OIC
-
ఐరాసలో పెరగనున్న పాక్ ప్రభావం
లోక్‌సభ ఎన్నికల హడావిడిలో ఈ వార్త అంతగా దృష్టిలో పడలేదుగానీ, భద్రతా మండలిలో రెండేళ్ల కాలానికి పాకిస్తాన్ ఎన్నిక కావడం భారత్ పట్టించుకోవాల్సిన అంశమే. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదు సభ్యదేశాలు భద్రతా మండలిలో ఉండటమూ పాక్‌కు కలిసొచ్చేదే. కశ్మీర్‌పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి అది ప్రయత్నించవచ్చు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత ఐరాస ఎజెండాలో కీలకమైంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాక్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని చర్చలోకి తేగలదు. ఒక భారతీయుడిని ఐరాస నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కూడా పాక్ ప్రయత్నించవచ్చు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి పాకిస్తాన్ ఇటీవల ఎన్నికైన విషయాన్ని, భారత్‌లో విస్తృతంగా నివేదించి ఉంటే, అది భారతీయులను కలవరపరిచి ఉండేది. భారత్ లోక్‌సభ ఎన్నికల్లో కూరుకుపోవడంతో, ఐక్యరాజ్య సమితి అత్యున్నత కమిటీలో పాకిస్తాన్ స్థానం గురించిన వార్తలకు దేశంలో పెద్దగా స్పందన లభించలేదు. ఐరాసలోని 193 సభ్య దేశాలలో 182 పాకిస్తా¯Œ కు అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎన్నిక, మూడవ దఫా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి పెద్ద సవాలుగా మారనుంది.2025 జనవరి 1న భద్రతామండలిలో రెండేళ్ల కాలానికి చేరనున్న పాకిస్తాన్, సోమాలియాల ఎంపికతో ఐక్యరాజ్యసమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్’కు చెందిన ఐదు సభ్యదేశాలు ఉంటాయి. మొత్తం ప్రపంచం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే నిర్ణయాలు చేసే ఏకైక ఐరాస సంస్థ అయిన భద్రతామండలి ఎన్నుకున్న సభ్యుల సంఖ్యలో ఇది సగం. అటువంటి నిర్ణయాలను మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీటో ద్వారా తిరస్కరించవచ్చన్నది మరొక విషయం. ఈ సభ్యదేశాలనే పి–5 లేదా బిగ్ ఫైవ్ అంటారు. ఇప్పుడు ఇస్లామాబాద్‌కు ఐరాస భద్రతామండలి తలుపులు తెరిచినంత మాత్రాన, భారత్ ఏదైనా దౌత్యపరమైన ముప్పును ఎదుర్కొంటుందని అర్థం కాదు. ప్రమాదం ఉండదు, కానీ సవాలు మాత్రం ఉంటుంది. అందువల్ల, భారత్ నిశ్చింతగా ఉండకూడదు. న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి పదవి ఖాళీగా ఉంది. పాకిస్తాన్ తరఫున గత ఐదేళ్లుగా ఈ పదవిని నిర్వహిస్తున్న మునీర్ అక్రమ్ ఒక ఘోరమైన రాయబారి. ఆయన అంతకుముందు కూడా 2002 నుండి ఆరేళ్ల పాటు అదే పదవిలో ఉన్నారు. 1994లో ఐరాస మానవ హక్కుల సంఘం ఎజెండాలో కశ్మీర్‌ను చేర్చడంలో అక్రమ్ రహస్య దౌత్యం దాదాపుగా విజయం సాధించింది. మరుసటి సంవత్సరం, ఆయన అధికారికంగా జెనీవాలో ఐరాస శాశ్వత ప్రతినిధిగా నియమితులవడమే కాకుండా ఏడేళ్లు ఈ పదవిలో కొనసాగారు. కాబట్టి, లోక్‌సభ ఎన్నికల ప్రచారం మధ్యలో పదవీ విరమణ చేసిన భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్థానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలి.వచ్చే ఏడాది ద్వైవార్షిక సమీక్ష కోసం కౌంటర్ టెర్రరిజం డాక్యుమెంట్ ఐక్యరాజ్యసమితి వద్దకు తిరిగి వస్తుంది. ఈ సమీక్షలోని పాఠం సరిహద్దు ఉగ్రవాద బాధితురాలిగా భారత్‌కు ముఖ్యమైనది. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని రాజ్య విధాన సాధనంగా ఉపయోగించిన పాకిస్తాన్ వంటి మొండి రాజ్యాల కారణంగా, ఉగ్రవాదానికి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రూపొందించలేకపోయారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆ సమావేశంలో సోమాలియాది కూడా సందేహాస్పద వైఖరి కావడంతో, జనరల్ అసెంబ్లీపై ఈ రెండు దేశాల ప్రభావమూ పడుతుంది. అదే సమయంలో భారత్ మరో ప్రమాదం నుంచి తనను కాపాడుకోవలసి ఉంది. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదుగురు భద్రతా మండలి సభ్యులు ఒక భారతీయుడిని ఐక్యరాజ్యసమితి నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కలిసి పని చేసే అవకాశం ఉంది. వాళ్లు కచ్చితంగా భద్రతా మండలి ప్రసిద్ధ తీర్మానం 1267 ప్రకారం, ఒక హిందువును ఉగ్రవాది జాబితాలో చేరడాన్ని చూడాలనుకుంటారు. 1999లో ఆమోదం పొందిన ఈ తీర్మానం ప్రకారం, ఉగ్రవాది జాబితాలో చేరిన అపఖ్యాతి ఒసామా బిన్ లాడెన్‌ది. న్యూఢిల్లీలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం ఈ విషయంలో ఓఐసీకి మేత అవగలదనే చెప్పాలి. అయితే 2024లోనూ, వచ్చే ఏడాదిలోనూ మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం భారత్‌లో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఇది చాలావరకు ఆధారపడి ఉంటుంది.1267 తీర్మానంతో ఏర్పాటు చేసిన ఆంక్షల కమిటీ ద్వారా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చడంలో అమెరికాతో కలిసి పనిచేసిన భారత్ సఫలీకృతమైంది. ఆ ఘటన పాక్ రాయబారి అక్రమ్‌ను ఇప్పటికీ గాయపరుస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు మక్కీయే కారణమని ఆ తీర్మానం ఇచ్చిన వివరణ పాక్ బాధను మరింత పెంచింది. ఈ మక్కీ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు స్వయానా బావ.రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత, భద్రతా మండలిలో పాకిస్తాన్ ‘సంప్రదింపులు’ మాత్రమే చేయగలిగింది. ఇటువంటి ప్రక్రియ మండలి సభ్యుల మధ్య అంతర్గత చర్చలను సూచిస్తుంది. ఈ చర్చల గురించి బహిరంగంగా ఎటువంటి రికార్డూ ఉండదు. ఇప్పుడు పాక్ భద్రతా మండలిలోకి ప్రవేశించిన తర్వాత, మిగతా ఓఐసీ సభ్యదేశాల మద్దతుతో కశ్మీర్‌పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. అవి ‘బహిరంగ సంప్రదింపుల’ ద్వారా జరిగే అవకాశం ఉంది. అంటే వాటి గురించి మీడియాకు, ప్రజలకు తెలియజేస్తారని అర్థం. సందర్భానుసారంగా ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ కూడా ఆ చర్చల గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు. భారత్ దృక్కోణం నుండి ప్రమాదం ఏమిటంటే, ఇటువంటి జిత్తులు కొనసాగుతున్నప్పుడు కశ్మీర్ సమస్యపై ఐరాస పూర్తి దృష్టి పడుతుంది. అయినప్పటికీ భద్రతా మండలిలో వీటో కలిగివున్న పి–5 దేశాలపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.15 మంది సభ్యులతో కూడిన భద్రతామండలి పనికి ఆటంకం కలగకుండా గతంలో భారత్, పాక్ సహజీవనం చేశాయి. రెండు దేశాలూ చివరిసారిగా 2012లో కలిసి పనిచేశాయి. కానీ తర్వాతరెండు విషయాలు మారిపోయాయి. ఐరాసలో అప్పటి పాకిస్తాన్ మిషన్ కు ‘డాన్’ మీడియా గ్రూప్‌ను కలిగి ఉన్న హరూన్ కుటుంబానికి చెందిన హుస్సేన్ హరూన్ నాయకత్వం వహించారు. ఆయన చాలామంది పాకిస్తాన్ కెరీర్ దౌత్యవేత్తల మాదిరిగా కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ నోరు జారలేదు. రెండవ మార్పు ఏమిటంటే, అప్పట్లో 2012లో ప్రపంచం చాలా భిన్నమైనదిగానూ, తక్కువ సంక్లిష్టమైనదిగానూ ఉండేది.ఇటీవలి సంవత్సరాలలో ఐరాసలో దురదృష్టవశాత్తు ప్రత్యర్థులు, శత్రువుల మధ్య రహస్య, బహిరంగ ఘర్షణకు అవకాశాలు పెరిగాయి. అందువల్ల, భారత్‌తో తన ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ కు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత అనేది ఐరాస ఎజెండాలో కీలకంగా ఉంది. వివాదాలను పరిష్కరించడానికి సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని గట్టిగా చర్చలోకి తీసుకురాగలదు. వారు తమ కుతంత్రాలలో విజయం సాధించకపోవచ్చు కానీ ఇస్లామాబాద్ ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండిపోదు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికలలో యూరప్ మితవాదం వైపు దూసుకెళ్లిన తర్వాత, ఐరాస చర్చల్లో ఇస్లామోఫోబియా కూడా ఎక్కువగా ఉంటుంది. భద్రతా మండలిలో ఓఐసీ దౌత్యవేత్తల సంఖ్య పెరగడం వారికి దేవుడిచ్చిన వరం. ఐక్యరాజ్యసమితిలో తన ప్రయోజనాలను ముందుకు తీసుకురావడానికి పాకిస్తాన్ దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.- వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- కేపీ నాయర్ -
గాజా సంక్షోభం.. ఇస్లామిక్ దేశాల ఎమర్జెన్సీ మీటింగ్
జెద్దా: ఇజ్రాయెల్-గాజా యుద్ధం నేపథ్యంలో.. అత్యవసరంగా భేటీ కావాలని ఇస్లామిక్ దేశాలకుThe Organisation of Islamic Cooperation పిలుపు వెళ్లింది. ఇస్లామిక్ సదస్సుకు ప్రస్తుతం ఆతిథ్యం ఇస్తున్న సౌదీ అరేబియాలోనే బుధవారం(అక్టోబర్ 18వ తేదీన) ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో.. ఈ భేటీని అత్యవసర అసాధారణ సమావేశంగా అభివర్ణించాయి జెడ్డా వర్గాలు. గాజా సంక్షోభం ప్రధానంగా ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ చర్చించనుంది. ఇజ్రాయెల్ బలగాల మోహరింపు ఎక్కువవుతుండడం.. గాజా అమాయకుల ప్రాణాల రక్షణపైనా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఐసీ.. ఐక్యరాజ్య సమితి తర్వాత రెండో అతిపెద్ద సంస్థ. నాలుగు ఖండాల్లో.. 57 దేశాలకు OICలో సభ్యత్వం ఉంది. ఇస్లాం ప్రపంచ సంయుక్త గళంగా తనను తాను అభివర్ణించుకుంటుంది OIC. మరోవైపు.. ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా తన సంబంధాలను సాధారణీకరించడం కోసం చర్చలను నిలిపివేసిన రోజునే.. OIC అత్యవసర సమావేశ పిలుపు రావడం గమనార్హం. -
ఓఐసీ ప్రకటనపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత్ అంతర్గత వ్యవహారాలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. శ్రీ రామ నవమి సందర్భంగా జరిగిన ఘర్షణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఓఐసీ. అయితే.. దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వాళ్ల కమ్యూనల్ మైండ్‌సెట్(మతపరమైన ఆలోచనాధోరణికి) ఇది మరో ఉదాహరణ అని, భారత్ వ్యతిరేక ఎజెండాను ఆ దేశాలు మరోసారి బయటపెట్టాయని భారత్ మండిపడింది. భారత్ అంతర్గత వ్యవహారాలలో ఓఐసీ జోక్యం అక్కర్లేని అంశమని భారత్ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా ముస్లింలు లక్ష్యంగా హింస, విధ్వంసం చోటుచేసుకున్నాయని ఒక ప్రకటనలో ఆరోపించింది. అధికారులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారత్‌లో ముస్లింల భద్రతకు, హక్కులకు భరోసా ఇవ్వాలని ఓఐసీ తన ప్రకటనలో భారత్‌ను డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే.. భారత్ తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య జనరల్ సెక్రటేరియెట్ పేరిట రిలీజ్ అయిన ప్రకటనను, బాగ్చీ ఖండించారు. అలాగే జమ్ము కశ్మీర్ అంశంలోనూ ఓఐసీ(ఇందులో పాక్ కూడా ఉంది) జోక్యాన్ని అవసరమైన అంశంగా తేల్చారు ఆయన. -
విమర్శలు-సమన్లు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు త్రీవస్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు ఆయా దేశాలు తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేస్తుండగా.. ఐవోసీ ఘాటు వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జెడ్డా వేదికగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (IOC) ‘‘భారతదేశంలో ఇస్లాం పట్ల ద్వేషం, విమర్శలు, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాలు తేటతెల్లం అయ్యాయి’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దరిమిలా భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా స్పందించారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, సంకుచిత భావంతో కూడుకుని ఉన్నాయంటూ వ్యాఖ్యానించారాయన. అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగానే చూస్తుందని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. ఐవోసీలో ఇస్లాం ఆధిపత్య దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయన్నది తెలిసిందే. తమది ఇస్లాం ప్రపంచ సంయుక్త గొంతుక అని ప్రకటించుకుంటుంది ఆ వేదిక. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఐవోసీ జోక్యం చేసుకోవడం, ఆ జోక్యాన్ని భారత్ ఖండిస్తూ వస్తుండడం జరుగుతోంది. తాజాగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఐవోసీకి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. దూషణపూరితమైన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసినవని, అది భారత ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు బాగ్చీ. వ్యాఖ్యలు చేసిన శర్మ, జిందాల్‌లపై తొలగింపు వేటు కూడా పడిందన్న విషయాన్ని బాగ్చీ గుర్తు చేస్తున్నారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. టీవీ డిబెట్లో బీజేపీ మాజీ ప్రతినిధులు మహమద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూపుర్ శర్మ కామెంట్లు అవమానకరరీతిలో ఉన్నాయని, అన్ని మతాలను.. విశ్వాసాలను గౌరవించాలని అంటున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాగం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది. మరోవైపు దోహాలోని భారత దౌత్యవేత్తకు అక్కడి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తక్షణ ఖండన, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఖతర్. ఇక కువైట్ కూడా ఖతర్లాగే భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంకోవైపు ఇరాక్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది. దేశంలో వరుసగా జరుగుతున్న మత విద్వేష ఘర్షణలు, జ్ఞానవాపి మసీదు చర్చ సందర్భంగా ఓ టీవీ డిబేట్లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. మహమద్ ప్రవక్తను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్ సైతం ప్రవక్త మీద ఓ ట్వీట్ చేసి.. అది విమర్శలకు దారి తీయడంతో వెంటనే డిలీట్ చేసేశారు. ఈ పరిణామాల తర్వాత కాన్పూర్(యూపీ) శుక్రవారం ప్రార్థనల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి పలువురు గాయపడ్డారు. నుపూర్, నవీన్ చేష్టల వల్లే ఇదంతా జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తగా.. బీజేపీ సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. సౌదీ అరేబియా, బహ్రైన్‌తో పాటు మరికొన్ని దేశాలు సైతం భారత ఉత్పత్తులను సూపర్మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. చదవండి: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ -
యాసిన్ మాలిక్ తీర్పుపై విమర్శా?.. భారత్ కౌంటర్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు.. కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చింది.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై ఇస్లామిక్ దేశాల కూటమి (OIC-IPHRC) మానవహక్కుల విభాగం ప్రతికూలంగా స్పందించింది. యాసిన్ మాలిక్ శిక్ష విషయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఐవోసీ మానవ హక్కుల విభాగం పేర్కొంది. యాసిన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోనివ్వకుండా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసిందంటూ వ్యాఖ్యానించింది. అయితే ఓఐసీ ఇలా విమర్శలు గుప్పించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌ను కోరింది. ప్రపంచం ఉగ్రవాద ముప్పు నుంచి భారత్ భద్రతను కోరుకుంటోందని పేర్కొంది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ... మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదని ఓఐసీకు హితవు పలికారు. మాలిక్‌కు జీవితఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. అటు వంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘‘యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై భారత్‌ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం.. ఈ వ్యాఖ్యల ద్వారా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ విభాగం పరోక్షంగా మద్దతునిచ్చింది.. ఆధారాలను డాక్యుమెంట్ చేసి కోర్టులో సమర్పించారు.. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని కోరుతోంది.. దానిని ఏ విధంగానూ సమర్థించవద్దని మేము ఓఐసీ కోరుతున్నాం’’అని వ్యాఖ్యానించారు. చదవండి: Yasin Malik: యాసిన్‌కు మరణశిక్ష ఎందుకు వేయలేదు! -
భారత్‌పై ఓఐసీ విమర్శలు... నఖ్వీ స్పందన
న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలపై వివక్షను రూపుమాపి వారి హక్కులు కాపాడాలంటూ ఇస్లామిక్ దేశాల సమాఖ్య(ఓఐసీ) భారత్‌కు విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఇస్లామోఫోబియా పెంచడాన్ని కట్టడి చేయాలని కోరింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఓఐసీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ముస్లింలకు భారత్ స్వర్గధామమని... సామాజికంగా, ఆర్థికంగా, మతపరమైన విషయాల్లో తమ హక్కులకు వచ్చిన ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు.(లాక్డౌన్ ఎగ్జిట్: మంత్రుల సమావేశం!) ‘‘భారత ముస్లింలు ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించే వారెవరూ వారికి స్నేహితులు కాబోరు’’ అని వ్యాఖ్యానించారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మీడియా ఉద్దేశపూర్వకంగానే ముస్లింలపై వివక్ష ప్రదర్శిస్తూ దుష్ప్రచారం చేస్తోందంటూ ఓఐసీ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. ఇక భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే సాకుగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాగ్యుద్దానికి దిగిన విషయం తెలిసిందే.(భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం) -
సౌదీ రాజును అవమానపరిచిన ఇమ్రాన్!
-
సౌదీ రాజును అవమానపరిచిన ఇమ్రాన్!
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విపరితమైన విమర్శలు వస్తున్నాయి. ఆయన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ ప్రొటోకాల్‌ను కూడా ఉల్లఘించారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత వారం సౌదీ ప్రభుత్వం మక్కాలో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరైన ఇమ్రాన్ సౌదీ రాజు వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు. అనంతరం వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. సౌదీ రాజుతో పక్కనే ట్రాన్స్‌లేటర్ ఇమ్రాన్ చెప్పే సందేశాన్ని ఆయనకు వివరిస్తున్నారు. అయితే చివర్లో ఇమ్రాన్ చెప్పిన మాటలు ట్రాన్స్‌లేటర్ రాజుకు వివరించలోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సౌదీ రాజుతో మాట్లాడేటప్పుడు ఇమ్రాన్ బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇమ్రాన్ ప్రవర్తన కారణంగా ఆ తర్వాత సౌదీ, పాక్‌ల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిందని పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. 57 దేశాలు సభ్యత్వం ఉన్న ఓఐసీ ప్రపంచంలోని ముస్లింల కోసం పనిచేస్తున్నట్టు ప్రకటించుకుంది. -
ఓఐసీ సదస్సుకు పాకిస్తాన్ డుమ్మా
-
ఓఐసీ సదస్సులో తొలిసారి భారత గళం
-
భారత్ రాకతో పాక్ డుమ్మా..!
అబుదాబి: భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ రాకతో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) నిర్వహించిన విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. సమావేశంలో సుష్మా పుల్వామా ఉగ్రదాడిని లేవనెత్తారు. పాకిస్తాన్ బెదిరింపులకు భయపడేది లేదని.. ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల పాటు దుబాయ్‌లో జరునున్న ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. పుల్వామా దాడితో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దోషిగా తేలిందని సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెట్రేగిపోతోందని, దాన్ని నిలువరించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకు శాంతికి దారి చూపే మార్గంగా భారత్ ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం కారణంగా ఎన్నో దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేసే పోరాటానికి భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. (సుష్మా వస్తే మేం రాం : పాక్) పాకిస్తాన్ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆ దేశంపై సుష్మా మండిపడ్డారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘ఉగ్రవాదులు చేస్తున్న దారుణాల వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు.. వెంటనే దాన్ని నిలిపివేయాలి. అన్ని దేశాలు కలిసి కట్టుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. మతానికి వ్యతిరేంగా ఏ పోరాటం ఉండదు, మన పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే ఉండాలి. మహాత్మాగాంధీ నడయాడిన ప్రదేశం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. భారత్ ఎల్లప్పుడూ బహుళత్వాన్ని అనుసరిస్తుంది. మానవత్వాన్ని కాపాడాలనుకుంటే.. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం నిలిపివేయాలి’ అని పేర్కొన్నారు. -
సుష్మా వస్తే మేం రాం : పాక్
ఇస్లామాబాద్ : అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) నిర్వహించనున్న విదేశాంగ మంత్రుల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ తెలిపారు. మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఓఐసీ సమావేశానికి భారత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. అయితే మంగళవారం నాటి భారత్ మెరుపు దాడులకు నిరసనగా ఖురేషీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఖురేషి మాట్లాడుతూ.. ‘యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడాను. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశానికి హాజరవుతుండడంపై అభ్యంతరాలను వారికి వివరించాను’ అని తెలిపారు. ఐఓసీలో దాదాపు 57 సభ్యదేశాలు ఉన్నాయి. అయితే గతంలో అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని చర్చించడం పై భారత్ అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ విషయంలో ఓఐసీ మొదటి నుంచి పాక్‌కు సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. (ఓఐసీ సదస్సుకు భారత్) -
ఓఐసీ సదస్సుకు భారత్
న్యూఢిల్లీ: ముస్లిం ప్రధాన దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలని భారత్‌ను యూఏఈ ఆహ్వానించింది. మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఓఐసీ సమావేశానికి భారత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. భారత్‌లో నివసిస్తున్న సుమారు 18 కోట్ల మంది ముస్లింలు, దేశ బహుళత్వం, వైవిధ్య పరిరక్షణలో వారి పాత్రను గుర్తిస్తూ ఓఐసీ ఈ ఆహ్వానం పంపింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌ను ఏకాకిని చేయాలని భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కశ్మీర్ విషయంలో ఓఐసీ మొదటి నుంచి పాక్ వైపే మాట్లాడుతోంది. ఐఓసీలో సభ్యురాలిగా చేరేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను పాక్ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఐఓసీ భారత్‌ను ఆహ్వానించడం చరిత్రాత్మకమని మాజీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్ అన్నారు. సంబరపడొద్దు: కాంగ్రెస్ ఓఐసీ ఆహ్వానాన్ని మన్నించి భారత్ సంబరపడటం సరికాదని కాంగ్రెస్ సూచించింది. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇదొక విఫల ప్రయత్నమని పేర్కొంది. భారత్‌ను పూర్తిస్థాయి సభ్యురాలిగా చేర్చుకునేంత వరకు ఓఐసీ సమావేశాలకు హాజరుకావొద్దని గతంలో నిర్దేశించుకున్న వైఖరిని ప్రభుత్వం కొనసాగించాలని కోరింది. -
కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో భారత్‌లో అంతర్భాగమని.. అందులో ఎటువంటి సందేహం లేదని భారత విదేశాంగ శాఖ శనివారం మరోసారి స్పష్టం చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (ఓఐసీ) గత వారంలో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ అటు ఓఐసీ, పాకిస్తాన్‌కు సూటిగా సమాధానమిచ్చింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. మా దేశానికి సంబందించిన అంతర్గత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఒక వేళ అలా జోక్యం చేసుకుంటే తగిన సమాధానం చెబుతామని ప్రకటించింది. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సమాజాన్ని పక్కదోవ పట్టించేలా ఓఐసీ వ్యాఖ్యలు ఉన్నాయని.. సమితిలో భారత కార్యదర్శిగా పనిచేస్తున్న సుమిత్ సేథ్ చెప్పారు. ఓఐసీ వ్యాఖ్యలను భారత్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. ఓఐసీ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఖరాఖండీగా చెప్పారు. ఎల్ఓసీ వద్ద నిత్యం కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్‌కు.. సైన్యం బుద్ధి చెబుతోందని అన్నారు.