న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలపై వివక్షను రూపుమాపి వారి హక్కులు కాపాడాలంటూ ఇస్లామిక్ దేశాల సమాఖ్య(ఓఐసీ) భారత్‌కు విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఇస్లామోఫోబియా పెంచడాన్ని కట్టడి చేయాలని కోరింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఓఐసీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ముస్లింలకు భారత్ స్వర్గధామమని... సామాజికంగా, ఆర్థికంగా, మతపరమైన విషయాల్లో తమ హక్కులకు వచ్చిన ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు.(లాక్‌డౌన్ ఎగ్జిట్: మంత్రుల సమావేశం!)
‘‘భారత ముస్లింలు ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించే వారెవరూ వారికి స్నేహితులు కాబోరు’’ అని వ్యాఖ్యానించారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మీడియా ఉద్దేశపూర్వకంగానే ముస్లింలపై వివక్ష ప్రదర్శిస్తూ దుష్ప్రచారం చేస్తోందంటూ ఓఐసీ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. ఇక భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే సాకుగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాగ్యుద్దానికి దిగిన విషయం తెలిసిందే.(భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం)
Comments
Please login to add a commentAdd a comment