'భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది'
ట్యూనిష్: ఉగ్రవాదంపై భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ పాలసీగా మార్చుకొని ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉగ్రవాదం పోవాలంటే అంతర్జాతీయ కృషి చాలా అవసరం అని నొక్కి చెప్పారు. 'భారత్.. ప్రపంచం' అనే అంశంపై ఆయన ట్యూనిష్లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలకోసం ఎప్పటి నుంచో తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఒక పక్క మానవత్వాన్ని అంటిపెట్టుకొని కోటానుకోట్ల ప్రజల ఆశలను నెరవేర్చేదిశగా తమ దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా ముందుకు వెళుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లోని ప్రతి చోట స్వచ్ఛంద కార్యక్రమాల్లో, మానవీయతను చాటుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుందని అన్నారు. భారత్ స్థిరమైన పాలనతో అభివృద్ధిలో ముందుకెళుతుందని గుర్తు చేశారు.