BJP Meet To Pick Its Vice President Candidate | PM Modi - Sakshi
Sakshi News home page

బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు!

Published Sat, Jul 16 2022 4:33 PM | Last Updated on Sat, Jul 16 2022 6:24 PM

BJP Meet To Pick Its Vice President Candidate - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ప్రచార హడావిడి దాదాపుగా ముగియవస్తుండడంతో.. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. ఈ మేరకు శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. 

ఉపరాష్ట్రపతి రేసులో మాజీ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ , నజ్మా హెప్తుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement