న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ శనివారం జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తవగానే శనివారం సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ దన్కర్‌కు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఎన్నికలు లాంఛనప్రాయమేకానున్నాయి. జగదీప్ దన్కర్‌కు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ప్రకటించింది. అలాగే.. దన్కర్‌కు బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన, బీజేడీ, ఆర్‌ఎల్‌జేపీ మద్దతు ప్రకటించాయి.
విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్‌ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగియనుంది.
ఇదీ చదవండి: Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా
Comments
Please login to add a commentAdd a comment