minority students
-
జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య నభ్యసించేలా ఆర్థిక సాయం అందించే జగనన్న విదేశీ విద్యా దీవెన అమలుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మందికి మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 200 యూనివర్సిటీల ఎంపిక చేతురు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ.కోటి వరకు 100% ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్. 100 – 200 క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజు గరిష్టంగా రూ.75 లక్షల వరకు రీయిబర్స్‌మెంట్ చేస్తారు. మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.50 లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా చార్జీలను సైతం ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. -
విద్యార్ధులకు భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో మైనారిటీ వర్గాలకు చెందిన ఐదు కోట్ల మంది విద్యార్ధులకు స్కాలర్షిప్లు అందచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రీ మెట్రిక్, మెట్రిక్ అనంతర, వృత్తి, సాంకేతిక విద్యను అభ్యసించే మైనారిటీ విద్యార్ధులకు ప్రభుత్వం స్కాలర్షిప్లను అందిస్తుందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వెల్లడించారు. మైనారిటీ విద్యార్ధినీ, విద్యార్ధుల్లో సామాజికార్ధిక, విద్యా సాధికారత కోసం పలు స్కాలర్షిప్లను ప్రభుత్వం వారికి అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధినులకు పది లక్షల బేగం హజరత్ మహల్ బాలికా స్కాలర్షిప్లను ఇస్తామని తెలిపారు. సమ్మిళిత వృద్ధిని సాధించే క్రమంలో మైనారిటీ విద్యార్దినీ విద్యార్ధులకు భారీస్ధాయిలో ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. -
మైనార్టీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సాక్షి సిటీబ్యూరో: మైనార్టీ విద్యార్థులకు సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఏటా వంద మందిని ఎంపిక చేసి వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం మే 8వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి.. 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా ఎనిమిది పాత జిల్లాల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఉన్నతమైన శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఓ కమిటీని వేసి నగరంలోని ఐదు ప్రముఖ ఐఏఎస్ స్టడీ సర్కిళ్లను ఎంపిక చేశారు. స్టైఫండ్, మెటీరియల్ కూడా.. ఎంపికైన విద్యార్థులకు కోచింగ్‌కు అయ్యే ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైగా ఉపకార వేతనం కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. లోకల్ విద్యార్థికి రూ.2500, నాన్ లోకల్ విద్యార్థికి రూ.5 వేలు ఇవ్వనున్నారు. దీంతో పాటు స్టడీ మెటీరియల్ కొనుగోలుకు అదనంగా రూ.3500 ఇస్తారు. కోచింగ్ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.51 లక్షలు వెచ్చించనుంది. మైనార్టీల ప్రగతికి తోడ్పాటు ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థుల కోసం ప్రవేశపేట్టిన సివిల్ సర్వీస్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు నగరంలోని టాప్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇవ్వలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి.– ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్,సీఈడీఎం డైరెక్టర్ -
ఏపీలో మైనార్టీ విద్యార్థులకు నీట్ కష్టాలు
-
మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్షిప్ రెట్టింపు?
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్టడీ స్కీం ఉపకారవేతనం పెరుగనుంది. ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం కేసీఆర్ వద్ద దస్త్రం పరిశీలనలో ఉంది. ఇటీవల ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీం’ కింద ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాన్ని రూ. 20 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ విద్యార్థుల తరహాలో మైనారిటీలకు కూడా వర్తింపజేయాలని వచ్చిన పలు విజ్ఞాపనల మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సీఎం కేసీఆర్ ఆమోదంతో త్వరలో జీవో జారీ అయ్యే అవకాశాలున్నాయని మైనారిటీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఓవర్సీస్ స్కీం ఉపకార వేతనం కోసం కుటుంబ వార్షికాదాయ పరిమితి పెంచాలని మోహసిన్-ఏ-ఇన్సానియత్ ఫౌండేషన్ కార్యదర్శి బాల్కొండ రియాజ్ ఖాద్రి ప్రభుత్వాన్ని కోరారు. -
నిర్మించి నిరుపయోగం చేశారు..!
వివిధ డిగ్రీ కళాశాలల్లో వసతిగృహాలకు భవనాల నిర్మాణం మూడేళ్లయినా హాస్టల్స్ ఏర్పాటు చేయని అధికారులు నిరుపయోగంగా భవనాలు.. ప్రైవేట్ కార్యకలాపాలకు వినియోగం నిడదవోలు :జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల క్రితం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం నిర్మించిన వసతిగృహాల భవనాలు నిరుపయోగంగా మారాయి. లక్షల రూపాయలతో భవనాలను నిర్మించినా వాటిలో హాస్టల్స్ నిర్వహించకపోవడంతో అవి విద్యార్థులకు అక్కరకు రాకుండా పోయాయి. దీంతో ఆ భవనాలు ప్రైవేట్ వ్యక్తుల కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయి. వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2012లో నిధులు మంజూరు జిల్లాలో నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సంక్షేమ వసతి గృహాల నిర్వహించేందుకు భవనాల నిర్మాణానికి యూసీజీ నిధులు మంజూరు చేసింది. నిడదవోలు పట్టణంలో వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో రూ. 58.75 లక్షలతో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. కింద నాలుగు విశాలమైన గదులు, పై అంతస్తులో రెండు గదులతో పాటు డైనింగ్ హాలును నిర్మించారు. 2013లో అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ కళాశాలలో 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పట్టణ చుట్టుపక్కల 48 గ్రామాల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు ఈ కళాశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి హాస్టల్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావించారు. అయితే అప్పటి నుంచి భవనంలో హాస్టల్ ఏర్పాటు చేయలేదు. నిడదవోలు పట్టణ శివారున ఉన్న ఎస్వీఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా 2010లో యూజీసీ నిధులు రూ.20 లక్షల వ్యయంతో వసతిగృహం నిర్మించారు. కానీ ఇప్పటికి కూడా హాస్టల్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో.. ఇదే విధంగా జిల్లాలోని పాలకొల్లు దాసరి నారాయణరావు మహిళా డిగ్రీ కళాశాలలో రూ.60 లక్షలతో వసతి గృహ భవనం నిర్మించారు. ఇదే పట్టణంలోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.60 లక్షలతో నిర్మించిన వసతి గృహ భవనం కూడా నిరుపయోగంగా మారింది. తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, తాడేపల్లిగూడెం డీఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా నిర్మించిన హాస్టల్ భవనాలు నిరుపయోగంగానే మారాయి. దాదాపుగా ఈ భవనాలన్నింటిలో ప్రస్తుతం ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. భవనాలు ఖాళీగా ఉండడంతో యోగా, వ్యాయామం క్లాసులు, ఇతర కార్యక్రమాలకు వివిధ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. కనీసం తాళాలు కూడా వేయకపోవడంతో రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భవనాల కిటికీలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. అద్దె భవనాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్స్మరోవైపు ఇవే పట్టణాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండడం గమనార్హం. నిడదవోలు పట్టణంలో చాలా కాలం నుంచి ఎస్సీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఇంటర్ విద్యార్థుల వసతి గృహలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రాయిపేటలోని బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌ను 2008 నుంచి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, బీఈడీ విద్యార్థులు కూడా ఉంటున్నారు. నెలకు రూ.20 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. కనీసం ఆ హాస్టల్‌ను డిగ్రీ కళాశాలలో నిర్మించిన భవనానికి తరలిస్తే ప్రభుత్వానికి అద్దె మిగలడంతో పాటు కళాశాల విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని పట్టణ ప్రజలు సూచిస్తున్నారు. హాస్టల్ ప్రారంభించేందుకు చర్యలు కళాశాలలో మూడేళ్ల క్రితం యూజీసీ నిధులతో హాస్టల్ భవనం నిర్మించారు. ఏడాది క్రితం కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదాకు యూజీసీ అధికారులకు నివేదిక పంపించాం. అనుమతులు రాగానే హాస్టల్ ప్రారంభించేందుకు కృషి చేస్తాం. - డాక్టర్ ఎస్కే ఇమాంఖాసీం, ప్రిన్సిపల్, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, నిడదవోలు -
ఉపకారం
ఉపకార వేతనాల కోసం విద్యార్థుల అగచాట్లు అందని ధ్రువీకరణ పత్రాలు నేడు ముగియనున్న స్కాలర్షిప్ దరఖాస్తు గడువు నష్టపోనున్న వేలాది మంది విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యం వల్ల జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గత నెలలో భారీ వర్షాలకు తోడు చాలాచోట్ల ఆన్లైన్ ఇబ్బందులు, రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో మంజూరు కాలేదు. ఫలితంగా వేల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను అందివ్వలేకపోయా రు. శనివారంతో గడువు ముగుస్తుండడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు (గిరింపేట): పాలకుల అలక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలోని అర్హులైన వేల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఆన్లైన్ ఇబ్బందులు, రెవెన్యూశాఖ లోపాల వల్ల సర్టిఫికెట్లు మంజూరు కావడం ఆలస్యమౌతోంది. ఈ కారణంగా చాలామంది విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతో కళాశాల విద్యార్థుల కిచ్చే పోస్టుమెట్రిక్, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు నమో దుకోసం పడరానిపాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని రకాల ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు కనీసం 80 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు, డిప్లొమో విద్యార్థులు ఉపకార వేతనాల కోసం నవంబర్ మొదటి వారంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీరిలో ఇప్పటికీ 25 వేల మందికిపైగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. శనివారం ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటికే రెండుసార్లు గడువు పెంచిన నేపథ్యంలో మళ్లీ పెంచేందుకు ప్రభుత్వం సముఖంగా లేదు. దీనికితోడు ఇప్పటి వరకు డైట్ సెట్, ఎడ్‌సెట్, బీ-ఫార్మసీ ఇలా 10 సెట్ల వరకు కౌన్సెలింగ్ పూర్తిచేయకపోవడంతో చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేయాలో.. వద్దో అన్న సందేహంలో ఉన్నారు. ఈ పాపం సర్కారుదే.. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలంటూ ప్రభుత్వం షరతులు విధించింది. వాటిని జారీ చేయడంలో రెవెన్యూ శాఖ తీవ్ర ఆలస్యం చేస్తోంది. ఇక నవంబర్‌లో కురిసిన వర్షాలకు పదిరోజులకు పైగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వరద ఉద్ధృతికి విద్యార్థులు ఇంటి నుంచి భయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో అర్హులైన వారు సకాలంలో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారంతో గడవు ముగుస్తుండడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు మీ- సేవా, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. సర్టిఫికెట్ల కోసం అక్రమ వసూళ్లు నిబంధనల ప్రకారం మీ-సేవా కేంద్రాల్లో ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వద్ద రూ.35 మాత్రమే తీసుకోవాలి. కానీ చాలా చోట్ల రూ.100 వరకు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. -
ప్రవేశాలివ్వనప్పుడు కాలేజీలెందుకు?
- మైనారిటీ విద్యా సంస్థలనుద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: మైనారిటీ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వలేనప్పుడు కాలేజీలు మూసివేసుకోవడం మంచిదని మైనారిటీ విద్యా సంస్థలను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానిం చింది. మైనారిటీల కోసమంటూ ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది కాలేజీలు ఏర్పాటు చేస్తున్న మైనారిటీ విద్యాసంస్థలు చివరకు మైనారిటీయేతరులతో సీట్లు భర్తీ చేస్తుండటం తమకు విస్మయం కలిగిస్తోందని హైకోర్టు తెలి పింది. ఇలా చేయడం మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేయడమేనని స్పష్టం చేసింది. ఈ కేసులో ఎంబీఏ కన్వీనర్ వాదనలు విన్న తరువాతనే ఉత్తర్వులిస్తామంటూ కన్వీనర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి తమకు ఎంబీఏ కోర్సుకు జేఎన్టీయూ, హైదరాబాద్ అనుమతిని ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఖాదర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించింది. -
280 మందికి విదేశీ విద్యా భాగ్యం
మైనార్టీ విద్యార్థులకు సర్కారు సాయం ‘ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్టడీ స్కీం’ కింద విద్యార్థుల ఎంపిక ఉపకార వేతనాల కింద రూ.10 లక్షలు.. 233 దరఖాస్తుల తిరస్కరణ హైదరాబాద్: నిరుపేద మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్టడీ స్కీం’ కింద 280 మందికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ పథకం కింద వారికి విదేశాల్లో విద్యాభాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఉపకారవేతనం రూపంలో ఆర్థిక చేయూత అందించనుంది. 2015-16 విద్యాసంవత్సరానికి మొత్తం 513 మంది దరఖాస్తు చేసుకున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు జరుగుతుండటంతో ప్రభుత్వం హడావుడిగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఐదుగురు సభ్యులు గల రాష్ట్రస్థాయి స్క్రీనింగ్ కమిటీకి పంపారు. వీరు 280 దరఖాస్తులను ఆమోదించి, మరో 233 దరఖాస్తులను తిరస్కరించారు. కమిటీ తుది జాబితాను ప్రభుత్వానికి పంపింది. స్పష్టత లేని నిబంధనలు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్టడీ స్కీం నిబంధనలు గందరగోళంగా ఉన్నాయి. రెండుసార్లు సవరించిన వీసాపై స్పష్టత ఇవ్వలేదు. వీసా ఉన్నవారితో పాటు వీసాలేని వారు సైతం విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్క్రీనింగ్ కమిటీ సైతం అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జన పడింది. అభ్యర్థుల వయోపరిమితిని చివరి నిమిషంలో సవరించారు. తొలుత వయోపరిమితిని 30 ఏళ్ల లోపుగా ప్రకటించి, తిరిగి జూలైలో దీన్ని 35 ఏళ్లుగా సవరించారు. అదీగాక దరఖాస్తు చేసుకునేందుకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. పథకానికి విసృ్తత ప్రచారం లేకపోవడంతో అభ్యర్థులు చివరి క్షణంలో హడావుడిగా దరఖాస్తు చేసుకోవడంతో అనేక పొరపాట్లు దొర్లినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం 33 శాతం మహిళా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. -
సంక్షేమ హాస్టళ్లకు మంగళం!
50 నుంచి 65 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్ల ఎత్తివేతకు రంగం సిద్ధం తొలుత ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న వాటిపై దృష్టి 2015-16 విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం కడప రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తోంది. ఉన్న హాస్టళ్లను అభివృద్ధి చేయకుండా తక్కువ విద్యార్థులు ఉన్నారనే సాకుతో ఎత్తి వేయడానికి పావులు కదుపుతోంది. తొలుత ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లను ఎత్తి వేయడానికి సంకల్పించింది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 143 వసతి గృహాల్లో వంద హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా, 43 హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. నిధుల కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో ఎత్తివేయడానికి సంకల్పించింది. ఆ మేరకు 50 నుంచి 65 లోపు విద్యార్థులుండి.. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్ల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ శాఖ పరిధిలో మొత్తం 43 ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లలో కొనసాగుతుండగా, అందులో 17 హాస్టళ్లలో 50 నుంచి 65లోపు కంటే తక్కువగా విద్యార్థులున్నారు. మొత్తం 774 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ధ్రువీకరించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 60 హాస్టళ్లు ఉండగా, వాటిల్లో 4 హాస్టళ్లలో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నట్లు ధ్రువీకరించారు. గురుకుల పాఠశాలల్లోకి తరలిస్తారట! ఐదు నుంచి 10వ తరగతి విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలల్లో ఒక్కో తరగతిలో 10 మంది విద్యార్థులను చేర్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అక్కడ వసతులు ఉన్నాయా? లేవా? అనే వివరాలు కూడా సేకరించింది. గురుకుల పాఠశాలల్లో సీట్ల వివరాలను రాబట్టి 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆ ప్రకారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో తొలి దశలో 17 వసతి గృహాలను ఎత్తి వేయనున్నారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఇంకా నిర్ణయం వెలువడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేదా? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలను ఎత్తివేసి సమీపంలోని గురుకుల పాఠశాలల్లో ఆయా విద్యార్థులను చేర్పించి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేదని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకున్నట్లేనా.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటే ఆ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందించవచ్చుకదా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వివరాలు అడిగారు.. ప్రైవేటు భవనాల్లో నడుస్తూండి.. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న హాస్టళ్ల వివరాలను ప్రభుత్వం అడిగింది. అందుకు సంబంధించిన సమాచారం నివేదించాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. - పీఎస్ఏ ప్రసాద్, జాయింట్ డెరైక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ, వైఎస్సార్ జిల్లా. -
ఆ విద్యార్థులే ‘మైనారిటీ’..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీల్లో జరుగుతున్న అవకతవకలపై విద్యాశాఖ దృష్టి సారించింది. నిబంధనలను తుంగలో తొక్కి మైనారిటీయేతర విద్యార్థులకు సీట్లు అమ్ముకోవడం, మైనారిటీయేతర కోటాలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వంటి అక్రమాలను వెలికి తీయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులైన డీఎడ్, బీఎడ్, పండిత శిక్షణ కోర్సులను నిర్వహించే దాదాపు 100 మైనారిటీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు, విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. పేరుకే మైనారిటీ.. నిబంధనల ప్రకారం మైనారిటీ కాలేజీల్లో 70 శాతం సీట్లను మైనారిటీ వర్గాల విద్యార్థులకే ఇవ్వాలి. అది కూడా విద్యాశాఖ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల మెరిట్ ఆధారంగానే కేటాయించాలి. కానీ చాలా కాలేజీలు మైనారిటీ విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా, ఇతర విద్యార్థులకు సీట్లను అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం మెరిట్‌ను కూడా తుంగలో తొక్కుతున్నాయనే అభిప్రాయాలున్నాయి. అంతేగాకుండా 30 శాతం నాన్ మైనారిటీ కోటా సీట్ల భర్తీలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ఐదారేళ్లుగా తతంగం కొనసాగిస్తున్నా... విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, ముడుపులు పుచ్చుకొని మిన్నకుండిపోవడంతో అర్హులైన మైనారిటీ వర్గాల విద్యార్థులకు సీట్లు లభించడం లేదు. ‘హోదా’ పొందడంలోనే పక్కదారి! మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యావకాశాలు అందించేందుకు రాజ్యాంగం ‘మైనారిటీ కాలేజీ’లకు అవకాశం కల్పించింది. వాటికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మైనారిటీ హోదా ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించకపోయినా, నిరాకరించినా జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించి మైనారిటీ హోదా పొందే వీలుంది. అయితే చాలా కాలేజీలు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖను సంప్రదించకుండానే... శాఖ అధికారులు నిరాకరించారని పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేసి, జాతీయ కమిషన్ నుంచి సర్టిఫికెట్లు పొందుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు పదిహేనేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అయితే ఇటీవల డీఎడ్ కాలేజీల విషయంలో జాతీయ మైనారిటీ కమిషన్ సర్టిఫికెట్లను తీసుకోవడానికి విద్యాశాఖ నిరాకరించింది. కానీ వాటి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందాయి. దీంతో అసలు ఆ కాలేజీలకు మైనారిటీ హోదాను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఎప్పుడు తిరస్కరించింది? జాతీయ కమిషన్‌లో ఎప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు? అందులో ఏం చెప్పారన్న అంశాలను సేకరించేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. అంతేగాకుండా ఆ కాలేజీలు మైనారిటీయేతర విద్యార్థులకు కేటాయించిన సీట్ల వివరాలను కూడా తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
వక్ఫ్ భూముల కబ్జాపై విచారణ జరపండి: అక్బరుద్దీన్ ఒవైసీ
* ప్రభుత్వానికి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వినతి * కబ్జాదారులెవరో తేల్చండి * సభలో శ్వేతపత్రం పెట్టండి * మూసీ నదిని శుద్ధి చేయండి * మైనారిటీలకు గృహాలు నిర్మించండి సాక్షి, హైదరాబాద్: ఆక్రమణకు గురైన వేలాది ఎకరాల వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మైనారిటీ సంస్థలు, వక్ఫ్ ఆస్తులు ఎవరి కబ్జాలో ఉన్నాయో సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. వక్ఫ్ ఆస్తులపై శ్వేత పత్రం సమర్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల్లో 76 శాతం ఆక్రమణలోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం భూములు మొదలు బహుళ జాతి కంపెనీలకు ధారాదత్తం చేసిన భూములన్నీ వక్ఫ్‌కు చెందినవేనని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో భూసంస్కరణల పేరుతో జమీందార్లు, భూస్వాముల నుంచి వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వాలు వాటిని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టాయని... ముస్లిం నిరుపేదలకు ఒక్క ఎకరం భూమిని కూడా కేటాయించలేదని అన్నారు. హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూనే.. మూసీ నదిని కూడా శుద్ధి చేయాలని కోరారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రపంచంలోనే ఎత్తై భవనాలు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం.. హైదరాబాద్‌లో నిరుపేదలు తల దాచుకునేందుకు రెండు గదుల ఇళ్ల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాల బకాయిలకు సరిపడే నిధులను ఈ బడ్జెట్లో కేటాయించలేదని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఒక మైనారిటీ సభ్యుడిని నియమించాలని కోరారు. తొమ్మిది జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా పరిగణిస్తుంటే ఖమ్మం జిల్లాను ఎందుకు మినహాయించారని ప్రభుత్వాన్ని నిల దీశారు. మైనారిటీ సంక్షేమశాఖ, మైనారిటీ కమిషన్, వక్ఫ్ బోర్డుల విభజన ఇంకా జరగలేదని.. ఎప్పుడు జరుగుతుందో చెప్పాలని కోరారు. వక్ఫ్ భూములు కాపాడుతాం: మహమూద్ వక్ఫ్ ఆస్తులు.. ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని ఉపముఖ్యమంత్రి మ హమూద్ అలీ ప్రకటించారు. అక్బరుద్దీన్ ప్రసంగానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల బకాయి లు త్వరలోనే చెల్లిస్తామన్నారు. కాగా, అక్బర్ ప్రసంగం మధ్యలో స్పందించిన ఆర్థికశాఖ మంత్రి ఈటెల మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో మైనారిటీలను ఎన్నికల కోణంలోనే చూశారని, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. సీమాంధ్ర పాలకులకు ముస్లింల సంక్షేమం కనిపించలేదని, నిజాం నవాబు కూడబెట్టిన లక్షలాది ఎకరాల భూములు మాత్రమే కనిపించాయని అన్నారు. మైనారిటీ విభాగానికి రూ.1038 కోట్లు కేటాయించామని తెలిపారు. -
కష్టకాలం
పాలకుల నిర్లక్ష్యం పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కాక మైనార్టీ విద్యార్థుల చదువులకు భరోసా కరువైంది. అటు ప్రభుత్వం నుంచి ఫీజులు రాక.. ఇటు కళాశాల యాజమన్యాల ఒత్తిడి భరించలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కడప రూరల్: జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలో ఇంటర్మీడియేట్, ఆపై చదివే విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజులను చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు ఎప్పుడొస్తాయోనని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. 450 కళాశాలల్లో.... ఫీజుల పథకానికి అర్హులైన జిల్లాలోని మైనార్టీ వర్గానికి చెందిన నిరుపేదలు మొత్తం 450 కళాశాలల్లో 11945 మంది ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఇంటర్మీడియట్, ఆపై విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఫీజుల కింద ప్రభుత్వం ఆయా కళాశాలల యాజమాన్యాల ఖాతాలకు డబ్బును జమ చేయాల్సి ఉంటుంది. అయితే, 2012-13 విద్యా సంవత్సరంలో కొంతమందికి, 2013-14 విద్యా సంవత్సరంలో అందరికీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో ఆ విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మేరకు రూ. 11.05 కోట్లు విడుదాల కావాల్సి ఉండగా, ఇంతవరకు జమ కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. విద్యార్థులపై ఒత్తిళ్లు.. దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వం ఫీజులను చెల్లించకపోవడంతో విద్యార్థులపై కళాశాల యాజమాన్యాల ఒత్తిడి ఎక్కువైంది. ముఖ్యంగా రెన్యూవల్ విద్యార్థులకు ఫీజులు కట్టమని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఫీజులను చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. నిధులు రాని మాట వాస్తవమే జిల్లాలోని మైనార్టీ విద్యార్థులకు ఫీజు రాని విషయం వాస్తవమే. ఇందుకు సంబంధించి ఏవో సాంకేతిక కారణాలు ఉన్నట్లు తెలిసింది. త్వరలో బడ్జెట్ రాగానే ఫీజు మొత్తాన్ని విడుదల చేస్తాం. - ఖాదర్‌బాష, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి, కడప -
మైనారిటీ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం
హైదరాబాద్: రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్లైన్లో దర ఖాస్తులు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్ఏ సుకూర్ శుక్రవారం తెలిపారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం కొత్తవి, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి సెప్టెంబర్ 10 వ తేదీ గడువు అని, అదే రీతిలో పోస్టు మెట్రిక్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సెప్టెంబర్ 15న, రెన్యువల్స్ అయితే అక్టోబర్ 10వ తేదీ గడువుగా పేర్కొన్నారు. దరఖాస్తు విధానం, అర్హతలు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీఎస్ఎంఎఫ్సీ.కామ్‌లో ఉంటాయన్నారు. -
వైఎస్ఆర్తోనే ముస్లిం సంక్షేమం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: తమ సామాజిక వర్గానికి చెందిన వారికే లబ్ధి చేకూర్చే నాయకు లు రాజ్యమేలుతున్న రోజులవి. రుణం కావాలన్నా, పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా సిఫారుసు లేకపోతే పనిసాధ్యం కాని పరిస్థితులు. రాజకీయ అండలేని పేదలతో పాటు ముస్లిం వర్గాల వారు అంధకారంలో మగ్గిపోతున్న వేళ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి చుక్కానిలా, అందరి ఆత్మబంధువులా...ముఖ్యంగా ముస్లింకు అండగా నిలిచారు. తమ సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం తమను ఓటు బ్యాంకుగా పరిగణించే తరుణంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖరరెడ్డి తమను, తమ బిడ్డలను ఆదుకున్నారని ముస్లింలు పొంగిపోయారు. అయితే ఆయన మరణానంతరం తమ పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయని వాపోతున్నారు. తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ దఫా మైనార్టీల గణనను కూడా చేయకపోవడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 32వేల మంది మైనార్టీలు ఉన్నట్టు గుర్తించారు. 2014 వచ్చే సరికి 20 శాతానికి పైగా పెరిగారు. ఈ సంఖ్య ఇప్పుడు సుమారు 45 వేలకు పెరిగింది. చీకటి రోజులు... 2004 సంవత్సరానికి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లింలు అంధకారంలో మగ్గిపోయారు. ముస్లిం విద్యార్థులకు నిధుల మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించేది. నిధుల మంజూరును తగ్గించుకునేలా స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల వడపోత ఉండేది.దరఖాస్తు చేసినవారందరికి స్కాలర్షిప్లు మంజూరు చేసేవారుకాదు. స్కాలర్షిప్లను తాము పొందవచ్చనే విషయమే చాలా మందికి తెలిసేది కాదు. దీంతో ఫీజులు చెల్లించడానికి, ఇతర అవసరాలకు సొమ్ములేక చాలా మంది ముస్లిం పిల్లలు మధ్యలోనే చదువు మానేసేవారు. మహానేత హయాంలో... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2008 నుంచి నిధులను అధికంగా విడుదల చేయడమే కాకుండా, తమకూ పెద్ద చదువులు చదువుకునే హక్కు తమకుందని ముస్లింలలో ఆత్మస్థైర్యాన్ని ప్రోదిచేశారు. అంతవరకూ తమ పిల్లలను చదివించలేక, ఆడపిల్లలకు పెళ్లి చేయలేక తీవ్ర ఇబ్బందులు పడిన ముస్లింలు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో జీవితాలను బాగుచేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పిల్లలు చదువుబాటపట్టారు. అన్ని కళాశాలలు, పాఠశాలల్లో చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థులకు మంచి వసతిని ఏర్పాటు చేయడమేకాకుండా స్కాలర్షిప్పులు అందించారు. వైఎస్ మృతి చెందిన తరువాత కూడా దరఖాస్తులు వెల్లువలావచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి పోరాటాలు చేయడంతో తరువాత వచ్చిన పాలకులకు నిధులను విడుదల చేయక తప్పలేదు. -
బాబు డైరీ: ఆసరా అంతంతే..
ఇదీ తేడా! * మైనార్టీలకు కేవలం రూ.32కోట్ల బడ్జెట్ కేటాయించారు. * మైనార్టీ విద్యార్థులు ఇంటర్ విద్యను పూర్తి చేసిన అనంతరం పై చదువుల కోసం రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణాలు అందించేవారు. * దుకాన్-మకాన్ స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, ఇళ్ల నిర్మాణానికి 3 శాతం వడ్డీతో రుణాల పంపిణీ * వితంతువులు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు 3 శాతం వడ్డీతో రూ.పది వేల రుణాలు. * రోష్నీ పథకం ద్వారా వృత్తి పనివారికి 20 శాతం సబ్సీడీతో బ్యాంకు రుణాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ * మైనార్టీ పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థికసాయం కిరణ్ హయాం * మైనార్టీల కోసం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచారు. * మైనార్టీల బడ్జెట్‌ను రూ.1027 కోట్లకు పెంచారే కానీ 2014 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ 40 శాతం కూడా ఖర్చు చేయలేదు. * ఫీజు రీయింబర్స్మెంట్, ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం గత ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ ఇవ్వలేదు. * మాస్ మ్యారేజెస్ పథకాన్ని నీరుగార్చారు. సబ్సిడీ రుణాలదీ ఇదే స్థితి. వైఎస్ హయాం * బడ్జెట్ రూ. 350 కోట్ల వరకు పెంపుదల * పేద ముస్లింలకు రుణ మాఫీ * అర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రూ.30 వేల చొప్పున సబ్సిడీ రుణాలు * డోమువా పథకం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో నివసించే పేద ముస్లిం మహిళలకు సబ్సిడీ రుణాలు * నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ పథకం ద్వారా ముస్లిం పిల్లలకు విద్యా రుణాలు * స్కాలర్షిప్ పథకం ద్వారా ప్రతి ఏటా 3 లక్షల మంది ముస్లిం పిల్లలు విద్యావంతులవుతున్నారు. * ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి 4 శాతం రిజర్వేషన్ల కల్పన. దీనివల్ల లక్షల మంది విద్య, ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎదిగాయి. * ముస్లిం పేద అమ్మాయిల కోసం మాస్ మ్యారేజెస్ (సామూహిక వివాహాల) పథకాన్ని ప్రవేశ పెట్టారు. * కుటుంబ వార్షికాదాయం రూ. 80 వేల కంటే తక్కువగా ఉన్నవారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాల పంపిణీ * దీపం పథకం ద్వారా ముస్లిం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు * రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు కోసం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా ప్రత్యేక నిధుల కేటాయింపు. * మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఓపెన్ స్కూల్స్ ఏర్పాటు. * మదర్సాల్లో చదివే విద్యార్థుల కోసం కంప్యూటర్ల ఏర్పాటు * యువతకు ఐటీ,వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాల కల్పన. నాకు పునర్జన్మ లభించింది ఐస్‌ఫ్రూట్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అనుకోకుండా 2010 సంవత్సరంలో గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గుండె శస్త్ర చికిత్స చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన నా దగ్గర డబ్బులేని దుస్థితి. అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉండడంతో వెంటనే మలక్‌పేట్ యశోదా ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేశారు. నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆస్పత్రిలో ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇంటికి వచ్చేందుకు బస్సు చార్జీలు సైతం ఇచ్చారు. మళ్లీ ఏడాది కాలం పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు..వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారానే నాకు పునర్జన్మ లభించింది.. - మహమ్మద్ ఫజలుద్దీన్, జిరాయత్‌నగర్, ఆర్మూర్ మండలం,నిజామాబాద్ జిల్లా -
ఉపకారం ఊసేదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తోంది. విద్యాసంవత్సరం ఆరంభమై ఆర్నెల్లు కావస్తున్నా ఇప్పటికీ అధికారులు స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన నిధుల ఊసెత్త డం లేదు. సాధారణంగా ఈ సమయానికే దరఖాస్తుల పరిశీలన పూర్తికావాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఉదాసీన తతో ఇంకా దరఖాస్తుల ప్రక్రియే కొనసాగుతుండడం గ మనార్హం. ఈలెక్కన విద్యార్థులకు ఇప్పట్లో ఉపకారవేతనాలు అందడం కష్టమేనని స్పష్టమవుతోంది. ‘పరిశీలన’ ప్రహసనమే.. ఉపకారవేతనాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన తర్వాతే నిధులు మంజూరు చేస్తారు. ఇందుకుగాను పాఠశాల స్థాయినుంచి సంక్షేమ అధికారుల వరకు అంచలంచెలుగా ఈ ప్రక్రియ సాగుతుంది. దాదాపు మూడు దశల్లో దరఖాస్తులను పరిశీలిస్తారు. రాష్ట్రంలోనే అధికంగా మన జిల్లాలో వివిధ కాలేజీలున్నాయి. దాదాపు 1,057 జూనియర్, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కాలేజీలున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీటి పరిధిలో ఇప్పటివరకు 1.85 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలంటే కనిష్టంగా రెండు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ మొదలే కాలేదు. ఈనెలాఖరు నాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే అవకాశముందని సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టినా.. విద్యాసంవత్సరం ముగిసేనాటికి కూడా ఉపకారవేతనాలు అందేలా లేవు. బడిపిల్లలకూ ‘ఉపకారం’ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కూడా ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఉపకారవేతనాలు పంపిణీ చేస్తోంది. 5 నుంచి 10తరగతి చదివే ఎస్సీ విద్యార్థులు, 9,10 తరగతులు చదివే ఎస్టీ, బీసీ విద్యార్థులు, 1నుంచి 10 వరకు చదివే మైనార్టీ విద్యార్థులు ఈ ఉపకారవేతనాలకు అర్హులు. ఇంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ప్రచారం చేపట్టడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. గడువు ముగియడంతో ఇటీవల చాలా మంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు నోచుకోలేదు. అదేవిధంగా అవగాహన కల్పించడంలో విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సైతం దరఖాస్తుకు దూరంగానే ఉన్నారు. తాజాగా పాఠశాల విద్యార్థులకు కూడా ఉపకారవేతనాల పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా సంక్షేమశాఖ అధికారులపైనే ఉండడంతో వారిపై మరింత ఒత్తిడి పెరగనుందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కేటగిరీల వారీగా కేటగిరీ ఫ్రెషర్ రెన్యూవల్ ఎస్సీ 5893 22108 ఎస్టీ 2167 8500 బీసీ 22606 75782 ఈబీసీ 3972 26584 మైనార్టీ 4337 13500 -
మైనారిటీ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పంపిణీ చేసే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఈ నెల 25వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ అహ్మద్‌నదీమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉర్దూ వర్సిటీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా కేంద్రం విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల20 ఆఖరు తేదీగా నిర్ణయించారు. -
మైనార్టీ వసతిగృహంలో ‘ఆకలి కేకలు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైనారిటీ విద్యార్థులు సంకటంలో పడ్డారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. సర్కారు నెలవారీగా విడుదల చేసే మెస్ చార్జీల బిల్లులు ఏడాది కాలంగా పేరుకుపోవడంతో విద్యార్థులు తిండి కోసం వీధిన పడ్డారు. జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ సమీపంలో పోస్టుమెట్రిక్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ఈ వసతి గృహంలో వసతి కలిస్తారు. ఇలా వసతి పొందే విద్యార్థులకు ప్రతి నెల మెస్ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి రూ.1050 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏడాదిగా మెస్ చార్జీలు లేవ్.. బండ్లగూడలోని మెనార్టీ వసతి గృహంలోని 50 మందికి వసతి కల్పించే సదుపాయం ఉంది. ఈ విద్యార్థులకు ఏడాది కాలంగా మెస్ చార్జీలు అందడంలేదు. సాధారణంగా నెలవారీగా విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లిస్తేనే.. వాటితో నెలకు సరిపడా సరుకులు తెచ్చుకోవడం.. వంట చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏడాది కాలంగా ఈ విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లించకపోవడంతో స్నేహితుల వద్ద భోజనం చేయడమో.. లేక పస్తులు ఉండాల్సివస్తోందని షాకీర్ అనే విద్యార్థి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు రూ. 3.6 లక్షలు.. మైనార్టీ వసతి గృహంలోని విద్యార్థులకు ఏడాది కాలంగా మెస్ చార్జీలు ఇవ్వకపోవడంతో బకాయిలు రూ. 3.6 లక్షలకు చేరాయి. మరోవైపు వసతిగృహంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది 50 మంది విద్యార్థుల్లో 15 ఖాళీలు ఏర్పడినా.. కొత్త విద్యార్థులను చేర్చుకునే పరిస్థితి లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ స్విచ్ఆఫ్ రావడం గమనార్హం.