Vice President of India
-
ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు. మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్‌లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు. -
వెంకయ్యను ఉప రాష్ట్రపతిని చేయడం నాకు నచ్చలేదు: రజినీకాంత్
సాక్షి, చెన్నై: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, రజినీకాంత్ శనివారం సెపియన్స్‌హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు. గొప్ప నాయకుడైన వెంకయ్యను రాజకీయాల నుంచి దూరం చేశారని తెలిపారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు. మరికొన్ని రోజులపాటు ఆయన కేంద్రమంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేది అని తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో, సూపర్ స్టార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రజినీకాంత్ మంచి నటుడు. ఆయన రాజకీయాల్లోకి రావద్దని నేను చెప్పాను. ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాల్లోకి రాకూడదని సలహా ఇచ్చాను. ప్రజలను సేవ చేయడానికి రాజకీయాలు ఒక్కటే కాదు.. అనేక మార్గాలున్నాయని అన్నారు. అయితే, ఇదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చేవారిని తాను నిరుత్సాహపరచడం లేదన్నారు. ఎక్కువ మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, భావజాలానికి నిబద్ధత ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. -
National Games 2022: సర్వీసెస్‌కు అగ్రస్థానం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది. ► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్‌కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి. ► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం. ► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు. ► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సర్వీసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. ► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి. హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -
ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం
-
భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో దర్భార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా జగదీప్ ధన్‌ఖడ్ వృత్తి రీత్యా లాయర్. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్‌ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం. రాజస్థాన్ హైకోర్టులో లాయర్‌గా పచేసిన ధన్కర్.. మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ చొరవతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1991లో పీవీ నర్సింహారావు హయంలోనూ మంత్రిగా సేవలు అందించారు. చదవండి: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రస్థానం.. రాజ్యాంగ పీఠంపై న్యాయ కోవిదుడు -
రాజ్యాంగ పీఠంపై న్యాయ కోవిదుడు
దేశ 14వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖడ్ వృత్తి రీత్యా లాయర్. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్‌ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం. రాజస్తాన్‌లోని ఝుంఝును జిల్లాలో కిథానా అనే కుగ్రామంలో జాట్ల కుటుంబంలో 1951 మే 18న ధన్‌ఖడ్ జన్మించారు. చదువులో చురుగ్గా ఉండేవారు. చిత్తోర్‌గఢ్ సైనిక స్కూలులో మెరిట్ స్కాలర్‌షిప్‌తో ప్రాథమిక విద్య, జైపూర్ మహారాజా కాలేజీలో డిగ్రీ చేశారు. ఎల్ఎల్బీ పూర్తయ్యాక రాజస్తాన్ బార్ కౌన్సిల్లో 1979లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1990లో సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టి మంచి గుర్తింపు సంపాదించారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయ్యేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. సైనిక స్కూల్ చిన్నప్పట్నుంచే క్రమశిక్షణ నేర్పింది. రాజ్యాంగం, చట్టాలు, సెక్షన్లు కొట్టిన పిండి. దేవీలాల్ అడుగు జాడల్లో యువకుడిగా ఉండగానే ధన్‌ఖడ్ జనతాదళ్‌లో చేరారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ వ్యవస్థాపకుడు దేవీలాల్ అడుగుజాడల్లో నడిచారు. ఆయన ఆశీస్సులతో 1989లో ఝుంఝును నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాటి వీపీ సింగ్ సర్కార్ నుంచి దేవీలాల్ బయటికొచ్చినప్పుడు ధన్‌ఖడ్ ఆయన వెంటే నడిచారు. చంద్రశేఖర్ కేబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చేశారు. పీవీ నరసింహారావు హయాంలో ఆయన విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు. రాజస్తాన్ కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లాట్ హవా పెరుగుతూండటంతో 2003లో బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీలో వసుంధర రాజెకు దగ్గరయ్యారు. కానీ రాజకీయంగా పెద్దగా ఎదగలేదు. పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు లాయర్‌గా మంచి పేరు సంపాదించారు. 2019 జులైలో పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జాట్ల నేత కావడం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఆయన్ను ఎంచుకోవడంలో కీలకంగా నిలిచింది. లాయర్‌గా లోతైన పరిజ్ఞానం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా అనుభవం అదనపు అర్హతలు మారాయి. ఎన్డీఏకు ఇంకా పూర్తి మెజారిటీ లేని రాజ్యసభలో త్వరలో కీలక బిల్లుల ఆమోదం ఉన్నందున న్యాయ, పాలనా, రాజ్యాంగపరంగా లోతుపాతులు తెలిసిన వ్యక్తి చైర్మన్‌గా ఉండనుండటం బీజేపీకి ఊరటే. ప్రయాణాలంటే ఇష్టం జగదీప్ భార్య సుదేశ్ సామాజిక కార్యకర్త. ఆర్థికశాస్త్రంలో పీజీ చేశారు. కుమార్తె కామ్నా సుప్రీంకోర్టు లాయర్ కార్తికేయ వాజపేయిని పెళ్లి చేసుకున్నారు. ధన్‌ఖడ్‌కు క్రికెట్, ప్రయాణాలు చాలా ఇష్టం. దేశ విదేశాలు విపరీతంగా తిరిగారు. కుటుంబంతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతి ముర్ము మాదిరిగానే ఆయన కూడా ఆధ్యాత్మిక బాటలో ఉన్నారు. రూ.4 లక్షల వేతనం ఉపరాష్ట్రపతి రాజ్యాంగపరంగా దేశంలో రెండో అత్యున్నత పదవి. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. నెలకు రూ.4 లక్షల అందుతుంది. ఇతర భత్యాలు, అలవెన్సులు లోక్‌సభ స్పీకర్‌తో సమానంగా ఉంటాయి. ఉచిత బంగ్లా, ఉచిత వైద్యం, విమానాలు, రైళ్లలో ఉచిత ప్రయాణాలు, ల్యాండ్, మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితర సదుపాయాలుంటాయి. పదవీకాలం ముగిశాక వేతనంలో సగం పెన్షన్ కింద వస్తుంది. మమతతో ఢీ అంటే ఢీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో నిత్యం ఢీ అంటే ఢీ అంటూ ధన్‌ఖడ్ ఎప్పడూ వార్తల్లో నిలిచారు. బీజేపీ ఏజెంట్ అంటూ ఆయన్ను మమతా నిందించేవారు. తన లాయర్ పరిజ్ఞానంతో మమత సర్కారుని ఇరకాటంలోకి పెట్టడానికి ప్రయత్నించేవారు. పరిస్థితి చివరికి గవర్నర్ స్థానంలో సీఎంను రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల చాన్సలర్‌గా మారుస్తూ మమత చట్టం చేసేదాకా వెళ్లింది! ఇలా వారిద్దరూ ఉప్పూనిప్పుగా ఉన్న సమయంలోనే ధన్కడ్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఎంపిక చేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ విజయం
సాక్షి, ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థి అయిన ధన్కర్కు 528 ఓట్లు వచ్చాయి. అలాగే యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 15గా తేలింది. భారత దేశపు 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఎన్నికయ్యారు. శనివారం(ఆగస్టు6న) ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగ్గా.. సాయంత్రం నుంచి కౌంటింగ్ మొదలైంది. ధన్కర్ గెలుపును అధికారికంగా ప్రకటించారు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. మొత్తం 780 ఎలక్టోర్స్‌లో 725 మంది మాత్రమే ఓటు వేశారని, ఓటింగ్ శాతం 92.94గా నమోదు అయ్యిందని లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు. ఇందులో అధికార పక్ష అభ్యర్థి ధన్కర్ 528 ఓట్లు సాధించారని, విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌కు 182 ఓట్లు దక్కాయని ఆయన వెల్లడించారు. చెల్లని ఓట్లు 15గా ఉందని, ఎన్నికలో 346 ఓట్ల తేడాతో ధన్కర్ గెలిచినట్లు ప్రకటించారు. ఇదీ చదవండి: జగదీప్ ధన్కర్.. మారుమూల పల్లెలో ‘రైతు బిడ్డ’ నుంచి ఉపరాష్ట్రపతి దాకా! -
రాష్ట్రపతిలా కాదు.. ఉపరాష్ట్రపతి జీతమెంతో తెలుసా?
ఢిల్లీ: మన దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాజ్యాంగబద్దంగా భారతదేశ రెండో అత్యున్నత పదవి.. ఉపరాష్ట్రపతి. అయితే రాష్ట్రపతిలా ఆమోద ముద్రలు, ఇతర నిర్ణయాలకు పరిమితం కాలేదు ఉపరాష్ట్రపతి. పార్లమెంట్లో రాజ్యసభ బాధ్యతలను పూర్తిగా చూసుకునే చైర్మన్ హోదా ఉంటుంది. అలాంటిది ఉపరాష్ట్రపతి జీత భత్యాలు, భారత ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, పెన్షన్, ఇతర సదుపాయాలు.. ఎలా ఉంటాయో తెలుసా?.. ► ఉపరాష్ట్రపతికి శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫీసర్స్ యాక్ట్ 1953 ప్రకారం.. జీతభత్యాలను చెల్లిస్తారు. ఎందుకంటే.. రాజ్యసభకు ఆ వ్యక్తి చైర్మన్(ఎక్స్ అఫీషియో)గా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే స్పీకర్‌లాగే ఉపరాష్ట్రపతికి జీతం, ఇతర బెనిఫిట్లు అందుతాయి. ► ఉపరాష్ట్రపతి జీతం.. అక్షరాల నాలుగు లక్షల రూపాయలు. ఇవి కాకుండా రకరకాల అలవెన్స్‌లు అందుతాయి. 2018 వరకు 1లక్ష25వేల రూపాయలుగా ఉండేది. ఆ దఫా బడ్జెట్లో మార్పుల మేరకు జీతం పెరిగింది. ► డెయిలీ అలవెన్స్, ఉచిత వసతి, మెడికల్ కేర్, ట్రావెల్, ఇతరత్రాలు అందుతాయి. పదవి నుంచి దిగిపోయాక.. సగం జీతం పెన్షన్‌గానూ అందుతుంది. ► ఉపరాష్ట్రపతికి భద్రతా, సిబ్బంది వాళ్ల వ్యక్తిగతం. అధికారిక కార్యక్రమాల సమయంలో మాత్రం సంబంధిత కేంద్ర, ఆయా రాష్ట్రాల తరపున సిబ్బంది భద్రత కల్పిస్తారు. ► రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి.. రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహిస్తారు. ఆ సమయంలో రాష్ట్రపతికి అందే జీతం, ఇతర బెనిఫిట్స్ ఉపరాష్ట్రపతికి అందుతాయి. అంతేకాదు రాష్ట్రపతి అందుకునే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ ► రిటైర్మెంట్ తర్వాత.. పెన్షన్‌తో పాటు మరికొన్ని బెనిఫిట్స్ మాజీ ఉపరాష్ట్రపతులకు ఉంటాయి. ► ఉపరాష్ట్రపతి ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. ఉపరాష్ట్రపతిగా ఓ వ్యక్తిని ఎన్నిసార్లైనా ఎన్నుకోవచ్చు. ► ఒకవేళ ఉపరాష్ట్రపతి లేని టైంలో రాజ్యసభ వ్యవహారాలను డిప్యూటీ చైర్మన్ చూసుకుంటారు. ► రాష్ట్రపతి పదవిలో ఉన్న ఓ వ్యక్తి మరణిస్తే.. ఉపరాష్ట్రపతి ఆ బాధ్యతలను చేపడతారు. అయితే అది ఆరునెలల వరకే. అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా అన్నమాట. ఆలోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ► 35 ఏళ్ల వయసు ఉండాలి. లాభదాయకమైన పదవులు అనుభవిస్తున్న వారు అనర్హులు. భారతీయ పౌరసత్వం ఉన్న ఎవరైనా సరే ఉపరాష్ట్రపతి పోటీకి అర్హులు. అయితే రాజకీయ పార్టీల ప్రాబల్యంతో.. పార్లమెంట్ అంతర్గత వ్యవహారంగానే మారింది ఉపరాష్ట్రపతి ఎన్నిక. ► 1962 నుంచి న్యూఢిల్లీలోని నెంబర్ 6, మౌలానా ఆజాద్ రోడ్‌లోని అధికారిక నివాసాన్ని ఉపరాష్ట్రపతి కోసం ఉపయోగిస్తోంది భారత ప్రభుత్వం. ఆరున్నర ఎకరాల్లో ఉంటుంది ఉపరాష్ట్రపతి భవన్ కాంపౌండ్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ గనుక పూర్తైతే.. అందులో ఉపరాష్ట్రపతికి శాశ్వత భవనం కేటాయించాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ► భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యుల ఓట్లు.. విజేతను నిర్ణయిస్తాయి. ఎన్నికల సంఘం సీక్రెట్ బాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తుంది. ► ఐదేళ్ల పదవీకాలం. రాజ్యసభ పూర్తి మెజారిటీతో ఆమోదించిన తీర్మానం, సాధారణ మెజారిటీతో లోక్‌సభ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చని భారత రాజ్యాంగం పేర్కొంది. రాజ్యసభకు అర్హత ప్రమాణాలను నెరవేర్చనందుకు మరియు ఎన్నికల అవకతవకలకు పాల్పడినందుకు ఉపరాష్ట్రపతిని సుప్రీంకోర్టు కూడా తొలగించవచ్చు . ఇదీ చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా? -
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ శనివారం జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తవగానే శనివారం సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ దన్కర్‌కు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఎన్నికలు లాంఛనప్రాయమేకానున్నాయి. జగదీప్ దన్కర్‌కు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. అలాగే.. దన్కర్‌కు బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన, బీజేడీ, ఆర్ఎల్జేపీ మద్దతు ప్రకటించాయి. విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఇదీ చదవండి: Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
మీ సహకారమే నాకు ఫేర్వెల్ గిఫ్ట్: వెంకయ్య
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు. ఈ సందర్భంగా ‘‘వర్షాకాల సమావేశాలు సక్రమంగా సాగేందుకు నాకు సహకరించండి. అదే నాకు వీడ్కోలు బహుమానం’’ అని రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో జరిపిన అఖిలపక్ష భేటీలో 41 మంది నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యకివే చివరి సమావేశాలు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ధన్‌ఖడ్‌కు వెంకయ్య విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు. ఇదీ చూదవండి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులన్నింటిపై చర్చ! -
ఏపీలో ఉపరాష్ట్రపతి పర్యటన
-
వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఇటీవల సాగించిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల డ్రాగన్ దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశ నాయకులు అరుణాచల్‌లో పర్యటించడాన్ని తాము కచి్చతంగా, గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పింది. అరుణాచల్ రాష్ట్రాన్ని తాము ఇండియాలో భాగంగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అది దక్షిణ టిబెట్‌లో ఒక భాగమని పేర్కొంది. వెంకయ్య నాయుడు ఈ నెల 9న అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, హింసకు తెరపడి, శాంతి నెలకొంటోందని చెప్పారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఏకపక్షంగా, బలవంతంగా, చట్టవిరుద్దంగా ఇండియాలో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని, అక్కడ భారత నేతలు పర్యటిస్తే వ్యతిరేకిస్తామని తేలి్చచెప్పారు. చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినేలా, సరిహద్దు వివాదాలు పెరిగిపోయేలా వ్యవహరించవద్దని భారత్‌కు హితవు పలికారు. అరుణాచల్ మా దేశంలో అంతర్భాగం: భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో వెంకయ్య నాయుడు పర్యటించడం పట్ల చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా అభ్యంతరాలను తిరస్కరించింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తేలి్చచెప్పారు. భారత్ నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థంపర్థం లేని పని అని కొట్టిపారేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. -
నూతన విద్యావిధానం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: ఉపరాష్ట్రపతి
-
ఉపరాష్ట్రపతి ఖాతా: ట్విటర్ దుందుడుకు చర్య
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ దుందుడుకు చర్య సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూటిక్‌ను తాజాగా తొలగించింది. 6 నెలలుగా ఆయన ఖాతా యాక్టివ్‌గా లేని కారణంగా అన్ వెరిఫై చేసి బ్లూ మార్క్ తొలగించినట్టు ట్విటర్ వెల్లడించింది. శనివారంఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వినియోగదారు పేరు మార్చినా లేదా ఖాతా యాక్టివ్‌గా లేకపోయినా ఎలాంటి నోటీసు లేకుండా ఎప్పుడైనా 'ధృవీకరించబడిన' బ్లూ బ్యాడ్జ్ చిహ్నాన్ని తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ఉపరాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ నుండి బ్లూ బ్యాడ్జ్ తొలగించడంపై బీజేపీ ముంబై అధికార ప్రతినిధి సురేష్ నఖువా గ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'భారత రాజ్యాంగంపై దాడి' అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జూలై 23, 2020 న పోస్ట్ చేసిన చివరి ట్వీట్ చేయగా, సుమారు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖాతాకు 931,000 మందికి పైగా అనుచరులున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి ట్విటర్‌కు కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఈ వార్ మరింత ముదిరిన సంగతి తెలిసిందే. దిగొచ్చిన ట్విటర్ అటు బీజేపీ శ్రేణులు, ఇటు నెటిజనుల నుంచి తీవ్ర ఆగ్రహం పెల్లుబుకిన నేపథ్యంలో ట్విటర్ దిగొచ్చింది. ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతా బ్లూ మార్క్ టిక్‌ను పునరుద్ధరించింది. -
ఏపీ తొలి స్థానంలో నిలవడం అభినందనీయం
సాక్షి, నెల్లూరు: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈవోడీబీలో ఆంధ్రప్రదేశ్‌కి దేశంలోనే ప్రథమ స్థానం దక్కడం అభినందనీయమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఆదివారం నెల్లూరు జర్నలిస్టులతో వెబినార్ కార్యక్రమాన్ని నిర్శహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు మరింత కృషి చేస్తామని, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని కేంద్ర పథకాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పథకాలు, సంస్థల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తి చేస్తామని తెలిపారు. కరోనా రోగులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కోవిడ్‌పై పూర్తిగా దృష్టి సారించారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. దానికోసం రూ.15వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరుచుకోవచ్చుని పేర్కొన్నారు. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం కోలుకుంటుండటం శుభ పరిణామమని ఉప రాష్ట్రపతి తెలిపారు. నిత్యం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి వర్గాల నుంచి తెలుసుకుంటున్నానని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేయిస్తామని తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంసీఐ గుర్తింపు కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తామని చెప్పారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన సులభతర వాణిజ్య విభాగంలో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – ఈవోడీబీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 2019 సంవత్సరానికిగాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా సులభతర వాణిజ్యం కోసం నిర్దేశించిన 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. -
రక్షాబంధన్ ఎప్పటి నుంచి జరుపుకుంటాం అంటే...
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధాన్ ప్రాముఖ్యతను, ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలను ఆయన వివరించారు. దీంతో పాటు భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో రక్షాంబంధన్‌కు సంబంధించి ఒక పోస్ట్‌ను పెట్టారు. ‘అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకైన రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ రోజు నేడు. తోబుట్టువులు ఏడాదంతా ఎదురుచూసే ఈ రోజు.. వారిమధ్య బంధాన్ని మరింత పరిపుష్టం చేసే ప్రత్యేకమైన పండుగ రోజు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబవిలువలను ప్రతిబింబించే పండుగ రాఖీపౌర్ణమి. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు, ప్రాచీన జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించటంతోపాటు, కుటుంబసభ్యులకు ఒక సామాజిక భద్రతను కలిగించే గొప్ప ఉత్సవం. ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం, బాధ్యతలను కలగలుపుకుని జరుపుకునే పండుగ ఇది. తరతరాలుగా ఈ కుటుంబ విలువలను కాపాడుకుంటూ, సామాజిక ఆచారాలు, పండుగలు, జానపద కళలు, పురాణేతి హాసాలు, పవిత్ర మత గ్రంథాల ద్వారా ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు కొత్త తరానికి వీటిని అందిచడం జరుగుతోంది. అమరకావ్యమైన రామాయణంలో తన తండ్రిమాటను గౌరవిస్తూ రాజ్యాధికారాన్ని భరతుడికి అప్పగించి అరణ్యవాసానికి బయలుదేరడం, అటు భరతుడు కూడా అన్నపై ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవంతో ఆయన పాదుకాలతో రాజ్యాన్ని నడిపించడం వంటివి భారతదేశంలోని కుటుంబవిలువలకు ఓ ఉదాహరణ మాత్రమే. సతీ అనసూయ, సీతాదేవికి కుటుంబసభ్యులు, పెద్దలతో బాధ్యతగా మసలుకోవలసిన ప్రాముఖ్యతను వివరించడం రామాయణ మహాకావ్యంలోని మరో ముఖ్యమైన ఘట్టం. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి తమ ప్రేమానురాగాలను, బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉత్సాహవంతంగా జరుపుకోవడమే మన పండుగల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. తన వారితో తన ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోవడం కన్నా మరింత గొప్పది ఏముంటుంది? భారతదేశంలో మానవ సంబంధాలకు, కుటుంబ విలువలకు గౌరవమిస్తూ జరుపుకునే పండగలు కోకొల్లలు. భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే వటసావిత్రీ పౌర్ణమి, కర్వాచౌత్ (ఉత్తరభారతంలో), తమ సంతానం శ్రేయస్సుకోసం తల్లులు పూజలు చేసే అహోయ్ అష్టమి, మన అజ్ఞాన తిమిరాలను తొలగించే గురువులను గౌరవించుకునే గురుపౌర్ణమి ఇలా ఎన్నో పండుగలు బంధాలను మరింత పరిపుష్టం చేసేవే. రక్షాబంధన్ కూడా అలాంటిదే. ‘రక్ష’ అంటే సోదరులు, సోదరీమణుల బంధాన్ని పరిరక్షించేదని అర్థం. సోదరులపై చెడు ప్రభావం పడకుండా రక్షను (రాఖీ) సోదరీమణులు సోదరుల చేతికి కడతారు. దీనికి ప్రతిగా, సోదరికి ఎలాంటి ఆపద వచ్చినా కాపాడతానని సోదరుడు ప్రమాణం చేస్తాడు. అందుకే మన దగ్గర రాఖీ కడుతున్నప్పుడు ‘నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరమూ కలిసి మన దేశానికి రక్ష’ అని పరస్పరం చెప్పుకుంటారు. అదీ రక్షా బంధనంలో ఉన్న గొప్పదనం. అందుకే ఈ పండుగంటే అందరికీ చాలా ఇష్టం. ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైందనే దానిపై భిన్న సందర్భాలను పెద్దలు మనకు చెబుతారు. అందులో ఒకటి, పాండవుల ధర్మపత్ని అయిన ద్రౌపది ఒకసారి తన సోదరుడైన శ్రీ కృష్ణుడికి గాయమైనప్పుడు. తన చీర కొంగును చించి కృష్ణుడికి రక్తస్రావం కాకుండా కడుతుంది. దీంతో ఎప్పుడూ సోదరిని, ఈ బంధాన్ని కాపాడుకుకంటానని శ్రీ కృష్ణుడు ప్రమాణం చేస్తాడు. దీంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలోపేతమైందని, అప్పటినుంచి రక్షాబంధనం మన సంప్రదాయంలో భాగమైందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ పండగను, ఈ ఏడాది ప్రపంచమంతా కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలోనే జరుపుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవితాల్లో పెనుమార్పులు వచ్చిన ఈ సందర్భంలో.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలను జరుపుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. నిస్సందేహంగా ఇది చాలా క్లిష్టమైన సమయం. కానీ మన వారిని కాపాడుకుంటూ.. వైరస్ తరిమికొట్టేందుకు మనం కుటుంబాలు, బంధువులతో కలిసి ఒకచోట చేరి పండగలు జరుపుకోవడాన్ని నివారించాలి. ఇలా చేయడం వల్ల మనవారిని బాధపెట్టినవారమవుతాం. కానీ, కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో ఇంతకుమించిన ప్రత్యామ్నాయమేదీ లేదు. భారతీయ సంప్రదాయాల ప్రకారం ఏడాది పొడగునా చాలా పండగలు జరుపుకుంటాం. కానీ ప్రతీ పండుగ వెనకున్న చారిత్రక నేపథ్యం, పురాణాల్లోని సందర్భం, పండుగ ప్రాశస్త్యం మొదలైన వాటిని యువతరానికి నేర్పించాలి. అప్పుడే వారికి ఈ పండుగల వెనుక ఉన్న నైతిక విలువలు, సమాజంలో వ్యవహరించాల్సిన తీరు మొదలైన అంశాలపై స్పష్టత వస్తుంది. మన పండుగలు మన ఘనమైన వారసత్వానికి ప్రతీకలు. భిన్న సంస్కృతులు భిన్న సామాజిక పరిస్థితులను కలుపుతూ, అందరినీ ఐకమత్యంగా ఉంచే సాధనాలు. కరోనా మహమ్మారి కారణంగా మన పండగలను మునుపటిలా ఘనంగా జరుపుకోలేకపోయినా మనలో ఉత్సాహం, పట్టుదల ఏమాత్రం సడలకుండా ఐకమత్యంతో వైరస్‌ను ఓడిద్దాం. అప్పటి వరకు మనమంతా ప్రభుత్వం సూచించినట్లుగా కరోనాను కట్టడి చేసే నిబంధనలన పాటిద్దాం. ముక్కు, నోటికి మాస్క్ వాడుతూ భౌతిక దూరాన్ని పాటిద్దాం’ అని వెంకయ్య పేర్కొన్నారు. చదవండి: నేనైతే గిఫ్ట్ కోసం కట్టను.. -
'దేశాభివృద్ధి నైతిక విలువలపైనే ఆధారపడి ఉంది'
సాక్షి,వరంగల్ : వరంగల్‌లోని ఏవివి విద్యాసంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లాటినం ఉత్సవాలను భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' కాకతీయుల సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగల్లుకు రావడం.. ఇక్కడి గడ్డపై జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మొదటి నుంచి విద్య, సాహిత్య, సాంస్కృతిక, వ్యవసాయక కేంద్రంగా ఓరుగల్లు ప్రభాసిల్లింది. 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ.. ఇంత గొప్ప విద్యాసంస్థను స్థాపించిన చందా కాంతయ్యను మనమంతా గుర్తుంచుకోవాలి. భారతదేశంలోని 65 శాతానికి పైగా ఉన్న యువతే భారత్‌కు పెద్ద బలం. వచ్చే 35 ఏళ్లపాటు ప్రపంచానికి అవసరమైన మానవవనరులను అందించే శక్తి సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయి. అయితే దీనికి కావాల్సిందల్లా అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమే. దేశాభివృద్ధి నైతిక విలువల పునరుద్ధరణపైనే ఆధారపడి ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే ఈ రకమైన విద్యా విధానం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నా' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్, నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, రాజ్యసభ సభ్యు లు కెప్టెన్ లక్ష్మికాంత రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీ లేదు’
సాక్షి, రాజమండ్రి: ఆంగ్లభాషను ప్రోత్సహించడంలో తప్పులేదని.. ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డెల్టా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ఇంగ్లీష్ భాష అవసరమని.. అలాగే మాతృభాషను కూడా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నదుల అనుసంధానం అనేది ప్రధాన ప్రక్రియ అని, అది జరిగితే ఆహార సమస్య ఉండదని చెప్పారు. గోదావరి నీటిని ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమకు కూడా అందించే ప్రయత్నం చేస్తామని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. గోదావరి అంటే ఎంతో ఇష్టం.. రాజమండ్రిలో మరిన్ని విద్యాలయాలు, వైద్యాలయాలు రావాలన్నారు. గోదావరి ప్రాంతానికి రావడం అంటే తనకెంతో ఇష్టమన్నారు. కార్యక్రమం పెద్దది కాకపోయినా.. సేవా కార్యక్రమం కావడంతో హాజరయ్యానన్నారు. దేశంలో టెలీ మెడిసిన్ విస్తృతం కావాలన్నారు. ప్రపంచంలో అనేక చోట్ల భారతీయ వైద్యులు సేవలందిస్తున్నారన్నారు. అమెరికాలో మొదటి టాప్ టెన్ వైద్యుల్లో ఐదుగురు భారతీయులేనని తెలిపారు. అందరూ ప్రోటీన్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. -
‘సాక్షి’ కథనంపై స్పందించిన ఉపరాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు, పేరంటాలు, వేడు కల్లో ఆహారం వృథా అవుతోందన్న అంశాన్ని వివరిస్తూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కాస్త.. చూసి వడ్డించండి’ అనే కథనంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఉపరాష్ట్రపతి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘సాక్షి’ కథనాన్ని ప్రస్తావించారు. ‘ఆహార భద్రతపై చర్చ జరుగుతున్న సమయంలో.. వివా హాది శుభకార్యాల్లో పరబ్రహ్మ స్వరూపమైన అన్నం 20 నుంచి 25 శాతం చెత్తకుప్పల పాలవుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తాజా సర్వేలను ఉటంకిస్తూ ‘సాక్షి’పత్రికలో సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి రాసిన కథనాన్ని అందరూ చదివి ఆలోచించాల్సిన తరుణమిది’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ‘మన సంప్రదాయ పద్ధతిలో అతిథులకు స్వయంగా వడ్డించినప్పుడు తక్కువ మొత్తంలో.. బఫే పద్ధతిలో ఎక్కువగా వృథా జరుగుతోందనే విషయాన్ని మనం గమనించాలి. ఈ మధ్య అలంకరణలతో పాటు విందుల్లో ఆడంబరాలు ఎక్కువవుతున్నాయి. ఈ దుబారా, ఆడంబరాలపై అందరం ఆలోచించి వీటిని అరికట్టేందుకు ఉపక్రమించాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. (చదవండి: కాస్త.. చూసి వడ్డించండి) ఆహార భద్రతపై చర్చ జరుగుతున్న సమయంలో.. వివాహాది శుభకార్యాల్లో పరబ్రహ్మ స్వరూపమైన అన్నం 20-25% చెత్తకుప్పల పాలవుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తాజా సర్వేలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రికలో శ్రీ సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి రాసిన కథనాన్ని అందరూ చదివి ఆలోచించాల్సిన తరుణమిది.— Vice President of India (@VPSecretariat) December 1, 2019 -
బిజీబిజీగా ఉపరాష్ట్రపతి..
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం నెల్లూరు నగరానికి చేరుకున్నారు. అనంతరం నగరంలోని ఆయన స్వగృహానికి వెళ్లారు. అక్కడి నుంచి కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌తో కలి సి వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు ప్రత్యేక రైలులో నూతనంగా నిర్మించిన కృష్ణపట్నం– ఓబులవారిపల్లె రైల్వే సొరంగ మార్గాన్ని పరిశీలించారు. ఆదివారం గూడూరులో విజయవాడ ఇంటర్ సిటీ రైలును ప్రారంభించనున్నారు. సాక్షి, నెల్లూరు : ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో శనివారం మధ్యాహ్నం 1.35 గంటలకు నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానానికి చేరుకున్నారు. వీరికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, గుంటూరు రేంజ్ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్, కలెక్టర్ శేషగిరిరావు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి, రైల్వే శాఖ సహాయ మంత్రితో కలిసి రోడ్డు మార్గాన సర్దార్‌వల్లభ్‌భాయిపటేల్ నగర్‌లోని తన స్వగృహానికి వెళ్లారు. ఆందోళనకు గురిచేసిన వాతావరణం నగరంలో శనివారం ఉదయం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉపరాష్ట్రపతి పర్యటనకు అవాంతరాలు ఏర్పడతాయేమోనని అందరూ భావించారు. వాతావరణం అనుకూలించని పక్షంలో రోడ్డు మార్గాన రేణిగుంట నుంచి నెల్లూరు తీసుకురావొచ్చని అధికారులు ఆలోచించారు. అందుకు అనుగుణంగా కాన్వాయ్‌ను సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అయితే మధ్యాహ్నానికి వాతావరణం బాగుండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నాయకుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘యూరి’పై వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు
పాకిస్తాన్‌పై మన దేశ ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఘటన ఆధారంగా తెరకెక్కించిన యూరీ సినిమాకు కూడా అంతటి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్రయూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమాను వీక్షించిన అనంతరం వెంకయ్య నాయుడు తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘నా కుటుంబసభ్యులు, కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు మరియు ఉపరాష్ట్రపతి నివాసంలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బందితో కలిసి “యూరి – ద సర్జికల్ స్ట్రైక్” సినిమాను వీక్షించడం జరిగింది. దేశభక్తిని రగిల్చి, మన భారత సైన్య అకుంఠిత దీక్షను, పోరాట పటిమను, ధైర్యసాహసాలను కళ్ళకు కట్టినట్లు “యూరి –ద సర్జికల్ స్ట్రైక్” సినిమాలో చూపించారు. ఎంతో స్ఫూర్తి దాయకంగా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్యధర్ తో పాటు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు’ అంటూ ట్వీట్‌చేశారు. యూపీ ప్రభుత్వం ఈ చిత్రానికి జీఎస్టీ నుంచి మినహాయింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశభక్తిని రగిల్చి, మన భారతసైన్య అకుంఠిత దీక్షను, పోరాట పటిమను, ధైర్యసాహసాలను కళ్ళకు కట్టినట్లు “యూరి –ద సర్జికల్ స్ట్రైక్” సినిమాలో చూపించారు. ఎంతో స్ఫూర్తి దాయకంగా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్యధర్ తో పాటు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు #URITheSurgicalStrike — VicePresidentOfIndia (@VPSecretariat) January 29, 2019 -
‘తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని చెప్పారు’
సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృందం విఙ్ఞప్తి చేసింది. మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఈ బృందం మంగళవారం వెంకయ్య నాయుడును కలిసింది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే బడ్జెట్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర నిపుణులు రూపొందించిన ఫాక్ట్ రిపోర్ట్‌ను తాము వివిధ జాతీయ నేతలకు అందజేస్తామని వెల్లడించింది. ప్రత్యేక హోదా సహా హామీలన్నింటికీ వారి మద్దతు కోరనున్నట్లు పేర్కొంది. తన శక్తి మేరకు ప్రయత్నిస్తానన్నారు.. ప్రత్యేక హోదా సాధనకు రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వుందని ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృందం అభిప్రాయపడింది. ఈ విషయంలో నాలుగున్నరేళ్లుగా కేంద్రం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం చివరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అయినా సరైన కేటాయింపులు జరపకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నికల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమాధానం చెబుతారని పేర్కొంది. హామీల అమలు విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును జోక్యం చేసుకోవాలని కోరగా... తెలుగు వాడిగా తన స్థాయిననుసరించి హామీల అమలుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించింది. విశాఖ రైల్వేజోన్‌పై ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటన వెలువడుతుందని వెంకయ్య చెప్పినట్లు పేర్కొంది. -
‘కర్తార్‌పూర్’కు శంకుస్థాపన
గురుదాస్‌పూర్: పాకిస్తాన్‌లోని గురుద్వార దార్బార్ సాహిబ్‌ను సందర్శించే సిక్కు యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేయనున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలపడం విదితమే.16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన ఈ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్లు గడిపారు. దేశ విభజన అనంతరం కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వార పాకిస్తాన్‌కు వెళ్లింది. భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి కర్తార్‌పూర్ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ఈ కారిడార్‌తో ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ పాక్‌కు హెచ్చరికలు చేశారు. భారత్ శాంతికి ప్రాధాన్యమిస్తుందనీ, కానీ భారత్‌కు భారీ, శక్తిమంతమైన సైన్యం ఉందన్న విషయాన్ని పాక్ గుర్తించాలన్నారు. సరిహద్దుల్లో భారత సైనికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల, సైనికుల దాడులకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వానే కారణమన్నారు. -
‘ఈ మూడు లక్షణాలు ఉంటే విజయం మీదే’
రాజకీయ నాయకుడిగా రాణించాలనుకుంటున్నారా..? స్టార్ పొలిటిషియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందా..? అయితే మీలో.. గ్లామర్, గ్రామర్, హ్యూమర్ అనే మూడు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలట. ఈ మాటలు చెబుతోంది మేము కాదండోయ్! సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్ అండ్ అవార్డ్స్ 2018’ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే గ్లామర్, గ్రామర్, హ్యూమర్ అనే లక్షణాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు ఈ మూడు లక్షణాలు విడివిడిగా ఉంటే సరిపోవని.. అన్నీ కలగలిసి ఉన్నప్పుడే మీపై వదంతులు ప్రచారమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చమత్కరించారు. కాగా ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, తమిళనాడు సీఎం పళని స్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్ సహా పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇక ఇండియా టుడే అవార్డుల్లో భాగంగా... పాలనలో అత్యంత మెరుగైన రాష్ట్రంగా ఎన్నికైన తెలంగాణ తరపున తెలంగాణ భవన్ ప్రధాన రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్వీకరించారు. -
మీరు జాతీయవాదులా?
న్యూఢిల్లీ: దేశంలో ఆందోళనలు సృష్టిస్తున్న మూకోన్మాద ఘటనలకు పాల్పడుతున్నవారెవరూ తమను తాము జాతీయవాదులుగా చెప్పుకోవద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో చట్టాల ద్వారా మాత్రమే మార్పు సాధ్యం కాదని.. సమాజ ప్రవర్తనలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మూకోన్మాద ఘటనలపై రాజకీయాలు చేయాలనుకుంటున్న వారిపైనా వెంకయ్య మండిపడ్డారు. ఈ ఘటనలకు రాజకీయ పార్టీలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మూక దాడుల ఘటనలను ఆపేందుకు చట్టం మాత్రమే సరిపోదు. సామాజిక మార్పు అవసరం. మీరు జాతీయవాదులుగా చెప్పుకుంటున్నట్లయితే.. ఓ మనిషిని ఎలా చంపుతారు? ఓ వ్యక్తి మతం, కులం, వర్ణం, లింగం ఆధారంగా వివక్ష చూపిస్తారా? జాతీయవాదం, భారత్ మాతాకీ జై అనే పదాలకు విశాలమైన అర్థం ఉంది. మూకదాడుల ఘటనలు ఓ పార్టీ పని కాదు. మీరు ఈ వివాదాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారంటే విషయాన్ని పలుచన చేస్తున్నట్లే. ఇదే జరుగుతోందని స్పష్టంగా చెప్పగలను’ అని వెంకయ్య పేర్కొన్నారు. ‘నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. అత్యాచారాలు ఆగిపోయాయా? నేను ఈ అంశంపై రాజకీయాలు మాట్లాడటం లేదు. పార్టీలు కొన్ని అంశాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. ఒక బిల్లు ద్వారా, రాజకీయ తీర్మా నం, పాలనాపరమైన నిర్ణయంతోపాటుగా ఈ దుర్మార్గపు ఆలోచనను సమాజం నుంచి పూర్తిగా తొలగించేలా మార్పు తీసుకురాగలగాలి. ఇదే విషయాన్ని నేను పార్లమెంటులో కూ డా చెప్పాను’ అని వెంకయ్య స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌కు వ్యతిరేకమనే.... ఎన్టీఆర్ నన్ను ఓడించలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాననే ఒకే ఒక్క కారణంతో 1983 నాటి ఎన్నికల్లో తాను ఓడిపోకూడదని నాటి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు కోరుకున్నారని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. తాను పోటీచేస్తున్న నియోజకవర్గంలో ఎన్టీఆర్ ప్రచారానికి రావాల్సి ఉన్న సమయంలో ఈ విషయం చెప్పడానికి స్వయంగా దగ్గుబాటి చెంచురామయ్యను తన దగ్గరకు పంపారని.. ఆ ఎన్నికల్లో తాను గెలిచానని ఆయన గుర్తుచేశారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన ఆత్మీయుల సమావేశంలో ప్రసంగించారు. తన స్నేహితుల కారణంగానే తాను ఈ స్థాయికి ఎదిగానని వెంకయ్యనాయుడు చెప్పారు. అదే అతిపెద్ద సవాల్... రాజకీయంగా నిత్యం బిజీగా ఉండే తాను.. స్వేచ్ఛగా మాట్లాడాలన్నా, కోరుకున్న చోటుకి వెళ్లాలన్నా అనేక ప్రోటోకాల్ ఆంక్షలు ఉండే ఐదేళ్ల ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఎప్పుడు పూర్తవుతుందోనని మొదట్లో అనుకున్నానని.. కానీ, అప్పుడే ఓ ఏడాది పూర్తయిందా అని అనిపిస్తోందన్నారు. ఉప రాష్ట్రపతిగా రాజ్యసభ నిర్వహణే ఇప్పుడు తన ముందున్న పెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు. చైర్మన్‌గా రాజ్యసభ స్థాయిని పెంచాలన్న లక్ష్యం.. సభ జరుగుతున్న తీరు మధ్య తాను సంఘర్షణకు లోనవుతున్నట్టు చెప్పారు. చట్టసభలు సజావుగా జరగడానికి రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ ప్రారంభోత్స కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదన్న ప్రచారంలో వాస్తవంలేదని, అధికారులు పిలిచినా సీఎంకు సమయం కుదరకపోవడంవల్లే కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలిసిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. -
ఉప రాష్ట్రపతి పర్యటన వాయిదా
భువనేశ్వర్ : రాష్ట్ర పర్యటనకు విచ్చేయుచున్న ఉప రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారిక వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తొలుత ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు అధికారులు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ నెల 25వ తేదీకి ఉప రాష్ట్రపతి పర్యటన వాయిదా పడినట్లు అధి కారులు వెల్లడించారు. ఇదే విషయమై రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అశిత్ త్రిపాఠి నుంచి తమకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) కాన్వొకేషన్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి విచ్చేస్తున్న విష యం తెలిసిందే. ఆగస్టు 25న ఉదయం 8 గం టలకు న్యూ ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఉదయం 10 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కాన్వొకేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటారని అధికారులు వివరించారు. కార్య క్రమానంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి న్యూ ఢిల్లీకి పయనమవుతారని అధికారులు పేర్కొన్నారు. -
రేపే కొత్త రూ.125 నాణెం విడుదల
న్యూఢిల్లీ : కొత్త రూ.125 స్మారక నాణెంను శుక్రవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేయనున్నారు. గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్ 125వ జయంతి వేడుక సందర్భంగా ఈ నాణెంను ఉపరాష్ట్రపతి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మహాలనోబిస్ జయంతినే కేంద్రం, గణాంకాల దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతేడాది దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక రోజుల కేటగిరిలో జూన్ 29ను గణాంకాల దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం 2007లో నిర్ణయించింది. సామాజిక-ఆర్థిక ప్రణాళికల్లో, పాలసీ రూపకల్పనలో గణాంకాలు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తాయో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతేడాది నిర్వహిస్తోంది. ఈ ఏడాది గణాంకాల దినోత్సవ థీమ్ ‘అధికారిక గణాంకాల్లో నాణ్యతా హామీ’ అనే విషయం. జూన్ 29న కోల్‌కతాలో గణాంకాల దినోత్సవాన్ని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఐ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించనుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఐఎస్ఐను 1931లో మహాలనోబిసే ఏర్పాటు చేశారు. -
అభిశంసన కుదరదు!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. పరిగణనలోకి తీసుకునేందుకు నోటీసుకు ఎలాంటి అర్హత లేదని, అందులోని ఆరోపణలు సమర్థనీయం, అంగీకారయోగ్యం కావన్నారు. శనివారం పలువురు న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో విస్తృత చర్చల తర్వాత సోమవారం ఈ ఉత్తర్వులిచ్చారు. నోటీసులో పేర్కొన్న దుష్ప్రవర్తన, అసమర్థత అభియోగాల్ని నిరూపించేందుకు కచ్చితమైన సమాచారం లేనందుకే తిరస్కరిస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో పేర్కొన్న ఆరోపణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని వెంకయ్య తప్పుపట్టారు. కాగా రాజ్యసభ చైర్మన్ తమ నోటీసుపై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, ఇది అసాధారణమే కాక చట్ట విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్స్, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులతో పాటు ప్రముఖ న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించిన అనంతరం వెంకయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సీజేఐపై ప్రతిపక్షాలు అభిశంసన నోటీసులివ్వడం తెల్సిందే. కాంగ్రెస్ నేతృత్వంలో 7 విపక్ష పార్టీలు జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులిచ్చారు. నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఏడుగురు మాజీ సభ్యులు సంతకాలు చేశారు. దుష్ప్రవర్తనతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.ప్రతిపక్షాల నోటీసుపై పలువురు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిష్ణాతుల అభిప్రాయం మేరకు నోటీసుల్ని తిరస్కరిస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు. ‘ప్రతిపక్షాల నోటీసులోని అంశాల్ని పూర్తిగా పరిశీలించాను. న్యాయ నిపుణులు, రాజ్యంగ కోవిదులతో సంప్రదింపుల అనంతరం వ్యక్తమైన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక నోటీసుకు ఎలాంటి అర్హత లేదని అభిప్రాయానికి వచ్చాను. అందువల్ల నోటీసును తిరస్కరిస్తున్నాను’ అని ఉత్తర్వుల్లో వెంకయ్య పేర్కొన్నారు.నోటీసు ద్వారా వ్యక్తమైన అంశాలపై అన్ని కోణాల్లో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపానని, ఒక్కో ఆరోపణను విడివిడిగానే కాకుండా, సమష్టిగా కూడా పరిగణనలోకి తీసుకున్నానని ఆయన తెలిపారు. ‘ఇది సుప్రీంకోర్టు స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అంతర్గత అంశం. నోటీసులో పేర్కొన్న ఐదు ఆరోపణల్ని నిశితంగా పరిశీలించాక.. అవి సమర్ధనీయం కాదు, అలాగే అంగీకారయోగ్యం కావనే అభిప్రాయానికి వచ్చాను. ఈ కేసులోని ఆరోపణలు రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ స్వతంత్రతను బలహీనపరిచేలా ఉంది. ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేశాక.. నోటీసులో నిరూపించదగ్గ ఆరోపణలు లేవని నిర్ధారణకు వచ్చాను. తీర్మానానికి సంబంధించి రాజ్యసభ నియమావళిని పరిశీలించడంతో పాటు విస్తృత సంప్రదింపులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాల్ని పరిశీలించాక నోటీసును పరిగణనలోకి తీసుకోవడం వాంఛనీయం కాదన్న అంశంతో సంతృప్తి చెందాను’ అని రాజ్యసభ చైర్మన్ తెలిపారు. న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నం: బీజేపీ న్యాయవ్యవస్థను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఓట్లు, ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ తప్పుపట్టారు. విపక్షాల పిటిషన్‌ను తిరస్కరించినందుకు ఉప రాష్ట్రపతికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తిరస్కారానికి గురైన కాంగ్రెస్... అసత్యాలు, ఇతరుల ప్రోద్బలంతో కూడిన పిటిషన్ల ద్వారా కోర్టు ఆవరణల నుంచి దేశాన్ని నడిపించలేదని న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విమర్శించారు. నాలుగేళ్ల క్రితం గుండె నొప్పితో మరణించిన జడ్జి లోయా మృతిని కూడా కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా వాడుకుందని ఆయన తప్పుపట్టారు. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన న్యాయమూర్తులు సోమవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ దీపక్ మిశ్రాతో పాటు ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బెంచ్‌లపైకి 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పలు ఊహాగానాలు విన్పించాయి. సీజేఐపై విపక్షాల అభిశంసన నోటీసు, తిరస్కరణ అంశంపై వారు చర్చించి ఉండవచ్చని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంలోని అన్ని బెంచ్‌లు పనిని ప్రారంభించాల్సి ఉండగా.. 10.45 వరకూ న్యాయమూర్తులు బెంచ్‌లపైకి రాలేదు. 15 నిమిషాలు ఆలస్యంగా బెంచ్‌కి వచ్చిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వెంటనే కేసుల విచారణను ప్రారంభించింది. రాజ్యసభ చైర్మన్కుఆ అధికారం ఉంది: న్యాయ నిపుణులు సీజేఐపై అభిశంసన కోసం ఇచ్చిన నోటీసులో పరిగణనలోకి తీసుకునే అంశాలు లేవని, ఉప రాష్ట్రపతి సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ అన్నారు. నోటీసుపై నిర్ణయం తీసుకునేందుకు చట్టబద్ధమైన అధికారం రాజ్యసభ చైర్మన్‌కు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లినా విజయం సాధించే అవకాశాలు లేవని మరో ప్రముఖ న్యాయవాది సోలి సొరాబ్జీ చెప్పారు. ‘ఉప రాష్ట్రపతి తన బుద్ధి కుశలతను వినియోగించి న్యాయ నిపుణులతో సంప్రదించాక నిర్ణయానికి వచ్చారు’ అని ప్రశంసించారు. కాగా లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ స్పందిస్తూ.. వెంకయ్య నాయుడు హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు అని పేర్కొన్నారు. హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు: కాంగ్రెస్ అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ వెంకయ్య తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయం దేశ న్యాయ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టిందని, ప్రజల నమ్మకంపై నీళ్లు చల్లిందని విమర్శించింది. నోటీసులోని అంశాల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు. ‘ఇది అసాధారణ, చట్ట విరుద్ధమైన పొరపాటు నిర్ణయం. మేం తప్పకుండా ఈ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేస్తాం’ అని చెప్పారు. అభిశంసన నోటీసుపై సంతకం చేసినందుకు సీజేఐ దీపక్ మిశ్రా న్యాయమూర్తిగా ఉన్న ధర్మాసనం ముందు తాను వాదించబోనన్నారు. ‘నేను సీజేఐ ముందు వాదించను. వృత్తి విలువలను పాటిస్తాను. అభిశంసన నోటీసుపై సంతకం చేసి ఎలా వాదిస్తాను? నైతికంగా అది అసంబద్ధం. వృత్తి ప్రమాణాలకు విరుద్ధం’అని సిబల్ అన్నారు. ఏఐసీసీ మీడియా ఇన్చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాల మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్న, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న శక్తుల మధ్య పోరు అని అభివర్ణించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ట్వీటర్లో పేర్కొన్నారు. ఆధారాలు అవసరం: వెంకయ్య ఆలోచన, మాట, చర్య ద్వారా పరిపాలన మూలస్తంభాల్ని బలహీనపరిచేందుకు అనుమతించకూడదని ఉత్తర్వుల్లో వెంకయ్య సూచించారు. ‘పిటిషన్లో వాడిన వ్యాఖ్యలు అనుమానం, ఊహా లేదా అంచనాల్ని మాత్రమే వెల్లడిస్తున్నాయి. నోటీసులో పేర్కొన్న అంశాలకు సరైన ఆధారాలు చూపలేదు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తనను నిరూపించాలంటే ఆధారాలు అవసరం’ అని అన్నారు. అభిశంసన నోటీసుపై ప్రతిపక్ష పార్టీల ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రస్తావిస్తూ.. రాజ్యసభ సభ్యుల నియమావళిలోని పేరా 2.2లో పేర్కొన్న పార్లమెంటరీ ఆచారాలు, సంప్రదాయాల్ని సభ్యులు విస్మరించారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నానని వెంకయ్య చెప్పారు. కాగా, జడ్జి అభిశంసనకు సంబంధించిన నోటీసును తిరస్కరించే చట్టబద్ధ అధికారం రాజ్యసభ చైర్మన్‌కు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘జడ్జిల విచారణ యాక్ట్’ ప్రకారం సంప్రదింపులు, నిబంధనల అధ్యయనం అనంతరం రాజ్యసభ చైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ నోటీసును అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చని తెలిపాయి. గతంలోనూ ఈ తిరస్కరణలు జడ్జిలపై అవిశ్వాస నోటీసులు ఆదిలోనే తిరస్కరణకు గురవ్వడం ఇదే తొలిసారి కాదు. 1970లో నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేసీ షా అభిశంసన కోసం నాటి లోక్‌సభ స్పీకర్ జీఎస్ ధిల్లాన్‌కు నోటీసులు అందాయి. అయితే అభిశంసనకు అవసరమైనంత తీవ్రమైన విషయాలు నోటీసులో లేవని పేర్కొంటూ తదుపరి చర్యలు చేపట్టేందుకు స్పీకర్ తిరస్కరించారు. అలాగే 2015లోనూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా రిజర్వేషన్లపై అనుచితంగా మాట్లాడారంటూ 58 మంది రాజ్యసభ సభ్యులు ఆయనపై అభిశంసనకు నాటి రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీకి నోటీసులు అందజేశారు. అయితే అభిశంసనపై తదుపరి చర్యలు చేపట్టక ముందే రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలను సర్దివాల తొలగించడంతో ఆ విషయం అక్కడితో ముగిసింది. -
వెంకయ్యా.. ఇదేందయ్యా..!
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మాన నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్ణయంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరగా.. సోమవారం వాటిని వెంకయ్య నాయుడు తిరస్కరించిన అనంతరం ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఉపరాష్ట్రపతికి నేతలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసులు సరిగ్గా ఉన్నాయో లేదో చెప్పడం మాత్రమే వెంకయ్య పని అని, తిరస్కరించే అధికారం లేదని అభిప్రాయపడ్డారు. 'తన వద్దకు తీర్మానం నోటీసులలో 50 మంది కంటే ఎక్కువ ఎంపీలు సంతకాలు చేశారా లేదా అన్నది చూడాలి. అసలు ఏ విషయం ఆధారంగా తీర్మానాన్ని వెంకయ్య తిరస్కరించారు. ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు. ముగ్గురు జడ్జీలతో కమిటీ నియమించాలని ఎంపీలు నోటీసులలో కోరారు. కానీ అభిశంసన తీర్మానాన్ని తీరస్కరించడం సరైన నిర్ణయం కాదని' ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసులను వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సంతకం చేసిన ఎంపీలకు తమ కేసుపై వారికే కచ్చితత్వం లేదని, ఆరోపణలకు సంబంధించి జరిగి ఉండొచ్చు.. అవకాశముంది.. పాల్పడొచ్చు అనే పదాలను ఉపయోగించారని వెంకయ్య నాయుడు తెలిపారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులను తిర్కరించినట్లు వివరించారు. What!! VP Naidu rejects impeachment motion against CJI signed by 64 RS MPs! On what grounds? He has no power to say that charges are not made out. That's for the inquiry committee of 3 judges. He only has to see if it's signed by >50 MPs & possibly if charges are of misbehaviour — Prashant Bhushan (@pbhushan1) 23 April 2018 -
అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించిన వెంకయ్య
-
సీజేఐపై అభిశంసన; తిరస్కరించిన వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన విషయమై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసులను ఆయన తిరస్కరించారు. న్యాయనిపుణులతో చర్చల అనంతరం వెంకయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సోమవారం ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది. సుదీర్ఘ సంప్రదింపులు: సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరాయి. సదరు నోటీసులను అంగీకరించాలా, వద్దా అనేదానిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో వెంకయ్య మాట్లాడారు. ఒక దశలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని కూడా సంప్రదించినట్లు సమాచారం. మూడు రోజుల తర్జనభర్జన తర్వాత చివరికి ‘నోటీసులు తిరస్కరిస్తున్నట్లు’ చెప్పారు. సుప్రీంకు వెళ్లే యోచనలో కాంగ్రెస్: అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని అధికార బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఒకవేళ అభిశంసన తీర్మానం నోటీసులను ఉపరాష్ట్రపతి తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నది. -
రోజూ 18 పేపర్లు చదువుతా..
సాక్షి, విశాఖపట్నం: ‘అప్పట్లో మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు.. రాజకీయ నాయకులూ లేరు. వారసత్వం లేకున్నా జవసత్వంతో ఈ స్థాయికి (ఉపరాష్ట్రపతి) ఎదిగా. నా జీవితంలో అన్ని పదవులూ చేశా. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. కేంద్రంలో కీలక మంత్రి పదవులు చేపట్టాను. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి అధిరోహించాను. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పదవిలో ఉన్నాను. ఇలా అన్ని పదవులూ నిర్వహించాను.నేను నా ఈ జీవితాన్ని ఊహించలేదు.’ అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన మనసులో భావాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి బ్యాచ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వాజ్‌పేయి నెల్లూరు పర్యటనకు వచ్చారు. ఆయన బహిరంగ సభకు జనమంతా తరలి రావాలంటూ జట్కాబండిలో మైకులో ఊరంతా ప్రచారం చేశాను. కానీ వాజ్‌పేయి, అద్వానీల్లాంటి వారి మధ్య కూర్చుని ప్రసంగిస్తానని గాని, దేశంలో రెండో అత్యున్నత పదవి (ఉపరాష్ట్రపతి)కి ఎదుగుతానని నేనూహించలేదు.’ అని వివరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతుల కష్టాలను ఎరుగుదునన్నారు. ‘నేను తాడిచెట్టు ఎక్కగలను. చెరువుల్లో ఈదగలను. చిన్నతనంలో పశువులను కడిగే వాడిని. నాగలిపట్టి పొలం దున్నేవాడిని. ఇవన్నీ నాకు మా తాత నేర్పారు. చేలో పంటను పక్షులు తినకుండా కొట్టేవాళ్లం. పంట ఇంటికొచ్చాక అవి తినడానికి వీలుగా వరి, జొన్న, సజ్జ కంకులను ఇళ్ల పంచలకు వేలాడదీసేవాళ్లం. ఇవన్నీ విద్యార్థులు తెలుసుకుంటే మన నాగరికత, సంస్కృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది.’ అని వివరించారు. నేను రోజూ 18 దినపత్రికలు చదువుతాను. మీరూ పత్రికలు చదవి వాటి ద్వారా జ్ఞానాన్ని అవగతం చేసుకోండి’ అని పిలుపునిచ్చారు. విశాఖలో తిరగని వీధి లేదు.. ‘విశాఖ వస్తే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది. విశాఖలో నేను తిరగని వీధిలేదు. అప్పట్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గెలుపుకోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేశా. ఆంధ్ర యూనివర్సిటీలో గోపీ బడ్డీ, ఎండు చేపలు, చావుల మదుం, జగదాంబ జంక్షన్.. ఆర్కే బీచ్.. ఇలా ఒకటేమిటి విశాఖలో ప్రకృతి అందాలన్నీ అన్నీ గుర్తుకొస్తాయి.’ అని విశాఖతో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విలాసాల వైపు వెళ్లొద్దని ఉద్బోధించారు. మావి హ్యాపీ డేస్.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో అంతా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. చదువుకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చేవాళ్లం. స్టూడెంట్స్ ఎన్నికలకు గట్టి పోటీ ఉండేది. జై ఆంధ్ర ఉద్యమంలో ఆరు నెలలు డుమ్మా కొట్టాను. మా క్లాస్మేట్స్ 12 మంది జడ్జీలయ్యారు. వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకరు. యూనివర్సిటీలో మావి హ్యాపీ డేస్!’ అంటూ స్టూడెంట్ జీవితాన్ని వివరించమని అడిగిన ఓ విద్యార్థికి వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు. -
నాన్నగారి పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం
‘‘ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి, లవకుశ, దేశోద్ధారకులు’ వంటి విజయవంతమైన చిత్రాలు విడుదలైన ఈ రోజున ఆయన బయోపిక్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను చూస్తే ఎన్టీఆర్ గురించి తెలియనివారికి కూడా పూర్తిగా తెలిసేలా, చక్కటి సందేశంతో రూపొందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఉప రాష్ట్రపతిఎం. వెంకయ్యనాయుడు. తేజ దర్శకత్వంలో ఎన్.బి.కే ఫిలిమ్స్ బ్యానర్‌పై వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పణలో నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘యన్.టి.ఆర్’. బాలకృష్ణ టైటిల్ రోల్లో నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. విష్ణు సహనిర్మాత. దుర్యోధనుడు గెటప్‌లో ఉన్న బాలకృష్ణపై తీసిన తొలి సీన్‌కి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, వెంకయ్యనాయుడు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ, సాయికృష్ణ దర్శక–నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు. ‘‘భారతదేశం గర్వించదగ్గ అందాల నటుడు ఎన్టీఆర్‌గారు. బాలయ్యగారిని చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూసినట్లుంది’’ అన్నారు టి. సుబ్బరామిరెడ్డి. ‘‘ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న బాలయ్య ధన్యుడు. దర్శకత్వం వహిస్తున్న తేజ అదృష్టవంతుడు’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘ఎన్టీఆర్ చరిత్రను తెరపైకి తీసుకురావడమే సాహసం. దానికి బాలకృష్ణ మాత్రమే అర్హుడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్.‘‘నాన్నగారి పాత్రలో నటిస్తుండటం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు బాలకృష్ణ. ‘‘దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత విష్ణు. ‘‘ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టం. బాగా చేయాలని ప్రయత్నిస్తున్నాను. కథ బాగా వచ్చింది. బాలకృష్ణగారు బాగా చేస్తారు. ఏమైనా చిన్నతప్పులు ఉంటే ఫ్యాన్స్ క్షమించాలి’’ అన్నారు తేజ. సంగీత దర్శకుడు కీరవాణి, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయి మాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు. -
ఉపరాష్ట్రపతి నకిలీ పీఏ అరెస్ట్
సాక్షి, హైద్రాబాద్ : ఉపరాష్రపతి పీఏగా చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు విజయనగరం జిల్లాకు చెందిన నవీన్ అలియాస్ అర్జున్ రావ్‌గా గుర్తించారు. ఉపరాష్రపతి పీఏను అంటూ మెడికల్ సీట్లు, బదిలీల్లో సహాయం చేయాలని సంబంధిత అధికారులను నవీన్ బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ నెల 13న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్రమత్తమైన సీసీఎస్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
పీఎన్బీ కేసుతో బ్యాడ్ నేమ్
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణంపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పందించారు. పీఎన్బీ స్కాంతో సిస్టమ్‌కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. సిస్టమ్‌లో ఎక్కువ పారదర్శకత, నైతిక కార్పొరేట్ పాలన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ‘పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇతర బ్యాంకులో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించనవి. కొంతమంది వ్యక్తులతో కొంత సిస్టమ్ విఫలమైంది. అదేసమయంలో మనకు, సిస్టమ్‌కు చెడ్డ పేరు వచ్చింది’ అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 58వ నేషనల్ కాస్ట్ కన్వెక్షన్‌లో వెంకయ్యనాయుడు మాట్లాడారు. కొంత మంది అధికారులతో కుమ్మకై, డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ పీఎన్బీలో సుమారు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి రావడంతో, బ్యాంకింగ్ సిస్టమ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఎక్కువ పారదర్శకత, నైతిక కార్పొరేట్ పాలన ఉండాలని ఉపరాష్ట్రపతి కూడా అభిప్రాయం వ్యక్తంచేశారు. -
కోలుకుంటున్న ‘రియల్’ రంగం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థకు మంచిదని ఆయన పేర్కొన్నారు. చిన్న నగరాల్లో భూముల ధరలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రెడాయ్ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వ్యవ సాయ రంగం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలే దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తూ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. -
ఆధ్యాత్మికతకు భారత్ రాజధాని
మైసూరు (శ్రావణ బెళగొళ): ప్రాచీన సంప్రదాయాలతో భారతదేశం విరాజిల్లుతోందనీ, ప్రపంచంలో ఆధ్యాత్మికతకు భారత్ రాజధాని అని ఉపరాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్యానించారు. శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరుని మహామస్తకాభిషేకాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. చావుండరాయ వేదికపై కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా ఘనచరిత్ర కలిగిన కర్ణాటకలో జరుగుతున్న బాహుబలి మహామస్తకాభిషేకాల్లో పాల్గొనడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమన్నారు. మన ఆచార, వ్యవహారాలను చూసి ఎవ్వరూ సిగ్గుపడనక్కర లేదన్నారు. మన పూర్వీకులు, గురువుల నుంచి నేర్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేయాలన్నారు. -
ఉప రాష్ట్రపతి పర్యటన ఇలా
గుంటూరు: ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు శనివారం జిల్లాకు వస్తున్నారు. ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 8.30 గంటలకు పెదనందిపాడు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.30 గంటలకు బయల్దేరి పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 10.15 గంటలకు బయల్దేరి గుంటూరులోని ఓమెగా హాస్పటల్‌కు 10.45 గంటలకు చేరుకుంటారు. 11 నుంచి 11.45 గంటల వరకు అదే ఆసుపత్రిలో అంకాలజీ విభాగం, 150 పడకల సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 12 నుంచి 1.15 గంటల వరకు జేకేసీ కళాశాల స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 1.15 నుంచి 2.15 గంటల వరకు భోజన విరామం. 2.15 గంటలకు జేకేసీ కళాశాల నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.30 గంటలకు ఒమెగా హాస్పటల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.15 గంటలకు తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.30 గంటలకు ఒమెగా ఆసుపత్రిలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలసి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి ఉపరాష్ట్రపతి ఒమెగా హాస్పటల్ వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి బయల్దేరి వెళ్లిన అనంతరం 2.35 గంటలకు తిరిగి నివాసానికి చేరుకుంటారు. భారీ బందోబస్తు వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా అర్బన్ ఎస్పీ విజయరావు శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. పలు ప్రాంతాల్లో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జేకేసీ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తుతోపాటు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి అటువైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. రాష్ట్రపతితోపాటు ముఖ్యమంత్రి కూడా వస్తున్న నేపథ్యంలో ఒమెగా హాస్పటల్ సమీపంలో రెండు హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. ఎస్పీ, డీఎస్పీలతో ఆ ప్రాంతంలో నిఘాను పెంచారు. 450మంది అధికారులు, సిబ్బంది కేటాయింపు గుంటూరు: పెదనందిపాడులో శనివారం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు వెల్లడించారు. జాబ్లీ వేడుకలు జరిగే కళాశాల ప్రాంగణంలో బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనఖీలు చేశామన్నారు. హెలీపాడ్ వద్ద ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసి సిబ్బంది పహారా కాస్తున్నారని తెలిపారు. పెదనందిపాడు చేరుకున్న 450 మంది అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. వీవీఐపీ, వీఐపీల రాకపోకలకు ఆటంకం కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామాన్ని పోలీసు బలగాలు అధీనంలోకి తీసుకొని నిఘా కొనసాగిస్తున్నారని వివరించారు. కాన్వాయ్ ట్రయల్ రన్ పెదనందిపాడు: వెంకయ్యనాయుడు పెదనందిపాడు రానున్న సందర్భంగా శుక్రవారం ఉదయం నాగులపాడులోని హెలిప్యాడ్ నుంచి పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల సభా ప్రాంగణం వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ సీహెచ్. వెంకట అప్పలనాయుడు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రధాన రహదారుల్లో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ను డైవర్షన్ చేశామని, సభ ముగియగానే యథావిధిగా పునరుద్ధస్తామని ఆయన తెలిపారు. తప్పిన ప్రమాదం అబ్బినేనిగుంటపాలెం(పెదనందిపాడు): మండల పరిధిలోని అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి కాన్వాయ్ వచ్చే సరికి రోడ్డు మీద గొర్రెలు అడ్డు రావడంతో సడన్‌గా అపాల్సి వచ్చింది. ఆ సమయంలో కాన్వాయ్ వెనుక వస్తున్న కళాశాల అధ్యక్షుడు, రిటైర్డు ఏఏస్పీ కాళహస్తి సత్యనారాయణ కారు కాన్వాయ్ కారుల్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏఏస్పీ కారు ముందు భాగం బాగా దెబ్బతింది. కారులోని వారు క్షేమంగా ఉన్నారు. -
మేడారం చేరుకున్న వెంకయ్యనాయుడు
-
అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : దేశ విచ్ఛిన్నానికి యత్నించిన వ్యక్తులకు మేధావులు మద్ధతు ఇవ్వటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాన్ని నాశనం చేసే శక్తులకు అండగా నిలుస్తూ.. సొంత సైన్యంపైనే సదరు మేధావులు పోరాటాలు చేయటం దారుణమని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో జాతీయ విచారణ సంస్థ(ఎన్ఐఏ) మాజీ డైరెక్టర్ జనరల్(తొలి) రాధా వినోద్ రాజు సంస్మరణ సభలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘‘అసమ్మతికి ఈ దేశంలో చోటు ఉంటుంది. కానీ, దేశ విచ్ఛిన్నాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. అఫ్జల్ గురు, యాకుబ్ మెమోన్ లాంటి వాళ్ల పుట్టిన రోజులు జరపాల్సిన అవసరం మనకు ఏంటి? ఈ విషయంలో కొందరు మేధావుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది అని వెంకయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న అల్లర్లకు రెచ్చగొడుతున్న కొందరు వేర్పాటువాదుల నిజ స్వరూపాన్ని ఎన్ఐఏ బయటపెట్టిందని వెంకయ్య ప్రశంసలు కురిపించారు. అయితే పక్కా ఆధారాలతో వేర్పాటువాదులు పట్టుబడుతున్నప్పటికీ వారికి మద్ధతుగా మేధావులు పోరాటాలు చేస్తున్నారని.. కానీ, సామాన్యుల ప్రాణాలు పోతున్నప్పుడు మాత్రం వాళ్లు కనీసం నోరు కూడా మెదపరని ఆయన తెలిపారు. పైగా దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల మీద, సైన్యం మీద ఆరోపణలు చేస్తూ కాలం గుడుపుతున్నారని.. అయినప్పటికీ ప్రజల నైతిక మద్ధతు మాత్రం సైన్యానికే ఉంటుందన్న విషయాన్ని వాళ్లు(మేధావులు) గుర్తుంచుకుంటే మంచిదని వెంకయ్య సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఎన్ఐఏ కీలక అధికారులు పాల్గొన్నారు. -
మేడారం జాతరకు రండి
న్యూఢిల్లీ: మేడారం జాతరకు రావాల్సిందిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతిని ఈ ఉదయం కలిసిన ఆయన జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్నఈ మహా జాతరకు రావాల్సిందిగా కోరారు. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మంత్రితోపాటు రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, పలువురు ఎంపీలు ఉన్నారు. -
అమ్మకు కాకుండా.. అప్జల్‌గురుకు దండం పెడతారా..?
న్యూఢిల్లీ: వందేమాతరం ఆలపించడంపై నెలకొన్న వివాదంపై భారత ఉప రాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు ఘాటుగా స్పందించారు. తల్లికి కాకుండా ఉగ్రవాది అయిన అప్జల్‌గురూకు దండం పెడతారా అని ప్రశ్నించారు. వందేమాతరం ఆలపించమని, జాతీయగీతమైన జనగణమననే పాడుతామని కొన్ని రాజకీయ పక్షాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ పుస్తక రిలీజ్ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. వందేమాతరం పాడటం అంటే మాతృభూమికి దండం పెట్టడమేనన్నారు. మాతృభూమికి దండం పెట్టడంలో వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఇక స్కూళ్లలో విద్యార్థులు వందేమాతరం ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘భారత్ మాతాకీ జై’ అనేది దేవున్ని పూజించడం కాదన్న ఆయన దేశంలో నివసిస్తున్న 125 కోట్ల మంది మతం, కులాలతో సంబంధం లేకుండా మేమంతా భారతీయులమని నివసిస్తున్నారని స్పష్టం చేశారు. ‘హైందవం అంటే గొప్ప ధర్మం. అది ఒక సంప్రదాయం. అదే భారతీయత. దీనిని మనం వారసత్వంగా పొందాం. హిందుత్వం అంటే ఓ జీవన విధానం’’ అని వెంకయ్యనాయుడు వివరించారు. -
పద్మావతి: స్పందించిన ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు పద్మావతి చిత్ర వివాదం కొనసాగుతున్న వేళ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. న్యూఢిల్లీలో శనివారం ఓ సాహితి వేడుకలకు హాజరైన ఆయన.. చిత్రం పేరును ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం ఆయన ప్రసంగం ఇలా ఉంది... నుషులను చంపుతామని.. వారిపై రివార్డులను ప్రకటించటం ప్రజాస్వామిక వ్యవస్థ అంగీకరించబోదు. సినిమాలు-కళలు అనేవి దేశానికి అవసరమన్న ఆయన.. వాటి విషయంలో బెదిరింపులను చట్టాలు ఊపేక్షించబోవు.‘‘మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు నిరసనలు ప్రదర్శిస్తున్నారు. వాళ్ల దగ్గర అంత డబ్బు ఉందో లేదో తెలీదుగానీ.. కోటికి తక్కువ కాకుండా రివార్డు ప్రకటిస్తున్నారు. కోటి రూపాయలు అంటే అంత తేలికగా వాళ్లు భావిస్తున్నారా? అని వెంకయ్యనాయుడు చురకలంటించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని.. కానీ, అది హింసాత్మక ధోరణితో ఉండకూడదని ఆయన సూచించారు. ఈ క్రమంలో ఆయన హారామ్ హవా, కిస్సా కుర్సీ కా, ఆనంది చిత్రాల పేర్లను ఆయన ప్రస్తావించారు. రాణి పద్మావతి గాథ -
ఆస్పత్రి నుంచి వెంకయ్య డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : యాంజియోప్లాస్టీ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, వైద్యుల సూచన మేరకు మూడు రోజులపాటు సంపూర్ణ విశ్రాంతి తీసుకుంటారని ఉపరాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటన చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నేటి మధ్యాహ్నం వెంకయ్యకు ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. విశ్రాంతి అవసరమైన కారణంగా నేటి నుంచి మూడు రోజులపాటు ఉపరాష్ట్రపతిని కలిసేందుకు సందర్శకులెవరికీ అనుమతి ఉండబోదని సచివాలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం వెంకయ్య అస్వస్థతతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు జరిపిన వైద్యులు ఆయన గుండెకు సంబంధించిన ఓ నాళం పూడుకుపోతున్నట్లు గుర్తించారు. అదేరోజు ఎయిమ్స్ కార్డియాలజీ ప్రెఫెసర్ డాక్టర్ బలరాం భార్గవ నేతృత్వంలో యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు.. పూడుకుపోతున్న నాళంలో స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే. -
ఉపరాష్ట్రపతి వెంకయ్యకు యాంజియోప్లాస్టీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(68)కి శుక్రవారం ఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఉదయం అస్వస్థతతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించగా.. పరీక్షలు జరిపిన వైద్యులు వెంకయ్య గుండెకు సంబంధించిన ఓ నాళం పూడుకుపోతున్నట్లు గుర్తించారు. ఏయిమ్స్ కార్డియాలజీ ప్రెఫెసర్ డాక్టర్ బలరాం భార్గవ నేతృత్వంలో యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు.. పూడుకుపోతున్న నాళంలో స్టెంట్ వేశారు. ప్రస్తుతం వెంకయ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అంతకుముందు, ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక జరిపిన పరీక్షల్లో వెంకయ్యనాయుడు గుండెకు సంబంధించి సమస్య ఉన్నట్లు గుర్తించారు. -
మతంతో సంబంధం లేదు
సాక్షి,న్యూఢిల్లీ: యోగాకు మతంతో సంబంధం లేదని, ప్రాచీన శాస్త్రమైన యోగకు మత కోణాన్నిజొప్పించడం సమాజానికి హాని కలిగిస్తుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. యోగపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాలని, ఇతర వైద్య విధానాల మాదిరిగానే యోగ కూడా మానవాళికి మేలు చేకూర్చే ప్ర్రక్రియేనని చెప్పారు. మంగళవారం అంతర్జాయ యోగ సదస్సును వెంకయ్య నాయుడు ప్రారంభించారు. శారీరక పటుత్వం, మానసిక ప్రశాంతత, ఆథ్యాత్మిక ప్రశాంతతలు అందించే యోగ అన్ని వ్యాయామాలకూ తల్లి వంటిదని అభివర్ణించారు. యోగతో వైద్య బిల్లుల భారం తప్పుతుందన్నారు. ప్రాచీన శాస్త్రమైన యోగను ప్రజల సుఖ సంతోషాలకూ, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించేలా ఈ సదస్సు దిశానిర్ధేశం చేయాలని ఆకాంక్షించారు. యోగను ఇంటింటికీ తీసుకువెళ్లడంలో బాబా రాందావ్ చొరవ చూపారని ప్రశంసించారు.మన పూర్వీకుల నుంచి మనం అందుకున్న యోగ విజ్ఞానాన్ని పదిలంగా ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆధునిక సమాజంలో తలెత్తే ఆరోగ్య, మానసిక సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగను దినచర్యలో భాగం చేసుకోవాలని సచించారు.యోగ కేవలం శారీరక ఫిట్‌నెస్‌కే ఉపకరిస్తుందనే అపోహ నెలకొందన్నారు.యోగ ద్వారా మనస్సు, శరీరం ఉత్తేజితమవుతాయని, ధ్యాన, శ్వాస ప్రక్రియల ద్వారా వ్యక్తి అన్ని విధాలా ధృడంగా ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. -
సాంకేతికతను సామాన్యుడికి దగ్గర చేసింది
-
తెలంగాణను ఆదర్శంగా తీసుకొండి: ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభినందించారు. ఇదే విధంగా మిగతా రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమ మాతృభాషకు తొలి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణలో తొలిసారిగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని విద్యాసంస్థలకు సూచించారు. తెలుగును సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్లో తెలుగు మహాసభలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్దూ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టు ఉండాలని నిర్ణయించారు. I hope, Andhra Pradesh Government @AndhraPradeshCM will take a similar decision at the earliest. — VicePresidentOfIndia (@VPSecretariat) 13 September 2017 Others States must emulate the example of Telangana Government in according top priority to mother tongue. — VicePresidentOfIndia (@VPSecretariat) 13 September 2017 -
తెలంగాణ నుంచి ఏడుగురికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఉత్తమ ఉపాధ్యాయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులను అందుకున్నారు. ప్రాథమిక పాఠశాల విభాగంలో నలుగురు ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల విభాగంలో ముగ్గురు ఉపాధ్యాయులకు అవార్డులు వరించాయి. అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, సహాయ మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు.. కిషన్ - పాత ఎల్లాపూర్(నిర్మల్ జిల్లా) జనార్ధన్ - మర్రిగూడ(నల్లగొండ జిల్లా) నారాయణ - పాల్కపల్లి(నాగర్‌కర్నూల్ జిల్లా) విజయలక్ష్మి - కులాస్పూర్(నిజామాబాద్ జిల్లా) రామారావు - ఏనుకూరు(ఖమ్మం జిల్లా) యోగేశ్వర్ - మంచిర్యాల సురేందర్ - జగిత్యాల -
క్రీడల్లో ప్రతిభాన్వేషణ కోసం పోర్టల్ షురూ
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయి నుంచి క్రీడల్లో విశేష ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు కేంద్ర క్రీడా శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంట్లో భాగంగా సోమవారం ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ’ పోర్టల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ‘ఇలాంటి చర్యలు ఉత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను గుర్తించడమే కాకుండా వారికి అత్యున్నత స్థాయిలో పోటీ పడే విధంగా తగిన వాతావరణాన్ని కల్పిస్తాయని’ ఆయన అన్నారు. ఎనిమిదేళ్లకు పైబడి వయస్సు కలిగిన వారు ఏదైనా క్రీడల్లో నైపుణ్యం ఉంటే www.nationalsportstalenthunt.com పోర్టల్‌లో తమ బయోడేటా లేక వీడియోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి క్రీడా శాఖ తగినవారిని ఎంపిక చేసి తమ ‘సాయ్’ కేంద్రాల్లో శిక్షణ ఇస్తుంది. అలాగే ఎనిమిదేళ్లపాటు రూ.5 లక్షల చొప్పున వెయ్యి స్కాలర్షిప్లను అందిస్తామని క్రీడా మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. ఇటీవలి కాలంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా రాణిస్తున్నారని, రియో ఒలింపిక్స్‌లో... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వారే పతకాలు తెచ్చారని గుర్తుచేశారు. -
ప్రతిపక్ష నేతకు ఆహ్వానం ఇలాగేనా?
- ఉపరాష్ట్రపతి సన్మానంలో ఆనవాయితీ పాటించని ప్రభుత్వం - కేవలం ఒక్క రోజు ముందే మెయిల్ ద్వారా జగన్‌కు ఆహ్వానం సాక్షి, అమరావతి: సరైన రీతిలో ఆహ్వానం అందకపోవడం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సన్మాన సభకు హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేతను ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఆహ్వానించడం ఆనవాయితీ. వెంకయ్య సన్మాన కార్యక్రమ తేదీ ఎప్పుడో ఖరారైనా.. కేవలం ఒక్కరోజు ముందు అది కూడా సాయంత్రం మెయిల్ ద్వారా ఆహ్వానం పంపినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. దీన్నిబట్టి జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదన్న సంకేతాలను ప్రభుత్వమే ఇచ్చినట్లుగా ఉందని వైఎస్సార్సీపీ ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమానికి వ్యక్తిగతంగా జగన్ హాజరుకానప్పటికీ వెంకయ్యనాయుడు విషయంలో ప్రతి సందర్భంలోనూ సముచిత గౌరవం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. వెంకయ్య పేరును ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినప్పుడు తమ పార్టీ ముందే మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. సన్మాన కార్యక్రమానికి హాజరుకానప్పటికీ వైఎస్ జగన్ ప్రత్యేకంగా వెంకయ్యనాయుడిని అభినందించినట్లు వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. నేడు కాకినాడలో వైఎస్ జగన్ పర్యటన సాక్షి ప్రత్యేక ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన రెండు చోట్ల బహిరంగ సభలు, రోడ్డు షో నిర్వహించనున్నారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. జగన్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి కారులో కాకినాడకు వస్తారని, ఉదయం 10.30కు అన్నమ్మ ఘాట్ వద్ద సభలో ప్రసంగిస్తారన్నారు. తర్వాత చంద్రిక థియేటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డులో రోడ్డు షోలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డెయిరీ ఫామ్ సెంటర్లో ప్రసంగించిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్తారని వివరించారు. -
21న ఉపరాష్ట్రపతికి పౌరసన్మానం
అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఈనెల 21న సన్మానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం రోజున సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో రాష్ట్రం తరఫున పౌరసన్మానం నిర్వహించాలని అధికారులకు సూచించారు. వెంకయ్య గౌరవార్థం దిల్కుషా అథితి గృహంలో విందు సైతం ఇవ్వనున్నారు. -
వెంకయ్యనాయుడు అను నేను..
-
వెంకయ్యనాయుడు అను నేను..
- భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తెలుగుతేజం - దర్బార్‌హాలులో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి కోవింద్ న్యూఢిల్లీ: దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో తెలుగువారైన వెంకయ్యనాయుడు ఆశీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో శుక్రవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. వెంకయ్యతో ప్రమాణం చేయించారు. ‘వెంకయ్య నాయుడు అను నేను.. రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత ప్రదర్శిస్తానని ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేస్తున్నా ’ అంటూ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం పుస్తకంలో సంతకం చేశారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మొదటిగా రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. అటుపై మొదటి వరుసలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు.. ఉపరాష్ట్రపతికి నమస్కరించారు. 10 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, విపక్షాలకు చెందిన కీలక నేతలు, రాష్ట్రాల సీఎంలు, పలు దేశాల రాయబారులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లిన వెంకయ్య.. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయి పటేల్, దీన్‌దయాళ్ ఉపాథ్యాయలకు కూడా వెంకయ్య పుష్పాంజలిఘటించారు. -
అన్సారీపై వెంకయ్య ఎటాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలలో అభద్రతా భావం నెలకొందని, అసంతృప్తి పోగైందంటూ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అనడాన్ని ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. అన్సారీ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారం అని మండిపడ్డారు. మరోపక్క, బీజేపీ కూడా అన్సారీ వ్యాఖ్యలు తప్పుపట్టింది. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది. ఆయన రాజకీయ ఆశ్రయం కోరేందుకు ఇలా మాట్లాడినట్లుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ విమర్శించారు. పదవీ విరమణ సమయంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఉండగానే ఇలాంటి మాటలు సరికాదన్నారు. తాము ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించబోమని స్పష్టం చేశారు. రాజ్యసభలో అన్సారీ ఉభయపక్షం వహిస్తున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా 'ఆయన తప్పు చేశారు.. అది ఉద్దేశపూర్వకంగా చేశారా? కాదా అనేది నేను చెప్పలేను' తెలిపారు. గురువారంతో పదవీ విరమణ చేయనున్న హమీద్ అన్సారీ ఓ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు. గోరక్షకుల పేరిట కొందరు వ్యక్తులు గోవధకు పాల్పడిన వారిపై దాడులకు పాల్పడటం, హత్యలు చేయటంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ‘ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి. దేశపౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయం. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు.. నేను భారతీయుడిని.. అంతే’ అని హమీద్ అన్సారీ అన్నారు. ఇదిలా ఉండగా, అన్సారీ దిగిపోతున్న వేళ 'మీ నుంచి మేం చాలా నేర్చుకున్నాం' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. -
ఓటింగ్ ముగిసింది.. ఇక లెక్కింపే
న్యూఢిల్లీ: దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 781 ఓట్లలో 771 ఓట్లు పోలయ్యాయి. వెంటనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఫలితాలు రాత్రి 7 గంటల వరకు వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అధికారపక్షం ఎన్డీయే తరుఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు బరిలోకి దిగగా... ప్రతిపక్షాలు మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని పోటీకి దింపాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గోపాలకృష్ణ గాంధీకి మద్దతిచ్చాయి. అయితే, లోక్‌సభలో మెజార్టి ఉన్న ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనమే. -
చిరుతో కవిత సెల్పీ.. లుక్కేయండి మరీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణమంతా సందడిగా కనిపించింది. ఉల్సాసభరితంగా ఆహ్లాదకరంగా దర్శనం ఇచ్చింది. శనివారం పోలింగ్ నేపథ్యంలో ఓటు వేసేందుకు ఢిల్లీకి వచ్చిన తెలుగు ప్రాంతాల ఎంపీలు మరింత ఆకర్షణీయంగా కనిపించారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఒకరినొకరు సరదాగా పలకరించుకున్నారు. వీరిలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత మరింత ఆకట్టుకున్నారు. తనకు ఎదురైన ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించి నమస్కారాలు చేస్తూ ముందుకు వెళ్లిన ఆమె కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ నటుడు చిరంజీవితో సరదాగా కనిపించారు. ఆయనతో కలిసి సెల్ఫీ దిగారు. కవితతోపాటు ఇతర ఎంపీలు కూడా చిరుతో సెల్ఫీలు దిగారు. ఓటింగ్ అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల ప్రకారం బీజేపీ అభ్యర్థి వెంకయ్యనాయుడికే తాము ఓటు వేశామని చెప్పారు. ఇక ఎంపీ కవిత చిరంజీవితో కలిసి దిగిన సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘ఫ్యాన్ మూమెంట్ విత్ మెగాస్టార్’ అంటూ ట్వీట్ చేశారు. -
ఉపరాష్ట్రపతి పోలింగ్: మధ్యాహ్నానికే 90 శాతం
-
ఉపరాష్ట్రపతి పోలింగ్: మధ్యాహ్నానికే 90 శాతం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రయలో భాగంగా శనివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు సభ్యులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికే 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మధ్యాహ్నం 1 గంట వరకు 90.83 శాతం ఓటింగ్ నమోదయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి(అసిస్టెంట్) ముకుల్ పాండే మీడియాకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ఓటు వేయగా, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సభ్యులు ఆయన తర్వాత వరుస కట్టారు. అటుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ వీపీ రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యులూ పార్లమెంట్ హాలుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం ఓటర్ల సంఖ్య 790. -
ఉపరాష్ట్రపతి ఎన్నికలు: వార్ వన్ సైడ్ కాబోదు!
- విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ కామెంట్ న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోవని విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిపై పోటీచేసిన విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ గణనీయంగా ఓట్లు సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పోలింగ్ సందర్భంగా శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీరాకుమార్లాగే నాకు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఓట్లు పడతాయనే నమ్మకం ఉంది. కాబట్టి వార్ వన్ సైడ్ అయ్యే అవకాశమే లేదు’ అని గాంధీ అన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తలపడుతోన్న వెంకయ్యనాయుడితో తనకు మంచి స్నేహం ఉందని, రాజ్యాంగపరమైన ప్రక్రియలో భాగంగానే తాము పోటీపడుతున్నామని, ఇరువురమూ స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నామని గోపాలకృష్ణ గాంధీ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ హాలులో శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మొదటి ఓటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షానికి చెందిన ఎంపీలు ఓట్లు వేశారు. విపక్ష ఎంపీలు మధ్యాహ్నం తర్వాత ఓటు వేసే అవకాశం ఉంది. నేటి సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. -
అందుకే ప్రచారం కూడా చేయలేదు: వెంకయ్య
-
అందుకే ప్రచారం కూడా చేయలేదు: వెంకయ్య
న్యూఢిల్లీ: భారత 13వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు పార్లమెంట్ హాలుకు చేరుకున్నారు. సందడి వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తన గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. అందరికంటే ముందే పార్లమెంట్‌కు చేరుకున్న ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. తాను పార్టీలకు అతీతుడినన్న వెంకయ్య.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ వ్యక్తిమీదో లేదా పార్టీ మీదో పోటీ చేయడంలేదని అన్నారు. దేశంలోని మెజారిటీ పార్టీలు తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ పార్లమెంట్లో నేను ప్రతిఒక్కరికీ తెలిసినవాడినే. అందుకే ప్రచారం కూడా చేయలేదు. అయితే, మద్దతు కోరుతూ ప్రతిఒక్కరికీ మర్యాదపూర్వకంగా లేఖలు రాశాను. వాళ్ల ప్రతిస్పందనను బట్టి గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. -
ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. పార్లమెంట్ సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెలువడనుంది. కాగా ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు, విపక్షాల అభ్యర్థి, మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. అయితే లోక్‌సభలో మెజారిటీ ఉన్నఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికకవడం లాంఛనమే. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గాంధీకి మద్దతిస్తున్నాయి. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. బీజేపీ సభ్యులు 281. బీజేపీతో కలిపి ఎన్డీఏ బలం 338. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. ఈ నెల 10వ తేదీతో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం యుగియనుంది. -
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక
► సాయంత్రానికి ఫలితం వెల్లడి ► ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యకే విజయావకాశాలు న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. శనివారం(నేడు) పార్లమెంట్ సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే విషయం శనివారం సాయంత్రానికి తేలిపోనుంది. లోక్‌సభలో మెజారిటీగల ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికకవడం లాంఛనమే. ఆయనపై విపక్షాలు మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని రంగంలోకి దించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గాంధీకి మద్దతిస్తున్నాయి. సాయంత్రానికి ఫలితం: పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెల్లడిస్తారు. రహస్య ఓటింగ్ పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతున్నందున పార్టీలు విప్ జారీ చేయలేదు. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది రాజ్యసభ ఎక్స్–అఫీషియో చైర్మన్, లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఉభయ సభల్లో మొత్తం సభ్యుల సంఖ్య 790. అయితే లోక్‌సభలో రెండు, రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉన్నాయి. అలాగే కోర్టు తీర్పు కారణంగా లోక్‌సభలో బీజేపీ ఎంపీ చేడీ పాశ్వన్ ఓటు హక్కును వినియోగించుకోలేరు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికలో గెలుస్తారు. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. బీజేపీ సభ్యులు 281. బీజేపీతో కలిపి ఎన్డీఏ బలం 338. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. కాగా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఒకే కుటుంబం(బీజేపీ) నుంచి వస్తుండటంతో 2017–2022 మధ్య ఉజ్వల భవిత దిశగా దేశం పయనిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యకు మద్దతిస్తున్న వివిధ పార్టీల ఎంపీలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు. -
వెంకయ్యపై జానా పొగడ్తలేల..?
కాంగ్రెస్ ముఖ్యుల విస్మయం సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి సీఎల్పీ నేత కె.జానారెడ్డి హాజరుకావడంపై కాంగ్రెస్‌లో విస్మయం వ్యక్తమవుతోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ పోటీలో ఉన్న సమయంలో బీజేపీ అభ్యర్థి వెంకయ్యపై జానా పొగడ్తలను కురిపించడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘వెంకయ్య ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థి మాత్రమే, ఇంకా ఉప రాష్ట్రపతి కాలేదు. ఫలితాలెలా ఉన్నా కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థి కోసం ఎంపీలతో సభలు, సమావేశాలు పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం సైద్ధాంతిక పోరాటం చేస్తోంది. ఈ సమయంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని పొగిడి రావడంలో జానా ఆంతర్యమేమిటి? దీనిపై శ్రేణులకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నాం’ అని ముఖ్య నాయకుడొకరు ప్రశ్నించారు. ఈ అంశంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలేమిటి? జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు 5 రూపాయల భోజనాన్ని తిని టీఆర్ఎస్కు లాభం చేశారని ఇప్పటికే విమర్శలున్నాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిపై పొగడ్తలను కురిపించి ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నారు? దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయకుండా ఉండాలా? ఈ చర్యను అధిష్టానం ఉపేక్షిస్తుందా?’ అని మరో కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. -
కన్నీళ్లు ఆగలేదు కన్నతల్లి లాంటి పార్టీని వీడుతుంటే...
ఆత్మీయ కన్నతల్లి లాంటి అనుబంధం లో వెంకయ్య ఉద్వేగం ♦ నాతోపాటు ప్రధాని కూడా కంటతడి పెట్టారు ♦ బీజేపీలో వాజ్‌పేయి, అడ్వాణీల తర్వాత నేనే సీనియర్ని ♦ ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా సిద్ధాంతాలకే కట్టుబడ్డా ♦ సమయం లభిస్తే రాజకీయ అనుభవాలపై పుస్తకం రాస్తా సాక్షి, హైదరాబాద్: ‘‘ఊహ తెలిసినప్పటి నుంచి కన్నతల్లిలా ఆదరించిన పార్టీ(బీజేపీ)కి రాజీనామా చేస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నాతోపాటు ప్రధాని మోదీ కూడా కంటతడి పెట్టుకున్నారు. పార్టీని వీడాలంటే బాధపడ్డానే తప్ప పదవులను వీడేందుకు కాదు’’ అని ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన నేపథ్యంలో శుక్రవారం బీజేపీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినం దన కార్యక్రమంలో వెంకయ్య ఉద్వేగంగా మాట్లాడారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడం తో ఊహ తెలిసినప్పటి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో తనకు కన్నతల్లి లాంటి అనుబంధం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు. జీవితంలో తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రజల ఆశీర్వాదం కారణమన్నారు. నిత్యం అందరినీ కలిసే అలవాటున్న తాను ఇకపై అలా కలవడం కుదరదని తెలియడం బాధిస్తోందన్నారు. బీజేపీలో చేరినప్పుడు అందులో ఎందుకు చేరుతున్నావని చాలా మంది మిత్రులు ప్రశ్నించారని.. కానీ ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ అని వెంకయ్య పేర్కొన్నారు. 2019లో మోదీ మరోసారి ప్రధాని అయ్యేంతవరకు పనిచేసి ఆ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కావాలను కున్నానని.. కానీ పార్టీ ఆదేశాల మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలో ఉన్నానన్నారు. పదవులపై ఆశ లేదు... పదవులపై తనకు ఏనాడూ ఆశలేదని వెంకయ్య పేర్కొన్నారు. కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల్లేరని, ఉప రాష్ట్రపతి పదవి దాకా అవకాశం ఇచ్చిన పార్టీ తనకు తల్లితో సమానమన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశానని, అప్పుడు కూడా మంత్రి పదవికి రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని, ఇప్పుడు అదే రీతిలో రాజీనామా చేసి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాల్సి వచ్చిందని వెంకయ్య గుర్తుచేశారు. బీజేపీలోని సీనియర్లలో వాజ్‌పేయి, అడ్వాణీ తర్వాత సీనియర్ని తానేనని వెంకయ్య చెప్పారు. టీడీపీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని ఎన్టీఆర్ 1984లో పేర్కొన్నా సిద్ధాంతాల కోసం కట్టుబడి సున్నితంగా తిరస్కరించానన్నారు. కుమారుడి వ్యాపారంతో సంబంధం లేదు తన కుమారుడి వ్యాపారం గురించి తనకు పెద్దగా తెలియదని, ఆ విషయం తాను ఎప్పుడూ పట్టించుకోలేదని వెంకయ్య చెప్పారు. తన కుమారుడికి చెందిన హర్షా టయోటాపై కొందరు ఆరోపణలు చేస్తుంటే ఏం జరిగిందో తెలుసుకున్నానని, పోలీసు శాఖకు వాహనాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నేరుగా కంపెనీకే ఆర్డర్ ఇచ్చినట్లు తేలిందని వెంకయ్య వివరించారు. రాజకీయాల జోలికి రావొద్దని కుమారుడికి చెప్పానని, అలాగే వ్యాపారాల జోలికి రానని కుమారుడికి చెప్పానన్నారు. సేవే మార్గంగా నడిచే స్వర్ణభారత్ ట్రస్ట్‌పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు బాధాకరమన్నారు. అవగాహన లేమితోనే వారు ఆరోపణలు చేశారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రెండు రాష్ట్రాల మంత్రులు కేటీఆర్, తుమ్మల, కామినేని శ్రీనివాస్, సీఎల్సీ నేత కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, సినీ ప్రముఖులు నాగార్జున, వెంకటేష్, కె. రాఘవేంద్రరావు, సురేష్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్నిప్రారంభించిన వెంకయ్య శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): స్వర్ణ భారత్ ట్రస్టుపై విపక్షాల ఆరోపణలు తగవని వెంకయ్య పేర్కొన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్టు ఓ కుటుంబానిది కాదని.. తాను ట్రస్టుకు ప్రోత్సాహం అందించే వాడిని తప్ప అందులో కనీసం సభ్యుడిని కూడా కాదన్నారు. తన కుమార్తెతోపాటు కొందరు సభ్యులుగా ఏర్పడి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కొందరు రాజకీయంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ట్రస్టుకు తానేమీ చేయలేదని అన్నారు. ఇక్కడ నిర్మించిన భవనాల పన్నును మినహాయించి సమాజ సేవకు వినియోగిం చేలా ప్రభుత్వం సహకరించిందన్నారు. సీఎంలు ఏకతాటిపైకి వస్తే విభజన హామీలకు పరిష్కారం రాజకీయాల్లో మరికొంత కాలం ఉంటే రాష్ట్రానికి కొంత న్యాయం జరిగేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారని వెంకయ్య తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి ఒక అంగీకారంతో కేంద్రం దగ్గరకు వెళ్తే విభజన హామీలన్నీ పరిష్కారమవుతాయని సూచించారు. సమయం దొరికితే తన రాజకీయ అనుభవాలతో పుస్తకం రాస్తానని వెంకయ్య వెల్లడించారు. -
వెంకయ్యపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. వెంకయ్యనాయుడు కుటుంబం నిర్వహించే స్వర్ణభారత్ ట్రస్టుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మినహాయింపులు పొందారని రమేశ్ తెలిపారు. ఫలితంగా ఈ ట్రస్టు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవెలప్మెంట్ అథారిటీకి రూ.రెండు కోట్ల చార్జీలు చెల్లించలేదన్నారు. వెంకయ్యనాయుడు కుమారుడికి చెందిన హర్ష టయోటా నుంచి తెలంగాణ ప్రభుత్వం టెండర్ లేకుండానే వాహనాలు కొనుగోలు చేసిందని జైరామ్ రమేశ్ ఆరోపించారు. వెంకయ్య చైర్మన్‌గా ఉన్న బోపాల్‌లోని ఖుషాబావు ఠాక్రే స్మారక ట్రస్టుకు కూడా రూ.100 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం రూ.25 లక్షలకు కట్టబెట్టారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ కేటాయింపును రద్దు చేసిందని రమేశ్ వివరించారు. -
గోపాలకృష్ణ గాంధీ నామినేషన్
హాజరైన మన్మోహన్, సోనియా, రాహుల్ న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో ఆయన పార్లమెంట్ హౌస్‌లో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. శరద్ యాదవ్(జేడీయూ), సీతారాం ఏచూరి(సీపీఎం), డి.రాజా(సీపీఐ), తారిక్ అన్వర్, ప్రఫుల్ పటేల్(ఎన్సీపీ), ఫరూక్ అబ్దుల్లా(ఎన్సీ), కనిమొళి(డీఎంకే) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ విలేకర్లతో మాట్లాడుతూ.. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ను ఉరిశిక్ష నుంచి కాపాడటానికి తాను చేసిన యత్నాలను సమర్థించుకున్నారు. మరణశిక్ష తప్పు అని, అది మధ్యయుగాల నాటి శిక్ష అని వ్యాఖ్యానించారు. మరణశిక్షను వ్యతిరేకించి, దాన్ని రద్దు చేయాలని కోరుకున్న మహాత్మాగాంధీ, బాబాసాహేబ్ అంబేడ్కర్ల స్ఫూర్తితో ఆ పని చేశానని తెలిపారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై పునరాలోచించాలని అప్పట్లో తాను రాష్ట్రపతికి పంపిన పిటిషన్‌పై శివసేన చేసిన తాజా విమర్శలపై గాంధీ స్పందించారు. ‘మెమన్ కేసులో వాస్తవాలను ప్రణబ్ ముఖర్జీ ముందుంచాలని అనుకున్నాను. గత రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాంలా ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకున్నా.. శివసేన తన పని తాను చేసింది. మరణశిక్ష తప్పు అనేది నా విశ్వాసం.. ఒక సామాన్య, స్వతంత్ర పౌరుడిగా నా విశ్వాసాలను పాటించడం నా విధి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కులభూషణ్ జాధవ్ కోసం కూడా ఇలాంటి పిటిషన్ పంపానని వెల్లడించారు. ప్రస్తుతం దేశాన్ని విడగొట్టే శక్తి క్రియాశీలంగా పనిచేస్తోందని వ్యాఖ్యనించారు. తాను ఏ పార్టీకీ కాకుండా ఈ దేశ సామాన్య పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ప్రజలకు, రాజకీయాలకు మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. రాజకీయాలపై ప్రజలు కోల్పోయిన విశ్వాసం పునరుద్ధరణ కావాలని కోరుకుంటున్నానన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో గెలుపోటములపై స్పందిస్తూ.. కొన్నిసార్లు అంకెలతో సబంధం లేని విశ్వాసాల కోసం ముందుకు రావాల్సి ఉంటుందన్నారు. బీజేడీ మద్దతు.. భువనేశ్వర్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించిన బీజేడీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి మద్దతు తెలిపింది. ఈమేరకు పార్టీ నేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం వెల్లడించారు. గాంధీ తనకు పాతమిత్రుడని, తాను రాజకీయాల్లోకి రాకముందే తాము స్నేహితులమని నవీన్ 2012లో చెప్పారు. -
ఇక అందరి వాడిని!
బీజేపీ వ్యక్తిని కాను: వెంకయ్య.. ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేస్తా ► ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు ► వెంకయ్య పేరు ప్రతిపాదకుల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం నామినేషన్ వేశారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని పార్టీలకు చేరువకావడానికి.. తాను ఇక బీజేపీకి చెందినవాణ్ని కానని, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వెంకయ్య పార్లమెంట్ హౌస్‌లో రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్‌కు ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ అగ్రనేత ఎల్.కె. అడ్వాణీ తదితరులు హాజరయ్యారు. వెంకయ్య అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ తదితరులు వెంకయ్య పేరును ప్రతిపాదించి బలపరచారు. కార్యక్రమానికి టీడీపీ, శివసేన, ఎల్జేపీలతోపాటు ఎన్డీఏయేతర అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు కూడా హాజరయ్యారు. అంతకుముందు మోదీ, అమిత్‌షా, ఎన్డీఏ మిత్రపక్షాలు, వెంకయ్యకు మద్దతిస్తున్న పార్టీల నేతలు పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో సమావేశమై పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇది నాకు గౌరవం.. నామినేషన్ అనంతరం వెంకయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్డీయే అభ్యర్థిత్వం తనకు గౌరవమని, ఎన్నికల్లో గెలిస్తే ఉప రాష్ట్రపతి పదవి గౌరవాన్ని మరింత పెంచుతానని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా, ఎన్డీఏ పార్టీలు, తనకు మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవిపై తనకు ఆసక్తిలేదని, మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ‘మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనుకున్నాను. అంతేగాని, కొందరు చెబుతున్నట్లు మంత్రిగా కొనసాగాలనే ఉద్దేశం నాకు లేదు’ అని అన్నారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, ఎం. హిదయతుల్లా, ఆర్. వెంకట్రామన్, శంకర్‌దయాళ్ శర్మ, భైరాన్‌సింగ్ షెకావత్ వంటి గొప్ప వ్యక్తులు ఉప రాష్ట్రపతి పదవి చేపట్టారు. ఈ పదవి విశిష్ట విధుల గురించి నాకు తెలుసు. నేను ఎన్నికైతే గత ఉప రాష్ట్రపతులు స్థిరపరచిన సంప్రదాయాలను, ప్రమాణాలను కాపాడతానని ప్రజలకు హామీ ఇస్తున్నాను.. ఆ పదవికి న్యాయం చేయగలను..’ అని అన్నారు. రాజ్యాంగ బాధ్యతలున్న ఉప రాష్ట్రపతి పదవికి, నాలుగు దశాబ్దాలుగా ప్రజలతో ముడివేసుకున్న తన ప్రజా జీవితానికి మధ్య ఉన్న తేడాలు తెలుసునని పేర్కొన్నారు. భారతదేశ సౌందర్యం దాని శక్తి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఉందన్న వెంకయ్య ఆ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఓటేసే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలోనే ఉన్నారు కనుక తాను ప్రచారం చేయనని చెప్పారు. బీజేపీ అమ్మలాంటిది: తన నేపథ్యాన్ని వివరిస్తూ.. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన తనకు బీజేపీ తల్లి వంటిదని, పార్టీలోనే తల్లిని చూసుకున్నానని వెంకయ్య భావోద్వేగంతో పేర్కొన్నారు. ‘సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రజల, పార్టీ అండతోనే ఈ స్థితికి చేరుకున్నాను. అయితే ఇకపై ఎంతమాత్రం బీజేపీకి చెందినవాడిని కాను.. ఏ పార్టీకి చెందినవాడిని కాను’ అని అన్నారు. 40 ఏళ్ల అనుబంధమున్న పార్టీని వీడటం చాలా బాధాకరమన్నారు. పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా.. సోమవారం రాత్రి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యాక వెంకయ్య కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీకి కూడా ఆయన రాజీనామా చేసినట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. పార్టీ నుంచి తనంతట తాను వైదొలిగానని వెంకయ్య కూడా చెప్పారు. తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతానని, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తానన్నారు. ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతోపాటు ఇతర పార్టీలు మద్దతిస్తుండటంతో ఆ యన సులువుగా విజయం సాధించే అవకాశముంది. విధి మరోలా తలచింది.. ‘2019 ఎన్నికల్లో మళ్లీ మోదీ విజయాన్ని చూసిన తర్వాత సంఘసేవలోకి అడుగుపెట్టాలని కోరుకున్నాను. అయితే విధి మరోలా తలచింది’ అని వెంకయ్య ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. పార్టీలో చర్చ తర్వాత తీసుకున్న తుది నిర్ణయాన్ని అంగీకరించానన్నారు. దేశానికి అందిన గొప్పనాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలని మోదీని ఉద్దేశిస్తూ అన్నారు. తర్వాత వెంకయ్య పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వెళ్లి వివిధ పార్టీల ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. నామినేషన్ సందర్భంగా వెంకయ్య కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్ హౌస్‌కు వచ్చారు. నామినేషన్‌కు ముందు ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తదితరులను కలుసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
ఉపరాష్ట్రపతిగా ఉషాపతి ఎందుకు?
న్యూఢిల్లీ: ‘నేను రాష్ట్రపతిని కావాలనుకోవడం లేదు, ఉపరాష్ట్రపతిని కావాలనుకోవడం లేదు. ఉషాపతిగా నేను ఆనందంగా ఉన్నాను (భార్యపేరు ఉషా)’ అని గత మే నెలలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి వెంకయ్య నాయుడిని బీజేపీ నేతృత్వంలోని పాలకపక్షం ఎంపిక చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అనూహ్య నిర్ణయమే ఉంటుందని పార్టీతో సహా అన్ని వర్గాలు భావించాయి. అందుకు విరుద్ధంగా వెంకయ్య నాయుడు పేరును తెరపైకి తీసుకరావడం ద్వారా మోదీ ద్వయం మళ్లీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడికి అన్ని అర్హతలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాదికి చెందిన ఆయన సీనియర్ ఆరెస్సెస్ కార్యకర్త. కరడుగట్టిన హిందుత్వవాది. రాజ్యసభకు నాలుగుసార్లు ఎన్నికకావడమే కాకుండా బీజేపీకి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇంగ్లీషుతోపాటు హిందీ కూడా బాగా మాట్లాడగలరు. అన్నింటికన్నా మోదీకి మౌఖిక అభిమాని. ఒకప్పుడు కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన వెంకయ్య నాయుడిని ఉద్దేశపూర్వకంగానే తక్కువ ప్రాధాన్యతగల కేంద్ర పట్టణాభివృద్ధితోపాటు సమాచార, ప్రసారాల శాఖను అప్పగించారని, ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్న ఆయన్ని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం అంటే ప్రభుత్వ లేదా పార్టీ వ్యవహారాల నుంచి ఆయన్ని తప్పించడానికేనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి పదవంటే విదేశాలు తిరుగుతూ దేశ దౌత్య సంబంధాలను మెరగుపర్చుకోవడమేనన్న భావన కొంతమందిలో ఉండవచ్చు. రాజ్యసభ చైర్మన్‌గా ఆయన నిర్వహించాల్సిన బాధ్యతలు కీలకమైనవి. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాజ్యసభలో తగిన బలంలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభను సమర్థంగా నిర్వహించాల్సిన బాధ్యత వెంకయ్య నాయుడి భుజస్కంధాలపై ఉంటుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా విఫలమైన ఆయన ఈ విషయంలో విజయం సాధిస్తారని నమ్మడం ఆశ్చర్యమే. పన్నులు లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బిల్లులు రాజ్యసభకు వచ్చినప్పుడు అవి ఆర్థిక బిల్లులా, కావా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందీ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతిది. ఆర్థిక బిల్లులంటూ లోక్‌సభకు పంపించే బిల్లులపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం లోక్‌సభలకే ఉంటుంది. వాటికి రాజ్యసభ ఆమోదం అవసరం లేదు. ఈరకంగా మోదీ విధేయుడిగా వెంకయ్య నాయుడు తన బాధ్యతలను నిర్వర్తించగలరు. రాష్ట్రపతి పదవికే మొదట వెంకయ్య నాయుడు పోటీ పడ్డారని, ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతి పదవితో సంతృప్తి పడమని, భవిష్యత్తులో పదోన్నతి చూడవచ్చని పార్టీ అధిష్టానం అయనకు నచ్చ చెప్పిందనే వాదన కూడా వినిపిస్తోంది. -
గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా గోపాలకృష్ణ గాంధీ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన వెంట వచ్చారు. రాజ్యసభ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి. రాజా, జేడీ(యూ) నేత శరద్ యాదవ్ తదితర ప్రముఖులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. 18 ప్రతిపక్ష పార్టీలు గోపాలకృష్ణ గాంధీకి మద్దతు ఇచ్చాయి. అంతకుముందు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ పోటీలో నిలబడడంతో పోలింగ్ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 21 చివరి తేది. -
వెంకయ్య భావోద్వేగం
న్యూఢిల్లీ: ఈరోజు నుంచి తన పాత్ర మారుతుందని, కొత్త పాత్ర పోషించబోతున్నానని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇష్టపూర్వకంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీలో నిలిచినట్టు వెల్లడించారు. తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని కాపాడతానని, పార్టీలకతీతంగా పనిచేస్తానని హామీయిచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, ఆదర్శాలకు లోబడే పనిచేస్తానని అన్నారు. ఇకపై పార్టీ వ్యహారాల గురించి మాట్లాడే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చానని, తనకు ఘనమైన చరిత్ర లేదన్నారు. ఏడాదిన్నర వయసులోనే తల్లిని కోల్పోయానని, తల్లిలాంటి పార్టీ తనను ఇంతటి వాడిని చేసిందని పేర్కొన్నారు. పార్టీతో బంధం తెంచుకోవడంతో బాధతో బావోద్వేగానికి గురయినట్టు చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రచారం చేసే ఆలోచన లేదని వెల్లడించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని గుర్తు చేశారు. తనమై నమ్మకం, విశ్వాసం ఉంచి తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు వెంకయ్య ధన్యవాదాలు తెలిపారు. -
వెంకయ్య భావోద్వేగం
-
నిబద్ధతకు నిక్కమైన నిర్వచనం
సందర్భం నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పుట్టిన వెంకయ్య 40 ఏళ్ల ప్రస్థానం దేశ రాజధాని ఢిల్లీలో 30 అబ్దుల్ కలామ్ రోడ్డు నుంచి ఉపరాష్ట్రపతి భవనానికి మారబోతోంది. ఇది తెలుగు జాతి గర్వించదగిన రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ పేరు ప్రముఖంగా విన్పించని రోజుల్లోనే ఆయన ఆ పార్టీకి ముఖ్యనేత. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనే కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ పేరు సుపరిచితం. తెల్లటి చొక్కా, తెల్లటి పంచెతో దర్శనమిచ్చే 6 అడుగుల మాటల బుల్లెట్ వెంకయ్య నాయుడు. బీజేపీ జాతీయ నేతలు... అటల్జీ, అద్వానీజీ, ప్రమోద్ మహాజన్, సుష్మాస్వరాజ్, నరేంద్రమోదీ, అరుణ్ జైట్లీ ఇలా సీనియర్లందరూ వెంకయ్యాజీ అని పిలిచే సమున్నత వ్యక్తిత్వం ఆయనది. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జిగా, బీజేపీ జాతీయ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా ఇలా అనేక బాధ్యతల్లో వెంకయ్య ఒదిగిపోయారు. ఎన్డీఏ ప్రభుత్వాల్లో తనదైన శైలితో ఒక ప్రత్యేక ముద్రతో కార్యకర్తలను, ప్రజలను, ఆకట్టుకోవడంలో వెంకయ్యది ప్రత్యేక స్టైల్. మాటల తూటాలతో దక్షిణాది రాష్ట్రాల్లోనే కాక, బిహార్, ఉత్తరప్రదేశ్, కేరళ, మిజోరామ్, జమ్మూ కశ్మీర్ ఇలా దేశ వ్యాప్తంగా అనేక పార్టీ బహిరంగ సభల్లో పార్టీ వాణి–బాణిని బలంగా విన్పించారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రత్యర్థి పార్టీలకు వేడి పుట్టించే ప్రసంగాలకు వెంకయ్య పెట్టింది పేరు. వెంకయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిం చారు. 4 సార్లు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఆయన రాజ్యసభ ఎంపీనే. 2013 రాష్ట్ర విభజన సందర్భంగా పార్టీ ఎజెండా ప్రకారం రెండు రాష్ట్రాల నినాదాన్ని పార్లమెంట్లో బలంగా విన్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఒకే ఒక్కడుగా వ్యవహరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... పదేళ్లు కావాలని బల్ల గుద్ది మరీ చెప్పారు. పోలవరం ముంపు మండలాలు, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, విశ్వవిద్యాలయాలు, పోర్టులు, రోడ్లు, కేంద్ర సంస్థలు, ఇలా అనేక విషయాల్లో నాటి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి... బిల్లులో పెట్టించేలా చేశారు. విభజన సమయంలో వెంకయ్య పోషించిన పాత్ర అనన్య సామాన్యం. ఓవైపు సొంత పార్టీ నేతలు, మోదీ, జైట్లీ, సుష్మా, అద్వానీలకు విభజన బిల్లులో లోపాలను వివరిస్తూ... మరోవైపు అధికార పక్షంతో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, కావాల్సిన సంస్థలు, రావాల్సిన నిధులు, పోలవరం ముంపు మండలాల విషయాలపై చర్చించారు. 3 నెలల సమయాన్ని విభజన చర్చల కోసం వెచ్చించడం చాలా మందికి తెలియని విషయం. ఆనాటి సీఎం చివరి వరకు పదవి కోసం ఆఖరి బంతి ఉందంటూ ప్రజలను మభ్యపెట్టడాన్ని మనంచూశాం. ఇక తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఆరుగురు ప్లకార్డులతో ఆందోళన వెలిబుచ్చారు తప్ప రాష్ట్రానికి ఏం కావాలో చెప్పనే చెప్పలేదు. 1985 నుంచి 1998 వరకు ఏ విధమైన పదవి లేకున్నా... ఒకే పార్టీలో ఉండి తన నిబద్ధతను చాటుకున్నారు వెంకయ్య. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు, ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత దూషణలకు దిగలేదు. కేవలం సిద్ధాంత రాజకీయాలపైనే విమర్శలు, ప్రతి విమర్శలు చేసేవారు. అలుపు లేకుండా ఈనాటికి ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాల కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి కొండంత అండగా ఉంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావడంలో, భారీగా నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వెంకయ్య చొరవను, ప్రమేయాన్ని ఎవరూ కాదనలేరు. పార్టీ ఏ పని చెప్పినా ఆ పని చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మంత్రిగా ఉన్నా, ఆ శాఖకు వన్నె తెచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ, సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా... అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రశంసను నేటి ప్రధాని మోదీ అభినందనలను వెంకయ్య పొందారు. పని రాక్షసుడిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వం లోనూ పేరు తెచ్చుకున్నారు. అనేక సందర్భాల్లో పార్టీ దూతగా, ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు. ఎప్పుడూ ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య యువజన నేతగా, చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరి... దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నారు. సంఘ్ శిక్షణలో ఒక సమర్థమైన క్రమశిక్షణ గల నాయకునిగా రాటుదేలారు. నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పుట్టిన వెంకయ్య 40 ఏళ్ల ప్రస్థానం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 30 అబ్దుల్ కలామ్ రోడ్డు నుంచి ఉపరాష్ట్రపతి భవనానికి మారబోతోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వెంకయ్య... ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పీఠాన్ని అధిరోహించేందుకు రంగం సిద్ధమవుతోంది. మోదీ సర్కారులో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ... ప్రభుత్వానికి తల్లోనాలుకలా వ్యవహరించిన వెంకయ్యను బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకయ్య... తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి దిశానిర్దేశం చేశారు. కాకలు తీరిని రాజకీయ నేతల వేదికగా ఉండే రాజ్యసభలో మోదీ స్టైల్లో నడిపించాలంటే అందుకు వెంకయ్యే తగినవాడన్న అభిప్రాయం మోదీలో ఉంది. దక్షిణాదిన కాషా యం పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచాడు. ఉత్తరాది పార్టీలో దక్షిణాది పోకడలను నింపాడు. - పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
ఎక్కడున్నా నెల్లూరు మీదే..
►కోమల విలాస్‌లో భోజనం, నెల్లూరు చేపల పులుసంటే మహాఇష్టం ►రైతు కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి దాకా.. ►అంచెలంచెలుగా ఎదిగన వెంకయ్యనాయుడు నెల్లూరు(బారకాసు): రైతు కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి దాకా ఎదిగిన కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరంటే ఎంతో ఇష్టపడుతారు. ఆయన ఎంతటి ఉన్నతస్థాయికి ఎదిగినా ఎక్కడున్నా నెలకోసారైనా నెల్లూరు రావాల్సిందే. ఒక్కోసారి మూడు నాలుగు నెలలు పట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు నెల్లూరు వెళ్తామా అని ఆలోచించేవారు. నెల్లూరు వచ్చిన ప్రతిసారీ ఆయనతో పాటు చదువుకున్న స్నేహితులు ఆమంచర్ల శంకరనారాయణ, దువ్వూరు రాధాకృష్ణారెడ్డి, పేర్నేటి ఆదిశేషారెడ్డి తదితరులను కలవనిదే వెళ్లేవారు కాదు. వారితో ఆరోగ్యం ఎలా ఉంది? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలా సాధారణ విషయాలు మాత్రమే చర్చించేవారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని జేమ్స్గార్డెన్లో వెంకయ్యనాయుడు వివాహనంతరం దాదాపు ఐదేళ్లపాటు నివాసం ఉన్నారు. అలాగే నగరంలోని తనకిష్టమైన ప్రాంతం ట్రంక్‌రోడ్డు. ఇక్కడి ప్రాంతంలో నడుస్తూ చల్లనిగాలి పీల్చుకుంటూ ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటానని దీంతో తాను ఎంతో ఆరోగ్యకరంగా ఉండగలుగుతున్నానని అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్లోకి వెంకయ్యనాయుడిని తీసుకొచ్చిన భోగా ది దుర్గాప్రసాద్, సోంపల్లి సోమయ్య పేర్లను ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. చల్లా దోసెలు, పులిబొంగరాలంటే ఇష్టం వెంకయ్యనాయుడు నెల్లూరు వచ్చినప్పుడు సాయంత్రంపూట తన స్నేహితుడైన చిన్నబజార్‌లోని మీనాక్షిజ్యూయలరీ అధినేత చింతాల సుందర్రాజన్ షాపువద్దకు వెళ్లేవారు. సమీపంలో ఓ చిన్న టిఫిన్ దుకాణం ఉండేది. అక్కడ వేసే చిన్న చిన్న దోసెలు (చల్లాదోసెలు), పులిబొంగరాలు అంటే అమితంగా ఇష్టపడేవారు. వాటిని అది పనిగా తెప్పించుకుని తినేవారు. కోమల విలాస్ భోజనం, సీమా టీ.. నెల్లూరు వచ్చిన ప్రతిసారీ ట్రంక్‌రోడ్డులోని సీమా సెంటర్లో టీ తాగేవారు. కోమల విలాస్‌లో భోజనం ఎంతో ఇష్టంగా తినేవారు. నేటికీ నెల్లూరు వస్తే కోమల విలాస్ భోజనం, టిఫిన్ తప్పనిసరిగా చేస్తారు. కోమల విలాస్ అధినేత కోమల ప్రసాద్‌కు వెంకయ్యనాయుడుతో దాదాపు 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. అంతేకాకుండా నగరంలోని ట్రంకురోడ్డులో ఉండే జనసంఘ్ కార్యాలయానికి వచ్చి అక్కడే కొంత సమయం గడిపి అక్కడికి వచ్చే వారందరితో ముచ్చటించేవారు. అప్పట్లో జయభారత్ ఆసుపత్రి పక్కనే ఉన్న వెంకటేశ్వర థియేటర్‌కు అనుకుని ఉన్న ఖాళీస్థలంలో జనసంఘ్‌కు సంబంధించిన ముఖ్య స్నేహితులంతా వెంకయ్యనాయుడుతో కలసి కొంత సమయాన్ని గడిపేవారు. వినాయక చవితి వేడుకల్లో.. ట్రంకురోడ్డులోని శివాజీ సెంటర్లో ఏటా న్విహించే వినాయక చవితి వేడుకల్లో వెంకయ్య తప్పకుండా హాజరయ్యేవారు. ఆ వేడుకల్లో అందరితో కలసి ఎంతో సంతోషంగా సంబరాన్ని జరుపుకునేవారు. దాదాపు 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొంటూ వస్తుండటం గమనార్హం. మూడేళ్ల నుంచే పార్టీ పరంగా బాధ్యతలు పెరగడంతో వెంకయ్యనాయుడు వినాయక చవితి వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని తెలిసింది. మురికి నీళ్లు చూసే బాధపడేవారు.. వెంకయ్యనాయుడు నెల్లూరు వచ్చినప్పుడల్లా నగరంలో పారే మురికి నీళ్లు చూసి ఎంతో బాధపడేవారు. సరైన డ్రెయినేజ్ లేకపోవడంతో నగరంలో ప్రజలంతా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందేవారు. దీంతో ఆయన కేంద్రమంత్రి అయిన తరువాత నెల్లూరు నగరానికి భూగర్భ డ్రైనేజ్ వచ్చేందుకు తనవంతు కృషి చేసి ఆ పథకాన్ని సాధించారు. -
తొలి అడుగు ఇక్కడి నుంచే..
⇒ఒంగోలు నుంచే వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం ప్రారంభం ⇒1977లో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఒంగోలు: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం ప్రకాశం జిల్లా నుంచే ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. ఆ తర్వాత 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి బీఎల్డీ (భారతీయ లోక్‌దళ్) అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పులి వెంకటరెడ్డి చేతిలో ఓటమి చెందాడు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మొత్తం 7,41,462 ఓట్లు ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి పులి వెంకటరెడ్డికి 2,52,206 (55.97 శాతం) రాగా, బీఎల్డీ అభ్యర్థి వెంకయ్యనాయుడుకు 1,62,281 (36.14 శాతం) ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన గుజ్జుల యలమందారెడ్డి 35,551 (7.9 శాతం) ఓట్లు వచ్చాయి. మొత్తంగా వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రస్థానం ప్రకాశం జిల్లా నుంచే ప్రారంభమైంది. -
ముస్లింల అభ్యున్నతికి వైఎస్ అహర్నిశలు శ్రమించారు
♦ వైఎస్ చేసిన సేవలను కొనియాడిన నేతలు ♦ రిజర్వేషన్లపై షబ్బీర్ అలీ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సాక్షి, న్యూఢిల్లీ: ముస్లింల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అహర్నిశలు శ్రమించారని నేతలు కొని యాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయ డంవల్ల కలిగిన ప్రయోజనాలపై తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రచించిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించారు. ‘ముస్లిం తహఫుజాహత్ జిద్దొ జెహాత్’ పేరుతో షబ్బీర్ అలీ రచించిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, ఏపీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌లు రఘువీరారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ.. సమాజంలో అందరికీ సమాన హక్కులు లభించినప్పుడే సబ్కా సాత్, సబ్కా వికాస్ సాధ్యమవుతుందన్నారు. అందరూ కలసి అభివృద్ధి చెందాలనేదే రాజ్యాంగ లక్ష్యమని పేర్కొన్నారు. తాను పార్టీ ఇన్చార్జ్గా ఉన్నప్పుడు వైఎస్‌తో కలసి రిజర్వేషన్లు తీసుకొచ్చామని గులాంనబీ ఆజాద్ గుర్తు చేసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్ల అమలులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిబద్ధతను దిగ్విజయ్‌సింగ్, జైపాల్‌రెడ్డిలు కొనియాడారు. ముస్లింల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 58 రోజుల్లో ఉస్మానియా వర్సిటీ, మైనారిటీ కమిషనరేట్ల సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా జీవో నంబర్ 33 విడుదల చేసి ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారని షబ్బీర్ అలీ తన పుస్తకంలో వివరించారు. తదనంతరం పలు సమస్యల వల్ల రిజర్వేషన్ల నిలుపుదల.. అనంతరం బీసీ ఈని ప్రవేశపెట్టి నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ముస్లింలకు కలుగుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. రిజర్వేషన్ల అమలు వల్ల 2004–2014 మధ్య కాలంలో 12 లక్షల మంది ముస్లిం విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం పొందారని ఆయన పేర్కొన్నారు. కేవలం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయంగానూ ముస్లింల సాధికారతకు రిజర్వేషన్ ఫలాలు తోడ్పడ్డాయని వివరించారు. -
నితీష్ కుమార్ ఓటెవరికి?
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేయడంలో విజయం సాధించిన ప్రతిపక్షాలు జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతును కూడగట్టడంలో విజయం సాధిస్తాయా? అన్నదే ఇప్పుడు ముఖ్యమైన అంశం. ప్రతిపక్షాల ఐక్యతకు గత ఏప్రిల్ నెలలోనే అన్నీ తానై చొరవ తీసుకున్న నితీష్ కుమార్ తమతో చేతులు కలుపుతారనే ఆశ ప్రతిపక్షాలకు లేకపోలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనే నితీష్ కుమార్ కలసివస్తారని కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీలు ఆశించాయి. ఆయన అనూహ్యంగా ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకాకపోవడం, అదేరోజు ప్రధాని నరేంద్ర మోదీతో విందు సమావేశంలో పాల్గొనడం విపక్ష పార్టీలను విభ్రమపర్చాయి. అనుమానించినట్లుగానే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నోథ్ కోవింద్‌ను బలపర్చి ప్రతిపక్ష పార్టీలను నితీష్ కుమార్ నిరాశ పర్చారు. అలాగే రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం మంగళవారం జరిగిన విపక్షాల సమావేశానికి నితీష్ కుమార్ ఎగనామంపెట్టి ఇప్పుడు కూడా అనుమానం బీజాలు నాటారు. బీజేపీలో ఉన్నప్పుడు కూడా లౌకికభావాలు కట్టుబడి రాజకీయవేత్తగా రాణించిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ప్రధాని మోదీ పక్షాన చేరాల్సిన అవసరమే లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరిపితే దాన్ని ఇబ్బందికర పరిణామంగా భావించి లాలూతో నితీష్ తెగతెంపులు చేసుకుంటారని బీజేపీ పెద్ద నేతలు ఆశించి ఉండవచ్చు. దర్యాప్తు దశలో లాలూతో సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం నితీష్‌కు లేదు. ఎందుకంటే అంతకంటే అపకీర్తి కలిగిన నేతల మద్దతుతో నితీష్ ప్రభుత్వ పాలన సాగించిన రోజులు ఉన్నాయి. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా ముద్రపడిన సూరజ్ భాన్ సింగ్ లాంటి వారి మద్దతుతోనే ఆయన ప్రభుత్వాని నిలబెట్టుకున్నారు. 1989లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటవడానికి ముఖ్యకారకుడు నాటి హర్యానా ముఖ్యమంత్రి దేవీలాల్. ఆయనే అన్ని విపక్షాలను ఏకం చేశారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి మహత్తర పాత్రను నిర్వహించే అవకాశం నితీష్ కుమార్‌కు వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటారా? 1966లో జ్యోతిబసు ప్రధాన మంత్రయ్యే అవకాశాన్ని వదులుకొని చారిత్రక తప్పిదం చేశామంటూ పశ్చాత్తామం పడతారా? అన్నది నితీష్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. -
ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్ 10తో ముగియనుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్ 5వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు అదే రోజు వెలువడనున్నాయి. కాగా నిమినేషన్లను జూలై 4వ తేదీ నుంచి స్వీకరిస్తారు. అలాగే నామినేషన్లు దాఖలుకు 18వ తేదీతో గడువు ముగియనుంది. ఉపసంహరణకు జూలై 21 చివరి తేది. ఇక రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.