సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో మైనారిటీ వర్గాలకు చెందిన ఐదు కోట్ల మంది విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రీ మెట్రిక్, మెట్రిక్ అనంతర, వృత్తి, సాంకేతిక విద్యను అభ్యసించే మైనారిటీ విద్యార్ధులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను అందిస్తుందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వెల్లడించారు.
మైనారిటీ విద్యార్ధినీ, విద్యార్ధుల్లో సామాజికార్ధిక, విద్యా సాధికారత కోసం పలు స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వారికి అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధినులకు పది లక్షల బేగం హజరత్ మహల్ బాలికా స్కాలర్‌షిప్‌లను ఇస్తామని తెలిపారు. సమ్మిళిత వృద్ధిని సాధించే క్రమంలో మైనారిటీ విద్యార్దినీ విద్యార్ధులకు భారీస్ధాయిలో ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment