోద్ పరామర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పెద్దలు మాణిక్యం థాక్రేను కలిసేందుకు ఢిల్లీకి వచ్చాను. మానవత్వంతో శేజల్‌ను పరామర్శించాను. బెల్లంపల్లిలో ఇంత పెద్ద దుర్ఘటన జరగడం బాధాకరం. నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు ఆమె ఇచ్చిన ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదు, FIR కూడా చెయ్యడం లేదు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పైన వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలి. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వ భూమి ఇచ్చారు. 30 లక్షలు తీసుకొని ఒక ఏడాది గడిచిపోయింది న్యాయం కావాలని శేజల్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం. చదవండి: తెలంగాణకు అమిత్ షా, జేపీ నడ్డా.. ఎప్పుడంటే! -
బోథ్ బీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు
-
బోథ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మెల్యే బెదిరింపులు
-
ఆ నియోజకవర్గంలో ‘గులాబీ’ల మధ్య యుద్ధం!
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గులాబీల మధ్య యుద్ధం మొదలైంది. సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మధ్య వార్ తీవ్రమయింది. మాజీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే మీద యుద్ధం ప్రకటించారు. దీనికి ఎమ్మెల్యే వర్గం కూడా సై అంటోంది. రెండు వర్గాలు సమరశంఖం పూర్తించి ఆధిపత్యపోరుకు తెర తీసాయి. సంక్షేమంపై దళారి డేగలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల నియోజకవర్గం బోథ్‌లో అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై మాజీ ఎంపి నగేష్ తిరుగుబాటు జెండా ఎగురేశారు. కొద్ది రోజుల క్రితం నగేష్ జన్మదిన వేడుకలు బోథ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పై నగేష్ తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో రాష్ట్ర సర్కారు పథకాలు లభించాలంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉందని నగేష్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల విషయంలో దళారులే రాజ్యమేలుతున్నారని.. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకంలో అవినీతి జరిగిందన్నారు. బోగస్ పేర్లతో ప్రభుత్వ సొమ్మును లూటీ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ నగేష్. రియల్ ఎస్టేట్ పాలిటిక్స్ తన ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యాపారాలు చేయలేదని.. తనతో ఉన్న నాయకులు కూడా వ్యాపారాలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎద్దేవా చేస్తూ ఈ వ్యాఖ్యలు చెయడం సంచలనం కలిగించింది. బోథ్ నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చానని నగేష్ చెప్పారు. ఇప్పుడు బోథ్ ప్రతిష్ట మసక బారుతుందని అందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో బోథ్ లో టిఅర్ఎస్ జెండా ఎగురవేయడమే తనలక్ష్యమంటూ..తానే ఎమ్మెల్యే అభ్యర్థినని కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చారు నగేష్. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? మాజీ ఎంపి నగేష్ చేసిన వ్యాఖ్యలు బోథ్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఎన్నికల ప్రచారంలో ఉండటంతో ఆయన వర్గీయులంతా ఇచ్చోడలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాబలం ఉన్న రాథోడ్‌కే కేసీఆర్ మళ్ళీ అవకాశం ఇస్తారని, ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని ప్రకటించారు. కొందరు కావాలనే రాథోడ్‌కు టిక్కెట్ రాదని.. ఒకవేళ వచ్చినా తాము పనిచేయంటూ ప్రకటించడంపై అగ్రహం వ్యక్తం చేశారు. రాథోడ్ బాపురావు పై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ది చెబుతామని హెచ్చరికలు జారీచేశారు. మొత్తం మీద అధికార పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతల మధ్య పోరు కారణంగా బోథ్ నియోజకవర్గం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. -
బోథ్ అడవుల్లో మావోయిస్టులు? పోలీసుల అలెర్ట్!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ అడవుల్లో మావోయిస్టులు సంచరించినట్లు తెలుస్తోంది. 20 రోజుల క్రితం బోథ్ మండలంలోని కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం బోథ్ సీఐ నైలు నాయక్ ఆధ్వర్యంలో కైలాస్ టెకిడి అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఓ గుట్ట వద్ద గ్రెనేడ్ పడి ఉండడాన్ని పోలీసులు గమనించి వెంటనే ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో పోలీసులు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. కైలాస్టెకిడి అటవీ ప్రాంతం ఆగస్టులోనే వచ్చారా..? కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో గ్రెనేడ్ లభిచండంతో ఆ గ్రెనేడ్ నేలపై ఎన్ని రోజుల క్రితం పడిందని పోలీసులు లెక్కలేస్తున్నారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలోనే మావోల బ్యాగుల నుంచి ఇది నేల మీద పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చారా? లేక తిర్యాణి అడవుల్లో ఉన్నట్లు భావిస్తున్న అడెల్లు దళం వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అడెల్లు స్వస్థలం బోథ్ మండలంలోని పొచ్చర కావడంతో అతనే వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జారి పడిందా? విడిచి వెళ్లారా? అటవీ ప్రాంతంలో గ్రెనేడ్ మావోయిస్టుల బ్యాగులో నుండి జారి పడిందా? లేదా కావాలని విడిచి వెళ్లారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దృష్టిని మరల్చడానికి విడిచివెళ్లారన్న వాదన వినిపిస్తున్నా పోలీసులు మాత్రం కచ్చితంగా మావోయిస్టుల వద్ద నుండే గ్రెనేడ్ కింద పడి ఉంటుందని పేర్కొంటున్నారు. వివరాలు వెల్లడించని పోలీసులు గ్రెనెడ్ లభ్యమైందని పోలీసులు అనధికారికంగా ధృవీకరించినా వివరాలు మాత్రం వెల్లడించలేదు. న్నతాధికారులే పూర్తి వివరాలు వెల్లడిస్తారని బోథ్ సీఐ నైలు నాయక్ పేర్కొన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి గ్రెనేడ్‌కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ప్రజాప్రతినిధులు అలర్ట్‌గా ఉండాలి ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ గ్రామాలకు వెళ్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. బోథ్ అడవుల్లో గ్రెనేడ్ లభ్యం బోథ్ మండలం నిగిని గ్రామ సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో సీఐ నైలునాయక్ ఆధ్వర్యంలో గురువారం కూంబింగ్ నిర్వహిస్తుండగా భూమిపై పడి ఉన్న గ్రెనేడ్‌ను గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో ఉన్నతాధికారులకు పంపించారు. ఎలా వచ్చిందో విచారణ చేపడుతున్నారు. 15 నుంచి నెల రోజుల మధ్య అటవీ ప్రాతంలో పడి ఉన్నట్లు భావిస్తున్నారు. -
పంచె కట్టి.. బ్యాట్ పట్టి
సాక్షి, ఆదిలాబాద్: రైతులంటే నాగలి చేతపట్టి దుక్కి దున్నడమే కాదు.. బ్యాట్ పట్టి క్రికెట్ కూడా ఆడగలమని నిరూపించారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రైతులు. బోథ్‌లోని లాల్‌పిచ్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన రైతులంతా కలిసి జట్టుగా ఏర్పడి పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఎస్ఎస్ టీంతో తలపడ్డారు. ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ ఏడు పరుగుల తేడాతో రైతుల జట్టు ఓడిపోయింది. కానీ ఆ రైతులు మాత్రం తమ ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. యువకులు షూస్, యూనిఫాంతో టోర్నీ ఆడగా.. రైతులు పంచెకట్టు, కాళ్లకు చెప్పులు లేకుండా మ్యాచ్ ఆడారు. -
చెల్లిపై వేధింపులు: బావకు నచ్చచెప్పేందుకు వెళ్లిన అన్నపై కత్తి దాడి
నేరడిగొండ (బోథ్): బావమరిదిపై కత్తితో బావ దాడి చేసిన ఘటన మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌సుమన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌తో జుబేర్ గత రెండు సంవత్సరాల క్రితం చెల్లె వివాహం జరిపారు. మూడు రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా జుబేర్ బావను నచ్చజెప్పడానికి ఆయన చికెన్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ మాటామాట పెరగడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో బావ ఇమ్రాన్‌ఖాన్ మరిది జుబేర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన మెడ, చెవిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జుబేర్‌ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్ చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు -
‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’
ఉట్నూర్‌రూరల్: ఆదిలాబాద్ ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జోగు రామన్న క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, రమేశ్, దేవి దాస్, భాగ్యలక్ష్మీ, రాజమణి, హరిప్రసాద్, రాజేందర్, మోహన్, వెంకటేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎంపీ జోలికోస్తే సహించేది లేదు ఇంద్రవెల్లి: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సోయం బాపురావు జోలికి వస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దీపక్‌సింగ్‌షెకవత్, మరప రాజు, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, మడావి భీంరావు, ఆడవ్ చంపత్‌రావ్, ఆరెల్లి రాజలింగు, గేడం భరత్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ వ్యక్తి కాదు ఓ శక్తి
ఇచ్చోడ(బోథ్): విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం గొప్ప అనుభూతినిచ్చింది. పుస్తకం చదువుతున్నంత సేపు రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడిన మాటలు, ఆయనతో గడిపిన క్షణాలు కళ్లముందు కదలాడినట్లు అనిపించింది. పుసక్తం చేతిలో పట్టుకుంటే చాలు వైఎస్సార్‌తో పెనవేసుకున్న మధుర జ్ఞాపకాలు కళ్లలో మెదలుతున్నాయని వైఎస్సార్ అభిమాని, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం చదివిన ఆయన వైఎస్సార్‌తో తనకున్న అనుభవాలను మంగళవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వైఎస్సార్ ఓ శక్తి.. వైఎస్సార్‌తో 1994లో పరిచయం ఏర్పడింది. ఆయన చనిపోయే వారం ముందు ఆయనతో మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డితో నాకు ఎంతో సానిహిత్యం ఉండేది. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కార మార్గం చూపేవారు. ఆయన వ్యక్తి కాదు ఓ శక్తి. మిస్టర్ శ్రీనివాస్ అనే వారు.. ఎన్నిసార్లు కలిసినా చెరగని చిరునవ్వుతో మిస్టర్ శ్రీనివాస్ అంటూ ప్రేమగా పొట్టపై చిన్నగా కొట్టేవారు. జిల్లా సమస్యలు విని వాటికి వెంటనే పరిష్కార మార్గం చూపేవారు. ఆదిలాబాద్ జిల్లా అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆయన స్ఫూర్తితోనే నేను ఈరోజు ఉన్నంతలో కొంత పేదల కోసం ఖర్చు చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. మరిచిపోలేని అనుబంధం 2001లో పాదయాత్రలో పాల్గొన్నాను. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది, వైఎస్సార్ సీఎం అయ్యాక ఆయనతో అనుబంధం మరింత పెరిగింది. 2007లో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సోనాలలో మా ఇంటికి కూడా వచ్చారు. ఆయన వైద్య వృత్తిలో చేసిన సేవల మాదిరిగానే నా కుమారిడితో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తాను. -
పులి కదలికలపై నిరంతర నిఘా
సాక్షి, తాంసి(ఆదిలాబాద్) : భీంపూర్ మండలంలోని తాంసి(కె), గోల్లఘాట్ పరిసర ప్రాంతాలలో పశువులపై పులి తరుచూ దాడులు చేస్తూ హత మార్చుతుండడంతో అటవీశాఖ సిబ్బంది తాంసి(కె), గోల్లఘాట్ గ్రామాలలో పులి కదలికలపై నిరంతర నిఘా పెట్టింది. పులి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. సోమవారం అటవీశాఖ కన్జర్వేటర్ వినోద్ కుమార్ తాంసి(కె) గ్రామాన్ని సందర్శించి పులి సంచారం ఉన్న ప్రదేశాలను పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రజలు, పులుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ప్రజలకు, పులులకు ఎటువంటి నష్టం జరుగుకుండా సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంగళవారం ఎఫ్ఆర్వో అప్పయ్య ఆధ్వర్యంలో తాంసి(కె), గోల్లఘాట్ గ్రామాలలో 4 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. తాంసి(కె) గ్రామంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో ఆదిలాబాద్ రేంజ్ అటవీశాఖ అధికారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడవి చిత్రపటం ద్వారా బీట్ అధికారులకు అవగాహన కల్పించారు. పెన్ గంగ పరివాహక ప్రాంతంలో పులి కదలికలను అటవీశాఖ సిబ్బంది పరిశీలించడానికి పెన్‌గంగ నది ఒడ్డున 15 ఫీట్ల ఎత్తుపై ప్రత్యేకంగా మంచెను ఏర్పాటు చేశారు. పులి కదలికలను పరిశీలించడానికి అటవీశాఖ ప్రత్యేకంగా మానిటరింగ్ అధికారిని ఏర్పాటు చేసింది. తాంసి(కె) గ్రామంలో మంగళవారం డివిజనల్ అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, రేంజ్ ఆఫీసర్ అప్పయ్య సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో పులి కదలికల కోసం పరిశీలించారు. -
బాత్రూమ్లో ముద్దు ఇవ్వాలని బెదిరింపు..
సాక్షి, ఆదిలాబాద్ : గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్‌ను విద్యార్థిని కుటుంబ సభ్యులు సోమవారం చితకబాదారు. బోథ్ హాస్టల్లో ఉంటున్న 10వ తరగతి విద్యార్థినిపై వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా దాడికి దిగారు. బాత్రూమ్లోకి వచ్చి ముద్దు ఇవ్వాలని విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ బెదిరించాడు. ఈ క్రమంలో విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులతో వచ్చి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వార్డెన్ అటువైపు రావడంతో ఒక్కసారిగా విద్యార్థిని బంధువులు అతనిపై దాడి చేయడంతో వార్డెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సెలవులొస్తే జీతం కట్!
సాక్షి, బోథ్(ఆదిలాబాద్) : వారంతా ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగానే బోధిస్తారు. కాని వేతనా లు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుకుంటున్నట్లు వారు అందుకోరు. సెలవులు వ స్తే ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాల్లో ఎ లాంటి మార్పు ఉండదు. కాని హవర్లీ టీచర్లకు మాత్రం ఎటువంటి వేతనాలు ఉండ వు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. సమాన పనికి సమాన వేతనాలను అందించాలని వారు డిమాండ్చేస్తున్నారు. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం గంటకు వేతనంగా నిర్ణయించి ఉపాధ్యాయులను నియమించింది. మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యాబోధన ఉంటుంది. వీరికి ప్రతి గంటకు రూ.140 చెల్లిస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయులు కనీసం ఐదు క్లాసులు బోధిస్తారు. ఈ లెక్కన ఉపాధ్యాయులకు ప్రతి రోజు రూ.700 వరకు వేతనం ఉంటుంది. పాఠశాలకు సెలవు నేపథ్యంలో తరగతులు ఉండవు. కాబట్టి వీరికి వేతనాలు అందవు. నెలలో 30 రోజుల్లో నాలుగు ఆదివారాలు, ఒక రెండవ శనివారం పో నూ 25రోజులు పనిదినాలు ఉంటాయి. అంటే సగటున వీరు రోజుకు రూ.700ల వేతనా లను పొందితే 25 రోజులకు రూ.17 వేలా 500 రావాలి. కానీ ప్రభుత్వం నెలకు కేవలం 100గంటల వేతనాలను మాత్రమే చెల్లిస్తోంది. అంటే గరిష్టంగా వీరు రూ.14 వేలు మాత్రమే వేతనాలను పొందుతున్నారు. అది కూడా సెలవులు లేకపోతేనే.. అదే సెలవులు వస్తే వారి జీతాల్లో కోతే. నెలలో మరిన్ని సెలవులు వస్తే ఆ రోజుల్లో వేతనాలను కోల్పోతారు. దీంతో సగటున తమకు 12 వేల రూపాలయ వరకు మాత్రమే అందుతున్నాయని వాపోతున్నారు. అక్టోబర్‌లో అన్నీ సెలవులే.. అక్టోబర్ నెలలో దసరా సెలవులు రావడం, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 19 వరకు సెలవులు పొడిగించడంతో ఒక్క రో జు కూడా పాఠశాలలు పని చేయలేదు. దీంతో వారికి ఈ నెల వేతనాలు అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలలో 31రోజులుండగా 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. 21వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే ఆదివారం, దీపావళికి రెండు రోజుల సెలవులు పోనూ మరో ఆరు రోజులు మాత్రమే పాఠశాలలు నడవనున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు అక్టోబర్ నెలలో కేవలం ఆరు రోజుల వేతనాలను మాత్రమే అందుకోనున్నారు. అంటే కేవలం రూ.4200 మాత్రమే వారికి అందుతాయి. పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వకుండా హవర్టీ బేస్డ్ ఉపాధ్యాయులను వెట్టిచాకిరీ చేయిస్తున్నారని హెచ్‌బీటీ ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమ బతుకులు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలను తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 162 మంది ఉపాధ్యాయులు హవర్టీ బేస్డ్ టీచర్లుగా కొనసాగుతున్నారు. వీరు సగటుగా రూ.12 వేల నుంచి 13 వేల వరకు వేతనాలను పొందుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 1500 మంది హవర్లీ బేస్డ్ టీచర్లుగా పనిచేస్తున్నారని, వారికి సెలవుల్లో వేతనాల్లో కోతలను విధించరాదని ఇప్పటికే ఉపాధ్యాయులు విద్యాశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ లింగయ్యను ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు. సమాన పనిక సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు. సెలవులతో సంబంధం లేకుండా వేతనాలివ్వాలి మోడల్ స్కూళ్లో పనిచేసే హవర్లీ బేస్డ్ ఉపాధ్యాయులకు సెలవులకు సంబంధం లేకుండా వేతనాలను అందజేయాలి. సెలవుల్లో వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. సెలవులతో సంబంధం లేకుండా సిలబస్‌ను పూర్తి చేసే భారం తమదే అయినప్పుడు వేతనాలను కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చౌహాన్ గోవింద్, హవర్లీ బేస్డ్ టీచర్ల సంఘం (మోడల్ స్కూల్), జిల్లా అధ్యక్షుడు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలి గంటకు వేతనం కాకుండా ప్రతీ నెల ఫిక్స్డ్ వేతనాలను అందించాలి. శ్రమ దోపిడీకి గురవుతున్నాం. సమాన పనికి సమాన వేతనాలను అందించాలి. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో పని చేస్తున్నాం. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం వేతనాలను అందించాలి. సెలవులు వస్తే మా వేతనాల్లో కోతలు ఉంటున్నాయి. – పాలెపు గణేశ్, హవర్లీ బేస్డ్ ఉపాధ్యాయుడు -
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి!
సాక్షి, బజార్హత్నూర్(బోథ్): చిన్నపాటి జ్వరానికే ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. ఈ ఘటన అందరినీ విస్తుగొల్పింది. అయితే, చిన్నారి మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బజార్హత్నూర్ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన కొడప మల్లేశ్వరి అదే మండలంలోని మాడగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోది. గురువారం ఉదయం నుంచి మల్లేశ్వరి జ్వరంతో బాదపడుతుంటే పాఠశాలకు చెందిన ఏఎన్ఎం అనుసూయ పారసెటమల్ మాత్రలు ఇచ్చింది. కానీ, సాయంత్రం వరకు జ్వరం తగ్గకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా కావడంతో ఆ సమయంలో హెచ్ఎం రమేష్, ఏఎన్ఎం అనసూయ అందుబాటులో లేకపోడడంతో వార్డెన్ దేవరావ్ బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బోథ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మల్లీశ్వరి అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కానీ, అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు రిమ్స్ వైద్యులు తెలపడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన కొలాంగూడ గ్రామానికి తరలించారు. ఈ క్రమంలోనే చిన్నారి మృతదేహాన్ని అంబు లెన్స్‌లో తీసుకెళ్లుండగా తన కూతురు మరణానికి పాఠశాల సిబ్బందే కారణమని మృతురాలి తండ్రి కొడప నారాయణ హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేయబోయారు. కానీ, గ్రామస్తులు సముదాయించి అతన్ని శాంతింపజేశారు. కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం చేసేవరకు చిన్నారి మృతదేహంను తీసుకోమని బీష్మించారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రెండెకరాల సాగుభూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అబ్దుల్బాఖీ, ఏటీడీవో సౌజన్య ఫోన్లో ఐటీడీఏ డీడీ చందనతో మాట్లాడి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. రాత్రి దాకా చెప్పలేదు.. చిన్నారి మల్లీశ్వరి గురువారం ఉదయం నుంచే జ్వరంతో బాదపడుతున్నా.. ఈ విషయాన్ని తమ కు తెలుపలేదనీ, రాత్రి మాత్రం బజార్హత్నూర్ పీహెచ్‌సీకి తీసుకెళ్తున్నామని మాత్రం తెలిపారని తల్లితండ్రులు కొడప నారాయణ, రుక్మబాయి బోరున విలపిస్తూ వివరించారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక మాట కూడా తెలుపలేదని రాత్రి కూడా ఇదే విషయమడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడారని మారోపించారు. గురువారమే తమకు చెప్పి ఉంటే ఎలాగోలా కూతురిని కాపాడుకునేవాళ్లమని వారు కన్నీరుమున్నీరయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. మల్లీశ్వరి మృతి విషయం తెలుసుకున్న ఏటీడీవో సౌజన్య కొలాంగూడ గ్రామానికి చేరుకుని ఆమె తల్లితండ్రులను ఓదార్చారు. అనంతరం మాడగూడ ఆశ్రమ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థులను విచారించారు. భోజనాన్ని, తాగునీరు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థిని మృతి రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు పంపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. పాఠశాలలో హెల్త్ క్యాంప్ విద్యార్థిని మృతి సంఘటనతో అప్రమత్తమైన వైద్యారోగ్య సిబ్బంది మాడగూడ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం ప్రభుత్వ వైద్యుడు హరీష్ అధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అన్ని తరగతుల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్ అసిస్టెంట్ గాజుల రమేష్, ఏఎన్ఎం అనసూయ పాల్గొన్నారు. -
దేవుడికే శఠగోపం
సాక్షి, బోథ్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దేవుడి భూములు అన్యాక్రాంతమయ్యాయి. దేవాదాయశాఖకు చెందిన వందలాది భూములు పరాయి వారి చేతుల్లోకి చేరాయి. మొత్తం 111 ఆలయాలకు దాదాపు 3563 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో నుంచి చాలా భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్నేళ్ల తరబడి ఈ భూముల్లో వ్యవసాయం సాగిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు భూసర్వేలో అధికారులు దేవాదాయశాఖ భూములు గుర్తించడంలో విఫలమయ్యారు. దేవాదాయశాఖ అధికారులు ఆలయాల పేరు మీద ఉన్న భూముల వివరాలు ఇవ్వాలని ఇప్పటికే కోరారు. అయితే వందలాది ఎకరాలు పరాధీనంలో ఉండడంతో రెవెన్యూ అధికారుల నుంచి స్పందన కరువైందని తెలుస్తోంది. దేవాలయ భూములు గుర్తించి దేవాదాయశాఖకు అప్పగిస్తే..ఆ భూములకు వచ్చే కౌలుతో దేవాలయాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని 111 దేవాలయాల దేవుడి భూములు 3563 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 1250 ఎకరాల భూములు ఆలయాల అర్చకుల ఆధీనంలో ఉన్నాయి. మిగతా భూముల విషయంలో దేవాదాయశాఖ అధికారుల వద్ద పాత రికార్డులు, గెజిట్లు ఉన్నా..భూములు మాత్రం పరాయివారి ఆధీనంలో ఉన్నాయి. బోథ్ మండలంలోని కుచులాపూర్ పంచాయతీ పరిధిలోని అతి ప్రాచీనమైన శ్రీ వేంకటేశ్వర ఆలయానికి చెందిన 48 ఎకరాల 29 గుంటల భూమి దశాబ్దాలుగా పరాదీనంలో ఉంది. ఈ భూమని గుర్తించి దేవాదాయశాఖకు అప్పగిస్తే వచ్చిన కౌలు డబ్బుతో ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుంది. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వర దేవాలయ ధర్మశాల పేరిట గుడిహత్నూర్ మండలంలోని సీతాగొందిలో 29.31 ఎకరాల భూమి ఉంది. ఇందులో 26.31 ఎకరాలు పరాధీనంలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ భూమి విషయమై అధికారులు ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించారు. నిర్మల్ మండలంలోని సోన్‌లోని దత్తస్వామి మఠానికి చెందిన ఏడు ఎకరాల భూమి నేరడిగొండ మండలంలోని బుద్దికొండలో ఉంది. ఈ భూమి ఇతరులు సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలోని శ్రీరామ చంద్రస్వామి ఆలయానికి 48 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వడూర్, ఆరెపల్లి, బుద్దికొండ, వాగ్దారి, బోరిగాం గ్రామాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమి కబ్జాలో ఉంది. ఆదిలాబాద్ పట్టణకేంద్రంలోని పురాతనమైన గోపాలకృష్ణ మఠానికి చెందిన 1259 ఎకరాల వ్యవసాయ భూములు మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని కేలాపూర్ తాలుకాలోని గోమ్సి గ్రామంలో ఉన్నాయి. గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది హనుమాన్ ఆలయం పేరిట 31.24 ఎకరాల భూమి ఉంది. కానీ స్థానికంగా 15 ఎకరాలు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. మిగతా భూమి ఎక్కడికెళ్లిందో తెలియని పరిస్థితి. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర ఆలయానికి బేల మండలంలో 54 ఎకరాలు, జైనథ్ మండలంలో 221 ఎకరాలు, తలమడుగు మండలంలో 43 ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల్లో ఇటీవల అధికారులు 23 ఎకరాలు గుర్తించి సాగు చేసుకున్నారు. మిగతా భూమి కొంత మంది పట్టా చేసుకున్నారని సమాచారం. అయితే చాలా వరకు భూములు అధికారులు గుర్తించడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ వద్ద కేవలం 554 ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయి. 500 ఎకరాలు కబ్జాకు గురి కాగా..1259 ఎకరాలు మహారాష్ట్రలో ఉన్నాయి. 1250 ఎకరాలు అర్చకుల పేరు మీద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా భూములు తమకు అప్పగించాలని ఇప్పటికే దేవాదాయశాఖ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రభుత్వ భూసర్వేలో వెల్లడైన దేవాలయాలకు చెందిన భూముల వివరాలు.. జిల్లా దేవాలయాలు ఎకరాలు భూమి ఉన్న ఆలయాలు గుర్తించిన భూమి ఆదిలాబాద్ 17 373 8 120 మంచిర్యాల 16 91 6 17 నిర్మల్ 72 1301 16 86 కుమురంభీం 6 164 6 122 పరాధీనంలో కొన్ని దేవాదాయభూములు దేవాలయం విస్తీర్ణం(ఎకరాల్లో) జంగం మఠం,బోథ్ 7.39 శ్రీ వేంకటేశ్వర ఆలయం,బోథ్ 48.29 బాలాజీ వేంకటేశ్వర ఆలయం, ఆదిలాబాద్ 290.35 దత్తస్వామి మఠం, సోన్ మండలం 7.09 రామచంద్రస్వామి దేవాలయం, వడూర్,నేరడిగొండ 48.06 వేంకటేశ్వర స్వామి ఆలయం, తాంసి 39.24 హనుమాన్ మందిరం, సీతాగొంది, గుడిహత్నూర్ 31.24 మహాదేవ్ మందిరం,గుడిహత్నూర్ 16.24 రామలక్ష్మణ స్వామి మందిరం, గుడిహత్నూర్ 10.00 వేంకటేశ్వర ధర్మశాల, ఆదిలాబాద్ 23.31 దేవుడి మాన్యాలు స్వాధీనం చేసుకుంటాం జిల్లాలోని దేవుడి మాన్యాలు స్వాధీనం చేసుకుంటాం. ఈ మేరకు ట్రిబ్యునల్‌కు వెళ్లాం. భూములకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం కోరాం. భూములకు సంబంధించి పాత రికార్డులు, గెజిట్ల ఆధారంగా రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకుంటాం. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైనా దేవాదాయ భూములు కబ్జా చేస్తే కోర్టుకు వెళ్తాం.– విజయరామారావు, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయశాఖ -
గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
సాక్షి,తాంసి: నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్ గ్రామంలో బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో నిర్వహించిన గ్రామస్తుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండల్‌నాగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమెల్యే రాథోడ్ బాపూరావును బుడగ జంఘం సంఘం నాయకులు పూలమాల శాలువాతో సన్మానించారు. పిప్పల్‌కోటి గ్రామంలో ఎమ్మెల్యేను నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గసభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ పిప్పల్‌కోటి గ్రామంలో 368 కోట్ల రూపాయల రిజర్వాయర్ నిర్మాణంతో గ్రామంలో చుట్టుపక్కల భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు భూములను అందించటం అభినందనీయమన్నారు. భూములను అందించిన రైతులకు నష్టపరిహారంతో పాటు అన్నివిధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములందించి సహకరించిన పిప్పల్‌కోటి గ్రామాన్ని దత్తత తీసుకొని అబివృద్ధి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు. -
భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య
బోథ్ (ఆదిలాబాద్ జిల్లా): భార్యను హత్య చేసి ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా భోద్ మండలం సాకిరా గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన బడుగు సుజాత(28)పై అనుమానంతో ఆమె భర్త బడుగు సురేష్(35)తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సురేష్ ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యను అనుమానించిన అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.