జెద్దా: ఇజ్రాయెల్-గాజా యుద్ధం నేపథ్యంలో.. అత్యవసరంగా భేటీ కావాలని ఇస్లామిక్ దేశాలకుThe Organisation of Islamic Cooperation పిలుపు వెళ్లింది. ఇస్లామిక్ సదస్సుకు ప్రస్తుతం ఆతిథ్యం ఇస్తున్న సౌదీ అరేబియాలోనే బుధవారం(అక్టోబర్ 18వ తేదీన) ఈ సమావేశం జరగనుంది.
ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో.. ఈ భేటీని అత్యవసర అసాధారణ సమావేశంగా అభివర్ణించాయి జెడ్డా వర్గాలు. గాజా సంక్షోభం ప్రధానంగా ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ చర్చించనుంది. ఇజ్రాయెల్ బలగాల మోహరింపు ఎక్కువవుతుండడం.. గాజా అమాయకుల ప్రాణాల రక్షణపైనా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓఐసీ.. ఐక్యరాజ్య సమితి తర్వాత రెండో అతిపెద్ద సంస్థ. నాలుగు ఖండాల్లో.. 57 దేశాలకు OICలో సభ్యత్వం ఉంది. ఇస్లాం ప్రపంచ సంయుక్త గళంగా తనను తాను అభివర్ణించుకుంటుంది OIC. మరోవైపు.. ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా తన సంబంధాలను సాధారణీకరించడం కోసం చర్చలను నిలిపివేసిన రోజునే.. OIC అత్యవసర సమావేశ పిలుపు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment