ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్‌లోని విద్యాసంస్థలపై కనిపించింది.
బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్‌పూర్‌లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్‌గఢ్‌లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment