jeddah
-
IPL 2025: మెగా వేలం వేదిక మార్పు..?
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం, వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. తొలుత మెగా వేలాన్ని సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే తాజాగా వేదికను జెద్దా నగరానికి మార్చినట్లు సమాచారం. అబేది అల్ జోహార్ అరీనా (బెంచ్‌మార్క్ అరీనా) మెగా వేలానికి వేదిక కానున్నట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఫ్రాంచైజీ ప్రముఖులకు వసతి ఏర్పాట్లను అబేది అల్ జోహార్ అరీనా సమీపంలో గల హోటల్ షాంగ్రీ-లాలో సిద్దం చేసినట్లు తెలుస్తుంది. వేలం తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరుగనుందని సమాచారం.కాగా, వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే కావడం విశేషం. ఈ సారి మెగా వేలానికి మొత్తం 1574 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో 1165 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 409 మంది విదేశీ ఆటగాళ్లని సమాచారం. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకుని వదిలేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా..పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుశశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లుపంజాబ్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుశిఖర్ ధవన్ (కెప్టెన్)రిలీ రొస్సోహర్ప్రీత్ సింగ్ భాటియాశివమ్ సింగ్అధర్వ తైడేఅశుతోష్ శర్మవిశ్వనాథ్ సింగ్సికందర్ రజాసామ్ కర్రన్క్రిస్ వోక్స్రిషి ధవన్తనయ్ త్యాగరాజన్జానీ బెయిర్స్టోజితేశ్ శర్మరాహుల్ చాహర్విధ్వత్ కావేరప్పహర్షల్ పటేల్నాథన్ ఎల్లిస్అర్షదీప్ సింగ్ప్రిన్స్ చౌదరీహర్ప్రీత్ బ్రార్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుపాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ఆటగాళ్లుగ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చులక్నో సూపర్ జెయింట్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లునికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్ వదిలేసిన ఆటగాళ్లుప్రేరక్ మన్కడ్దేవ్దత్ పడిక్కల్కైల్ మేయర్స్కృనాల్ పాండ్యామార్కస్ స్టోయినిస్అర్షిన్ కులకర్ణిదీపక్ హుడాఆస్టన్ అగర్కృష్ణప్ప గౌతమ్క్వింటన్ డికాక్కేఎల్ రాహుల్ (కెప్టెన్)మణిమారన్ సిద్దార్థ్యుద్ద్వీర్సింగ్ చరక్నవీన్ ఉల్ హక్యశ్ ఠాకూర్షమార్ జోసఫ్అమిత్ మిశ్రాఅర్షద్ ఖాన్మ్యాట్ హెన్రీవేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్‌రైడర్స్ ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లురింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుకోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసిన ఆటగాళ్లుమనీశ్ పాండేనితీశ్ రాణాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)సకీబ్ హుసేన్షెర్ఫాన్ రూథర్ఫోర్డ్వెంకటేశ్ అయ్యర్అనుకుల్ రాయ్అంగ్క్రిష్ రఘువంశీరహ్మానుల్లా గుర్భాజ్శ్రీకర్ భరత్వైభవ్ అరోరాసుయాశ్ శర్మచేతన్ సకారియామిచెల్ స్టార్క్దుష్మంత చమీరాఅల్లా ఘజన్ఫర్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం లేదుఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ఆటగాళ్లురికీ భుయ్యశ్ ధుల్డేవిడ్ వార్నర్పృథ్వీ షాజేక్ ఫ్రేసర్ మెక్గుర్క్స్వస్తిక్ చికారలలిత్ యాదవ్సుమిత్ కుమార్గుల్బదిన్ నైబ్షాయ్ హోప్కుమార్ కుషాగ్రారిషబ్ పంత్ (కెప్టెన్)ఇషాంత్ శర్మజై రిచర్డ్సన్రసిఖ్ దార్ సలామ్విక్కీ ఓస్త్వాల్ఖలీల్ అహ్మద్ముకేశ్ కుమార్అన్రిచ్ నోర్జేప్రవీణ్ దూబేలిజాడ్ విలియమ్స్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ఆటగాళ్లుసుయాశ్ ప్రభుదేశాయ్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్మహిపాల్ లోమ్రార్మనోజ్ భండగేసౌరవ్ చౌహాన్స్వప్నిల్ సింగ్టామ్ కర్రన్అనూజ్ రావత్కర్ణ్ శర్మవిజయ్కుమార్ వైశాఖ్అల్జరీ జోసఫ్రాజన్ కుమార్మయాంక్ డాగర్లోకీ ఫెర్గూసన్మొహమ్మద్ సిరాజ్హిమాన్షు శర్మఆకాశ్దీప్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లుమతీశ పతిరణ- రూ. 13 కోట్లుశివమ్ దూబే- రూ. 12 కోట్లురవీంద్ర జడేజా- రూ. 18 కోట్లుఎంఎస్ ధోని- రూ. 4 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుఅజింక్య రహానేషేక్ రషీద్సమీర్ రిజ్విడారిల్ మిచెల్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రనిషాంత్ సంధుమిచెల్ సాంట్నర్అరవెల్లి అవనీశ్అజయ్ జాదవ్ మండల్హంగేర్కర్ముకేశ్ చౌదరీప్రశాంత్ సోలంకిశార్దూల్ ఠాకూర్సిమ్రన్జీత్ సింగ్తుషార్ దేశ్పాండేమహీశ్ తీక్షణరిచర్డ్ గ్లీసన్దీపక్ చాహర్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుజస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లుసూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లుహార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లురోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లుతిలక్ వర్మ- రూ. 8 కోట్లుముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లుటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్నేహల్ వధేరానమన్ ధిర్శివాలిక్ శర్మషమ్స్ ములానీశ్రేయస్ గోపాల్రొమారియో షెపర్డ్కుమార్ కార్తీకేయమొహమ్మద్ నబీఅర్జున్ టెండూల్కర్ఇషాన్ కిషన్హార్విక్ దేశాయ్పియూశ్ చావ్లాఅన్షుల్ కంబోజ్గెరాల్డ్ కొయెట్జీఆకాశ్ మధ్వాల్నువాన్ తుషారక్వేనా మపాకాలూక్ వుడ్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుగుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురషీద్ ఖాన్- రూ. 18 కోట్లుశుభ్మన్ గిల్- రూ. 16.5 కోట్లుసాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లురాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లుషారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లుగుజరాత్ టైటాన్స్ వదిలేసిన ఆటగాళ్లుడేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్అభినవ్ మనోహర్విజయ్ శంకర్అజ్మతుల్లా ఒమర్జాయ్వృద్దిమాన్ సాహామాథ్యూ వేడ్శరత్ బీఆర్కార్తీక్ త్యాగినూర్ అహ్మద్రవిశ్రీనివాసన్ సాయి కిషోర్జాషువ లిటిల్స్పెన్సర్ జాన్సన్మొహిత్ శర్మదర్శన్ నల్కండేజయంత్ యాదవ్ఉమేశ్ యాదవ్సందీప్ వారియర్మారవ్ సుతార్గుర్నూర్ బ్రార్పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చురాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..సంజూ శాంసన్- రూ. 18 కోట్లుయశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లురియాన్ పరాగ్- రూ. 14 కోట్లుదృవ్ జురెల్- రూ. 14 కోట్లుషిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లుసందీప్ శర్మ- రూ. 4 కోట్లురాజస్థాన్ రాయల్స్ వదిలేసిన ఆటగాళ్లు..రోవ్‌మన్ పొవెల్శుభమ్ దూబేతనుశ్ కోటియన్రవిచంద్రన్ అశ్విన్డొనొవన్ ఫెరియెరాకునాల్ సింగ్ రాథోర్టామ్ కొహ్లెర్-కాడ్మోర్ఆవేశ్ ఖాన్ట్రెంట్ బౌల్ట్నవ్దీప్ సైనీనండ్రే బర్గర్యుజ్వేంద్ర చహల్కుల్దీప్ సేన్ ఆబిద్ ముస్తాక్కేశవ్ మహారాజ్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు -
గాజా సంక్షోభం.. ఇస్లామిక్ దేశాల ఎమర్జెన్సీ మీటింగ్
జెద్దా: ఇజ్రాయెల్-గాజా యుద్ధం నేపథ్యంలో.. అత్యవసరంగా భేటీ కావాలని ఇస్లామిక్ దేశాలకుThe Organisation of Islamic Cooperation పిలుపు వెళ్లింది. ఇస్లామిక్ సదస్సుకు ప్రస్తుతం ఆతిథ్యం ఇస్తున్న సౌదీ అరేబియాలోనే బుధవారం(అక్టోబర్ 18వ తేదీన) ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో.. ఈ భేటీని అత్యవసర అసాధారణ సమావేశంగా అభివర్ణించాయి జెడ్డా వర్గాలు. గాజా సంక్షోభం ప్రధానంగా ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ చర్చించనుంది. ఇజ్రాయెల్ బలగాల మోహరింపు ఎక్కువవుతుండడం.. గాజా అమాయకుల ప్రాణాల రక్షణపైనా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఐసీ.. ఐక్యరాజ్య సమితి తర్వాత రెండో అతిపెద్ద సంస్థ. నాలుగు ఖండాల్లో.. 57 దేశాలకు OICలో సభ్యత్వం ఉంది. ఇస్లాం ప్రపంచ సంయుక్త గళంగా తనను తాను అభివర్ణించుకుంటుంది OIC. మరోవైపు.. ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా తన సంబంధాలను సాధారణీకరించడం కోసం చర్చలను నిలిపివేసిన రోజునే.. OIC అత్యవసర సమావేశ పిలుపు రావడం గమనార్హం. -
భర్త మృతదేహం కోసం న్యాయపోరాటం
మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణలోని గల్ఫ్ ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు అండగా నిలబడింది. ఫోరం కార్యకర్తల చొరవతో సౌదీ అరేబియాలో పూడ్చిపెట్టిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని అంజూశర్మ అనే మహిళ న్యాయపోరాటం చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి.. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంజీవ్‌కుమార్ (49) 23 సంవత్సరాల నుంచి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. అయితే గుండెపోటు రావడంతో ఆయన జనవరి 24న సౌదీలోని భీష్ జనరల్ ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ విషయాన్ని సంజీవ్‌కుమార్ పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, తన భర్త మృతదేహాన్ని ఇంటికి పంపించాలని అంజూశర్మ వేడుకుంది. అయితే జెద్దాలోని భారత కాన్సులేట్ కార్యాలయంలోని ట్రాన్స్‌లేటర్ చేసిన తప్పిదం వల్ల సంజీవ్‌కుమార్‌ను ముస్లింగా భావించి ఆ మత సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 18న పూడ్చిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని సంజీవ్‌కుమార్ భార్య అంజూశర్మకు జెద్దాలోని మన విదేశాంగ శాఖ కార్యాలయం తెలియజేసింది. అంతేకాక తమ ట్రాన్స్‌లేటర్ పొరపాటుకు విదేశాంగ శాఖ అధికారులు క్షమాపణలు కోరారు. సంజీవ్‌కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సంజీవ్‌కుమార్‌కు సన్నిహితుడైన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌కు చెందిన ఎనుగందుల గణేశ్ ఈ విషయాన్ని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం చైర్మన్ మంద భీంరెడ్డికి వివరించారు. దీనికి స్పందించిన భీంరెడ్డి, అంజూశర్మను సంప్రదించారు. ఆమె తన భర్త మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని భీంరెడ్డిని వేడుకుంది. ఈ క్రమంలో భీంరెడ్డి చొరవతో ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఎలా అంత్యక్రియలను నిర్వహిస్తారని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి, గురువారం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని విదేశాంగ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే జెద్దాలోని మన విదేశాంగ శాఖకు కూడా నోటీసులు పంపించారు. ఈ విషయంలో ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం చొరవను కార్మిక సంఘాలు అభినందిస్తున్నాయి. -
సౌదీలో ఆ దాడి చేసింది భారతీయుడే!
రియాద్ : సౌదీ అరేబియాలోని జెడ్డా ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఆత్మాహుతి దాడికి పాల్పడింది భారతీయుడేనని సౌదీ ప్రభుత్వం నిర్ధారించింది. 2016 జూలై 4 వ తేదీన సౌదీలోని మూడు ప్రాంతాల్లో నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ దాడుల్లో భాగంగా సౌదీ పశ్చిమ ప్రాంతంలోని యూఎస్ కాన్సులేట్ వెలుపల ఆత్మహుతి దాడి జరిపింది భారతీయుడైన ఫయాజ్ కాగ్జీ అని ఆరోపణలు వచ్చాయి. దీంతో సౌదీ అధికారులు ఆ దాడి దృశ్యాలను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు పంపి.. నిందితుడి వివరాలు పంపాల్సిందిగా కోరారు. దీంతో ఎన్ఐఏ ఆదేశాలతో మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు కాగ్జీ డీఎన్ఏ నమూనాలను 2017లో సౌదీ అధికారులకు అందజేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి డీఎన్ఏతో ఇది సరిపోలడంతో.. ఆ దాడికి పాల్పడింది కాగ్జీనే అని సోమవారం సౌదీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన కాగ్జీ 2006లో పాకిస్తాన్‌కు వెళ్లి.. అక్కడ లష్కరే తోయిబాలో చేరి పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. 2006లో జౌరంగాబాద్ అక్రమ ఆయుధాల రవాణా కేసులో కాగ్జీ ప్రధాన నిందితుడు. అలాగే 26/11 ముంబై దాడులకు కాగ్జీనే సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. -
సౌదీలో ప్రవాసుల వద్దకే దౌత్య సేవలు
జిద్దా : సౌదీ అరేబియాలో జిద్దాలోని ఇండియన్ కాన్సులేట్ సిబ్బంది ఈనెల 11న నజరాన్, అభా పట్టణాలలో ఉదయం 8 నుండి సాయంత్రం 7 వరకు ప్రవాస భారతీయులను కలుసుకోనున్నారు. ఎన్ఆర్ఐలు పాస్ పోర్ట్, దౌత్య సంబంధ సేవలు, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవొచ్చు. వివరాలకు సౌదీలోని 017-5221919 నెంబరుకు లేదా హైదరాబాద్ లోని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ హెల్ప్ లైన్ నెంబర్ +91 81435 88886 లలో సంప్రదించవచ్చని ఆ సంస్థ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
సౌదీ ప్రిన్స్‌కు కొరడా దెబ్బలు, జైలు
జెడ్డా: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఉండదంటారు. అయితే ఆ దెబ్బలు తినేవాడు సాక్షాత్తూ యువరాజైతే? రాజరిక వ్యవస్థలో అసలిలాంటి తీర్పును ఊహించగలమా? కానీ జరిగింది అదే. కోపంలో ఒకరిని కాల్చి చంపాడన్న కారణంగా యువరాజుకు మరణశిక్ష విధించిన సౌదీ అరేబియా రాజు.. తప్పు చేసిన మరో యువరాజును కూడా తీవ్రంగా శిక్షించాడు. వివరాల్లోకి వెళితే.. అల్ సౌద్ రాజవంశీకుల పాలనతో ఉన్న సౌదీ అరేబియాకు ప్రస్తుతం సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ రాజుగా కొనసాగుతున్నారు. పెద్ద కుటుంబం కావడంతో యువరాజుల సంఖ్య కూడా ఎక్కువే. ఆ యువరాజుల్లో ఒకరైన తుర్కీ బిన్ సౌద్ అల్ కబీర్.. ఓ వ్యక్తిని చంపిన కారణంగా మరణశిక్షకు గురయ్యాడు. ఇటీవలే చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ సంగతి మర్చిపోకముందే మరో యువరాజుకు సౌదీ రాజప్రసాదం కఠిన శిక్ష విధించింది. ( సౌదీ ప్రిన్స్‌కు మరణశిక్ష ) నేరం చేసినందుకుగానూ యువరాజును సోమవారం జెడ్డాలోని జైలులో కొరడాలతో చితకబాతి, ఓ గదిలో పడేశారు. ఆ యువరాజు చేసిన నేరం ఏమిటనేదిమాత్రం ఇంకా వెల్లడికాలేదు. శిక్ష తాలూకు వివరాలు మాత్రేమే సౌదీ న్యాయశాఖ వెల్లడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. కనీసం రెండువారాలపాటు అతను జైలులో ఉంటాడని తెలిపింది. రాజు తలుచుకుంటే యువరాజుకూ దెబ్బలు తప్పలేదు! -
తాజ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ప్రవాసీ తెలుగు సంఘమైన తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్దా) ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న తెలుగు ప్రవాసీయులను అభినందిస్తూ పురస్కరించారు. తెలుగు భాష వ్యాప్తి కొరకు ప్రవాసీయులకు సాఫ్ట్‌వేర్‌ను ఉచింతగా అందించిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ సయీదోద్దీన్ను ఈ కార్యక్రమంలో సన్మానించారు. అక్కడి పాఠశాలలో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల కొరకు తెలుగు భాషను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన వారిని కూడ ఈ సందర్భంగా తాజ్ సత్కరించింది. సౌదీ అరేబియాలో తెలుగు భాష వ్యాప్తి కొరకు తాజ్ చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు మోహమ్మద్ యూసుఫ్ వివరించారు. కుల, మత మరియు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తెలుగు ప్రవాసీయుల కొరకు తాజ్ కృషి చేస్తున్నదని ప్రధాన కార్యదర్శి మేడికొండు భాస్కర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వహీద్, శ్రీ లక్ష్మిలు పాడిన గేయాలు అలరించాయి. చిన్నారి సాయి దీక్షిత సాంప్రదాయ నృత్యం, తెలుగు ప్రముఖులను అనుకరిస్తూ చిన్నారుల వేషధారణలు సభికులను ఆకట్టుకున్నాయి. -
జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
-
జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ తెలుగు కార్మికులు ఉండే కంటెయినర్లు మొత్తం తగలబడిపోయాయి. ప్రధానంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయానికి ఎక్కువ మంది విధులకు వెళ్లడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలోనే ప్రమాదం సంభవించింది. ఆ సమయానికి చాలామంది వెళ్లిపోయినా, కొంతమంది మాత్రం ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం వల్ల దాదాపు పది లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఈ ప్రమాదం గురించి అశోక్ అనే బాధితుడు 'సాక్షి'తో జెడ్డా నుంచి ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలివీ.. 'మూడు నాలుగు కంటెయినర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అవి ఇక ఏమాత్రం పనికిరావు. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కొంతమంది మాత్రం నిద్రిస్తున్నారు. చాలామంది ఉద్యోగాలకు వెళ్లారు. అక్కడ సుమారు 200-250 మంది తెలుగువాళ్లు ఉన్నారు. ప్రాణనష్టం లేకపోయినా, గదులలో ఉన్న డబ్బులు, బియ్యం, వస్తువులు అన్నీ పూర్తిగా దగ్ధం అయిపోయాయి. అసలే కంపెనీ నుంచి జీతాలు కూడా సరిగా రాని ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో సర్వస్వం కోల్పోయాం'. -
దేశం కాని దేశంలో.. చంపి, తగలబెట్టాడు!!
ఇద్దరూ దేశం కాని దేశం వెళ్లారు. ఒకే దేశం నుంచి వెళ్లామన్న సొంత భావన కూడా లేకుండా కొట్టి చంపడమే కాక, మృతదేహాన్ని కూడా కాల్చేశాడో భారతీయుడు. ఈ దారుణం దుబాయ్‌లో జరిగింది. అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడి వివరాలు ఇంకా తెలియలేదు. అతడు మాత్రం తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు, బాధితుడు వేర్వేరు ఉద్యోగాలు చేస్తారని, తన ఇంటికి పిలిచి మరీ అతడిని హత్యచేశాడని పోలీసులు చెప్పారు. అతడి ఇంటి మేడమీద బాగా కాలిపోయి ఉన్న మృతదేహం పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులకు లభ్యమైంది. ఎప్పుడో ఇద్దరి మధ్య జరిగిన గొడవను మనసులో పెట్టుకుని, చంపే ఉద్దేశంతోనే పిలిచాడని పోలీసు ప్రతినిధి నవాఫ్ అల్ బౌక్ తెలిపారు. ముందుగా తాను అతడిని ఇనుప రాడ్‌తో పదే పదే తలమీద కొట్టానని, చనిపోయిన తర్వాత మేడ మీదకు తీసుకెళ్లి తగలబెట్టానని నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు. మృతదేహాన్ని గుర్తుపట్టడం కూడా ఎవరికీ సాధ్యం కావట్లేదు. అయితే నేరం జరిగిన 24 గంటల్లోగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.