Tunis
-
సంచలనం సృష్టించిన భారత జోడీ.. వరల్డ్ టైటిల్ సొంతం
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిషియాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. -
విషంతో రాసిన లేఖ చదవడంతో..
టూనిస్: దేశ అధ్యక్షుడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి విషంతో నింపిన ఓ లేఖను పంపారు. ఆ లేఖను తెరిచిన అధ్యక్షుడి సహాయకురాలు అస్వస్థతకు గురయ్యింది. వెంటనే ఆమెను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఈ ఘటన ట్యూనిషియా దేశంలో జరిగింది. దేశ అధ్యక్షుడిని లక్ష్యంగా ఆ లేఖ పంపారని.. అధ్యక్షుడి చంపేందుకు కుట్ర పన్నారని గుర్తించారు. దీంతో ఆ దేశ అధికారులు అప్రమత్తమై వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ట్యూనిషియా అధ్యక్షుడు కైస్ సయీద్‌కు సోమవారం ఓ లేఖ వచ్చింది. అయితే ఆయన సహాయకురాలు నదియా అకాచ గురువారం అధ్యక్షుడి టేబుల్‌పై పెట్టి ఆ లేఖను తెరచి చూసింది. అందులో ఖాళీ పేపర్ ఉండడంతో అనుమానంగా చూశారు. లేఖ తెరచి చూడగానే ఓ రకమైన వాసన వచ్చింది. ఆ తర్వాత ఆమె కళ్లు మండడం.. తలనొప్పి రావడం మొదలైంది. అనంతరం వెంటనే నీరసించి అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లేఖను దూరం పెట్టారు. అస్వస్థతకు గురైన నదియాను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ట్యూనిషియాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు కైస్ సయీద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎవరు కంగారుపడనవసరం లేదు. విషపు లేఖతో నాకు ఏం కాలేదు. ఆరోగ్యంగా ఉన్నాను’అని ప్రకటించారు. భద్రతా దళాలు విషపు లేఖపై ప్రత్యేక దర్యాప్తు మొదలుపెట్టాయి. -
'భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది'
ట్యూనిష్: ఉగ్రవాదంపై భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ పాలసీగా మార్చుకొని ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉగ్రవాదం పోవాలంటే అంతర్జాతీయ కృషి చాలా అవసరం అని నొక్కి చెప్పారు. 'భారత్.. ప్రపంచం' అనే అంశంపై ఆయన ట్యూనిష్లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలకోసం ఎప్పటి నుంచో తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఒక పక్క మానవత్వాన్ని అంటిపెట్టుకొని కోటానుకోట్ల ప్రజల ఆశలను నెరవేర్చేదిశగా తమ దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా ముందుకు వెళుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లోని ప్రతి చోట స్వచ్ఛంద కార్యక్రమాల్లో, మానవీయతను చాటుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుందని అన్నారు. భారత్ స్థిరమైన పాలనతో అభివృద్ధిలో ముందుకెళుతుందని గుర్తు చేశారు.