హైదరాబాద్: మల్లన్న సాగర్ అంశాన్ని పక్కదారి పట్టించడానికే కేసీఆర్ హైకోర్టు విభజన తెరమీదికి తీసుకువచ్చారని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, మల్లన్న సాగర్ రైతులు రోడ్డుపైకి వస్తే కేసీఆర్‌కి మనస్తాపం కలగలేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై కవిత సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ కార్పొరేటర్స్‌కి ఆప్షన్స్ ఇవ్వవచ్చు కానీ, 50 మంది న్యాయమూర్తులకు ఇస్తే తప్పు ఏమిటి అని ప్రశ్నించారు.
హైకోర్టు విభజన విషయం ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందన్నారు. హైకోర్టు విభజనపై ఢిల్లీలో కేసీఆర్ దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు. 123 జీఓ మంచిదా లేక 2013 చట్టం మంచిదా అనే విషయంపై భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు బహిరంగ చర్చకు వస్తే చెప్పడానికి సిద్ధమని రఘునందన్ రావు సవాలు విసిరారు.