
నేరడిగొండ (బోథ్): బావమరిదిపై కత్తితో బావ దాడి చేసిన ఘటన మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌సుమన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌తో జుబేర్ గత రెండు సంవత్సరాల క్రితం చెల్లె వివాహం జరిపారు. మూడు రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా జుబేర్ బావను నచ్చజెప్పడానికి ఆయన చికెన్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ మాటామాట పెరగడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో బావ ఇమ్రాన్‌ఖాన్ మరిది జుబేర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన మెడ, చెవిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జుబేర్‌ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్‌చల్
చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు