Vice Presidential Election
-
రాజ్యాంగ పీఠంపై న్యాయ కోవిదుడు
దేశ 14వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖడ్ వృత్తి రీత్యా లాయర్. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్‌ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం. రాజస్తాన్‌లోని ఝుంఝును జిల్లాలో కిథానా అనే కుగ్రామంలో జాట్ల కుటుంబంలో 1951 మే 18న ధన్‌ఖడ్ జన్మించారు. చదువులో చురుగ్గా ఉండేవారు. చిత్తోర్‌గఢ్ సైనిక స్కూలులో మెరిట్ స్కాలర్‌షిప్‌తో ప్రాథమిక విద్య, జైపూర్ మహారాజా కాలేజీలో డిగ్రీ చేశారు. ఎల్ఎల్బీ పూర్తయ్యాక రాజస్తాన్ బార్ కౌన్సిల్లో 1979లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1990లో సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టి మంచి గుర్తింపు సంపాదించారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయ్యేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. సైనిక స్కూల్ చిన్నప్పట్నుంచే క్రమశిక్షణ నేర్పింది. రాజ్యాంగం, చట్టాలు, సెక్షన్లు కొట్టిన పిండి. దేవీలాల్ అడుగు జాడల్లో యువకుడిగా ఉండగానే ధన్‌ఖడ్ జనతాదళ్‌లో చేరారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ వ్యవస్థాపకుడు దేవీలాల్ అడుగుజాడల్లో నడిచారు. ఆయన ఆశీస్సులతో 1989లో ఝుంఝును నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాటి వీపీ సింగ్ సర్కార్ నుంచి దేవీలాల్ బయటికొచ్చినప్పుడు ధన్‌ఖడ్ ఆయన వెంటే నడిచారు. చంద్రశేఖర్ కేబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చేశారు. పీవీ నరసింహారావు హయాంలో ఆయన విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు. రాజస్తాన్ కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లాట్ హవా పెరుగుతూండటంతో 2003లో బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీలో వసుంధర రాజెకు దగ్గరయ్యారు. కానీ రాజకీయంగా పెద్దగా ఎదగలేదు. పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు లాయర్‌గా మంచి పేరు సంపాదించారు. 2019 జులైలో పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జాట్ల నేత కావడం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఆయన్ను ఎంచుకోవడంలో కీలకంగా నిలిచింది. లాయర్‌గా లోతైన పరిజ్ఞానం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా అనుభవం అదనపు అర్హతలు మారాయి. ఎన్డీఏకు ఇంకా పూర్తి మెజారిటీ లేని రాజ్యసభలో త్వరలో కీలక బిల్లుల ఆమోదం ఉన్నందున న్యాయ, పాలనా, రాజ్యాంగపరంగా లోతుపాతులు తెలిసిన వ్యక్తి చైర్మన్‌గా ఉండనుండటం బీజేపీకి ఊరటే. ప్రయాణాలంటే ఇష్టం జగదీప్ భార్య సుదేశ్ సామాజిక కార్యకర్త. ఆర్థికశాస్త్రంలో పీజీ చేశారు. కుమార్తె కామ్నా సుప్రీంకోర్టు లాయర్ కార్తికేయ వాజపేయిని పెళ్లి చేసుకున్నారు. ధన్‌ఖడ్‌కు క్రికెట్, ప్రయాణాలు చాలా ఇష్టం. దేశ విదేశాలు విపరీతంగా తిరిగారు. కుటుంబంతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతి ముర్ము మాదిరిగానే ఆయన కూడా ఆధ్యాత్మిక బాటలో ఉన్నారు. రూ.4 లక్షల వేతనం ఉపరాష్ట్రపతి రాజ్యాంగపరంగా దేశంలో రెండో అత్యున్నత పదవి. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. నెలకు రూ.4 లక్షల అందుతుంది. ఇతర భత్యాలు, అలవెన్సులు లోక్‌సభ స్పీకర్‌తో సమానంగా ఉంటాయి. ఉచిత బంగ్లా, ఉచిత వైద్యం, విమానాలు, రైళ్లలో ఉచిత ప్రయాణాలు, ల్యాండ్, మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితర సదుపాయాలుంటాయి. పదవీకాలం ముగిశాక వేతనంలో సగం పెన్షన్ కింద వస్తుంది. మమతతో ఢీ అంటే ఢీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో నిత్యం ఢీ అంటే ఢీ అంటూ ధన్‌ఖడ్ ఎప్పడూ వార్తల్లో నిలిచారు. బీజేపీ ఏజెంట్ అంటూ ఆయన్ను మమతా నిందించేవారు. తన లాయర్ పరిజ్ఞానంతో మమత సర్కారుని ఇరకాటంలోకి పెట్టడానికి ప్రయత్నించేవారు. పరిస్థితి చివరికి గవర్నర్ స్థానంలో సీఎంను రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల చాన్సలర్‌గా మారుస్తూ మమత చట్టం చేసేదాకా వెళ్లింది! ఇలా వారిద్దరూ ఉప్పూనిప్పుగా ఉన్న సమయంలోనే ధన్కడ్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఎంపిక చేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ విజయం
సాక్షి, ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థి అయిన ధన్కర్కు 528 ఓట్లు వచ్చాయి. అలాగే యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 15గా తేలింది. భారత దేశపు 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఎన్నికయ్యారు. శనివారం(ఆగస్టు6న) ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగ్గా.. సాయంత్రం నుంచి కౌంటింగ్ మొదలైంది. ధన్కర్ గెలుపును అధికారికంగా ప్రకటించారు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. మొత్తం 780 ఎలక్టోర్స్‌లో 725 మంది మాత్రమే ఓటు వేశారని, ఓటింగ్ శాతం 92.94గా నమోదు అయ్యిందని లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు. ఇందులో అధికార పక్ష అభ్యర్థి ధన్కర్ 528 ఓట్లు సాధించారని, విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌కు 182 ఓట్లు దక్కాయని ఆయన వెల్లడించారు. చెల్లని ఓట్లు 15గా ఉందని, ఎన్నికలో 346 ఓట్ల తేడాతో ధన్కర్ గెలిచినట్లు ప్రకటించారు. ఇదీ చదవండి: జగదీప్ ధన్కర్.. మారుమూల పల్లెలో ‘రైతు బిడ్డ’ నుంచి ఉపరాష్ట్రపతి దాకా! -
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ శనివారం జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తవగానే శనివారం సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ దన్కర్‌కు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఎన్నికలు లాంఛనప్రాయమేకానున్నాయి. జగదీప్ దన్కర్‌కు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. అలాగే.. దన్కర్‌కు బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన, బీజేడీ, ఆర్ఎల్జేపీ మద్దతు ప్రకటించాయి. విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఇదీ చదవండి: Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
ఫోన్ ట్యాపింగ్‌పై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని అన్నారు. బీజేపీలోని తన మిత్రులతో ఫోన్లో మాట్లాడాక తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారో ‘పెద్దన్న’ వింటూనే ఉంటారన్నారు. కలిసినప్పుడు కూడా నాయకులు గుసగుసలాడాల్సిన పరిస్థితి నెలకొందని ఆక్షేపించారు. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) పంపిన నోటీసును మార్గరెట్ ఆళ్వా ట్విట్టర్లో షేర్ చేశారు. I thank the Chairman of MTNL/ BSNL for action on my complaint. My phone services have now been restored. I’m glad that a FIR has been registered by the authorities. https://t.co/PBjS7px9AH — Margaret Alva (@alva_margaret) July 26, 2022 అయితే మార్గరెట్ ఆళ్వా ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు. ఆళ్వా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని.. ఓ సీనియర్ నేత అయ్యుండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. చదవండి: ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు -
విపక్షాలకు మమత షాక్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం
కోల్‌కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండనుందని బాంబు పేల్చారు. ఈ ఓటింగ్‌కు తమ పార్టీ సభ్యులు గైర్హాజరవుతారని ప్రకటించింది టీఎంసీ. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయటంలో ఇతర విపక్షాల వైఖరే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అదే సమయంలో.. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు అభ్యంతరకరం. విపక్షాల అభ్యర్థికీ మేము మద్దతు ఇవ్వం. అందుకే ఓటింగ్‌కు మా పార్టీ సభ్యులు దూరంగా ఉంటారు.’ అని స్పష్టం చేశారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున జగదీప్ ధన్‌ఖడ్ పోటీ చేస్తున్నారు. బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. మరోవైపు.. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను బరిలోకి దింపాయి కాంగ్రెస్, ఎన్సీపీ సహా ఇతర పార్టీలు. శివసేన, జేఎంఎం వంటి పార్టీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు మద్దతు తెలపటమూ టీఎంసీ ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ఇటీవలే గవర్నర్ దగదీప్ ధన్‌ఖడ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో మమతా బెనర్జీ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టు 6న ఓటింగ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే. ఇదీ చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి -
నామినేషన్ వేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదిరుల సమక్షంలో ఆమె నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్(తెలంగాణ) దూరంగా ఉండడం గమనార్హం. మద్దతు విషయంలో ఇంకా తమ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీలు జాతీయ మీడియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరికొన్ని పార్టీల నుంచి కూడా అల్వాకు మద్దతు ఇచ్చే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్ సోమవారం నాడే ప్రధాని మోదీ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ఇవాళే తుది గడువు కాగా, ఆగష్టు 6న దేశ 14వ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది. ఆగష్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. #WATCH | Opposition's Vice-Presidential candidate Margaret Alva files her nomination papers at Parliament, in the presence of Congress leaders Rahul Gandhi, Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury, NCP chief Sharad Pawar, Shiv Sena's Sanjay Raut and other Opposition leaders. pic.twitter.com/oHmMvB6ij3 — ANI (@ANI) July 19, 2022 -
ప్రధాని సమక్షంలో నామినేషన్ వేసిన జగదీప్ ధన్కర్
సాక్షి, ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన నామినేషన్ సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరుల ధన్కర్ వెంట ఉన్నారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. మంగళవారంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. Delhi | Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections, as the candidate of NDA. Prime Minister Narendra Modi, HM Amit Shah, Defence Minister Rajnath Singh, Union Minister Nitin Gadkari, BJP national president JP Nadda and other BJP leaders present. pic.twitter.com/iBRfuXC0pO — ANI (@ANI) July 18, 2022 #WATCH | Delhi: NDA candidate Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections in the presence of PM Narendra Modi. (Source: DD) pic.twitter.com/jyUOddtxOe — ANI (@ANI) July 18, 2022 -
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వా (80) ను బరిలో దించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ నివాసంలో జరిగిన 17 పార్టీల భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. అల్వా పేరును పార్టీలన్నీ ముక్త కంఠంతో ఆమోదించినట్టు భేటీ తర్వాత పవార్ తెలిపారు. భేటీకి రాని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆ పార్టీల చీఫ్‌లు మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రివాల్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జేఎంఎం కూడా అల్వాకే మద్దతిస్తుందని వివరించారు. మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), సంజయ్ రౌత్ (శివసేన), కె.కేశవరావు (టీఆర్ఎస్), టీఆర్ బాలు (డీఎంకే), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), వైగో (ఎండీఎంకే), ఏడీ సింగ్ (ఆర్జేడీ), మహ్మద్బషీర్ (ఐఎంయూఎల్), జోస్ కె.మణి (కేరళ కాంగ్రెస్–ఎం) భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలైన శివసేన, జేఎంఎం రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించడం తెలిసిందే. సుదీర్ఘ రాజకీయ జీవితం విపక్షాల నిర్ణయాన్ని సవినయంగా అంగీకరిస్తున్నట్టు అల్వా ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలన్నారు. ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అధికార ఎన్డీఏ తమ అభ్యర్థిగా శనివారం ప్రకటించడం తెలిసిందే. ఎన్నిక ఆగస్ట్ 6న జరుగుతుంది. అల్వా ఆమె 1942 ఏప్రిల్ 14న కర్ణాటకలోని మంగళూరులో పుట్టారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు నిర్వహించడంతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా చేశారు. మరోవైపు, రైతుపుత్రుడైన ధన్‌ఖడ్‌కు మద్దతివ్వాల్సిందిగా విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థులిద్దరికీ సామ్యాలెన్నో! ఉపరాష్ట్రపతి ఎన్నికలో తలపడుతున్న ధన్‌ఖడ్, అల్వా మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా పని చేశారు. ఇద్దరికీ కాంగ్రెస్ నేపథ్యముంది. ఇద్దరూ లా పట్టభద్రులే. ఒక్కసారి మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ధన్‌ఖడ్ బీజేపీలో చేరకముందు జనతాదళ్, కాంగ్రెస్‌ల్లో పని చేశారు. Delhi | Opposition's candidate for the post of Vice President of India to be Margaret Alva: NCP chief Sharad Pawar pic.twitter.com/qkwyf7FMOw— ANI (@ANI) July 17, 2022 ఇది కూడా చదవండి: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ -
Presidential election 2022: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్, జాట్ నాయకుడు జగదీప్ ధన్‌ఖడ్(71)ను బరిలోకి దించనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. ధన్‌ఖడ్ అచ్ఛమైన రైతు బిడ్డ అని ప్రశంసించారు. ప్రజల గవర్నర్‌గా పేరు సంపాదించారని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో విస్తృత సంప్రదింపుల అనంతరం ధన్‌ఖడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రధాని మోదీ అభినందనలు భారత రాజ్యాంగంపై జగదీప్ ధన్‌ఖడ్‌కు అపార పరిజ్ఞానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చట్టసభల వ్యవహారాలపై మంచి పట్టు ఉందన్నారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా చైర్మన్ హోదాలో రాజ్యసభను చక్కగా ముందుకు నడిపిస్తారంటూ అభినందనలు తెలియజేశారు. ఉప రాష్ట్రపతిగా తన పేరును ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ధన్‌ఖడ్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇలా.. కొత్త ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయానికొస్తే నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులంతా కలిసి ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒకటి. అందరి ఓటు విలువ సమానమే. ప్రస్తుతం పార్లమెంట్లో మొత్తం ఎంపీల సంఖ్య 780. బీజేపీకి సొంతంగానే 394 మంది ఎంపీలున్నారు. మెజారిటీ (390) కంటే అధికంగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారు. అంచలంచెలుగా ఎదుగుతూ... జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాలో మారుమూల కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చీత్తోర్‌గఢ్ సైనిక్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ రాజస్తాన్ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్తాన్‌లో ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందారు. రాజస్తాన్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝున్‌ఝున్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో రాజస్తాన్‌లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జూలైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనేక విషయాల్లో ధన్‌ఖఢ్ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు భార్య సుదేశ్ ధన్‌ఖడ్, ఓ కుమార్తె ఉన్నారు. -
Jagdeep Dhankhar: మారుమూల పల్లెలో రైతు కుటుంబం నుంచి..
ఢిల్లీ: రాజస్థాన్‌కు చెందిన సీనియర్ పొలిటీషియన్, సీనియర్ న్యాయవాది.. అన్నింటికి మించి బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉన్న జగదీప్ ధన్కర్(71)ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. కష్టం, స్వశక్తితో ఎదిగిన మనిషిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో.. Jagdeep Dhankhar Profile ► 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ మారుమూల పల్లెలో జన్మించారు ఆయన. ► జగదీప్ ధన్కర్ ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అంచెలంచెలుగా ఎదిగి న్యాయనిపుణుడిగా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కించుకున్నారు. ► కాలినడకనే రోజూ 4 నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్లి చదువుకునేవాడినని పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకునేవారు ఆయన. అంతేకాదు పిల్లలంటే ఆయనకు ఎంతో మమకారం. ► గవర్నర్‌గా విధులు నిర్వహించే సమయంలోనూ వీలు చేసుకుని మరీ విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లి మరీ వాళ్లను ప్రోత్సహించేలా ఉపన్యాసాలు ఇచ్చేవారాయన. ► చిత్తోర్‌ఘఢ్ సైనిక్ స్కూల్లో ప్రాథమిక విద్య, జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ► జనతాదళ్ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో(1989-91) ఆయన మంత్రిత్వ శాఖను చేపట్టారు కూడా. ► 1993-98 మధ్య కిషన్‌గఢ్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా పని చేశారు. ► రాజస్థాన్ హైకోర్టు బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వహించారు. ► అంతేకాదు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లోనూ మెంబర్‌గా పని చేశారు. కొన్నాళ్లపాటు సుప్రీం కోర్టులోనూ ఆయన పని చేశారు. ► 2003లో ఆయన బీజేపీలో చేరారు. ► 2019లో ఆయన్ని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ► గవర్నర్ పేషీలో ఓఎస్డీగా తన దగ్గరి బంధువును నియమించారనే రాజకీయ ఆరోపణ మాత్రం ఆయన్ని ఇబ్బంది పెట్టింది. ► భార్య సుదేశ్ ధన్కర్. కామ్నా కూతురు. అల్లుడు కార్తీకేయ వాజ్‌పాయి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. ► మైనార్టీ కోటాలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా భావించినా.. ధన్కర్ పేరును తెరపైకి తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది బీజేపీ. శుక్రవారం సాయంత్రం హోం మంత్రి అమిత్ షాతో ధన్కర్ భేటీ కావడం, ఆపై శనివారం ప్రధాని మోదీతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారినా.. ఇలా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహించలేదు. Kisan Putra Jagdeep Dhankhar Ji is known for his humility. He brings with him an illustrious legal, legislative and gubernatorial career. He has always worked for the well-being of farmers, youth, women and the marginalised. Glad that he will be our VP candidate. @jdhankhar1 pic.twitter.com/TJ0d05gAa8 — Narendra Modi (@narendramodi) July 16, 2022 Shri Jagdeep Dhankhar Ji has excellent knowledge of our Constitution. He is also well-versed with legislative affairs. I am sure that he will be an outstanding Chair in the Rajya Sabha & guide the proceedings of the House with the aim of furthering national progress. @jdhankhar1 pic.twitter.com/Ibfsp1fgDt — Narendra Modi (@narendramodi) July 16, 2022 చదవండి: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ -
బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ప్రచార హడావిడి దాదాపుగా ముగియవస్తుండడంతో.. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి రేసులో మాజీ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ , నజ్మా హెప్తుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. చాయ్‌వాలా నామినేషన్
న్యూఢిల్లీ: ఆగస్ట్ 6వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం నామినేషన్ వేసిన ఐదుగురిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ సింగ్ కుష్వాహా అలియాస్ రామాయణి చాయ్‌వాలా కూడా ఉన్నారు. ఈయన నామినేషన్‌ను స్వీకరించినప్పటికీ రూ.15 వేల సెక్యూరిటీ డిపాజిట్ అందజేయలేదని అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన శ్రీముఖలింగం నామినేషన్ పత్రాలతోపాటు ఓటర్ జాబితాలో పేరున్నట్లు తెలిపే సర్టిఫికెట్ ఇవ్వనందున తిరస్కరించామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కె పద్మరాజన్, అహ్మదాబాద్‌కు చెందిన పరేష్‌కుమార్ నానుభాయ్ ములానీ, బెంగళూరు నివాసి హోస్మత్ విజయానంద్ నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, రామాయణి చాయ్‌వాలా.. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లోనూ పలుమార్లు నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. 24 పర్యాయాలు ఆయన ఎన్నికల్లో పోటీకి నిలిచినట్టు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19 ఆఖరు తేదీ. జూలై 20న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 22 చివరి తేదీ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. నామినేటెడ్ సభ్యులతో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటు వేయడానికి అర్హులు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. (క్లిక్: కేంద్రంపై కోర్టుకెక్కిన ట్విట్టర్)