ఉల్లం‘ఘనులు’పై కఠిన వైఖరి
♦ తాగి వాహనాలు నడిపితే శిక్ష
♦ శంషాబాద్ విసృ్తతంగా డ్రంకెన్ డ్రైవ్
♦ ఏటా పెరుగుతున్న కేసులు
♦ ఆరు నెలల్లో 649 కేసులు
తాగి వాహనాలు నడిపితే ప్రమాదానికి గురై తనకు తాను హాని కలిగించుకోవడమే కాకుండా అమాయకుల ప్రాణాలను సైతం తీస్తున్న ఉల్ల‘ఘనులు’ ఇంకా మారడం లేనేలేదు. మత్తులో వాహనాలు నడిపే వారి సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్నా.. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన తాగుబోతుల సంఖ్య పెరుగుతూ పోతోంది.
శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల డ్రంకెన్ డ్రైవ్‌ను విసృ్తతంగా చేపడుతున్నారు. ఓ వైపు అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డుపై రాకపోకలు వాహనాలను ఆపి పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ చేపడతున్నారు. ఈ ఏడాది జనవరి మాసం నుంచి జులై 13 వరకు మొత్తం 649 మంది తాగుతూ వాహనాలు న డిపి పోలీసులకు చిక్కారు. వీరిలో ఇప్పటి వర కు 20 మందికి ఒకరోజు జైలు శిక్ష పడగా 112 మందికి శంషాబాద్ చౌరస్తాలో ఒక రోజు ట్రాఫిక్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. మిగతా 517 మంది 5,93,000 జరిమానా చెల్లించారు.
జనవరి నెలలో 88 మంది, ఫిబ్రవరిలో 77, మార్చిలో 110, ఏప్రిల్‌లో 89, మేలో 115, జూన్ లో 95, జూలైలో ఇప్పటి వరకు 75 మంది తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఆ స్థారుులో తాగుబోతులు దొరికిపోయారు. 2015 ఏడాది కాలంలో 578 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వారి నుంచి 6,49,000 జరిమానా వసూలు చేశారు. అంతకుముందు 2014లో శంషాబాద్ ట్రాఫిక్ ఏరియాలో 224 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యారుు. వీరి నుంచి 4,06,800 జరిమానాను వసూలు చేశారు. గతంలో కన్నా ప్రస్తుతం డ్రంకెన్ డ్రైవ్‌ను పెద్ద ఎత్తున చేపడుతున్న కారణంగానే కేసులు కూడా పెరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నారుు.
యువతే అధికం
ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు పెంచుతున్నా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ఇందులో ఎక్కువగా యువకులు, విద్యావంతులు కూడా అధికంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది. పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా ద్విచక్రవాహనదారులే ఉన్నారు. భారీ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు కూడా 100 శాతానికి మించి ఆల్కహాల్ సేవించి నడిపిస్తూ పట్టుబడుతున్నారు. మౌత్ అనలైజర్ ద్వారా 30 శాతం మించితే ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తున్నారు.
30 శాతం నుంచి 100 లోపు ఉన్న నమోదైన వారికి జరిమానా లేదా ట్రాఫిక్ డ్యూటీ 100 శాతం మించిన వారికి ఒకరోజు జైలు శిక్ష, 200 మించి వారికి రెండురోజు జైలు శిక్షలు అమలవుతున్నారుు. రెండోసారి పట్టుబడిన వారికి రెండు నుంచి ఐదు రోజులు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలున్నారుు. తాగుబోతుల ఆల్కహాల్ శాతంతో కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వారికి సంబంధిత కోర్టులో హాజరుపరుస్తున్నారు. అరుుతే న్యాయమూర్తి ఆదేశానుసారం వీరికి శిక్షలు అమలవుతున్నారుు.
తలవంచుకుని..
తాగి వాహనం నడిపి శిక్ష పడిన కొందరు ఒకరోజు ట్రాఫిక్ డ్యూటీలో భాగంగా ఆయా చౌరస్తాలో నిలబడి ‘డోంట్ డ్రంకెన్ డ్రైవ్’ బోర్డులు చేతబట్టుకుని విధులు నిర్వహించాల్సి వస్తోంది. తాగి కొని తెంచుకుంటున్న ఈ తంటాతో సమాజంలో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుని అపరాధ భావానికి గురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని చూసి ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావల్సిన పరిస్థితి కనిపిస్తోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నారుు. ఇటీవల స్థానికంగా తాగి శిక్షకు గురైన ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహించిన వారిలో కొందరు చోటా నాయకులతో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు.