checks
-
ఖర్గే హెలికాప్టర్లో తనిఖీలు.. ‘బీజేపీ నేతలను తనిఖీ చేస్తున్నారా?’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గట్ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్‌ను బిహార్‌లోని సమస్తిపూర్‌లో పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా విదిలేస్తున్నారని కాంగ్రెస్ ఎన్నికల అధికారులపై విమర్శలు చేసింది. శనివారం మల్లికార్జున ఖర్గే.. సమస్తీపూర్, ముజఫర్పర్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గేను బిహార్‌లోని సమస్తీపూర్‌లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ రాథోడ్ అన్నారు. బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్ చెక్ చేశారని రాజేష్ రాథోడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో.. హెలికాప్టర్ చుట్టూ అధికారులు, పోలిసులు ఉండటం గమనించవచ్చు.श्री @RahulGandhi जी के बाद अब @INCIndia अध्यक्ष श्री @kharge जी का हेलीकॉप्टर की तलाशी बिहार के समस्तीपुर में सभा के दौरान चुनाव आयोग और पुलिसकर्मियों द्वारा करना चुनाव आयोग का दुर्भावना पूर्ण व्यवहार प्रतिपक्षों के लिए दर्शाता है यह लोकतंत्र की हत्या है l pic.twitter.com/tk1SUqcj5P— Rajesh Rathorre (@RajeshRathorre1) May 11, 2024 ‘‘కేవలం కాంగ్రెస్ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్ రాథోడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎండాకాలం..మండే కాలం : ఏసీ మెయింటెనెన్స్ టిప్స్
వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకూపెరుగుతున్నాయి. ముందుంది చెడుకాలం అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం అన్ని జాగ్రత్తలతో సిద్ధం కావాల్సిందే. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్ళల్లో అయితే మరింత అప్రమత్తత అవసరం. నంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ చిట్కా ఏమిటంటే ప్రతి సంవత్సరం ఏసీని సర్వీసింగ్ చేయించడం. ఎండలు మండించే దాకా వేచి ఉండకుండా ఏసీలు ఉన్న ఇళ్లలో ఏసీ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అవసరమైతే గ్యాస్ పట్టించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెలవారీ ఎయిర్ ఫిల్టర్లను చెక్ చేసుకోవాలి. ఎయిర్ కండీషనర్ సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసుకోవాలి. కండెన్సర్ యూనిట్ చుట్టూ ఖాళీ 4-అడుగుల ప్లేస్ వదలాలి. గదిలో ఏసీ ఆన్‌లో ఉన్నపుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్త పడాలి. అంతేకాదు ఏసీ బిల్లు తడిచి మోపెడు కాకుండా ఉండాలంటే అవసరం లేనపుడు ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. విండో ఫిల్మ్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. వేసవిలో ఇది మన ఇంటిని చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. వేసవి ఇతర జాగ్రత్తలు వేసవి రాగానే ఫ్రిజ్‌లో పెట్టే వాటర్ బాటిళ్లు మరో సెట్ కొని సిద్ధం చేయడం ఆనవాయితీ. ఫ్రిజ్ బాటిళ్లతోపాటు మట్టి కుండ నీళ్లను వాడటం ఉత్తమం. మట్టి కుండలోని నీటి రుచి ఈ తరం బాల్యానికి పరిచయం చేయండి. ఇంటి కిటికీలకు వట్టివేరు తడికలను కర్టెన్లుగా వేయడానికి ప్రయత్నించండి. పర్యావరణహితంగా ఇంటిని చల్లబరుచుకుందాం. -
రైలు ప్రమాద బాధితులకు చెక్కులు అందించిన మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. వారికి నష్ట పరిహారం చెక్కులను మంత్రి అందజేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని సూచించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన 13 మందికి, 30 మంది గాయపడిన వారికి కలసి మొత్తం 43 మందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు పరిహారంగా అందజేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. మంగళవారం 8 మందికి పరిహారం అందించామని, ఈ రోజు 12 మందికి పరిహారం అందజేశామని, రేపటిలోగా అందరికీ పరిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు. గాయాలపాలైన వారు జీవితాంతం బాధపడకుండా వారికి తోడ్పాటు అందించేందుకు ముఖ్యమంత్రి.. శాశ్వత అంగవైకల్యం పాలైన వారికి రూ.10 లక్షల సహాయం ప్రకటించారు. నెల రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స అవసరమయిన వారికి రూ.5 లక్షలు, నెల రోజుల్లోపు చికిత్స పూర్తయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వారికి రూ.2 లక్షలు సహాయం అందిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. చదవండి: వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు -
పులివెందులలో వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ
-
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అయ్యప్ప భక్తుల కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం
-
‘గ్యారెంటీ’ కోసం డీఎస్పీని సృష్టించాడు!
సాక్షి, హైదరాబాద్: వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో నగరవాసిని మోసం చేసిన ముఠా అందుకు ‘గ్యారెంటీ’ కోసం ఓ నకిలీ డీఎస్పీని సృష్టించింది. వీరి చేతిలో రూ.1.2 కోట్ల మోసపోయిన బాధితుడు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మెహిదీపట్నానికి చెందిన సునీల్‌కుమార్ 2018 డిసెంబర్లో జయప్రతాప్ అనే వ్యక్తిని కలిశాడు. (చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!) అప్పట్లో జయప్రతాప్ తన వద్ద రూ. 1.2 కోట్లు పెట్టుబడి పెడితే వ్యాపారం చేసి, వారం రోజులో రూ. 3 కోట్లు ఇస్తానంటూ చెప్పాడు. అతడి మాటలను సునీల్ పట్టించుకోలేదు. దీంతో దాదాపు ఏడాది తర్వాత మరోసారి జయప్రతాప్ హిమాయత్‌నగర్‌లోని సునీల్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ సమయంలో మునిరామయ్య అనే వ్యక్తినీ వెంట తీసుకువెళ్లాడు. మునిరామయ్య తిరుపతిలో సీఐడీ విభాగం డీఎస్పీగా పనిచేస్తున్నారని, పెట్టుబడికి ఆయన గ్యారంటీగా ఉంటాడని చెప్పి సునీల్‌ను ఒప్పించాడు. దీంతో పాటు రూ.3 కోట్లకు రాసిన చెక్కులు, ఖమ్మంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పత్రాలు ఇవ్వడంతో జయప్రతాప్‌కు 2019 నవంబర్‌లో రూ.1.2 కోట్లు ఇచ్చాడు. ఎంతకూ తనకు రావాల్సిన డబ్బును జయప్రతాప్ ఇవ్వకపోవడం, అతడి ఆచూకీ లేకపోవడంతో మునిరామయ్యను సంప్రదించాలని సునీల్ భావించారు. ఏపీ సీఐడీ విభాగంలో ఆరా తీయగా... ఆ పేరుతో ఏ అధికారీ లేరని తేలింది. దీంతో జరిగిన మోసం తెలుసుకున్న బాధితుడు ఇటీవల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ (ఫోటోలు)
-
పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
సాక్షి, అమరావతి: కోవిడ్ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల చెక్కులను అందజేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరులైన కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్కులను అందజేశారు. పోలీస్ అమరవీరులు సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్.. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అమరులైన పోలీసులకు సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర సెక్రటరీ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే కోవిడ్ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కులను సీఎం వైఎస్ జగన్ అందజేశారు. కాగా, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పోలీసు సంక్షేమ గ్రాంట్‌ను అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగానే 15 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేశారు. తద్వారా దాదాపు 206 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 1. వాసు గారి భార్య శ్రీమతి భాగ్యలక్ష్మీ భవాని గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 2. శ్రీరాములు (ఏఆర్ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన భార్య ఝాన్సీరాణి గారు 10 లక్షల చెక్కు అందుకున్నారు. 3. నాగేశ్వర్రావు (ఏఆర్ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన సతీమణి సి.హెచ్.విశ్వశాంతి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 4. రామారావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 5. పద్మ(వుమెన్ హోంగార్డు)అమరులయ్యారు. ఆమె భర్త టీ. చంద్రశేఖర్ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 6. ప్రసాద్‌రావు (హెడ్ కానిస్టేబుల్)అమరులయ్యారు. ఆయన భార్య బి. లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 7. సయ్యద్ జలాలుద్దీన్ (ఏఆర్ఎస్పై)అమరులయ్యారు. ఆమె సతీమణి సయ్యద్ ఉమే సల్మా గారు గ్రాంట్‌ను అందుకున్నారు. 8. హరిబాబు గారు అమరులయ్యారు. ఆయన భార్య నిర్మల గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 9. రత్నంరాజు గారు (హెడ్ కానిస్టేబుల్)అమరులయ్యారు. ఆయన సతీమణి కె. సుజాతావాణి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. చదవండి: నేటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు: సీఎం జగన్ -
ఆనందోత్సవాల ‘ఆసరా’
సాక్షి, అమరావతి: చెప్పిన సమయానికి చెప్పినట్టుగా.. సరిగ్గా పండుగ సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండో విడత పొదుపు సంఘాల రుణాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అక్కచెల్లెమ్మలు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నృత్యాలు, కోలాటాలు నిర్వహిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాల చుట్టూ ముగ్గులు వేసి, పూలతో అలంకరించి వాటి చుట్టూ కోలాటాలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7.97 లక్షల పొదుపు సంఘాల్లో ఉన్న 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా కింద ఈ ఏడాది ప్రభుత్వం రూ.6,439 కోట్లు చెల్లిస్తోంది. రెండో విడత నగదు చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ నెల 7 నుంచి లబ్ధిదారులతో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 54 మండలాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 7 నుంచి ఇప్పటివరకు 12 జిల్లాల పరిధిలో మొత్తం 556 చోట్ల ఆసరా వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాల్లో ఘనంగా ఆసరా ఉత్సవాలు.. వైఎస్సార్ ఆసరా కింద రెండో విడత నగదు సాయానికి సంబంధించిన చెక్కులను గురువారం ప్రకాశం జిల్లావ్యాప్తంగా అందజేశారు. త్రిపురాంతకంలో మంత్రి ఆదిమూలపు సురేష్ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఆసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, వెలుగు సిబ్బంది సీఎం వైఎస్ జగన్ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. పెడన మండలంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే జోగి రమేష్.. అక్కచెల్లెమ్మలకు రూ.6,79,88,739 చెక్కును అందజేశారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు సందడిగా సాగాయి. రుణమాఫీ చెక్కులను అందుకున్న అక్కచెల్లెమ్మలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. బాడంగి మండలంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చెక్కులు అందజేశారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం గుళ్లపల్లిలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ ఆసరా చెక్కులు అందించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతీనగర్‌లో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. గూడూరు మునిసిపల్ కార్యాలయం ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి అక్కచెల్లెమ్మలు క్షీరాభిషేకం చేశారు. -
బాధితులకు ఆర్థిక సాయం
రాజేంద్రనగర్/మేడిపల్లి: ముంపు ప్రాంతాలైన గగన్‌పహాడ్, ఫీర్జాదిగూడలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం పర్యటించారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసానిచ్చారు. గగన్‌పహాడ్‌లో నీళ్లలోపడి కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను కలిసి ఓదార్చిన ఆయన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చెక్కులు అందజేశారు. హైదరాబాద్, చేవెళ్ల ఎంపీలు అసద్దుదీన్ ఒవైసీ, డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ సంఘటన జరిగిన తీరును మంత్రికి వివరించారు. ఆయన వెంట మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మేయ ర్ బొంతు రామ్మోహన్ తదితరులున్నారు. అరెస్టులు.. ఆగ్రహాలు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో గగన్‌పహాడ్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐ పీఎస్‌కు తరలించారు. కేటీఆర్ పర్యటన ముగిశాక వదిలేశారు. గగన్‌పహాడ్, పల్లెచెరువు ప్రాంతాలకు చెందిన బాధితులు కేటీఆర్‌తో మొరపెట్టుకునేందుకు ఉదయం నుంచే వేచి ఉన్నారు. కానీ, కేటీఆర్ ఆలీనగర్, గగన్‌పహాడ్ పర్యటన తర్వాత శంషాబాద్ వెళ్లిపోయారు. దీంతో అక్కడ వేచి ఉన్న∙వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టనష్టాలపై ఆరా భారీ వర్షాలకు అతలాకుతలమైన ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. బాగా దెబ్బతిన్న ప్రగతినగర్ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ యోగక్షేమాలు, వరదల వల్ల జరిగిన నష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వేళకు ఆహారాన్ని అందించి, అండగా నిలిచిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులను కేటీఆర్ అభినందించా రు. ఆయన వెంట మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఇద్దరు రియల్టర్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు
సాక్షి,మెదక్/తూప్రాన్/వెల్దుర్తి: మెదక్ జిల్లా లో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రియల్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట మండలం పులిమామిడిలలో ఈ తనిఖీలు ఏకకాలంలో జరిగాయి. మెదక్ మాజీ అదనపు కలెక్టర్ నగేశ్ 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం తీసుకున్న కేసు దర్యాప్తులో భాగంగా.. వెల్దుర్తి మండలం మాసాయిపేటకు చెందిన ఏర్పుల శివరాజ్ తూప్రాన్‌లో శ్రీనివాస ప్లానర్స్, బిల్డర్స్, కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. మాసాయిపేటలో 10 మంది దళితులకు కేటాయించిన 2.20 ఎకరాల ఇనాం భూమిని, ఎకరాకు రూ.50 వేల చొప్పున గతేడాది కొనుగోలు చేశాడు. నగేశ్ ఇంట్లో సోదాల్లో దీనికి సంబంధించిన పత్రాలు లభించాయి. దీంతో ఏసీబీ అధికారులు శివరాజ్ కార్యాలయం, ఇంట్లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇనాం ములకు సంబంధించిన రైతులను, సర్వేయర్ నర్సింహులును విడివిడిగా విచారించారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ఏడు ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో తూప్రాన్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, మీనాక్షీ కిరాణం, సూపర్ మార్కెట్ యాజమాని నాగిళ్ల ప్రభాకర్ గుప్త ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ప్రభాకర్ భాగస్వాములు చీర్న రాజేశ్వర్ గుప్త, మురళి తదితరులను కూడా విచారించారు. ప్రభాకర్ గుప్త ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. -
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం తనిఖీ
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం కోసం సోంత భవనం ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి, మధ్యవర్తుల దోపిడిలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఆన్లైన్ విధానం అమలు చేస్తామని తెలిపారు. గతంలో మధురవాడ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసి తప్పుడు ఆరోపణలు చేశాయని, అందుకే తాను ఆకస్మిక తనిఖీకి వచ్చానని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఏసీబీ దాడులపై సబ్ రిజిస్టర్ సిబ్బందితో ఆయన చర్చించినట్లు చెప్పారు. కాగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్ పనితీరు బాగుందని, రిజిస్ట్రేషన్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను ఆయన అభినందించారు. రిజిస్ట్రేషన్లపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఈ ప్రాంతం దేశంలోనే రెండో ఆర్ధిక రాజధానిగా ఎదగడానికి అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో తనిఖీలు
-
ఏపీ : ప్రైవేట్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 130 పాఠశాలలను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, బోధించే వారి అర్హతలు, పాఠశాల భవనాలు తదితరాలను పరిశీలించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 24 పాఠశాలలలో తనిఖీలు చేపట్టి.. మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతపురం జిల్లాలోని ఏపీ పాఠశాల విద్య కమిషన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పలు ప్రైవేట్, కొర్పొరేట్ పాఠశాలలకు వెళ్లి మౌలిక సదుపాయాలు, ఫీజు వివరాలపై అధికారులు ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ పాఠశాల విద్యా కమిషన్ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 130 పాఠశాలలలో తనిఖీలు చేపట్టామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని, పదేపదే చేస్తే లైసెన్స్‌లను రద్దు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిబంధనలను మరింత పకడ్బంధీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వెట్టి చాకిరి సహించేది లేదని స్పష్టం చేశారు. తిరుపతి, ప్రకాశం, ఒంగోలు, టంగుటూరు, దర్శి, చీరాలలోని పలు ప్రైవేట్ పాఠశాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
‘కమిషన్ కోరిన సమాచారాన్ని కళాశాలలు ఇవ్వాలి’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 21వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని ఉన్నత విద్యా కమిషన్ సెక్రటరీ ఎన్. రాజశేఖర్ విద్యాసంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలల్లోని ఫీజులను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మా, ఏంసీఏ, ఎంబీఏ కాలేజీలన్నింటికీ నోటీసులు పంపించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతి కాలేజీ యాజమాన్యం కమిషన్ కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, గతంలో ఫీజుల నిర్థారణపై ఆరోపణులు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని కాలేజీలకు భారీగా ఫీజుల పెంచారని, మరికొన్ని కాలేజీలకు తక్కువ ఫీజుల పేట్టారని అన్నారు. కాలేజీల్లో సదుపాయాల తనిఖీకి కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నామని, టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబర్ నాటికి కొత్త ఫీజులను నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. -
వెలుగు సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి
-
ఏవోబీలో మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు?
ముంచంగిపుట్టు(పెదబయలు): ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారం అందినట్టు భోగట్టా. మావోయిస్టులు ఏవోబీలో భారీ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటలి జెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ముంచంగిపుట్టు, పెదబయలు మండల కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, కుమడ, డుడుమ మార్గాల్లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతీ వాహనాన్ని ఆపి, బ్యాగులు తనిఖీ చేశారు.అనుమానిత వ్యక్తులను ప్రశ్నిం చి విడిచిపెట్టారు. ముంచంగిపుట్టు ఎస్ఐ ప్ర సాదరావు ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు నుంచి కుభజంగి జంక్షన్ వరుకు బాంబు స్క్వాడ్‌తో కల్వర్టులు,వంతెనల కింద తనిఖీలు చేశారు. కొన్ని నెలలుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్న నేప«థ్యంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు(ఏవోబీ) వైపు మావో యిస్టులు వచ్చి తలదాచుకుంటున్నారనే సమాచారంతో సరిహద్దులో ప్రాంతాల్లో పోలీసు బలగాలు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశాయి. దీనికి తోడుగా మావోయిస్టు యాక్షన్ టీంలు సైతం రంగంలోకి దిగినట్టు పోలీసులు భావించి, సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే పన్నెడ జంక్షన్, కొత్తాపుట్టు జంక్షన్లలో పెదబయలు ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఏవోబీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. -
డోన్ ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
సాక్షి, కర్నూలు(డోన్ టౌన్) : ఋపట్టణంలోని రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ముగ్గురు అనధికారిక ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అధికారులు అనధికారిక ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఏసీబీ కర్నూలు డీఎస్పీ నాగభూషణం, సీఐలు ప్రవీణ్‌కుమార్, అస్రాద్‌బాష తమ సిబ్బందితో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రహస్యంగా కాసేపు ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు. తర్వాత కార్యాలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న చంద్రమోహన్, అన్సర్‌బాష, అక్బర్ అనే అనధికారిక ఏజెంట్లను అదుపులోకి తీసుకుని..విచారణ చేశారు. వారు అక్రమంగా కల్గివున్న రూ.40,020 స్వాధీనం చేసుకున్నారు. ఎంవీఐ శివశంకరయ్యను కూడా విచారించారు. ఒరిజినల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు వాహనదారులకు ఇవ్వకుండా అనధికారిక ఏజెంట్ల చేతికిచ్చి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కార్యాలయంలో ఎంవీఐ ఉన్న సమయంలోనే అనధికారిక ఏజెంట్లు కూడా ఉన్నారని, వారి వద్ద ఒరిజినల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు అధిక మొత్తంలో డబ్బు లభ్యమైందని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. ఎంవీఐపై తుదపరి చర్యల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే 9440446178 ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
మద్యం విచ్చలవిడి అమ్మకాలకు చెక్
పేదల బతుకుల్లో వెలుగు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యానికి బానిసలుగా మారుతున్నవారి జీవన ప్రమాణాలు మరింత దిగజారకుండా ముందడుగు వేస్తోంది. కేవలం మూడు నెలల పాలనలో బెల్ట్ దుకాణాలను, కల్తీ మద్యం, నాటు సారా వ్యాపారాలను సమర్థవంతంగా నియంత్రించిన ప్రభుత్వం తాజాగా మద్యం విచ్చలవిడి అమ్మకాలను అడ్డుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. విశాఖ సిటీ: మద్యం విక్రయాలను ఇక ప్రభుత్వమే చేపట్టనుంది. అక్రమ వ్యాపారంతో పాటు కల్తీని పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేయనుంది. విడి మద్యం అమ్మకాలకు చెక్ పెట్టనుంది. మద్యం దుకాణాల వద్ద తాగే అవకాశం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కూడా సాధ్యపడుతుంది. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్న పథకాల్లో పొందుపరిచిన మద్యపాన నిషేధం వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నూతన మద్యం పాలసీకి రంగం సిద్ధం చేసింది. ఈ పాలసీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా తొలిదశలో 20 శాతం దుకాణాలు తగ్గించనున్నారు. తద్వారా జిల్లా, నగరంలో ప్రస్తుతం ఉన్న 401 మద్యం దుకాణాల సంఖ్య 320కి తగ్గుతుంది. ఇందులో 42 మద్యం దుకాణాలను (గతేడాది రెన్యూవల్ చేయించుకోలేదు) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నారు. మిగిలిన 278 దుకా ణాలు అక్టోబర్ నుంచి మొదలవుతాయి. ఆయా దుకాణా లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ద్వారా ఏర్పాటవుతాయి. వీటిని నడిపేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీ పనిచేస్తుంది. మొ త్తం 320 దుకాణాల్లో 1520 మంది సిబ్బం దిని నాలుగు విభాగాల్లో ఏడాది కాల పరిమి తికి అవుట్ సోర్సింగ్ ద్వారా నియమిస్తా రు. నగర పరిధిలోని ఒక్కో దుకా ణానికి ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్మెన్లు, ఒక సెక్యూరిటీగార్డు, జిల్లాలో దుకాణానికి ఒక సూపర్వైజర్, ఇద్దరు సేల్స్మెన్లు, ఒక గార్డుకు ఉపాధి కల్పి స్తారు. రిక్రూట్మెంట్ కోసం ఎక్సైజ్ కమి షనర్ ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ శని వారం నోటిఫికేషన్ జారీ చేశారు. ‘బెల్ట్’పై ఉక్కుపాదం.. అయితే రాష్ట్రంలో నూ తన ప్రభుత్వం ఏర్పడిన తరువాత మ ద్యం అమ్మకాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యంగా మూడు నెలల పాలనలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేలు పైచీలుకు మద్యం బెల్ట్ దుకాణాలను పూ ర్తిగా నిర్మూలించారు. కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు. నాటుసారా బట్టీల పనిపట్టారు. సిండికేట్ ఆటకట్టించారు. మద్యాన్ని జనవాసాలకు దూరం చేయడంలో దాదాపు ప్రభుత్వం చాలావరకు సఫలీకృతమైంది. మరో నెల రోజుల తరువాత మద్యం అమ్మకాలు పూర్తిగా గాడిలో పడతాయి. సమయం ఉండదు మిత్రమా.. మరోవైపు మద్యం అమ్మకాల సమ యం విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన మా ర్గదర్శకాలు జారీ చేసిం ది. ఏపీఎస్‌బీసీఎల్ అవుట్లెట్ ద్వారా అమ్మకాలు ఉద యం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మా త్రమే నిర్ణయించారు. ఇదివరకు ఈ సమ యం ఉదయం 10 నుంచి రాత్రి 10 గం టల వరకు ఉండేది. జిల్లా వ్యాప్తంగా ఈ నెలా ఖరున ప్రారంభం కానున్న 42 దుకాణాలకు ఈ సమయం వర్తించగా..అక్టోబర్ నుంచి అన్ని దుకాణాలకు వర్తింపజేస్తారు. మెరిట్ ద్వారా ఉద్యోగం.. సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సూపర్వైజర్ పోస్టుకు డిగ్రీ అర్హత కాగా సేల్స్‌మెన్‌కు ఇంటర్మీడియట్ అర్హత. గార్డుకు నామమాత్రపు విద్యార్హతను నిర్ణయించారు. సూపర్వైజర్కు రూ.17,500, సేల్స్‌మెన్‌కు రూ.15 వేలు వేతనం ఇవ్వనున్నారు. ఏడాది కాల పరి మితికి గాను వీరిని అవు ట్ సోర్సింగ్ ద్వా రా పరీక్షలో మె రిట్ సాధించిన వారికి ఉపాధి కల్పిస్తూ పారదర్శకంగా నియామకం జరుపుతా రు. మొత్తం 400 మంది సూపర్వైజర్లు, 800 మంది సేల్స్మెన్లు, గార్డులను తీసుకుంటారు. వీరి పనితీరు బాగుంటే మరో ఏడాదికి ఒక నెల వేతనం బోనస్‌గా అందిస్తూ కొనసాగిస్తారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వీరి నియాకాలు చేపడతారు. ఏపీఎస్‌బీసీఎల్ మేనేజర్ సారధ్యం వీరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 25. టెండర్లకు నేడే ఆఖరు.. ఏపీఎస్‌బీసీఎల్ అవుట్ లెట్ల నిర్వాహణకు దుకాణాలను అద్దెకు తీసుకునేందుకు ప్రస్తుతం జరుగుతున్న టెండర్ల ప్రక్రియ గడువు ఆదివారంతో ముగియనుంది. ఆసక్తి గల ప్రస్తుత మద్యం దుకాణాల యజమానుల నుంచి టెండర్లు స్వీకరించేందుకు జిల్లా/నగరంలోని ప్రతి పోలీస్స్టేషన్లోనూ టెండర్ బాక్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం వరకు ఆయా బాక్సుల్లో టెండర్ పత్రాలు వేసి పూర్తి వివరాలను ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు తెలియజేయవచ్చు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన టెండర్లను ఈ నెల 20 జాయింట్ కలెక్టర్ సమక్షంలో తెరిచి తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భవనాలతో పాటు ఫర్నిచర్ ఇతర అవసరమైన సామగ్రిని అద్దెకు తీసుకుంటారు. టీడీపీ హయాంలో బతుకులు బుగ్గి.. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ అస్తవ్యస్తంగా సాగింది. బడి–గుడి రోడ్డు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలకు అనుమతులు జారీ చేశారు. దాంతోపాటు బెల్ట్ దుకాణాలకు పూర్తిగా సహకరించి లైసెన్స్ దుకాణాల నుంచే మద్యం సరఫరా చేసేవారు. దీంతో మద్యం జనవాసాల్లో ఏరులై పారేది. దీంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు మద్యానికి బానిసలుగా మారి ఒళ్లు–ఇళ్లు గుల్ల చేసుకునే దుస్థితి వచ్చింది. ముఖ్యంగా కుటుంబ పెద్దలతో పాటు యువకులు కూడా మద్యానికి బానిసలు కావడంతో జిల్లావ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీంతోపాటు మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు కోకొల్లలు. ప్రభుత్వాదాయం కోసం మద్యం అమ్మకాల్లో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడంతో పేదమధ్య ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. మరోవైపు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇష్టానుసారం ధరలు పెంచేసి ఎమ్మార్పీ నిబంధనలకు తూట్లు పొడిచి మందుబాబుల జేబులకు చిల్లు పెట్టారు. ‘పర్మిట్’ లేదు.. ప్రస్తుతం లైసన్స్ మద్యం దుకాణం వద్ద ప్రత్యేక రుసుం ద్వారా పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చేవారు. దీంతో దుకాణం కాస్త బార్గా మారి అక్కడే మందుబాబులు మద్యం సేవించేవారు. సమయం మించిపోయినా అక్కడే తిష్ట వేసి పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారింది. లూజ్ అమ్మకాలు యథేచ్ఛగా సాగేవి. అయితే తాజాగా మద్యం పాలసీ ద్వారా ఆయా పర్మిట్ రూమ్‌లకు ఇకపై అనుమతి ఇవ్వబోరు. దుకాణంలో కేవలం అమ్మకాలు మాత్రమే జరుపుతారు. షాపు చుట్టుపక్కల ఎక్కడా మద్యపానం చేయడానికి వీలు లేదు. నిరుద్యోగులకు బాసటగా.. -నాలుగు విభాగాల్లో ఏడాది కాల పరిమితికి అవుట్ సోర్సింగ్ విధానం -ఒక్కో షాపునకు ఓ సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్మెన్లు, ఓ సెక్యూరిటీ గార్డు -సూపర్వైజర్కు : 17,500 వేతనం -సేల్స్‌మన్‌కు : 15,000 -మొత్తం సూపర్వైజర్లు : 400 మంది -సేల్స్మన్లు : 800 మంది -సెక్యూరిటీ గార్డులు : 320 మంది -దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 25 వైన్ షాపుల వివరాలు.. -జిల్లాలో ఉన్న మద్యం షాపులు : 401 -కొత్త పాలసీ ప్రకారం తగ్గనున్నవి : 81 -గతేడాది రెన్యువల్ చేయించుకోలేని మద్యం షాపులు : 42 -అక్టోబర్ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే షాపులు : 42 -వీటి మోనటరింగ్‌కు కమిటీ సభ్యులు : ఐదుగురు పారదర్శకంగా ప్రక్రియ.. నూతన మద్యం పాలసీ విధానంపై పూర్తి కసరత్తు చేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం సూచించిన కమిటీలో కలెక్టర్ సారధ్యంలో ఐదుగురు సభ్యుల బృందంతో పాటు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్ ప్రక్రియతో పాటు సిబ్బంది నియామకం కూడా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. ఈ నెలాఖరుకు 42 అవుట్లెట్లు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. మిగిలిన దుకాణాలు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. దుకాణాల సమయం గంట తగ్గించడంతో పాటు పరిమిట్ రూమ్‌ల అనుమతిని రద్దు చేస్తాం. నూతన మద్యం పాలసీ వలన ప్రజల బతుకులు మారుతాయని ఆశిస్తున్నాం. – టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ డెప్యూటీ కమిషనర్, విశాఖపట్నం -
ఆకస్మిక తనిఖీలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు పోలీసు శాఖ పనిచేయాలని, పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవల్ అన్నారు. ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు, ఫిర్యాదుదారుల విభాగం, స్పందనకు వచ్చే ప్రజలకు అందించే సౌకర్యాలు తదితరాలపై ఆరా తీశారు. రికార్డ్ గది, కంప్యూటర్ రూమ్, స్టోర్ రూ మ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రాంగణంలో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని స్టేషన్లలో తాను తనిఖీలు చేపడతానన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహించాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరా వు, ఏలూరు డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్, ఎస్బీ సీఐ రజ నీకుమార్, వన్‌టౌన్ సీఐ వై.బాలబాలాజీ, ఎస్సైలు ఎన్ఆర్ కిషోర్‌బాబు, ఎస్.రామకృష్ణ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
స్టాలిన్ అతిథిగృహంలో సోదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచార నిమిత్తం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ బస చేయనున్న ప్రైవేటు అతిథిగృహంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తమిళనాడులో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతుండగా, వాటిల్లో ఒకటైన ఒట్టబిడారంలో ప్రచారంకోసం ఉదయం స్టాలిన్ అక్కడికి చేరుకోవాలి. తెల్లవారుజాము 5 గంటలకు అతిథిగృహంలోకి ప్రవేశించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. స్టాలిన్ ప్రచార వాహనం, బందోబస్తుగా అనుసరించే పైలట్, బ్లాక్ కమాండోస్, అనుచరుల వాహనాలను సోదా చేశారు. అక్కడి కార్యకర్తల వాహనాలనూ తనిఖీ చేశారు. 23 తర్వాతే ఫ్రంట్‌పై స్పష్టత: స్టాలిన్ ఈనెల 23వ తేదీ ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే మూడో ఫ్రంట్‌పై స్పష్టత వస్తుందని స్టాలిన్ మీడియాతో చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మూడో ఫ్రంట్ ఏర్పాటు నిమిత్తం రాలేదని, తమిళనాడులో ఆలయాల సందర్శనకు వచ్చి మర్యాదపూర్వకంగా మాత్రమే తనను కలిశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమని అన్నారు. -
జేసీ దివాకర్‌రెడ్డి కళాశాలలో...
యాడికి: తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు సిద్ధం చేశారని సమాచారం అందడంతో తహసీల్దార్ అంజనాదేవి, రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖరన్, రెవిన్యూ సిబ్బందితో శనివారం సాయంత్రం యాడికి మండల పరిధిలోని జేసీ దివాకర్‌రెడ్డి జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. అయిగే గదులు తాళాలు వేసి ఉండటంతో వీఆర్వో పవిత్ర ప్రిన్సిపల్‌ను ఫోన్లో సంప్రదించారు. తాను బెంగళూరులో ఉన్నానని, తాళంచెవులు తాడిపత్రిలోని తన ఇంటిలో ఉన్నాయని చెప్పాడు. ఈ మేరకు సిబ్బంది తాడిపత్రికి వెళ్లి తాళంచెవులు తీసుకొచ్చారు. ఇందులో ఒక గదిలో టీడీపీ కండువాలు, కరపత్రాలు లభించాయి. ప్రిన్సిపల్ రూము, మరో గదికి సంబంధించిన తాళంచెవులు లేకపోవడంతో వాటిని తెరవలేకపోయారు. ఈ గదుల తాళాలను తర్వాతైనా తెరిచి పరిశీలించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖర్‌ను సిబ్బందికి సూచించారు. ఇదిలా ఉండగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనిఖీల సమయంలో తహసీల్దార్‌కు ఫోన్ చేసి.. తమ కళాశాల గదులను తెరవవద్దని, ఒక వేళ కాదు అని తెరిస్తే మీ మీద కోర్టులో కేసు వేస్తానని బెదిరించినట్లు తెలిసింది. మరి ప్రిన్సిపల్ గదిని తెరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
చెక్కులు... చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ రాయితీ పథకాలకు వరుస అవరోధాలు ఎదురవుతున్నాయి. నాలుగేళ్లు బీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రాయితీ పథకాలను నిలిపివేశారు. అయితే 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులిచ్చింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి స్వయం ఉపాధిలో ఆసక్తి ఉన్న బీసీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, తొలివిడతగా మొదటి కేటగిరీ లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 41వేల మంది లబ్ధిదారులను గుర్తించిన బీసీ కార్పొరేషన్ ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.50 వేల చొప్పున రాయితీని నేరుగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు దాదాపు 19 వేల మందికి అధికారులు చెక్కులను పంపిణీ చేశారు. మిగతా 22 వేలమంది లబ్ధిదారులకు రూ.106 కోట్లకు సంబంధించి చెక్కులు పంపిణీ చేస్తున్న సమయంలోనే అసెంబ్లీ రద్దు కావడం, ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డిసెంబర్ వరకు చెక్కుల పంపిణీ అటకెక్కింది. తిరిగి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చెక్కుల పంపిణీకి ప్రభుత్వ అనుమతి తీసుకున్న బీసీ కార్పొరేషన్... లబ్ధిదారుల పేరిట కొత్తగా చెక్కులను తయారు చేసి జిల్లాలకు పంపింది. ఇంతలో జనవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా మరోమారు చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసిన తర్వాత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు బీసీ కార్పొరేషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో చెక్కుల పంపిణీకి ప్రభుత్వ అనుమతి కోరింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంలో జాప్యం కావడంతో ఏకంగా పార్లమెంటు ఎన్నికల నగారా మోగింది. దీంతో స్వయం ఉపాధి పథకానికి పూర్తిగా బ్రేక్ పడినట్లైంది. మే నెలాఖరు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అప్పటివరకూ చెక్కులు పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. మరో పది రోజుల్లో వార్షిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఈ ఏడాది విడుదల చేసిన నిధులను గడువులోగా ఖర్చు చేయకుంటే అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమకానున్నాయి. లక్ష్యసాధన పూర్తి చేయాలంటే తిరిగి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. -
చెక్కుల మార్పిడికి మరో అవకాశం
కరీంనగర్‌సిటీ: రైతు బంధు పథకంలో భాగంగా మొదటి విడతలో వివిధ కారణాలతో చెక్కులను నగదుగా మార్చుకోలేని రైతులకు ప్రభుత్వం మూడు నెలల కాలపరిమితిని ఎత్తివేసింది. ఆ కాల పరిమితిని మరో 3 నెలలు పొడగించినట్లు జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. జిల్లాలో రైతు బంధు పెట్టుబడి సాయం కింద మే 10 నుంచి వర్షాకాలం పంటకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అర్హులైన రైతులకు ప్రభుత్వం చెక్కుల రూపంలో పెట్టుబడి సాయం అందించిన విష యం తెలిసిందే. ఆ చెక్కులను వివిధ దఫాల వారీగా 4 తారీఖులలో ముద్రిం చారు. ముద్రణ తేదీ నుంచి 3 నెలల కాల వ్యవధి వరకు చెల్లుబాటు సౌకర్యంతో వ్యవసాయశాఖ కమిషనర్ నుంచి చెక్కులను జారీ చేయడం జరి గిందని తెలిపారు. జిల్లాలో మొత్తంగా రూ.124.59 కోట్ల విలువైన 1,46,027 చెక్కులకు గాను ప్రభుత్వం రూ.116.52 కోట్ల విలువైన 1,31,268 చెక్కులు జిల్లాకు పంపిణీ చేసింది. అందులో రూ.112.89 కోట్ల విలువైన 1,25,062 చెక్కులను రైతులు నగదుగా మార్చుకున్నారు. ఇంకా రూ.3.63 కోట్ల విలువైన 6,206 చెక్కులను నగదుగా మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యార్థం అన్ని బ్యాంకర్లతో సమావేశమై చెక్కులను నగదుగా మార్చుకునేందుకు నిర్దేశిత మూడు నెలల కాలపరిమితిని ఎత్తివేసి మరో మూడు నెలలు పొడగించారు. ఏప్రిల్ 19, మే 1, మే 10, మే 15 తేదీలలో చెక్కులు తీసుకుని నగదుగా మార్చుకోని వారికి అప్పటి మూడు నెలల కాలపరిమితికి మరో 3 నెలల పొడగింపు ఉంది. అయితే.. ఈనెల 10వ తేదీ నుంచి రైతులు బ్యాంకులకు చెక్కులు తీసుకొస్తే చెల్లుబాటు చేసుకునేందుకు ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించినట్లు డీఏవో శ్రీధర్ తెలిపారు. రైతు సోదరులు ఆలస్యం చేయకుండా సమీపంలోని రైతుబంధు బ్యాంకులలో కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు జతపరుస్తూ సంప్రదించాలని డీఏవో శ్రీధర్ సూచించారు. అందని చెక్కులు.. జిల్లాలో ఇప్పటివరకు రెవెన్యూ సమస్యలతో పాసుపుస్తకాలు పొందని, తదితర కారణాలతో చెక్కులు అందని పరిస్థితి ఉంది. ఆ సమస్యలు పరిష్కారమయ్యాకే వారికి చెక్కులిచ్చేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందని చెబుతోంది. చెక్కులు అందినవారు తీసుకోవడానికి ఉన్న శ్రద్ధ ఇంకా పంపిణీ చేయని వారిపై దృష్టి కేంద్రీకరించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండో పంట వస్తున్నా రెవెన్యూ సమస్యలు తీరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పుల సవరణ తర్వాత గత రెండు పంటల పెట్టుబడి సాయం అందిస్తారా? మళ్లీ కొత్తగానే అమలు చేస్తారా? అనేది కూడా రైతుల్లో సందేహం నెలకొంది. పాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణం తక్కువగా రావడం, పేర్లలో తప్పులు దొర్లడం, తదితర రెవెన్యూ సవరణలకు కాలయాపన జరుగుతోంది. అది రెవెన్యూ పనిభారమో? రైతులతో బేరమో? అనేది ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అవసరముందంటున్నారు రైతులు. చెక్కుల జాప్యం ఫలితంగా అర్హులైన రైతులు పెట్టుబడి సాయానికి నోచుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.124.59 కోట్ల విలువైన 1,46,027 చెక్కులకు గాను ప్రభుత్వం రూ.116.52 కోట్ల విలువైన 1,31,268 చెక్కులు జిల్లాకు పంపిణీ చేసింది. ఇంకా 14,759 మంది రైతులకు గాను రూ.8.07 కోట్ల విలువగల చెక్కులు అందలేదు. -
రైతుబంధు’లందరూ బీమాకు అర్హులే
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు చెక్కులు తీసుకున్న రైతులందరూ రైతుబీమాకు అర్హులేనని వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. ఈ పథకం కింద రైతుల నమోదు పురోగతి గురించి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. పార్థసారథి మాట్లాడుతూ రైతు జీవితబీమా పథకంలో ఇప్పటివరకు 30 లక్షల మంది రైతులపేర్లు నమోదయ్యాయని తెలిపారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాసుబుక్ లేకున్నా రైతుబంధు చెక్కులను అందజేశామని, వారూ రైతుబీమా చేయించుకోవాలని పేర్కొన్నారు. కొంద రు రైతులు రైతుబంధు చెక్కులు తీసుకోకపోవడంతో అవి తహసీల్దార్ వద్దనే ఉన్నాయని, అలాంటి రైతు లు తప్పనిసరిగా ఆ చెక్కులు తీసుకుని, రైతుబీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు కుటుంబాలకు భరోసా కలిగించడానికే రైతుబీమా పథకమని.. ప్రతీ రైతు కూడా రైతుబీమా పథకంలో నమోదు కావాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగిన 18 నుంచి 59 సంవత్సరాల (1959 ఆగస్టు 14 నుండి 2000 ఆగస్టు 15 మధ్య పుట్టినవారు) వయసు కలిగిన రైతులు జీవిత బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. జీవితబీమా పథకంలో ప్రతీ పట్టాదారు రైతు నమోదయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జూలై 15, 2018 నాటికి నమోదు వివరాలు అందించాలి కాబట్టి త్వరితగతిన నమోదు, అప్ లోడింగ్ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
‘చెక్కు’ల్లో చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు చెక్కులకు సంబంధించి అనేక లోపాలు బయటపడుతున్నాయి. రైతులకు ఉన్న భూమి కంటే ఎక్కువగా, తక్కువగా ఉన్నట్టుగా నమోదవడం.. ఎక్కువ భూమి ఉన్నవారికి తక్కువ సొమ్ము, తక్కువ భూమి ఉన్నవారికి ఎక్కువ సొమ్ముతో చెక్కులు అందడం, చాలా చోట్ల చెక్కుల పంపిణీ పూర్తిగాకపోవడం, తప్పుల కారణంగా చెక్కులు పంపిణీ చేయలేకపోవడం వంటి వాటితో వ్యవసాయ శాఖ అధికారులు బెంబేలెత్తుతున్నారు. ముందుగా నిర్ణయించుకున్న గడువు తీరిపోయినా.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 13 లక్షలకుపైగా చెక్కులు పంపిణీ కాకపోవడం గమనార్హం. 40 వేల చెక్కుల్లో ‘నగదు’తప్పులు పలుచోట్ల ‘రైతు బంధు’చెక్కుల్లో.. రైతులకు ఉన్న భూమికంటే ఎక్కువ సొమ్ము ఉండటం, మరికొన్ని చోట్ల తక్కువగా ఉండటంతో గందరగోళం నెలకొంది. ఉదాహరణకు నాలుగెకరాలు ఉన్న రైతుకు ఐదెకరాల సొమ్ముతో చెక్కులు రావడం, ఆరు ఎకరాలున్న రైతుకు రెండే ఎకరాల పేరిట రూ.8 వేల చెక్కు రావడం వంటివి బయటపడుతున్నాయి. సొమ్ము తక్కువగా వచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ సొమ్ముతో చెక్కులిచ్చిన పరిస్థితిపై అధికారులు కిందామీదా పడుతున్నారు. అలా ఎక్కువ సొమ్ము అందుకున్న రైతుల నుంచి ఆ అధిక మొత్తాన్ని ఎలా రాబట్టాలనుకుంటూ తల పట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ రైతు ఇలా ఎక్కువ సొమ్ము పొందినట్టు గుర్తించిన అధికారులు వెళ్లి అడిగితే.. తిరిగి ఇస్తానని అంగీకరించాడు. మిగతా చోట్ల కూడా ఇలాగే చేయాలని భావిస్తున్నారు. ఇక తక్కువ సొమ్ము అందిన రైతులకు.. తిరిగి సరైన మొత్తంతో ఇస్తామంటూ ప్రస్తుత చెక్కులను వెనక్కి తీసుకుంటున్నారు. పలుచోట్ల మిగతా మొత్తాన్ని విడిగా అందిస్తామని హామీ ఇస్తున్నారు. మొత్తంగా 40 వేల చెక్కుల్లో ఇలాంటి పొరపాట్లు జరిగినట్టు వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ తప్పిదంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. భారీగా పేరుకుపోతున్న చెక్కులు ఈ నెల 10వ తేదీన రైతుల చెక్కుల పంపిణీని ప్రారంభించిన సర్కారు.. 17 నాటికి పూర్తి చేయాలని భావించింది. 17వ తేదీ నాటికి 10,052 గ్రామాల్లో గ్రామసభలు పెట్టి 51 లక్షల చెక్కులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైతే గడువు పెంచినా.. మొత్తంగా 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అన్ని చోట్లా గ్రామసభలు నిర్వహించినా.. 37.65 లక్షల చెక్కులే పంపిణీ చేసినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 13.35 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. కొన్నిచోట్ల రైతులు గ్రామసభలకు రాకపోవడం, మరికొన్నిచోట్ల చెక్కుల్లో తప్పుల వల్ల వాటిని పంపిణీ చేయలేకపోయారు. గ్రామాల్లో పంపిణీ అనంతరం మిగిలిపోయిన చెక్కులను నెల రోజులపాటు తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేస్తారు. ఆ గడువులోనూ తీసుకోని చెక్కులను హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తరలించి.. అక్కడ తీసుకోవడానికి వీలు కల్పిస్తారు. మరోవైపు విదేశాల్లో స్థిరపడిన, వలస వెళ్లిన రైతుల భూములకు సంబంధించి చెక్కుల పంపిణీ అంశంపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఇక గ్రామసభల్లో చెక్కులు తీసుకోని పరిస్థితి అక్రమాలకు తావిచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామసభల్లో అయితే రైతులను ఎవరైనా గుర్తుపట్టగలరని, మండల కేంద్రాలు, హైదరాబాద్ కమిషనరేట్‌లో చెక్కులిచ్చేటపుడు గుర్తుపట్టడం కష్టమని.. దీంతో అక్రమాలు జరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నాయి. -
ఆపరేషన్ లాడ్జి
నెల్లూరు(క్రైమ్): లాడ్జీలపై పోలీసు నిఘా కొరవడింది. అసాంఘిక శక్తులు లాడ్జీల్లో మకాం వేసి నేరాలకు పాల్పడుతున్నట్లు పలు ఘటనలపై విచారణలో వెలుగుచూసింది. దీంతో జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ లాడ్జీ లపై దృష్టి సారించారు. క్రమం తప్పకుండా లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో శనివారం అర్ధరాత్రి జిల్లా వ్యాప్తం గా పోలీసులు తమ ప్రాంతాల్లోని లాడ్జీల్లో రెండు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. నెల్లూరు నగరంలోని 40 లాడ్జీలు, నెల్లూరు రూరల్ పరిధిలో 11, గూడూరులో 15, కావలిలో 14, ఆత్మకూరులో 5 లాడ్జీల్లోని ప్రతి గదిని తనిఖీ చేశారు. తనిఖీల్లో పలువురు అనుమానాస్పదంగా దొరకడంతో వారి పూర్తి వివరాలను సేకరించారు. నగరంలోని బాబుఐస్‌క్రీం సమీపంలో గల ఓ లాడ్జీల్లో పోలీసు తనిఖీల సందర్భంగా ఒక మహిళ, ఇద్దరు విటులు పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ లాడ్జీల్లో దిగేవారి పూర్తి వివరాలను సేకరించి విధిగా ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు ఫోను చేసి తెలపాని చెప్పారు. తనిఖీల్లో నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నాు. -
ఆ చెక్కులూ అనుమతిస్తాం
ఒంగోలు క్రైం: అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులుకు యాజమాన్యం 2015 సంవత్సరంలో ఇచ్చిన చెక్కులను కూడా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల వద్దకు తీసుకురావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో డిపాజిట్‌దారులకు స్పష్టత నిచ్చారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో శుక్రవారం ‘అగ్రిగోల్డ్ బాధితులను వీడని కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎస్పీ చెక్కుల విషయంలో డిపాజిట్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 2015లో తేదీల వారీగా ఇచ్చిన చెక్కులు కూడా అనుమతిస్తారని చెప్పారు. వాటిని జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కేంద్రాలకు తీసుకొచ్చి పరిశీలింపజేసుకోవాలని, ఆన్‌లౌన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ వెబ్సైట్లో ఇంకా నమోదు చేసుకోకుండా ఉన్న వారు, గతంలో నమోదు చేసుకొని పోలీస్ స్టేషన్లలో వెరిఫికేషన్‌కు వెళ్లని వారు ఇప్పటికైనా కేంద్రాలకు వెళ్లి వారి పత్రాలను వెరిఫై చేయించుకోవాలన్నారు. డిపాజిట్‌దారులు తమ వద్ద ఉన్న బాండ్లు, రసీదులు, చెక్కులు వంటి ఆధారాలతో వెళ్లి నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. -
30 తరవాత... ఆ చెక్కులు చెల్లవు!
-
ఏవోబీలో భయం.. భయం
♦ నేటి నుంచి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవం ♦ తనిఖీలు, కూంబింగ్ ముమ్మరం ముంచంగిపుట్టు(అరకులోయ) : ఆంధ్ర–ఒడిశా సరి హద్దు ప్రాంతంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు పార్టీ 13వ వార్షికోత్స వం నేపథ్యంలో ఏవోబీ వేడెక్కింది. పోలీసు బలగాలన్నీ ఏవోబీ వైపు కదిలాయి. మండల కేంద్రంలో ఎస్ఐ అరుణ్కిర ణ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కుమడ, జోలాపుట్టు, డుడుమ ప్రాంతాల నుంచి వాహనాలను తనిఖీలు కొనసాగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా మవోయిస్టు పార్టీ హిట్‌లిస్టులో ఉన్నా ప్రజా ప్రతినిధులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద సాయుధ పోలీసులతో నిఘా కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో పోలీసు బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు కొన్ని రోజులుగా బ్యానర్లు కట్టి, కరపత్రాలు వెదజల్లుతున్నారు. ఏవోబీలో ఎప్పుడు ఎటువంటి సంఘటన చోటు చేసుకుంటుందోనని మారుమూల గిరి గ్రామల గిరిజనులు భయాందోళనకు గురువుతున్నారు. -
‘తూర్పు’ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుతాం
615 ఓడీఎఫ్ గ్రామాల్లో మార్చి 31కి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కలెక్టర్ అరుణ్‌కుమార్ పి.గన్నవరం : జిల్లాలోని 615 ఓడీఎఫ్ గ్రామాల్లో మార్చి 31లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ వివరించారు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో మిగిలిన 400 గ్రామాల్లో కూడా డిసెంబర్ నెలాఖరు నాటికి వ్యక్తిగత మరుగుదొడ్లను నూరు శాతం పూర్తిచేసి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై పర్యవేక్షణలో భాగంగా శనివారం ఆయన పి.గన్నవరం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. మండలంలోని ఆరు ఓడీఎఫ్ గ్రామాల్లో ఇంకా 1,100 మరుగుదొడ్లు నిర్మించాల్సిన నేపథ్యంలో మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీహెచ్‌సీలో డాక్టర్ల నియామకానికి చర్యలు పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బంది పోస్టుల నియామకానికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. స్థానిక ఆస్పత్రిలోని వార్డులను, రికార్డులను ఆయన తనిఖీ చేశారు. వైద్య సేవలు, ఓపీపై ఆయన ఆరా తీశారు. సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆస్పత్రిని దత్తత తీసుకున్న అబ్దుల్ కలాం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ భీమాల వెంకటేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు. స్కానింగ్ మిషన్ ఉన్నా..టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు అమలాపురంలోని ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి స్కానింగ్ తీయించుకుంటూ వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని వెంకటేశ్వరరావు చెప్పారు. ఎక్స్‌రే మిషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. సీహెచ్‌సీకి ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం మంజూరైందని డిప్యూటీ సివిల్ సర్జన్ అప్పారి సూర్యనారాయణ కలెక్టర్‌కు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న బాలింతలతో ఆయన మాట్లాడారు. కలాం ట్రస్ట్ సేవలు అభినందనీయం జిల్లాలో బాగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పి.గన్నవరం సీహెచ్‌సీ ఒకటని కలెక్టర్ అన్నారు. ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్న కలాం చారిటబుల్ ట్రస్ట్‌ను ఆయన అభినందించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో ట్రస్ట్‌కు భాగస్వామ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటనన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, తహసీల్దార్ బి.బేబీజ్ఞానాంబ, ఆర్ఐ జి.ఉమాశంకర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వడదెబ్బ ప్రమాదాలపై అవగాహన కల్పించాలి కాకినాడ సిటీ : వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా అవగాహన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాలులో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ చలివేంద్రాలను వ్యాపార కూడళ్లల్లో, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్‌స్టేషన్, తదితర చోట్ల ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, మజ్జిగ ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మున్సిపల్ పాఠశాలల్లో తాగునీరు సరఫరా చేయాలని లోతట్టు ప్రాంతాల్లో తోపుడుబళ్లు, లోడింగ్ అన్ లోడింగ్ చేసే కార్మికులకు నీటి సరఫరాతో పాటు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు మందులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీఎంఅండ్హెచ్ఓకు సూచించారు. డ్వాక్రా గ్రామైక్య సభ్యులు వేసవిలో తీసుకోవాల్సిన చర్యలు అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటలలోపు పనులు పూర్తి చేయాలని వారికి తాగునీరు, మజ్జిగ టెంట్లు ఏర్పాటు చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్ఓ చెన్న కేశవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
20రోజులుగా ఖాళీ
ఖజానా ఖాళీతో చెల్లని చెక్కులు పనులు చేయలేమంటున్న కాంట్రాక్టర్లు మట్టి ఖర్చుల పద్దులు ఫ్రీజింగ్ పెళ్లిళ్ల సీజన్‌తో అల్లాడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటికి విడుదల చేస్తారో తెలియదంటున్న అధికారులు గుడివాడ: ప్రభుత్వ ఖాతాల కార్యాకలాపాలు నిలుపుదల చేసి సోమవారం నాటికి 20 రోజులు పూర్తి అవుతుంది. నాటి నుంచి ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. కోటాను కోట్లు ఖర్చుతో మహిళా సాధికారిత సదస్సులు పెట్టి మా కడుపులు మాడుస్తున్నారని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆవేదనతో రగిలి పోతునారు. ట్రెజరీ చెక్కులు తీసుకున్న వారు బ్యాంకుల వద్దకు వెళ్లి బిక్కముఖంతో వెనుతిరుగుతున్నారు. మూడు పద్దులు మాత్రమే వదిలారు... ఈనెల 8న ప్రభుత్వ అకౌంట్లు ప్రీజింగ్ చేసిన నాటినుంచి మూడు రోజుల కిందట కోర్టు చెక్కుల చెల్లింపుకు 2014 పద్దును మాత్రమే వదిలారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వీఆర్ఏల జీతాలకు సంబంధించిన పద్దుల బిల్లులు చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు, జీపిఎఫ్ ఖాతాల్లో రుణాల విషయంలో ఇంతవరకు వదలలేదు. దీనికి తోడు మున్సిపాల్టీలకు సంబంధించిన సొంత ఖాతాల్లో కూడా ఫ్రీజింగ్ పెట్టారు. ఫలితంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లింపులు లేక నానా తంటాలు పడుతున్నారు. శుభకార్యాలు చేసుకుందామని జీపీఎఫ్ రుణాలు కోసం దరఖాస్తుచేసినా ఫలితం లేకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్క గుడివాడ సబ్ ట్రెజరీ కార్యాలయంలోనే దాదాపుగా 500కు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. నిలిచిపోయిన అభివృద్ది పనులు.. మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. పాత పనుల బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు పంచాయతీల్లో కరెంటు బిల్లులు, రోజువారీ ఖర్చులకు చెల్లింపులు చేయలేక సర్పంచ్‌లు తంటాలు పడుతున్నారు. మార్చినెల ముగింపు నేపథ్యంలో కొన్ని పనులు పూర్తి చేయకపోతే నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. పంచాయతీ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేదు... ట్రెజరీలో ఒక్క బిల్లు కూడా మారటం లేదు. పంచాయతీ పాలన కుంటుపడింది. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. జీతాల కోసం సొంత డబ్బులు ఇస్తున్నాం. వీధిలైట్లు, బ్లీచింగ్, వర్కర్స్ జీతాలు ప్రభుత్వం ఇస్తే కొంత వరకు ఇబ్బందులు తొలుగుతాయి. బిల్లులు నిలుపుదల చేస్తే పంచాయతీ పాలన ఎలా చేయాలి. –సదుర్తిసాయిబాబు –దండిగానపూడి, సర్పంచ్ ఒక్క బిల్లు రాలేదు.. ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన జన్మభూమి–మాఊరు గ్రామసభలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంత వరకూ బిల్లు మంజూరు చేయలే దు. అత్యవసర బిల్లులు సైతం నిలుపుదలచేశారు. రోజు ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. బిల్లులు మాత్రం పాస్ కావటం లేదు. అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. చంద్రబాబు ఏ ఖర్చు మానేస్తున్నారు . –నీలం ఉదయ్‌కుమార్, సర్పంచ్, వెన్ననపూడి నిలిచిన ఉపాధి పనులు... జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న రోడ్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రెజరీల్లో ఫ్రీజింగ్ కారణంగా సిమెంట్‌కు రాసిచ్చినా నిధులు విడుదల కావడం లేదు. ఈ విధానం మార్చి నెల వరకు కనబడుతుంది. కాని జిల్లా కలెక్టరు మాత్రం మార్చిలోగా పనుల్ని పూర్తి చేయాలని అంటున్నారు. ఎలా సాధ్యం. – పి. బాలయ్య,వడ్లమన్నాడు సర్పంచ్ -
డాక్టర్ రెడ్డీస్ ప్లాంటులో ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిర్యాలగూడ ప్లాంటులో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తయినట్లు ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వెల్లడించింది. మూడు సూచనలతో ఎఫ్‌డీఏ ఫారం 483ని జారీ చేసినట్లు తెలిపింది. ఇందులో పేర్కొ న్న అంశాల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు డీఆర్ఎల్ వివరించింది. -
జర్నలిస్టుల కుటుంబాలకు కేసీఆర్ చెక్కుల పంపిణీ
-
చెక్కుల, ఖాతాల ద్వారానే వేతనాల చెల్లింపు
న్యూఢిల్లీ: పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్ని చెక్కులు లేదా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు 2017ను, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బిల్లును సభ ముందుంచారు. పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు 2016, స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇంతకుముందు ఈ అంశంపై జారీ చేసిన ఆర్డినెన్స్ ను కూడా రద్దు చేయాలని సూచించారు. -
బెదిరించి దోచేయడమే
ఆగని నకిలీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లీలలు మూడు జిల్లాల్లో అనధికార తనిఖీలు ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు ముఠాగా ఏర్పడి అక్రమ వసూళ్లు మర్రిపాలెం : కనిపించిన వాహనాన్ని ఆపడం.. పత్రాలు చూపించండి.. కారులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అని బెదిరించడం.. ఆనక ఓ రేటు మాట్లాడుకుని దోచుకోవడం.. ఇలా సాగిపోతోంది ఓ ప్రబుద్ధుడి నిర్వాకం. పలుమార్లు పోలీసులకు చిక్కినా.. కేసులు నమోదు చేసినా అతని ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఏకంగా ఓ ముఠా తయారుచేసి తనిఖీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడు రోజుల కిందట విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో తనఖీలు చేపడుతూ ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. ప్రధాన నిందితుడు మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పగలు డ్రైవింగ్... రాత్రుళ్లు తనిఖీలు ఇసుకతోట ప్రాంతానికి చెందిన గోవింద్ ఒకప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కారుకు డ్రైవర్‌గా పనిచేశాడు. సదరు అధికారి కారును తన ఇంటి వద్ద ఉంచుతానని చెప్పి తీసుకుపోయేవాడు. రాత్రి వేళ ఆ కారుతో రహదారులపై తనిఖీలకు తెరలేపాడు. ‘రవాణా శాఖ’ పేరుతో కారు చూసిన వారంతా నిజమని నమ్మేవారు. కారులో ఓ మహిళను ఉంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని నమ్మిస్తూ ఎడాపెడా దోచేసేవాడు. ఉదయం మరలా యధావిధిగా విధులకు వచ్చేవాడు. తనిఖీల విషయం సదరు అధికారికి తెలియడంతో ఉద్యోగం ఊడింది. మరో అధికారి వద్ద గోవింద్ మళ్లీ డ్రైవర్‌గా చేరాడు. అక్కడ కూడా అదే తరహాలో వ్యవహరించడంతో ఉద్యోగం పోయింది. ఇదంతా రెండేళ్ల క్రితం మాట. గోవింద్ కోసం గాలింపు నకిలీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చెలామణీ అవుతోన్న గోవింద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గోవింద్ పట్టుబడితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా విశాఖలో పలువురు అధికారుల వద్ద పనిచేసిన గోవింద్ తనదైన శైలిలో బెదిరింపులకు పాల్పడేవాడని తెలిసింది. అధికారులను బ్లాక్మెయిల్ చేయడంలో దిట్టగా చెబుతున్నారు. నమ్మకంగా ఉంటూ తన అసలు రూపం చూపేవాడని సమాచారం. అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం చెబుతానని బెదిరించి డబ్బులు దోచుకోవడంలో దిట్టగా రవాణా శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే లక్షలాది రూపాయలు దోచిన గోవింద్ ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టాలని, మరోసారి నకిలీ అధికారిగా కనిపించకుండా కఠినంగా శిక్షించాలని రవాణా శాఖ అధికారులు కోరుతున్నారు. సొంతంగా కారు... ఓ ముఠా అప్పటికే దోచుకున్న డబ్బుతో గోవింద్ సొంతంగా కారు కొన్నాడు. ఏకంగా ఓ ముఠా తయారుచేశాడు. రోడ్డు మీద కాపు గాచి తనిఖీలకు ఉపక్రమించాడు. లారీలు ఆపి రికార్డులు తనిఖీ చేయడం, కేసులు నమోదు చేస్తానని బెదిరించి డబ్బులు గుంజేవాడు. అయితే ఆయా ప్రాంతాల్లో గోవింద్ ఆగడాలను పోలీసులు పసిగట్టారు. విజయనగరం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్లలో అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. మూడు నెలల క్రితం చోడవరం ప్రాంతం చీడికాడలో తనిఖీలు జరిపి మరలా దొరికిపోయాడు. గోవింద్‌తో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నమ్మించిన మహిళను, మరో ఇద్దరిని చోడవరం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెల రోజుల తర్వాత బెయిల్ మీద విడుదలైన గోవింద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మరలా తనిఖీలు ప్రారంభించాడు. మూడు రోజుల క్రితం భోగాపురం ప్రాంతం సుందరపేటలో ఓ లారీ డ్రైవర్‌ను బెదిరించాడు. తాను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా తెలిపి రూ.25 వేలు డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని డ్రైవర్ చెప్పడంతో రూ.3 వేలకు బేరం కుదిరింది. అయితే డ్రైవర్ అనుమానంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భోగాపురం సీఐ నర్సింహరావు నేతృత్వంలో కారు అదుపులోకి తీసుకున్నారు. అందులోని ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా గోవింద్ తృటిలో తప్పించుకున్నాడు. లారీ డ్రైవర్ వద్ద డబ్బు వసూలు విషయం వాస్తవమని పోలీసులు తేల్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
పోలీసు కుటుంబాలకు భద్రత చెక్కుల పంపిణీ
కర్నూలు : విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ ఆకే రవికృష్ణ చేతుల మీదుగా భద్రతా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు విందు వడ్డించి ఆయన సహపంక్తి భోజనం చేశారు. ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో శనివారం ఉదయం భద్రత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏఆర్పీసీ వై.ఎస్.మహేష్‌కుమార్, భార్య చందనకి రూ.7,99,580, పీసీ శ్రీనివాసరాజు భార్య అశ్వినికి రూ.4 లక్షలు, ఏఎస్ఐ ఎం.డి.యూసుఫ్ భార్య ముస్తాని బేగంకు రూ.3,98,845, హెడ్ కానిస్టేబుళ్లు రమణమూర్తి భార్య ఈశ్వరికి రూ.3,98,530, ఎ.వి.ఎస్.రఘుకుమార్ భార్య శ్రీలక్ష్మికి రూ.3,91,303, పదవీ విరమణ పొందిన ఎస్ఐ రామకృష్ణయ్యకి రూ.94,407 భద్రతా చెక్కులను ఎస్పీ అందజేశారు. అనంతరం వారి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్ విజయకుమార్, ఓఎస్డీ రవిప్రకాష్, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి అబ్దుల్ సలాం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.నారాయణ, భద్రతా క్లర్కు పి.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
చెక్కులు వద్దంటూ రైతుల నిరసన
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు అడ్తిదారులు చెక్కులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్లైన్ చెల్లింపులు జరపడంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ మార్కెట్ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొంత సేపు కొనుగోళ్లు నిలిచిపోయారుు. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో చాలాకాలం తర్వాత రైతులు మార్కెట్‌కు సరుకులను తీసుకొస్తున్నారు. మార్కెట్‌కు సరుకులను తీసుకొచ్చిన రైతులకు నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరపాలని మార్కెట్ కమిటీ నిర్ణరుుంచింది. దీంతో కొంతమంది రైతులు గేటుకు తాళం వేసే ప్రయత్నించగా, వారిని చైర్మన్ అడ్డుకుని నచ్చజెప్పారు. ధర విషయంలో కూడా అత్యధికంగా రూ. 5,100లతో కొనుగోళ్లు చేరుుంచారు. -
నిరంతరం నిర్బంధ తనిఖీలు
కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కరీంనగర్ క్రైం : నేరాల నియంత్రణ కోసం నిరంతరం నిర్బంధ తనిఖీలు కొనసాగిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ శివారులోని కిసాన్‌నగర్, పసుల నారాయణకాలనీల్లో గురువారం ఉద యం కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. అనంతరం సీపీ కాలనీవాసులతో మాట్లాడారు. అసాంఘిక శక్తుల కదలికల నియంత్రణకు, అక్రమ కార్యకలాపాల అడ్డుకట్ట వేసేందుకు కార్డెన్‌సెర్చ్‌లు చేపడుతున్నట్లు చెప్పారు. శివారు ప్రాంతాల్లోనే కాకుండా ఇక ముందు ప్రతి అనుమానిత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ తరహా తనిఖీలు చేపడతామన్నారు. నూతనంగా అద్దెకు వస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని గ్రామ పోలీస్ అధికారులు(వీపీవో)లను ఆదేశించారు. వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటి నుంచి అనుమానితుల కదలికలు తగ్గాయని, ఇలాంటి తనిఖీలు కొనసాగించాని కాలనీవాసులు సీపీని కోరారు. సాయంత్రం వేళల్లో ముఖ్య కూడళ్ల వద్ద కొందరు ఆకతారుులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీపీ ఇప్పటి నుంచే ఈ ప్రాంతంలో ప్రత్యేక గస్తీతో పాటు షీటీం బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. ఈ కార్డెన్‌సెర్చ్‌లో సరైన ధ్రువీకరణపత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక ట్రాక్టర్, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న జంటను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో అటువైపుగా వచ్చిన దొంగ పో లీసులను చూసి తన వాహనం వదిలి పరారయ్యాడు. దొంగను పట్టుకునేందుకు రెండు బృందాలు రంగంలోకి దిగారుు. ఈ తనిఖీల్లో కరీంనగర్ ఏసీపీ రామారావు, ఇన్స్పెక్టర్లు సదానందం, హరిప్రసాద్, కృష్ణగౌడ్, లక్ష్మిబాబు, ఎస్సైలు తిరుమల్, వెంకటేశ్వర్లు, నరేశ్, రవీందర్నారుుడు, నాగన్నతోపాటు మరో ఆరుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, మహిళ పోలీసులు, ఏఆర్ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్ మొత్తం 200 మంది పోలీసులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
రూ. 25 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రాన్స్‌కో ఏడీఈ గంగాధర్ బాధితుడు గోన్‌గొప్పుల్‌కు చెందిన రైతు భీమ్‌గల్ : ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. భీమ్‌గల్ మండలంలో ట్రాన్స్‌కో ఏడీఈగా పనిచేస్తున్న చెలిమెల గంగాధర్‌ను మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోన్‌గొప్పుల్ గ్రామానికి చెందిన రైతు వంజరి హన్మాండ్లు, ఆయన సతీమణి వంజరి శారదలు ఈ ఏడాది జనవరిలో 25 కేవీ అదనపు ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి నెలలో ట్రాన్స్ఫార్మర్ మంజూరైంది. అయితే నిజామాబాద్‌లోని స్టోర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు దీనికి సంబంధించిన సామాగ్రి విడుదల కోసం ఏడీఈ గంగాధర్ రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే బాధిత రైతు అంత మొత్తం ఇచ్చుకోలేనన్నా ససేమిరా అన్నాడు. దీంతో రూ. 25 వేలకు బేరం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు. వారి పర్యవేక్షణలో మంగళవారం సాయంత్రం భీమ్‌గల్ పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడీఈ కార్యాలయంలో రూ. 25 వేల నగదును ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కెమికల్ ఎగ్జామినేషన్‌లో నిందితుడి ఎడమ చేతి వేలిముద్రలు సరిపోయాయని, అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ రఘునాథ్, ఎస్సై ఖుర్షీద్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాదులతో అప్రమత్తం
అఫ్జల్‌గంజ్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సి. లక్ష్మారెడ్డి కోరారు. ఆయన సోమవారం ఉస్మానియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి భవనం పరిస్థితిని పరిశీలించి, పాత భవనంలోని 1,2 అంతస్తుల్లోని వార్డులను, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. వార్డులలో చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించి వారితో మాట్లాడారు. జహీరాబాద్‌కు చెందిన వెంకటనర్సింహ కిడ్నీలో రాళ్ళువచ్చాయని 45 రోజులుగా చికిత్స పొందుతున్నానని, రాత్రి వేళలో సెక్యూరిటీ సిబ్బంది లేని కారణంగా దొంగలు తిరుగుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒకరిద్దరు ముసుగులతో వచ్చి రాత్రి వేళ నిద్రించి వెళ్తున్నారన్నారు. రోగులకు భద్రత కరువైందని మంత్రికి ఫిర్యాదుచేశాడు. హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు కొరత ఉందని వారిని త్వరితగతిన నియమించాలని కోరుతూ నర్సులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సూపరిండెంట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.... వైద్యశాఖ అన్ని పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక వైద్య క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఆస్పత్రి భవనాన్ని ఎప్పటికప్పుడు ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోందన్నారు. వైద్య శాఖలో ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు టీఎస్‌సీఎస్సీద్వారా 2118 పోస్టులకు త్వరలో నీటిపికేషన్ వెలువడనుందని అన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ జీవీఎస్ మూర్తి, చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, ఆర్‌ఎంఓలు నజాఫీ, కవిత, రఫి, రాష్ట్ర వైద్యుల సంఘం అద్యక్షులు బొంగు రమేష్, నాగేందర్, ప్రవీణ్, అన్ని విభాగాల అదిపతులు, టిఆర్ఎస్ నాయకులు ఆర్వి మహేందర్, సంతోష్ గుప్త తదితరులు ఉన్నారు. నిమ్స్‌లో ఆకస్మిక తనిఖీ పంజగుట్ట: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి సోమవారం నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సాయంత్రం 4:30 ప్రాంతంలో నిమ్స్‌కు వచ్చిన ఆయన అరగంటపాటు అక్కడే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన నియోజకవర్గం కార్యకర్తను పరామర్శించిన ఆయన పలువురు రోగులతో మాట్లాడి నిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశాడు. పలువురు రోగులు, సహాయకులు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని కోరగా వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ మనోహర్, పలువురు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఇళ్లలో ఐటి సోదాలు
-
కేఎంసీలో ‘మెడికల్ కౌన్సిల్’ తనిఖీలు
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని ఎంజీఎం, సీకేఎం, నేత్ర వైద్యశాల, హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, భీమారంలోని టీబీ ఆస్పత్రులలో గురువారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు తనిఖీలు చేశారు. కేఎంసీలో 200 సీట్లకు అనుగుణంగా సౌకర్యాలతో పాటు ఫ్యాకల్టీ, పరికరాలు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. కోల్‌కతాకు చెందిన అభిమన్యు బస్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వి.కె.దాస్, మధ్యప్రదేశ్ జబల్పూర్కు చెందిన పి.కె. ఖచార్, ఉత్తరప్రదేశ్ ఇటావాకు చెందిన రవీంద్రసింగ్ రాజ్బుట్ల బృందం తనిఖీలు చేపట్టింది. ఇద్దరు సభ్యులు కెఎంసీలో, మరో ఇద్దరు కేఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంసీలోని, బాలుర, బాలికల హాస్టళ్లను పరిశీలించారు. కళాశాలలో ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలను చూశారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖర్, దొడ్డ రమేశ్, రాంకుమార్‌రెడ్డి, సీతమహాలక్ష్మి, పుషే్పందర్నాథ్ పాల్గొన్నారు. ఎంజీఎంలో తనిఖీలు.. కేఎంసీకి బోధనాస్పత్రిగా ఉన్న ఎంజీఎంలో ఎంసీఐ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఓపీ, క్యాజువాలిటీ, మెడికల్, సర్జరీ, అర్థో, అపరేషన్ థియేటర్, ఏఎంసీ, ఐసీసీయు, ఐఎంసీ, ఐసీఎస్యు వంటి అత్యవసర వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్యకు తగినంత మంది వైద్యులు ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఎంసీఐ బృందం ముందు నిరసన.. కేఎంసీలో ఎంసీఐ సభ్యులు నిర్వహిస్తున్న ఆయా విభాగాల వైద్యుల హెడ్ కౌంట్ విషయంలో వివాదం తలెత్తింది. ఉదయం 11 గంటల సమయంలో విభాగాల వారీగా ఉన్న వైద్యుల కౌంట్ తెలుపాలని ఎంసీఐ సభ్యులు ఉత్తర్వులు జారీ చేయగా ఆ సమయంలో కొంత మంది వైద్యులు అపరేషన్ థియేటర్లో ఉండడంతో పాటు రాత్రి వేళలో విధులు చేసిన వైద్యులు అలస్యంగా హాజరుకావడం వల్ల కొంత మంది వైద్యులు సంతకాలు చేయలేదు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అన్ని విభాగాల వైద్యులు కేఎంసీకి చేరుకుని హెడ్ కౌంట్‌కు హాజరు కాగా అలస్యంగా వచ్చిన వైద్యుల కౌంటింగ్‌ను పరిగణలోకి తీసుకోమని ఎంసీఐ సభ్యులు తెలుపడంతో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ విద్యాసాగర్ జోక్యం చేసుకుని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులకు సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
రైల్వేస్టేన్లో సీఏఓ తనిఖీలు
రైల్వేగేట్ : అలాగే ఆర్‌పీఎఫ్‌లోని సీసీ కెమెరాల పనితీరుతోపాటు భవనం నుంచి వర్షానికి కారుతున్న నీళ్లను పరిశీలించారు. ప్రయాణికులతో క్లీన్ రైల్వే స్టేషన్‌పై మాట్లాడారు. వారి నుంచి అభిప్రాయాలను తెలసుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైల్వే కళాకారులు స్వచ్ఛ రేల్..స్వచ్ఛ భారత్‌పై నృత్య ప్రదర్శన నిర్వహించి చైతన్య పరిచారు. క్లీన్ రైల్వే స్టేషన్‌కు సహకరించాలని ప్రయాణికులు, రైల్వే స్టేషన్ సిబ్బందిని పూర్ణ కోరారు. ఈ సందర్భగా ఆర్పీఎఫ్ వారు లిట్టరింగ్ కింద 10 కేసులను నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.200 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, హరిప్రసాద్, సాగర్, సతీష్‌కుమార్, శ్రీనివాస్‌రావు, ఆర్పీఎఫ్ సీఐ నర్సింహ, ఏఎస్సై జనార్దన్, ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కోడికొండ చెక్‌పోస్టులో తనిఖీలు
- రెండు లారీలు సీజ్ చిలమత్తూరు రూరల్ : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తోన్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖాధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఒక్కో లారీలో 33 టన్నుల బియ్యం రవాణా అవుతోంది. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉండవచ్చు. ఎలాంటి బిల్లులు చూపించక పోవడంతో లారీలను సీజ్ చేసినట్లు డీసీటీఓ జేబీ నందా తెలిపారు. పట్టుబడిన లారీలు(కేఏ04ఏఏ 0227, కేఏ04ఏఏ 0224) కొత్త చెరువుకు చెందిన ఓ టీడీపీ నేతకు చెందినవిగా సమాచారం. -
ప్రైవేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
వరంగల్ : నర్మెట మండల కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. స్థానిక సింధూజ డిగ్రీ కాలేజీ, భార్గవి ఒకేషనల్ కాలేజీ, తరిగొప్పులలోని వల్లభి జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, కళాశాల ఆట స్థలం, విద్యార్థులకు అనుగుణంగా క్లాస్రూంలు, అధ్యాపకుల లభ్యత, ఫీజుæ రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై ప్రభుత్వానికి రహస్య నివేదిక అందించనున్నట్లు తెలిపారు. సింధూజ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు పార్ట్‌టైంగా పని చేస్తున్నారని తెలిపారు. భార్గవి కళాశాలలో ల్యాబ్, గ్రంథాలయ సమస్య ఉందని, వల్లభి జూనియర్ కళాశాలలో అసంపూర్తి భవనం ఉందన్నారు. 700 కాలేజీలకుగానూ ఇప్పటిదాకా 450 చోట్ల సోదాలు పూర్తయ్యాయయన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈ సుగుణాకర్‌రావు, అధ్యాపకులు అంజయ్య, భాను కుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అనంత రైల్వే కేంద్రంలో రైల్వే జీఎం తనిఖీలు
-
భయం గుప్పిట్లో కార్మికులు
రాయికల్ : సౌదీలో భారత కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఆర్థిక మాంధ్యంతో కంపెనీలు మూతపడి కార్మికులు రోడ్డున పడితే.. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలు చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు జైళ్లకు పంపిస్తున్నారు. సౌదీలోని రియాద్, జెడ్డా ప్రాంతాల్లో రోజురోజుకు ఇలాంటి అరెస్టులు పెరిగిపోతున్నాయని తెలంగాణకు చెందిన పలువురు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్లో సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలోని కరీంనగర్, ఆది లాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులు ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. మోసాలూ కారణమే..:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులను సౌదీలోని పలు కంపెనీల్లో మంచి ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి సౌదీకి తీసుకువచ్చిన అనంతరం కపిళ్లు(అక్కడి ఏజెంట్లు) అక్కడికి వచ్చిన తర్వాత అనుకున్న ఉద్యోగం పాటు వేతనం సరిగా ఇవ్వకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కపిళ్లు కార్మికుల పాస్‌పోర్టులను తమ వద్దనే ఉంచుకుని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తే తమకు కమిషన్ ఇవ్వాలని హుకూం జారీ చేస్తున్నారు. దేశం కానీ దేశానికి అప్పు చేసి వచ్చిన కార్మికులు దిక్కుతోచని స్థితిలో కపిళ్లకు జీతంలో 200 రియాళ్లు ఇస్తున్నారు. కొంత కాలంగా కంపెనీలు మూతపడటం.. వేతనాలు రాకపోవడంతో కపిళ్లకు నెలానెలా చెల్లించే 200 రియాళ్లను కార్మికులు ఇవ్వలేకపోతున్నారు. దీంతో కపిళ్లే నేరుగా సౌదీలోని పోలీసులకు(సుల్తాలకు) సమాచారం ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి సమాచారం మేరకు పోలీసులు వీరిని అరెస్టు చేసి జైలులో పెడుతున్నారు. జైలులో ఒకే గదిలో 200 నుంచి 300 మందిని ఉంచడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. భోజనంగా ఒక బన్ను, టీ మాత్రమే ఇస్తున్నారని.. ఇంటికి ఫోన్ చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. పట్టించుకోని అధికారులు.. సౌదీలో అకారణంగా పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టినప్పటికీ భారత ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవ డం లేదని కార్మికులు వాపోతున్నారు. తమ కు పాస్‌పోర్టు ఉన్నప్పటికీ అకామ (వర్క్ పర్మిట్) కార్డు లేకపోవడంతో అరెస్ట్‌లు చేస్తున్నారని, దీనిపై భారత ఎంబసీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను స్వరాష్ట్రానికి తీసుకురావడంతో పాటు జైలులో మగ్గుతున్న వారిని విడిపించాలని కోరుతున్నారు. -
ప్రైవేటు పాఠశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
అర్వపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర విషయాల పరిశీలనకై మంగళవారం మండలంలోని ప్రైవేటు పాఠశాలలను టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ చేసింది. అర్వపల్లిలోని విజ్ఞాన్ పబ్లిక్‌స్కూల్, చైతన్యభారతి, మాంటిస్సోరి, లోయపల్లి క్రాస్‌రోడ్డులోని శాంతి నికేతన్ పాఠశాలలను బృందం పరిశీలించింది. పరిశీలించిన నివేదికను డీఈఓకు పంపనున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారి తుంగతుర్తి ఎంఈఓ బి. లింగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు పాలవరపు సంతోష్, అశోక్‌రెడ్డి, ఎస్. రాజయ్య, ఆయా పాఠశాలల హెచ్ఎంలు కె. జగన్, కె. మహేశ్వర్, కె. ఉప్పలయ్య, వీణ తదితరులు పాల్గొన్నారు. -
కళాశాలల్లో విస్తృత తనిఖీలు
గోవిందరావుపేట : మండలంలోని పస్రా జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉదయమే దేవి ఒకేషనల్ జూనియర్ కళాశాల, నలంద కళాశాల, గాయత్రీ, కాకతీయ డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు జరిగాయి. నలంద కళాశాలకు సీఐడీ డీఎస్పీ రవి కుమార్, డిగ్రీ కళాశాలలకు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, దేవి కళాశాలకు మైనింగ్ ఏజీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బృందాలు చేరుకున్నాయి. లైబ్రరీ, ల్యాబ్‌లు, కళాశాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయా, భవనాలకు నిర్మాణ అనుమతి ఉందా అనే విషయాలు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, లెక్చరర్లు ఎంతమంది, వారి అర్హతలు వంటి వివరాలను పరిశీ లిస్తున్నారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ డీ డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా విజి లెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సుమారు 1200 కళాశాలల్లో తనిఖీలు చేపట్టనుండగా, ఇప్పటి వర కు 750 కళాశాలల్లో పూర్తయిందని వివరించారు. కళాశాలలో ఎలాంటి లోపాలున్నా ప్రాథమిక రిపోర్టును తయారు చేసి పంపిస్తామని చెప్పారు. ఆయన వెంట విజిలెన్స్ తహసీల్దార్ భవాని, సీఐడీ ఎస్సై పుష్పలత, ప్రొఫెసర్ అంజయ్య, పీఆర్ ఏఈ సుగుణాకర్‌రావు, సిబ్బంది ఉన్నారు. పస్రాలోని ఓ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఎప్పుడూ విద్యార్థులు కనిపించరని, ఇప్పుడు మాత్రం వస్తున్నారంటే తనిఖీ సమాచారం ముందే లీకై ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కోదాడ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
కోదాడ: పట్టణంలోని ఈవీరెడ్డి డిగ్రీకళాశాలలో విజిలెన్స్ ప్రత్యేక బృందం తనిఖీ చేసింది. వసతులు, ప్రయోగశాలలు, తరగతి గదులు, విద్యార్థుల హాజరు పట్టికలు, అధ్యాపకుల వివరాలను కళాశాల నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కోదాడలోని సుగుణ డిగ్రీ కళాశాలను తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్ అధికారులతో పాటు కళాశాల కరస్పాండెంట్ గింజల రమణారెడ్డి, జీఎల్‌ఎన్‌రెడ్డి, కెపీబీవీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం విద్యాశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల భవనాలను పరిశీలించి ఫీజుల వివరాలను తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో లోపాలను గుర్తించినట్లు సమాచారం. ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే ప్రభుత్వ గుర్తింపు రద్దవుతుందని యాజమాన్యాలను హెచ్చరించారు. తనిఖీలపై తమ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని వారు తెలిపారు. ఈ తనిఖీలలో నడిగూడెం ఎంఈఓ సలీంషరీఫ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని పలు ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో గురువారం విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. -
మసీదుల అభివృద్ధికి చెక్కుల పంపిణీ
చిలుకూరు: మండలంలోని నారాయణపురం, సీతరాంపురం, రామాపురం, కొండాపురం, జెర్రిపోతులగూడెం, బేతవోలులో రెండు మసీదులకు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి∙ఒక్కోక్క మసీదుకు మంజూరైన రూ. 15 వేలను ముస్లీం పెద్దలకు బుధవారం ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్‌లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లీలంకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కొల్లు దామోదర్‌రావు, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, విఆర్వో నభి తదితరులు పాల్గొన్నారు. -
మత్తు వదిలిస్తున్నారు!
తాగి వాహనం నడిపితే జైలుకే జిల్లాలో 6 నెలల్లో 10,546 కేసులు రూ.40,62,800 జరిమానా సరదాకోసం కొందరు.. వ్యక్తిగత సమస్యలతో మరికొందరు.. మానసిక ఒత్తిడితో ఇంకొందరు ఇలా కారణాలు ఏవైనా వాటి నుంచి ఉపసమనం పొందేందుకు మద్యానికి బానిసలవుతున్నారు. పుట్టుగా మద్యంసేవించి ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారి భరతం పట్టేందుకు జిల్లా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. తాగి వాహనాలు నడిపే వారికి భారీ జరిమానా, శిక్షలు విధిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 10 వేలకుపైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ. 40 లక్షల 60 వేల వరకు జరిమానా విధించారు. తిరుపతిక్రైం: మద్యంమత్తులో వాహనాలు నడిపే వారికి జిల్లా పోలీసులు ఝలక్ ఇస్తున్నారు. దొరికినవారికి దొరికినట్లు.. జరిమానా విధిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే.. జైలుశిక్ష కూడా తప్పడం లేదు. జిల్లాలో 25కు పైగా బ్రీత్ అన్లైజర్లు ఉన్నాయి. వీటితో రాత్రిపూట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు మరి న్ని బ్రీత్ అన్లైజర్లు వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన వెంటనే తనిఖీలు మరింత విస్తృతం చేయనున్నారు. శ్వాస పరీక్షలు, శిక్షలు.. తనిఖీల సమయంలో పోలీసులు వాహనదారుని నోట్లో బ్రీత్ అన్‌లైజర్ పెట్టి గట్టిగా ఊదమంటారు. ఆ వ్యక్తి మద్యం సేవించినట్టు అయితే బ్రీత్ అన్లైజర్లో ఆల్కాహా ల్ శాతం నమోదవుతుంది. ఒక బీరు, 15 ఎంఎల్ మద్యం సేవించినట్లు అయితే 30 శాతంగా చూపిస్తుంది. అంతకు మించి నమోదైదే కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తారు. పరీక్షించిన సమయంలో శరీరంలోని ఆల్కాహాల్ శాతం వివరాలు, బ్రీత్ అన్‌లైజర్ నుంచి వచ్చే రశీదులో నమోదవుతాయి. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు తరలిస్తారు. న్యాయమూర్తి ఇచ్చే తీర్పును బట్టి రూ.2 వేల వరకు జరిమానా వరకు లేదా జైలు శిక్షపడే అవకాశం ఉంది. నిబంధనలు ఇలా.. ద్విచక్ర వాహనదారుడు రూ.2 వేలు జరిమానా, పదేపదే దొరికితే రూ.5 వేలు జరిమానాతో పాటు ఆరునెలలు జైలు విక్ష విధిస్తారు. కారు, అంతకన్నా పెద్దవాహనాలు నడుపుతూ చిక్కిన వారికి రూ.2500 జరిమానా, మూడు రోజులు జైలు శిక్ష, పదేపదే దొరికితే జైలు శిక్షతోపాటు జరిమానా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తిరుపతి అర్బన్ జిల్లాలో.. 2014లో 1336 కేసులు నమోదు కాగా, రూ.40,68,000 కోర్టులో జరిమానాలు విధించారు. 2015లో 1755 కేసులు నమోదు కాగా రూ.61,93,400 జరిమానాలు కోర్టు ద్వారా విధించారు. 2015లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి సుమారు రెండు నెలలు పాటు జైలు శిక్షపడింది. మరో వ్యక్తికి లెసైన్స్ లేనందున మూడు రోజులపాటు జైలు శిక్ష విధించారు. 2016 జూలై వరకు రూ.23,62,800 ఇప్పటి వరకు మద్యం తాగిన వారి వద్ద జరిమానాలను కోర్టు వసూలు చేసింది. చిత్తూరులో కేసులు ఇలా.. 2014లో 1470 కేసులు నమోదు కాగా కోర్టు ద్వారా రూ.49,71,200 జరిమానాల రూపంలో వసూలు చేశారు. 2015లో 1272 కేసులు నమోదు కాగా కోర్టు ద్వారా రూ.37,72,100లు వసూలు చేశారు. 2016లో జూలై వరకు సుమారు 400లకు పైగా కేసులు నమోదు చేసి రూ.17 లక్షలకు పైగా కోర్టు ద్వారా జరిమానాలు విధించారు. జరిమానా మా లక్ష్యం కాదు.. వాహనదారులకు జరిమా నా విధించడం మా లక్ష్యం కాదు. మద్యంసేవించి వాహనాలు నడపడం వల్ల నిండుప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయి. వాటిని అరికట్టడమే ముఖ్యం. మద్యం సేవించి వాహనాలు నడిపితే గతంలో జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుం డా మద్యం సేవించి, ట్రిపుల్ రైడింగ్‌లో కాలేజీ విద్యార్థులు ఎవరైనా దొరికితే వారి వద్ద మొదటిసారిగా 3 గంటలసేపు ట్రాఫిక్ విధులు నిర్వహింపజేస్తాం. రెండోసారి దొరికితే మూడు రోజులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్, ట్రాఫిక్ డీఎస్పీ, తిరుపతి -
ఉల్లం‘ఘనులు’పై కఠిన వైఖరి
♦ తాగి వాహనాలు నడిపితే శిక్ష ♦ శంషాబాద్ విసృ్తతంగా డ్రంకెన్ డ్రైవ్ ♦ ఏటా పెరుగుతున్న కేసులు ♦ ఆరు నెలల్లో 649 కేసులు తాగి వాహనాలు నడిపితే ప్రమాదానికి గురై తనకు తాను హాని కలిగించుకోవడమే కాకుండా అమాయకుల ప్రాణాలను సైతం తీస్తున్న ఉల్ల‘ఘనులు’ ఇంకా మారడం లేనేలేదు. మత్తులో వాహనాలు నడిపే వారి సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్నా.. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన తాగుబోతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల డ్రంకెన్ డ్రైవ్‌ను విసృ్తతంగా చేపడుతున్నారు. ఓ వైపు అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డుపై రాకపోకలు వాహనాలను ఆపి పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ చేపడతున్నారు. ఈ ఏడాది జనవరి మాసం నుంచి జులై 13 వరకు మొత్తం 649 మంది తాగుతూ వాహనాలు న డిపి పోలీసులకు చిక్కారు. వీరిలో ఇప్పటి వర కు 20 మందికి ఒకరోజు జైలు శిక్ష పడగా 112 మందికి శంషాబాద్ చౌరస్తాలో ఒక రోజు ట్రాఫిక్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. మిగతా 517 మంది 5,93,000 జరిమానా చెల్లించారు. జనవరి నెలలో 88 మంది, ఫిబ్రవరిలో 77, మార్చిలో 110, ఏప్రిల్‌లో 89, మేలో 115, జూన్ లో 95, జూలైలో ఇప్పటి వరకు 75 మంది తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఆ స్థారుులో తాగుబోతులు దొరికిపోయారు. 2015 ఏడాది కాలంలో 578 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వారి నుంచి 6,49,000 జరిమానా వసూలు చేశారు. అంతకుముందు 2014లో శంషాబాద్ ట్రాఫిక్ ఏరియాలో 224 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యారుు. వీరి నుంచి 4,06,800 జరిమానాను వసూలు చేశారు. గతంలో కన్నా ప్రస్తుతం డ్రంకెన్ డ్రైవ్‌ను పెద్ద ఎత్తున చేపడుతున్న కారణంగానే కేసులు కూడా పెరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నారుు. యువతే అధికం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు పెంచుతున్నా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ఇందులో ఎక్కువగా యువకులు, విద్యావంతులు కూడా అధికంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది. పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా ద్విచక్రవాహనదారులే ఉన్నారు. భారీ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు కూడా 100 శాతానికి మించి ఆల్కహాల్ సేవించి నడిపిస్తూ పట్టుబడుతున్నారు. మౌత్ అనలైజర్ ద్వారా 30 శాతం మించితే ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తున్నారు. 30 శాతం నుంచి 100 లోపు ఉన్న నమోదైన వారికి జరిమానా లేదా ట్రాఫిక్ డ్యూటీ 100 శాతం మించిన వారికి ఒకరోజు జైలు శిక్ష, 200 మించి వారికి రెండురోజు జైలు శిక్షలు అమలవుతున్నారుు. రెండోసారి పట్టుబడిన వారికి రెండు నుంచి ఐదు రోజులు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలున్నారుు. తాగుబోతుల ఆల్కహాల్ శాతంతో కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వారికి సంబంధిత కోర్టులో హాజరుపరుస్తున్నారు. అరుుతే న్యాయమూర్తి ఆదేశానుసారం వీరికి శిక్షలు అమలవుతున్నారుు. తలవంచుకుని.. తాగి వాహనం నడిపి శిక్ష పడిన కొందరు ఒకరోజు ట్రాఫిక్ డ్యూటీలో భాగంగా ఆయా చౌరస్తాలో నిలబడి ‘డోంట్ డ్రంకెన్ డ్రైవ్’ బోర్డులు చేతబట్టుకుని విధులు నిర్వహించాల్సి వస్తోంది. తాగి కొని తెంచుకుంటున్న ఈ తంటాతో సమాజంలో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుని అపరాధ భావానికి గురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని చూసి ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావల్సిన పరిస్థితి కనిపిస్తోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నారుు. ఇటీవల స్థానికంగా తాగి శిక్షకు గురైన ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహించిన వారిలో కొందరు చోటా నాయకులతో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు. -
కొండముచ్చు అన్నందుకే స్వాతిని చంపా
విచారణ వేగవంతం * కొండముచ్చు అన్నందుకే చంపా * దేవరాజన్ బృందంతో నిందితుడు * తల్లి, సోదరి వద్ద కూడా విచారణ * మీనాక్షిపురం ఇంట్లో తనిఖీలు సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి చెన్నైకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తరలించారు. కాగా తన ప్రేమను తిరస్కరించడమే కాకుండా, కొండముచ్చు(దేవాంగు) వలే ఉన్నావని పదేపదే హేళన చేయడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చినట్టు దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందం ఎదుట రామ్‌కుమార్ వాంగ్ములం ఇచ్చాడు. ఇక, ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసిన సెంగోట్టై పోలీసులు మీనాక్షిపురంలోని రామ్‌కుమార్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ప్రేమోన్మాదంతో స్వాతిని హతమార్చిన నిందితుడు రామ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది. ఈ కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారి దేవరాజన్ నేతృత్వంలోని బృందం శనివారం రాత్రంతా పాళయం కోట్టై ప్రభుత్వ ఆసుపత్రిలో తిష్ట వేసింది. ఆసుపత్రి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా అక్కడికి వచ్చే వాళ్లు ప్రతి ఒక్క రినీ తనిఖీల అనంతరం అనుమతించారు. రామ్‌కుమార్‌కు ఆస్పత్రి తరఫున బ్రెడ్, పాలు మాత్రం అందించారు. రాత్రంతా ఈ బృందం జరిపిన విచారణలో తనలోని ప్రేమికుడు, ఉన్మాది గురించి రామ్‌కుమార్ వివరించాడు. ఫేస్బుక్ ద్వారా స్వాతితో ఏర్పడ్డ పరిచయం, ఆమె కోసమే చెన్నై వచ్చినట్టుగా పేర్కొన్నాడు. తాను ప్రేమించమని ఒత్తిడి తెచ్చినప్పుడల్లా స్వాతి చీదరించుకునేదని పేర్కొన్నాడు. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో తన మీద ఆమెకు ప్రేమ ఉందని భావించినట్టు, అందుకే పదే పదే వెంటబడ్డట్టూ వివరించాడు. అదే సమయంలో తన ప్రేమకు మధ్యవర్తి ఓ మిత్రుడు వ్యవహరించినట్టు రామ్‌కుమార్ పేర్కొనడంతో అతగాడి కోసం విచారణ మొదలెట్టారు. చివరకు తనను తిరస్కరించిన స్వాతి కొండముచ్చు వలే ఉన్నావని పదే పదే వ్యాఖ్యానించడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చాడని, మీనాక్షిపురానికి వచ్చి సమీపంలోని ఓ తోటలో అరటి గెలలు కోయడానికి ఉంచిన కత్తిని రహస్యంగా తీసుకుని చెన్నైకు వెళ్లినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ రోజు ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదు అని, ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించానని, అయితే, ఆమె మాటలు ఉన్మాదిని చేసినట్టు, హంతుకుడిగా మార్చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నుంగంబాక్కం స్టేషన్ నుంచి మేన్షనుకు రాగానే టీవీల్లో స్వాతి మృతి చెందినట్టు వచ్చిన వార్తతో అక్కడి నుంచి ఉడాయించి మీనాక్షిపురం చేరుకున్నట్టు వివరించాడు. రెండ్రోజులు బయటకు వెళ్లనప్పటికీ, తర్వాత మేకల మందల్ని తోలుకుని బయటకు వెళ్లినట్టు, క్రమంగా ఈ హత్య కేసు విచారణ గురించి పత్రికలు, టీవీల్లో తెలుసుకుంటూ వచ్చానని పేర్కొన్నాడు. తన ఇంటికి మఫ్టీలో మహిళా కానిస్టేబుల్ వెళ్లినప్పుడే పోలీసులు తనను సమీపించినట్టే అని భావించి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టే మీడియాల్లో సమాచారాలు వెలువడుతుండడం గమనార్హం. ఇక, ప్రేమోన్మాది మీద సెంగోట్టై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసి, అతడి ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ రక్తపు మరకతో ఉన్న చొక్కా, స్వాతి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, స్వాతిని హతమార్చిన విషయం ముందుగా తమకు తెలియదని రామ్‌కుమార్ తల్లి పుష్ప పోలీసులు వద్ద స్పష్టం చేశారు. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, ఫేస్బుక్ పరిచయం గురించి తమకు తెలియదంటూ రామ్‌కుమార్‌తో సన్నిహితంగా ఉండే మీనాక్షిపురం మిత్రులు తెలియజేయడం గమనార్హం. అయితే, అవసరం మేరకు తప్ప, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని, అలాంటి వాడా, ఇలా అన్న విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నైకి రామ్‌కుమార్: రాత్రంతా సాగిన విచారణతో ఆదివారం ఉదయం రామ్‌కుమార్‌కు వైద్య పరీక్షల్ని అందించారు. కొంత మేరకు కోలుకున్న దృష్ట్యా, ఇక, చెన్నైకు తీసుకెళ్లవచ్చని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్, వైద్యబృందం, ముందు రెండు, వెనుక రెండు పోలీసు వాహనాలను సిద్ధం చేసి భద్రత నడమ చెన్నైకు తరలించే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం చెన్నైకు తరలించే ప్రయత్నం చేసినా, అక్కడి కోర్టు న్యాయమూర్తి సెలవు మీద వెళ్లి ఉండడంతో సమస్యలు తప్పనట్టు సమాచారం. చెన్నైకు రామ్‌కుమార్‌ను తరలించే క్రమంలో అతడ్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున ఆసుపత్రి ఆవరణలో చుట్టుముట్టడంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. చివరకు న్యాయ పర సమస్యల్ని అధిగమించి, గట్టి భద్రత నడమ సరిగ్గా ఐదు గంటల సమయంలో అంబులెన్స్ పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి జాతీయ రహదారి గుండా చెన్నై వైపుగా దూసుకెళ్లింది. ఆరు వందల కి.మీ దూరం పయనం కాబట్టి, సోమవారం వేకువ జామున చెన్నైకు చేరుకోనున్నారు. నేరుగా రామ్‌కుమార్‌ను రాయపేట ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ ప్రత్యేక వార్డులో వైద్య చికిత్సలు అందించి, వైద్యుల సలహా మేరకు తదుపరి విచారణను వేగవంతం చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలు స్వాతి హత్యతో సమాప్తం కావాలని, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, రామ్‌కుమార్ కఠినంగా శిక్షించబడాలని స్వాతి చిన్నాన్న గోవిందరాజన్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అలాగే, స్వాతి స్నేహితుడు మహ్మద్ బిలాల్ సిద్ధిక్ పేర్కొంటూ, వేధింపుల విషయాన్ని స్వాతి ఎవరి దృష్టికైనా తీసుకొచ్చి ఉంటే, ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదు అని వ్యాఖ్యానించాడు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం, ఏ సమస్యనైనా నేరుగా ఢీకొట్టే ధైర్యం, శక్తి ఆమెకు ఉండబట్టే ఎవరి దృష్టికి తీసుకు రాలేదని పేర్కొంటూ, నిందితుడు కఠినంగా శిక్షించ బడాలని విన్నవించాడు. ఇళ్ల వద్ద నిఘా..నిఘా నేత్రాల మీద ప్రస్తుతం అందరి దృష్టి మళ్లింది. స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను గుర్తించడంలో నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడ్డాయి. రైల్వే స్టేషన్లలో నిఘా నేత్రాలు కన్పించనప్పటికీ, నుంగబాక్కం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా నిందితుడు ఉడాయిస్తుండడాన్ని బందించింది. ఇది పోలీసుల విచారణకు ఎంతగానో దోహదపడింది. ఈ పరిస్థితుల్లో తమ ఇళ్ల వద్ద నిఘా నేత్రాల ఏర్పాటు మీద జనం దృష్టి పెట్టారు. సొంత ఇళ్లు కల్గిన వాళ్లతో పాటు అపార్ట్మెంట్స్, పలు ప్రాంతాల్లోని దుకాణాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు మీద ఆయా యజమానులు దృష్టి పెట్టి ఉండడం విశేషం. ఇందుకు తగ్గట్టుగా సీసీ కెమెరాల విక్రయ ఏజెన్సీలు రంగంలోకి దిగి ఉండడం గమనార్హం. -
బ్యాంకు పేరుతో 5లక్షలు దోచేశారు
రూ.4.90లక్షలు ఖాతా నుంచి మళ్లింపు ఖమ్మం : బ్యాంక్ ఆఫ్ పాటియాలతో రూ.4.90లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకోంది. టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయ్‌నగర్ కాలనీకి చెందిన పోల్లు సత్యనారాయణకు మూడు అంతస్తుల భవనం ఉంది. పై అంతస్తులో ఆయన నివాసం ఉంటుండగా కింద ఫోర్షన్ ఖాళీగా ఉంది. గురువారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తాము బ్యాంక్ ఆప్ పాటియాల ఉద్యోగులమని, మీ ఇంట్లో తమ బ్యాంక్ పెట్టాలని అనుకుంటున్నామని సత్యనారాయణను నమ్మించారు. చదరపు మీటర్ రూ.40 చొప్పున అద్దె మాట్లాడుకున్నారు. అప్లికేషన్ ఫాంకు సంబంధించి మొత్తం రెండు చెక్కులు ఇవ్వాలని, ఒక చెక్కుపై రూ.200, మరోచెక్కుపై రూ.2,500 ఇవ్వాలన్నారు. సత్యనారాయణ ఆయన భార్య పేరు మీద సిండికేట్ బ్యాంక్ చెక్కులు రెండు ఇచ్చాడు. శుక్రవారం ఖాతా నుంచి రూ.4.90లక్షలు డ్రా అయినట్లు మేసేజ్ వచ్చింది. వెంటనే ఆయన బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా ఢీల్లీలో సందీప్‌కుమార్ సింగ్ ఖాతాకు మళ్లింపు చేసారని సిండికేట్ బ్యాంక్ అధికారులు చెప్పారు. వెంటనే సత్యనారాయణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారుల్లో క్రమశిక్షణ లేదు
రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి రెండో రోజు కొత్త, పాత ప్రభుత్వాస్పత్రుల్లో పూనమ్ తనిఖీలు విజయవాడ (లబ్బీపేట) : అధికారుల్లో డిసిప్లిన్ లేదు.. ఇక కిందస్థాయి వారు ఎలా ఉంటారో అర్థమవుతుందంటూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పనిచేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని, అవి అధికారులు పాటిస్తే కిందస్థాయి వారు పాటిస్తారని ఆమె తెలిపారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు సమీక్ష జరిపిన ఆమె, మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకే పాత ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ విభాగంలో చికిత్స పొందుతున్న శిశువుల తల్లులు వేచివున్న గదికి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురిని సమస్యలు అడగగా, సిజేరియన్ అయిన ఐదు రోజులకే డిశ్చార్జి చేస్తున్నారని, ఇక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పూనమ్ మాలకొండయ్య, సిజేరియన్ అయిన వారి కోసం అక్కడ పడకలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసూతి ఓపీ విభాగాన్ని, అక్కడి పరికరాలను పరిశీలించారు. అనంతరం కొత్త ప్రభుత్వాస్పత్రికి చేరుకుని డయాగ్నోస్టిక్ బ్లాక్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కుర్చీలు ఖాళీగా ఉండటంతో వారు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పక్క గదిలో ఉన్న సిబ్బంది రాగా, మీరు యూనిఫామ్ వేసుకోరా అని నిలదీశారు. అనంతరం ఐసీటీసీ, ఏఆర్టీ విభాగాలను పరిశీలించారు. మధ్యాహ్నం డయాగ్నోస్టిక్ బ్లాక్ పైన నిర్మాణం పూర్తయిన రెండు అంతస్థులను పరిశీలించి, దానికి విద్యుత్ సౌకర్యం కల్పించి ప్రారంభోత్సవం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూపర్ బ్లాక్, ఇతర సౌకర్యాలపై చర్యలు ప్రధానమంత్రి స్వాస్థ్ సురక్ష యోజన పథకం ద్వారా మంజూరైన రూ.150 కోట్ల నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణాలకు సంబంధించి ప్లాన్‌ను డీఎంఈ డాక్టర్ టి.వేణుగోపాలరావు, ఏపీహెచ్ఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజనీర్ డి.రవీందర్‌లతో కలిసి చర్చించారు. బ్లడ్‌బ్యాంక్‌లో కాంపోనెంట్స్ యూనిట్ ఏర్పాటు, అదనపు యూనిట్ల మంజూరు వంటి అంశాలపై సూపరింటెండెంట్ చాంబర్లో ఉన్నతాధికారులతో మాట్లాడారు. రెండు రోజుల సందర్శనలో తన దృష్టికొచ్చిన అంశాలపై అధికారులతో చర్చించారు. సాయంత్రం పాత ప్రభుత్వాస్పత్రిని సందర్శించి రోగులకందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో రాష్ట్ర అధికారుల హడావుడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య ప్రభుత్వాస్పత్రిలో చేపట్టాల్సిన పనులను పరిశీలించేందుకు పలువురు అధికారులు హడావుడి చేశారు. ఏపీహెచ్ఎంఎస్ఐడీసీ ఎండీ వెంకట గోపీనాధ్ సివిల్ పనులు, పరికరాల అంశాలను పరిశీలించగా, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ, డ్రగ్ కంట్రోల్ బోర్డు డెరైక్టర్ రవిశంకర్ అయ్యర్ బ్లడ్ బ్యాంక్‌ను పరిశీలించారు. వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ బి.సోమరాజు, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ సావిత్రి, అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ నీరద, డీఈఈ రోహిణి, వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు జితేంద్రశర్మ పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. వారి వెంట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నాగమల్లేశ్వరి ఉన్నారు. -
మా పొట్ట మీద కొట్టకండి
సర్కారు వైఖరిపై ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆవేదన ఆత్మగౌరవం దెబ్బతినేలా పోలీసులతో తనిఖీలా? తనిఖీలు ఆపకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసులతో తనిఖీలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో 85 శాతం విద్యావ్యాప్తికి దోహదపడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఏకపక్షంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. కనీసం తమను చర్చలకు పిలవకుండా, సంప్రదించకుండా తనిఖీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటని ప్రశ్నించింది. తనిఖీల పేరుతో తమ పొట్టల మీద కొట్టొద్దని అభ్యర్థించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో తనిఖీలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీగా ఆవిర్భవించాయి. జేఏసీ కన్వీనర్ గింజల రమణారెడ్డి, ప్రతినిధులు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. విద్యాసంస్థల్లో పోలీస్, ఇంటెలిజెన్స్, ఏసీబీ, విజిలెన్స్ తదితర శాఖాధికారులతో ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తామన డం అన్యాయమన్నారు. అది రాష్ట్రానికే అవమానకరం తెలంగాణలోని విద్యాసంస్థలు బోగస్ అని ప్రకటించడం రాష్ట్రానికే అవమానకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. తనిఖీలకు తాము వ్యతిరేకం కాదని, అయితే సంబంధిత విద్యాశాఖ అధికారులతోనే తనిఖీలు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యాసంస్థల యాజమాన్యాలనే దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన చెందారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఆదివారంలోగా తనిఖీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోగా రూ. 3,500 ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు భాస్కర్ రెడ్డి, కె. సిద్ధేశ్వర్, కో ఆర్డినేటర్ ఎస్ఎన్ రెడ్డి, అధికార ప్రతినిధి గౌరీ సతీశ్, రాంచందర్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో బాంబు పెట్టాం!
ఆకతాయి ఫోన్‌కాల్ పోలీసులు ఉరుకులు, పరుగులు సికింద్రాబాద్: ‘‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టాం.. మరి కొద్ది సేపట్లో పేలుతుంది. జాగ్రత్త’’... అంటూ...ఫోన్ చేసి ఓ ఆకతా యి పోలీసుల ను ఉరుకులు, పరుగులు పెట్టించాడు. వివరాలు... గురువారం మధ్యాహ్నం 2.30కి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టామని, కొద్దిసేట్లో పేలుపోతుందని హెచ్చరించాడు. కంట్రోల్ రూమ్ సిబ్బంది సమాచారం మేరకు అప్రమత్తమైన జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు రైల్వేస్టేషన్లో తనిఖీలు ప్రారంభించారు. ప్లాట్‌ఫామ్‌లు, వెయిటింగ్ హాళ్లు, స్టేషన్ పరిసరాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఎవరో అకాతాయి ఈ ఫోన్ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపం నుంచే ఈ కాల్ వచ్చిందని, సదరు ఫోన్‌మాత్రం రాజేంద్రనగర్‌కు చెందిన నరేష్‌దని గుర్తించారు. చిరునామా అధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు జీఆర్పీ బృందాలు బయలుదేరాయి. కాగా, సదరు ఆకతాయిని పోలీసులు గురువారం రాత్రే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
చెక్కు...చిక్కు!
చెల్లని చెక్కులతో అధికారులకు ఇక్కట్లు ఆస్తిపన్ను వసూళ్లలో కొత్త తలనొప్పులు సంబంధిత వ్యక్తులకు నోటీసులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అధికారులకు ‘చెక్కు’లు చుక్కలు చూపిస్తున్నాయి. పన్నుల చెల్లింపునకు కొంతమంది ఇస్తున్న చెక్కులు చెల్లడం లేదు. వాటిని అందుకునేటపుడు సంతోషిస్తున్న అధికారులు... తీరా అవి బౌన్స్ అవుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి అందిన చెక్కుల్లో దాదాపు రూ.150 కోట్ల మేర చెల్లనివి ఉన్నట్లు తెలిసింది. చెక్కుల రూపంలో పన్ను చెల్లించిన వారిలో సుమారు 27,600 మంది ఇచ్చినవి బౌన్సయ్యాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామంటూ లాయర్ నోటీసులు పంపించగా... రూ.137 కోట్లు తిరిగి వసూలయ్యాయి. ఇంకా రూ.13 కోట్లు రావాల్సి ఉంది. మరో 3,650 మంది నుంచి పన్నులు వసూలు కావాల్సి ఉంది. లాయర్ నోటీసులిప్పించేందుకు జీహెచ్ఎంసీ ఒక్కో కేసుకు దాదాపు రూ.135 ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని సంబంధిత వ్యక్తులనుంచే వసూలు చేయనున్నారు. ఆస్తిపన్ను చెల్లించామని చెప్పి కొంతకాలం తప్పించుకునేందుకు సదరు వ్యక్తులు ఇలా జీహెచ్ఎంసీకి టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. లాయర్ నోటీసులతో బెంబేలెత్తి తిరిగి చెల్లింపులు ప్రారంభించారు. ఇలాంటి చెల్లని చెక్కులు ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ నెల దాటితే కానీ తెలియదు. చెక్‌బౌన్స్ కేసుల్లో ఎక్కువ మొత్తం రావాల్సిన సర్కిళ్లలో ఖైరతాబాద్, అబిడ్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1100 కోట్లు. ఇప్పటి వరకు దాదాపు రూ.790 కోట్లు వసూలయ్యాయి. మిగతా టార్గెట్ పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు శ్రమిస్తున్నారు. మిగిలిన పది రోజుల్లో ఎంతమేరకు లక్ష్యం సాధిస్తారనేది వేచి చూడాలి. -
రూ.100 కోట్లు అడిగితే 12 కోట్లిచ్చారు
ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు అంటూ అరకొర నిధులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 20 నెలలు దాటిన తరువాత ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. రోడ్లపై చెట్ల నీడలో, దాబాలో కూర్చొని అంతర్రాష్ట్ర వాహనాలను ‘తనిఖీ’ చేస్తున్న తీరుపట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు చెక్‌పోస్టుల కోసం నిధులు కేటాయించింది. అయితే, ఈ 7 ‘ఇంటిగ్రేటెడ్’ చెక్‌పోస్టుల కోసం కేవలం రూ.12కోట్లు మాత్రమే విడుదల చేసింది. చెక్‌పోస్టుల నిర్మా ణం, నిఘా ఏర్పాట్ల కోసం తొలివిడత రూ.100 కోట్ల వరకు అవసరమని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు నివేదికలు పంపినప్పటికీ, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై నిఘా వేసేందుకు 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో కోదాడ, విష్ణుపురం, నాగార్జునసాగర్, ఖమ్మంలో పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో తుంగభద్ర నది బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆయా సరిహద్దుల్లో ప్రభుత్వ స్థలాలేవీ లేనందున ప్రైవేటు భూములను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. భూసేకరణ చట్టం అమలు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, న్యాయపరమైన చిక్కుల్లేకుండా భూములు కొనుగోలు చేయడమొక్కటే మార్గమని అధికారులు భావించారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద కనీసం నాలుగెకరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ధర విషయంలో అధికారులకు, భూ యజమానులకు పొంతన కుదరకపోవడంతో... బీఓటీ (నిర్మాణం, నిర్వహణ, అప్పగింత) విధానంలో లీజు పద్ధతిలో తీసుకోవాలని భావించారు. ఈ విధానానికి కొన్ని జిల్లాల్లో భూ యజమానులు ఒప్పుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, చెక్‌పోస్టులు నిర్మించాల్సి ఉంది. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ విధానంలోనే ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఈ లెక్కన చెక్‌పోస్టుల వద్ద అధునాతన కెమెరాలు, స్కానర్లు, వేయింగ్ మిషన్లు, గోడౌన్, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో సాధార ణ రీతిన కూడా చెక్‌పోస్టుల నిర్మాణం సాధ్యం కాదని అధికారులే పెదవి విరుస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏవీ? రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖకు ఏపీతో పా టు కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దులున్నాయి. కర్ణాటకతో చిరాగ్పల్లి, జహీరాబాద్ క్రాస్‌రోడ్స్‌లో చెక్‌పోస్టులు ఉండగా, మహారాష్ట్రతో బైంసా, వాంకిడి, మద్నూర్‌లలో ఉన్నాయి. ఇవికాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని బొరాజ్, నిజామాబాద్ జిల్లాలోని సాలూర చెక్‌పోస్టులు ప్రాధాన్యత గలవి. వీటిని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా మార్చాలని సమైక్య రాష్టంలోనే ప్రణాళికలు తయారు చేసినా.. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. -
హాస్టళ్లపై ఏసీబీ పంజా
♦ యాలాల బీసీ బాలుర, కుల్కచర్ల మండలం ♦ ముజాహిద్పూర్ గిరిజన హాస్టళ్లలో తనిఖీలు ♦ బయటపడిన అవకతవకలు ♦ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్న ఏసీబీ అధికారులు ♦ జిల్లాలోని రెండు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు ♦ విద్యార్థుల హాజరు, మెనూ, వసతులపై ఆరా ♦ రికార్డుల నమోదులో వ్యత్యాసాల గుర్తింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా : పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతిగృహాల్లో అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. మూడేళ్లుగా ఏసీబీ అధికారులు వసతిగృహాల్లో అకస్మిక తనిఖీలు చేపడుతుండడంతో ఈ వ్యవహారం క్రమంగా బట్టబయలవుతోంది. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతూ సర్కారు సొమ్ము స్వాహా చేస్తున్నారు. అంతేకాకుండా కాస్మోటిక్ చార్జీలు.. ఉపకార వేతనాలను అక్రమంగా డ్రా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వసతిగృహ సంక్షేమాధికారి మొదలు పైస్థాయి వరకు ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ పంజా విసిరింది. జిల్లాలోని యాలాల, కుల్కచర్లలోని వసతి గృహాలపై మంగళవారం దాడులు చేసింది. ఉదయం 9 గంటలకు దాడులు ప్రారంభించిన అధికారులు హాస్టళ్ల సిబ్బందిని హడలెత్తించారు. యాలాలలోని బీసీ బాలుర వసతి గృహంలో వసతులు, విద్యార్థుల హాజరుశాతం, ఆహార పదార్థాల నాణ్యత, మెనూ తదితర వివరాలు సేకరించారు. వసతిగృహంలో 96 మంది విద్యార్థులున్నట్టు రికార్డుల్లో ఉంది. కానీ అధికారుల తనిఖీలో సమయంలో 56 మందే ఉన్నారు. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గిరిజన హాస్టల్లోనూ ఉదయం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. ఇక్కడి హాస్టల్లో 273 మంది విద్యార్థులున్నట్లు రిజిస్టర్లో నమోదు చేశారు. కానీ 151 మందే ఉన్నారు. యాలాల/కుల్కచర్ల: యాలాల, కుల్కచర్లలోని ప్రభుత్వ వసతిగృహాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. యాలాలలోని బీసీ బాలుర హాస్టల్లోని వసతులు, విద్యార్థుల హాజరుశాతం, ఆహార పదార్థాల నాణ్యత, మెనూ వివరాల గురించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వివరాలు సేకరించారు. బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ సుందరమ్మ బాలుర వసతి గృహానికి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. వసతిగృహంలో మొత్తం 96 మంది విద్యార్థులున్నట్టు రికార్డుల్లో ఉండగా, ఏసీబీ అధికారుల తనిఖీలో 56 మందే ఉన్నట్లు గుర్తించారు. కూరగాయలు, బియ్యం తదితర స్టాకు వివరాలు సేకరించారు. వీటితో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు, మెనూ ప్రకారం భోజనం అందడం లేదనే విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీలు ఏసీబీ సీఐలు నాగేశ్వరరావు, రాజేష్ ఆధ్వర్యంలో జరిగాయి. అదేవిధంగా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గిరిజన హాస్టల్లో కూడా మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ తనిఖీ లు కొనసాగాయి. ఏసీబీ సీఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 7 గంటలకు హాస్టల్‌కు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్ వసతులను పరిశీలించారు. వంటగది, విద్యార్థుల గదులను పరిశీలించారు. వార్డెన్ నాగలక్ష్మి స్థానికంగా లేకపోవడంతో ఆమెకోసం మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచిచూశారు. రెండు గంటలకు ఆమె రావడంతో రికార్డులు పరిశీలించారు. అనంతరం ఏసీబీ సీఐ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. హాస్టల్లో 273 మంది విద్యార్థులున్నట్లు రీజిస్టర్లో ఉన్నా.. హాస్టల్ మాత్రం 151 మందే ఉన్నారని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేద ని, నాణ్యత లేదని విద్యార్థులు చెప్పారన్నారు. రికార్డు ప్రకారం బియ్యం లేవన్నారు. విద్యార్ధులకు బట్టలు,నోట్ పుస్తకాలు, చాపలు ఇవ్వకుండా దాచి పెట్టినట్లు తెలిపారు. ఈ విషయంపై వార్డెన్ నాగలక్ష్మి, డీటీడబ్ల్యూఓ రామేవ్వర్లను విచారించామ ని.. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. తనిఖీల్లో ఏసీబీ సీఐ లక్ష్మి పాల్గొన్నారు. ♦ మూడేళ్ల క్రితం మహేశ్వరం మండలం బీసీ సంక్షేమశాఖ వసతిగృహంపై దాడులు చేసిన అధికారులు పలు అక్రమాలను గుర్తించారు. అప్పట్లో ఉన్న వసతిగృహ సంక్షేమాధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ♦ గతేడాది ఘట్కేసర్లోని బీసీ సంక్షేమ వసతిగృహంపైనా ఆకస్మిక దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాలను వెలికితీశారు. ఈ క్రమంలో ఇటీవల ఆ వసతిగృహ సంక్షేమాధికారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ♦ మంగళవారం కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహం, యాలాల మండల కేంద్రంలోని వెనకబడిన తరగతులు సంక్షేమశాఖ వసతిగృహంలో ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ పలు అవకతవకలను గుర్తించింది. ♦ ఈ దాడుల్లో వెలుగులోకి వచ్చిన విషయాలను ఏసీబీ అధికారులు త్వరలో జిల్లా యంత్రాంగానికి నివేదిక పంపనున్నారు. -
విజయవాడలో ఆహార భద్రతా శాఖ తనిఖీలు
విజయవాడ: ప్రజల ఆరోగ్యం ప్రభుత్వాలకు పట్టదా.. అని హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాలకు మొట్టికాయలు వేయడంతో అప్రమత్తమైన అధికారులు పండ్ల మార్కెట్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కార్బైట్ సాయంతో పండిన పండ్లను తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పదే అవకాశం ఉన్నందున ఈ విషయం పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో.. రంగంలోకి దిగిన భారతీయ ఆహార భద్రతా శాఖ అధికారులు సోమవారం విజయవాడలోని కేదారేశ్వరి నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా కార్బైట్ సాయంతో పండ్లను మగ్గపెడుతున్న ఓ షాపును సీజ్ చేశారు. శాఖ డెరైక్టర్ మంజరి ఆధ్వర్యంలో 15 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ల బృందం తనిఖీలు కొనసాగిస్తోంది. -
జరిగేది జంబ్లింగే!
స్పష్టతనివ్వడంతో ఏర్పాట్లలో జిల్లా అధికారులు 64 కేంద్రాల్లో ఇంటర్ ప్రయోగ పరీక్షలు సగం ప్రైవేట్ కళాశాలల్లోనే ప్రయోగ పరికరాలు హాజరుకానున్న 33,742 మంది విద్యార్థులు తనిఖీలకు నాలుగు స్క్వాడ్లు విశాఖపట్నం: ఈసారైనా ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ ఉంటుందా.. ఉండదా.. అన్న సందేహాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఫిబ్రవరిలో జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా జంబ్లింగ్ విధానం ప్రవేశపెడతామని చెబుతున్న ప్రభుత్వం పరీక్షలు సమీపించే సమయానికి వెనక్కు తగ్గడం అలవాటుగా మారింది. ఈ ఏడాది తప్పనిసరిగా జంబ్లింగ్ అమలు చేస్తామని ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. ఇంతలో ప్రయోగ పరీక్షలకు అవసరమైన పరికరాల కొరత ఉందన్న అంశాన్ని ప్రైవేటు కాలేజీలు తెరపైకి తెచ్చాయి. దీంతో జంబ్లింగ్ అమలుపై నీలినీడలు అలముకున్నాయి. ఒకపక్క ప్రయోగ పరీక్షలుంటాయని అధికారులు, ఉండకపోవచ్చని ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు చెబుతూ వచ్చారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జంబ్లింగ్ విధానాన్ని ఖరారు చేస్తూ మంగళవారం ఇంటర్మీడియట్ కమిషనర్, కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ తనిఖీ అధికారుల (ఆర్‌ఐఓల)తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జంబ్లింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విధివిధానాలను సూచించారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఆర్ఐవో తమర్బ నగేష్ ప్రాక్టికల్ పరీక్షలు జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం తన కార్యాలయంలో సమావేశమాయ్యరు. 64 కేంద్రాల ఎంపిక ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం విశాఖ జిల్లా, నగరంలో మొత్తం 64 కేంద్రాల ను ఎంపిక చేశారు. వీటిలో 23 ప్రభుత్వ, 11 ఎయిడెడ్, మూడు సాంఘిక సంక్షేమ, రెండు గిరిజన సంక్షేమ కళాశాలలు, 24 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 33,742 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల తనిఖీలు, పర్యవేక్షణకు నాలుగు స్క్వాడ్లను నియమిస్తున్నారు. -
కమర్షియల్ ట్యాక్స్ తనిఖీలు..రూ.14 కోట్ల నగలు పట్టివేత
-
కాల్ డ్రాప్స్‌పై ట్రాయ్ తనిఖీలు...
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌కు సంబంధించి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్(టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) ఏడు నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. టెలికం కంపెనీల సేవల నాణ్యత మెరుగుపడిందో లేదో చూడ్డానికి ఈ పరీక్షలను ఏడు నగరాల్లో-ఢిల్లీ, ముంబై, సూరత్, కోల్‌కత, పుణే, భువనేశ్వర్, ఇండోర్ల్లో నిర్వహిస్తున్నామని ట్రాయ్ ఉన్నతాధికారొకరు చెప్పారు. గత నెల 21 నుంచి మొదలైన ఈ పరీక్షలు ఈ నెల 8 వరకూ జరుగుతాయని పేర్కొన్నారు. కాగా కాల్డ్రాప్స్ సమస్య మెరుగుపడుతోందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. -
అపోలో హాస్పిటల్స్‌లో ఐటీ శాఖ సోదాలు
* ప్రమోటర్ల ఇళ్లలోనూ తనిఖీలు * సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్స్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ మంగ ళవారం తనిఖీలు నిర్వహించింది. ఏవైనా పన్ను ఎగవేత జరిగిందో లేదో నిర్ధారించుకోవడానికి ఈ దాడులు చేపట్టినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి జరిగిన దాడుల్లో 50 బృందాలు పాల్గొన్నాయి. సంస్థ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డితోసహా కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. కంపెనీ వ్యాపారం, రోగుల సేవలకు చెందిన పత్రాలను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఐటీ శాఖ తనిఖీలు చేపట్టడం 33 ఏళ్ల అపోలో చరిత్రలో ఇదే తొలిసారి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతోపాటు ఇతర నగరాల్లోని అపోలో కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. జూబ్లీహిల్స్‌లోని ఆసుప్రతిలో రెండు బ్లాక్‌లను అధికారులు మూసివేసి దాడులు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలను నిలుపుదల చేశారు. అదే సమయంలో చెన్నై, న్యూఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ బ్లాక్‌లను మూసివేశారు. అయితే సాధారణ కార్యకలాపాలను ఎటువంటి అడ్డంకులు కలుగలేదు. తనిఖీల విషయాన్ని అపోలో ధ్రువీకరించింది. ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందించామని వెల్లడించింది. అంతర్గతంగా తాము నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, రోగులు, వాటాదారుల నమ్మకాన్ని కొనసాగిస్తామని తిరిగి హామీ ఇస్తున్నట్టు తెలిపింది. ఐటీ దాడుల నేపథ్యంలో ఒకానొక దశలో అపోలో హాస్పిటల్స్ షేరు ధర బీఎస్ఈలో రూ.1,497 వరకు వెళ్లి రూ.1,431.55లకు వచ్చి చేరింది. చివరకు రూ.1,466.75 వద్ద స్థిరపడింది. -
సేఫ్ అండ్ హ్యాపీ...
-
సేఫ్ అండ్ హ్యాపీ...
హైదరాబాద్: ‘న్యూ ఇయర్ వేడుకలు స్వేచ్ఛగా..సంతోషంగా జరుపుకోండి. అపశ్రుతులకు తావివ్వొద్దు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం..అందరూ సహకరించండి’ అంటూ నగర పోలీసు విభాగం పిలుపునిస్తోంది. నగర వ్యాప్తంగా గురువారం జరుగనున్న కొత్త సంవత్సర స్వాగత వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఐసిస్ అనుమానితుల అరెస్టు, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు వంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పోలీసులతో పాటు అదనపు బలగాలూ విధుల్లో ఉంటాయి. నగరంలో పరిమితికి మించిన శబ్ధం చేసే డీజేలు తదితరాల వినియోగాన్ని నిషేధించారు. మద్యం సేవించి వాహనాలు పడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని అధికారులు పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ‘నో-ఎంట్రీ’... ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్‌ను నిషేధిస్తూ మళ్లింపులు విధించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్లు క్లోజ్... గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తున్న అధికారులు వాటిపై రాకపోకలకు అనుమతించరు. కేవలం ప్రత్యామ్నాయ మార్గాలు లేని, కింద రైల్వే ట్రాక్స్ ఉన్న బేగంపేట, డబీర్‌పుర, సనత్‌నగర్ వంటి ఫ్లైఓవర్లపై మాత్రమే రాకపోకలు ఉంటాయి. ఈ సమయంలో నగరంలోకి భారీ వాహనాల రాకపోకల్నీ నిషేధించారు. ‘జీరో యాక్సిడెంట్ నైట్’గా చేయడంలో భాగంగా డ్రంకన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్‌రైడింగ్ తదితర ఉల్లఘటనలపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ‘ట్రాఫిక్’కు తెల్లవార్లూ నిలువుకాళ్ళ జీతమే.. సాధారణ రోజుల్లో వైన్‌షాపులు రాత్రి 10 గంటల వరకు, బార్లు 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి ప్రభుత్వం డిసెంబర్ 31 రోజున వైన్‌షాపులు 12 గంటలు, బార్లు తెల్లవారుజాము 1 గంటల వరకు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక డ్రైవ్‌ను రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు నిర్వహించాలని నిర్వహించిన ట్రాఫిక్ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ‘108’ నిర్వహిస్తున్న సంస్థతోనూ ట్రాఫిక్ విభాగం తరఫున సంప్రదింపులు జరుపనున్నారు. గతంలో చోటు చేసుకున్న ఉదంతాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్టులు పెట్టుకుని వాహనాలు నడపాలని అధికారులు కోరుతున్నారు. తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకుని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతంగా మెలిగి కొత్త ఏడాదిలో విషాదాలు, ప్రమాదాలు లేకుండా చేయాలని ట్రాఫిక్ వింగ్ కోరింది. ఔటర్‌పై రాకపోకల నియంత్రణ గురువారం ఔటర్ రింగు రోడ్డుపై వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రించనున్నారు. రాత్రి 11 గ ంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకు సాధారణ ప్రజల వాహనాలను ఔటర్‌పైకి నిషేధించారు. ఇందు కోసం ఔటర్ జంక్షన్లలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వారి వాహనాలను మాత్రమే రాత్రి వేళ అనుమతిస్తారు. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు... కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నింధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావ భావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు.అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు.ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి.న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు ‘పార్టీ’లకు రానివ్వొద్దు. మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా... న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ద ృష్టిలో పెట్టుకున్న పోలీసులు గతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ (పెడ్లర్స్) అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిని కట్టడి చేయాలని నిర్ణయించారు. వీరిపై నిఘా ఉంచి, చెక్ చెప్పేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపారు. వీటితో పాటు శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్ కంట్రోలింగ్‌కు ప్రత్యేక బృందాలు, షీటీమ్స్ మోహరిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ బృందాలన్నీ పని చేస్తుంటాయి. మళ్లింపులు ఇలా... వీవీ స్ట్యాచూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజభవన్ మీదుగా మళ్లిస్తారు.బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్ని ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు పంపుతారు.లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, లక్డీకపూల్, అయోధ మీదుగా మళ్లిస్తారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. -
నమ్మకమివ్వని అమ్మకం
కొలతల్లో మాయాజాలం దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో మోసం నిలువుదోపిడీకి గురవుతున్న వినియోగదారులు తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమింపజేసే వారు మెజీషియన్లయితే.. చాలామంది వ్యాపారులు వారినే మించిపోతున్నారు. తూకంలో మాయాజాలంతో వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇంద్రజాలంలో సిద్ధహస్తులు ఉన్నదాన్ని లేనట్టు చేస్తే.. వీరు మాత్రం లేని బరువును ఉన్నట్టు చూపించి జనానికి టోకరా వేస్తున్నారు. తూనికలు కొలతల్లో బురిడీతో వినియోగదారులు రోజూ అడుగడుగునా మోసపోతున్నారు. యలమంచిలి : యలమంచిలి పట్టణంలోని ఓ చికెన్ దుకాణంలో శ్రీనివాసరావు అనే ఉద్యోగి కిలో చికెన్ కొన్నారు. బరువుతగ్గినట్టు అనుమానం రావడంతో మరో దుకాణం లో తూకం వేయిస్తే 900 గ్రాములే ఉంది... అనకాపల్లికి చెందిన శ్యామల ఓ చిల్లర దుకాణంలో రెండు కిలోల కందిపప్పు కొనుగోలు చేశారు. ఎలక్ట్రానిక్ కాటా తూకమే అయినా మోసం జరిగినట్టు అనుమానం వచ్చి మరో దుకాణంలో కందిపప్పును తూకం వేయించారు. 100 గ్రాములు తగ్గడంతో వ్యాపారితో తగాదాకు దిగారు. మనలో ప్రతి ఒక్కరికీ ఇలాటి అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. అయితే తెలియక కొంత, తెలిసినా అడిగే తీరిక లేక కొంత.. ఉదాసీనత వల్ల కొంత.. మొత్తం మీద చాలా సందర్భాల్లో ఈ మోసాలు మరుగున పడిపోతూనే ఉంటాయి. దీంతో పలువురు వ్యాపారులు ఇదో ఆనవాయితీగా మోసం చేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో కాలం వెళ్లదీస్తున్నారు. పెట్రోల్ బంక్, కిరాణా దుకాణం, రేషన్‌షాపు దగ్గర నుంచి పండ్లు, మాంసం, కూరగాయలు, వస్త్రాలు, చివరకు బంగారం వస్తువులు కూడా కొలతల ప్రకారం అమ్మాల్సిందే. అయితే అమ్మకాల్లో నమ్మకం కొరవడుతోందనివినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చినా పద్ధతిలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంకుల్లో బాదుడు పెట్రోల్ బంకుల పంపుల్లో తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణలోనే కొలతలు నిర్ధారించాలి. చాలా చోట్ల వీరు వెళ్లకుండానే బంకు యజమానులు ఇష్టానుసారం ఖరారు చేస్తున్నారు. లీటరు పెట్రోల్, డీజిల్ వేయడానికి కొలతలు నమోదు చేసేటప్పుడు 50 నుంచి 100 మి.లీ. తక్కువ పడేలా నమోదు చేస్తున్నట్టు బంకుల్లో పనిచేసే సిబ్బందే చెబుతున్నారు. దోపిడీ తీరిలా.. రెండేళ్లకోసారి కాటాలు, తూకంరాళ్లకు, ఏడాదికోసారి ఎలక్ట్రానిక్ కాటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్రలు వేయించాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల ఈ పరిస్థితే ఉండడం లేదు. కొందరు రేషన్ షాపుల నిర్వాహకులు ఎలక్ట్రానిక్ కాటాలను పక్కనపెట్టి పాత రాళ్లను వినియోగిస్తున్నారు. రెండేళ్లకిందట అమలులోకి వచ్చిన ప్యాకింగ్ కమోడిటీస్ చట్టం నూతన నిబంధనల ప్రకారం ప్రతివస్తువును ప్యాకింగ్ చేసి విక్రయించాలి. వాటిపై తయారు చేసిన తేది, నికర బరువు, ధర, ఎప్పటిలోగా వినియోగించాలనే వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ పద్ధతిని పాటించేవారే లేరన్నది విస్పష్టం. నామమాత్రంగా కేసులు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల దుకాణాలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు తదితరాలు కలిపి సుమారు 30వేలు ఉన్నాయి. వీటిపై 2014-15 ఆర్ధిక సంవత్సరంల ో ఇప్పటి వరకు కేవలం 300 కేసులు నమోదు చేసి రూ.11లక్షలు అపరాధ రుసుము కింద వసూలు చేశామని ఆ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ థామస్ రవికుమార్ తెలిపారు. తన పరిధిలో 34 మండలాల్లో అనకాపల్లి, నర్సీపట్నం ఇన్స్పెక్టర్లు కూడా తనిఖీ చేస్తారని తెలిపారు. వినియోగదారులు మోసాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. -
టంగుటూరులో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
-
భద్రతపై గురి!
10 నుంచి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ! అన్ని సంస్థల్లో సీసీ కెమెరాలు, గార్డులు తప్పనిసరి ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల పరిశీలన ‘సేఫ్‌సిటీ’పై నడుం బిగిస్తున్న పోలీసులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యా లయాల్లో భద్రతకు సంబంధించి పోలీసులు కఠిన నిబంధనలను రూపొందిస్తున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ నెల 10 నుంచి అన్ని సంస్థల భద్రతపై ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో జరిగే ఈ క్షేత్రస్థాయి తనిఖీల్లో ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు (అర్బన్): జిల్లాపై నిఘా పెంచడంతో పాటు భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి పోలీసుశాఖ సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలోని ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ‘సేఫ్టీ ఆడిట్’ పేరిట తనిఖీలు చేపట్టనున్నారు. ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాను సేఫ్‌సిటీగా మార్చాలనే నినాదంతో పోలీసుశాఖ ప్రజల్లోకి వెళ్లనుంది. ఇలా తనిఖీలు.. ప్రజల భద్రతకు ప్రభుత్వ ప్రయివేటు సంస్థలు తీసుకుంటున్న చర్యలపై పోలీసు శాఖ క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రయివేటు సంస్థలు, సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, సూపర్బజార్లు, కార్పొరేటర్ సంస్థలకు చెందిన మాల్స్‌తో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలను పోలీసులు తనిఖీ చేస్తారు. ఇక్కడ ప్రజలకు ఏదైనా ఇబ్బందులొస్తే సంస్థల యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయనే విషయాలను పరిశీలిస్తారు. అసాంఘిక శక్తులు ప్రమాదకరమైన వస్తువులు తీసుకెళితే ముందగానే గుర్తించి ఎలా నిరోధిస్తారు..? చోరీలను నియంత్రించేందుకు ఏంచర్యలు చేపడుతున్నారనే విషయాలను నిశితంగా పరిశీలిస్తారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా సీసీ కెమెరాలు పెట్టుకోవడం, ప్రజలు మాల్స్, ఇతర సముదాయాల్లోకి వెళ్లేప్పుడు తనిఖీలు చేయడం, గార్డులను నియమించుకోవడంపై ఆయా సంస్థలకు పోలీసు శాఖ నోటీసులు జారీ చేస్తుంది. నిబంధనలు పాటించకుంటే కేసులు.. పోలీసులు సేఫ్టీ ఆడిట్లో గుర్తించిన లోపాలను సరిచేసుకోవాలంటూ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు నోటీసులు ఇస్తుంది. ఇవి తీసుకున్న తరువాత పోలీసులు పేర్కొన్న లోటుపాట్లను సరిచేసుకోవాల్సిన బాధ్యత సంస్థల యాజమాన్యాలపై ఉంటుంది. ఇక నోటీసులు తీసుకున్న నెల రోజుల్లో అక్కడ భద్రతను పునరుద్ధరించుకోవాలి. అలా కాకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తే ఆయా సంస్థలపై కేసులు నమోదు చేసే అధికారం పోలీసు శాఖకు ఉంటుంది. ప్రజలు సహకరించాలి పోలీసుశాఖ పరంగా ప్రజల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం. అయితే కొన్ని విషయాలు ప్రజలకు తెలిసినా వాటిని పోలీసులతో షేర్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. పోలీసులపై నమ్మకం ఉంచి తెలిసిన విషయాలు మా దృష్టికి తీసుకురండి. 100 నంబర్‌కు కాల్ చేయండి, స్థానిక ఎస్సైకు చెప్పండి. ఆయన వినకుంటే సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ ఇలా ఎవరికో ఒకరి చెప్పండి. మీకు ఎవరిపైనా నమ్మకం లేకుంటే నాకు నేరుగా ఫోన్ (9440796700) చేసి చెప్పండి. అప్పుడే నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. -ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ, చిత్తూరు -
దగాపడుతున్న రైతన్న
తూకంలో మోసం చేస్తున్న ఎరువుల కంపెనీలు 50 కేజీల బస్తాలో 3 నుంచి 6 కేజీల వరకు తగ్గుదల అధికారుల తనిఖీలో వెల్లడైన వాస్తవం అన్నం పెట్టే రైతన్న అడుగడుగునా దగా పడుతున్నాడు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎరువుల కంపెనీలు సైతం మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ విషయం తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. నరసరావుపేట వెస్ట్ : సాధారణ తనిఖీల్లో భాగంగా తూనికలు, కొలతల శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ చల్లా దయాకరరెడ్డి వినుకొండ రోడ్డులోని సెంట్రల్ వేర్‌హౌసింగ్ గోడౌన్లను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఆ సమయంలో గోడౌన్లో స్పిక్, కోరమాండల్ కంపెనీకి చెందిన గ్రోమోర్ పారీ సూపర్, ఎంవోపీ (పోటాషియం), పీపీఎల్ నవరత్న (డీఏపీ) ఎరువులకు చెందిన వేలాది బస్తాలు షాపులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి నుంచి ప్రతి రకానికి చెందిన 32 బస్తాలను ఎలక్ట్రానిక్ కాటా సహాయంతో తూకం వేయగా దిమ్మె తిరిగే వాస్తవం బయటపడింది. కాటాల్లో కోరమాండల్ పారీ సూపర్ కంపెనీకి చెందిన 50 కేజీల 32 బస్తాలను కాటా వేయగా వాటిలో 16 బస్తాల్లో తూకంలో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ఒక్కో బస్తాలో 1 నుంచి 6 కేజీల వరకు తక్కువగా ఉన్నాయి. అలాగే కోరమాండల్ ఎంవోపీ (పొటాషియం) 32 బస్తాలను తూకం వేయగా ఒక్కో బస్తాలో 3 కేజీల వరకు త గ్గుదల ఉందని ఇన్స్పెక్టర్ దయాకరరెడ్డి చెప్పారు. పీపీఎల్ నవరత్న డీఏపీ బస్తాలను తూకం వేయగా 8 బస్తాల్లో 5 కేజీల వరకు తూకం తగ్గిందన్నారు. ప్రతి బస్తా గోనె సంచితో కలిపి 50 కేజీల 120 గ్రాములు ఉండాల్సి ఉండగా 49.600 గ్రాములే ఉన్నాయన్నారు. కంపెనీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తాం తనిఖీల్లో బయటపడిన వాస్తవాలపై ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసి, ఆ కంపెనీలపై కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ దయాకరరెడ్డి విలేకర్లకు చెప్పారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో ప్రతి బస్తాను కాటా వేసుకొని తూకాన్ని నిర్థారించుకున్న తర్వాతనే తీసుకోవాలని ఆయన సూచించారు. -
పోలీసు తనిఖీల్లో రూ. 4 ల క్షలు స్వాధీనం
వరంగల్ జిల్లాలో పోలీసులు నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహానాలు తనిఖీ చేస్తున్న పోలీసులు సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 4 లక్షల నగదును గుర్తించారు. గుండా వీరయ్య అనే వ్యాపారి నగదును తరలిస్తుండగా.. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులకు చిక్కిన బైక్ దొంగ
థియేటర్ పార్కింగ్‌లో పెట్టిన బైక్‌ను దొంగలించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని సాయిబాబా నగర్ క్రాస్ రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. క్రాస్‌రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తి తారసపడటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తన పేరు ఎరగండ్ల కుమరయ్య(24) అని రెండు రోజుల క్రితం కాటెదాన్ లోని స్వప్న థియేటర్ పార్కింగ్ నుంచి హీరో హోండా ఫ్యాషన్ ప్లస్ బైక్‌ను దొంగలించానని చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
దడ పుట్టిస్తున్న దాడులు
రెండో రోజు 51 హోల్‌సేల్ షాపుల్లో తనిఖీలు రూ.1.48 కోట్ల విలువైన సరకు స్వాధీనం 16 షాపులపై కేసులు నమోదు విశాఖపట్నం: కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కు పాదం మోపింది. మంగళవారం వరుసగా రెండో రోజు కూడా ఎనిమిది బృందాలు నగరంలో వివిధ చోట్ల మెరుపు దాడులు కొనసాగించాయి. పెదవాల్తేరు, ఎంపీపీ కాలనీ, అప్పూఘర్, మధురవాడ, పూర్ణ మార్కెట్, పెదగంట్యాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో 51 హోల్సేల్షాపులు గోదాముల్లో కొనసాగించిన దాడుల్లో కోటి 48 లక్షల 85వేల 818ల విలువైన పప్పులు, వంట నూనెలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అనధికారికంగా నిల్వ చేసిన 33.234 ఎంటీల కంది పప్పు, 96.197 ఎంటీల మినపప్పు, పెసరపప్పులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రికార్డుల్లో చూపని 64,961 కేజీల నూనెలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెదగంట్యాడలో సరస్వతి ట్రేడర్స్, సూర్య ఎంటర్ ప్రైజస్, పూర్ణామార్కెట్‌లోని ఎఎన్ఆర్ ఫుడ్ ట్రేడర్స్, హరూన్ బ్రదర్స్, వర్తిక ఎంటర్ ప్రైజస్, కార్తిక్ ట్రేజర్స్, కామధేను కిరణా జనరల్ స్టోర్, కనకమహాలక్ష్మి ట్రేడర్స్, ఎస్‌కేఎంఎల్ ఫ్లోర్ మిల్, అప్పూఘర్ వద్దనున్న ఎస్‌కేఎంఎల్ ట్రేడర్స్, న్యూరేవతి కిరణా అండ్ జనరల్ స్టోర్స్, మధురవాడలోని గాయత్రి డిపార్టుమెంటల్ స్టోర్స్, రూపేష్ కిరణ్ స్టోర్స్, పెదవాల్తేరులోని పోలమాంబ కిరాణా జనరల్ స్టోర్స్, పోలమాంబ ట్రేడర్స్‌లలో ఈ దాడులు జరిగాయి. అత్యధికంగా పూర్ణమార్కెట్‌లోని కార్తిక ట్రేడర్స్‌లో 12.142 ఎంటీల కందిపప్పు, 15.625 ఎంటీల మినపప్పు, ఇతర పప్పులు, 21,699 కేజీల ఆయిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.47.96 లక్షలుగా నిర్ధారించారు. నిల్వల్లో తేడాలుండడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, లెసైన్సుల్లేకుండా షాపులు నిర్వహించడం, స్టాక్ బుక్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించక పోవడం, ఎఫ్జీఎల్ లైన్స్ లేకుండా గోదాములను నిర్వహించడం వంటి అవకతవకలను గుర్తించారు. 16 షాపులపై కేసులు నమోదు చేసి రికార్డులను సీజ్ చేసారు. జాయింట్ కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా సివిల్ సప్లయిస్, కమర్షియల్ టాక్స్. రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఎనిమిది ప్రత్యేక బృందాలు ఈ దాడులు చేశాయి. -
ఎయిర్పోర్ట్ కథలు
గుట్టురట్టు మారణాయుధాలు, మాదక ద్రవ్యాలు.. సాధారణంగా వీటి గురించి విమానాశ్రయాలలో తనిఖీలు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి తనిఖీ అధికారులకు ఇవి రెండూ కాకుండా కొన్ని ‘వింతలు-విడ్డూరాలు’ కనిపిస్తుంటాయి. డెడ్ బాడీ: 2010లో బెర్లిన్ ఎయిర్‌పోర్టులో తల్లీకూతుళ్లను పట్టుకున్నారు. వారు వీల్ చెయిర్లో ఒక వ్యక్తిని తోసుకుంటూ వెళ్తున్నారు. అందులో ఓ మనిషి ఉన్నాడు. అతడికి నల్ల కళ్లజోడు ఉంది. ఆయనకి అల్జైమర్స్ వ్యాధి ఉందని, కంటి కలక కారణంగా కళ్లద్దాలు పెట్టుకున్నాడని తల్లీకూతుళ్లు చెప్పారు. అధికారులకు అనుమానం వచ్చి చూస్తే అదొక శవం అని తేలింది. మృతదేహానిక య్యే రవాణా ఖర్చులను తప్పించుకోడానికి వాళ్లిలా ప్లాన్ చేశారట! పాము పిల్లలు: స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో విమానాశ్రయంలోని అధికారులు ఒక మహిళపై అనుమానం వచ్చి తనిఖీ చేస్తే ఆమె ధరించిన బ్రా నుంచి 75 పాము పిల్లలు బయటపడ్డాయి. అన్నీ బతికి ఉన్నవే. ఆమె మాటిమాటికీ తన ఛాతీని గీరుకుంటూ ఉండడంతో తనిఖీ అధికారులకు డౌట్ వచ్చిందట. పుర్రె, కంకాళం: మ్యూనిచ్ ఎయిర్ పోర్టులో అధికారులు ఇద్దరు ఇటలీ వనితలను తనిఖీ చేస్తున్నప్పుడు వారి లగేజీ నుంచి ఒక పుర్రె, కంకాళం బయటపడ్డాయి! అధికారులు షాక్ తిన్నారు. బ్రెజిల్లో చనిపోయిన తమ కుటుంబ సభ్యుడి అస్తికలను ఆయన అభీష్టానుసారం ఇటలీలో ఖననం చేసేందుకు వెళుతున్నామని ఆ మహిళలు వివరణ ఇచ్చారు. అలాగే అతడిది సహజసిద్ధమైన మరణమని ధ్రువీకరణ పత్రం చూపడంతో వారిని వదిలిపెట్టారు. బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్: 2002లో లాజ్ ఏంజెల్స్ విమానాశ్రయంలో ఒక వ్యక్తి సూట్‌కేస్ నుండి నాలుగు అరుదైన పక్షులు (బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్) బయటపడ్డాయి. అధికారులు వాటిని క్యాచ్ చేసే లోపే పైకి ఎగిరిపోయాయి. తన బట్టల్లో కొన్ని పిల్ల కోతులు కూడా ఉన్నట్లు ఆ వ్యక్తి చెప్పడంతో వాటిని బయటికి తె ప్పించి అధికారులు అతడిని జైలుకు పంపించారు. కనుగుడ్లు: 2007లో లండన్ స్టాంస్టెడ్ ఎయిర్పోర్లో ఒక వ్యక్తి దగ్గరున్న జామ్ జార్లో ఐదు జతల మనిషి కనుగుడ్లు తేలుతూ ఉండడాన్ని అధికారులు గమనించారు. విమానాశ్రయాల తనిఖీ చరిత్రలో ఇంత భయంకరమైన ఘటన ఇదేనేమో! -
ఎర్ర చందనం స్వాధీనం
వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల వద్ద భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సోమవారం తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేసున్న పోలీసులకు ఓ వ్యాన్ లో రూ.2 కోట్ల విలువైన 110 ఎర్రచందనం దుంగలు లభించాయి. పోలీసులను చూసిన వ్యాన్ డ్రైవర్, కూలీలు పరారయ్యారు. పోలీసులు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. -
సేల్స్ టాక్స్ అధికారుల తనిఖీలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సేల్స్ టాక్స్ అధికారులు సోమవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న వస్తువులను అధికారులు సీజ్ చేశారు. రామచంద్రాపురం డీటీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు రెండు ఆటోలు, ఒక రిక్షాను పట్టుకున్నారు. వాటిల్లో ఎలాంటి బిల్లులు.. సంబంధిత పత్రాలు లేకుండా సామగ్రి తరలి పోవడాన్ని గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. రూ. లక్ష విలువైన వస్తు సామాగ్రిని సీజ్ చేసి.. వాహనదారులపై కేసులు నమోదు చేశారు. -
‘ఆరా’మ్గా చేస్తున్నారు..
ఫీజు దోపిడీపై స్కూళ్లలో నత్తనడకన తనిఖీలు లోపించిన శాస్త్రీయత, పారదర్శకత కంటితుడుపు చర్యేనని ఆరోపణలు సిటీబ్యూరో: అడ్డూ అదుపూ.. లెక్కాపత్రం లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలు అటకెక్కాయి. తనిఖీలు కంటితుడుపు చర్యలేనన్న భావన అందరిలో కలుగుతోంది. తనిఖీలు ప్రారంభమై.. 25 రోజులు ముగిసినా ఇంకా కొలిక్కి రాలేదు. తీవ్ర ఒత్తిడులు ఎదురవుతుండడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు, విద్యా హక్కు చట్టాన్ని కాలరాసి.. విద్యార్థుల నుంచి కాసులు పిండుకుంటున్నాయి. ఎటువంటి శాస్త్రీయత పాటించకుండా ఏటికేడు ఫీజుల మొత్తాన్ని పెంచుతూ.. వసూలు చే స్తున్నారు. ఈ తతంగంపై ఇప్పటికే ‘సాక్షి’తో సహా పలు పత్రికలు విస్తృతంగా కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దోపిడీ విషయాన్ని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రతిగా అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని హెచ్చరించింది. చివరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జోక్యం చేసుకుని.. స్కూళ్లలో తనిఖీల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి విద్యాశాఖ ఇన్చార్జి హైదరాబాద్ రీజినల్ జాయింట్ డెరైక్టర్ సుధాకర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్‌తోపాటు ఇద్దరు ఆడిటర్లు కమిటీలో సభ్యులు. మొదట నమూనాగా గుర్తించిన పది స్కూళ్ల గుర్తింపు, ఫీజుల వసూలు, బ్యాలెన్స్ షీట్, ఆదాయం, వ్యయం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులు లోతుగా తనిఖీలు చేసి.. ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంది. అతీగతీ లేని వైనం.. గత నెల 17వ తేదీన తనిఖీలు మొదలు పెట్టారు. వాస్తవంగా రోజుకో స్కూల్ చొప్పున ఎంచుకుని.. ఈ ప్రక్రియ ముగిస్తామని, ఈనెల 10వ తేదీకల్లా ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తామని కమిటీ సభ్యులు, జంట జిల్లాల డీఈఓలు మొదట్లో పేర్కొన్నారు. నిర్దేశిత గడువు మూడు రోజుల క్రితమే ముగిసింది. ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్లలో తనిఖీలు పూర్తయ్యాయో అధికారులకే తెలియకపోవడం గమనార్హం. కమిటీలో సభ్యులుగా ఉన్న జంట జిల్లాల డీఈఓలు సైతం చెప్పలేకపోతున్నారు. దీంతో నివేదిక అందజేతపై స్పష్టత కొరవడింది. మొన్నటి వరకు హైదరాబాద్ ఇన్చార్జి ఆర్జేడీగా ఉన్న సుధాకర్ స్థానంలో... ఇటీవల రెగ్యులర్ ఆర్జేడీగా కృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ మార్పు కూడా తనిఖీలపై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన ఆర్జేడీ పూర్తిస్థాయిలో తనిఖీలపై దృష్టి సారించాల్సి ఉంది. కనిపించని పారదర్శకత .. తనిఖీలు పారదర్శకంగా, పూర్తిస్థాయిలో జరగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలకు వెళ్లిన ఆడిటర్లకు పూర్తి వివరాలు అందజేయడంలో స్కూళ్ల యాజమాన్యాలు వెనుకంజ వేస్తున్నాయి. ఒక్కో స్కూల్లో పది తరగతులు ఉంటే.. కింది స్థాయిలో రెండు లేదా మూడు, పైస్థాయిలో రెండు తరగతులకు సంబంధించిన ఫీజు వివరాలను మాత్రమే చూపుతున్నారని తెలిసింది. ఈ విషయంపై ఆడిటర్లు సైతం యాజమాన్యాలను ప్రశ్నించలేకపోతున్నారు. తనిఖీలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంతేగాక ఒక స్కూల్లో 2001లో చేరి ప్రస్తుతం ఐదో తరగతికి చదువుతున్న విద్యార్థికి ఒక ఫీజు, అదే తరగతిలో ఈ ఏడాది చేరిన విద్యార్థి నుంచి మరొక ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాల మధ్య భారీ తేడా ఉన్నట్లు ఆడిటర్లు గుర్తించారు. -
నగరంపై మళ్లీ ‘హుజీ’ పడగ!
నసీర్ అరెస్టుతో తిరిగి తెరపైకి సంస్థ కదలికలు అణువణువూ గాలిస్తున్న పోలీసులు సిటీబ్యూరో: ఉగ్రవాద సంస్థ హుజీతో సంబంధమున్న మహమ్మద్ నసీర్తో పాటు మరో ఐదుగురి అరెస్టుతో సిటీలో కలకలం రేగింది. ఈ ఘటనతో హుజీ కదలికలు మరోసారి బయటపడ్డాయి. పంద్రాగస్టు వేడుకలకు ముందే వీరు పట్టుబడటంతో...ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంపై హుజీ ప్రభావాన్ని పరిశీలిస్తే గతంలో జరిగిన చాలా ఘటనలు కళ్ల ముందు మెదులుతాయి. 1992లో జరిగిన ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, అతని గన్‌మన్ హత్యతో రాష్ర్టంలో ఉగ్రవాదుల హింస ప్రారంభమైంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల వరకు ఇది కొనసాగింది. హైదరాబాద్‌లో జరిగిన రాక్షస క్రీడల్లో అత్యధికం హుజీవే. 2004 అక్టోబర్ 12న బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌కు సమీపంలో ఉన్న హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడికి పాల్పడింది కూడా హుజీనే. ఈ కేసుతో సహా వివిధ కేసుల్లో వాంటెడ్‌గా ఉండి 2007లో పాకిస్తాన్‌లోని కరాచీలో హతమైన కరుడుగట్టిన ఉగ్రవాది సాహెద్ అలియాస్ బిల్లాల్ నగరంలోని ముషారంబాగ్కు చెందినవాడు కావడం గమనార్హం. 2006 అక్టోబర్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఒడియన్ థియేటర్లో గ్రానైట్ దాడికి పాల్పడి 2011లో పోలీసులకు చిక్కిన జియా ఉల్ హక్ హుజీ సంస్థ వాడే. బెంగళూరు, హైదరాబాద్‌లలో రాజకీయ నేతలతో పాటు ప్రముఖుల హత్యకు కుట్రను బెంగళూరు పోలీసులు 2013లో ఛేదించారు. దీని వెనుక కూడా హుజీనే ఉన్నట్టు తేలింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పాతబస్తీకి చెందిన ఒబెత్ ఉర్ రెహమన్ కూడా హుజీకి చెందిన వాడే. 2007 ఆగస్టు 25నజరిగిన గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లు, 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో పాల్గొన్నది ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం)కు చెందిన వారు. అయితే హుజీకి, ఐఎంకి సంబంధాలున్నాయనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైంది. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన వఖాస్‌ను హుజీకి చెందిన మహమ్మద్ నసీర్ భారత సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సహకరించడం కూడా వారి సంస్థల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చెప్పకనే చెప్తోంది. పాస్‌పోర్టులపై దృష్టి... ఇప్పటికే చంచల్‌గూడకు చెందిన మహమ్మద్ మసూద్ అలీ ఖాన్ సహకారంతో మహమ్మద్ నసీర్ ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు పొందడమే కాకుండా 15 మందికి భారత పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు పంపించడంపైనా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఇతను హుజీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు పంపాడా? లేదా డబ్బులు సంపాదించేందుకు వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పంపించాడా?...ఇలా అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు వెళ్లిన కానిస్టేబుళ్లను విచారించి, విధుల్లో అలసత్వం వహించినందుకు వారిపైనా చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
‘ఆక్సిటోసిన్’..పక్కదారి!
అడ్డగోలుగా ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల వాడకం మనుషులకు, గేదెలకు నష్టం దాణా, పాల కేంద్రాలలో అక్రమ అమ్మకాలు పట్టించుకోని అధికారులు నర్సాపూర్ గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వాడుతూ కొందరు పాడి రైతులు మనుషుల ప్రాణాలపై చెలగాడమాడుతున్నారు. దూడలు చనిపోయిన తర్వాత గేదెలు పాలు ఇవ్వకపోవడంతో వైద్యుల సలహామేరకు పశువులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్ కొందరు ఇష్టమొచ్చినట్లుగా వాడుతున్నారు. పశు వైద్యుల సలహాల మేరకు వాడాల్సిన మందులను తోసిపుచ్చి దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్సిటోసిన్ ఇంజక్షన్ అక్రమ వ్యాపారం మూడు ఇంజక్షన్లు ఆరు లీటర్ల పాలుగా కొనసాగుతోంది. ఇంజక్షన్ల అమ్మకాల జోరు ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్పైనే విక్రయించాలి. అయితే మెడికల్ షాపు నిర్వాహకులు నేరుగా పాడిరైతులకు అమ్ముతున్నారు. దానాదుకాణాలను, పాల కొనుగోలు కేంద్రాలను ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయక పోవడంతో వ్యాపారులు అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. గతంలో తక్కువ మోతాదులో ఇంజక్షన్ ఆంపిల్స్ వచ్చేవని, దానిని కొనుగోలు చేయాలంటే ఎక్కువ ఖర్చు రావడంతో ప్రస్తుతం 50,100 మి.లీ సామర్థ్యం మందు బాటిళ్లు వస్తున్నాయి. కాగా దానా, పాల కేంద్రాలలో అమ్మే మందు బాటిళ్లపై ఎలాంటి పేరు లేకుండా ఇంజక్షన్ బాటిళ్లు అమ్మడం గమనార్హం. మందు బాటిళ్లపై వాటి పేరు, తయారి తేదీ, వాడకానికి చివరి తేదీ అలాంటి ఏ సమాచారం లేకుండా వస్తున్న మందు బాటిళ్లను గుడ్డిగా అమ్ముతూ మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. వైద్యుల సలహాతోనే వాడాలి.. ఆక్సిటోసిన్ ఇంజక్షన్ అనేది హార్మోను ఇంజక్షన్. వీటిని గేదెలకు వాడడంతో వాటితో పాటు మనుషులకు నష్టం కల్గుతుందని ఆయా రంగాల నిపుణులు అంటున్నారు. గైనకాలజిస్టులు మహిళలకు డెలివరీ సమయంలో అవసరాన్ని బట్టి 1 లేదా రెండు ఎం.ఎల్ ఇంజక్షన్‌ను వాడుతుంటారు. ఇదిలాఉండగా ఆక్సిటోసిన్ హార్మోను ఇంజక్షన్ కావడంతో పాడి పశువులకు సైతం వైద్యులు అవసరం మేరకు వాడుతుంటారు. దూడలు చనిపోయినపుడు చాలా గేదెలు పాలు ఇవ్వవు. అలాంటి గేదెలకు వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు ఇంజక్షన్ చేస్తే అవి పాలు ఇవ్వడానికి అలవాటు పడి రోజూ పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా చాలామంది అపోహలకు పోయి రోజూ ఇంజక్షన్ చేస్తున్నారు. మనుషులపై దుష్ర్పభావం.. పాడి గేదెలకు రైతులు ఆక్సిటోసిన్ ఎక్కువ వాడడంతో అనేక నష్టాలున్నాయి. ఇంజక్షన్ వాడిన గేదెల నుంచి పితికిన పాలు తాగితే ఆ పాలు ప్రధానంగా బాలికలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అన్ని వర్గాల మనుషులపై సైతం దుష్ర్పభావాలు చూపుతాయి. అలాంటి పాలు తాగిన బాలికలలో హార్మోన్ల బ్యాలెన్సు దెబ్బతిని పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మహిళల గర్భసంచిపై ప్రభావం చూపుతాయి. తల్లి పాలు లేని చిన్న పిల్లలకు అలాంటి పాలు తాగిస్తే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. - డాక్టర్ నరసింహారెడ్డి, సర్జన్ గేదెలకు నష్టమే.. ఇంజక్షన్‌ను ఎక్కువగా వాడడంతో గేదెల ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుంది. దూడలు చనిపోయిన గేదెలు పాలు ఇవ్వనట్లయితే వాటికి అలవాటయ్యేంత వరకు ఒకటి, రెండు రోజులు ఇంజక్షన్ చేయాలె.. తప్ప రోజూ ఇవ్వడంతో గేదె ఆరోగ్యం దెబ్బతిని పాల దిగుబడి తగ్గుతుంది. రోజు ఇంజక్షన్ చేస్తే గేదెలు సకాలంలో ఎదకు రావు. వాటిలో రోగ నిరోధక శక్తి తగ్గి అస్వస్థతకు గురవుతాయి. - డాక్టర్ శ్రీకాంత్, పశువైద్యాధికారి -
సౌదీలో జైలు పాలైన తెలంగాణ కార్మికులు
సంక్షోభం కారణంగా ముమ్మరంగా తనిఖీలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న 150 మందికి పైగా అరెస్టు మోర్తాడ్: సౌదీ అరేబియాలో కొనసాగుతున్న సంక్షోభం తెలంగాణ కార్మికుల ఉపాధికి విఘాతం కలిగిస్తోంది. అక్కడ కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంక్షోభాన్ని అణచివేయడానికి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న సౌదీ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులను అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 150 మందికిపైగా కార్మికులను వారం రోజుల వ్యవధిలో జైలులో పెట్టినట్లు తెలిసింది. మొదట కంపెనీ వీసాలపై సౌదీకి వెళ్లినా, అక్కడి పరిస్థితులు బాగాలేక పోవడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చి దొరికిన పనిచేస్తూ ఎంతో కొంత ఎక్కువ సొమ్మును సంపాదించుకునే వారిలో తెలంగాణ జిల్లాల కార్మికులు చాలామంది ఉన్నారు. ఒప్పందం ప్రకారం కంపెనీ యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడం, పని భారం ఎక్కువగా ఉండటంతో అప్పులు తీర్చే మార్గం కోసం అనేక మంది కార్మికులు వీసా, వర్క్‌పర్మిట్, పాస్ పోర్టులను వదిలివేసి నిబంధనలకు విరుద్ధంగా సౌదీలో పని చేస్తున్నారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో సౌదీ పోలీసులు తనిఖీలు చేస్తుండటం తో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్మికులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే వందలాది మంది కార్మికులు సౌదీ జైళ్లలో మగ్గుతున్నారు. మళ్లీ కొత్తగా అరెస్టులు మొదలు కావడంతో కార్మికుల్లో ఆందోళన నెల కొంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సౌదీ జైళ్లో మగ్గుతున్న కార్మికులను సొంత గ్రామాలకు రప్పించి ఉపాధి చూపాలని పలువురు కోరుతున్నారు. -
పెద్ద ఉద్యోగి..చిన్న బుద్ధులు
భాగ్యనగర్‌కాలనీ: ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఓ వ్యక్తి ఓ సంస్థలో చెక్కులు దొంగలించి కటకటాలపాలయ్యాడు. అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు మీడియాకు వివరాలు వెల్లడించారు... ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన బెజవాడ బ్రహ్మయ్య (55) గతంలో ఐడీపీఎల్ బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా, ఎన్‌ఐఎఫ్‌ఎంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజింగ్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రొఫెసర్‌గా, ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ప్రస్తుతం మూసాపేటలోని సైబర్హోమ్స్లో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే సైబర్హోమ్స్లోని ఓ కస్టమర్ ఫ్లాట్ బుక్ చేసుకుని అందుకు సంబంధించి రూ.11లక్షలకు చెక్కులను బ్రహ్మయ్యకు ఇచ్చాడు. అతను వాటిని సంస్థ అకౌంట్లో జమ చేయకుండా దొంగలించి యూసఫ్‌గూడలోని ఆంధ్రబ్యాంక్‌లో తన స్నేహితుడైన రవీందర్‌బాబు పేరుతో సైబర్ హోమ్స్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో జమ చేశాడు. వచ్చిన డబ్బును ఇద్దరూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే చెక్కులు ఇచ్చిన రహీమోద్దీన్ ఫ్లాట్ కోసం సైబర్‌హోమ్స్ నిర్వాహకులను అడగగా తమకు డబ్బులు చెల్లించలేదనడంతో అతను అవాక్కయ్యాడు. దీనిపై అనుమానం వచ్చిన సంస్థ యాజమాన్యం బ్రహ్మయ్యపై ఫిర్యాదు చేయడం తో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా చేసిన నేరం అంగీకరించాడు. దీంతో అతని స్నేహితుడు రవీందర్బాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకుని ఖాతాలను సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్
సౌకర్యాలపై తనిఖీలకు రానున్న ఎంసీఐ బృందం ఇప్పటికే ఎంబీబీఎస్ 50 సీట్లకు అనుమతి నిరాకరణ పీజీ సీట్లకూ పొంచివున్న ముప్పు లబ్బీపేట : ‘ఏ సమయంలోనైనా ఎంసీఐ బృందం తనిఖీలకు రావచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండండి. హెచ్వోడీలు, ప్రొఫెసర్లు సెలవులకు వెళ్లకుండా సమయానికి విధులకు రావాలి.’ ఇవీ వారం పది రోజులుగా సిద్ధార్థ వైద్య కళాశాలలో అధికారులు, ప్రొఫెసర్లు, విభాగాధిపతులకు ఇస్తున్న ఆదేశాలు. రోజూ ఎంసీఐ బృందం వచ్చేస్తోందంటూ హడావుడి చేస్తూ మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకూ వేచి చూసి, ‘హమ్మయ్య ఈ రోజు రాదులే’ అని ఊపిరి పీల్చుకోవడం నిత్యకృత్యంగా మారింది. యూజీ సీట్ల సౌకర్యాలపై తనిఖీలు గత ఏడాది పెంచిన 50 ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి సౌకర్యాలను పరిశీలించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం ఆకస్మికంగా తనిఖీలకు రానుంది. దీంతో పది రోజులుగా వైద్యులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అలెర్ట్‌గా ఉండాలంటూ ఇప్పటికే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రొఫెసర్లు, హెచ్వోడీలకు సెలవులు సైతం పరిమితంగా ఇస్తున్నారు. ఎంసీఐ బృం దం ఎప్పుడు వచ్చినా అడిగిన సమాచారం అం దించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆయా డిపార్ట్మెంట్లకు సం బంధించి పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేయాలని ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు తెలిసింది. సీట్లు ఉండేనా...ఊడేనా ? సిద్ధార్థ వైద్య కళాశాలలో వంద ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నవంబర్‌లో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంసీఐ బృందం నివేదిక రూపొందించింది. పెంచిన 50 సీట్లకు సంబంధించి సౌకర్యాలు అందుబాటులో లేవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ సీట్లు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి నెలకంది. గత అనుభవాలతోనే.. నవంబర్‌లో ఎంసీఐ బృందం వైద్య కళాశాలకు ఉదయం 8 గంటలకు చేరుకోగా, అప్పటికి ప్రిన్సిపాల్‌తో పాటు, వైద్యులెవరూ అందుబాటులో లేరు. ఎంసీఐ బృందం వచ్చిందని తెలుసుకుని అరగంటలో చేరుకున్నారు. అనంతరం పలు విభాగాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. అంతకు ముందు ఎంసీఐ బృందం వచ్చేవరకూ ఒక విభాగం తలుపులు తీయకపోవడంతో ఆ విభాగాన్ని వాడటంలేదని త నిఖీ బృందం రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం సిద్ధార్థ వైద్య కళాశాలలో 50 అదనపు సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసినా చేసిందేకానీ, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదు. సీట్ల మంజూరు సమయంలో ఎంసీఐకి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చనందునే ప్రస్తుతం సీట్లు కోల్పోవాల్సిన దుస్థితి నెల కొందని సీనియర్ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. ప్రతి విభాగంలో యూనిట్లు పెంచాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అప్పట్లో లేఖ రాసినా పట్టిం చుకోకుండా పక్కన పెట్టడం, సౌకర్యాల విషయంలో నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెపుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. గతంలో ఏమి పేర్కొందంటే... నిబంధనల ప్రకారం యూనిట్లను చూపుతున్నా, అందుకు అనుగుణంగా పడకలు అందుబాటులో లేవు. కనీసం ఎక్స్‌రే కూడా అందుబాటులో లేదు. నిబంధనల ప్రకారం రోజూ ఎక్స్‌రేలను తీయలేక పోతున్నారు. బ్లడ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి రెసిడెన్షియల్ క్వార్టర్లు అందుబాటులో లేవు. పూర్తిస్థాయిలోగ్రంథాలయం లేదు. ఆడిటోరియం రిపేరులో ఉంది. వ్యాధి నిర్ధారణ విభాగం సైతం అస్తవ్యస్తంగా మారింది. ఈ నివేదిక ఆధారంగా అదనంగా 50 సీట్లు అడ్మిషన్లకు ఈ ఏడాది అనుమతి ఇవ్వలేమని ఎంసీఐ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సదుపాయాలను పరిశీలించాలని చేసిన వినతి మేరకు ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీలకు రానుంది. -
లోపాలు సరిదిద్దుకుంటే మళ్లీ గుర్తింపు
మే నెలలో 4వ విడత తనిఖీలు ఉప ముఖ్యమంత్రి కడియం స్పష్టీకరణ హైదరాబాద్: రాష్ట్రంలోని 288 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన వసతులపై మే నెలలో నాలుగో విడత తనిఖీలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మూడు విడతల తనిఖీల అనంతరం గుర్తింపు (అఫిలియేషన్) కోల్పోయిన 163 కళాశాలలు నాలుగో విడత తనిఖీల నాటికి లోపాలు సరిదిద్దుకుంటే గుర్తింపును పునరుద్ధరిస్తామన్నారు. నాలుగో విడత తనిఖీల ఆధారంగానే కళాశాలల్లో 2015-16కు సంబంధించి ప్రవేశాలు, గుర్తింపు అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. శనివారం రెండోరోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన.. సదస్సు వేదిక మారియట్ హోటల్ బయట విలేకరుల సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయాల గుర్తింపు కోల్పోయిన 163 కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి గుర్తింపు పొడిగింపు లభించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఏఐసీటీఈ అనుమతి లభిస్తే వర్సిటీల గుర్తింపునకు హక్కు కల్పించినట్లు కాదన్నారు. ఇది పూర్తిగా విశ్వవిద్యాలయాల పరిధిలోని అంశమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐఐటీహెచ్, బిట్స్ పిలానీ, నీట్ సంస్థల నిపుణులతో నిర్వహించిన మూడో విడత తనిఖీల నివేదికలను ఆన్లైన్లో ఉంచామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేద విద్యార్థుల కోసమేనని, ప్రైవేటు కాలేజీల మనుగడ కోసం కాదన్నారు. 2014-15లో ప్రవేశాలు పొందిన ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తామన్నారు. గుర్తింపు రద్దయిన 163 కాలేజీల్లో ప్రవేశాలు పొంది న ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులను వార్షిక పరీక్షలకు అనుమతిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో జేఎన్టీయూ-హెచ్ లేదని, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాలలు ఫ్రీ జోన్ పరిధిలోకి రావన్నారు. ఏపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సవరణలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆ తర్వాతే రాష్ట్రంలోని వర్సిటీలకు శాశ్వత ప్రాతిపదికన వీసీలను నియమిస్తామన్నారు. 5 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు రాష్ట్రంలోని 5 వర్సిటీలకు ప్రభుత్వం ఇన్చార్జ్ వీసీ లను నియమించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీకి పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు, నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్లను ఇన్చార్జ్ వీసీలుగా నియమించారు. పాలమూరు, శాతవాహన, తెలుగు వర్సిటీలకు పాతవారినే కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వైద్యులపై సర్కారు కొరడా
విధులను నిర్లక్ష్యం చేసిన నిలోఫర్ వైద్యుడి బదిలీ నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు నోటీసులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులపట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు సమయపాలన పాటించని వైద్యులపై సర్కారు కొరడా ఝళిపిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖపై ఏడు గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రులపై ఆ శాఖ అధికారులు అప్రమత్త య్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. సీఎం ఇటీవల ఫీవర్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ఆ ఆసుపత్రి సూపరింటెం డెంట్ శంకర్, ఆర్ఎంవో చిత్రలేఖ, ఐదుగురు డాక్టర్లు లేకపోవడం విమర్శలకు దారితీసింది. దీంతో వైద్య విద్యాశాఖ సంచాలకులు (డీఎంఈ) పుట్టా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతమంది లేకపోతే ఇక ఆసుపత్రి నడపడం ఎలా అని ఆయన పేర్కొన్నారు. దీంతో వారందరికీ సోమవారం నోటీసులు జారీ చేసినట్లు డీఎంఈ ‘సాక్షి’కి చెప్పారు. నిలోఫర్ ఆసుపత్రికి తాను శుక్రవారం రాత్రి వెళ్లి 9.45 గంటల నుంచి 11 గంటల వరకు పరిశీలించానని... ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నారాయణ లేనేలేరని చెప్పారు. రికార్డుల్లో మాత్రం ఆయన విధుల్లో ఉన్నట్లు రాసి ఉందన్నారు. దీంతో ఆయన్ను తక్షణమే వరంగల్‌కు బదిలీ చేసినట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణలో విఫలమైన నిలోఫర్ సూపరింటెండెంట్ దేవరాజ్‌కు నోటీసులు జారీ చేశానన్నారు. ఉస్మానియా ఆసుపత్రి అసిస్టెంట్ డాక్టర్ భార్గవి విధుల్లో ఉన్నా రౌండ్స్ వేయలేదని... అందుకు ఆమెకూ మెమో జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిత్యం పారిశుద్ధ్యంపై ఇంటర్నెట్ ద్వారా ఫొటోలు పంపాలని డీఎంఈ ఆదేశించారు. ఎంతమంది డాక్టర్లు విధుల్లో ఉన్నారో తప్పనిసరిగా నివేదిక పంపాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అందుతోన్న వైద్య సేవలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున విధుల పట్ల, పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య సేవలు అందించకపోతే వేటే ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో పేదలకు సరైన వైద్య సేవలు అందించకపోతే కఠి నంగా వ్యవహరించాలని సర్కారు సంబంధిత వైద్యాధికారులను ఆదేశించింది. సీఎం సహా మంత్రులు, వైద్యాధికారులు తరచూ తనిఖీలు చేయాలని, ఫిర్యాదులపై స్పం దించి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాలని నిర్ణయించారు. విధులపట్ల క్రమశిక్షణగా ఉన్న వారికి సరైన చోటుకు బదిలీలు, ఉద్యోగోన్నతులు ఇవ్వాలని అంచనాకు వచ్చారు. కోఠిలోని కీలక అధికారుల పేషీల్లో అవినీతి, నిర్లక్ష్యం రాజ్యమేలుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు అధికారుల పీఏలు తమ వద్దే ఫైళ్లు ఉంచుకొని సంబంధిత కీల కాధికారికి అందించకుండా లంచాల కోసం చేతులు చాపుతున్నారన్న విమర్శలూ ఉన్నా యి. ఈ నేపథ్యంలో వైద్యరంగాన్ని ప్రక్షాళన చేస్తానని సీఎం చెప్పడంతో అధికారులు, డాక్టర్లు, సిబ్బంది వణికి పోతున్నారు. -
చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు
అనధికారికంగా ఉన్న రూ.31వేలు స్వాధీనం దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రవాణాశాఖ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గామాలపాడుకు సమీపంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. చెక్‌పోస్ట్‌లో ఏఎంవీఐ గోపాల్‌తో పాటు మరో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ తనిఖీల్లో రూ. 31వేలు అనధికారికంగా ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ రాజారావు విలేకరులకు తెలిపారు. చెక్‌పోస్ట్‌లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారుల ద్వారా రవాణాశాఖ కమిషనర్‌కు నివేదికను పంపి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరతామని వెల్లడించారు. ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో ఆర్టీఏ చెక్‌పోస్ట్‌కు సమీపంలోనిఉన్న వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు అప్రమత్తమయ్యారు. దాడుల్లో ఏసీబీ రేంజ్ఇన్స్పెక్టర్ కె.సీతారాం, ఇన్స్పెక్టర్ పి.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెల్లవారుజామున తనిఖీలు
పెడన : ఆదివారం తెల్లవారుజాము సుమారు 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల బూట్ల చప్పుడుతో పెడన పట్టణం శివారులోని ఇందిరాకాలనీ, దక్షిణ తెలుగుపాలెం కాలనీ ఉలిక్కిపడింది. అప్పుడే నిద్రలేస్తున్న కాలనీ వాసులకు ఎదురుగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్‌స్థాయి వరకు ప్రత్యక్షమవడంతో అసలేం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే కాలనీలను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ఏ ఇంటిని వదలకుండా ఇళ్లల్లోకి వెళ్లి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంటింటికి తిరిగి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు పరిశీలించారు. రహదారిలో వెళ్లే వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. కాలనీలలో అరాచకశక్తులు, టైస్టులు, సంఘవిద్రోహ శక్తులు నక్కి ఉన్నారా? కాలనీల నుంచి బయటకు వెళ్తుంటే ఎందుకు తనిఖీలు చేస్తున్నారు? తదితర ప్రశ్నలు కాలనీ వాసుల మెదళ్లను తొలచివేశాయి. పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా తనిఖీ చేస్తున్నారని కొంతసేపటి తరువాత ప్రజలకు అర్ధమైంది. దీంతో రెండు కాలనీల ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. బందరు డీఎస్పీ డి. శ్రావణ్ సూర్యకుమార్, బందరు రూరల్ సీఐ ఎ. నవీన్ నరసింహమూర్తి నేతృత్వంలో పెడన పట్టణ శివారు ఇందిరాకాలనీ, దక్షిణ తెలుగుపాలెం కాలనీలలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. బందరు రూరల్ పరిధిలోని డీఎస్పీ, సీఐ, ఏడుగురు సబ్ఇన్స్పెక్టర్లు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది 80 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరూ ఆరు బృందాలుగా విడిపోయి రెండు కాలనీలను దిగ్బంధించారు. ఇంటింటికి వెళ్లి విస్తృతస్థాయిలో తనిఖీ చేశారు. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రికార్డులు సక్రమంగా లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకుని పెడన పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయా కాలనీలలో నివసించే రౌడీషీటర్లు, పాత నేరస్తులను పిలిచి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి కదలికలపై స్థానిక పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. బందరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో చోరీలు జరిగే అవకాశం అధికంగా ఉంటుందని చెప్పారు. ఒక ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించి తనిఖీలు చేయడం వలన అరాచకశక్తులు, సంఘవిద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, నేర ప్రవృత్తి కలిగిన వారు తారసపడే అవకాశం ఉందని చెప్పారు. అట్టి వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పెడన ఎస్సై వి. మణికుమార్, బందరు రూరల్ పరిధిలోని చిరంజీవి, పి. జగదీష్, సత్యనారాయణ, విల్సన్‌బాబు, కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నెల్లూరు : ఎర్రచందనాన్నిఅక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా తడ మండలం తేనుగుంట గ్రామ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు..నెల్లూరు నుంచి చెన్నైకు విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించి తేనుగుంట వద్ద ఒక స్కార్పియో, లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో 60 ఎర్రచందనం దుంగలను ఉన్నట్లు గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (తడ) -
42 ఎర్రచందనం దుంగల పట్టివేత
గిద్దలూరు రూరల్: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్థానిక అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున బేస్తవారిపేట మండలం హనుమాయిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గిద్దలూరు రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు డీఆర్ఓ షేక్ నజీర్‌బాషా తన సిబ్బందితో హనుమాయిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. రోడ్డుకు ఒక పక్క అటవీ ప్రాంతంలో అక్రమంగా దాచి ఉంచిన 42 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని గిద్దలూరు అటవీశాఖ కార్యాయానికి తరలిచారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. దాడుల్లో ఎఫ్ఎస్ఓ హరిప్రసాద్, ఎఫ్‌బీఓలు ఓ.రామయ్య, టిప్పుఖాన్, మురళీకృష్ణ, రామకృష్ణ, ఏబీఓ ఎన్.రోజారమణి, సిబ్బంది పాల్గొన్నారు. -
పరీక్షలు ప్రశాంతం
తొలిరోజు 48,870మంది హాజరు రెండు కేంద్రాల్లో నేలపై అవస్థలు 48 కేంద్రాల్లో తనిఖీలు.. ఒకరు డిబార్ నేటి నుంచి ఇంటర్ సెకండియర్‌కు... పెదవాల్తేరు (విశాఖపట్నం) : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది నేలబారు పరీక్షలకు తావు లేకుండా పక్కా ఏర్పాట్లు చేసినప్పటికీ ఏజెన్సీలోని రెండు కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్షలు రాశారు. అర్బన్‌లో ఆ పరిస్థితి లేనప్పటికీ విద్యార్థులు ఇరుకు గదులతో ఇబ్బంది పడ్డారు. తక్కువ కెపాసిటీ ఉన్న కళాశాలలకు ఎక్కువమంది విద్యార్థులను కేటాయించడంతో ఈ పరిస్థితి వచ్చింది. గదులు చాలకపోవడంతో ఆరుబయట కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. నగరంలోని నాలుగు కళాశాలల్లో ఈ సమస్య ఎదురైంది. మరుసటి రోజు నుంచి ఇలాంటి పరిస్థితి రాకుండా అదనపు గదులు కేటయించాలని ఇంటర్ బోర్డు అధికారులు పరీక్ష కేంద్రాల యాజమాన్యాలను ఆదేశించారు. తొలి రోజు నిర్వహించిన భాషా పరీక్షకు 48,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,457మంది హాజరు కాలేదు. ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేశారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 48 కేంద్రాలను ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. ఇంటర్‌బోర్డు 14 మందిని తనిఖీ బృందాల్లో నియమించ గా జిల్లా కలెక్టర్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన 14 మందిని తనిఖీ బృందాలుగా నియమించారు. వీరంతా పరీక్షలను పర్యవేక్షించారు. అంతేకాకుండా హై పవర్ కమిటీ, డెక్ కన్వీనర్లు, డీవీఈవో, ఆర్ఐవో, పోలీస్ బృందాలు కూడా తనిఖీలు నిర్వహించాయి. గురువారం నుంచి ద్వితీయ సంవ త్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో వీరు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను కూడా ఇంటర్ బోర్డు, జిల్లా కలెక్టర్ నియమించిన ప్రత్యేక తనిఖీ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఈ పరీక్షలకు 50.567మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ట్రాఫిక్ టెన్షన్ ఇంటర్ విద్యార్థులను ట్రాఫిక్ టెన్షన్ వెంటాడింది. సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్తామో లేదోనని ఆందోళన పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, డాబాగార్డెన్స్ వంటి రద్దీ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉదయం ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు కార్లలో, మధ్యతరగతి విద్యార్థులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో రావడంతో రద్దీ ఎక్కువైంది. సాధారణ సమయాల్లోనే రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ ఏరియాలు పరీక్షల కారణంగా మరింత ర ద్దీగా మారాయి. ట్రాఫిక్‌ను తప్పించుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. -
తొలిరోజే ఇద్దరు డిబార్
⇒ ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం ⇒ పలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు ⇒ ఆలస్యంగా వచ్చి వెనుగిరిగిన కొందరు విద్యార్థులు నిజామాబాద్ అర్బన్ :ఇంటర్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ, ఎస్ఎస్ఆర్ కళాశాల కేంద్రాలను జేసీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. చిట్టిమిల్ల హరిప్రసాద్ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా స్క్వాడ్ అధికారులు వారిని పట్టుకున్నారు. 45 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించినా, కొన్ని చోట్ల విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. కాకతీయ జూనియర్ కళాశాల లో ఇద్దరు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. ఖలీల్వాడిలోని ఎస్ఎస్ఆర్ పరీక్ష కేంద్రానికి చెందిన ఓ ఇన్విజిలేటర్ 9.40 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి వచ్చారు. అధికారులు ఆయననూ అనుమతించలేదు. సమాచారం ఆలస్యంగా ఇచ్చారని తెలిపినా, నిరాకరించారు. మొదటి రోజు పరీక్షలకు 2,121 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మంగళవారం ద్వితీయ ఇంటర్ పరీక్షలు మొదలవుతాయి. -
గా‘నైట్’
జిల్లా సరిహద్దులు దాటుతున్న స్టోన్ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు.. అధిక లోడ్‌తో వెళ్తున్న లారీలు గుంతలు పడుతున్న రహదారులు పభుత్వ ఆదాయూనికి రూ.కోట్లలో గండి పట్టించుకోని అధికార యంత్రాంగం కాజీపేట : జిల్లాలో దాదాపు 200 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటిలో అనుమతి ఉన్నవి 110 నుంచి 120 వరకు ఉండగా.. అనుమతి లేనివి 50 నుంచి 60 వరకు ఉంటారుు. వివిధ కారణాలతో నడవనివి దాదాపు 20 నుంచి 40 వరకు ఉన్నారుు. ప్రధానంగా శాయంపేట, కొండపర్తి, మడికొండ, ధర్మసాగర్, మహబూబాబాద్, ఏటూరునాగారం, కేసముద్రం తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్నారుు. ఈ ప్రాంతాల క్వారీల నుంచి రోజు రాత్రి వందల సంఖ్యలో గ్రానైట్ లోడ్ లారీలు కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని అయోధ్యపురం రైల్వేట్రాక్‌కు చేరుకుంటున్నారుు. తెల్లవారే సరికి అవి రైళ్లలో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు చేరుకుంటున్నారుు. అక్కడి నుంచి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ ఈ ముడి గ్రానైట్ అందమైన ఆకృతిలో తయూరై మళ్లీ దిగుమతి అవుతోంది. ఉదాహరణకు జిల్లాలో రూ.100కు ఎగుమతి చేసిన గ్రానైట్ రాయి విదేశాల్లో ఆకృతి మార్చుకుని రాగానే మనం రూ.1000కి కొనుగోలు చేస్తున్నాం. సీమాంధ్ర, బెంగళూరు, చెన్నైకి చెందిన పలువురు వ్యాపారులు జిల్లాలో ని క్వారీల యజమానులతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా.. ప్ర భుత్వానికి పన్ను చెల్లించకుండా రాత్రి వేళల్లో జిల్లా సరిహద్దుల నుంచి విదేశాలకు గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రూ.కోట్లలో దందా జరుగుతుం డగా.. పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన రూ.లక్షల ఆదాయూనికి గండి పడుతోంది. నిబంధనలు గాలికి.. క్వారీల నుంచి తరలించే గ్రానైట్ లారీకి ఒక్కోదానికి మూడు నెలలకోసారి రూ.8,500 చొప్పున ప్రభుత్వానికి రోడ్‌ట్యాక్స్ చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల ట్రక్కులో 25 టన్నుల గ్రానైట్, 12 టైర్ల ట్రక్కులో 31, 14 టైర్ల ట్రక్కులో 35, 18 టైర్ల ట్రక్కులో 41, 22 టైర్ల ట్రక్కులో 49 టన్నుల గ్రానైట్ మాత్రమే తీసుకెళ్లాలి. కాగా ఆయా ట్రక్కు ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్ చేస్తున్నారు. సామర్థ్యానికి మించి లోడులో 22 టన్నుల నుంచి 32 టన్నుల వరకు అదనంగా వేసి రవాణా చేస్తున్నారు. టన్నుకు రూ.1,060 చొప్పున మైనింగ్ శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 25 టన్నులకు రూ.26,500 పన్నుల రూపకంగా చెల్లించాల్సి ఉండగా, ఒక ట్రక్కులో సుమారు 45 టన్నుల మేర వేసి రూ.21,200 పన్ను ఎగ్గోడుతున్నారు. దీంతోపాటు రవాణా భారం కూడా తగ్గుతుంది. రెండు సార్లు తీసుకెళ్లాల్సిన గ్రానైట్ రాళ్లను ఒకేసారి తీసుకెళ్లడంతో ఒక్క లోడుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. నెలకు రూ.లక్షల్లో వసూళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రానైట్ రాళ్లు తరలిస్తున్న ట్రక్కులను అధికారులు పట్టుకుని సీజ్ చేసి టన్నుకు రూ.1000 చొప్పున జరిమానా విధిం చాలి. కానీ, అధికారులు కాసులకు కక్కుర్తి పడి టన్నుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక క్వారీల యజమానులు, వ్యాపారులు ముందస్తుగానే అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని.. రూ.లక్షలు ముచ్చజెప్పి ఇబ్బంది లేకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. దీంతో చెక్ పోస్టుల వద్ద అధికారులు ఆపడం లేదు. ఇక.. క్వారీల యజ మానులు గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వేస్తున్నారు. చీక టి పడుతుందంటే చాలు.. జిలెటిన్‌స్టిక్స్ పేలుళ్లతో సమీప గ్రామాల ప్రజ లు ఉలిక్కిపడుతున్నారు. ఇళ్ల పునాదులు కదలడంతోపాటు క్వారీ పరిసరాల్లోని పంటలు నాశనమవుతున్నారుు. దీనికి తోడు అధిక లోడ్‌తో వెళ్లడంతో రహదారులపై ఉన్న కల్వర్టులు, పైప్లైన్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ రాయిని తరలించడం నేరం. జిల్లాలో మైనింగ్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అదనపు లోడుతో వెళ్తున్న వాహనాలపై జరిమానా వేస్తున్నాం. క్వారీల వివరాలు కావాలంటే సమాచారహక్కు చట్టం కింద ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. - బాలరాజుగౌడ్, అసిస్టెంట్ డెరైక్టర్, మైన్స్ అండ్ జియాలజీ -
14 స్కూల్ బస్సుల సీజ్
భవానీపురం : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్‌లపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో మంగళవారం తనిఖీలు నిర్వహించి, 14 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పాఠశాలల బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను విస్మరిస్తున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400 బస్‌లను తనిఖీ చేశామని, డ్రైవరక్లు లెసైన్స్‌లు, బస్‌కు పర్మిట్లు లేకపోవడం, టాక్స్‌లు చెల్లించక పోవడం వంటి కారణాలతో 25 బస్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. అందులో 14 బస్‌లను సీజ్ చేశామని వివరించారు. నగరంలోని పటమట, వారధి, చుట్టుగుంట ప్రాంతాలలో మూడు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. డ్రైవర్ల ప్రవర్తనకు సంబంధించి పలు అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. పిల్లలను బస్‌లలో పంపే తల్లిదండ్రులు నెలకొకసారైనా వాటిలో ప్రయాణించాలని సూచించారు. అలా చేస్తే బస్ కండిషన్, డ్రైవర్ ప్రవర్తన తెలుస్తాయన్నారు. బస్‌లలో ఏర్పాటు చేసే ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన మందులు ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బస్లోపల నుంచి బయటకు ఎలా రావాలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్ పర్మిట్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగిస్తున్నాయన్నారు. అటువంటివారిపై కేసులు నమోదు చేస్తామని, అప్పటికీ వారిలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు వి.ఆర్.రవీంద్రనాథ్, జి.సంజీవకుమార్, బి.చెల్లారావు, వి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎన్.ఎల్ సుబ్బలక్ష్మి, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు
బాల్కొండ: నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పలు సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీఐలు రఘునాథ్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కాస్మోటిక్ చార్టీలు చెల్లించకపోవడం, మెనూ ప్రకారం ఆహారం అందివ్వటం లేదని తనిఖీల్లో తేలినట్టు ఆధికారులు వెల్లడించారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ గిరిజన హాస్టల్, మెదక్ జిల్లా జహీరాబాద్ బీసీ హాస్టల్ లోనూ ఏసీబీ దాడులు నిర్వహించి రిజిస్టర్లను పరిశీలించారు. -
ఇంటింటా తనిఖీలు
పొంచి ఉన్న ఉగ్రవాద దాడులు, అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పలాస మండలంలోని శాసనాం, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని ఏఎస్ పేట, టెక్కలి పంచాయతీలోని చేరీవీధిల్లో శుక్రవారం ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. అనుమానితులకు ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరించారు. పలాస/ఇచ్ఛాపురం/టెక్కలి: పలాస మండలం శాసనాం గ్రామాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసు బలగాలు ఒక్కసారి చుట్టుముట్టారుు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటిని(కార్డెన్స్ సెర్చింగ్) తనిఖీ చేశారు. తాళం వేసిన ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మొత్తం పోలీసు సిబ్బంది నాలుగు విభాగాలుగా విడిపోయి ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో నాటుసారా విక్రయించకూడదని, అపరిచితులు గ్రామంలోకి వచ్చినట్లయితే వెంటనే సమాచారం అందజేయాలని సూచించారు. పండుగ సమయాల్లో దొంగతనాలు జరగడానికి అవకాశం ఉందని, ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లినట్లయితే సమాచారమివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ ఎస్ఐలు ఆర్.వేణుగోపాలరావు, బి.శ్రీరామ్మూర్తి, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని ఏఎస్ పేట గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.అవతారం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీఐతో పాటు ఇచ్ఛాపురం, కవిటి ఎస్సైలు కె.వాసునారాయణ, బి.రామారావు, మధుసూదనరావులు సిబ్బం దితో కలిసి ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు, రేషన్ కార్డులను పరిశీలించారు. వాహన పత్రాలను పరిశీలించారు. పత్రాలు చూపని రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టెక్కలిలో గత కొంత కాలంగా సమస్యాత్మకంగా ఉన్న చేరీవీధిని పోలీసు బలగాలు చుట్టుముట్టారుు. ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు కోళ్ల అప్పన్న హత్యకు గురికావడం, సంఘ విద్రోహ శక్తులు తిష్టవేశాయన్న సమాచారంతో పోలీసులు ఇంటింట తనిఖీలు నిర్వహించారు. -
అధికారుల గుండెల్లో దడ!
కొల్లాపూర్‌లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి సబ్‌రిజిస్ట్రార్ కుర్చీ పక్కన చెత్తబుట్టలో రూ.10వేల నగదు స్వాధీనం రికార్డులు పరిశీలించిన అధికారులు.. కేసు నమోదు కొల్లాపూర్: ఏసీబీ దాడులతో కొందరు అధికారులకు దడ పు ట్టింది. కొల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవా రం సాయంత్రం ఏసీబీ అధికారుల బృందం ఆకస్మికంగా త నిఖీలు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ టి.రాందాస్‌తేజ నేతృత్వంలో రెండుగంటల పాటు ఈ సోదాలు కొనసాగించారు. ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న బి.నవీన్‌కుమార్ వద్ద రూ.630తో పాటు ఆయన కుర్చీ పక్కనే ఉన్న చెత్తబుట్టిలో పడేసిన రూ.10,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయ రికార్డులు పరిశీలించారు. అక్కడే విధుల్లో ఉన్న పలువురి నుంచి వివరాలు సేకరిం చారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాందాస్‌తేజ విలేకరులతో మాట్లాడారు. తాము కార్యాలయంలోకి వస్తుండగానే త మను చూసి సబ్‌రిజిస్ట్రార్ నవీన్‌కుమార్ రూ.10,600 నగదు ను చెత్తబుట్టిలో పడేశారని తెలిపారు. ఆ డబ్బులను స్వా దీనం చేసుకున్నామని చెప్పారు. నవీన్‌కుమార్ జేబులో రూ. 630 ఉన్నాయని, కార్యాలయ రిజిస్ట్రేషన్ల ఫీజులకు సంబంధించిన చలాన్లు లభించాయని వివరించారు. దొరికిన నగదు లెక్కలు తేలడం లేదన్నారు. కేసు నమోదుచేసి విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తిరుపతిరాజు, గోవిందరెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
సంబరాలు డౌటే..!
* నూతన సంవత్సర వేడుకుల అనుమతి అనుమానమే? * ఇప్పటికే విక్రయించిన నూతన సంవత్సర వేడుకల టిక్కెట్లు * నగదు వెనక్కి ఇవ్వాలని పరుగుతీస్తున్న యువత బెంగళూరు: ప్రతి సంవత్సరం ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులలో అత్యంత వైభవంగా నిర్వహించే నూతన సంవత్సరం వేడుకలకు ఈ సంవత్సరం (2015) అనుమతి ఇచ్చే అవకాశం తక్కువగా ఉన్నాయని పోలీసు వర్గా లు అంటున్నాయి. ఆదివారం రాత్రి ఎంజీ రోడ్డు సమీపంలోనే బాంబు పేలుడు జరగడం, ఎంజీ రోడ్డులో జరిగే నూతన సంవత్సర వేడుకలకు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారు. ఈ సందర్భంలో సోదాలు, తనిఖీలు చేయడం కష్టం అవుతుందని కొందరు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడులకు అనుమతి ఇవ్వడం అంత మంచిది కాదని కొందరు అధికారులు అంటున్నారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబు పేలుడు జరిగినా కొన్ని గంటల వ్యవధిలో స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించి అందరి దగ్గర శభాష్ అనిపించుకున్న బెంగళూరు పోలీసులు.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే క్రికెట్ స్టేడియం వేరు, బహిరంగ ప్రాంతం వేరు అని పోలీసు వర్గాలు అంటున్నాయి. మా డబ్బు తిరిగి ఇవ్వండి సార్ నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ రాత్రి నుంచి జనవరి వేకువ జామున రెండు గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, హొటల్లు నిర్వహించరాదని పోలీసులు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జనవరి 1వ తేదీన వేకువ జామున రెండు గంటల వరకు వ్యాపారాలు చేసుకొవచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అర్దరాత్రి ఒంటి గంటలకు వ్యాపారాలు నిలిపి వేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి నగరంలో బాంబు పేలుడు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎంజీ రోడ్డు, బ్రిగే డ్ రోడ్డు, జయనగర, హెచ్ఎస్ఆర్ లేఔట్, ఇందిరానగర, శివాజీనగర, రెసిడెన్సీ రోడ్డు, కన్నింగ్హొం రోడ్డు, దోమ్మలూరు, పాత మద్రాసు రో డ్డు, పాత ఎయిర్ పోర్టు రోడ్డు, బెంగళూరు- బళ్లారి రోడ్డు, గాంధీనగర, డబుల్‌రోడ్డు, శాంతినగర, మైసూరు రోడ్డు, కంగేరి, ఎలక్ట్రానిక్ సిటీ, కోరమంగల తదితర ప్రాంతాల్లోని పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ ఫ్యామిలి రెస్టారెంట్ల నిర్వహకులు నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని టిక్కెట్లు విక్రయించారు. ఒక్కోక్క టిక్కెట్ రూ. మూడు వేల నుంచి రూ. 25, రూ. 50 వేల వరకు ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవచ్చని భావిం చిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ బీటీ, కార్పొరేట్ ఉద్యోగులు ఇప్పటికే వారికి అవరసరమై టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఎక్కువగా ఇక్కడి ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, రెసిడెన్సీ రోడ్డు తదితర చోట్ల ఉన్న పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం రాత్రి బాంబు పేలుడు జరగడంతో టిక్కెట్లు తీసుకున్న వారు హడిలిపోయారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వెళ్లి వచ్చే సమయంలో జరగరానిది జరిగితే ఎలా అని భయపడుతున్నారు. సోమవారం ఇక్కడి ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, రెసిడెన్సీ రోడ్డులలోని పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు చేరుకున్న కొందరు తాము తీసుకున్న టిక్కెట్లు వెనక్కు తీసుకుని నగదు చెల్లించాలని మనవి చేశారు. నూతన సంవత్సరం వేడుకులు నిర్వహించడానికి టిక్కెట్లు విక్రయించిన వారు తలలు పట్టుకున్నారు. కొందరు నిర్వహకులు టిక్కెట్ ధరలో 30 శాతం కట్ చేసి మిగిలిన 70 శాతం నగదు తిరిగి చెల్లిస్తున్నారు. -
ఎర్రచందనం స్వాధీనం ఆరుగురి అరెస్ట్
సుమో, రెండు బైక్‌లు స్వాధీనం బి.కొత్తకోట: ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా సుమోతో పాటు రెండు బైక్‌లను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలు తీసుకుని వెళుతున్న ఆరుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ బీవీ.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని అమరనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా నంబూలపూలకుంట నుంచి వచ్చిన టాటాసుమోను తనిఖీ చేయగా మూడు ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయన్నారు. ఘటనా స్థలం లో ఆరుగురు పట్టుబడగా, మరో ఆరుగురు పరారయ్యారని తెలిపారు. సుమోలోని 234 కిలోల మూడు దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దుంగలు తరలిస్తున్న వారిలో మదనపల్లె పట్టణం బోయవీధికి చెందిన ఎంవీ.నాగరాజు(30), వైఎస్ఆర్జిల్లా రాయచోటి ఎస్‌ఎన్‌కాలనీకి చెందిన కే.శ్రీనివాసులు (34), రెడ్డీస్కాలనీకి చెందిన పీ.రెడ్డికిషోర్(23), బి.కొత్తకోట మండలం బూదలవారిపల్లెకు చెందిన ఎం.వెంకటనరుసు (20), ఎన్.సురేష్(28) అమరనారాయణపురానికి చెందిన ఎస్.బషీర్(58)ను అరెస్ట్ చేశామని చెప్పారు. దుంగల విలువ రూ. 4. 68 లక్షలు, వాహనాల విలువ రూ.3 లక్షలుగా లెక్కించారు. ఈ కేసులో గుర్రంకొండ మండలం కలూరివారిపల్లెకు చెం దిన ఎస్.చంద్రశేఖరనాయుడు, ములకలచెరువు మండలం చింతరేవులపల్లెకు చెందిన కే.వెంకటేష్, తంబళ్లపల్లెకు చెందిన ఎం.చంద్రశేఖర్, కర్ణాటకలోని కటికహళ్లికి చెందిన సలీం పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడిన నిందితులను కోర్టుకు హజరుపరిచినట్టు వివరించారు. బుచ్చినాయుడుకండ్రిగలో బుచ్చినాయుడుకండ్రిగ : బుచ్చినాయుడుకండ్రిగలోని పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం ఎర్రచందనం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. 14మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఈశ్వరయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బుచ్చినాయుడుకండ్రిగలోని పెట్రోల్ బంకు వద్ద వాహనాలను తనిఖీచేస్తుండగా 10 ఎర్రచందనం దుంగలు చెన్నైకు తరలిస్తున్న లారీ పట్టుబడిందని చెప్పారు. ఎర్రచందనం విలువ పది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం తరలిస్తున్న చెన్నైకు చెందిన 14మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని తెలిపారు. -
మంత్రి పీఎస్ హల్చల్....
చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ శాఖా మంత్రి కిమిడి మృణాళిని పర్యటనలు, వ్యవహారాలు చూసుకోవాల్సిన ఆయన ఒక్కసారిగా మంత్రిగా పరకాయప్రవేశం చేశారు. తానే మంత్రినైనట్టు రాష్ట్ర మంత్రి మృణాళిని పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ వ్యవహరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రి పీఎస్ తనిఖీలు చేసి, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి మృణాళినితో ఫాలో అవ్వాల్సిన ఆమె పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ, మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ వాహనంలో శుక్రవారం చీపురుపల్లి వచ్చి హల్చల్ చేశారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీరింగ్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి, అక్కడే ఉన్న నీటి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంతో పాటు ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఏకంగా సాంకేతిక రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక అనుమతులు రిజిస్టర్లలో గత నెలకు సంబంధించిన పనులకు వివరాలను ఎందుకు పూర్తిగా నమోదు చేయలేదని అధికారులను నిలదీసినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా జిల్లా పరిషత్ సీఈఓ రాజకుమారి, పంచాయతీరాజ్ ఎస్ఈ, ఈఈలకు అక్కడి నుంచి ఫోన్ చేసి, స్పీకర్ ఆన్‌చేసి చీపురుపల్లి డిప్యూటీ పంచాయతీరాజ్ విభాగం పరిస్థితి ఏమీ బాగాలేదని, దృష్టి పెట్టాలని సూచించారు. అంతకుముందు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశారు. వారానికి ఎన్ని గుడ్లు పెడుతున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కూడా పరిశీలించినట్లు తెలిసింది. అయితే మంత్రి పీఎస్ చర్యలుపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ అధికారుల్లో చర్చ మొదలయ్యింది. ఈ విషయమై ఏకంగా మంత్రి మృణాళినితోనే మాట్లాడేందుకు ఇంజినీరింగ్ అదికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పోలీసుల ‘చెక్‌పోస్టు’ దొరికిందోచ్
యాలాల: ఎట్టకేలకు పోలీసుల చెక్‌పోస్టు గుడారం దొరికింది. మండల పరిధిలోని వ్యవసాయ పరిశోధన స్థానం సమీపంలో ఇటీవల పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు గుడారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరిం చిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం మండల పరిధిలోని బెన్నూరు సమీపంలో రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు గుడారాన్ని పడేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి గుడారాన్ని పోలీస్‌స్టేష న్కు తరలించారు. మండల పరిధిలో ని కాగ్నా నది నుంచి తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ పరిశోధన స్థానం సమీపంలో పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశా రు. ఓ గుడారం ఏర్పాటు చేసి పోలీసులు రాత్రివేళల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలోనే గత శుక్రవారం రాత్రి గుడారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. పోలీసుల గుడారమే అపహరణకు గురవడంతో ఖాకీలు ఈ ఘటనను అవమానంగా భావించారు. ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఈ ఘటనకు పాల్పడింది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులే అని పోలీసులు ప్రాథమికంగా భావించారు. ఈ కోణంలో కొందరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. అయితే అనుకోకుండా బుధవారం ఉదయం బెన్నూరు సమీపంలోని ఈడిగి అంబరయ్య బావి సమీపంలో గుడారం ప్రత్యక్షం అయింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గుడారాన్ని పడేసివెళ్లిన నిందితులు? పోలీసులు ప్రాథమిక అనుమానం ఉన్న ఇసుక రవాణాదారులను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపా రు. ఇసుక ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లను తమదైన శైలిలో విచారించారు. దీంతో గుడారాన్ని అపహరించుకుపోయిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ చేసిన తప్పును అంగీకరించాడని విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు గుడారాన్ని బెన్నూరు శివారులో బుధవారం ఉదయం ఉద్దేశపూర్వకంగానే వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. గుడారం ప్రత్యక్షమవడం విషయమై యాలాల ఎస్ఐ రవికుమార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్లో సంప్రదించే యత్నం చేసినా ఆయన స్పందించలేదు. -
బాంబు స్క్వాడ్ తనిఖీలు
కైకలూరు : బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు డిసెంబర్ ఆరో తేదీ (బ్లాక్ డే)ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కైకలూరులో శుక్రవారం రాత్రి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశాలతో గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో నాలుగు బృందాలుగా ఈ తనిఖీలు చేశారు. కైకలూరు ైరె ల్వే స్టేషన్లో జిల్లాకు చెందిన ‘మిక్కి’ డాగ్‌తో అణువణువు పరిశీలించారు. బాంబు స్క్వాడ్ టీం మోతి, నాగభూషణం, నాగరాజు, డాగ్ స్క్వాడ్ సీహెచ్‌వీవీ సూర్యనారాయణ తనిఖీల్లో పాల్గొన్నారు. బాంబు డిస్పోజబుల్ పరికరాలు, డాగ్ అన్వేషణను చూసిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. -
సీఎం ఫండ్ చెక్కులు చెల్లడంలేదు
గవర్నర్‌కు షబ్బీర్ అలీ లేఖ హైదరాబాద్: పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఇచ్చిన చెక్కులు సంబంధిత బ్యాంకుల్లో చెల్లడం లేదని, దీంతో బాధితులు బ్యాంకులు, సీఎం కార్యాలయం చుట్టూ తిరగలేక ఇబ్బం దులు పడుతున్నారని శాసన మండలిలో తెలం గాణ శాసనమండలిలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ షబ్బీర్ అలీ తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల్లో బౌన్సు అయిన చెక్కులను జత చేసి ఆయన, రాష్ర్ట గవర్నర్ న రసింహన్కు ఓ లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు జారీ అయిన సుమారు 3,600 చెక్కుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. కేవలం నెల రోజుల కాల పరిమితితో జారీ చే సిన ఈ బ్యాంకు చెక్కులను పట్టుకుని బాధితులు సీఎం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. -
అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ తనిఖీలు
‘పీజీ’ కౌన్సెలింగ్‌పై హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వెల్లడి హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించిన 145 ఇంజనీరింగ్ పీజీ కాలేజీల్లోనూ తనిఖీలు నిర్వహించి, నిబంధనల మేర సౌకర్యాలు ఉన్నాయో లేదో తేలుస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాంతోపాటు లోపాలున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలు తమ నోటీసులకు సమాధానమిచ్చాయని, ఆ సమాచారాన్ని క్రోడీకరించడంతో పాటు ఈ కాలేజీలను కూడా తనిఖీ చేస్తామని విన్నవిం చింది. అనంతరం ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదికలను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇం దుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన కోర్టు విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిరాకరించిన కాలేజీల ను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ గత నెల 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జేఎన్టీయూహెచ్ ఈ ఉత్తర్వులను స వాలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనానికి అప్పీలు చేసింది. ఈ నేపథ్యంలో కాలేజీల వ్యాజ్యాలపై తుది విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని గురువారం మరోసారి విచారించారు. పిటిషనర్లు, జేఎన్టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ గుర్తించిన లోపాలను ఆయా కాలేజీలు సరిదిద్దుకున్నాయా? లేదా? అన్న అంశానికే కోర్టు తన విచారణను పరిమితం చేసేందు కు ఇరుపక్షాలూ అంగీకరించాయి. లోపాలున్న ట్లు చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కా లేజీలతో పాటు వెబ్ కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించిన 145 పీజీ కాలేజీల్లోనూ తనిఖీలు నిర్వహించి, నివేదిక సమర్పిస్తామని ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారు. నాలుగు వారాల గడువుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
ములకలచెరువు: ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 400 కిలోల రాగి తీగలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రామాంజీనాయక్, ఎస్ఐ నరేష్కుమార్ సోమవారం తెలిపారు. వారి కథనం మేరకు..సోమవారం తెల్లవారుజామున తంబళ్లపల్లె ఎస్ఐ నరేష్కుమార్, తన సిబ్బందితో కోసువారిపల్లె క్రాస్‌వద్ద వాహనాల తనిఖీలు చేశారు. రెండు ఆటోలను తనిఖీ చేయగా వంద కిలోల రాగితీగలు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లెకు చెందిన దనియాల పెద్దరమణ (43), సద్దాం(25), రమేష్(26) ఆటో డ్రైవర్లు మల్లేశ్వర్రావు(29), నాగరా జు (26)ను అరెస్ట్ చేశారు. వీరంతా ఆవుల శంకర్(30)నేతృత్వంలో ఏడుగురి సభ్యులతో ఒక ముఠాగా ఏర్పడి ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలింది. అలాగే, కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలోని కొండలో నిందితులు దాచి ఉంచిన 300 కేజీల రాగితీగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆవుల శంకర్(30), మచ్చ రమేష్(25) కోసం గాలిస్తున్నామని, ఆవుల శంకర్, దనియాల పెద్దరమణపై అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఇంతకు ముందు దాదాపు 200 ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం మదనపల్లెకు తరలించారు. ఇదలా ఉంచితే, వీరు జిల్లాలో వివిధ మండలాల్లో 82 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగితీగలను చోరీ చేసినట్టు తేలిందని చెప్పారు.. రాగితీగలను కొన్న వారినీ అరెస్ట్ చేస్తాం : సీఐ ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా నుంచి రాగితీగలను కొన్న మదనపల్లెకు చెందిన నలుగురు గుజిరీ వ్యాపారులను కూడా అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. వీరు నిందితుల నుంచి కిలో రాగి తీగలు *300 చొప్పున కొని బెంగళూరులో 1000 రూపాయల వంతున విక్రయిస్తున్నట్టు తేలిందని వెల్లడించారు. 82 ట్రాన్స్ఫార్మర్ల చోరీకి సంబంధించి ఇంకనూ 946 కేజీల రాగి తీగలను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో ఎస్ఐలు నరేష్కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్ఐ నారాయణస్వామి, సిబ్బం ది, శ్రీకాంత్, కుమార్, సిరాజ్, శంక ర్, మారుతిరెడ్డి, రమణకుమార్, నరసింహులు పాల్గొన్నారు. -
ప్రైవేటు పాఠశాలల్లో అధికారుల తనిఖీలు
నిజామాబాద్‌అర్బన్ : ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాలపై తనిఖీలకు ఉపక్రమించడమే ఇందుకు ప్రధానకారణం. జిల్లాలో మూడు రోజులుగా ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యాబోధన తీరును విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో 850 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 410 పాఠశాలలకు అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. సగం పాఠశాలలకు సానిటేషన్ సౌకర్యం లేదు. అలాగే ఆటస్థలాలు లేకుండానే పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన లోపాలున్న పాఠశాలలు యాజమాన్యాల పరిస్థితి కుడిలో పడ్డ ఎలుకల్లా మారింది. తనిఖీలకు వచ్చే అధికారులను ప్రలోభాలకు గురిచేసి తప్పిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని 66 పాఠశాలలకు గుర్తింపు లేదు. ఉన్న పాఠశాలల్లో రెన్యూవల్ లేకుండా మరి కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలి సింది. తనిఖీలను చేపడుతున్న అధికారులు ప్రతి రోజు నివేదికలను డీఈఓ శ్రీనివాసచారికి అం దిస్తున్నారు. ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో పాఠశాలల్లో అదనపు సెక్షన్ల నిర్వహణ , మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేకపోవడం ప్రధానంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై కూడా అధికారులు పరిశీలన చేయనున్నారు. 80 శాతం పైగా ప్రైవేట్ పాఠశాలల్లో అసౌకర్యాలే ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలుతోంది. వేలాది ఫీజులు వసూలు చేస్తున్నా సౌకర్యాల ఏర్పాటులో యజమాన్యాల నిర్ల క్ష్య వైఖరి బట్టబయలవుతోంది. కొనసాగుతున్న దాడులు నాలుగవ రోజు శుక్రవారం జిల్లా వ్యా ప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు జరి గాయి. ఒక్కరోజే 56 పాఠశాలలను తనిఖీ చేసినట్లు తెలిసింది. ఆయా మండల కేంద్రాల్లో నియమించిన ప్రత్యేక బృందాలు పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేశాయి. చాలా చోట్ల సక్రమమైన భవనాలు లేకపోవడం , శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేరని తేలింది.తనిఖీల్లో భాగంగా పాఠశాల ఆర్జేడీ మస్తానయ్యా నేడు జిల్లాకు రానున్నారు.పాఠశాలల్లో మౌలిక వసతులు, అనుమతులను పరిశీలించనున్నారు. సరైన సమాచారం ఇవ్వాలి - డీఈవో శ్రీనివాసచారి ప్రైవేట్ పాఠశాలలకు తనిఖీలకు వెళ్లిన అధికారులకు పాఠశాల యజమాన్యాలు సరైన సమాచారం ఇవ్వాలి, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. విద్యార్థుల కు మెరుగైన విద్యనందించేందుకు ఈ పరి శీలన కొనసాగుతోంది. అన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తనిఖీల బృందాలకు సహకరించాలి. విద్యాహక్కు చట్టం అమలుకు కృషి -జిల్లా పరిశీలకులు రాంచందర్ బాన్సువాడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకు కృషి చేస్తున్నామని, విద్యా ప్రమాణాలు విద్యార్థులకు పూర్తి సాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ జిల్లా పరిశీలకులు రాంచందర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించలేకపోయామన్నారు. ఉపాధ్యాయులు స్వయం అధ్యయనంతోనే విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని సింధు, వివేకానంద పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలలను సందర్శించి నూతన పాఠ్యాంశాలపై విద్యార్థుల అభిప్రాయాలు, తరగతి గదుల పరిశీలన, మౌలిక వసతులు, ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల విద్యార్హతలపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏవిధం గా బోధిస్తున్నారు, వారి విద్యార్హతలు ఏ మేరకు పాటిస్తున్నారు, అనే అంశాలపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని అన్నారు. తన తనిఖీలో రెండు పాఠశాలల్లో గ్రంథాలయాలు, ల్యాబ్‌లు లేవని తెలిపారు. -
అన్నీ లోపాలే!
- బట్ట బయలవుతున్న ప్రయివేటు బడుల బాగోతం - అసౌకర్యాల నడుమ తరగతుల నిర్వహణ - మూత్రశాలలూ, మరుగుదొడ్లూ కరువే - అధికారుల పరిశీలనలో వెల్లడవుతున్న నిజాలు - నేడు కూడా కొనసాగనున్న తనిఖీలు నిజామాబాద్ అర్బన్: ప్రయివేటు బడుల బాగోతం బట్టబయలవుతోంది. పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. డైట్‌కు చెందిన ఎనిమిది మంది లెక్చరర్లు గురువారం నగరంలోని పాఠశాలలను సందర్శించారు. వసతులపై ఆరా తీశారు. ఒక్కొక్కరు ఒక్కో పాఠశాలను పరిశీలించారు. అంతటా అసౌకర్యాలే జిల్లాలో 850 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. డిప్యూటీ ఈఓ పోచాద్రి, డైట్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో రెండు బృందాలు తనిఖీలలో పాల్గొం టున్నాయి. ఈ రెండు బృందాలు నగరంలోని 12 పాఠశాలలను తనిఖీ చేసాయి. ఆర్టీసీ కాలనీలో ఓ ప్రయివేటు పాఠశాలలో అధిక సంఖ్యలో సెక్షన్లు ఉన్నాయని, తగినన్ని మూత్రశాలలు లేవని వెలుగులోకి వచ్చింది. అనుభవం లేని ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారని తేలింది. వినాయక్‌నగర్‌లోని ప్రయివేటు ఓ పాఠశాలలో స్థాయికి మించి సెక్షన్లు నిర్వహిస్తున్నారని, తరగతి గదులు ఇరుకుగా ఉన్నాయని, శిక్ష ణ పొందిన ఉపాధ్యాయులు లేరని, వందలాది మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల ఉందని బయటపడింది. మరికొన్ని పాఠశాలలలోనూ ఇదే పరిస్థితి ఉంది. మూత్ర శాలలు లేవని, భవనాలకు అగ్ని మాపక శాఖ అనుమతి కూడా లేదని, ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని వెల్లడైంది. పలు పాఠశాలలో మైదానాలు లేక క్రీడలను నిర్వహించడం లేదు. విద్యార్థులకు బోధన కూడా నామమాత్రంగా అందుతోంది. విద్యార్థుల నుంచి ముక్కు పిండి మరీ వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు పాఠశాలలలో సౌకర్యాల లేమి స్పష్టంగా బయటపడింది. కొన్ని పాఠశాలలకు ఆరవ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉండగా, పదవ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. చాలా వరకు బడులు నివాస భవనాలలోనే కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగనున్నాయి. -
ఇసుక లారీలపై ఉక్కుపాదం
- అర్ధరాత్రి విజిలెన్స్ అధికారుల దాడులు - వంద ఇసుక లారీల పట్టివేత - ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాల స్వాధీనం - క్వారీలలోనూ ఆకస్మిక తనిఖీలు - భారీగా జరిమానా విధింపు బాన్సువాడ/బిచ్కుంద: ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు కన్నెర్ర చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు విస్తృతంగా తనిఖీలు చేసి వంద లారీ లను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఏస్గీ క్వారీల నుంచి ఇసుకను తరలిస్తున్న పది టైర్ల భారీ వాహనాలను కూడా నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్‌తో ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు గనుల శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డి ఆధ్యర్యంలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి బిచ్కుంద మండలం ఖద్గాం, శెట్లూర్, వాజిద్నగర్, పిట్లం, నిజాం సాగర్, బాన్సువాడ, బిచ్కుందలో దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న వంద లారీలను స్థానిక తహసీల్దార్ ధన్వాల్కు అప్పగించారు. ఒక్కో వాహనానికి రూ.20వేల చొప్పున జరిమానా విధించారు. అయితే దాదాపు 35 లారీలకు ఇంకా జరిమానా వేయలేదని సమాచారం. ఒక్కో లారీలో 50 టన్నులు వాస్తవంగా పది చక్రాల లారీలో సుమారు 22 టన్నుల మేర కే లోడ్ నింపాలి. కానీ, సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో లారీ డ్రైవర్లు రెట్టింపు బరువు అంటే, దా దాపు 50 టన్ను ల ఇసుకను నింపి వివిధ ప్రాంతాల కు తరలి స్తున్నా రు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, లారీ లలో సామర్థ్యానికి మించిన బరువుతో ఇసుకను రవాణా చే స్తుండడంతో రహదారులు చెడిపోతున్నాయని బిచ్కుంద బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఇటీవల న్యాయవాదులు కోర్టులో కేసు కూడా వేశారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, తక్షణమే ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని విన్నవించారు. రెవెన్యూ, గనులు, పోలీస్, రవాణా శాఖ అధికారుల వైఖరికి నిరసనగా ఒక రోజు బిచ్కుంద బంద్ చేయించి, ధర్నా చేశారు. ఓవర్‌లోడ్ వాహనాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలూ గాలిలో కలిసిన సంఘటనలూ ఉన్నాయి. ఇటీవలే నిజాంసాగర్ మండలం కోమలంచ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక లారీ కింద పడి ఒక వ్యక్తి మరణించాడు. మహారాష్ట్ర ప్రాం తం నుంచి వస్తున్న భారీ వాహనాలను బోధన్-బాన్సువాడ-ఎల్లారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఒక్కొక్క భారీ వాహనంలో 30 నుంచి 40 టన్నుల ఇసుకను తరలిస్తున్న ఇసుక వ్యాపారులు వాటిని హైదరాబాద్ నగరానికి తర లించి సుమారు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లారీ ద్వారా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుండ డంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎట్టకేలకు అధికారులు స్పందించి బుధవారం రాత్రి ఇసుక లారీలపై దాడులు చేశారు. హోం మంత్రి వస్తున్నారనేనా! హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గురువారం మ ద్నూర్ ప్రాంతంలో పర్యటించారు. ఇసుక లారీల వ్య వహారం మంత్రి దృష్టికి రాకూడదనే పోలీసు అధికారులు భావించి ఈ దాడులు నిర్వహించారని తెలుస్తోంది. క్వారీని పరిశీలించిన అధికారులు ఖత్గాం, వాజిద్నగర్ గ్రామాలలో కొనసాగుతున్న ఇసుక క్వారీలను తహసీల్దార్ ధన్వాల్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధం గా ఇసుకను తవ్వుతున్నారా లేదా అని పరిశీలించి పూర్తి నివేదిక తయారు చేసి గనుల శాఖ అధికారుల కు అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. అక్కడి నుం చి అనుమతులు వచ్చే వరకు ఇసుక రవాణాను నిలి పివేయాలని క్వారీ నిర్వాహకులకు సూచించారు. -
రద్దీ వేళల్లో చలానాలు వద్దు
జంక్షన్‌కు 200 మీటర్ల దూరంలోనే రాయండి ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి అధికారులకు అదనపు సీపీ జితేందర్ ఆదేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు చలానా రాయడానికి స్వస్తి చెప్పనున్నారు. రద్దీ వేళల్లో వా హనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా చూడడంపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించనున్నారు. ఈ మేరకు నగర ట్రాఫి క్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ అ ధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చే శారు. బుధవారం తన కార్యాలయంలో ట్రాఫిక్ అధికారులు, సిబ్బం దితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని 25 ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలోని జంక్షన్లు, సిగ్నల్ వ్యవస్థ, ఆల్ఫా న్యూమెరి కల్ టైమర్లు, ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో తమ ఇబ్బందులను ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు జితేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు చలానా రాసేందుకే కాదని, సాఫీగా వాహనాలు నడిచేందుకు కృషి చేస్తున్నారనే భావన వచ్చేలా విధులు నిర్విహంచాల న్నారు. నిబంధనలఉల్లంఘనులపై దృష్టి సారించాలన్నారు. 200 మీటర్ల దూరంలోనే తనిఖీలు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా వాహనాల తనిఖీలు, చలానా రా యడం వంటివి చేపట్టాలని జితేందర్ సూచించారు. జంక్షన్‌కు 200 మీ టర్ల దూరంలో వాహనాలు తనిఖీ చేయడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందు లు ఉండవన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 9 నుంచి 11.30 గం టలు, తిరిగి సాయంత్రం 5 నుంచి 7.30 గంటల సమయాలలో త నిఖీలు, చలానాలు రాయవద్దని స్పష్టం చేశారు. మిగతా వే ళల్లోనూ ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా వాహనాల తనిఖీ చేపట్టాలని, ఆ సమయంలో ప్రత్యేక బారికేడ్లను పెట్టుకోవాలని ఆయన సూచించారు. చౌరస్తాకు 100 మీటర్ల దూరంలో రహదారులపై పార్కింగ్, షాపింగ్ సెంటర్ల సైన్‌బోర్డులు, ప్రకటనబోర్డులు అడ్డంగా ఉండకుండా చూడాలన్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమన్వయంపై దృష్టి ఎక్కడైనా భారీ వాహనం ప్రమాదానికి గురై, ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే స్పందించాలని జితేందర్ ఆదేశించారు. చుట్టు పక్కల ట్రాఫిక్ ఠాణాల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఠాణాల ఎస్హెచ్ఓలు (ఇన్స్పెక్టర్లు) ఎక్కువ సమయం రహదారుల పైనే విధులు నిర్వహించాలని, ప్రజలు, వాహనదారుల సహకారం తీసుకోవాలని సూచించారు. -
పాఠశాలల్లో మళ్లీ తనిఖీలు
కంచనపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో డీఈఓ తనిఖీ హెచ్ఎంకు మెమో.. ఇద్దరు టీచర్ల ఇంక్రిమెంట్లో కోత విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కొన్ని నెలల క్రితం ఈ తనిఖీలు చేపట్టిన విషయం విదితమే. ఆ తర్వాత వివిధ కారణాలతో నిలిపివేసిన అధికారులు మళ్లీ తనిఖీలకు ఉపక్రమించారు. ఈ మేరకు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ శుక్రవారం జిల్లాలోని రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని జెడ్పీఎస్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు. వ్యక్తిగత పనిపై వెళ్లిన ఉపాధ్యాయుడికి ఓడీ! కంచనపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో డీఈఓ తనిఖీ చేసిన సమయంలో హెచ్ఎం డి.సమ్మయ్య సెలవులో ఉన్నారు. అయితే, హాజరుపట్టికను పరిశీలిస్తే హెచ్ఎం ఎక్కువగా ఓడీలు కూడా వేసుకుంటున్నట్లు తేలింది. మరో ఉపాధ్యాయుడు పవన్‌కుమార్ తన వ్యక్తిగత పనిపై వెళ్లగా అతనికి కూడా హాజరుపట్టికలో ఆన్ డ్యూటీ(ఓడీ) వేశారు. దీంతో హెచ్ఎం పనితీరు సంతృప్తికరంగా లేదని గుర్తించిన డీఈఓ ఆయనకు మెమో జారీ చేశారు. ఇక పవన్‌కుమార్ వ్యక్తిగత పనిపై వెళ్తూ ఓడీ పెట్టినట్లు గుర్తించిన డీఈఓ ఆయన ఒక రోజు వేతనంలో కోత విధించారు. ఆ తర్వాత డీఈఓ విజయ్‌కుమార్ పదో తరగతి విద్యార్థుల ఇంగ్లిష్, సోషల్ స్టడీస్‌లో విద్యా సామర్థ్యాన్ని పరిశీలించగా, వారు చిన్నచిన్న ప్రశ్నలకు సైతం జవాబులు చెప్పలేకపోయారు. ఈ మేరకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఆర్.అశోక్, పి.సంపత్‌కు రాబోయే అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా తెలుగు, హిందీలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించగా సంతృప్తికరంగా ఉండడంతో ఆయా ఉపాధ్యాయులను డీఈఓ అభినందించారు. కాగా, మండలాల్లో ఎంఈఓలు పాఠశాలలను సరిగ్గా తనిఖీ చేయకపోవడంతో ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, ఇక నుంచి వరుసగా పాఠశాలల తనిఖీలు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ విజయ్‌కుమార్ వెల్లడించారు. -
అవినీతి క్వారీ!
- మట్టి తవ్వకాలకు అనుమతుల వెనుక భారీ అక్రమాలు - చేతులు మారిన కోట్ల రూపాయలు - రైతుల నోట్లో మట్టికొట్టిన వైనం మంగళగిరి: భారీ ఎత్తున సొమ్ము చేతులు మారటం వల్లే ఆత్మకూరు చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ‘ప్రజాప్రయోజనాల’ ముసుగులో అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు ఈ దందా నడిపినట్టు తెలుస్తోంది. సొంత పొలంలోని మట్టిని తోలుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేస్తే సవాలక్ష ప్రశ్నలతో కాలయాపన చేసే అధికారులు ఏకంగా 72 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులివ్వటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇదీ సంగతి.. సర్వే నంబర్లు 198/అ, 199/అ 202లలో 99.90 ఎకరాల విస్తీర్ణంలో ఆత్మకూరు చెరువు ఉంది. సుమారు 30 ఏళ్ల క్రితం ఇది ఎండి పూడిపోవడంతో 10 ఎకరాల ను కుండలు తయూరు చేసుకునే సామాజికవర్గం వారు, మరో 18 ఎకరాల్లో దళితులు నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మిగిలిన 72 ఎకరాల్లో 100 మందికిపైగా రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 72 ఎకరాల్లోని మట్టిపై మాఫియా కన్ను పడింది. 2011లో ప్రారంభమైన విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు మట్టి అవసరం కావటంతో ప్రజా ప్రయోజనాల పేరిట ఓ కాంట్రాక్టర్ అనుమతులు సాధించారు. అయితే స్థానిక రైతులు ఒప్పుకోకపోవడంతో పనులు సాగలేదు. దీంతో ఎకరాకు ఇంత ధర అని నిర్ణయించి రైతులను ఒప్పించడంతోపాటు గ్రామ పంచాయతీ ప్రతినిధులు, అధికారులకు నజరానాలు ఇచ్చి అనుమతులు సాధించారు. జాతీయ రహదారి విస్తరణ పనులకు మట్టి అవసరం లేదని ఎన్‌హెచ్ అధికారులు చెప్పినా దందా కొనసాగిపోరుుంది. గత డిసెంబర్ నుంచి పెద్దఎత్తున మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నారుు. ప్రతి రోజూ సుమారు 200 లారీలు, ట్రాక్టర్లలో లెక్కలేనన్నిసార్లు మట్టిని తరలిస్తున్నారు. వాహనాల వారు ఒకే వేబిల్లుతో పలుమార్లు తిరుగుతున్నారు. తద్వారా అక్రమార్కులు రూ. కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం నామమాత్ర ఆదాయమే లభిస్తోంది. క్వారీ యూజమాన్యం నుంచి పెద్దమొత్తంలో మామూళ్లు అందుతుండటంతో అటు అధికారులు, ఇటు పాలకులు పట్టించుకోవటం లేదు. - జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ముందురోజే స్థానిక అధికారులు కాంట్రాక్టర్‌కు సమాచారమిస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు వచ్చిన రోజు మాత్రం నిబంధనల ప్రకారం తవ్వకాలు సాగిస్తున్నారు. - మంగళగిరి వద్ద జాతీయ రహదారికి అరకిలో మీటర్ దూరంలో ఎకరా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా క్వారీ యూజమాన్యానికి అప్పగించడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. - నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నేపథ్యంలో పలు జాతీయ సంస్థల ఏర్పాటుకు స్థలాల కోసం వెదుకుతున్న అధికారులకు ఇంత విలువైన భూమి కనిపించకపోవడం గమనార్హం. లీజు రద్దు చేయూలని నివేదించాం.. ఆత్మకూరు మట్టి క్వారీ అక్రమాలపై మైనింగ్ ఎ.డి. జగన్నాథరావును వివరణ కోరగా క్వారీ లీజును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందజేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు నిర్వహించినా, వే బిల్లులు సక్రమంగా జారీ చేయకపోయినా జరిమానా విధించడంతోపాటు లీజు రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. దీనిపై మంగళగిరి తహశీల్దార్ శివరామకృష్ణారావు వివరణ ఇస్తూ శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు భూములను పరిశీలించటమే తమ బాధ్యతని పేర్కొన్నారు. మిగిలిన అనుమతులు, పర్యవేక్షణ మైనింగ్ శాఖ ఆధీనంలోనే ఉంటాయన్నారు. క్వారీ అనుమతులు తీసుకున్నది జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం మాత్రమేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలను మైనింగ్ శాఖ అధికారులే అడ్డుకోవాల్సి ఉందన్నారు. -
వడివడిగా...విచ్చలవిడిగా..
ప్రభుత్వ భూములు, డ్రెయిన్ల ఆక్రమణ అక్రమార్కులకు అధికారుల అండదండలు మామూళ్ల కోసమే తనిఖీలు గుడివాడ, నందివాడ మండలాల్లో చెరువులవుతున్న పంటపొలాలు గుడివాడ : ఇటీవల కాలంలో నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో చేపల చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దాదాపు 300 పొక్లెయిన్లు, 250 బుల్డోజర్లు చెరువుల తవ్వకానికి వినియోగిస్తున్నారంటే ఏ స్థాయిలో చేపల చెరువులు తవ్వారో తెలుస్తుంది. పంటబోదెలు, డ్రెయిన్లు, ప్రభుత్వ భూములు ఈచెరువుల్లో కలిసి పోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు అనుమతి ఉందంటూ తవ్వేశారు.. కోర్టు అనుమతి ఉందంటూ నందివాడ మండలంలో వందలాది ఎకరాల భూమిని తవ్వేశారు. కొంతమంది కోర్టునుంచి అనుమతి తెచ్చుకొని వ్యవసాయభూమిని చేపల చెరువుగా మార్చుకుంటే, చుట్టుపక్కల భూ యజమానులు సైతం తమకు కోర్టు అనుమతి ఉందంటూ చెరువులు తవ్వుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయశాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రె యినేజీ, భూగర్భ జలాలశాఖ, కాలుష్య నియంత్రణశాఖలు చెరువుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపాక మత్స్యశాఖ వారికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపాలి. కానీ ఎవరి మామూళ్లు వారు తీసుకుని అనుమతులు అడ్డగోలుగా ఇచ్చేస్తున్నారు. ఇందులో రెవెన్యూశాఖది కీలక పాత్ర. చెరువులు అనుమతి వచ్చాక మండల సర్వేయర్ పెగ్ మార్కింగ్ ఇచ్చాక మాత్రమే తవ్వాలి. కాలువ గట్లు, డ్రెయినేజీలు, రోడ్లు, శ్మశాన వాటికలకు 10మీటర్లు దూరంగానే ఉండాలి. అలాగే దేవాలయ భూములు, అసైన్మెంటు భూముల్ని మినహాయించాలి. పంట బోదెలు, డ్రైన్లు పాడవకుండా తవ్వాలి. కానీ ఈనిబంధనలు ఎవరూ పాటించడం లేదు. తహశీల్దార్‌తో సహా అధికారులంతా రింగ్... నందివాడ మండలంలో చెరువుల అక్రమ తవ్వకాల్లో మండల తహశీల్దార్‌తో సహా అధికారులంతా రింగ్ అయ్యి అడ్డగోలు తవ్వకాలకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్ మాత్రం తనకేమీ తెలియదనే చెబుతూనే గతంలో ఇచ్చిన అనుమతులకు పాత తహశీల్దార్ మామూళ్లు తీసుకున్నాడు కాబట్టి మళ్లీ ఇవ్వాలని డిమాండు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో మండల సర్వేయర్, ఆర్ఐలు ఎవరి వాటా వారు వసూలు చేసుకుని ఇష్టారాజ్యంగా తవ్వేసుకునేందుకు సహకరిస్తున్నారని చెబుతున్నారు. నందివాడ మండల తహశీల్దార్‌ను అక్రమ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని మండల ఆర్ఐ, సర్వేయర్లు ఇక్కడ కీలకంగా ఉన్నారని చెప్పేస్తున్నారు. బాధ్యతగల అధికారి ఇలా మాట్లాడటమేమిటని మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డగోలు తవ్వకాలకు ఆనవాళ్లు ఇవిగో.. నందివాడ, తమిరిశ, తుమ్మలపల్లి గ్రామాల్లో గత మే నెల నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సుమారు రెండు వేల ఎకరాల వరకు చేపల చెరువులు తవ్వారు. నందివాడలో తవ్విన చెరువులు కారణంగా భూమికోడు, దోసాపడు కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 20 ఎకరాల వరకు దేవాదాయశాఖ భూమి చేపలచెరువుగా మారిపోయింది. తుమ్మలపల్లిలో ఏలూరుకు చెందిన ప్రముఖ చేపల వ్యాపారి 80 ఎకరాలు చెరువులో నడుంకోడు కాలువను పూర్తిగా చెరువులో కలిపేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదిగాక పంట కాలువ పోరంబోకు 15ఎకరాల వరకు ఆక్రమించాడు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన నేత 60 ఎకరాల చేపల చెరువును నిబంధనలకు విరుద్ధంగా తవ్వించారు. మేజర్ చానల్ అయిన రాసకోడు చాల వరకు చెరువుల యజమానులు అక్రమించారు. నందివాడ మండలానికి సాగు, తాగునీరు ఇచ్చే దోసపాడు చానల్‌కు చాల చోట్ల చెరువుల యజమానులు తూట్లు పొచించారు. చానల్‌కు అనుబంధంగా ఉన్న టీఆర్ఎస్ చానల్‌ను నందివాడ నుంచి తుమ్మలపల్లి వరకు పూర్తిగా అక్రమించారు. వెంకటరాఘవపురం వద్ద జగంకోడు చానల్‌ను సైతం పూర్తిగా కబ్జా చేశారు. దీనిపై ఆగ్రామానికి చెందిన నాయకుడు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. రామాపురంలో కొత్తగా 120 ఎకరాల చెరువు తవ్వకంలో ప్రభుత్వ నిబంధనలు పటించలేదు. గ్రామానికి వెళ్లే రోడ్డు సైతం కబ్జా చేశారు. చానల్ కరకట్టనే చేపల చెరువు కట్టగా మార్చుకున్నారు. గుడివాడ రూరల్ మండలంలోని మోటూరులో 80 ఎకరాల చెరువులో పంట బోదె తవ్వేశారు. ఈ చెరువుకు రోడ్డుకు ఆనుకుని గట్టువేశారు. గుంటాకోడూరులో కూడా ఇదేపరిస్థితి నెలకొంది. అడ్డగోలు తవ్వకాలపై ఆయా మండల తహశీల్దార్లను వివరణ కోరగా.. తవ్వేశాక లెసైన్సు ఇచ్చేటప్పుడు చూస్తామని చెబుతున్నారు. కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తామంటున్నారు. -
ఏడాదిలో లక్ష కోట్ల నల్లధనం!
దాడులు, తనిఖీల్లో గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ బయటపడిన అక్రమ స్థిర, చరాస్తుల విలువ రూ. 1,01,181 కోట్లు 5,327 మంది వ్యక్తులు, సంస్థలపై దాడులు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన తనిఖీలు, దాడుల్లో ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ బుధవారం వెల్లడించింది. ఇది గత ఏడాది కంటే రెండున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో వెల్లడించకుండా దాచిన ఆస్తుల్లో ఏకంగా రూ. 71,195 కోట్లు ఒకే కార్పొరేట్ గ్రూప్‌నకు చెందినవి కావడం విశేషం. ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అక్రమాస్తులున్నాయనే సమాచారం మేరకు వివిధ వ్యక్తులు, వారి సంస్థల మీద చేసిన దాడుల్లో రూ. 10,791 కోట్ల ‘వెల్లడించని ఆస్తుల’ను గుర్తించారు. ఇదే సమయంలో పలు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ. 90,390 కోట్ల ‘లెక్కల్లో చూపని ఆస్తుల’ను గుర్తించారు. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1,01,181 కోట్ల నల్లధనాన్ని గుర్తించారు. ఇది అంతకుముందటి 2012-13 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన రూ. 29,628 కోట్లకన్నా మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. గత ఏడాది గుర్తించిన లక్ష కోట్ల నల్లధనానికి తోడు రూ. 807 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా సీజ్ చేశారు. 5,327 మంది వ్యక్తులు, సంస్థలపై దాడులు చేసి.. 4,503 వారంట్లను జారీ చేశారు. కాగా మునుపటితో పోలిస్తే గత రెండేళ్లుగా ఆదాయపన్ను శాఖ ఎక్కువ దాడులు, తనిఖీలు నిర్వహించిందని... అక్రమార్కుల పట్ల మరింత అప్రమత్తంగా తమ శాఖ వ్యవహరిస్తోందనే దానికి ఇది సూచన అని ఐటీ శాఖ అధికారి ఒకరు చెప్పారు. తాము గుర్తించిన నల్లధనం వివరాలను సిట్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వంటి సంస్థలకు అందజేశామని తెలిపారు. -
విజిలెన్స్ నిల్.. అఫెన్స్ ఫుల్!
తనిఖీలు, పెట్రోలింగ్ మరచిన పోలీసులు రెచ్చిపోతున్న అసాంఘికశక్తులు సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు పెట్రోలింగ్, వాహన తనిఖీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. గతవారం రోజుల్లో నగరంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ . ఎన్నికలప్పుడు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదుతో పాటు మారణాయుధాలు పట్టుబడ్డాయి. ఎన్నికలు ముగిశాక.. ఇక గస్తీ, వాహన తనిఖీలు ఎందుకనుకున్నారో ఏమో.. పోలీసులు వాటిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రౌడీషీటర్లు, దొంగలు, స్నాచర్లు రాత్రి, పగలు అనే తేడాలేకుండా రెచ్చిపోతున్నారు. నగర కొత్త పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని చెప్తుండగా... కింది స్థాయిలో మాత్రం అది ఆచరణకు నోచుకోకపోవడంతో అసాంఘికశక్తులు విజృంభిస్తున్నాయి. గత వారం రోజుల్లో బేగంపేట, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, హుస్సేనీఆలంలో జరిగిన ఘటనలు పోలీసుల పని తీరును వెక్కిరిస్తున్నాయి. రాత్రి గస్తీలేకే.... ఈనెల 21వ తేదీ తెల్లవారుజాము 4.30కి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని అన్నానగర్‌లో పాలవ్యాపారి తిరుపతిరా వు (29)పై శ్రీనివాస్ (ఇతనిపై వివిధ ఠా ణాలలో 30కి పైగా కేసులున్నాయి) పథకం ప్రకారం కళ్లల్లో కారం చల్లి ఇనుపరాడ్‌తో మోది హత్య చేశాడు. రాత్రి పూట పోలీసుల గస్తీలేక పోవడం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గస్తీ ఉండి ఉంటే.. పోలీసులు ఘటనకు అరగంట ముందు నుంచే శ్రీనివాస్ పట్టుకొని తిరిగిన ఐరన్ రాడ్‌ను స్వాధీనం చేసుకొని ఉండేవారని, తిరుపతిరావు హ త్యకు గురై ఉండేవాడు కాదని స్థానికు లు అభిప్రాయపడుతున్నారు. నిందితుడు శ్రీ నివాస్ ఆగడాలు రోజు రోజుకూ అధికమవుతున్నాయని, పోలీసులు అతడిపై కఠి న చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కత్తులతో స్వైరవిహారం... చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలోని వాహెద్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ ఖాలేద్ (20)పై పాత కక్షల నేపథ్యంలో ఈనెల 20న అదే కాలనీకి చెందిన పాతనేరస్తులు ఖాలాహిమ్నా, వాసిఫ్, అమర్లాల్ కత్తులతో దాడి చేశారు. ఖాలేద్ కడుపు, చేయి, తొడ భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. పట్టపగలే చోరీ... సుల్తాన్‌బజార్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటకు దొంగలు తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి.. రూ.10 లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లారు. చార్మినార్ సాక్షిగా.... రక్షణ శాఖ శాస్త్రవేత్త ఆర్.సత్పత్తిపై చైన్‌స్నాచర్ కత్తితో దాడి చేశాడు. చార్మినార్ సాక్షిగా.. పోలీసు స్టేషన్ ఎదుటే ఆదివా రం మధ్యాహ్నం 12.30కి ఈ ఘటన జరిగింది. నగరంలో చైన్‌స్నాచర్ల స్వైరవిహారం నిత్యకృత్యంగా మారింది. అయి నా.. పోలీసులు మాత్రం స్నాచర్లను నియంత్రించలేకపోతున్నారు. నగరంలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఒకపక్క ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. మరోపక్క పోలీసులు తమ విధులను మరచిపోవడం గమనార్హం. ఇప్పటికైనా గస్తీని పెంచి అసాంఘికశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రజలు కోరుతు న్నారు. -
రూ. 25లక్షల విలువైన విత్తనాలు సీజ్
ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ దాడులు నరసరావుపేట టౌన్: నరసరావుపేట పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. స్టేషన్‌రోడ్డులోని వెంకటేశ్వర సీడ్స్ దుకాణంలో విజిలెన్స్ సీఐ వంశీధర్, డీఈ సుందరబాబు, హెడ్‌కానిస్టేబుల్ రాంబాబులు తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాలకు రూ.35 లక్షల మేర సీడ్స్ విక్రయించినట్లు నిర్థారించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎరువులు, విత్తనాలు దుకాణాల్లో నిల్వలు, ఇతర జిల్లాలకు విక్రయాలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలతో పాటు విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారనేది ఆరా తీస్తున్నామని చెప్పారు. వెంకటేశ్వర సీడ్స్‌దుకాణంలో అక్రమంగా ఇతర జిల్లాలకు సీడ్స్ ఎగుమతి చేసినట్లు రికార్డుల ప్రకారం తేలడంతో ఆ షాపు యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు దుకాణంలో క్రయవిక్రయాలు నిలుపుదల చేయాలని ఆదేశించామన్నారు. షాపులో ఉన్న విత్తనాలకు, రిజిస్టర్లో పొందుపరిచిన లెక్కలకు వ్యత్యాసం ఉండడంతో అక్కడున్న రూ. 25లక్షల పైచిలుకు విలువగల విత్తనాలను సీజ్ చేశామన్నారు. రూ.5 లక్షల విలువైన పత్తి విత్తనాలు సీజ్.. మాడుగుల (గుర జాల): విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాలమేరకు మాడుగుల గ్రామంలో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. మండలంలోని మాడుగుల గ్రామంలో పురుగు మందులు విక్రయిస్తున్న వెంకటలక్ష్మీ ట్రేడర్స్, లక్ష్మీ ట్రేడర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా ఈ షాపుల్లో పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు షాపుల్లో రూ. 5 లక్షల విలువైన 540 ప్యాకెట్ల పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఏవో వెంకట్రావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనే సమయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు సూచించారు. గ్రామంలో విజిలెన్సు అధికారుల రాకను పసిగట్టిన యజమానులు తమ షాపులను మూసివేశారు. గురజాల మండల వ్యవసాయాధికారి అంజిరెడ్డికి మూసివేసిన షాపులను అదివారం, సోమవారం విచారించాల్సిందిగా సూచించారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ షేక్ కాశీంసాహెబ్, విజిలెన్స్ ఫారెస్టు అధికారి శ్రీరాములు, గురజాల వ్యవసాయాధికారి బి.అంజిరెడ్డి, గ్రామరెవెన్యూ అధికారి పద్మ, విజిలెన్స్ కానిస్టేబుళ్లు రమేష్, నాగరాజు పాల్గొన్నారు. 300 బస్తాల వరి విత్తనాలు స్వాధీనం రెంటాల (రెంటచింతల): రెంటాల గ్రామంలోని ఓ నివాసంలో అక్రమంగా నిల్వచే సిన 300 బస్తాల వరి విత్తనాలను శనివారం రాత్రి మండల వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పూజల చిన్ననాగేశ్వరావు నివాసంలో లెసైన్స్ లేకుండా నంద్యాలకు చెందిన నీలకంటేశ్వర సీడ్స్ కంపెనీ బీపీటీ వరి విత్తనాల బస్తాలను నిల్వ చేసి బిల్లు లేకుండా విక్రయిస్తున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు జేడీఏ వి.శ్రీధర్ ఆదేశాల మేరకు ఏవో నరసింహారావు, ఏఈవో తారాసింగ్లు దాడిచేసి విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు. వీటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందన్నారు. విత్తన బస్తాలను రెంటచింతల మార్కెట్ యార్డ్‌కు తరలిస్తున్నట్లు ఏవో తెలిపారు. దాడిలో ఇన్చార్జి ఆర్ఐ కటికల బాలయ్య, మార్కెట్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్ ఆస్పత్రిలో అధికారుల తనిఖీలు
- ‘ఇన్ఫెక్షన్ బారిన బాలింతలు’ ఘటనపై విచారణ - ఆపరేషన్ థియేటర్లో శాంపిల్స్ సేకరణ - పలు వార్డుల్లో తనిఖీలు - పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్ గజ్వేల్: గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం పలువురు అధికారులు తనిఖీ చేశారు. పారిశుద్ధ్య లోపంతో పలువురు బాలింతలు అస్వస్థతకు గురికాగా, సాక్షి శనివారం సంచికలో ‘ఇన్ఫెక్షన్ బారిన బాలింతలు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందిం చిన డీసీహెచ్ఎస్ (డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్) డాక్టర్ కిరణ్ శనివారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. బాలింతల అస్వస్థతకు గల కారణాలపై విచారణ జరిపారు. అనంతరం ఆపరేషన్ థియేటర్లో పలు శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. బాలింతలు అస్వస్థతకు గురయ్యేందుకు గల కారణాలను తెలుసుకునేంత వరకూ ఆపరేషన్ థియేటర్‌ను బంద్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్యలోపం తీరును పరిశీలించారు. ఆస్పత్రిని సందర్శించిన ఆర్డీఓ గజ్వేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో శనివారం సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి సైతం ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారిణి పద్మ తదితర అధికారులు సైతం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రి శానిటేషన్ కాంట్రాక్టర్ సస్పెన్షన్ సంగారెడ్డి అర్బన్: గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వర్తించని శానిటేషన్ కంట్రాక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డా.ఎ.శరత్ ఒక ప్రకటనలో తె లిపారు. గజ్వేల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపంతో పలువురు బాలింతల ఆస్వస్థతపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి ఆయన తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించాలని గజ్వేల్మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న బాలింతల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, పూర్తిస్థాయిలో మందులను అందిస్తున్నట్టు చెప్పారు. -
మిల్లర్లతో మిలాఖత్?
తనిఖీలు చాలు.. వచ్చేయండి! అధికారులకు బాస్‌ల ఫోన్? రైస్‌మిల్లుల్లో ఆగిన తనిఖీలు మధ్యలోనే వెళ్లిపోయిన వైనం ఇక నోటీసులిచ్చి ఏం ప్రయోజనం? జమ్మికుంట :ధాన్యం రైతులకు మద్దతు ధర చెల్లించని మిల్లర్లకు నోటీసులిచ్చి.. తనిఖీలు మొదలుపెట్టిన విజిలెన్స్ అధికారులకు ఏమైందో ఏమో గానీ... కాసేపటికే ఆపేశారు. అధికారుల నోటీసులతో తమకు మద్దతు ధర దక్కుతుందని ఆశించిన రైతన్నలకు దీంతో నిరాశే మిగిలింది. ఉన్నతాధికారుల ఫోన్‌తో అధికారులు ఆగమేఘాలమీద వెనుదిరగగా నోటీసులు ఇక చెత్తబుట్టలకే పరిమితం కానున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మిల్లర్లు కూడా కొనుగోలు చేశారు. మద్దతు ధర గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,345 ఉండగా వ్యాపారులు రూ.1,150 నుంచి రూ.1,200 దాకా, మగ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,310 ఉండగా మిల్లర్లు రూ.850 నుంచి రూ.950 మాత్రమే చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో సివిల్ సప్లయ్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టగా... తమకు మద్దతు ధర దక్కడం లేదని చాలా మంది రైతులు వెల్లడించారు. రైతులు చెప్పిన వివరాల మేరకు రూపొందించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు జమ్మికుంటలోని ఏడు మిల్లులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా విజిలెన్స్ అధికారులు మూడు మిల్లుల్లో సోదాలు మొదలుపెట్టారు. ఒక్కో మిల్లులో వేలాది క్వింటాళ్ల నిల్వలుండగా తనిఖీ చేసేందుకు ఒక రోజు సమయం పట్టే అవకాశముంది. కానీ, అధికారులు కేవలం రెండు గంటల్లోనే మూడు మిల్లులు తనిఖీ చేసి అర్ధంతరంగా వెనుదిరిగారు. తనిఖీలు మొదలుపెట్టగానే మిల్లుల్లో ఉన్న అక్రమ నిల్వలు, నేరుగా కొనుగోళ్లు చేపట్టిన వివరాలు, రికార్డుల్లోకి ఎక్కని ధాన్యం, రైతుల వద్ద తక్కువ ధరతో సేకరించిన ధాన్యం గుట్టు బయటపడుతుందనే భయంతో కొందరు వ్యాపారులు ఓ ముఖ్యనాయకుడితో తనిఖీలు ఆపేలా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సదరు నాయకుడినుంచి ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లగా.. మిల్లుల్లో అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు తయారు చేయాలని వారు తనిఖీ అధికారులకు ఫోన్లోనే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం మూడు మిల్లుల్లోనే రెండు గంటల్లో తనిఖీలు చేపట్టి వెనుదిరిగారనే ప్రచారం జరుగుతోంది. అధికారుల తనిఖీలతో తమకు మద్దతు ధర చెల్లిస్తారని ఆశించిన రైతులు తీవ్ర నిరాశ చెందారు. అసలు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మిల్లర్లకు నోటీసులు ఎందుకు జారీ చేశారు? వీటి వెనుక మర్మమేమిటి? తనిఖీలు లేకుండా అక్రమ నిల్వలను ఎలా గుర్తిస్తారు? తనిఖీలు అర్ధంతరంగా నిలిపేసి ఎందుకు వెనుదిరిగినట్లు? అనేది అంతుచిక్కడం లేదు. -
ఉల్లం‘ఘనం’
వారంలో 120 ఫిట్‌లెస్ స్కూల్ బస్సుల స్వాధీనం లెసైన్స్‌లు లేని డ్రైవర్ల చేతికి వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్కూల్ బస్సులు ఠారెత్తిస్తున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండానే వందల కొద్దీ బస్సులు రోడ్డెక్కేస్తున్నాయి. వారం రోజులుగా ఆర్టీఏ జరిపిన విస్తృత తనిఖీల్లో మొత్తం 150 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. వాటిలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 120 బస్సులను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం స్పెషల్ డ్రైవ్ పేరుతో స్కూల్ బస్సులకు తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేసే ఆర్టీఏ అధికారులు ఈ ఏడాది ఆ కర్తవ్యాన్ని విస్మరించారు.స్వచ్ఛందంగా వచ్చిన బస్సులకు మాత్రమే తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో విద్యాసంస్థల యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఫిట్నెస్ లేని బస్సులను సైతం పిల్లలను చేరేవేసేందుకు రోడ్డు మీదకు ఎక్కించాయి. దీనిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఆర్టీఏ రంగంలోకి దిగింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్లు ఇందుకోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ వారంలో నిర్వహించిన దాడుల్లో మొత్తం 150 బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. విండో గ్లాసెస్ లేకపోవడం, రంగు వెలసి పోవడం వంటి చిన్న చిన్న తప్పిదాలకు పాల్పడిన బస్సులపై కొద్ది మొత్తంలో జరిమానా విధించి వదిలివేయగా, తీవ్రమైన తప్పిదాలతో దొరికిన 120 బస్సులను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు నీళ్లు బడి పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన పాఠశాలలు తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్నాయి. ఏడాది పాటు ప్రేక్షకపాత్రకే పరిమితమై జూన్ ప్రారంభంతో ఆగమేఘాల మీద తనిఖీలకు దిగిన ఆర్టీఏ అధికారుల తీరు కూడా ఈ నిర్లక్ష్యానికి ఆజ్యంపోస్తోంది. ఫలితంగా మోటారు వాహన చట్టాలకు ఈ బస్సులు పాతరేస్తున్నాయి. పట్టుబడిన వాటిలో ఉల్లంఘనలివీ.. ఫిట్‌లెస్ వాహనాల్లోనే పిల్లలను ఎక్కించుకొని వెళ్తున్నారు. సీట్ల సామర్ధ్యానికి మించి ఒక్కో బస్సులో 10 నుంచి 20 మంది పిల్లలకు ఎక్కువగా ఎక్కిస్తున్నారు. ఈ పిల్లలంతా సీట్లలో కూర్చొనేందుకు అవకాశం లేక నించొని పయనించవలసి రావడం దారుణం. మరో దిగ్భ్రాంతికరమైన అంశం పలువురు డ్రైవర్లు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా దొరికిపోవడం. సాధారణంగా అనుభవజ్ఞులైన డ్రైవర్లు, హెవీ డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన వాళ్లు మాత్రమే పిల్లల బస్సులు నడపాలని చట్టం చెబుతుంది. అందుకు విరుద్దంగా తేలికపాటి వాహనాలను నడిపేందుకు మాత్రమే అనుమతి ఉన్న డ్రైవర్లు, కొత్తగా నేర్చుకున్నవాళ్లు ఈ బస్సులు నడపడం గమనార్హం. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రతి బస్సులో పిల్లలను ఎక్కించేందుకు దించేందుకు అటెండర్ ఉండాలి. కానీ చాలా బస్సులు అలాంటి అటెండర్లు లేకుండానే నడుస్తున్నాయి. అనేక బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు లేవు -
బిల్లు చూసి ‘షాక్’య్యారు
డిచ్పల్లి : డిచ్పల్లి మండల కేంద్రంలోని పలు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ వర్క్‌షాపులకు సంబంధించి ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే వేలల్లో బిల్లులు వేశారని వర్క్‌షాపుల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తమకు ట్రాన్స్‌కో అధికారులు పంపించిన నోటీసులు, బిల్లులను వారు విలేకరుల చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెలా 1500 లోపు మాత్రమే విద్యుత్ బిల్లులు వచ్చేవని, అధిక లోడు వినియోగం పేరిట ట్రాన్స్‌కో అధికారులు 20 వేల నుంచి 70 వేల వరకు బిల్లులు కట్టాలని నోటీసులు పంపించారని వాపోయారు. తమ వర్క్‌షాపులను తనిఖీ చేయకుండానే అధిక బిల్లులు పంపించడం దారుణమని విమర్శించారు. రోజుకు *300 నుంచి *500 సంపాదన కలిగిన తాము వేల రూపాయలల్లో బిల్లులను ఎలా కట్టాలని వాపోయారు. ఇలా అయితే తాము వర్క్‌షాపులను మూసుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. షాపులో ఒక లేత్ మిషన్ మాత్రమే ఉంటే మూడు ఉన్నాయని, ఒక కటింగ్ మిషన్ ఉంటే నాలుగు ఉన్నాయని తప్పుడు నివేదికలు రాసి నోటీసులు పంపించం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అలాగే 7 హెచ్‌పీ కరెంట్ అనుమతి ఉండగా, 41.98 హెచ్‌పీ వాడుకుంటున్నామంటూ తప్పుడు నోటీసులు పంపించారని ఆరోపించారు. అసలు 41 హెచ్‌పీ కరెంట్ వాడుకుంటే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోదనే విషయం అధికారులకు తెలియదా అంటూ ప్రశ్నించారు. 2012 డిసెంబర్, 2013 జనవరి నెలలకు సంబంధించిన నోటీసులు ఇప్పుడు పంపించారని భాధితులు వాపోయారు. ఈ విషయమై ట్రాన్స్‌కో అధికారులకు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు ట్రాన్స్‌కో అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. విలేకరులతో మాట్లాడిన వారిలో బాధితులు మహబూబ్, నయీం, అర్షద్, కుర్షీద్, అన్వర్, సురేశ్ తదితరులు ఉన్నారు. -
ఐ సెట్‌కు 91.7 శాతం హాజరు
- గుంటూరులో 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ - 6,895 మంది విద్యార్థులు హాజరు - పరీక్షా కేంద్రాలను సందర్శించిన ప్రొఫెసర్లు గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2014’కు జిల్లాలో 91.7 శాతం హాజరు నమోదయింది. శుక్రవారం గుంటూరు నగరంలోని 15 పరీక్షా కేంద్రాల పరిధిలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 7,519 మంది విద్యార్థులకు గానూ 6,895 మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు ముందుగానే ప్రకటించిన దృష్ట్యా విద్యార్థులు సకాలంలోనే చేరుకున్నారు. కాకతీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్‌కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆచార్యుడు జి.వి.చలం గుంటూరు ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఉప కులపతి ఆచార్య కె.వియ్యన్నారావు, రెక్టార్ వై.పి.రామసుబ్బయ్య గోరంట్ల సెయింట్ ఆన్స్ కళాశాల, లాం చలపతి ఫార్మశీ కళాశాల సహా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. ఎస్వీ, ఆంధ్ర, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి జిల్లాకు ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన ప్రొఫెసర్లు ఎం.సురేష్‌బాబు, జాలాది రవి, ఎ.శ్రీనివాసరావు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. -
ఏరులై పారిన మద్యం
ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 182 నగదు అక్రమ తరలింపు కేసులు నమోదు కాగా రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.46 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం పంపిణీ కేసులు ఎక్కువగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే నమోదు కావడం విశేషం. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో సుమారు రూ.15 లక్షల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 26న తాడేపల్లిగూడెంలో టీడీపీ నాయకుడు కేవీ సుబ్రమణ్యం నుంచి రూ.లక్షా 25 వేలు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 29న నరసాపురం టౌన్లో టీడీపీ నాయకుడు ఆకుల రమేష్ నుంచి రూ.లక్షా 11 వేలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 30న నరసాపురం టౌన్లో టీడీపీ నాయకుడు కె.ఆదినారాయణ నుంచి రూ.2 లక్షల 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 5న చింతలపూడి మండలం రాఘవపురంలో టీడీపీ నాయకుడు మోరంపూడి వెంకటేశ్వరరావు నుంచి రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 10న నరసాపురంలో టీడీపీ నాయకుడు ఎ.సత్యనారాయణ నుంచి రూ.2 లక్షల 15 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం నాయుడుగూడెంలో ఏప్రిల్ 12న టీడీపీ నాయకుడు టి.విజయ్ వద్ద నుంచి పోలీసులు రూ.13 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 7న నరసాపురంలో టీడీపీ నాయకుడు కోనకంటి సత్యనారాయణ నుంచి పోలీసులు రూ.లక్షా 66 వేలను స్వాధీనం చేసుకున్నారు. -
ఖాకీల హల్చల్
- అనంతసాగర్‌లోని పలువురి ఇళ్లలో తనిఖీలు - ఆందోళనలో గ్రామస్తులు - పోలీసుల తీరుపై ఆగ్రహం కొండాపూర్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని అనంతసాగర్‌లో పోలీసులు హల్చల్ చేశారు. బుధవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 30 మంది పోలీసులు ఒక్కసారిగా గ్రామంలో హడావుడి చేశారు. పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. దీంతో స్థానికులంతా భయాందోళనలు చెందారు. ఇప్పటికే సీఐడీ పోలీసుల మం టూ పలువురు గ్రామంలోని తనిఖీలు చేపట్టడం... తాజాగా పోలీసులు కూడా వారిలాగే తనిఖీలు చేపట్టడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఎందుకు తనిఖీలు చేపడుతున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడంతో వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజుకొకరు వచ్చి గ్రామంలోని పలు ఇళ్లను తవ్వేస్తుంటే ఏం చేయాలో...ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు. వారంరోజులుగా తనిఖీల పరంపర ఈ నెల 1వ తేదీన 25 మంది వ్యక్తులు పోలీసు యూనిఫాం, సివిల్ దుస్తులు ధరించి స్కార్పియో వాహనాల్లో గ్రామానికి వచ్చారు. తాము సిఐడీ పోలీసులమని గ్రామస్థులకు చెప్పారు. ఓ కేసు విషయంలో విచారణ జరుపుతున్నామంటూ గ్రామానికి చెందిన సోమేశ్వర్ పాడుపడ్డ ఇంటి తలుపులు బద్దలుకొట్టి ఆ ఇంట్లోని దేవుడిగదిలో తవ్వకాలు జరిపారు. తిరిగి మంగళవారం రాత్రి రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన పలువురు వ్యక్తులు తాము సీఐడీ పోలీసులమంటూ మళ్లీ సోమేశ్వర్ ఇంటికే వచ్చారు. ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు సిద్ధంకాగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అనంతసాగర్ చేరుకున్న ఎస్ఐ చంద్రయ్య ఆరుగురిని అరెస్టు చేయగా, మరికొందరు పరారయ్యారు. తన అదుపులో ఉన్న వారికి స్టేషన్‌కు తరలించిన ఎస్ఐ విచారణ చేపట్టారు. ఇదిలాఉండగా, బుధవారం ఉదయం డీఎస్పీతో పాటు మరికొంత మంది పోలీసులు తహశీల్దారు గీత, గ్రామంలోని మటం మల్లేశం, అశోక్, ఇంద్రారెడ్డి, సోమేశ్వర్‌ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఎందుకు తనిఖీలు చేస్తున్నారో కూడా చెప్పకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఓ దశలో పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు ఇలా ఎవరో ఒకరు వచ్చి తనిఖీలంటూ తమను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు వెంటనే ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తహశీల్దారు ఎదుట బైండోవర్ తమ అదుపులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన హరిబాబు, విజయ్‌కుమార్, కోల్కుంద నరేశ్, వినయ్మీర్ బాబు, గడ్డపల్లి శేఖర్, రాజ్‌కుమార్ నాయక్‌లను విచారించి బైండోవర్ చేసినట్లు ఎస్ఐ చంద్రయ్య తెలిపారు. కూలీ పనులు చేసుకోడానికి తాము గ్రామానికి వచ్చినట్లు విచారణలో వారు చెప్పారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రైల్వే స్టేషన్లలో భద్రత డొల్ల
అనుమానాస్పద వ్యక్తులకు రాచమార్గాలు చెన్నై ఘటనతో కదిలిన యంత్రాంగం.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో తనిఖీలు సాక్షి,సిటీబ్యూరో/నాంపల్లి, న్యూస్‌లైన్: సరిగ్గా ఏడు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఓ సైకో కత్తితో అమ్మాయి గొంతు కోసి ప్రాణం తీశాడు. అంతుకుముందు ఇదే స్టేషన్లో మందమర్రికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రైలు నుంచి కాలు జారి కింద పడిపోయాడు. 45 నిమిషాలకు పైగా రక్తస్రావమైనా ఒక్క పోలీసూ అటువైపు తొంగి చూడలేదు. ఒక్క సికింద్రాబాద్‌లోనే కాదు.. కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలోనూ తరచుగా చోరీలు, పోకిరీల వేధింపులు వంటివి జరుగుతునే ఉన్నాయి. ఓ పిచ్చివాడు కత్తి పట్టుకొని స్టేషన్ లోపలికి ప్రవేశించి ఓ చిన్నారిని బలి తీసుకున్నాక పది రోజులు మాత్రం యంత్రాంగం భద్రతను పెంచింది. తాజాగా చెన్నై సెంట్రల్ స్టేషన్లో జరిగిన బాంబు పేలుళ్లతో గురువారం ఇక్కడి అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. తర్వాత షరా మామూలే అన్నట్టు రైల్వే అధికారులు వ్యవహరిస్తారు. నగరంలోని మూడు రైల్వేస్టేషన్లలో భద్రత డొల్లతనాన్ని చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. సికింద్రాబాద్ స్టేషన్‌లోని ప్రయాణికుల కౌంటర్ల వద్ద ఒక ద్వారానికి మెటల్ డిటెక్టర్ ఉంది. కానీ అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు. ప్రయాణికులు మెటల్ డిటెక్టర్ లేని మరో ద్వారం నుంచే రాకపోకలు సాగిస్తారు. రేతిఫైల్ బస్టేషన్ వైపు ఉన్న మరో ద్వారం నుంచి యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తారు. రైల్వే ఎస్పీ కార్యాలయం వద్ద కూడా ఎలాంటి తనిఖీలు లేకుండా ఎవరన్నా లోపలికి వెళ్లవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్లో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే భద్రత చర్యలు చేపడతారు. స్టేషన్ లోనికి ప్రవేశించడానికి అనేక అడ్డదారులు ఉన్నాయి. పబ్లిక్‌గార్డెన్ అడ్డాపై ఉండే పోకిరీలు నాంపల్లి రైల్వే స్టేషన్ యార్డులోకి వచ్చి స్నానాలు చేస్తుంటారు. యార్డులో ఉంచిన కోచ్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేవారు ఉండరు. ఈ స్టేషన్‌లోనికి ప్రధాన ద్వారాల నుంచి సైతం ప్లాట్ఫారం టికెట్టు కూడా లేకుండా వచ్చి వెళ్తారు. వేసవి కావడంతో చాలామంది ప్లాట్ఫారాలపైనే నిద్రపోతున్నారు. స్టేషన్లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగానే ఉన్నాయి. బోగీల్లోకి ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ నాంపల్లి రైల్వే పోలీసుల పర్యవేక్షణ లేమితో ఇతరులు లోనికి వచ్చి పోతుంటారు. రైల్వే క్వార్టర్స్ నుంచి స్టేషన్‌లోనికి మరో దారి ఉంది. ఈ దారి నుంచి బయట వ్యక్తులు రాకపోకలు సాగిస్తారు. మజ్దూర్ యూనియన్ కార్యాలయం నుంచి ఒకటి, జీఆర్పీ కార్యాలయం నుంచి మరొకటి అడ్డదారులు ఉన్నాయి. పబ్లిక్‌గార్డెన్స్ ఫుట్ఓవర్ బ్రిడ్జి నుంచి ఉన్న పిట్టగోడ దూకి చాలా మంది స్టేషన్‌లోనికి వస్తుంటారు. రిజర్వేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్శిల్ కార్యాలయం నుంచి, ఎంఎంటీఎస్ టికెట్ కౌంటర్ పక్కన ఉన్న దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏటీఎం సెంటర్ పక్కన ఉన్న చిన్న పాటి సందు నుంచి లోనికి వెళ్లేందుకు మార్గం ఉంది. -
మలి పోరుకు రె‘ఢీ’
సాక్షి, ఏలూరు : జిల్లా పరిషత్, మండల పరి షత్ ఎన్నికల మలిపోరు శుక్రవారం జరగనుంది. 24 జెడ్పీటీసీ, 452 ఎంపీటీసీ స్థానాల్లో ఓటరు తీర్పు కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. తొలి విడత పోలింగ్‌లో ఎదురైన అవాం ఛనీయ ఘటనలు ఈసారి తలెత్తకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నరసాపురం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 24 మండలాల్లో శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. జెడ్పీటీసీ అభ్యర్థులు 87మంది, ఎంపీటీసీ అభ్యర్థులు 1,180 మం ది పోటీపడుతున్నారు. 11,67,231మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగిం చుకోవాల్సి ఉంది .686 ప్రాంతాల్లో 1,434 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 9వేల 414 మంది సిబ్బంది గురువారం ఆయా ప్రాంతాలకు వెళ్లారు. బ్యాలెట్ పేపర్లు, ఇంక్ బాటిళ్లు, స్వస్తిక్ గుర్తులు, ఇతర పరికరాలు వెంటబెట్టుకెళ్లారు. 451 సమస్యాత్మక, 315 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 2,275 మంది పోలీసులతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్రమాలను అరికట్టేందుకు రహస్య నిఘా ఈ ఎన్నికల్లో నగదు, మద్యం, ఇతర ప్రలోభాలను నిరోధించేందుకు రహస్యంగా నిఘా వేసే బృందాలను కలెక్టర్ సిద్ధార్థజైన్ రంగంలోకి దించారు. నిఘా బృందాల సభ్యులు సాధారణ జనంలా.. అవసరమైతే మారువేషాల్లో వెళ్లి అక్రమార్కుల భరతం పట్టాలని కలెక్టర్ సూచించారు. తమ వాహనాలను దూరంగా ఉంచి తనిఖీలు చేయాలని చెప్పారు. తొలి విడతలో జరిగిన లోటుపాట్లు దృష్టిలో ఉంచుకుని అలాంటివి మలి విడత పోలింగ్ ప్రక్రియలో చోటుచేసుకోకుండా చూడాలని పోలింగ్ యంత్రాంగానికి ఆయన సూచించారు. పూర్తయిన పంపకాలు : అధికారుల తనిఖీలు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ముందుగానే మేల్కొన్నారు. డబ్బు, మద్యం పంపిణీని పోలింగ్ ముందు రోజు రాత్రి ముమ్మరంగా చేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సహించమని అధికారులు హెచ్చరికలు జారీచేయడంతో పాటు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో రెండు రోజులు ముందునుంచే పంపకాలు ప్రారంభించారు. గురువారం ఉదయానికే చాలా చోట్ల పూర్తి చేశారు. -
బాబోయ్ ఇవేం తనిఖీలు
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: పోలీసుల అవగాహన లోపం సామాన్యులకు శాపంగా మారింది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో చిరువ్యాపారుల నుంచి మధ్య తరగతి ప్రజల వరకు.. కనీసం లక్ష రూపాయల లోపు డబ్బును తమ అవసరాల కోసం తీసుకెళ్లలేకపోతున్నారు. వివిధ వ్యాపారాల నిమిత్తం డబ్బులు తీసుకెళ్లడం సర్వసాధారణం. కానీ పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం వల్ల వీరంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం 50వేల రూపాయలలోపు డబ్బును ఎవరు తీసుకెళ్లినా పట్టుకునేందుకు వీలు లేదు. రూ.2.50లక్షల వరకు ఎవరైనా డబ్బును తీసుకెళుతుంటే, అందుకు ఆధారాలు చూపడితే వదిలివేయాలి. సీజ్ చేయకూడదు. రూ.2.50లక్షల కంటే ఎక్కువ డబ్బు రవాణా అయితేనే సీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ పత్రికాముఖంగా వెల్లడించారు. కానీ జిల్లాలో ఏర్పాటు చేసిన ఏ చెక్‌పోస్టు వద్ద కూడా ఈ విధంగా జరగడం లేదు. కనీసం రూ. 50 వేలు తీసుకెళుతున్నా వెంటనేసీజ్ చేస్తున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా మొత్తం 26 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జహీరాబాద్, నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, పటాన్చెరు, రామచంద్రపురం, మెదక్, సిద్దిపేట, అందోల్, చేగుంట, రామాయంపేట, గజ్వేల్, ఒంటిమామిడి తదితర ప్రాంతాల్లో ఈ చెక్‌పోస్టులు ఉన్నాయి. అయితే ఈ చెక్‌పోస్టుల వద్ద అవగాహన కలిగిన పోలీసు అధికారులెవ్వరూ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎఎస్ఐ స్థాయి కంటే కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఈ చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాల్లో డబ్బు కనిపించిన వెంటనే ఎంత డబ్బు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆరా తీయకుండానే సీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో వినియోగించే డబ్బు అక్రమ మార్గం ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నప్పటికీ వ్యాపార నిమిత్తం తీసుకెళ్తున్న చిరు వ్యాపారులు, ఇతరులు మాత్రం ఇబ్బంది పడాల్సివస్తోంది. దీంతో వ్యాపార కొనుగోళ్ల కోసం కనీసం రూ.50వేలు వెంట తీసుకెళ్లాలన్నా జంకుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న డబ్బును తిరిగి తీసుకోవడానికి సామాన్యులకు సవాలక్ష నిబంధనలు ఎదురవుతున్నాయి. దీంతో తమ కష్టార్జితమైన డబ్బును తిరిగి సొంతం చేసుకునేందుకు వ్యాపారులు, సామాన్యులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. -
రూ.5.80 లక్షల స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సోమవారం నెల్లూరు, సూళ్లూరుపేట, కోట, మనుబోలు ప్రాంతాల్లో రూ.5.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కేసవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.3.54 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విద్యానగర్‌కు చెందిన ఆక్వా రైతు రాజేంద్రన్ గూడూరుకు కారులో రూ.1.60 లక్షలు తీసుకెళుతున్నాడు. తనిఖీ చేసిన పోలీసులు ఆ నగదుకు సంబంధించిన ధ్రువపత్రాలు లేవని నిర్ధారించి స్వాధీనం చేసుకున్నారు. కోటకు చెందిన శేఖర్ మోటార్‌ై బెక్లో రూ.66 వేలు తీసుకెళుతుండగా పోలీసులు గుర్తించి ప్రశ్నించారు. అయితే తాను కొత్తగా మోటార్‌బైక్ కొనుగోలుకు వెళుతున్నట్లు తెలిపాడు. ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. గూడూరుకు వెళుతున్న ఆటోలో డక్కిలి మండలం ఆల్తూరుపాడుకు చెందిన వ్యాపారవేత్త కనుపర్తి చంద్రశేఖర్ రూ.1.28 లక్షలు తీసుకెళుతున్నాడు. నగదుకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.85 వేలు స్వాధీనం మనుబోలు : మండలం పరిధిలోని జాతీయ రహదారిపై వీరంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి ఓ బొలేరో వాహనం నుంచి రూ.85 వేలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి గూడూరు వెళుతున్న మీనాక్షి పవర్ ప్లాంట్‌కు చెందిన బొలేరో వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో ఓ వ్యక్తి వద్ద రూ.85 వేల తీసుకెళుతుండగా విచారించారు. సదరు వ్యక్తి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శివకుమార్‌కు అప్పగించారు. రూ.90 వేలు నగదు స్వాధీనం నెల్లూరు (నవాబుపేట) : అల్లీపురానికి చెందిన దొడ్ల తిరుపాలరెడ్డి సోమవారం స్కూటీలో రూ.90 వేలు నగదును తీసుకుని వెళుతున్నాడు. చింతారెడ్డిపాళెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో పోలీసులు తనిఖీలు చేశారు. స్కూటీలో ఉన్న రూ.90 వేలు నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎటువంటి ధ్రువ పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. గరుడ బస్సులో రూ.50,900 పట్టివేత సూళ్లూరుపేట : చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ గరుడ బస్సులో గేదెల బాబూరావు అనే వ్యక్తి నుంచి సోమవారం రాత్రి రూ. 50,900 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై గంగాధర్ తెలిపారు. హోలీక్రాస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టులో తనిఖీలు చేస్తుండగా బాబూరావు వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బాబూరావు వ్యాపార లావాదేవీల్లో నగదు తీసుకెళుతున్నట్టు చెప్పినా తగిన ఆధారాలు లేవని ఎస్సై తెలిపారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.7.77 లక్షలు స్వాధీనం
మద్వానిగూడెం (కలిదిండి), న్యూస్‌లైన్ :ఎన్నికల సందర్భంగా మద్వానిగూడెంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.7,77,600 నగదును పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి సురేష్‌కుమార్, ఎన్నికల జమాఖర్చుల అధికారి రామాంజనేయాచార్యులు కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా జున్నూరు గ్రామానికి చెందిన పి.నరసింహారావు, కె.సూర్యనారాయణరాజు కలిదిండి మండలం పడమటిపాలెం నుంచి మోటారుసైకిల్‌పై వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, రోశయ్య తనిఖీచేసి, వారి వద్ద రూ.7,77,600 నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని సురేష్‌కుమార్, రామాంజనేయాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీమ్‌లీడర్ రామ్మోహనరావు, ఏఎస్ఐలు గుమ్మడి శ్రీనివాసరావు, కృష్ణారావు పాల్గొన్నారు. ఈనెల 13వ తేదీన ఈ చెక్‌పోస్టు వద్ద ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.12.82 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. -
తనిఖీల్లో రూ 9.50 లక్షలు స్వాధీనం
జొన్నాడ (ఆలమూరు), న్యూస్‌లైన్ : జిల్లాలోని వివిధ చెక్‌పోస్టుల వద్ద అధికారులు శనివారం తనిఖీలు చేపట్టి కారుల్లో తరలిస్తున్న రూ. 9,51,500 లను స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు మండలం జొన్నాడలోని చెక్‌పోస్టు వద్ద రూ. మూడులక్షలను సీజ్ చేశారు. ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొరుప్రోలు వెంకటేశ్వరరావు త న కారులో మండపేటకు బయలు దేరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో స్థానిక అవుట్ పోస్టు సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆయన కారును తనిఖీ చేయగా, బ్యాగులోని నగదు బయటపడింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ సొమ్మును ఎస్సై సీహెచ్ సూర్య భాస్కరరావు సీజ్ చేశారు. మండపేట సీఐ పీవీ రమణ ఆదేశాల మేరకు కేసును నమోదు చేశామని ఆయన తెలిపారు. అద్దరిపేట చెక్‌పోస్టులో.. తొండంగి : ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 2,26,500 లను శనివారం అద్దరిపేట చెక్‌పోస్టు వద్ద ఎన్నికల అధికారులు గుర్తించి సీజ్ చేశారు. చెక్‌పోస్టు ఎన్నికల అధికారి శివాజీ, ఎస్సై కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన సుషాంత్బెహర్, మరో నలుగురు కారులో అన్నవరం నుంచి ఒంటిమామిడి బీచ్‌రోడ్డు మీదుగా విశాఖ జిల్లా రాజానగరం వెళుతున్నారు. వారి కారును అద్దరిపేట చెక్‌పోస్టు అధికారులు తనిఖీ చేసి బ్యాగులో నగదును గుర్తించారు. ఆ సొమ్మును సీజ్ చేసి ఇన్‌కంటాక్స్ అధికారులకు నివేదించామని శివాజీ తెలిపారు. కారులోని ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నామని ఎస్సై కిశోర్‌బాబు వివరించారు. యానాంలో.. యానాం టౌన్ : కారులో తరలిస్తున్న రూ. 2.85 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యజమాని తగిన ఆధారాలు చూపడం తో ఆ సొమ్మును అప్పగించారు. యా నాం దరియాలతిప్ప ఫ్లడ్‌బ్యాంక్ రోడ్డులోని అయ్యన్నన గర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఈ సంఘటన జరిగింది. యానాం నుంచి దరియాలతిప్ప వెళుతున్న కారులో అధికారులు ఈ నగదును గుర్తించారు. ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని డీటీ శిలాంబ్రేషన్కు అప్పగిం చారు. అనంతరం ఈ నగదుకు సంబంధించి ఒక కంపెనీ ప్రతినిధి ఆధారాలు చూపించారు. దీంతో పరిపాలనాధికారి ఎస్.గణేశన్ ఆ సొమ్మును వారికి అప్పగించారు. ఏప్రిల్ 24న యానాంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రూ.50 వేలకు మించి నగదును తీసుకువెళ్లేవారు తగిన ఆధారాలు కలిగి ఉండాలని గణేశన్ తెలిపారు. రాజమ్రండి ఐఎల్టీడీ జంక్షన్లో.. రాజమండ్రి సిటీ : స్థానిక ఐఎల్టీడీ జంక్షన్లో శనివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ. లక్షా నలభై వేలు పట్టుబడ్డాయని టూటౌన్ ఇన్స్పెక్టర్ రాజారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నందిగామ శ్రీను ఈ సొమ్ముతో ఇండికా కారులో వస్తుండగా పట్టుకున్నామన్నారు. సొమ్మును స్టాస్టికల్ సర్వే రిజిస్ట్రార్ ఎం.చంద్రశేఖరరావుకు అప్పగించామన్నారు. కార్యక్రమంలో ధవళేశ్వరం ఎస్సై టి. రమేష్ పాల్గొన్నారన్నారు. -
ఏడుగురు అవినీతి అధికారులపై లోకాయుక్త పంజా
బెంగళూరు, న్యూస్‌లైన్ : అవినీతిపరులపై లోకాయుక్త మళ్లీ పంజా విసిరింది. బెంగళూరు, బీదర్, గుల్బర్గ, బాగల్కోటె, దావణగెరెలలోని ఏడుగురు అధికారుల నివాసాలు, కార్యాలయాలపై గురువారం వేకువ జామున ఏక కాలంలో సోదాలు ప్రారంభించింది. వారి వద్ద రూ.7.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించామని లోకాయుక్త ఏడీజీపీ హెచ్ఎస్. సత్యనారాయణరావు తెలిపారు. గురువారం సాయంత్రం ఇక్కడి లోకాయుక్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... = రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్. పాటిల్ వ్యక్తిగత కార్యదర్శిసిద్ధప్ప బాళప్ప అథణి బాగలకోటెలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇల్లు, కార్యాలయంలో, మంత్రి ఇంటిలోని కార్యాలయంలో సోదాలను నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. = బీదర్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి ఎస్ఎస్. సావళగికి చెందిన బీదర్ కాళిదాస నగరలోని నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. = గుల్బర్గ జిల్లా చించోళిలోని సీనియర్ ఆరోగ్య శాఖాధికారి సిద్ధన్న పాటిల్ నివాసంలో కూడా విస్తృతంగా సోదాలను నిర్వహించారు. = కర్ణాటక గృహ నిర్మాణ మండలి బీదర్ చీఫ్ ఇంజనీరుగా పని చేస్తున్న టీ. మల్లన్న ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. = బిజాపుర నిర్మిత కేంద్రం ఏఈఈగా పని చేస్తున్న గోపీనాథ్ మజగికి చెందిన హొన్నాకట్టిలోని ఫామ్‌హౌస్, ఇల్లు, కార్యాలయా ల్లో కూడా సోదాలు జరిగాయి. = బెంగళూరులోని కేఐఏడీబీ అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న హెచ్వీ. ఓంకారమూర్తి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. = ఎగువ భద్ర పథకం అసిస్టెంట్ ఇంజనీరు సేవా నాయక్‌కు చెందిన దావణగెరెలోని కార్యాలయంతో పాటు అక్కడి సర్వసతి లేఔట్‌లోని నివాసంలో, సోదాలు జరిగాయి. ఆయా జిల్లాలో లోకాయుక్త ఎస్పీల ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఒకే సారి సోదాలు నిర్వహించారని సత్యనారాయణ రావు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం అక్రమ ఆస్తుల విలువ లెక్కగట్టినా, ఇంకా లాకర్లు, బంగారు నగలు, విలువైన వస్తువులను పరిశీలించాల్సి ఉంది. గోపీనాథ్ మగజి రూ.1.75 కోట్లు, సిద్ధన్న పాటిల్ రూ.98 లక్షలు, ఎస్.ఎస్. సావళగి రూ.95 లక్షలు, సేవా నాయక్ రూ.89 లక్షలు, సిద్ధప్ప బాళప్ప అథణి రూ.85 లక్షలు, హెచ్.వీ. ఓంకారమూర్తి రూ.81 లక్షలు, టీ. మల్లన్న రూ.64 లక్షల అక్రమ ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించారు. -
అటవీ అధికారుల మెరుపు దాడులు
రుద్రవరం, న్యూస్‌లైన్: అటవీ అధికారులు రుద్రవరం, చలిమ రేంజ్ పరిధిలో శుక్రవారం మెరుపు దాడులు చేశారు. దాడుల వివరాలను జిల్లా స్కాడ్ డీఎఫ్ఓ చంద్రశేఖర్ విలేకరులకు వివరించారు. ఈ మేరకు.. మొదట చాగలమర్రి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు ట్రాస్క్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఫారెస్ట్ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి 28 ఎర్రచందనం, 175 నానాజాతి దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని పెద్దకంబాలూరు, పందిర్లపల్లె గ్రామాల మధ్య వాగులో దాచి ఉంచిన 63 దుంగలు లభించాయి. వీటిలో 8 ఎర్రచందనం దుంగలు, 29 రేలా, 13 ఏగ, 8 సండ్ర, 2 బట్టగెనుపు, 2 ఎర్ర బుటెకె, 1 చిండుగ జాతులకు చెందిన దుంగలు ఉన్నాయి. అలాగే పెద్దకంబలూరు, చిన్నకంబలూరు, పందిర్లపల్లె గ్రామాలకు చెందిన నలుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలను రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. అలాగే అహోబిలం, దొర కొట్టాల గ్రామాల మధ్య తెలుగు గంగ ప్రధాన కాల్వ సమీపంలోని ముల్లపొదల్లో దాచిన 20 ఎర్రచందనం దుంగలను స్పెషల్ పార్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అహోబిలం కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. చలిమ రేంజ్ పరిధిలోని గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువులో దాచిన 120 సండ్ర జాతికి చెందిన దుంగలను స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ ట్రాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఎర్రచందనం దుంగలతోపాటు నానాజాతికి చెందిన దుంగలను ఎర్రచందనం దుంగలుగా విక్రయిస్తున్నారు. మొత్తం 203 దుంగలను ఎర్రచందనం దుంగలగా విక్రహిస్తే రూ. 50 లక్షలు విలువ ఉంటుందని డీఎఫ్ఓ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల్లో తిరుపతి టాస్క్‌పోర్స్ అధికారులు సీఐ మద్దయ్య ఆచారి, ఎస్ఐ ఆశోక్ కుమార్, రేంజర్ విశ్వేశ్వరరావు, డీఆర్ఓ వెంకటరామిరెడ్డి, ఫారెస్టర్ నాగరాజు, మొబైల్ పార్టీ అధికారి థాయన్న, అహోబిలం, మహనంది డీఆర్ఓలు వేణు ప్రసాద్, దేవరాజు, సెక్షన్ అధికారులు నాగ తిరుపాలు, జాకీర్ ఉశ్సేన్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
సీఎం సహాయనిధికి చెక్కుల్లేవ్!
రెండు నెలలుగా ఆగిన సాయం సాక్షి, హైదరాబాద్: చెక్ బుక్కులు (చెక్కులు) లేని కారణంగా రెండు నెలలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) కార్యకలాపాలు స్తంభించాయి. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సీఎంఆర్ఎఫ్ వితరణ ఆగిపోయింది. దీంతో నిధి నుంచి ఆర్థికసాయం మంజూరైన ఆపన్నులు చెక్కుల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆర్థికసాయం మంజూరు చేస్తూ సీఎం సంతకాలు చేసిన 1,600పైగా దరఖాస్తులు చెక్కులు లేని కారణంగా పెండింగులో ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వైద్యం, ఇతరత్రా అత్యవసర ఆర్థిక సాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలు ప్రతిరోజూ సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందించాలంటూ సీఎం కార్యాలయానికి విజ్ఞప్తులు చేస్తుంటారు. ప్రజాప్రతినిధుల సిఫా ర్సు లేఖలతో ముఖ్యమంత్రి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం కోసం దరఖాస్తులు వస్తుంటాయి. వ్యాధి బారినపడి అప్పో సప్పో చేసి వైద్యం చేయించుకున్న వారే ఇలా దరఖాస్తు చేసిన వారిలో అత్యధిక మంది. వీటిని పరిశీలించి వితరణకు అనుమతిస్తూ సీఎం సంతకం చేయగానే ఆ వివరాలను సీఎంఆర్ఎఫ్కు పంపుతారు. వీటి ఆధారంగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ సిబ్బంది చెక్కులు జారీ చేస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎంత బిజీగా ఉన్నా రోజూ తప్పనిసరిగా దరఖాస్తులను పరిశీలించేవారు. చెక్కుల్లేక: రెండు నెలలుగా చెక్కుల జారీ కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది. దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా చెక్కులు లేనందున వితరణ కార్యక్రమం ఆగిపోయిన విషయం వాస్తవమేనని వారు అంగీకరిస్తున్నారు. ‘కమిషనర్ స్టేషనరీ అండ్ ప్రింటింగ్‌కు చెక్‌బుక్కులు ముద్రించి ఇవ్వాలని మేం చాలా కాలం కిందటే ఇండెంట్ పెట్టాం. అయితే వారి నుంచి చెక్ బుక్కులు రాలేదు. కమిషనర్ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ అధికారులు నిధుల లేమివల్ల ముద్రించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిపారు. దీంతో మేం సీఎం కార్యాలయానికి తెలియజేసి రూ. 75 వేలు నిధులు విడుదల చేయించాం. 25,000 చెక్కుల కోసం ఆర్డర్ ఇచ్చాం. వారం రోజుల్లో చెక్కులు వస్తాయి. తర్వాత చెక్కులు జారీ చేస్తాం. అప్పటి వరకూ సమస్య తప్పదు..’ అని సీఎంఆర్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి.