Muktar abbash nakvi
-
బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ప్రచార హడావిడి దాదాపుగా ముగియవస్తుండడంతో.. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి రేసులో మాజీ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ , నజ్మా హెప్తుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు. -
బీజేపీలో చేరిన విఠల్
సాక్షి, ఢిల్లీ: టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, ఉమ్మడి ఏపీలో ఎన్జీవో నేత సీహెచ్ విఠల్ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి.. విఠల్‌కు కండువా కప్పి, ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ పుష్పగుచ్చం అందించి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. చదవండి: బీజేపీపై సంచలన ఆరోపణలు: కేబినెట్ బెర్త్, డబ్బు ఇస్తామన్నారు! విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ భావాలున్న ఆయన మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు. టీఆర్ఎస్ ఏర్పడక ముందు నుంచే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకం విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని గళమెత్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా గతేడాది దాకా పనిచేసిన విషయం తెలిసిందే. -
నవంబర్ 26 నుంచి హైదరాబాద్‌లో హున్నార్ హాట్
సాక్షి, న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌లో హున్నార్ హాట్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. నవంబరు 26 నుంచి డిసెంబరు 5 వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న హున్నార్ హాట్లో ఆంధ్రప్రదేశ్ సహా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 700 మంది కళాకారులు, చేతివృత్తుల నిపుణులు పాల్గొంటారని వెల్లడించారు. -
భారత్‌పై ఓఐసీ విమర్శలు... నఖ్వీ స్పందన
న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలపై వివక్షను రూపుమాపి వారి హక్కులు కాపాడాలంటూ ఇస్లామిక్ దేశాల సమాఖ్య(ఓఐసీ) భారత్‌కు విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఇస్లామోఫోబియా పెంచడాన్ని కట్టడి చేయాలని కోరింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఓఐసీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ముస్లింలకు భారత్ స్వర్గధామమని... సామాజికంగా, ఆర్థికంగా, మతపరమైన విషయాల్లో తమ హక్కులకు వచ్చిన ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు.(లాక్డౌన్ ఎగ్జిట్: మంత్రుల సమావేశం!) ‘‘భారత ముస్లింలు ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించే వారెవరూ వారికి స్నేహితులు కాబోరు’’ అని వ్యాఖ్యానించారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మీడియా ఉద్దేశపూర్వకంగానే ముస్లింలపై వివక్ష ప్రదర్శిస్తూ దుష్ప్రచారం చేస్తోందంటూ ఓఐసీ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. ఇక భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే సాకుగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాగ్యుద్దానికి దిగిన విషయం తెలిసిందే.(భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం) -
గాడ్సే లాంటి వాళ్లను తయారుచేయం
రాంపూర్: వివాదాలతో నిత్యం సావాసం చేసే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజామ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మదర్సాలు నాథురాం గాడ్సే, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వంటి వారిని తయారుచేయబోవని వ్యాఖ్యానించారు. మదర్సాలను ప్రధాన (మెయిన్‌స్ట్రీమ్) విద్యావ్యవస్థతో అనుసంధానం చేస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆజామ్ ఖాన్ స్పందించారు. గాంధీని చంపిన నాథురాం గాడ్సే స్వభావం కలిగిన వారిని, మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వంటి వ్యక్తిత్వం కలిగిన వారిని మదర్సాలు తయారుచేయడం లేదన్నారు. ముస్లింలకు నాణ్యమైన విద్యను అందించే మదర్సాలకు కేంద్రం నిజంగా సహాయం చేయదలిస్తే వాటిని మెరుగుపరచాలని సూచించారు. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో పాటు ఆధ్యాత్మిక విలువలు, విజ్ఞాన అంశాలను మదర్సాలు బోధిస్తున్నాయని తెలిపారు. మదర్సాలకు భవనాలు, ఫర్నిచర్, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను అందించే కేంద్రాలుగా మదర్సాలను గుర్తించాలన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న మదర్సాలను సాధారణ, ప్రధాన విద్యా కేంద్రాలతో కలుపుతామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ప్రకటించారు. మదర్సాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సబ్జెక్టులో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని ట్విటర్లో నఖ్వీ వెల్లడించారు. మదర్సాలను మెరుగపరిచేందుకు 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ ‘ఒక చేతిలో ఖురాన్ మరో చేతిలో కంప్యూటర్’ ఉండాలి అనే నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. -
విద్యార్ధులకు భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో మైనారిటీ వర్గాలకు చెందిన ఐదు కోట్ల మంది విద్యార్ధులకు స్కాలర్షిప్లు అందచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రీ మెట్రిక్, మెట్రిక్ అనంతర, వృత్తి, సాంకేతిక విద్యను అభ్యసించే మైనారిటీ విద్యార్ధులకు ప్రభుత్వం స్కాలర్షిప్లను అందిస్తుందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వెల్లడించారు. మైనారిటీ విద్యార్ధినీ, విద్యార్ధుల్లో సామాజికార్ధిక, విద్యా సాధికారత కోసం పలు స్కాలర్షిప్లను ప్రభుత్వం వారికి అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధినులకు పది లక్షల బేగం హజరత్ మహల్ బాలికా స్కాలర్షిప్లను ఇస్తామని తెలిపారు. సమ్మిళిత వృద్ధిని సాధించే క్రమంలో మైనారిటీ విద్యార్దినీ విద్యార్ధులకు భారీస్ధాయిలో ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. -
కొత్త మిత్రుల కోసం బీజేపీ వేట..
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఇబ్బందికరమేనని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అంగీకరించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అవసరమైతే కొత్త మిత్రుల వైపు దృష్టిసారిస్తామన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహరి వాజ్‌పేయి హయాం నుంచే కూటమి భాగస్వామ్య పక్షాలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తున్న విషయం ప్రస్తావించారు. తాము సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి ఉంటామని, అందుకే భాగస్వామ్య పక్షాలు తమతోనే ఉండాలని కోరుకుంటామన్నారు. కొత్త భాగస్వామ్య పార్టీల కోసం అన్వేషిస్తామని..కూటమిలో ఎవరికీ ప్రవేశం లేదనే బోర్డు పెట్టలేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ నుంచి ఇటీవల వైదొలిగిన పార్టీలు సైతం తిరిగి కూటమిలోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీ, మహారాస్ర్ట సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమిపై ఆయన స్పందిస్తూ ఉప ఎన్నికల్లో ఓటమి తమపై ప్రభావం చూపబోదని తాను చెబితే అది పొరపాటు అవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. తమకు వ్యతిరేకంగా పలు పార్టీల అపవిత్ర కలయికలను దీటుగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ఫలితాలు తమకు ఉపకరిస్తాయని అన్నారు. యుద్ధరంగంలో ప్రత్యర్థుల వ్యూహాలు, ఎత్తుగడలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుత ఫలితాలు తమకు భవిష్యత్ వ్యూహాలు రూపొందించుకునే క్రమంలో ఉపయోగపడతాని వ్యాఖ్యానించారు. దేశంలో రైతాంగ సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనపై స్పందిస్తూ అన్నారు. -
శాంతి, సామరస్యాలు దేశ సైద్ధాంతిక మూలాలు: మోదీ
జైపూర్: శాంతి, సామరస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన అజ్మీర్‌లోని సూఫీ మతగురువు హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. ప్రధాని తరఫున కేంద్ర మైనా రిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాను సందర్శించి, చాదర్ ను సమర్పించారు. 806వ వార్షిక ఉర్సు సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనుచరులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శాంతి, సామ రస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలు. సూఫీయిజం కూడా భారతీయ తత్వమే. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నంగా సూఫీ తత్వ వేత్త ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ నిలుస్తారు’ అని మోదీ ఆ సందేశంలో పేర్కొన్నారు. -
దోషులను కచ్చితంగా శిక్షించాల్సిందే: నఖ్వీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. హైదరాబాద్ వర్శిటీలో ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దోషులను కచ్చితంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని విమర్శించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయను లక్ష్యం చేసుకోవడం సరికాదన్నారు.