
తనిఖీల్లో రూ 9.50 లక్షలు స్వాధీనం
జొన్నాడ (ఆలమూరు), న్యూస్‌లైన్ :
జిల్లాలోని వివిధ చెక్‌పోస్టుల వద్ద అధికారులు శనివారం తనిఖీలు చేపట్టి కారుల్లో తరలిస్తున్న రూ. 9,51,500 లను స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు మండలం జొన్నాడలోని చెక్‌పోస్టు వద్ద రూ. మూడులక్షలను సీజ్ చేశారు. ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొరుప్రోలు వెంకటేశ్వరరావు త న కారులో మండపేటకు బయలు దేరారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో స్థానిక అవుట్ పోస్టు సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆయన కారును తనిఖీ చేయగా, బ్యాగులోని నగదు బయటపడింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ సొమ్మును ఎస్సై సీహెచ్ సూర్య భాస్కరరావు సీజ్ చేశారు. మండపేట సీఐ పీవీ రమణ ఆదేశాల మేరకు కేసును నమోదు చేశామని ఆయన తెలిపారు.
అద్దరిపేట చెక్‌పోస్టులో..
తొండంగి : ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 2,26,500 లను శనివారం అద్దరిపేట చెక్‌పోస్టు వద్ద ఎన్నికల అధికారులు గుర్తించి సీజ్ చేశారు. చెక్‌పోస్టు ఎన్నికల అధికారి శివాజీ, ఎస్సై కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన సుషాంత్‌బెహర్, మరో నలుగురు కారులో అన్నవరం నుంచి ఒంటిమామిడి బీచ్‌రోడ్డు మీదుగా విశాఖ జిల్లా రాజానగరం వెళుతున్నారు. వారి కారును అద్దరిపేట చెక్‌పోస్టు అధికారులు తనిఖీ చేసి బ్యాగులో నగదును గుర్తించారు.
ఆ సొమ్మును సీజ్ చేసి ఇన్‌కంటాక్స్ అధికారులకు నివేదించామని శివాజీ తెలిపారు. కారులోని ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నామని ఎస్సై కిశోర్‌బాబు వివరించారు.
యానాంలో..
యానాం టౌన్ : కారులో తరలిస్తున్న రూ. 2.85 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యజమాని తగిన ఆధారాలు చూపడం తో ఆ సొమ్మును అప్పగించారు. యా నాం దరియాలతిప్ప ఫ్లడ్‌బ్యాంక్ రోడ్డులోని అయ్యన్నన గర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఈ సంఘటన జరిగింది. యానాం నుంచి దరియాలతిప్ప వెళుతున్న కారులో అధికారులు ఈ నగదును గుర్తించారు.
ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని డీటీ శిలాంబ్రేషన్‌కు అప్పగిం చారు. అనంతరం ఈ నగదుకు సంబంధించి ఒక కంపెనీ ప్రతినిధి ఆధారాలు చూపించారు. దీంతో పరిపాలనాధికారి ఎస్.గణేశన్ ఆ సొమ్మును వారికి అప్పగించారు. ఏప్రిల్ 24న యానాంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రూ.50 వేలకు మించి నగదును తీసుకువెళ్లేవారు తగిన ఆధారాలు కలిగి ఉండాలని గణేశన్ తెలిపారు.
రాజమ్రండి ఐఎల్‌టీడీ జంక్షన్‌లో..
రాజమండ్రి సిటీ : స్థానిక ఐఎల్‌టీడీ జంక్షన్‌లో శనివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ. లక్షా నలభై వేలు పట్టుబడ్డాయని టూటౌన్ ఇన్‌స్పెక్టర్ రాజారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నందిగామ శ్రీను ఈ సొమ్ముతో ఇండికా కారులో వస్తుండగా పట్టుకున్నామన్నారు. సొమ్మును స్టాస్టికల్ సర్వే రిజిస్ట్రార్ ఎం.చంద్రశేఖరరావుకు అప్పగించామన్నారు. కార్యక్రమంలో ధవళేశ్వరం ఎస్సై టి. రమేష్ పాల్గొన్నారన్నారు.