neradigonda
-
ఆదిలాబాద్: కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలోని ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో వాళ్లందరినీ రిమ్స్‌కు తరలించారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఫుడ్ పాయిజన్ ఘటనపై స్కూల్ నిర్వాహకుల స్పందన తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాణం తీసిన కోడిగుడ్డు -
పేద విద్యార్థికి ఎన్నారై చేయూత.. ఐఐటీలో సీటు
ఇచ్చోడ(ఆదిలాబాద్ జిల్లా): పేద విద్యార్థికి చేయూతనిచ్చి ఓ ఎన్నారై ఉదారత చాటుకున్నాడు. నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన అడె సుదర్శన్–విజయ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరి కుమారుడు చంద్రకాంత్ ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లోనూ సత్తాచాటాడు. ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 787 ర్యాంక్ సాధించాడు. ఐఐటీ జోధ్‌పూర్‌లో సీటు లభించింది. సరస్వతీ కరుణ ఉన్నా లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చంద్రకాంత్ ఐఐటీలో ప్రవేశరుసుం కట్టే ఆర్థిక స్తోమత లేక ఇంటివద్దనే ఉండి పోయాడు. విషయం తెలుసుకున్న ఇచ్చోడకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ మౌనిక రాథోడ్ ఇటీవల ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. మంత్రి సన్నిహితుడి ద్వారా విషయం తెలుసుకున్న యూఎస్‌లో స్థిరపడ్డ ఎన్నారై శశికాంత్ స్పందించాడు. కనపర్తి ఐఐటీ జోధ్‌పూర్‌లో ప్రవేశరుసుం కట్టి చంద్రకాంత్‌ను చేర్పించాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు, సాయం అందించిన ఎన్నారై శశికాంత్‌కు, అలాగే మౌనిక రాథోడ్‌కు చంద్రకాంత్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు?) -
చెల్లిపై వేధింపులు: బావకు నచ్చచెప్పేందుకు వెళ్లిన అన్నపై కత్తి దాడి
నేరడిగొండ (బోథ్): బావమరిదిపై కత్తితో బావ దాడి చేసిన ఘటన మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌సుమన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌తో జుబేర్ గత రెండు సంవత్సరాల క్రితం చెల్లె వివాహం జరిపారు. మూడు రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా జుబేర్ బావను నచ్చజెప్పడానికి ఆయన చికెన్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ మాటామాట పెరగడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో బావ ఇమ్రాన్‌ఖాన్ మరిది జుబేర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన మెడ, చెవిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జుబేర్‌ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్ చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు -
అల్లు అర్జున్‌కు ఎలా అనుమతి ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్ : సినీ హీరో అల్లు అర్జున్ శనివారం కుటుంబ సమేతంగా కుంటాల జలపాతాన్ని సందర్శించారు. జలపాతం జాలువారే అందాలను తిలకించారు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను, ఇక్కడి ప్రకృతి అందాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివారులో గల హరితవనం పార్కులో సఫారీలో తిరుగుతూ అందాలను వీక్షించారు. అంతకు ముందు హరితవనం పార్కులో మొక్కలు నాటారు. అయితే, కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటన్న విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఇటీవల నిర్మాత దిల్ రాజు కుటుంబంతో పాటు కుంటాల జలపాతాన్ని సందర్శించారు. జలపాతం వద్ద పర్యాటకులను అనుమతించని అటవీ శాఖ అధికారులు సెలబ్రిటిలు, ప్రముఖులకు మాత్రం దగ్గరుండి జలపాతం అందాలను చూపించడం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. (చదవండి : మళ్లీ డ్రగ్స్ కలకలం.. తెరపైకి రకుల్) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జలపాతం వద్ద షూటింగ్ సందడి
నేరడిగొండ(బోథ్): రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద “నీలి నీలి’ అనే పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణకు హీరో నవికేత్, హీరోయిన్ నికితలు హాజరయ్యారు. డైరెక్టర్ బాబీ మాస్టర్, ఎంఎంపీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ చిత్రీకరణ జరిగింది. త్వరలోనే ఇక్కడ సినిమా షూటింగ్ నిర్వహించనున్నట్లు సినిమా బృందం సభ్యులు తెలిపారు. కుంటాల జలపాతంలో ఈ పాట చిత్రీకరణ బాగుంటుందన్నారు. -
వచ్చిరాని వైద్యం.. ఆపై నిలువు దోపిడీ
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్) : గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాథమిక చికిత్స అందించే వారు ఆర్ఎంపీలు, పీఎంపీలు. వారికున్న అవగాహన, అనుభవం మేరకు చికిత్సనందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే వ్యక్తులు. కానీ ప్రస్తుతం కొందరు అక్రమార్జనే ధ్యేయంగా కనీస పరిజ్ఞానం లేకున్నా, అవగాహన లేకున్నా డాక్టర్ల అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొద్ది రోజుల పాటు ఏదో ఒక ఆస్పత్రిలో పనిచేసి వైద్యుల్లా చలామణి అవుతున్నారు. అవసరమున్నా లేకపోయినా రకరకాల మందులు, టెస్టులు రాసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. దీంతో ప్రథమ చికిత్సకు ఆర్ఎంపీ వద్దకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఆస్పత్రికి వెళ్లేలోపు కావాల్సిన ప్రథమ చికిత్స అందిస్తుంటారు. కానీ వారిలోని కొందరు అక్రమార్జన బాట పట్టారు. అవగాహన లేకపోయినా, వైద్యం అందిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కాసుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైద్యం కోసం ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే స్థాయికి చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరిజ్ఞానం లేకపోయినా వైద్యం.. గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు ఆర్ఎంపీలు పరిజ్ఞానం లేకుండానే వైద్యులుగా చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఆర్ఎంపీలు, పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స చేయడానికి మాత్రమే అర్హులు. జ్వరం, జలుబు లాంటి వాటికి చిన్న చిన్న మాత్రలు ఇస్తే సరిపోతుంది. కానీ చాలా మంది పరిధి దాటి వైద్యం చేస్తున్నారు. అవగాహన లేక కొంత, రోగం తొందరగా తగ్గితే చాలా మంచి డాక్టర్‌గా పేరు సంపాదించాలన్న ఆత్రుత కొంత వెరసీ అవసరమున్న దానికంటే ఎక్కువ మోతాదు మందులు ఇస్తున్నారు. ఫలితంగా రోగి బలహీన పడిపోవడమే కాకుండా ఎక్కువ రోజులు రోగాలతో సావాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చిన జబ్బేమో కానీ వైద్యం తర్వాత బిల్లు చూస్తే కొత్త రోగం రావడం ఖాయమని రోగులు అంటున్నారు. కొద్ది రోజులే కాంపౌండర్.. పెద్ద ఆస్పత్రుల్లో ఐదారు నెలల పాటు కాంపౌండర్‌గా పనిచేయడం, కొంత మేర వైద్య పరిజ్ఞానం సంపాదించి సొంత ఊరిలో ఆర్ఎంపీలుగా అవతారం ఎత్తడం పరిపాటిగా మారింది. ఇంజక్షన్ వేయడం వస్తే చాలు వైద్యం నిర్వహించేందుకు ముందడుగు వేస్తున్నారు. కాంపౌండర్‌గా పనిచేసిన సమయంలో తెలిసిన కాస్తో, కూస్తో పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులున్నప్పటికి వారు ప్రైవేటుకు ఎక్కువగా ప్రాధాన్యమివ్వడం, సమయపాలన పాటించకపోవడం, వచ్చిన రోగులను పట్టించుకోకపోవడంతో రోగులు స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు గ్రామీణ వైద్యులు తెలిసీ తెలియని వైద్యాన్ని కొంతమేర నిర్వహించి, పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రాథమిక చికిత్స నుంచి మొదలుకొని ఆస్పత్రి నుంచి బయటికి వచ్చే వరకు అంతా తామై నడిపిస్తున్నారు. -
‘పవర్’ లేక పరేషాన్!
సాక్షి, నేరడిగొండ(బోథ్): ప్రజల ఆశీర్వాదంతో పదవి దక్కించుకున్న సర్పంచులకు చెక్ పవర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ‘మాకు చెక్ పవర్ ఇవ్వండి’ సారూ అంటూ నూతన సర్పంచులు అధికారుల వద్ద ప్రాధేయపడుతున్నారు. సర్పంచ్‌గా గెలిచినా.. శిక్షణ పూర్తి చేసిన తర్వాత చెక్ పవర్ ఇస్తామన్నారు. ఆదిలాబాద్‌లో ఐదు రోజుల పాటు పంచాయతీరాజ్ చట్టంపై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నా చెక్‌పవర్ ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో సర్పంచులు నిరాశ చెందుతున్నారు. ఎన్నికలకు ముందు జాయింట్ చెక్‌పవర్ అన్నారు. గెలిచాక సర్పంచులకు కూడా చెక్‌పవర్ ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. అప్పుల పాలవుతున్న సర్పంచులు జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉండగా 465 పంచాయతీల్లో ఎన్నికలు జరిగి 465 మంది సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వారికి చెక్‌పవర్ లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. నేరడిగొండ గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు సర్పంచే తన జేబులో నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. అలాగే కుమారి గ్రామపంచాయతీ సర్పంచ్ సుమారు రూ.లక్షకు పైగా వివిధ పనుల నిమిత్తం ఖర్చు పెట్టారు. ఈ గ్రామపంచాయతీల సర్పంచులే కాకుండా జిల్లాలో వారే భరిస్తుండడంతో ఈ పదవి తలకుమించిన భారంగా మారిందని లోలోన మదన పడుతున్నారు. సర్పంచులుగా గెలిచి ఇన్నిరోజులైనా చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీ పేరిట ఉన్న అకౌంట్లలోని డబ్బులను తీయలేని పరిస్థితి నెలకొంది. గెలిచిన ఉత్సాహంతో గ్రామాల్లో డ్రెయినేజీలు శుభ్రం చేయించడం, తాగునీటి పైపుల లీకేజీలు మరమ్మతులు చేయించడం, ఇతర పనుల కోసం మేజర్ గ్రామాల్లో రూ.లక్షల్లో, చిన్న గ్రామాల్లో రూ.50వేలకుపైగానే ఖర్చు చేశారు. పంచాయతీ సిబ్బందికి కూడా ఆరు నెలలుగా జీతాలు ఇచ్చేది ఉంది. గ్రామాల్లో తక్కువ జీతాలకు పనిచేసే పారిశుధ్య కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జీతాల కోసం పనులు మానుకోవడం, ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతుండగా త్వరలో చెక్‌పవర్ వస్తుంది. రాగానే ఒకేసారి జీతాలు ఇస్తామని వారిని శాంతింపజేస్తున్నారు. తాగునీటి పైపులు లీకైనా, ఇతర అవసరాల కోసం నిత్యం రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఇదే విషయంపై ఇన్చార్జి ఎంపీడీఓ ప్రభాకర్‌ను సంప్రదించగా జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వస్తేనే చెక్‌పవర్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. లక్షలు ఖర్చు చేశాం చెక్‌పవర్ కోసం అధికారుల వద్ద ప్రాధేయ పడాల్సిన పరిస్థితి వచ్చింది. గెలిచిన ఉత్సాహంతో గ్రామంలో రూ.లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాం. శిక్షణ కూడా పొందాం. చెక్‌పవర్ ఇస్తే నిధులు డ్రా చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. – అల్లూరి ప్రపుల్‌చందర్‌రెడ్డి, సర్పంచ్, తేజాపూర్ -
ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, నేరడిగొండ(బోథ్): ఈత సరదా బాలుడి ప్రాణం తీసింది. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం నవేదిరిలో చెరువులో మునిగి విద్యార్థి మృతిచెందిన సంఘటన మరువక ముందే నేరడిగొండ మండలంలో మరో ఘటన చోటు చేసుకుంది. నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన చౌహాన్ దశరథ్(9), విజయ్, మహిపాల్, పవన్ స్నేహితులు. అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుకుంటున్నారు. గురువారం ఒంటిపూట బడి అనంతరం వెంకటాపూర్ సమీపంలో గల కడెం వాగులో ఈత కోసం వెళ్లారు. ఈ నలుగురు విద్యార్థులు ఒడ్డుపై బట్టలు విడిచి వాగులోకి దిగారు. అదే సమయంలో దూరం నుంచి వీరిని గమనించిన మత్సకారుడు బట్ట ఆశన్న కేకలు వేస్తూ వెంటనే అక్కడకు చేరుకున్నాడు. కాని అప్పటికే నీటిలో మునిగిన దశరథ్ ఊపిరాడక మృతిచెందాడు. మిగతా వారిని కాపాడిన మత్స్యకారుడు.. విద్యార్థులు వాగులోకి దిగుతుండడాన్ని గమనించిన మత్స్యకారుడు బట్ట ఆశన్న కేకలు వేస్తూ వారిని హెచ్చరించాడు. నీటిలోకి దిగొద్దని అరిచాడు. కాని ఆశన్న అక్కడకు వచ్చే లోపే విద్యార్థులు నీటిలోకి దిగారు. ఆశన్న వెంటనే నీటిలోకి దిగి విజయ్, మహిపాల్, పవన్‌ను కాపాడాడు. ఊపిరాడక కొట్టుకుంటున్న దశరథ్ను పైకి లాగినా ఫలితం లేకుండా పోయింది. మత్స్యకారుడు బట్ట ఆశన్న గ్రామంలో విషాదం.. చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన చౌహాన్ వందన– సంజుకు ఇద్దరు కుమారులు, కుమా ర్తె ఉన్నారు. వీరిద్దరు గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్నారు. మొదటి సంతానం దశరథ్ చురుకుగా ఉండేవాడు. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండడంతో మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈత కోసం వాగుకు వెళ్లి ఇలా విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఘటన స్థలానికి ఎస్సై భరత్‌సుమన్ చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
కమీషన్ల కోసమే..మిషన్ కాకతీయ : కాంగ్రెస్
నేరడిగొండ : పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ అనిల్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాల భూమి అని ఎన్నో పథకాలను అమలు చేస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి నేటికీ ఒక్కటికూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు మాత్రం తమ కమీషన్ల కోసం అమలు చేస్తూ మిగితా వాటిని మరిచిపోయారని విమర్శించారు. గ్రామాల్లో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కార్యకర్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మార్కెట్‌యార్డులో కందులు అమ్మిన రైతులకు నేటికీ డబ్బులురాక ఆందోళన చెందుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ఇప్పుడు శనగపంటను అమ్ముదామన్నా రైతులకు ఇబ్బందులే ఉన్నాయన్నారు. ‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుల వద్దనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, త్వరలోనే జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో బోథ్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అల్లూరి ప్రపుల్‌చందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల కన్వీనర్ సాబ్లే నానక్‌సింగ్, నాయకులు ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, ఆడె వసంత్‌రావు, సాబ్లే ప్రతాప్‌సింగ్, గులాబ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ల కోసం ఆందోళన
నేరడిగొండ : అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళన చేపట్టారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంబేకర్ పండరి మద్దతు తెలిపి మాట్లాడారు. అర్హుల పింఛన్లు రద్దు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అర్హులందరికీ పింఛన్లు అందేవరకూ ఉద్యమిస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో మహ్మద్ రియాజొద్దీన్‌కు పలువురు పింఛన్ల కోసం దరఖాస్తులు అందజేశారు. ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ మండల అధ్యక్షులు గోనే అడెల్లు, సోలంకి జగన్ సింగ్, నాయకులు షేక్ మహబూబ్, రెహ్మతుల్లా, నర్సయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ ఇన్చార్జి ఎంఈవో వ్యవస్థ
నేరడిగొండ : ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరును, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చే మండల విద్యాధికారుల నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య గాడి తప్పుతోంది. ఇదీ పరిస్థితి జిల్లాలో 52 మండలాలకు గానూ కేవలం మూడు మండలాల్లోనే రెగ్యులర్ విద్యాధికారులు ఉన్నారు. దీంతో మిగతా 49 మండలాల్లో ఇన్‌చార్జీలే విద్యాధికారులుగా కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్‌లో పనిచేసే సీనియర్ ప్రధానోపాధ్యాయులైన పీజీ హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎంఈవోల నియామకంపై దృష్టి సారించకపోవడంతో ప్రాథమిక విద్య అటకెక్కింది. 49 ఇన్‌చార్జీలే. కెరమెరి, బెజ్జూర్, తిర్యాణి మినహా 49 మండలాలకు ఇన్‌చార్జీలే ఎంఈవోలుగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో విద్యా పథకాల అమలు, పాఠశాలల పర్యవేక్షణ జరుగుతోంది. సీనియర్ ఉపాధ్యాయులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో పనిభారంతో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు పాఠశాలలపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాఠశాలలో బోధన సక్రమంగా జరగక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల్లో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడే పాఠశాలల్లోని విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఇన్చార్జి ఎంఈవోల పాలనను ఆసరాగా చేసుకొని కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆలస్యంగా వస్తూ ముందు వెళ్లిపోవడం జరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారైతే ఆసలు పాఠశాలలకే వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం ఇన్చార్జి ఎంఈవోల వ్యవస్థను ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫీజుల వివరాలు తెలిపే పట్టికను పాఠశాలల్లో ప్రదర్శించడం లేదు. జిల్లాలోని అనేక పాఠశాలకు అనుమతులు కూడా లేవనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరికొన్నింటిలో కనీస వసతలు, ఆట స్థలాలు, తదితర నిబంధనలు పాటించకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్న ఇన్చార్జి ఎంఈవోలు చూసీ చూడనట్లు ‘మామూలు’గా వ్యవహరిస్తూనే విమర్శలున్నాయి. -
వడగండ్లు, గాలివాన బీభత్సం
నేరడిగొండ, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కురిసిన ఈదురుగాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షంతో ఇండ్ల పైకప్పులు లేచిపోయి అల్లంత దూరంలో పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. బుగ్గారం, చిన్నబుగ్గారం, నేరడిగొండ, బంధం, దూదిగండి, గుత్పాల, సావర్గాం, కిష్టాపూర్, సావర్గాం, కుంటాల తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో ప్రజలు భయపడ్డారు. కాగా కొందరి ఇండ్ల పైకప్పులు, రేకులు ఈదురు గాలులకు లేచి గ్రామ శివారులో పడ్డాయి. సావర్గాం గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ తీగలన్నీ గ్రామంలో పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూరగాయల పంటలు, మామిడి రైతులకు వడగండ్ల వర్షం పెను నష్టం కలిగించింది. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలుకు సంబంధించి పైకప్పు రేకులు ఈదురు గాలులకు లేచిపోయాయి. రెండు గంటల పాటు కురిసిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వడగండ్ల వర్షంతో ఎంత నష్టం వాటిల్లిందనేది పూర్తిస్థాయిలో తెలియరాలేదు. -
రూ.6.87లక్షలు నగదు పట్టివేత
రోల్మామడ(నేరడిగొండ), న్యూస్‌లైన్ : మండలంలోని రోల్మామడ టోల్‌ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రూ.6.87లక్షలు నగదు పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు కారులో బట్టల వ్యాపారి ఒకరు డబ్బు తరలిస్తుండగా తనిఖీల్లో లభించింది. తనిఖీ సమయంలో రూ.6,87,650 నగదు బయటపడింది. ఈ డబ్బుకు సంబంధించిన ఆధారాలు, సరైన లెక్కలను సదరు వ్యాపారి చూపకపోవడంతో రెవెన్యూ శాఖ డెప్యూటీ తహశీల్దార్, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు సమర్పిస్తే డబ్బు అందజేస్తామని వ్యాపారికి సూచించారు. తనిఖీల్లో ఎస్సై నరేశ్‌కుమార్, పీఆర్ జేఈ వేణుగోపాల్‌రెడ్డి, రెవెన్యూశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కు‘బడి’
నేరడిగొండ, న్యూస్‌లైన్ : మండలంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మొక్కుబడిగా మారింది. ఫలితంగా విద్యార్థులు ప్రైవేటు బడి బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మండలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 34, టీడబ్ల్యూపీఎస్లు 25, జెడ్పీఎస్ఎస్లు 5, ఎంపీయూపీఎస్‌లు 5, ఆశ్రమ పాఠశాలలు 3, కేజీబీవీ, మినీ గురుకులం ఒక్కొక్కటి ఉన్నాయి. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదు. మరికొందరు సమయపాలన పాటించ డం లేదు. స్థానికంగా పదో తరగతి వరకు చదివిన ఒకరిని అనధికారికంగా నియమిస్తూ విద్యాబోధన చేయిస్తున్నారు. నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తూ తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. పక్షం రోజులకోసారి పాఠశాలకు వెళ్లి రిజిష్టర్‌లో సంతకాలు చేస్తూ తాము నియమించిన వారికి సూచనలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శిస్తే ఏ కారణం చెప్పాలనే విషయమై జాగ్రత్తలు చెబుతున్నారు. మండల విద్యాశాఖాధికారి పర్యవేక్షణ, తనిఖీలు లోపించడంతో పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఎంఈవోల సమావేశంలో కలెక్టర్ అక్షింతలు వేసినా వారి తీరు మారడం లేదు. దర్భ గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఉండగా రెగ్యులర్ ఉపాధ్యాయుడు మౌలానా విధులకు దూరంగా ఉంటున్నారు. రూ.2వేలు వేతనంగా చెల్లిస్తూ అనధికారికంగా ఓ మహిళను బోధకురాలిగా నియమించారు. ఆమె తన ఇష్టం వచ్చిన సమయంలో పాఠశాల తెరుస్తుండడంతో విద్యార్థుల చదువు అటకెక్కుతోంది. గ్రామస్తులు ఈ విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లినా ఉపాధ్యాయులను వెనకేస్తూ మాట్లాడడం అనుమానాలకు తావిస్తోంది. వడూర్‌లోని ఉర్దూ ప్రభుత్వ ఎంపీపీఎస్ పనితీరు కూడా అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఉండగా 44మంది విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఇద్దరు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించగా ఒక్కరే విధుల్లో చేరారు. ఉపాధ్యాయులు తరచూ పాఠశాలకు రాకపోవడం, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ మొక్కుబడిగా పాఠశాలకు రావడంతో మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిరోజు ఉదయం విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మధ్యాహ్నం వరకు ఆటలాడి భోజనం చేశాక ఇంటి బాట పడుతున్నారు.