colleges
-
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం ని ర్ణయం తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్ధులు ఇంట్లో ఉండటం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది. ‘పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు లేవు, అందువల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు. అంతేగాక ఆన్లైన్ క్లాస్‌లలో పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఇలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగితే వారు వెనకబడిపోతారు. పాఠశాలలు, అంగన్వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారు. ’ అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చదవండి: షిండేనే మహారాష్ట్ర సీఎం!ఈ మేరకు ఢిల్లీలో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు సూచించింది. అదే విధంగా 1 నుంచి 10,11, 12 తరగతులకు శారీరక తరగతులపై నిషేధం కొనసాగించడంతోపాటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై రేపటిలోగా (మంగళవార) నిర్ణయం చెప్పాలని సీఏక్యూఎమ్ను(CAQM) ఆదేశించింది.ఇక ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షలను సరిగా అమలు చేయకపోవడంపై సిటీ పోలీస్ కమిషనర్‌పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయ్యింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.యాక్షన్ ప్లాన్-4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణరంగంలో కార్మికులు, దినసరి కూలీలు పనులు కోల్పోయారని తెలిపింది. 12 సెక్షన్ ప్రకారం శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సీఏక్యూఎమ్కు అన్ని అధికారాలు ఉన్నాయి. కావున వారిందరికీ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి సూచించింది. -
తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల సమ్మె! ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్
-
బెంగళూరులో మూడు కాలేజీలకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.బెంగళూరులోని మూడు ప్రముఖ కాలేజీలకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావటంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. బీఎంఎస్ కాలేజీ, ఎంఎస్ రామయ్య కాలేజీ, బీఐటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు రావటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.Bengaluru Bomb Threat: Major Colleges, Including BIT, BMSCE and MSRIT Receive Bomb Threats; Probe Launchedhttps://t.co/BjoVZwox4e#Bengaluru #BIT #BombThreat— LatestLY (@latestly) October 4, 2024క్రెడిట్స్: LatestLYసమాచారం అందిన వెంటనే ఆయా కాలేజీల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ , ఇతర సంబంధిత బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అవి నిజమైన బెదిరింపులా లేదా ఉత్తుత్తి బెదిరింపులా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు సంబంధించి.. హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య -
38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కచ్చితమైన ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)రంగాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత కాలేజీల్లో ప్రస్తుత 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జాబ్ గ్యారంటీ కోర్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ డిగ్రీతోపాటు మినీ డిగ్రీ కోర్సుగా ‘బీఎఫ్ఎస్ఐ’ నైపుణ్య శిక్షణను అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 10వేల మంది విద్యార్థులకు శిక్షణ అందనుంది. ఈ కాలేజీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌తో.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ‘బీఎఫ్ఎస్ఐ’ కోర్సులు అందేవిధంగా కాలేజీలను ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది. ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణను అందుకోనున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతోపాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది. ఆ కంపెనీలు ఈ పోర్టల్‌లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నైపుణ్యాలతో డిగ్రీ, ఇంజనీరింగ్‌లో కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగ భరోసా దక్కనుంది. జాబితాలోని నాన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ– వడ్డేపల్లి, హన్మకొండ ఎస్ఆర్–బీజీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ– ఖమ్మం నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల– నల్గొండ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్ భవన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి నిజాం కాలేజీ, హైదరాబాద్ ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహదీపట్నం, హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం హైదరాబాద్ తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్‌నగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి, హైదరాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్ జాబితాలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. బీవీఆర్ఐటీ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జేఎన్టీయూహెచ్) గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జేబి ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జేఎన్టీయూ కూకట్పల్లి ప్రధాన క్యాంపస్ (జేఎన్టీయూహెచ్) కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్టీయూహెచ్) వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్–టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) కిట్స్ వరంగల్ (కాకతీయ వర్సిటీ) చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఓయూ) మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) మెథడిస్ట్ ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) ఆర్జీయూకేటీ బాసర (ఆర్జీయూకేటీ) బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్ (జేఎన్టీయూహెచ్) -
ప్రైవేట్ పై చంద్రబాబు మోజు
-
Rajasthan: బంద్‌తో విద్యాసంస్థల మూసివేత.. ఇంటర్నెట్ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్‌లోని విద్యాసంస్థలపై కనిపించింది.బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్‌పూర్‌లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్‌గఢ్‌లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. -
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్‌ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్‌ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్‌తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్‌ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై ‘న్యాక్’ పిడుగు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఇప్పటివరకు లేకున్నా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చేవి. న్యాక్‌ను కేవలం నాణ్యత ప్రమాణాలకు సూచిక గానే పరిగణించేవి. రాష్ట్రంలో 1100 కాలేజీల్లో, కేవలం ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 200 కాలేజీలకే న్యాక్ గుర్తింపు ఉంది. కానీ ఇక మీదట ప్రతీ కాలేజీ న్యాక్ పరిధిలోకి రావాల్సిందే. ఇది ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలనే ప్రతిపాదన న్యాక్ తీసు కొస్తోంది. రాష్ట్రంలోని న్యాక్ గుర్తింపు ఉన్న (న్యాక్ కాలేజీలు), న్యాక్ గుర్తింపు లేని కాలేజీలు (నాన్–న్యాక్ కాలేజీలు)గా విభజి స్తారు. నాన్ న్యాక్ కాలేజీలకు క్రమంగా అను మతి ఇవ్వకూడదనే నిబంధన తేవాలనే యోచ నలో ఉన్నారు. ఈ మేరకు ఇటీవల బెంగళూరు కేంద్రంగా న్యాక్ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించింది. దక్షిణ భారత రాష్ట్రాల ఉన్నత విద్య మండళ్ళ చైర్మన్లను, పలువురు విద్యారంగ నిపుణులను ఈ సమావేశాలకు ఆహ్వానించింది. న్యాక్ నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరించింది. కొత్త నిబంధనలపై రాష్ట్రాల స్థాయిలో అవగా హన కల్పించాలని కోరింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవ్వాలని సూచించింది.90 శాతం కాలేజీలకు ఇబ్బందే!మౌలిక సదుపాయాల పెంపు, ఫ్యాకల్టీ, ఫలితాలు, ఉపాధి అవకాశాలు, సొంత బిల్డింగ్ ఉందా? వంటి అంశాలకు న్యాక్ బృందం మార్కులు ఇస్తుంది. దీని ఆధారంగానే గ్రేడ్‌ను కేటాయిస్తుంది. ఎక్కువగా కార్పొరేట్ కళాశాలలు మాత్రమే ఈ ర్యాంకులు పొందుతున్నాయి. కాగా, ఇప్పటి వరకూ న్యాక్ బృందాలు కళాశాలలను స్వయంగా పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇచ్చేవి. అలా కాకుండా ఆన్‌లైన్‌లోనూ పరిశీలించి అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే న్యాక్ నిబంధనలు అమలు చేయాలంటే 90 శాతం కళాశాలలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. కార్పొరేట్ కళాశాలలు మాత్రమే దీనివల్ల విస్తరిస్తాయనే విమర్శలొస్తున్నాయి. దాంతో న్యాక్ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని మండళ్ళ చైర్మన్లు ప్రతిపాదిస్తున్నారు. నాణ్యత లక్ష్యంగా సడలింపులు న్యాక్ నిబంధనల్లో సమూల మార్పులు చేసేందుకు న్యాక్ కౌన్సిల్ ప్రతిపాదించింది. దీనిపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. గుర్తింపు ప్రక్రియను మరింత సరళీకృతం చేయడమే దీని ఉద్దేశం. అన్ని కాలేజీలను న్యాక్ గుర్తింపు పరిధిలోకి తేవడం, నాణ్యత పెంచడమే లక్ష్యం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్)అలాగైతే ఇబ్బందేన్యాక్ నిబంధనల పేరుతో చిన్నకాలేజీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీలు ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎన్నో కాలేజీలు మూతపడ్డాయి. న్యాక్ గుర్తింపును ఐచ్ఛికంగానే పరిగణించాలి. – గౌరీ సతీశ్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్య సంఘంమూడు కేటగిరీల ఏర్పాటుఇక మీదట విద్యా సంస్థలను 3 కేటగిరీలుగా విభజించాలని న్యాక్ భావిస్తోంది. విశ్వవిద్యాలయాలు, అటాన మస్ కాలేజీలు, అనుబంధ కాలేజీలు అనే 3 విభాగాలను గుర్తిస్తారు. కాగా, విశ్వవిద్యాలయాలు ఇప్పటికే అన్ని వసతులతో ఉంటాయి. అటానమస్ కాలేజీలూ నిధులు సమకూర్చుకోవడంలో వెనుకాడవు. కానీ అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఇబ్బంది ఉందన్న వాదనలున్నాయి. -
కాలేజీల్లో మోరల్ పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో మోరల్ పోలీసింగ్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అన్ని ఇంటరీ్మడియెట్, డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరిస్తే.. దుష్ఫలితాలను నివారించుకోవచ్చన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులను వలంటరీ పోలీసింగ్‌కు కోసం వినియోగించుకోవాలని సూచించారు.శనివారం జేఎన్టీయూలో వలంటరీ పోలీసింగ్ వ్యవస్థపై నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమాజంలో పెడధోరణులు పెరగడానికి సాంకేతికత ఓ కారణమన్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా పెడితే.. చాలావరకు సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్నారుల మానసిక దృఢత్వానికి తోడ్పతాయని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలకు కారణమని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మత్తు పదార్థాలతో జరిగే నష్టాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్యాంశంగా బోధించడంతోపాటు నైతిక పోలీసింగ్‌ను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. బడులు, కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్స్ అవసరం ఎంతో ఉందని తెలిపారు. వారితో పోలీసులకు సమాచారం చేరవేసే వ్యవస్థను తయారు చేసుకుంటే.. తెలంగాణను డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా మార్చవచ్చని చెప్పారు. డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందంటూ ‘మీ అన్నగా పిలుపునిస్తున్నా... డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి’అని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని, అందుకోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యతని, ప్రజా సమస్యలపై ఫోకస్‌గా పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. సమస్యలకు భయపడి పారిపోకుండా, పోరాడాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీకైనా, బిల్ గేట్స్కైనా, రేవంత్ రెడ్డికైనా ఉండేది రోజుకు 24 గంటలేనని, రోజుకు 16 గంటలు మీరు ఎంత ఫోకస్‌గా పనిచేస్తే అంత బాగా మీ లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్‌లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్‌లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్‌లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్‌ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్‌లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
కాలేజ్‌కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!
ఓ వ్యక్తి కాలేజ్ చదువు కూడా చదవకుండా కోట్లు గడిస్తున్నాడంటే నమ్ముతారా..!. ఏ వ్యాపారం చేసో అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకంటే..అతడు చక్కగా పెద్ద కార్పోరేట్ కంపెనీలో అప్రెంటీస్‌గా మొదలు పెట్టి..ఏకంగా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్థాయికి చేరకున్నాడు. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చదువులు చదవకుండా.. ఎలా అతడికి సాధ్యం అయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. యూకేకి చెందిన న్యూటన్(30) యూవివర్సిటి విద్య కూడా చదవలేదు. కానీ డెలాయిట్ కంపెనీలో పార్టనర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వార్షిక వేతనం సుమారుగా రూ. 10 కోట్లు పైనే ఉంటుందట. ఇదంతా ఎలా సాధ్యం అనే కదా..!. అతడి కెరీర్ జర్నీ 12 ఏళ్ల క్రితం డెలాయిట్ కంపెనీలో బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరడంతో మొదలయ్యింది. అలా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్తాయికి ఎదిగిపోయాడు. అది కాలేజ్డ్రాపౌట్స్ కోసం ఏర్పాటు చేసిన డెలాయిట్ బ్రైట్ స్టార్ అప్రెంటీస్ ప్రోగ్రామ్ అతడి తలరాతనే మార్చిందని చెప్పొచ్చు. నూటన్ పెరిగిందంతా డోరెట్స్లోనే. తన తండ్రి 16 ఏళ్ల వయసులో పాఠశాల చదువును విడిచిపెట్టి ఆర్మీలో చేరిపోయాడు. తన అమ్మ పబ్‌లోనూ, ట్రావెలింగ్ ఏజెన్సీలోనూ పనిచేసేది. దీంతో తల్లిదండ్రుల ప్రంపంచానికి దూరంగా పెరిగాడు న్యూటన్. ఆర్థిక పరిస్థితి వల్లే కదా తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది అని భావించి సంపాదన మార్గాల గురించి తీవ్రంగా అన్వేషించడం ప్రారంభించేవాడు. తీరిక దొరికితే అందుకోసమే వెతికేవాడు. ఐతే అనుకోకుండా విశ్వవిధ్యాలయంలో గణితం అధ్యయనం చేసేందుకు సీటు లభించింది. ఇలా అతడి కుటుంబంలో విశ్వవిద్యాలయంలో సీటు పొందిన ఏకైక వ్యక్తి కూడా న్యూటనే. కానీ అందులో చేరలేదు. సంపాదన మార్గాల మీదే అతడి ధ్యాసంతా. అందుకోసం రెండు మూడు చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసేవాడు. అంతేగాదు స్కూల్ చదువుతో డబ్బులు వచ్చే స్కీములు ఏం ఉన్నాయా అని చూసేవాడు. ఆ కారణాల రీత్యా అతడు చదువాలనే దానిపై దృష్టి కేంద్రీకరించ లేదు. ఆ అన్వేషణలో భాగంగానే న్యూటన్ డెలాయిట్ బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్ ప్రోగ్రామ్‌లో చేరాడు. ఐతే ఇది విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన ఉపాది మార్గం ఇది. దీన్ని కాలేజ్ యూనివర్సిటీలే ఏర్పాటు చేశాయి. అయితే ఇదంతా న్యూటన్‌కి నచ్చక ఒకింత అసహనం అనిపించినా, డబ్బు సంపాదించే మార్గం దొరికిందన్న ఉద్దేశ్యంతో అందులో జాయిన్ అయ్యాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ పార్ట్నర్గా క్వాలిఫైడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్‌గా విధులు నిర్వర్తించే రేంజ్‌కి చేరాడు. నిజానికి డెలాయిట్ కంపెనీ రిక్రూట్మెంట్ కోసం ఈ బ్రైట్‌స్టార్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా విద్యార్థుల ఉపాది పొందుతూ కాలేజ్ చదువును చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. అంతేగాక ఈ ప్రోగ్రాం ద్వారా వారిలో దాగున్న టాంటెంట్ బయటకి వెలికితీస్తుంది. పైగా సామాజికంగా ఆర్థిక నేపథ్యం సరిగా లేని వ్యక్తులకు ఈ ప్రోగ్రాం ఒక గొప్ప వరం. అంతేగాదు కెరీర్లో మంచిగా సెటిల్ అవడానికి ఉపకరించే గొప్ప ఉపాధి మార్గం ఇది. ఇక్కడ న్యూటన్ సంపాదన ధ్యాస కళాశాలకు వెళ్లనీయకుండా చేసినా..ఉద్యోగంలో ఉన్నతంగా ఎదిగేలా చేసి ఈ స్థాయికి తీసుకురావడం విశేషం. ఇక్కడ డిగ్రీలు, పీహెచ్‌డీలు కాదు ముఖ్యం. సంపాదించాలనే కసి పట్టుదల అన్ని నేర్చుకునేలా, ఎదిగిలే చేస్తుందనడానికి న్యూటనే స్ఫూర్తి కదూ..!. (చదవండి: ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!) -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్‌గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్‌లో కూడా కాలేజ్‌కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్‌గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్‌ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్‌గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్‌గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్‌గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్‌లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్‌గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్‌తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్‌కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్‌తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
జనవరి 22న ఉత్తర ప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవు
లక్నో: జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ఈనెల 22నన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం దృష్టా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్‌లల్లా 'ప్రాణ-ప్రతిష్ఠ' కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ఆదిత్యనాథ్ పరిశీలించారు. అదే విధంగా జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని సీఎం తెలిపారు. ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. కాగా అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. చదవండి: మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్ -
ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. -
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్‌లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్‌లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్‌లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్‌లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో, ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక చరిత్రగా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8,500 కోట్ల ఖర్చుతో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తోందని, వీటిలో ఐదింటిని సీఎం జగన్ శుక్రవారం పారంభించారని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. సంక్షేమ రాడార్ నుంచి తప్పించుకోకుండా.. జగనన్న సంక్షేమ రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి రజని చెప్పారు. మొదటి దశలో వలంటీర్ల ఇంటింట సర్వే ఈ నెల 15న ప్రారంభమైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తొలి దశలో గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీహెచ్‌వో లేదా ఏఎన్ఎం ఆ ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని వలంటీర్లు సమాచారం ఇస్తారన్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్ఎంలు ప్రజల ఇళ్లకే వెళ్లి అందించే సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ప్రజల అంగీకారం మేరకు బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటివద్దే చేస్తారన్నారు. మూడో దశలో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం గల వ్యక్తుల బృందాలు మరోసారి ఇంటింటికీ వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించే తేదీ, అందించే సేవలను వివరిస్తారన్నారు. నాలుగో దశలో ఈ నెల 30న వైద్య శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి రజిని వివరించారు. శిబిరాల్లో రోగులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు ఇస్తారని, చికిత్స అవసరమైతే వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, పీహెచ్‌సీల వైద్యాధికారులు.. పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ ఆరోగ్య అధికారులు, యూపీహెచ్సీల వైద్యాధికారులు వైద్య శిబిరాల బాధ్యత తీసుకుంటారన్నారు. ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వో, ఏఎన్ఎంలు రిఫరల్ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందిందా లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా పరిశీలిస్తారని వివరించారు. నిఫా వైరస్‌పై అప్రమత్తం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తిగా ఎన్ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరినట్టు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి మంజుల, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ రోజు మరుపురానిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని అన్నారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్లైన్లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, కుమరంభీమ్, సిరిసిల్ల,నిర్మల్, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాధిస్తున్నామని అన్నారు. బోధన కాలేజీలే కాకుండా అనుబంధ ఆస్పత్రులను కూడా నెలకొల్పినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్లుగా తయారు చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 500 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను ఎగతాళి చేసినవాళ్లకు ఇదో మంచి ఉదాహరణ అని అన్నారు. దేశంలో వైద్య రంగంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గించామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 21కి చేరింది. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,515కు పెరిగింది. ఇదీ చదవండి: తెలంగాణలో ప్రారంభమైన టెట్ పరీక్ష -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
ప్రాణం మీదకొస్తున్న ‘ప్యాకేజీ’ చదువులు!
చదువు.. తెలివి ముందుగా ‘ప్యాకేజీ ’ చదువుల ఇంజనీర్ కథ .. ఓ వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఇంజనీర్ అయ్యాడు. బాగా సంపాదిస్తున్నాడు. కారు కొనుక్కున్నాడు. డ్రైవర్‌ను కూడా పెట్టుకున్నాడు. ఫంక్షన్ ఉండడంతో ఓ రోజు ఊరెళ్లాల్సి వచ్చింది. కానీ, డ్రైవర్ సెలవు పెట్టాడు. దానితో తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఊరికి బయలు దేరాడు. దాదాపుగా ఊరిదాకా వెళ్లాడు. కానీ అంతలోనే కారు టైరు పంక్చరయ్యింది. మార్చడానికి ఎప్పటిలా డ్రైవర్ లేడు. చేసేదేంలేక తానే టైర్ మార్చే ప్రయత్నం చేయసాగాడు. కష్టపడి టైర్ విప్పాడు. దురదృష్టం మనవాడిని వెన్నాడుతూనే ఉంది. స్టెప్నీ టైర్ తీసిపెట్టి బిగించే టైమ్‌లో కాలు తాకి విప్పిపెట్టిన నట్లు పక్కనే ఉన్న మురికి కాల్వలో పడ్డాయి. ఉసూరుమన్నాడు. దిగి తీద్దామంటే బురద... అంటితే ఫంక్షన్‌కు అటెండ్ కావడం ఎలా? కర్రలు గట్రాలతో రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏదీ వర్కవుట్ కాలేదు... తలపట్టుకుని అలాగే కూర్చున్నాడు. అరగంట గడిచింది. ఆ దారిలో పశువులను తోలుకుంటూ ఓ ఆసామి వస్తున్నాడు అతన్ని పిలిచి తన బాధంతా చెప్పి ఎలాగైనా ఆ న ట్లు తీసివ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడు. కొంచెంసేపు ఆ ఇంజనీర్వైపు కారువైపు అలాగే చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘బాబూ!, డబ్బుల విషయం అలా ఉంచు. నేను దిగి తీసివ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ, అందులో దిగాకా నేను మళ్లీ ఇంటికి వెళ్లి బురద కడుక్కుని రావాలి. నువ్వు కూడా దానిలో దిగలేవు. అందుకని నేనో ఉపాయం చెబుతా.. మిగతా చక్రాలవి ఒక్కో నట్టు తీసి ఈ టైరుకు బిగిద్దాం. కారు నడవడానికి ఢోకా ఉండదు. నువ్వు హాయిగా వెళ్లొచ్చు. ఓ పది కిలోమీటర్ల దూరంలో మెకానిక్ షాపు ఉంది. అక్కడకి వెళ్లి నట్లు వేయించుకుని వెళ్లు. నీకు డబ్బు ఖర్చు, నాకు బురదా తప్పుతాయి. ఆ ఐడియాకు ఆ మెకానికల్ ఇంజనీర్ అవాక్కయ్యాడు. ఈ మాత్రం ఆలోచన రాక అరగంట నుంచి ఇబ్బంది పడ్డానే అనుకున్నాడు.. చదువు మెకానికల్ అయిపోయి, ఉద్యోగానికి మాత్రమే, అందునా ప్యాకేజీలకు మాత్రమే పనికి వచ్చే చదువుతో తయారైన బుర్ర నుంచి ఇలాంటి పదునైన ఆలోచన రావడం కష్టమే..చావుల చదువు.. ఓ సీలింగ్ ఫ్యాన్.. మేధో బుర్రలకు తట్టిన గొప్ప ఐడియా. సీలింగ్ ఫ్యాన్‌కు దానికి ఆధారంగా ఉండే రాడ్‌కు మధ్య ఓ స్ప్రింగ్‌ను బిగిస్తారు. ఈ ఫ్యాన్లకు 20 కిలోల కన్నా ఎక్కువ బరువు వేలాడితే వెంటనే స్ప్రింగ్ సాగుతుంది. దానితో ఫ్యాను సీలింగ్ నుంచి కిందకు దిగుతుంది. స్ప్రింగ్ సాగగానే సైరన్కూడా మోగుతుంది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఇవి ఇప్పుడు రాజస్థాన్‌లోని కోటా పట్టణంలోని హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కోటాలోని ఐఐటీ కోచింగ్ సెంటర్లలో చదివే విద్యార్థులు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని.. వాటిని ఆపాలని ప్రయత్నం. వీటితో పాటు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకోకుండా భవనాల వెలుపలా, బాల్కనీల్లో సూసైడ్ ప్రూఫ్ వలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 150 కిలోల బరువు మోయగలవు. ఎవరైనా విద్యార్థులు భవనంపై నుంచి దూకినా గాయాలు కావు. పరిష్కారం ఇదేనా.. అన్న చర్చ పక్కన పెడితే.. విద్యావ్యవస్థ సిగ్గు పడాల్సిన సందర్భం ఇది. చదువు ఏమి ఇస్తది.. జ్ఞానం ఇస్తది.. బతుకుకు భరోసా ఇస్తది. చావు నిస్తదా.. చదువు ఎంత గొప్పదయితే అంత చావునిస్తదా. చదువు ఎందుకంత గొప్పదయ్యింది. మంచి జ్ఞానాన్ని, జీవితంపై భరోసాను కాదు మంచి జీతాన్ని ఇస్తదని, మంచి ప్యాకేజీలను ఇస్తదని ఆశ.. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి. పదిహేను లక్షలమందితో పోటీపడి 12 వేల మంది గెలుచుకునే క్రీడ. ఇందులో బలయ్యేది.. ఎక్కువగా తక్కువ స్థోమత ఉన్న కుటుంబంలోంచి వచ్చిన పిల్లలేనట. ఉన్న ఎకరమో, అరెకరమో అమ్మి, లేదా ఆర్థిక స్థోమత లేక అప్పోసప్పో చేసి తల్లిదండ్రులు పిల్లల బాగుకోసం చదువులకు పంపితే..అది ఇంకా పిల్లలపై ఒత్తిడి పెంచుతోంది. అసలే తీవ్రమైన పోటీ.. ఎడ తెరిపిలేకుండా శిక్షణ, ఆ చదువులు అబ్బుతాయా లేదా అన్న విచక్షణ లేకుండా.. మంచి ప్యాకేజీలో స్థిరపడాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష,, వెరసి చదువులు స్ప్రింగ్ ఫ్యాన్లు, సూసైడ్ ప్రూఫ్ నెట్ దాకా వచ్చాయి. .... ఇంతా కష్టపడి చదివిన ఐఐటీ డిగ్రీలు అవి నేర్పిన వృత్తిలోనే స్థిర పడుతున్నారా... ఏది దొరికితే ఆ ఉద్యోగం చేస్తున్నారు.. మనం పైన సరదాగా చెప్పుకున్న మెకానికల్, ప్యాకేజీ చదువులయిపోయాయి. మనసుకు పట్టినా పట్టకపోయినా.. మెకానికల్‌గా చదువుకుని బయటపడ్డవాళ్లు బతికిపోతున్నారు.. లేని వాళ్లు చితికి పోతున్నారు. చదవేస్తే... తెల్లారితే చాలు.. ఎక్కడో ఓ చోట.. ఎవరో ఓ విద్యార్థి ఆత్మహత్య వార్త వింటున్నాం. చదువుల ఒత్తిడి.. పరీక్షల్లో పాస్ కాకపోతే ఎలాగనే ఆవేదన.. తల్లిదండ్రులు, స్నేహితుల ముందు పరువుపోతుందనే ఆందోళన.. విద్యా సంస్థల్లో అధ్యాపకులు, సిబ్బంది వేధింపులు.. ఇలాంటివన్నీ కలసి విద్యార్థుల ఆత్మ‘హత్య’లకు కారణమవుతున్నాయి. కుటుంబ, వ్యక్తిగత కారణాలూ వీటికి తోడవుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ సమస్య మరింతగా పెరుగుతూ వస్తోంది. జూనియర్ కాలేజీల నుంచి మొదలుకుని మెడికల్ కాలేజీలు, ప్రఖ్యాత ఐఐటీల వరకు అన్నిచోట్లా విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయి. దేశంలో 2017– 2021 మధ్య ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. అదే ఒక్క విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటే 32 శాతం పెరిగాయి. 2017లో 9,905 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. 2021లో ఈ సంఖ్య 13 వేలకుపైనే. దేశంలో సగటున రోజుకు 35 మంది.. అంటే ప్రతి రెండు గంటల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులోనూ పురుష విద్యార్థుల బలవన్మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2020లో విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒక్కసారిగా 21శాతం పెరుగుదల నమోదైనట్టు గుర్తించారు. దేశంలోనే టాప్ విద్యాసంస్థలు అయిన ఐఐటీలు, ఐఐఎంలు, నిట్లు, సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. 2018 నుంచి 2023 ఏప్రిల్ మధ్య వీటిలో 103 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే.. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూ వస్తున్నాయి. వయసుపరంగా చూస్తే.. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వారి ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఈ ఏజ్వారు 2017 కల్లా 45,217 మంది బలవన్మరణానికి పాల్పడగా.. 2021 నాటికి ఈ సంఖ్య 56,543కు చేరుకుంది. అయితే విద్యార్థులు స్కూల్ చదువు పూర్తిచేసి కాలేజీల్లో చేరినప్పుడు.. ఒక్కసారిగా మారిపోతున్న విద్యా వాతావరణం, కాలేజీ చదువుకు అయ్యే ఖర్చు, విద్యార్థుల సామాజిక–సాంస్కృతిక–ఆర్థిక స్థాయిల్లో భేదాలతో ఒత్తిడి వంటివి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి వారి కుటుంబాల్లో సమస్యలకు కారణమై.. ‘కుటుంబ సమస్యల’తో బలవన్మరణాలు జరుగుతున్నాయని అంటున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన ‘భారత్‌లో ప్రమాద మరణాలు, ఆత్మహత్యల నివేదిక (ఏడీఎస్‌ఐ)’లోని అధికారిక లెక్కలే ఇవి. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు మరెన్నో. సరికొత్త చలపతి, రచయిత -
అదనంగా 1,410 ఇంజనీరింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే మరో 1,410 ఇంజనీరింగ్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ సీట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా మార్చారు. ♦ మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పాలేరులో కొత్తగా రెండు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతించింది. ఇవి జేఎన్టీయూహెచ్ పరిధిలో నడుస్తాయి. వాస్తవానికి ఈ రెండు కాలేజీల్లో ఒక్కోదాంట్లో 300 వరకూ సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది మాత్రం సీఎస్ఈ, ఈసీఈ, సీఎస్ఈ–ఎంఎల్ కోర్సులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 చొప్పున, ఒక్కో కాలేజీలో 180 సీట్లు అందుబాటులోకి వస్తాయి. రెండు కాలేజీల్లో కలిపి 360 సీట్లు ఉంటాయి. ♦ ఘట్కేసర్లోని కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి ఎంబీఏ కాలేజీకి కూడా ఇంజనీరింగ్ కోర్సులకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ కాలేజీలో ఆరు బ్రాంచ్‌లకు కలిపి 360 సీట్లు అదనంగా వస్తాయి. ♦ హైదరాబాద్‌లోని టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీని అప్‌గ్రేడ్ చేశారు. దీంతో 300 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ♦ ఇవి కాకుండా మరో మూడుకాలేజీలకు అదనంగా సీట్లు ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనికి జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది. ♦ ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి 1,410 సీట్లు అదనంగా రాబోతున్నాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. పెరిగిన సీట్లూ కంప్యూటర్ కోర్సుల్లోనే కొత్తగా పెరిగే 1,410 సీట్లల్లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 83,766 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటే, 58 వేల వరకూ కంప్యూటర్ సంబంధిత బ్రాంచ్‌ల్లోనే ఉన్నాయి. మూడు విడతలుగా సీట్ల భర్తీ చేపట్టినా, ఇంకా 3,034 సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో మిగిలాయి. తాజాగా మరో 900 వరకూ కొత్త సీట్లు కలుపుకుంటే, దాదాపు 4 వేల సీట్లు మిగిలే అవకాశం ఉంది. ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. ఆఖరిదశలో అనుమతులు, కొత్త సీట్లు రావడంతో వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ తేదీలు మార్చారు. వాస్తవానికి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలు పెట్టి, 23న సీట్ల కేటాయింపు చేపట్టాలని భావించారు. ఈ తేదీల్లో మార్పులు చేస్తూ సాంకేతిక విద్యా శాఖ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. 18వ తేదీ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ (కొత్తవారు) 17–22 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు 26న సీట్ల కేటాయింపు 26–28 తేదీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 27–29 తేదీల్లో కాలేజీలో రిపోరి్టంగ్ -
వాతావరణ శాఖ హెచ్చరికలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
సాక్షి, బెంగళూరు: వారం నుంచి వదలని వానలతో కర్ణాటకలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రేపు (జులై 26న) రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈక్రమంలోనే అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వయనాడ్, కోజీకోడ్, కన్నూర్, మళప్పురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మూసి ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. (షాకింగ్ వీడియో.. గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన 200కు పైగా కార్లు) తెరిపినివ్వని వర్షం కారణంగా కాసర్గాడ్ జిల్లాలోని వెళ్లరికుందు, హోస్దుర్గ్ తాలుకాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వానలు, వరదల కారణంగా కేరళలలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇడుక్కి, వయనాడ్, కాసర్గాడ్ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు ఉన్న చోట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కాగా, జులై 27 వరకు దక్షిణ భారతానికి భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు) -
స్కిల్ కాలేజీలతో పరిశ్రమల అనుసంధానం
సాక్షి, అమరావతి: స్కిల్ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నైపుణ్యశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15కల్లా పరిశ్రమలతో అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. స్కిల్‌హబ్‌లలో శిక్షణ కోసం ఇప్పటివరకు 15,559 మంది నమోదు చేసుకున్నట్లు నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 3,636 మందికి ఉపాధి అవకాశాలు అందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్‌కుమార్ చెప్పారు. స్కిల్ కాలేజీలు, స్కిల్హబ్లకు సంబంధించి కొత్త విధానంలో బ్రాండింగ్ చేయాలని మంత్రి బుగ్గన సూచించారు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! -
కాలేజీలు, వర్సిటీల్లో..చదువు... సంపాదన
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్ వైల్ లెర్న్’ (చదువుతూ సంపాదన–ఈడబ్ల్యూఎల్) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు పంపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను చదువుల్లో ముందుకు తీసుకెళ్లడంతోపాటు వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ పథకాన్ని యూజీసీ రూపొందించింది. ఈ వర్గాల విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూనే కొంత సంపాదించుకునేందుకు వీలుగా ‘చదువుతూనే సంపాదన’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని విజయవంతంగా అమలుచేయడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఎంగేజ్మెంట్ అవకాశాలను అందించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ప్రతిపాదించింది. ప్రతి గంటకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని, గరిష్టంగా వారానికి 20 గంటలపాటు నెలలో 20 రోజులు ఈ పార్ట్‌టైమ్ వర్క్‌లు వారికి అప్పగించాలని యూజీసీ పేర్కొంది. రోజూ తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఈ పార్ట్‌టైమ్ సేవలను విద్యార్థులకు కల్పించాలని తెలిపింది. ‘చదువుతూ సంపాదన’ అనే ఈ పథకం ద్వారా ఈ వర్గాల విద్యార్థులు వారి చదువులకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వీలవుతుందని, అదే సమయంలో వారు ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకునేలా నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారని యూజీసీ అభిప్రాయపడింది. ఈ ‘ఎర్న్ వైల్ లెర్న్’ పథకం బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల చదువుల్లో ఆర్థిక కష్టాలను తగ్గించడంతో పాటు విద్యార్థుల్లో కష్టపడి సంపాదించే తత్వాన్ని పెంపొందిస్తుంది. చదువుల్లో విద్యార్థులను మరింత మెరుగుపరుస్తుంది. విద్య నాణ్యత పెరగడంతోపాటు వారిలో సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేస్తుంది’.. అని యూజీసీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. అంతేకాక.. వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, సాంకేతిక నైపుణ్యాల మెరుగుకు తోడ్పాటునందిస్తుందని, తద్వారా ఈ వర్గాల విద్యార్థుల్లో సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని యూజీసీ అభిప్రాయపడింది. ‘విద్యార్థులు వృత్తిపరమైన పనులను త్వరగా చేపట్టడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది. పార్టుటైమ్ పనుల కేటాయింపు ఇలా.. సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాసంస్థల్లో ఎలాంటి పార్ట్‌టైమ్ ఉపాధి కార్యక్రమాలు కలి్పంచాలో కూడా యూజీసీ సూచించింది. ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఇందులో.. ♦ రీసెర్చ్ ప్రాజెక్టులతో కూడిన అసిస్టెంట్‌షిప్, లైబ్రరీ అసైన్మెంట్లు, కంప్యూటర్ సర్విసెస్, డేటాఎంట్రీ, లేబొరేటరీ అసిస్టెంట్లు తదితరాలతో పాటు ఆయా సంస్థలు ఇతర అంశాల్లోనూ పార్ట్‌టైమ్ జాబ్‌లను కలి్పంచాలని యూజీసీ పేర్కొంది. ♦ ఇందుకు సంబంధించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటుచేయాలని తెలిపింది. ♦ సంస్థ డీన్ లేదా డిపార్ట్మెంటల్ హెడ్ తదితరులతో చర్చించి అర్హులైన విద్యార్థులను గుర్తించిన అనంతరం ఉన్నతాధికారుల ఆమోదంతో విద్యార్థులకు తగ్గ పనులను అప్పగించాలని వివరించింది. ♦ ప్రతి అకడమిక్ సెషన్లోనూ ఈ విద్యార్థులను గుర్తించి పూల్‌గా ఏర్పరచి వీసీ, లేదా ప్రిన్సిపాళ్ల ఆమోదంతో పార్ట్‌టైమ్ పనులు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ♦ జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. ♦ సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉత్తమమైన కార్యక్రమమని యూజీసీ వివరించింది. ♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన పిల్లలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ ఇక ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఈ విద్యార్థులకు తొలి ఏడాదిలోనే బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ విద్యార్థులు సంబంధిత కోర్సుల్లోని అంశాలకు సంబంధించి పూర్వపు పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకునే పరిస్థితుల్లేక వెనుకబడి ఉంటారని, ఆ లోపాన్ని పూరించేందుకు ఈ కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది. ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి వీరు చేరుకునేందుకు ఇవి అవకాశం కలి్పస్తాయని తెలిపింది. సెమిస్టర్ ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు ఏటా వీటిని నిర్వహించాలని సూచించింది.