![Higher Education Commission Secretary Rajashekar Checks College Fees In AP - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/14/college.jpg.webp?itok=uBDUAcsh)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 21వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని ఉన్నత విద్యా కమిషన్ సెక్రటరీ ఎన్. రాజశేఖర్ విద్యాసంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలల్లోని ఫీజులను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మా, ఏంసీఏ, ఎంబీఏ కాలేజీలన్నింటికీ నోటీసులు పంపించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతి కాలేజీ యాజమాన్యం కమిషన్ కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, గతంలో ఫీజుల నిర్థారణపై ఆరోపణులు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని కాలేజీలకు భారీగా ఫీజుల పెంచారని, మరికొన్ని కాలేజీలకు తక్కువ ఫీజుల పేట్టారని అన్నారు. కాలేజీల్లో సదుపాయాల తనిఖీకి కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నామని, టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబర్ నాటికి కొత్త ఫీజులను నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment