checkpost
-
చెక్‌పోస్టు ఉద్యోగం భలే కిక్కు!
కర్నూలుకు చెందిన గిరిబాబుతో పాటు మరో నలుగురు యువకులు శనివారం అలంపూర్‌కు వెళ్లి మద్యం సేవించి తిరిగి వచ్చేటప్పుడు కారులో రాయల్‌స్టాగ్ మద్యం బాటిళ్లను తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వాహనం తనిఖీ చేశారు. కారులో ఆరు రాయల్‌స్టాగ్ ఫుల్ బాటిళ్ల మద్యం పట్టుబడగా వాటిని నొక్కేసి కారును వదిలేశారు.కర్నూలు: కర్నూలు శివారులోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులో సెబ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ నుంచి జిల్లాలోకి అక్రమ మద్యం రవాణా కాకుండా నిరోధించేందుకు పంచలింగాల క్రాస్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటైంది. గతంలో సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులతో పాటు అధిక సంఖ్యలో సిబ్బంది నిరంతరం వాహనాలు తనిఖీ చేస్తూ మద్యం అక్రమ రవాణాను కట్టడి చేశారు. ఎన్నికల సమయంలో కూడా ఈ చెక్‌పోస్టు వద్ద సివిల్, సెబ్ పోలీసులతో పాటు రవాణా, ఇతర శాఖల అధికారులతో కలసి నిరంతరం వాహనాలు తనిఖీ చేపట్టారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సివిల్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు తమ విధులకు వెళ్లిపోవడంతో కేవలం సెబ్ పోలీసులు మాత్రమే చెక్‌పోస్టులో విధుల్లో ఉంటున్నారు. అక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో తనిఖీల్లో పట్టుబడిన మద్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు షిఫ్టులలో ఇక్కడ సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ సిబ్బంది కొరత వల్ల కొంతమంది మాత్రమే ఉంటున్నారు. అక్కడ విధులు నిర్వహించే ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ప్రతిరోజూ పట్టుబడిన మద్యం బాటిళ్లను వారు ఉంటున్న గదుల్లో భద్రపరచి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.👉 అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడితే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి మద్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి రవాణాదారులపై కేసు నమోదు చేయాల్సి ఉంది.👉 అయితే కొంతకాలంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సెబ్ సిబ్బంది అక్రమ సంపాదనకు అలవాటు పడి చేతివాటం ప్రదర్శిస్తున్నారు.👉 సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ కొంతకాలంగా సిబ్బంది పట్టుబడిన మద్యాన్ని రహస్య ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.👉 ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్‌ను వివరణ కోరగా విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీల సందర్భంగా మద్యం నొక్కేసినట్లు విచారణలో బయటపడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అక్కడ విధులు నిర్వహించాల్సిన ఉన్నతాధికారుల పనితీరుపైనా విచారణ జరిపిస్తానని తెలిపారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ/భదర్వా: కశ్మీర్లో మళ్లీ ఉగ్ర ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. కథువా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమారిస్తే, దోడా జిల్లాలో చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించి పారిపోయారు. శివ్‌ఖోరీ నుంచి కాత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగి 9 మంది మరణించిన ఘటన మరువకముందే మళ్లీ కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. వివరాలను జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. ‘‘మంగళవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు సైదా సుఖాల్ గ్రామంలో చొరబడి ఒక ఇంట్లో తాగేందుకు నీళ్లు అడగడంతో గ్రామస్థులు భయపడి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన కబీర్ దాస్ అనే సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఒక పౌరునికి సైతం గాయాలయ్యాయి.చెక్‌పోస్ట్‌పై గుళ్ల వర్షందోడా జిల్లాలోని భదర్వా–పఠాన్‌కోట్ రోడ్డులోని ఛత్తర్గల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తాత్కాలిక సంయుక్త చెక్‌పోస్ట్‌ను ఆర్మీ, పోలీసులు ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి ఆ చెక్‌పోస్ట్ దాటేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
చెక్‌పోస్టులో భారీగా మద్యం పట్టివేత
తడ (తిరుపతి జిల్లా): ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. తాజాగా బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద బుధవారం పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కేరళకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా మద్యం రవాణా బట్టబయలైంది. పట్టుకున్న లారీని బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంలోని ఎస్ఈబీ కార్యాలయానికి తరలించి సరుకు లెక్కించారు. లారీలో మొత్తం 300 కేసుల (14,400 బాటిళ్లు) క్వార్టర్ బాటిళ్ల మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7.42 లక్షలుగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు లారీ, కేరళకు చెందిన డ్రైవర్ మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సరుకు పుదుచ్చేరిలోని బాలాజీ ఎంటర్ ప్రైజెస్, గ్లోబల్ బేవరేజెస్ పరిశ్రమ నుంచి వస్తున్న ‘ఆల్వేస్ సూపర్ స్ట్రాంగ్’ పేరుతో ఉన్న బ్రాందీ. దీనిని ఏప్రిల్ 30వ తేదీన తయారు చేసినట్టు సీల్ ఉంది. ఈ బ్రాండ్ నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ మద్యం వ్యాపారిదిగా ఎస్ఈబీ సిబ్బంది గుర్తించారు. -
మాడిగి అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం సీజ్
-
TSRTC: రాత్రివేళల్లోనూ శ్రీశైలం బస్సులు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ నెల 20 వరకు రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో ఘాట్ రోడ్ల వద్ద బస్సులను నిలిపి తిరిగి ఉదయం వేళల్లో ఫారెస్ట్ అధికారులు బస్సులను అనుమతించేవారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రిజినల్ రీజియన్ మేనేజర్ ఎ.శ్రీధర్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలపకుండా రాత్రివేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ఫారెస్ట్ అధికారి రాకేష్ మోహన్ డోపిడియాల్ ఈ నెల 20 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో బస్సులను అనుమతించిన ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!) -
కర్నూలులో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కర్నూలు ఎస్ఈబీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.3కోట్ల విలువైన 7 కేజీల బంగారం, రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా వీటిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కారులో నగదు, బంగారాన్ని హైదరాబాద్ నుండి బెంగళూరుకి తరలిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. -
మంచిర్యాల: తపాలాపూర్ చెక్‌పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం
-
భారీగా బంగారం, నగదు పట్టివేత
సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం, నగదును పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల 5లక్షల 35వేల 500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, బంగారం సీజ్ చేశారు. ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు తరలిస్తుండగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం -
చెక్‌పోస్టులో కరెన్సీ కట్టలు
సాక్షి, హోసూరు: తమిళనాడు సరిహద్దు జూజువాడి చెక్‌పోస్ట్‌లో శుక్రవారం అర్ధరాత్రి క్రిష్ణగిరి ఏసీబీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి లెక్కకు రాని రూ.2 లక్షల 14 వేల 120ను స్వాధీనపరుచుకొన్నారు. హోసూరు– బెంగళూరు జాతీయ రహదారి జూజువాడి వద్ద ఈ చెక్‌పోస్టుపై ఏసీబీ డీఎస్పీ క్రిష్ణరాజ్, ఇన్స్పెక్టర్ మురుగన్‌లు సోదాలు చేయగా భారీ మొత్తంలో లెక్కలు లేని నగదు బయటపడింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఆర్టీవో అధికారి సుబ్బురత్నంను విచారిస్తున్నారు. -
పెళ్లిళ్లకు వేదికగా సరిహద్దు చెక్‌పోస్ట్
చెన్నై : తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యంలోని ఎక్సైజ్ చెక్‌పోస్ట్ బుధవారం పండగ శోభను సంతరించుకుంది. సాధారణంగా ఆ చెక్‌పోస్ట్ ద్వారా నిత్యం ఇరు రాష్ట్రాల మధ్య సరకు రవాణా జరుగుతుంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ చెక్‌పోస్ట్ మూడు పెళ్లిళ్లకు వేదికగా మారింది. ఇలా మూడు పెళ్లిళ్లు ఒకే రోజు కొంత విరామంతో జరగడం విశేషం. వేదక్కని-ముత్తప్పరాజ్ కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు, తమిళనాడుకు చెందిన ముగ్గురు అబ్బాయిలతో పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. అయితే అదే సమయంలో కరోనా లాక్డౌన్ విధించడంతో వారు తొలుత వివాహలను వాయిదా వేసుకున్నారు. అయితే కరోనా ఎంతకాలం ఉంటుందో తెలియకపోవడంతో పెద్దలు తమ పిల్లలు ఎలాగైనా జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు.. వారి వారి తల్లిదండ్రులు ఇరు రాష్ట్రాల సరిహద్దులో పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇలా ముగ్గురు వధూవరులు.. అధికారులు అనుమతితో, పెద్దల ఆశీర్వాదంతో బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద ఏకమయ్యారు. ఇందుకు వారి కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కస్తూరి-నిర్మల్‌రాజ్ దాదాపు రెండు గంటల వ్యవధిలోనే ఈ మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సుకన్య-మణికందన్, వేదక్కని-ముత్తప్పరాజ్, కస్తూరి-నిర్మల్‌రాజ్ జంటలు వివాహ బంధంతో ఏకమయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని వారు ముందుగానే శానిటైజ్ చేసుకుని అక్కడికి తీసుకువచ్చారు. పెళ్లి తర్వాత నూతన వధువులు.. తమిళనాడులోకి తమ తమ అత్తవారి ఇళ్లకు చేరిన తర్వాత వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇదే చెక్‌పోస్ట్ వద్ద జూన్ 7వ తేదీన కూడా ఓ పెళ్లి జరిగింది. -
జెఎంజె కాలేజ్ వద్ద లారీ బీభత్సం
సాక్షి, వైఎస్సార్ : వైఎస్సార్ జిల్లా నగర శివార్లలో శుక్రవారం అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. జెఎంజె కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టు టెంట్‌లోకి ఒక లారీ దూసుకెళ్లింది. అయితే ఆ సయయంలో టెంట్లో ఎవరూ లేపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే టెంట్‌లోకి లారీ దూసుకెళ్లడంతో చెక్‌పోస్ట్ మొత్తం నేలమట్టమయింది. కాగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటాకా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా మరో ఘటనలో జిల్లాలోని పోరుమామిళ్ల మండలం నాగల కుంట్ల గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో ఒక్కసారి కరెంట్ షాక్ కావడంతో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. -
లాక్డౌన్: కానిస్టేబుల్‌పై లారీ డ్రైవర్ దాడి
సాక్షి, బోధన్ రూరల్: అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లడమే కాకుండా కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడో లారీ డ్రైవర్. కరోనా నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు జిల్లాలోకి రాకుండా నియంత్రిస్తున్నారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున బోధన్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ (పీబీ13ఏఎల్9637)ని పోలీసులు ఆపేందుకు యత్నించారు. అయితే, సదరు లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతివేగంగా దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు వెంబడించి లారీని పట్టుకుని వివరాలు సేకరిస్తుండగా పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్ గురుప్రీత్‌సింగ్ కర్రలతో దాడికి దిగాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ జీవన్ తలకు గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్ అహ్మద్ తెలిపారు. (మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది? ) సాక్షి, ఇందూరు(నిజామాబాద్ ): ఉద్యోగులు అవసరం లేకున్నా ఆన్ డ్యూటీ స్టిక్కర్లు వాహనాలపై వేసుకుని బయట తిరిగితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అధికారులకు సర్క్యూలర్ ద్వారా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన లాక్డౌన్ ఆదేశాలకు అనుగుణంగా కొన్ని శాఖల్లో రొటేషన్ ప్రకారం ఉద్యోగులను కార్యాలయాలకు విధులకు అనుమతించిందన్నారు. కానీ కొందరు ఉద్యోగులు విధుల్లో లేకున్నా కూడా వాహనాలకు ఆన్‌డ్యూటీ స్టిక్లర్లు అతికించుకుని అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారని, ఈ విషయా లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని, ఇ టువంటి ఉద్యోగులపై యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. (స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం' ) ఈ విధంగా ప్రవర్తించడం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతేకాక వైరస్ వ్యాప్తికి కారణం కావడంతో పాటు ఆ కుటుంబాల్లో వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం కలుగుతుందని తద్వారా ఆ కు టుంబాలకు కూడా ప్రమాదకరమని తెలిపారు. అయితే అత్యవసర విధులు నిర్వహించే పో లీ సు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, అగి్నమాపక, తదితర శాఖల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి మాత్రమే కార్యాలయాల వేళలు త ర్వాత కూడా విధులకు హాజరు కావడానికి ప్రభుత్వ ఆదేశాలున్నాయన్నారు. కావునా ఆ యా కార్యాలయాలకు చెందిన సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అదే విధంగా కొందరు అధికారుల కుటుంబ సభ్యులు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రభుత్వ వాహనాల్లో నిబంధనలకు విరుద్దంగా స్టిక్కర్లు అతికించుకుని బయట తిరుగుతున్నారని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలు ఎవరు అతిక్రమించినా అధికారు లు, ఉద్యోగులు, సిబ్బందిపైన సీరియస్‌గా కఠనంగా చర్యలు తీసుకుంటామన్నారు. (‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్‌గా నివేదా ) ప్రజలు తిరిగే ప్రాంతాల్లో జాగ్రత్త.. కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు వచ్చే అన్ని ప్రాంతాలతో పాటు రైతులు తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా వైరస్ నిరోధించడానికి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధిహామీ ప నులు, వ్యవసాయ పనులు చేయడానికి కూలీ లు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.బ్యాంకులు, కిరాణా దుకాణా లు, మాంసం దుకాణాల వద్ద జనం ఎక్కు ఉంటారని ఇక్కడ మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటు సంబంధిత యాజమాన్యాలు కూడా వారి ప్రాంతాలకు వచ్చే ప్రజలు క్రమ శిక్షణ, భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలన్నారు. దుకా ణాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాల న్నారు. ఈ జాగ్రత్త చర్యలు తీసుకోని వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. (ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ ) -
చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు
-
ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి
-
సరిహద్దు చెక్‌పోస్టు మూసివేత
– జీఎస్టీ అమలు ఎఫెక్ట్.. హిందూపురం రూరల్ : జిల్లాలో సరిహద్దు వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రాలు శనివారం మూతపడ్డాయి. ఇప్పటివరకు వాణిజ్య పన్నుల చెక్‌పోస్టులు తనిఖీలకే పరిమితమయ్యాయి. జీఎస్టీ అమలుకావడంతో జులై 1 నుంచి మూసేయాలని అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దాంతో శనివారం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో ఉన్న కొడికొండ చెక్‌పోస్టు, తూముకుంట చెక్‌పోస్టు, గుంతకల్లు వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రాలను మూసివేశారు. వీటిలో డీసీటీలు 20 మంది, ఏసీటీఓలు 40 మందితో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహించేవారు. వాణిజ్య పన్నుల శాఖకు చెక్‌పోస్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.వంద కోట్ల ఆదాయం వచ్చేది. కొత్త విధానంతో ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్లనుంది.దీంతో తప్పనిసరిగా మూసివేసి డీసీటీఓ స్థాయి అధికారి నుంచి సీనియర్ అసిస్టెంట్ అధికారి వరకు కర్నూలులోని వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని, అటెండర్ స్థాయి ఉద్యోగులు జిల్లా డీసీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. పట్టుబడితే భారీ జరిమానా : అక్రమంగా సరుకు రవాణా చేస్తూ మొబైల్ తనిఖీ బృందాలుకు దొరికితే భారీగా జరిమానా విధించినట్లు వాణిజ్య పన్నుల ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆన్లైన్లో వేబిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే పట్టుపడిన సరుకుపై ఏడు రెట్లు జరిమానాతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయునున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఎత్తివేత
కర్నూలు (హాస్పిటల్): వస్తు సేవల పన్ను(జీఎస్టి) అమలు నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి కర్నూలు నగర శివారులోని పంచలింగాల వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టును ఎత్తివేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను ఈ చెక్‌పోస్టులో తనిఖీ చేసేవారు. రోజుకు 1500 నుంచి 2వేల నుంచి వాహనాలు ఇక్కడకు వచ్చేవి. వీటిలో ఉన్న సరుకు తాలూకు పత్రాలను తనిఖీ చేసి, అవసరమైన మేరకు రుసుము వసూలు చేసేవారు. జీఎస్టి అమలు నేపథ్యంలో ఈ చెక్‌పోస్టులను ఎత్తివేశారు. శనివారం సాయంత్రం ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి దాకా నిర్వహించిన సేవలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్‌లో నిర్వర్తించాల్సిన విధుల గురించి చర్చించుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు వెంకటేశ్వర్, గీతామాధురి, సీటీవోలు నాగేంద్రప్రసాద్, హుసేన్ సాహెబ్, రామాంజనేయప్రసాద్, డీసీటీవోలు, ఏసీటీవోలు పాల్గొన్నారు. అధికారుల హోదాలు మార్పు జీఎస్టీ అమలు నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారుల హోదాలు మారాయి. ప్రస్తుతం ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్ ఇకపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్‌గా మారారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్‌ను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, సీటీవోలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డీసీటీవోలను డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఏసీటీవోలను జీఎస్టి ఆఫీసర్స్‌గా మార్చారు. -
చెక్‌పోస్టుల్లో ఏసీబీ తనిఖీలు
– అనధికార డబ్బు రూ.69,765 సీజ్ – ఇద్దరు ఏఎంవీఐలు, ఇద్దరు హోంగార్డులపై చర్యలకు సిఫారసు కర్నూలు: కర్నూలు శివారులోని హైదరబాద్ జాతీయ రహదారిపై పంచలింగాల క్రాస్ రోడ్డు వద్దనున్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నిరంతరాయంగా తనిఖీలు చేపట్టారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ జయరామ రాజు, సీఐ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. అక్కడ అన్నీ సక్రమంగా ఉండటంతో సమీపంలోని ఆర్టీఏ చెక్‌పోస్టులో సోదాలు జరిగాయి. ఏఎంవీఐలు శ్రీనివాసులు, రఘునాథ్‌తో పాటు హోంగార్డు హుసేని, నరసింహులు కార్యాలయం వద్ద ఉండి వాహనాల తనిఖీ చేస్తుండటం గుర్తించారు. కార్యాలయం గల్లాపెట్టెలో రూ.3,28,165 ఉండగా, అందులో రూ.69,765 అనధికార సొమ్ముగా వెల్లడయింది. అందుకు సంబంధించి రవాణా శాఖ అధికారులు లెక్కలు చూపకపోవడంతో అనధికార సొమ్మును సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసి చర్యలకు ప్రభుత్వానికి రిపోర్టు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. -
సొంత అవసరాల రవాణాకు పన్ను లేదు
చిలమత్తూరు (హిందూపురం) : డ్రైవర్లు, రవాణాదారులు తమ సొంత అవసరాల నిమిత్తం రవాణా చేస్తున్న వస్తువులకు చెక్‌పోస్టు వాణిజ్య పన్నుల తనిఖీ కార్యాలయంలో (ఫారం 650, 651) ట్రాన్స్పోర్ట్ డిక్లరేషన్ లేదా వే బిల్లు ఇవ్వాల్సిన అవసరం లేదని పరిపాలనాధికారి రాజగోపాల్‌రెడ్డి బుధవారం తెలిపారు. సొంత అవసరాలు, ఇళ్లకు కావాల్సిన ఫర్నీచర్ తదితర సామగ్రి తీసుకెళ్తున్నపుడు నిబంధనలకు విరుద్ధంగా చెక్‌పోస్టులో అధికారి కానీ సిబ్బంది కానీ పన్నులు వసూలు చేస్తే 80082 77270 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
పంచలింగాల, తాండ్రపాడు ఇసుక రీచ్‌లను పరిశీలించిన ఎస్పీ కర్నూలు: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. అనుమతి లేని రీచ్‌ల నుంచి ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. గురువారం ఉదయం కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంచలింగాల, తాండ్రపాడు గ్రామాల్లో ఇసుక రీచ్‌లు, పోలీస్ పికెట్ చెక్ పోస్టులను ఎస్పీ తనిఖీ చేశారు. అనుమతి లేని ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుకను తరలించేవారి వాహనాలను సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ఇసుకను డంప్‌లుగా దాచిపెట్టినా ఆ ఇసుకను ప్రభుత్వం సీజ్ చేసి తీసుకెళ్తుందన్నారు. సరిహద్దు చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశామన్నారు. చెక్‌పోస్టులలో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐ గిరిబాబు తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. పోలీస్ కుటుంబాలకు కార్పస్ ఫండ్ చెక్కులు పంపిణీ విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు గురువారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ ఆకే రవికృష్ణ కార్పస్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఏఆర్ఎస్ఐ స్వామిరెడ్డి కూతురు స్వాతి, ఏఎస్ఐ రఘుకుమార్ భార్య శ్రీలక్ష్మీ, హెడ్ కానిస్టేబుల్ రమణమూర్తి భార్య ఈశ్వరి, కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్ భార్య రాణమ్మ, ఏఎస్ఐ మోహన్‌రావు భార్య అన్నమ్మ, కానిస్టేబుల్ రాముడు భార్య శిరీష, శ్రీనివాసరాజు భార్య అశ్విని, ఏఎస్ఐ యూనుస్ భార్య ముస్తారి బేగం, ఏఆర్పీసీ విజయకుమార్ భార్య పద్మావతి తదితరులకు ఒక్కొక్కరికి రూ.40 వేల కార్పస్ ఫండ్ చెక్కును ఎస్పీ ఆకే రవికృష్ణ పంపిణీ చేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, బి–సెక్షన్ సూపరింటెండెంట్ కుమారి వి.దేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి
జీలుగుమిల్లి : రాష్ట్ర సరిహద్దు తాటియాకులగూడెంలోని రవాణా శాఖ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సమయంలో చెక్ పోస్టులో ఇద్దరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, సిబ్బంది ఉన్నారు. ఓ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్రాంతిలో ఉండగా.. మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. చెక్ పోస్టు సిబ్బంది బయటకు వెళ్లకుండా చుట్టూ ఏసీబీ సిబ్బంది కాపాలాకాశారు. చెక్ పోస్టు సిబ్బంది వద్ద ఉన్న నగదు, క్యాష్ కౌంటర్లోని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కౌంటర్ కంప్యూటర్లోని పనున్న చెల్లింపు వివరాలు ప్రింట్ అవుట్లు తీసుకున్నారు. లెక్కల్లో లేని రూ.4,500ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ వి.జె.విల్సన్ తదితరులు ఉన్నారు. తరచూ ఆరోపణలు : 2014లో ప్రారం భించిన ఈ రవాణా శాఖ చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు జరగడం ఇది మూడోసారి. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి: రూ.36 వేలు స్వాధీనం
గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు చెక్‌పోస్ట్‌పై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ. 36 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెక్‌పోస్ట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రహదారిపై వెళ్తున్న వాహనాల నుంచి సదరు చెక్‌పోస్ట్ సిబ్బంది భారీగా నగదు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. -
చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు, ఇద్దరి అరెస్ట్
తిరుపతి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లురు మండలం తానా చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఆ చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఉద్యోగులు, కొందరు అనుమానితులను తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద అనధికారికంగా ఉన్న రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చెక్‌పోస్టు వద్ద బెదిరింపులు: విలేకరులపై కేసు
సూళ్లూరుపేట (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా తడ వద్ద ఉన్న అంతర్ రాష్ట్రీయ చెక్ పోస్టు వద్ద బెదిరింపులకు పాల్పడుతున్న పత్రికా విలేకరులపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. గత డిసెంబరు 9వ తేదీన చెక్‌పోస్టు వద్ద సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఈనాడు పత్రిక విలేకరి చంద్రమోహన్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి విలేకరి రమేష్ వారిని అడ్డుకుని కొన్ని లారీలను ముందుకు దాటించే ప్రయత్నం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు సిబ్బందిని బెదిరించారు. దీనిపై చెక్‌పోస్టు అధికారి జగబంధు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఆరోపణలు నిజమని తేలటంతో ఇందుకు సంబంధించి ఇద్దరు విలేకరులపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌కుమార్ తెలిపారు. -
తడకుపేట చెక్‌పోస్ట్‌పై పోలీసుల దాడి
-
చెక్‌పోస్ట్ వద్ద విజిలెన్స్ తనిఖీలు
ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సరిహద్దులో ఉన్న పురుషోత్తమపురం చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్ట్ దాటుతున్న వాహనాలన్నింటిని ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న పలు వాహనాలకు తాకీదులు ఇచ్చారు.