raghu nandan rao
-
రేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఆగ్రహం
Janwada Farm House Party Updates :తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిగ్గా మారింది. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న ఫామ్‌హౌస్‌లో రాజ్ పాకాల శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేని మద్యాన్ని గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ పోలీసుల దాడులతో రాజ్ పాకాల పరారీలో ఉన్నారని తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషి తెలిపారు. 6.00pmతలసాని శ్రీనివాస్ యాదవ్కక్ష సాధింపు చర్యలు సరికాదుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంఅనేక సమస్యలతో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు... వాటిపై దృష్టి సారించాలిప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై కేటీఆర్ ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రలుగంట గంటకు మారుతున్న ఎఫ్ఐఆర్లు.. కారణం ఏమిటిఎలాంటి సర్చ్ వారెంట్ లు లేకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారుప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకాడేది లేదువేముల ప్రశాంత్ రెడ్డి కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారుకేటీఆర్ బావమరిది సొంతంగా ఫామ్ హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారుజన్వాడలో ఏం దొరకలేదుగచ్చిబౌలిలో రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ చేస్తున్నారుకేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారురాజ్ పాకాల ఇంట్లోకి లాయర్లను పంపించాలిపోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారుప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉందికేటీఆర్ పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఉందిసబితా ఇంద్రారెడ్డితెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దాపోలీసు కుటుంబాలు రోడ్డు ఎక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదురాజ్ పాకాల విషయంలో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేశారుసెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎట్లా చేస్తారుప్రభుత్వం కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తోందితెలంగాణలో పండుగలు వచ్చినప్పుడు దావత్ లు చేసుకోవడం కామన్ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదుశ్రీనివాస్ గౌడ్ తెలంగాణలో శుభకార్యం జరిగితే ప్రతి ఇంట్లో మందు పార్టీ ఇస్తారుతెలంగాణలో కక్షపూరిత రాజకీయాల లేవుతెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురాకండిలేనిపోని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారు5:30pmరేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఆగ్రహంరేవ్ పార్టీ చెడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుసీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు.అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు5:10pmశైలేంద్ర పాకాల ఇంట్లో తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ పోలీసులుఓరియన్విల్లాకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు4:40pmహైదరాబాద్ ఓరియన్ విల్లా వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒరియన్ విల్లాలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై బీఆర్ఆర్ఎస్ నేతలు తిరగబడ్డారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను,మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.3:40pmఒరియన్ విల్లాస్‌లో ఉద్రిక్తతరాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎక్సైజ్ అధికారూలుకేటీఆర్ విల్లా పక్కనే ఉన్న రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల విల్లాఎక్సైజ్ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నేతల వాగ్వాదంసెర్చ్ వారెంట్ చూపాలని ఎక్సైజ్ పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదంఎక్సైజ్ పోలీసులు జేబులు తనిఖీ చేశాక లోపలకి పంపిస్తాం అంటున్న బీఆర్ఎస్ నేతలుతమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బీఆర్ఎస్ వాదన 3:21pmరాయదుర్గం ఓరియన్ విల్లాస్‌కు చేరుకున్న పోలీసులురాజ్ పాకాల ఉంటున్న విల్లా నెంబర్ 40కి తాళం వేసి ఉన్నట్లు పోలీసుల గుర్తింపుఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులుపోలీసుల దాడులతో ఓరియన్ విల్లా దగ్గర ఉద్రిక్తతనోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహిస్తున్నారని బీఆర్ ఎస్ నేతల ఆందోళనఎక్సైజ్ అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదంఎలాంటి నోటీసులు లేకుండా ఇంటిని తడిఖీలు ఎలా చేస్తారంటు ప్రశ్ననోటీసులు చూపించాలని డిమాండ్కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తోందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం 2:55pmరాజేంద్ర నగర్ డీసీపీ రాజ్ పాకాల ఫామ్ హౌస్‌పై నిన్న రాత్రి దాడి చేశాంలోకల్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులతో కలిపి ఆకస్మిక తనిఖీలు చేశాంపార్టీలో మొత్తం 35 మంది ఉన్నారువీరిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారుఏడు విదేశీ మద్యం బాటిల్స్‌తో పాటు 10 దేశీయ మధ్య బాటిళ్లు స్వాధీనంబాటిల్స్తో పాటు నిషేధిత గేమింగ్ వస్తువులు స్వాధీనంఅందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించంవిజయ్ మద్దూరి కొకైనే పాజిటివ్ వచ్చిందివిజయ్ మద్దూరికి రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాంపార్టీ నిర్వహించిన రాజ్ పాకాల పైన గేమింగ్ యాక్ట్ కింద మోకిలా పీఎస్‌లో కేసు నమోదు చేశాంపార్టీకి ఎక్సైజ్ నుండి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి ఎక్సైజ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారుమోకిలా పీఎస్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశాం2:53 pmకేటీఆర్‌ను ఇరికించాలని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందహామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుకేటీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారుకేటీఆర్ బావమరిది స్వంత ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారుస్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారుఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారుఅధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారురిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదలంరేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారుసొంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దాకేటీఆర్పై బురదచల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారురాజ్ పాకాల కొత్త ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారురాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్, కేటీఆర్ సతీమణి లేరుకేటీఆర్ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారురేవంత్ రెడ్డి డైవర్షన్‌లో ఇది జరుగుతోందిరేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే రియాక్ట్ అవుతున్నారుబండి సంజయ్,రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారురేవంత్ రెడ్డి,బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారురేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు2:30pmరేవ్ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషిరేవ్ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషి స్పందించారు. అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పార్టీ నిర్వహించారు. ఫామ్ హౌస్ మేనేజర్ కార్తీక్, రాజ్ పాకాలపై కేసు నమోదు చేశాం. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ రాజ్ పాకాల నిర్వహించారు. విదేశీ మద్యం లభించడంతో అయన ఇంట్లో సోదాలు చేయాలి. ఫామ్‌హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. ఆయన విల్లాకు తాళం వేసి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలిఫామ్ హౌస్ ఓనర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాకపోతే వెంటనే సీసీ టీవీ ఫుటేజీ రిలీజ్ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. జన్వాడ్ ఫామ్‌హౌస్‌లోనే ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని అన్నారు. రేవ్ పార్టీలో వీఐపీల పిల్లలు ఉన్నారని వార్తలొస్తున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు కాకపోతే డీజీపీ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ సీసీటీవీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయాలని అన్నారు. -
‘పీవోకేను కలుపుకున్నాకే కశ్మీర్లో ఎన్నికలు’
సాక్షి, ఆదిలాబాద్ : గత 70 ఏళ్లు భారత దేశ చరిత్ర వక్రీకరణకు గరవుతోందనీ, కుహానా మేధావులు ఎందరో దీనికి కారణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు విమర్శించారు. శనివారం ఆదిలాబాద్‌లో టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ఆర్టికల్ 370 రద్దుపై చర్చాగోష్టి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఆంగ్లేయుల కుటిల పన్నాగంతోనే భారతదేశం విభజనకు గరైందన్నారు. రాజా హరిసింగ్ పాలనలో ఉన్న కశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకునే దుశ్చర్యకు పాక్ పాల్పడిందన్నారు. నాటి నెహ్రూ ప్రభుత్వం షేక్ అబ్దుల్లాకు అనుకూలంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. అబ్దుల్లాను అంబేద్కర్ వద్దకు పంపించి ఆర్టికల్ 370 ని రాజ్యాంగంలో చొప్పించే ప్రయత్నం చేయగా, అంబేద్కర్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని తెలియజేశారు. దాంతో రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులైన గోపాలకృష్ణ అయ్యంగార్ ద్వారా వాళ్లు అనుకున్నది సాధించారని పేర్కొన్నారు. అయితే 370ని రద్దుచేసే అంశం కూడా అదే క్లాజ్‌లో ఉందని, దాని ద్వారానే నేడు రద్దు సాధ్యమైందని వివరించారు. స్థానిక ప్రజల కోరిక మేరకే లడాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశారన్నది గుర్తుంచుకోవాలన్నారు. అన్ని వర్గాల మేలుకోసం కశ్మీర్లో రిజర్వేషన్ల సవరణ, సమానత్వమే జనసంఘ్, బీజేపీల ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో తదుపరి ఎన్నికలు పీవోకేను కలుపుకునే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. 370 రద్దుతో ప్రజల్లో హర్షం, కాంగ్రెస్‌లో అసహనం మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి కానీ మోదీ ప్రధాని అయ్యాక అవి మచ్చుకైనా కానరావట్లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే 370 ఆర్టికల్ రద్దుపై తనకు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతోనే ముస్లిం మహిళలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, పార్టీ పార్లమెంట్ కన్వీనర్ ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
'అందుకే తెరపైకి హైకోర్టు విభజన'
హైదరాబాద్: మల్లన్న సాగర్ అంశాన్ని పక్కదారి పట్టించడానికే కేసీఆర్ హైకోర్టు విభజన తెరమీదికి తీసుకువచ్చారని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, మల్లన్న సాగర్ రైతులు రోడ్డుపైకి వస్తే కేసీఆర్‌కి మనస్తాపం కలగలేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై కవిత సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ కార్పొరేటర్స్‌కి ఆప్షన్స్ ఇవ్వవచ్చు కానీ, 50 మంది న్యాయమూర్తులకు ఇస్తే తప్పు ఏమిటి అని ప్రశ్నించారు. హైకోర్టు విభజన విషయం ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందన్నారు. హైకోర్టు విభజనపై ఢిల్లీలో కేసీఆర్ దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు. 123 జీఓ మంచిదా లేక 2013 చట్టం మంచిదా అనే విషయంపై భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు బహిరంగ చర్చకు వస్తే చెప్పడానికి సిద్ధమని రఘునందన్ రావు సవాలు విసిరారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
చిల్లకల్లు (జగ్గయ్యపేట), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని చిల్లకల్లులో ఈ నెల 16న జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హాజరు కానుండటంతో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులతో కలసి గురువారం ఏర్పాట్లు పరిశీలించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం పక్కన ఉన్న సంతలో ఏర్పాటు చేస్తున్న సభావేదికను, ఎస్జీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలతో పాటు పేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రభాకరరావు, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన, వ్యవసాయ శాఖ జేడీ బాలునాయక్, డ్వామా పీడీ అనీల్ కుమార్, యువజన, క్రీడల శాఖ (కృషి) సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ శివశంకర్, జిల్లా వైద్యాధికారి సరసిజాక్షి, జిల్లా పంచాయతీ అధికారి ఆనంద్, డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 16న ఉదయం 10.30 గంటలకు చిల్లకల్లు రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం వరకు కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాలకు రోడ్డుమార్గాన వస్తారని చెప్పారు. అక్కడినుంచి హైదరాబాద్ వెళతారని అధికారులు తెలిపారు.