
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే యువకుడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువకుడు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు.
తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ ఎస్సైతో దుర్భాషలాడాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ఎసైను కాలితో తన్నాడు. యువకుడి పక్కన ఉన్న యువతి సైతం రెచ్చిపోయి ప్రవర్తించింది. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ మాట్లాడింది. దీంతో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment