రూ.6.87లక్షలు నగదు పట్టివేత | RS.6.87 lacks caught by police | Sakshi

రూ.6.87లక్షలు నగదు పట్టివేత

Mar 15 2014 1:19 AM | Updated on Sep 2 2017 4:42 AM

రూ.6.87లక్షలు నగదు పట్టివేత

రూ.6.87లక్షలు నగదు పట్టివేత

మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రూ.6.87లక్షలు నగదు పట్టుకున్నారు.

 రోల్‌మామడ(నేరడిగొండ), న్యూస్‌లైన్ : మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రూ.6.87లక్షలు నగదు పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు కారులో బట్టల వ్యాపారి ఒకరు డబ్బు తరలిస్తుండగా తనిఖీల్లో లభించింది. తనిఖీ సమయంలో రూ.6,87,650 నగదు బయటపడింది.

 

ఈ డబ్బుకు సంబంధించిన ఆధారాలు, సరైన లెక్కలను సదరు వ్యాపారి చూపకపోవడంతో రెవెన్యూ శాఖ డెప్యూటీ తహశీల్దార్, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు సమర్పిస్తే డబ్బు అందజేస్తామని వ్యాపారికి సూచించారు. తనిఖీల్లో ఎస్సై నరేశ్‌కుమార్, పీఆర్  జేఈ వేణుగోపాల్‌రెడ్డి, రెవెన్యూశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement