poison letter to tunisia president - Sakshi
Sakshi News home page

అధ్యక్షుడి హత్యకు కుట్ర.. విషంతో లేఖ

Published Fri, Jan 29 2021 11:22 AM | Last Updated on Fri, Jan 29 2021 12:46 PM

Poison Letter to Tunisia President - Sakshi

టూనిస్‌: దేశ అధ్యక్షుడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి విషంతో నింపిన ఓ లేఖను పంపారు. ఆ లేఖను తెరిచిన అధ్యక్షుడి సహాయకురాలు అస్వస్థతకు గురయ్యింది. వెంటనే ఆమెను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఈ ఘటన ట్యూనిషియా దేశంలో జరిగింది. దేశ అధ్యక్షుడిని లక్ష్యంగా ఆ లేఖ పంపారని.. అధ్యక్షుడి చంపేందుకు కుట్ర పన్నారని గుర్తించారు. దీంతో ఆ దేశ అధికారులు అప్రమత్తమై వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ట్యూనిషియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌కు సోమవారం ఓ లేఖ వచ్చింది.

అయితే ఆయన సహాయకురాలు నదియా అకాచ గురువారం అధ్యక్షుడి టేబుల్‌పై పెట్టి ఆ లేఖను తెరచి చూసింది. అందులో ఖాళీ పేపర్‌ ఉండడంతో అనుమానంగా చూశారు. లేఖ తెరచి చూడగానే ఓ రకమైన వాసన వచ్చింది. ఆ తర్వాత ఆమె కళ్లు మండడం.. తలనొప్పి రావడం మొదలైంది. అనంతరం వెంటనే నీరసించి అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లేఖను దూరం పెట్టారు. అస్వస్థతకు గురైన నదియాను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ట్యూనిషియాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎవరు కంగారుపడనవసరం లేదు. విషపు లేఖతో నాకు ఏం కాలేదు. ఆరోగ్యంగా ఉన్నాను’అని ప్రకటించారు. భద్రతా దళాలు విషపు లేఖపై ప్రత్యేక దర్యాప్తు మొదలుపెట్టాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement