రైల్వే స్టేషన్లలో భద్రత డొల్ల | Railway stations, security hollow | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్లలో భద్రత డొల్ల

Published Fri, May 2 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

రైల్వే స్టేషన్లలో భద్రత డొల్ల

రైల్వే స్టేషన్లలో భద్రత డొల్ల

  •      అనుమానాస్పద వ్యక్తులకు రాచమార్గాలు
  •      చెన్నై ఘటనతో కదిలిన యంత్రాంగం..
  •      సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో తనిఖీలు
  •  సాక్షి,సిటీబ్యూరో/నాంపల్లి, న్యూస్‌లైన్: సరిగ్గా ఏడు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఓ సైకో కత్తితో అమ్మాయి గొంతు కోసి ప్రాణం తీశాడు. అంతుకుముందు ఇదే స్టేషన్‌లో మందమర్రికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రైలు నుంచి కాలు జారి కింద పడిపోయాడు. 45 నిమిషాలకు పైగా రక్తస్రావమైనా ఒక్క పోలీసూ అటువైపు తొంగి చూడలేదు.

    ఒక్క సికింద్రాబాద్‌లోనే కాదు.. కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలోనూ తరచుగా చోరీలు, పోకిరీల వేధింపులు వంటివి జరుగుతునే ఉన్నాయి. ఓ పిచ్చివాడు కత్తి పట్టుకొని స్టేషన్ లోపలికి ప్రవేశించి ఓ చిన్నారిని బలి తీసుకున్నాక పది రోజులు మాత్రం యంత్రాంగం భద్రతను పెంచింది. తాజాగా చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుళ్లతో గురువారం ఇక్కడి అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. తర్వాత షరా మామూలే అన్నట్టు  రైల్వే అధికారులు వ్యవహరిస్తారు. నగరంలోని మూడు రైల్వేస్టేషన్లలో భద్రత డొల్లతనాన్ని చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..
         
    సికింద్రాబాద్ స్టేషన్‌లోని ప్రయాణికుల కౌంటర్ల వద్ద ఒక ద్వారానికి మెటల్ డిటెక్టర్ ఉంది. కానీ అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు. ప్రయాణికులు మెటల్ డిటెక్టర్ లేని మరో ద్వారం నుంచే రాకపోకలు సాగిస్తారు.
         
    రేతిఫైల్ బస్టేషన్ వైపు ఉన్న మరో ద్వారం నుంచి యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తారు. రైల్వే ఎస్పీ కార్యాలయం వద్ద కూడా  ఎలాంటి తనిఖీలు లేకుండా ఎవరన్నా లోపలికి వెళ్లవచ్చు.
         
    నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే భద్రత చర్యలు చేపడతారు. స్టేషన్ లోనికి ప్రవేశించడానికి అనేక అడ్డదారులు ఉన్నాయి.
         
    పబ్లిక్‌గార్డెన్ అడ్డాపై ఉండే పోకిరీలు నాంపల్లి రైల్వే స్టేషన్ యార్డులోకి వచ్చి స్నానాలు చేస్తుంటారు. యార్డులో ఉంచిన కోచ్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేవారు ఉండరు.
         
    ఈ స్టేషన్‌లోనికి ప్రధాన ద్వారాల నుంచి సైతం ప్లాట్‌ఫారం టికెట్టు కూడా లేకుండా వచ్చి వెళ్తారు. వేసవి కావడంతో  చాలామంది ప్లాట్‌ఫారాలపైనే నిద్రపోతున్నారు. స్టేషన్‌లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగానే ఉన్నాయి.
         
    బోగీల్లోకి ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ నాంపల్లి రైల్వే పోలీసుల పర్యవేక్షణ లేమితో ఇతరులు లోనికి వచ్చి పోతుంటారు.
         
    రైల్వే క్వార్టర్స్ నుంచి స్టేషన్‌లోనికి మరో దారి ఉంది. ఈ దారి నుంచి బయట వ్యక్తులు రాకపోకలు సాగిస్తారు. మజ్దూర్ యూనియన్ కార్యాలయం నుంచి ఒకటి, జీఆర్పీ కార్యాలయం నుంచి మరొకటి అడ్డదారులు ఉన్నాయి. పబ్లిక్‌గార్డెన్స్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నుంచి ఉన్న పిట్టగోడ దూకి చాలా మంది స్టేషన్‌లోనికి వస్తుంటారు.
         
    రిజర్వేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్శిల్ కార్యాలయం నుంచి, ఎంఎంటీఎస్ టికెట్ కౌంటర్ పక్కన ఉన్న దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏటీఎం సెంటర్ పక్కన ఉన్న చిన్న పాటి సందు నుంచి లోనికి వెళ్లేందుకు మార్గం ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement