- మైనారిటీ విద్యా సంస్థలనుద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వలేనప్పుడు కాలేజీలు మూసివేసుకోవడం మంచిదని మైనారిటీ విద్యా సంస్థలను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానిం చింది. మైనారిటీల కోసమంటూ ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది కాలేజీలు ఏర్పాటు చేస్తున్న మైనారిటీ విద్యాసంస్థలు చివరకు మైనారిటీయేతరులతో సీట్లు భర్తీ చేస్తుండటం తమకు విస్మయం కలిగిస్తోందని హైకోర్టు తెలి పింది. ఇలా చేయడం మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేయడమేనని స్పష్టం చేసింది.
ఈ కేసులో ఎంబీఏ కన్వీనర్ వాదనలు విన్న తరువాతనే ఉత్తర్వులిస్తామంటూ కన్వీనర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి తమకు ఎంబీఏ కోర్సుకు జేఎన్‌టీయూ, హైదరాబాద్ అనుమతిని ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఖాదర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించింది.
ప్రవేశాలివ్వనప్పుడు కాలేజీలెందుకు?
Published Wed, Sep 30 2015 4:12 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement