రేవ్‌ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్‌ఎస్‌ ఆగ్రహం | Cyberabad Police raid farmhouse of KTR brother in law raj pakala live updates | Sakshi
Sakshi News home page

రేవ్‌ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

Published Sun, Oct 27 2024 2:47 PM | Last Updated on Sun, Oct 27 2024 6:12 PM

Cyberabad Police raid farmhouse of KTR brother in law raj pakala live updates

Janwada Farm House Party Updates :

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో జ‌న్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జ‌న్వాడ ఫామ్ హౌస్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిగ్గా మారింది. జన్వాడ రిజర్వ్​ కాలనీలో ఉన్న ఫామ్‌హౌస్‌లో రాజ్‌ పాకాల శనివారం రాత్రి రేవ్‌ పార్టీ నిర్వహించారు. రేవ్‌ పార్టీపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేని మద్యాన్ని గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్‌ మద్దూరి అనే వ్యక్తి కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఓటీ పోలీసుల దాడులతో రాజ్ పాకాల పరారీలో ఉన్నారని తెలంగాణ ఎక్సైజ్‌ జాయింట్‌ సీపీ ఖురేషి తెలిపారు. 

6.00pm
తలసాని శ్రీనివాస్ యాదవ్‌

  • కక్ష సాధింపు చర్యలు సరికాదు
  • బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
  • అనేక సమస్యలతో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు... వాటిపై దృష్టి సారించాలి
  • ప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై కేటీఆర్ ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రలు
  • గంట గంటకు మారుతున్న ఎఫ్‌ఐఆర్‌లు.. కారణం ఏమిటి
  • ఎలాంటి సర్చ్ వారెంట్ లు లేకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారు
  • ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకాడేది లేదు

వేముల ప్రశాంత్ రెడ్డి  

  • కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారు
  • కేటీఆర్ బావమరిది సొంతంగా ఫామ్ హౌస్ క‌ట్టుకుని గృహ ప్రవేశం చేశారు
  • జన్వాడలో ఏం దొరకలేదు
  • గచ్చిబౌలిలో రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ చేస్తున్నారు
  • కేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు
  • రాజ్ పాకాల ఇంట్లోకి లాయర్లను పంపించాలి
  • పోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • ప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది
  • కేటీఆర్ పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఉంది

సబితా ఇంద్రారెడ్డి

  • తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా
  • పోలీసు కుటుంబాలు రోడ్డు ఎక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదు
  • రాజ్ పాకాల విషయంలో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేశారు
  • సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎట్లా చేస్తారు
  • ప్రభుత్వం కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తోంది
  • తెలంగాణలో పండుగలు వచ్చినప్పుడు దావత్ లు చేసుకోవడం కామన్
  • ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదు

శ్రీనివాస్ గౌడ్  

  • తెలంగాణలో శుభకార్యం జరిగితే ప్రతి ఇంట్లో మందు పార్టీ ఇస్తారు
  • తెలంగాణలో కక్షపూరిత రాజకీయాల లేవు
  • తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురాకండి
  • లేనిపోని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని  అరెస్ట్ చేశారు

5:30pm

రేవ్‌ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

  • రేవ్‌ పార్టీ చెడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
  • సీఎం రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నాడు.
  • అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు

5:10pm

  • శైలేంద్ర పాకాల ఇంట్లో తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్‌ పోలీసులు
  • ఓరియన్‌విల్లాకు భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

4:40pm
హైద‌రాబాద్ ఓరియ‌న్ విల్లా వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. ఒరియ‌న్ విల్లాలో కేటీఆర్ బావ‌మ‌రిది రాజ్ పాకాల ఇంట్లోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్న పోలీసుల‌పై బీఆర్ఆర్ఎస్ నేత‌లు తిర‌గ‌బ‌డ్డారు. దీంతో పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను,మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

3:40pm

  • ఒరియన్ విల్లాస్‌లో ఉద్రిక్తత
  • రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎక్సైజ్ అధికారూలు
  • కేటీఆర్ విల్లా పక్కనే ఉన్న రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల విల్లా
  • ఎక్సైజ్‌ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్‌ నేతల వాగ్వాదం
  • సెర్చ్ వారెంట్ చూపాలని ఎక్సైజ్ పోలీసులతో బీఆర్‌ఎస్‌ నేతల వాగ్వాదం
  • ఎక్సైజ్ పోలీసులు జేబులు తనిఖీ చేశాక లోపలకి పంపిస్తాం అంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు
  • తమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బీఆర్‌ఎస్‌ వాదన

 

3:21pm

  • రాయదుర్గం ఓరియన్‌ విల్లాస్‌కు చేరుకున్న పోలీసులు
  • రాజ్‌ పాకాల ఉంటున్న విల్లా నెంబర్‌ 40కి తాళం వేసి ఉన్నట్లు పోలీసుల గుర్తింపు
  • ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో దాడులు
  • పోలీసుల దాడుల‌తో ఓరియన్ విల్లా ద‌గ్గ‌ర ఉద్రిక్తత
  • నోటీసులు ఇవ్వ‌కుండా సోదాలు నిర్వ‌హిస్తున్నార‌ని బీఆర్ ఎస్ నేత‌ల ఆందోళ‌న
  • ఎక్సైజ్ అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం
  • ఎలాంటి నోటీసులు లేకుండా ఇంటిని తడిఖీలు ఎలా చేస్తారంటు ప్రశ్న
  • నోటీసులు చూపించాల‌ని డిమాండ్‌
  • కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటూ చెడు ప్ర‌చారం చేస్తోందంటూ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం 

2:55pm
రాజేంద్ర నగర్ డీసీపీ 

  • రాజ్ పాకాల ఫామ్‌ హౌస్‌పై నిన్న రాత్రి దాడి చేశాం
  • లోకల్ పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులతో కలిపి ఆకస్మిక తనిఖీలు చేశాం
  • పార్టీలో మొత్తం 35 మంది ఉన్నారు
  • వీరిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు
  • ఏడు విదేశీ మద్యం బాటిల్స్‌తో పాటు 10 దేశీయ మధ్య బాటిళ్లు స్వాధీనం
  • బాటిల్స్‌తో పాటు నిషేధిత గేమింగ్ వస్తువులు స్వాధీనం
  • అందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించం
  • విజయ్ మద్దూరి కొకైనే పాజిటివ్ వచ్చింది
  • విజయ్ మద్దూరికి రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం
  • పార్టీ నిర్వహించిన రాజ్ పాకాల పైన గేమింగ్ యాక్ట్ కింద మోకిలా పీఎస్‌లో కేసు నమోదు చేశాం
  • పార్టీకి ఎక్సైజ్‌ నుండి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి ఎక్సైజ్‌ పోలీసులు మరో కేసు నమోదు చేశారు
  • మోకిలా పీఎస్‌లో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ కింద విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశాం

2:53 pm

కేటీఆర్‌ను ఇరికించాలని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద

  • హామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

  • కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు

  • కేటీఆర్ బావమరిది స్వంత ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు

  • స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారు

  • ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారు

  • అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు

  • రిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదలం

  • రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారు

  • సొంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దా

  • కేటీఆర్‌పై బురదచల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు

  • రాజ్ పాకాల కొత్త ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారు

  • రాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్, కేటీఆర్ సతీమణి లేరు

  • కేటీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు

  • రేవంత్ రెడ్డి డైవర్షన్‌లో ఇది జరుగుతోంది

  • రేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే రియాక్ట్ అవుతున్నారు

  • బండి సంజయ్,రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారు

  • రేవంత్ రెడ్డి,బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు

  • రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు

2:30pm
రేవ్‌ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్‌ జాయింట్‌ సీపీ ఖురేషి

రేవ్‌ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్‌ జాయింట్‌ సీపీ ఖురేషి స్పందించారు. అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పార్టీ నిర్వహించారు. ఫామ్‌ హౌస్‌ మేనేజర్‌ కార్తీక్, రాజ్ పాకాలపై కేసు నమోదు చేశాం. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ  రాజ్ పాకాల నిర్వహించారు. విదేశీ మద్యం లభించడంతో అయన ఇంట్లో సోదాలు చేయాలి. ఫామ్‌హౌస్‌ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్‌ పాకాల పరారీలో ఉన్నారు. ఆయన విల్లాకు తాళం వేసి ఉంది.  

సీసీటీవీ ఫుటేజ్‌ రిలీజ్‌ చేయాలి
ఫామ్‌ హౌస్‌ ఓనర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి కుమ్మక్కు కాకపోతే వెంటనే సీసీ టీవీ ఫుటేజీ రిలీజ్‌ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. జన్వాడ్‌ ఫామ్‌హౌస్‌లోనే ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని అన్నారు. రేవ్‌ పార్టీలో వీఐపీల పిల్లలు ఉన్నారని వార్తలొస్తున్నాయని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు కాకపోతే డీజీపీ జితేందర్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీ సీసీటీవీ ఫుటేజ్‌ వెంటనే రిలీజ్‌ చేయాలని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement