Tunisia
-
3 ఆఫ్రికన్ ఏనుగులకు స్వాగతం పలికిన వంతారా..!
-
ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
మిలాన్: ఇటలీ సముద్ర తీరానికి సమీపంలో రెండు పడవలు నీటమునిగాయి. రెండు పడవల్లో ఒకదాంట్లో 48 మంది మరో దాంట్లో 42 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారని వారిలో 57 మందిని కాపాడిన ఇటలీ తీరప్రాంత రక్షణ దళాలు ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని గల్లంతైన మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఇటలీ కోస్ట్ గార్డులు తెలిపారు. వయా ట్యునీషియా.. స్ఫాక్స్ బీచ్ తీరంలో గత వారం 10 మృతదేహాలను కనుగొన్నామని ట్యునీషియా పోర్టు గుండా ఇటలీకి చేరుకోవడం సులభం కాబట్టి అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు స్ఫాక్స్ అధికారులు. తాజాగా ఈ రెండు పడవలు కూడా ట్యునీషియా పోర్టు నుండే ఇటలీ వైపుగా వచ్చాయని అవి లంపెడుసా ద్వీపం దాటగానే ఉరుములు మెరుపులతో సముద్రంలో అలజడి రేగడంతో అలల తాకిడికి అందులో ప్రయాణిస్తున్న 90 మంది వలసదారులతో సహా పడవలు బోల్తా పడ్డాయన్నారు. కోస్ట్ గార్డుల సాహసం.. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇటలీ తీర రక్షణ దళాలు హుటాహుటిన స్పందించి 57 మందిని రక్షించగలిగామని తెలిపారు స్ఫాక్స్ అధికారులు. కానీ ప్రమాదంలో ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని. వారి మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలిపారు. పడవలోని మిగిలిన 30 మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇలా అయితే ఎలా? ఈ రెండు పడవల్లోని వలసదారులు సహారా-ఆఫ్రికా దేశాలకు చెందిన వారే అయి ఉంటారని, ఎంతగా ప్రయత్నించినా ఆఫ్రికా దేశాల నుండి ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయలేకున్నామని తెలిపారు ఇటలీ వలసల విచారణాధికారి ఇమ్మానుయేల్ రిసిఫారీ. వారాంతా మెరుగైన జీవితం కోసమే ఇటు వస్తున్నారు. అదేదో చట్టబద్దంగా వస్తే బాగుంటుంది కానీ దొడ్డిదారిన రావడం వల్లనే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. డిమాండ్ ఎక్కువ.. ఎందరో వలసదారులు చనిపోతున్నారని సముద్రంలో ప్రమాదాలను నివారించడానికి నౌకలను ఏర్పాటు చేయడం కూడా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పొరుగు దేశానికి వలసలంటే భయపడేవారు కూడా ధైర్యంగా అడుగేసి ఇటు వైపుగా కదులుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ అక్రమ వలసలు రెట్టింపయ్యాయి. 2022లో 42,600 మంది వలస వచ్చినట్లు రికార్డుల్లో నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 92,000 మందికిపైగా వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. Migrants rescued from rough seas off Italy. Reports say dozens could still be missing at sea, while more stranded migrants were airlifted from rocks on the island of Lampedusa. Read more: https://t.co/cJMUPoyyWL pic.twitter.com/lbXo28Rbrd — Sky News (@SkyNews) August 7, 2023 ఇది కూడా చదవండి: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. -
అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు. ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్ -
సంచలనం సృష్టించిన భారత జోడీ.. వరల్డ్ టైటిల్ సొంతం
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిషియాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. -
FIFA WC: డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు ఊహించని షాక్! కానీ..
FIFA world Cup Qatar 2022: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అందరి కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించిన ఫ్రాన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రపంచ 30వ ర్యాంకర్ ట్యునీషియా 1–0 గోల్‌తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఫ్రాన్స్ జట్టును ఓడించింది. అయితే ఈ గెలుపు ట్యునీషియాకు నాకౌట్ బెర్త్‌ను అందించలేకపోయింది. ఆట 58వ నిమిషంలో వాహిబి ఖాజ్రి గోల్‌తో ట్యునీషియా విజయాన్ని దక్కించుకుంది. స్టాపేజ్ సమయంలో (90+10వ ని.లో) ఫ్రాన్స్ గ్రీజ్మన్ కొట్టిన షాట్ ట్యునీషియా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో స్కోరు సమం అయింది. అయితే ట్యునీషియా రిఫరీ నిర్ణయాన్ని సమీక్షించడంతో రీప్లేలో ఫ్రాన్స్ గోల్ ఆఫ్‌సైడ్‌గా తేలింది. దాంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. ఫలితంగా 1971 తర్వాత ఫ్రాన్స్‌పై ట్యునీషియాకు రెండో విజయం దక్కింది. చదవండి: Sanju Samson: పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: ట్యునీషియాపై విజయం.. బోణీ కొట్టిన ఆస్ట్రేలియా
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో 1-4 తేడాతో దారుణ పరాజయం పొందిన ఆస్ట్రేలియా.. ట్యునీషియాతో మ్యాచ్‌లో మాత్రం ఆకట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ట్యునీషియాను 1-0తో ఓడించింది. ఆట 23వ నిమిషంలో ఆసీస్ స్ట్రైకర్ మిచెల్ డ్యూక్ గోల్ అందించాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఇరుజట్ల మరొక గోల్ చేయకపోవడంతో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా రౌండ్ ఆఫ్-16 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు డెన్మార్క్‌తో ఆడిన తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ట్యునీషియా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యి ప్రి క్వార్టర్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
FIFA WC: డెన్మార్క్‌కు చెక్ పెట్టిన ట్యునీషియా.. మెక్సికో- పోలాండ్ మ్యాచ్ కూడా
FIFA World Cup 2022- దోహా: పట్టుదలతో ఆడితే ప్రపంచకప్‌లాంటి గొప్ప ఈవెంట్లోనూ తమకంటే ఎంతో మెరుగైన జట్టుపై మంచి ఫలితం సాధించవచ్చని ట్యునీషియా జట్టు నిరూపించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ ట్యునీషియా 0–0తో ప్రపంచ 10వ ర్యాంకర్ డెన్మార్క్జట్టును నిలువరించింది. రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ట్యునీషియా గోల్‌పోస్ట్ లక్ష్యంగా డెన్మార్క్ జట్టు ఐదుసార్లు షాట్లు కొట్టినా ఫలితం లేకపోయింది. డెన్మార్క్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 62 శాతం ఉంచుకున్నా ట్యునీషియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయలేకపోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. మరో ‘డ్రా’ దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మరో ‘డ్రా’ నమోదైంది. పోలాండ్, మెక్సికో జట్ల మధ్య మంగళవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. మెక్సికో జట్టు పోలాండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగు సార్లు షాట్లు సంధించగా ఒక్కటీ లక్ష్యానికి చేరలేదు. పోలాండ్ స్టార్ ప్లేయర్ లెవన్డౌస్కీను మెక్సికో జట్టు వ్యూహత్మకంగా కట్టడి చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. వేల్స్‌ను గట్టెక్కించిన బేల్ 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించిన వేల్స్ జట్టు తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అమెరికాతో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ను వేల్స్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 82వ నిమిషంలో వేల్స్ జట్టుకు లభించిన పెనాల్టీని గ్యారెత్ బేల్ గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. 36వ నిమిషంలో టిమోతి చేసిన గోల్‌తో అమెరికా ఖాతా తెరిచింది. మ్యాచ్ ‘డ్రా’ కావడంతో రెండు జట్లుకు ఒక్కో పాయింట్ దక్కింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో సంచలనాల జాబితా.. ఇప్పుడు సౌదీ.. అప్పట్లో -
‘ఫ్రెంచ్ కిక్’ అదిరేనా!
తొమ్మిది దశాబ్దాల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు టైటిల్ నిలబెట్టుకొని 60 ఏళ్లు గడిచాయి. చివరిసారి బ్రెజిల్ జట్టు ఈ ఘనత సాధించింది. బ్రెజిల్ వరుసగా 1958, 1962 ప్రపంచకప్‌లలో చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో విజేత జట్టు తదుపరి ప్రపంచకప్‌లో టైటిల్ సాధించలేకపోయింది. 1994 తర్వాత ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన యూరోప్ జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ దాటడంలో విఫలమవుతోంది. చరిత్రపరంగా చూస్తే ప్రస్తుత విజేత ఫ్రాన్స్ జట్టుకు ప్రతికూలాంశాలు ఉన్నాయనుకోవాలి. కానీ ఎంతోమంది స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఫ్రాన్స్ జట్టు ఖతర్‌లో చరిత్రను తిరగరాస్తుందా? 60 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలుస్తుందా వేచి చూడాలి. ఫ్రాన్స్ బలగాన్ని చూస్తే మాత్రం గ్రూప్ ‘డి’లో ఉన్న మిగతా జట్లు డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియాలను దాటుకొని నాకౌట్ దశకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరో అవకాశం ఉండని నాకౌట్ దశ నుంచి ఆ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. ఫ్రాన్స్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: విజేత (1998, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 4. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘డి’ విన్నర్. ప్రపంచకప్‌లో 16వసారి బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్ జట్టు క్వాలిఫయింగ్ పోటీల్లో అజేయంగా నిలిచింది. యూరో టోర్నీలో వైఫల్యం తర్వాత గత ఏడాది నేషన్స్ లీగ్ టైటిల్‌ను సాధించి ‘ది బ్లూస్’ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కొని 2018 ప్రపంచకప్‌నకు దూరమైన 34 ఏళ్ల స్టార్ స్ట్రయికర్ కరీమ్ బెంజెమా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఆడనుండటం శుభసూచకం. ఈ ఏడాది యూరోప్ ప్రొఫెషనల్ లీగ్స్ చాంపియన్స్ లీగ్, లా లీగాలో రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టుకు టైటిల్ దక్కడంలో కరీమ్ బెంజెమా కీలకపాత్ర పోషించాడు. కరీమ్ బెంజెమాతోపాటు ఇతర స్టార్ ఆటగాళ్లు కిలియాన్ ఎంబాపె, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్ రాణిస్తే మాత్రం ఫ్రాన్స్ జట్టు ఈసారీ ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రూప్ దశలో ఒక్క డెన్మార్క్ తప్ప ఇతర జట్ల నుంచి ఫ్రాన్స్‌కు గట్టిపోటీ లభించే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. గ్రూప్ దశ దాటి నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత పొందాకే ఫ్రాన్స్ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. డెన్మార్క్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్స్ (1998). ‘ఫిఫా’ ర్యాంక్: 10. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎఫ్’ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న డెన్మార్క్ క్వాలిఫయింగ్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆడిన పది మ్యాచ్‌ల్లో తొమ్మిదింట గెలిచి, కేవలం ఒక మ్యాచ్‌లో ఓడింది. 30 గోల్స్ సాధించి, కేవలం మూడు గోల్స్ ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది. స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్పైనే అందరి దృష్టి ఉంది. ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా సమష్టిగా రాణించడం డెన్మార్క్ జట్టు ప్రత్యేకత. తమ గ్రూప్‌లో ఫ్రాన్స్ జట్టుతో మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లో డెన్మార్క్ జట్టుకు విజయాలు దక్కే అవకాశాలున్నాయి. తాము ఆడిన గత నాలుగు ప్రపంచకప్‌లలో డెన్మార్క్ గ్రూప్ దశను దాటి నాకౌట్ రౌండ్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ఈసారి ఆ జట్టు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగుస్తుందో ముందుకు సాగుతుందో చూడాలి. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2006). ‘ఫిఫా’ ర్యాంక్: 38. అర్హత ఎలా: ఆసియా–దక్షిణ అమెరికా మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా నాకౌట్ దశకు చేరాలంటే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ట్యునీషియాపై ఆ జట్టుకు గెలిచే అవకాశాలున్నా... ఫ్రాన్స్, డెన్మార్క్ జట్ల మ్యాచ్‌ల ఫలితాలే ఆ జట్టుకు కీలకం కానున్నాయి. యూరోపియన్ లీగ్స్‌లో పలు మేటి జట్లకు ఆడిన స్ట్రయికర్ అజ్దిన్ రుస్టిక్పై ఆసీస్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. గత రెండు ప్రపంచకప్‌లలో ఆసీస్ ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈసారి తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఆడనున్న ఆస్ట్రేలియా కనీసం ‘డ్రా’తో గట్టెక్కినా అది విజయంతో సమానమే. ట్యునీషియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 30. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్ ఆడుతున్న ట్యునీషియా జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడే అలవాటున్న ట్యునీషియా ఈ ఏడాది 12 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు గోల్స్ మాత్రమే తమ ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. వాబి ఖాజ్రి, యూసెఫ్ మసాక్ని, నయీమ్ జట్టులోని కీలక ఆటగాళ్లు. పటిష్ట జట్లయిన ఫ్రాన్స్, డెన్మార్క్‌లతో జరిగే మ్యాచ్‌లే ఈ మెగా ఈవెంట్లో ట్యునీషియా ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. –సాక్షి క్రీడా విభాగం -
భారత రెజ్లర్ల పసిడి పట్టు
ట్యూనిషియాలో జరిగిన జుహైర్ ఎస్గయిర్ అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత మహిళా రెజ్లర్లు ఏడు పతకాలతో అదరగొట్టారు. ఫ్రీస్టయిల్ విభాగంలో 145 పాయింట్లతో ఓవరాల్ టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అంతిమ్ (53 కేజీలు), సరిత (59 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. నిషా (68 కేజీలు), బిపాషా (72 కేజీలు) రజత పతకాలు... మాన్సి (57 కేజీలు), సాక్షి (62 కేజీలు), మనీషా (65 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. చదవండి: Sri Lanka Crisis: శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం.. టీ20 లీగ్ వాయిదా..! -
ట్యునీసియా కేబినెట్లో రికార్డు స్థాయిలో మహిళలు
ట్యునిస్: ఆఫ్రికా దేశం ట్యునీసియాలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్లో అత్యధిక సంఖ్యలో మహిళలకు చోటు దక్కింది. అధ్యక్షుడు కైస్ సయీద్ దాదాపు రెండు నెలల క్రితం అప్పటి కేబినెట్‌ను బర్తరఫ్ చేసి, సర్వాధికారాలను చేజిక్కించుకున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఆయన ప్రధాని పదవికి నజ్లా బౌడెన్ పేరును ప్రతిపాదించారు. తాజాగా, దేశానికి ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బౌడెన్ 24 మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రధానితో కలిపి అత్యధిక సంఖ్యలో 10 మంది మహిళలే ఉండటం గమనార్హం. అవినీతిపై పోరాటమే తమ లక్ష్యమని సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బౌడెన్ ప్రకటించారు. -
కరోనాతో రాజకీయ సంక్షోభం: ప్రధానమంత్రి తొలగింపు
టూనిస్ (ట్యూనిషియా): మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ప్రజలతో పాటు ప్రభుత్వాలను కుప్పకూలుస్తోంది. తాజాగా ట్యూనిషియా దేశంలో కరోనా ప్రభావంతో ఏకంగా ప్రధానమంత్రినే తొలగించారు. దేశ అధ్యక్షుడు మొత్తం పార్లమెంట్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై తాజా మాజీ ప్రధానమంత్రి అధ్యక్షుడి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి కావాల్సిన పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ పార్లమెంట్‌ను రద్దు చేయడంపై మండిపడుతున్నారు. దీంతో ప్రస్తుతం టునిషీయాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ట్యూనిషియాలో కరోనా తీవ్రంగా ప్రబలింది. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే కొన్ని నెలల కిందట ఆరోగ్య శాఖ మంత్రిని పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆ దేశంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాజధాని నగరం టునీస్‌లో ప్రజలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అధికార పార్టీ ఎన్నాహద్ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. కంప్యూటర్లు పగులగొట్టి.. నిప్పు పెట్టి హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతుండడంతో దేశ అధ్యక్షుడు కైస్ సయీద్ ప్రధానమంత్రి హిచెమ్ మెచిచిని పదవిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌ను రద్దు చేశారు. అధికార పార్టీ ‘ఇస్లామిస్ట్ ఇన్స్పైర్డ్ ఎన్నాహ్‌ద పార్టీ’కి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రదాన నగరాల్లో ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. అయితే అధ్యక్షుడి నిర్ణయాన్ని తాజాగా మాజీ ప్రధానమంత్రిగా అయిన హిచెమ్ మెచిచి తప్పుబట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో అధ్యక్షుడిగా కాయిస్ సయీద్ ఎన్నికయ్యారు. -
అతికష్టం మీద ఒలింపిక్స్‌కు ..కానీ గోల్డ్‌మెడల్‌తో మెరిశాడు
టోక్యో: విశ్వక్రీడల వేదికపై పెను సంచలనం నమోదైంది. ఆదివారం జరిగిన 400 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్‌లో ఏమాత్రం అంచనాలు లేని ట్యునీషియాకు చెందిన 18 ఏళ్ల అహ్మద్ అయూబ్ హఫ్నాయ్ ఏకంగా స్వర్ణ పతకం సాధించి అందరిని అబ్బురపరిచాడు. ఈ రేసును 3 నిమిషాల 43.36 సెకన్లలో పూర్తి చేసిన అతను ఒలింపిక్స్ రికార్డును నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా స్విమ్మర్ జాక్ మెక్లౌగ్లిన్ రజతంతో, అమెరికా స్విమ్మర్ కైరాన్ స్మిత్ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, 2019లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హఫ్నాయ్ 100వ స్థానంలో నిలిచాడు. ఆ తరువాత అతి కష్టం మీద ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ప్రస్తుత ఒలింపిక్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా పూల్‌లోకి దిగిన హఫ్నాయ్.. తొలి ప్రయత్నంలోనే స్వర్ణం సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వాస్తవానికి హఫ్నాయ్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అనుకోకుండా అతని లక్ష్యం మూడేళ్ల ముందుగానే సాకారమైంది. తొలి పతకం సాధించిన సందర్భంగా హఫ్నాయ్ మాట్లాడుతూ.. స్వర్ణం సాధిస్తానని అనుకోలేదని, తన కల సాకారమైనందుకు చాలా ఆనందంగా ఉందని, దేవుడికి కృతజ్ఞతలని పేర్కొన్నాడు. కాగా, హఫ్నాయ్ ట్యూనీషియా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మహ్మద్ హఫ్నాయ్ తనయుడు. -
ట్యునీషియా తీరంలో బోటు మునక: 50 మంది గల్లంతు
ట్యునిస్: ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా తీరంలో వలసదారులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో అందులోని సుమారు 50 మంది గల్లంతయ్యారు. మరో 33 మందిని సమీపంలోని చమురు సంస్థ సిబ్బంది కాపాడారు. ఎస్‌ఫాక్స్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుందని ట్యునీషియా రక్షణ శాఖ తెలిపింది. సురక్షితంగా బయటపడిన వారంతా బంగ్లాదేశీయులేనని అంతర్జాతీయ వలసదారుల సంస్థ పేర్కొంది. లిబియాలోని జవారా రేవు నుంచి బయలుదేరిన ఈ పడవలో 90 మంది వరకు ఉంటారని తెలిసిందని ప్రకటించింది. యూరప్ వెళ్లాలనుకునే వలసదారులు లిబియా మీదుగా ప్రమాదకరమైన ఈ మధ్యదరా సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చదవండి: ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు, ప్రతిదాడులు -
విషంతో రాసిన లేఖ చదవడంతో..
టూనిస్: దేశ అధ్యక్షుడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి విషంతో నింపిన ఓ లేఖను పంపారు. ఆ లేఖను తెరిచిన అధ్యక్షుడి సహాయకురాలు అస్వస్థతకు గురయ్యింది. వెంటనే ఆమెను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఈ ఘటన ట్యూనిషియా దేశంలో జరిగింది. దేశ అధ్యక్షుడిని లక్ష్యంగా ఆ లేఖ పంపారని.. అధ్యక్షుడి చంపేందుకు కుట్ర పన్నారని గుర్తించారు. దీంతో ఆ దేశ అధికారులు అప్రమత్తమై వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ట్యూనిషియా అధ్యక్షుడు కైస్ సయీద్‌కు సోమవారం ఓ లేఖ వచ్చింది. అయితే ఆయన సహాయకురాలు నదియా అకాచ గురువారం అధ్యక్షుడి టేబుల్‌పై పెట్టి ఆ లేఖను తెరచి చూసింది. అందులో ఖాళీ పేపర్ ఉండడంతో అనుమానంగా చూశారు. లేఖ తెరచి చూడగానే ఓ రకమైన వాసన వచ్చింది. ఆ తర్వాత ఆమె కళ్లు మండడం.. తలనొప్పి రావడం మొదలైంది. అనంతరం వెంటనే నీరసించి అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లేఖను దూరం పెట్టారు. అస్వస్థతకు గురైన నదియాను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ట్యూనిషియాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు కైస్ సయీద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎవరు కంగారుపడనవసరం లేదు. విషపు లేఖతో నాకు ఏం కాలేదు. ఆరోగ్యంగా ఉన్నాను’అని ప్రకటించారు. భద్రతా దళాలు విషపు లేఖపై ప్రత్యేక దర్యాప్తు మొదలుపెట్టాయి. -
అజేయ బెల్జియం
కలినిన్‌గ్రాడ్: ప్రపంచకప్ గెలవగల జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టిన బెల్జియం... అదే స్థాయి ఆటతో లీగ్ దశను అజేయంగా ముగించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి 9 పాయింట్లతో గ్రూప్ ‘జి’లో అగ్రస్థానం సాధించింది. గురువారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 1–0తో నెగ్గింది. జానుజాజ్ (54వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. రెండు జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే నాకౌట్ చేరిన నేపథ్యంలో మ్యాచ్ గణాంకాలు గ్రూప్ టాపర్ ఎవరో తేల్చేందుకే ఉపయోగపడ్డాయి. పనామాపై ట్యూనీషియా విజయం గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో పనామాపై ట్యూనీషియా 2–1తో నెగ్గింది. ట్యూనీషియా ఆటగాడు యాసిన్ మెరాయ్ 33వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేయడంతో పనామాకు ఆధిక్యం దక్కింది. అయితే, బెన్ యూసెఫ్ (51వ నిమిషం), ఖజ్రీ (66వ నిమిషం) గోల్స్ చేసి జట్టును గెలిపించారు. -
టునిషియాపై 5-2తో బెల్జియం విజయం
-
బెల్జియం... బెబ్బులిలా
ఫేవరెట్లు జాగ్రత్త పడాల్సిందే! బెంబేలెత్తిస్తున్న బెల్జియంను తట్టుకోవాలంటే తప్పకుండా వ్యూహరచన చేయాల్సిందే. ఈ ఫిఫా ప్రపంచకప్‌లో ‘చాంపియన్ల’కు దీటుగా రాణిస్తున్న జట్టేదైనా ఉందంటే అది బెల్జియమే! మెరికల్లాంటి ఫార్వర్డ్, దుర్భేద్యమైన డిఫెన్స్‌తో రోజు రోజుకూ పటిష్టమైన జట్టుగా ఎదుగుతోంది. గ్రూప్ ‘జి’లో ఇంగ్లండ్ కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరింది. లుకాకు డబుల్ మ్యాజిక్ స్పార్టక్ స్టేడియాన్ని ఊపేసింది. మాస్కో: పనామాపై 3–0తో గెలిచింది బెల్జియం. అయినా కోచ్‌తో మాట పడాల్సి వచ్చింది. కోచ్ రాబెర్టో మార్టినెజ్ ఇదేం ఆట? ఇంత నింపాదిగానా? అని అసంతృప్తి వెలిబుచ్చారు. ఆయన అసంతృప్తికి ఈ మ్యాచ్ సగంలోపే సమాధానమివ్వాలనుకున్నారో ఏమోగానీ బెల్జియం ఆటగాళ్లు బెంబేలెత్తించారు. 3–1తో తొలి భాగాన్ని ముగించిన బెల్జియం... చివరకు 5–2తో ట్యూనిషియాను దడదడలాడించింది. వరుసగా రెండో భారీ విజయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘జి’ నుంచి వరుస విజయాలతో ఈ అర్హత సంపాదించింది. స్పార్టక్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం మ్యాచ్ ఆసాంతం గర్జించింది. స్టార్ స్ట్రయికర్ రొమెలు లుకాకు ఈ మ్యాచ్‌లోనూ రెండు గోల్స్ సాధించాడు. మొత్తం నాలుగు గోల్స్‌తో ఈ టోర్నీలో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) సరసన నిలిచాడు. ఆట ఆరంభమే బెల్జియం ఆధిక్యంతో మొదలైంది. 6వ నిమిషంలో లభించిన పెనాల్టీని మిడ్‌ఫీల్డర్ ఎడెన్ హజార్డ్ గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాలకు ఈ ఆధిక్యం రెట్టింపైంది. ఆట 16వ నిమిషంలో మెర్టెన్స్ ఇచ్చిన పాస్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా లుకాకు గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అయితే రెండు నిమిషాల వ్యవధిలోనే ట్యూనిషియా డిఫెండర్ డిలాన్ బ్రాన్ గోల్ చేయడంతో బెల్జియం ఆధిక్యం 2–1కు తగ్గింది. 18వ నిమిషంలో కెప్టెన్ ఖాజ్రీ ఫ్రికిక్ షాట్‌ను బ్రాన్ గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. ప్రథమార్థం ముగిసే దశలో లుకాకు మరో గోల్ సాధించాడు. ఇంజ్యూరీ టైమ్ (45+3వ ని.)లో మెనియెర్తో కుదిరిన సమన్వయంతో లుకాకు గోల్ చేసి తొలి అర్ధభాగాన్ని 3–1తో ముగించాడు. తర్వాత ద్వితీయార్ధం కూడా ప్రథమార్థంలాగే మొదలైంది. ఆరు నిమిషాల్లో బెల్జియం మళ్లీ గోల్‌తో గర్జించింది. 51వ నిమిషంలో అల్డెర్ విరెల్డ్ నుంచి వచ్చిన బంతిని హజార్డ్ ఛాతితో నియంత్రించి మెరుపు వేగంతో గోల్ కొట్టాడు. అప్పుడు... ఇప్పుడు ఆట మొదలైన ఆరు నిమిషాలకే హజార్డ్ గోల్ చేయడం విశేషం. ఎక్స్ట్రా టైమ్ కంటే ముందే సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియం ఏకంగా 4 గోల్స్ చేయడం ఇదే తొలిసారి. సరిగ్గా 90వ నిమిషంలో టియెలిమన్స్ కార్నర్ దిశగా ఇచ్చిన పాస్‌ను మైకీ బట్షువయి గోల్ పోస్ట్‌లోకి నెట్టేశాడు. దీంతో 5–1 ఆధిక్యంతో గెలిచేందుకు సిద్ధమైంది బెల్జియం. అయితే ఇంజ్యూరీ టైమ్ (90+3వ ని.)లో ఈ సారి ట్యూనిషియా గోల్ సాధించింది. కెప్టెన్ ఖాజ్రీ కొట్టిన ఈ గోల్‌తో ఆధిక్యం 5–2కు తగ్గింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం ఆట అద్భుతంగా సాగింది. 12 సార్లు లక్ష్యంపై గురిపెట్టిన ఆ జట్టు ఐదు సార్లు సఫలమైంది. ప్రత్యర్థి ట్యూని షియా ఐదుసార్లు ప్రయత్నించి 2 గోల్స్‌తో సరిపెట్టుకుంది. బెల్జియం తమ గ్రూప్‌లో చివరి మ్యాచ్‌ను ఈ నెల 28న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ► 2 డిగో మారడోనా తర్వాత ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా లుకాకు చరిత్రకెక్కాడు. 1986లో మారడోనా ఇంగ్లండ్, బెల్జియంలపై రెండేసి గోల్స్ సాధించాడు. ► 5 వరల్డ్‌కప్ చరిత్రలో బెల్జియం ఒక మ్యాచ్‌లో 5 గోల్స్ చేయడం ఇదే ప్రథమం. ఓవరాల్‌గా ఒకే మ్యాచ్‌లో ఏడు గోల్స్ నమోదు కావడం తొమ్మిదోసారి. ► 6 ప్రపంచకప్ గ్రూప్ దశలో బెల్జియంకు ఇది వరుసగా ఆరో విజయం. 2002లో ఒకటి, 2014లో మూడు, ఇప్పుడు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ► 0 గత 13 ప్రపంచకప్‌ల్లో బరిలోకి దిగిన ట్యూనిషియా ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది. నాలుగు డ్రా చేసుకుంటే తొమ్మిదింట పరాజయమే! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కెప్టెన్ గెలిపించాడు
ప్రపంచ కప్‌లో మరో చిన్న జట్టు నుంచి స్ఫూర్తిదాయక పోరాటం. ఇంగ్లండ్ స్ట్రయికర్ల దాడులు... ట్యునీషియా రక్షణ శ్రేణి నిలువరింతల మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌దే పైచేయి అయింది. మొదట్లోనే గోల్ సమర్పించుకున్నా... తర్వాత ట్యునీషియా పట్టుగానే ఆడింది. మాజీ చాంపియన్‌ను నిలువరించి మ్యాచ్‌ను ‘డ్రా’ చేస్తుందేమో అనిపించింది. ఇంజ్యూరీ సమయంలో కెప్టెన్ హ్యారీ కేన్ చేసిన హెడర్ గోల్‌తో గెలిచిన ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. వోల్గోగ్రాడ్: ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా అనుభవాన్ని రంగరించిన ఇంగ్లండ్... ఆఖర్లో ఫలితాన్ని తనవైపు తిప్పుకొంది. సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన గ్రూప్ ‘జి’ మ్యాచ్‌లో ఆ జట్టు 2–1 తేడాతో ట్యునీషియాను ఓడించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ రెండు (11వ ని., 91వ ని.) గోల్స్ చేయగా... ట్యునీషియా తరఫున ఫెర్జానీ ససీ 35వ నిమిషంలో ఒక గోల్ కొట్టాడు. అటు దూకుడు... ఇటు నిలువరింత జెస్సీ లిన్‌గార్డ్ మూడో నిమిషంలోనే దాదాపు గోల్ చేసినంత పని చేయడంతో మ్యాచ్‌ను ఇంగ్లండ్ దూకుడుగా ప్రారంభించింది. అయితే, అతడి షాట్‌ను కీపర్ మోయిజ్ హాసెన్ అడ్డుకున్నాడు. ఆధిపత్యం కొనసాగించిన ఇంగ్లండ్‌కు కొద్దిసేపటికే ఫలితం ద క్కింది. 11వ నిమిషంలో జాన్ స్టోన్స్ కొట్టిన హెడర్ గోల్ పోస్ట్ సమీపం నుంచి వెళ్తుండగా... అందుకున్న హ్యారీ కేన్ ఒడుపుగా స్కోరు చేశాడు. మరోవైపు ట్యు నీషియా అటాకింగ్‌కు దిగడంలో ఆలస్యం చేసింది. వరుసగా రెండు కార్నర్ కిక్‌లు వచ్చినా వినియోగించుకోలేకపోయింది. కానీ, వాకర్... బెన్ యూసఫ్‌ను అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో ఆ జట్టుకు అనుకోని వరంలా పెనాల్టీ లభించింది. దీనిని ససీ వేగవంతమైన షాట్‌తో గోల్‌గా మలిచాడు. అప్రమత్తమైన ఇంగ్లండ్... ఇద్దరు స్ట్రయికర్లను మోహరించి అవకాశాలు సృష్టించుకుంది. ఇవేవీ లాభించకపోవడంతో మొదటి భాగం 1–1తో ముగిసింది. రెండో భాగం పోటాపోటీ... ఇరు జట్లు ప్రభావవంతంగా ఆడకపోవడంతో రెండో భాగం మొదటి పది నిమిషాలు సాధారణంగా సాగింది. తర్వాత బంతిని ఆధీనంలో ఉంచుకుంటూ ఇంగ్లండ్ ఫార్వర్డ్లు జోరు కనబర్చినా ట్యునీషియా రక్షణ శ్రేణి అడ్డుకుంటూ వారి సహనాన్ని పరీక్షించింది. దీంతో ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఇంగ్లండ్ ఏకంగా నలుగురు ఆటగాళ్లతో దాడులకు దిగింది. అయినా నిర్ణీత సమయంలో మరో గోల్ నమోదు కాలేదు. మ్యాచ్ ‘డ్రా’ వైపు మళ్లుతున్నట్లు కనిపించింది. కానీ ఇంజ్యూరీ సమయం ప్రారంభం (90+1)లోనే డిఫెండర్ మగ్యురే నుంచి అందిన బంతిని హ్యారీ కేన్ తలతో గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మిగిలిన స్వల్ప వ్యవధిలో ట్యునీషియా స్కోరు సమం చేయలేకపోయింది. మ్యాచ్‌లో 59 శాతం బంతిని అదుపులో ఉంచుకున్న ఇంగ్లండ్... 17 సార్లు దాడులకు దిగింది. -
ఈ ఇళ్లు భూగర్భంలో..!
నేషనల్ డెస్క్: సాధారణంగా మనకు ఎండ ఎక్కువగా ఉందనిపిస్తే ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుంటాం. యూరప్, అమెరికా వంటి చలితీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఏడారులకు సమీపంలో నివసించే ప్రజలు ప్రతిరోజూ ఈ రెండురకాల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫ్రికా దేశమైన ట్యూనీషియాలో జెబెల్దహార్లోని గ్రామాల్లో నివసిస్తున్న బెర్బెర్ జాతి ప్రజలు ఈ సమస్యకు తమదైన పరిష్కారాన్ని కనుగొన్నారు. సహారా ఎడారికి సమీపంలో ఉండటంతో పగటి పూట వడగాలుల్ని, రాత్రిపూట తీవ్రమైన చలిని తట్టుకునేందుకు వీలుగా నేలను తవ్వి గుహల్లాంటి ఇళ్లను నిర్మించుకున్నారు. వలయాకారం మధ్యలో ఖాళీ ప్రదేశంతో పగలు, రాత్రి స్థిరమైన ఉష్ణోగ్రత ఉండేలా ఈ ఇళ్లను అక్కడి ప్రజలు తీర్చిదిద్దుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఇళ్లను అక్కడి కుటుంబాలు వారసత్వంగా కాపాడుకుంటున్నాయి. సౌర విద్యుత్ సాయంతో రాత్రిపూట ప్రజలు తమ పనుల్ని చక్కబెట్టుకుంటున్నారు. పట్టణీకరణ ప్రభావంతో.. స్థానికులు ప్రధానంగా యువత ఉపాధిని వెతుక్కుంటూ పట్టణాలకు వలసవెళుతుండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రజలు లేక వెలవెలబోతోంది. ఇళ్లతో అనుబంధం పెనవేసుకున్నవారు మాత్రం వదిలివెళ్లట్లేదు. ఈ విషయమై స్థానికురాలు లతీఫా బిన్ యహ్యా(38) మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న, అమ్మ చనిపోయారు. నా కుమార్తెలు వివాహం చేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఐదు గదులున్న ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా. ఇప్పుడు నేను ఈ ఇంటిని వదిలేస్తే ఇల్లు మాదికాకుండా పోతుంది’ అని తెలిపారు. మరికొందరు కొత్త ఇళ్లను నిర్మించుకుని ఈ భూగర్భ గృహాలను స్టోర్‌రూమ్‌లుగా మార్చుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ఫ్రాన్స్ నుంచి 1956, మార్చి 20న స్వాతంత్య్రం పొందిన తర్వాత అధ్యక్షుడు హబీబ్ బోర్గిబా 1960,70 దశకాల్లో చేపట్టిన సంస్కరణల ప్రభావంతో పలువురు బెర్బెర్ జాతి ప్రజలు ఈ భూగర్భ ఇళ్లను వదలి పట్టణాలకు వలస వెళ్లారు. అయితే తమ జాతిని విచ్ఛిన్నం చేసేందుకే అధ్యక్షుడు హబీబీ అప్పట్లో ఈ మార్పులు తీసుకొచ్చాడని పలువురు స్థానికులు ఆరోపించారు. ఆదాయంపై విప్లవ పంజా 1977లో వచ్చిన ‘స్టార్ వార్స్’ సినిమా కోసం ఓ హోటల్ సెట్‌ను ఇక్కడ వేయడంతో ప్రత్యేకమైన నిర్మాణశైలితో ఉన్న ఈ భూగర్భ ఇళ్లకు అంతర్జాతీయంగా సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. అప్పటివరకూ ఆలివ్, పామ్‌జాతి(ఈత,ఖర్జూర) చెట్ల సాగుపై ప్రధానంగా ఆధారపడ్డ స్థానికులు.. పర్యాటకుల కోసం హోటళ్లు ఏర్పాటుచేసి అదనపు ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టారు. అయితే 2011లో చెలరేగిన ‘అరబ్ విప్లవం’తో పరిస్థితి తారుమారైంది. విదేశీ పర్యాటకులపై ట్యూనీషియాలో దాడులు పెరిగిపోవడంతో వారి రాక తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోవడంతో పాటు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న తీవ్రమైన కరువు, భారీ వర్షాలను తట్టుకోలేక పలువురు ప్రజలు ఈ ఇళ్లను వదిలి మెరుగైన జీవితం కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో చివరి భూగర్భ గృహాన్ని తాను 1970లో నిర్మించానని అలీ కయెల్ అనే వ్యక్తి చెప్పారు. ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియాలోని కూబర్పెడీ పట్టణంలోనూ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొండల్ని ఆనుకుని ఇలాంటి నిర్మాణాలే వెలిశాయి. 1915లో ఏర్పడిన ఈ పట్టణంలో ప్రస్తుతం 3,500 మంది ప్రజలుండగా వీరిలో 60 శాతం మంది కొండల్ని తొలిచి భూగర్భంలో నిర్మించిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం ఓపల్(ఓ రకమైన విలువైన రాయి) ఇక్కడే లభ్యమవుతోంది. కప్పడోసియా ఇళ్లు (టర్కీ), వర్జెడియా కేవ్ సిటీ(జార్జియా), కండోవన్(ఇరాన్) లలోనూ ఇలాంటి ఇళ్లున్నాయి. -
ట్యునీషియాలో ఎమర్జెన్సీ..
- రాజధాని నడిబొడ్డున బస్సు పేలుడు.. ఉగ్రదాడిగా అనుమానం - దేశాధ్యక్షుడి దక్షణ దళానికి చెందిన 15 మంది అంగరక్షకుల దుర్మరణం - నెలరోజుల అత్యయిక స్థితి విధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు బెంజీ ఎసెప్సీ ట్యునిష్: ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా రాజధాని ట్యూనిష్ నగరం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. అధ్యక్షుడి కాన్వాయ్ కి చెందిన బస్సును గుర్తుతెలియని దుండగులు పేల్చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళావారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటనలో 15 మంది సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పేలుడు సమయంలో అధ్యక్షుడు అక్కడ లేకపోవటంతో పెను ముప్పు తప్పినట్లయింది. రాజధాని నగరం నడిబొడ్డులో జరిగిన పేలుడుతో ఉలిక్కిపడ్డ ట్యునీషియా ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. నెలరోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీ వెల్లడించారు. కాగా, దాడికి పాల్పడింది ఉగ్రవాదులే అయిఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి లక్ష్యం అధ్యక్షుడే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ తర్వాత అత్యయిక పరిస్థితి ప్రకటించిన దేశం ట్యునీషియానే కావటం గమనార్హం. -
పిల్లలకు నాన్న ప్రేమిస్తున్నాడని చెప్పు!
టునీస్: అప్పటివరకు ఆహ్లాదకరంగావున్న టూనిషియాలోని టూరిస్ట్ రిసార్ట్ హఠాత్తుగా అల్లకల్లోలంగా మారింది. ప్రేయసితో కలిసి సన్ బెడ్‌పై సేదతీరుతున్న ఓ బ్రిటీష్ తండ్రి మాథ్యూ జేమ్స్ (30) తరుముకొస్తున్న మృత్యువును ముందుగానే గ్రహించాడు. పక్కనేవున్న ప్రేయసిని ఒడిసి పట్టుకొని దూసుకొస్తున్న బుల్లెట్ల నుంచి ఆమెకు రక్షణ కవచంలా నిలబడ్డాడు. ‘బేబ్ నిన్నెంతో ప్రేమిస్తున్నా. పారిపో, పారిపో! పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఈ తండ్రి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నానని మరీ మరీ చెప్పు’ అంతే...ఆ తండ్రి నోటి నుంచి మరో మాట రాలేదు. పొత్తి కడుపులో మూడు బుల్లెట్లు దిగడంతో రక్తం మడుగులో కుప్పకూలి పోయాడు. ఆయన ప్రేయసి సాయెర విల్సన్ (26) అక్కడి పారిపోయి హోటల్లోని బట్టల కప్‌బోర్డులో తలదాచుకుంది. కొన్ని గంట తర్వాత ఆమెకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ప్రియుడు మాథ్యూ నుంచే. ప్రాణాపాయ స్థితిలోవున్న తనను సమీపంలోని ఆస్పత్రిలో ఉన్నానని, ఆపరేషన్‌కు సిద్ధం చేస్తున్నారని చెప్పడంతోనే ఫోన్ కటయింది. విల్సన్ ఆస్పత్రికి వెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోవున్న మాథ్యూను దూరం నుంచే చూసి బోరుమంది. ఆ తర్వాత అక్కడికెళ్లిన మీడియా ప్రతినిధులకు జరిగిన సంఘటనను వివరించి చెప్పింది. బ్రిటన్‌లోని కార్డిఫ్‌కు చెందిన తాము టునీషియాలోని బెల్లేవు హోటల్ రిసార్ట్‌కు వచ్చామని, శుక్రవారం ఉదయం హోటల్ ముందు సముద్రం ఒడ్డున సేదతీరుండగా, నల్లటి ముసుగు ధరించిన ఓ టెర్రరిస్ట్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలిపింది. కాల్పుల్లో మాథ్యూ కటివలయం పూర్తిగా ధ్వంసమైందని, ప్రస్తుతం ఆయన బతికితే అంతేచాలని కోరుకుంటోంది. తమకు ఇద్దరు పిల్లలని, మాథ్యూ మొదటి భార్యకు ఒకరుండగా, తనతోని ఒకరు పుట్టారని ఆమె చెప్పింది. తమకు ఇంకా పెళ్లికాలేదని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ జరిపిన కాల్పుల్లో 37 మంది మరణించగా, 36 మంది గాయపడిన విషయం తెల్సిందే. మృతుల్లో ఐదుగురు బ్రిటన్ దేశస్థులు ఉన్నారని బ్రిటన్ విదేశాంగ మంత్రి ఫిలిప్ హమ్మాండ్ శనివారం నాడు ప్రకటించారు. -
నాలుగు దేశాలపై ఉగ్ర పంజా
హింసే తమ మతమని ఉగ్రవాదులు మరోసారి చాటుకున్నారు! ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలోనూ రక్తపుటేర్లు పారించారు. కువైట్, టునీసియా, సిరియా, ఫ్రాన్స్‌లలో అమాయకులను బలిగొన్నారు. కువైట్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన ఓ ఉగ్రవాది శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిపి 25 మందిని చంపేశాడు. టునీసియాలోని ఓ బీచ్‌లో మరో ముష్కరుడు పర్యాటకులపై తూటాలు కురిపించి 28 మంది ప్రాణాలు తీశాడు. ఫ్రాన్స్‌లో ఇంకో ఉగ్రవాది ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి, ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా తల నరికేశాడు. ఆ తలను ఫ్యాక్టరీ గేటుకు తగిలించి రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఇక నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్న సిరియాలో రక్తం రుచి మరిగిన ఐఎస్ ముష్కరులు 146 మందిని హత్య చేశారు. ఈ ఉగ్రవాద చర్యలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. కువైట్ మసీదులో ఐఎస్ ఆత్మాహుతి దాడి 25 మంది మృతి.. 200 మందికి గాయాలు కువైట్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు కువైట్‌లో పేట్రేగిపోయారు. షియాల మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడి 25 మందిని పొట్టనబెట్టుకున్నారు. నగరంలోని అల్-ఇమామ్ అల్-సాదిక్ మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఐఎస్ ఈ ఘాతుకానికి తెగబడింది. దాడికి పాల్పడింది తామేనని, అబు సులేమాన్ అల్-మువాహిద్ అనే మిలిటెంట్ ఆత్మాహుతి దాడి చేసినట్లు ప్రకటించుకుంది. ఈ మసీదులో సున్నీ ముస్లింలకు షియా బోధనలు చేస్తున్నారని, అందుకే దాడి చేసినట్లు ఐఎస్ అనుబంధ సంస్థ నజ్ద్ ప్రావిన్స్ తెలిపింది. 2006 తర్వాత కువైట్‌లో ఉగ్రవాద దాడి చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 25 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయాలపాలైనట్లు ప్రభుత్వ వర్గాలు వె ల్లడించాయి. టునీసియా బీచ్‌లో కాల్పులు 28 మంది మృతి టునిస్: ఉత్తరాఫ్రికా దేశమైన టునీసియాలోని ఒక బీచ్ రిసార్ట్‌లో పర్యాటకులపై ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించారు. అది ఉగ్రవాద దాడిగా అధికారులు నిర్ధారించారు. దేశ రాజధాని టునిస్కు 140 కిమీల దూరంలో ఉన్న సౌస్సెలోని సముద్ర తీరంలో ఉన్న రిసార్ట్ మర్హబాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారన్న టునీసియా ప్రభుత్వం.. వారి వివరాలను వెల్లడించలేదు. ఇది ఉగ్రవాద దాడేనని, ఆ ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయని హోంశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఫ్రాన్స్ ఫ్యాక్టరీలో శిరచ్ఛేదం సెయింట్-క్వెంటిన్-ఫలవీర్: ఫ్రాన్స్‌లోని ఓ చిన్నపట్టణంలో అనుమానిత ఉగ్రవాది శుక్రవారం పట్టపగలు బీభత్సం సృష్టించాడు. ఓ గ్యాస్ ఫ్యాక్టరీపై దాడి చేసి ఒకరి తల నరికి, ఆ తలను ఫ్యాక్టరీ గేటుకు తగిలించాడు. అతడు జరిపిన పేలుళ్లలో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. లియోన్ నగరానికి 40 కి.మీ. దూరంలోని సెయింట్-క్వెంటిన్-ఫలవీర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అమెరికా కంపెనీ ఎయిర్ ప్రొడక్ట్స్‌కు చెందిన ఫ్యాక్టరీలోకి దుండగుడు వాహనంలో దూసుకొచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. శిరచ్ఛేదానికి గురైన వ్యక్తి మృతదేహం వద్ద అరబిక్ అక్షరాల జెండా కనిపించింది. అది ఇస్లామిక్ స్టేట్దని వార్తలొచ్చాయి. నిందితుడిని యాసిన్ సల్హీ(35)గా గుర్తించారు. అతని భార్యనూ అరెస్ట్ చేశారు. సిరియాలో ఐఎస్ నరమేధం 146 మంది పౌరుల బలి బీరట్: సిరియాలో జిహాదీలు మారణహోమం సృష్టించారు.146 మందిని హత్య చేశారు. కొబేన్ప్రాంతంలోని బీరట్‌లో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్ సిరియా(ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు శుక్రవారం పట్టణంలోకి ప్రవేశించి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారు. సమీప గ్రామంలో మరో 26 మందిని చంపేశారు. గత కొన్నివారాలుగా కుర్దీష్ మిలటరీ చేపట్టిన చర్యలకు ప్రతీకారంగా జిహాదీలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. గురువారం జిహాదీలకు చెందిన ముగ్గురు వాహనాల్లో దూసుకొచ్చి బీరట్ పట్టణ ప్రవేశమార్గంలో బాంబులతో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారు. మృతదేహాలు ఇళ్లల్లో, వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో బీరట్‌లో 120 మంది, సమీపంలోని గ్రామంలో మరో 26 మంది పౌరులను ఐఎస్‌కు చెందిన తీవ్రవాదులు హత్య చేశారని సిరియా మానవ హక్కుల పరిశీలక బృందం డెరైక్టర్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. కుబేన్లోని ప్రతి కుటుంబమూ ఒక వ్యక్తిని ఈ మారణహోమంలో కోల్పోయింది. వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని టర్కీ సరిహద్దు ప్రాంతాల్లోకి పారిపోయారు. -
3 దేశాల్లో ఉగ్ర దాడులు, 41 మంది మృతి
-
మూడు దేశాల్లో ఉగ్ర దాడులు, 41 మంది మృతి
సౌసీ/కువైట్/పారిస్: ప్రపంచ దేశాలను పెను ముప్పుగా మారిన ఇస్లాం ఉగ్రవాదులు శుక్రవారం చెలరేగిపోయారు. మూడు ఖండాల్లోని మూడు దేశాల్లో దాడులకు తెగబడ్డారు. 41 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని ఫ్రాన్స్, కువైట్, ట్యునీసియా దేశాల్లో దాడులు చేశారు. ట్యునీసియాలోని పర్యాటక పట్టణం సౌసీలో రెండు హోటళ్లపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో 27 మంది మృతి చెందారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. మరో దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సముద్ర తీరం వెంబడి ఉన్న హోటళ్లపై ఈ దాడి జరిగింది. అయితే దాడులు జరిపింది ఉగ్రవాదులా, కాదా అనేది వెల్లడి కాలేదు. బీచ్ టూరిజానికి ప్రసిద్ధిగాంచిన సౌసీకి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. కువైట్ రాజధాని కువైట్ లో షియా మసీదులో ఇస్లాం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. ఫ్రాన్స్ లోని లియాన్ ప్రాంతానికి సమీపంలోని ఉన్న గ్యాస్ ఫ్యాక్టరీలో ఇస్లాం ఉగ్రవాది దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. వరుస ఉగ్రదాడులతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. -
ట్రక్కు, రైలు ఢీకొని 15 మంది దుర్మరణం
ట్యునిస్ (ట్యునిషియా): ట్యునిషియా రాజధాని ట్యునిస్ సమీపంలో ట్రక్కు, రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో 70 మంది గాయాలపాలయ్యారు. స్థానిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ పెద్ద ట్రక్కు రైలును ఢీకొట్టడంతో 14 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని చెప్పారు. మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడని స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది రైలు ప్రయాణికులేనని రవాణా అధికారులు వెల్లడించారు. రాజధాని ట్యునిస్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాఫోర్ పట్టణం నుంచి బయలుదేరిన రైలు 60 కి.మీ ప్రయాణించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తుంది. రైలు, ట్రక్కు డ్రైవర్లు ఇద్దరూ అధిక వేగంతో వాహనాలను నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. -
కాన్సులేట్ అధికారుల అపహరణ
ట్యూనిస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతోన్న లిబియాలో మరో సంచలనం చోటుచేసుకుంది. రాజధాని ట్రిపోలీలోని ట్యునీషియా రాయబార కార్యాలయంపై సాయుధ ఉగ్రవాదులు దాడి జరిపి 10 మంది అధికారులను అపహరించుకు వెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన ట్యునీషియా ప్రభుత్వం.. బందీలను విడిపించే దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా లిబియా ఉన్నతాధికారులను కోరారు. అయితే లిబియా అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని, ఇలాంటి అపహరణలు మరిన్ని జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజధాని ట్రిపోలీ సహా లిబియాలో ఉన్న తమ దేశస్తులందూ వెంటనే వెనక్కు రావాలని ఆదేశించినట్లు ట్యునీషియా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2011లో గడాఫీ మరణానంతరం తలెత్తిన ఆధిపత్య పోరు లిబియాను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఆసుపత్రులు, స్కూలు భవనాలను నేలకూల్చిన తిరుగుబాటుదారులు తాజాగా రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. -
రికార్డులు బద్దలు కొట్టాలని..
ట్యూనిష్: త్వరలోనే ఓ అరుదైన రికార్డు ద్వారా ట్యూనిషియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కబోతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ జెండాను రూపొందించి ఈ ఘనతను సాధించనుంది. ఇందుకోసం ఏకంగా 80 కిలోమీటర్ల వస్త్రాన్ని ఉపయోగించుకుంటూ మొత్తం 104544 స్క్వేర్ మీటర్లమేరకు దీనిని తయారు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీని బరువు ఏకంగా 12.6 టన్నులు ఉండనుంది. మనౌబా అనే క్యాంపస్‌లో తమ జాతీయ జెండాకు అవమానం జరిగినందుకు ప్రతిగా వారు ఈ పనికి పూనుకున్నారు. ఓ మతానికి చెందిన విద్యార్థి ట్యూనీషియా జెండాను అవమానించేందుకు ప్రయత్నించడంతోపాటు దానిని అడ్డుకున్న ట్యూనిషియా విద్యార్థినిని కిందపడేశాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ట్యూనిషియా ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద జెండాను రూపొందించనుంది. జెండాకు అవమానం జరిగే ఘటనను ప్రతిఘటించిన ఖావోలా రాచిది అనే బాలికకు ఆ దేశ అధ్యక్షుడు సత్కారం కూడా చేయనున్నారు. -
రక్షణ విమానం కూలి 11 మంది మృతి
టూనిస్: నేపాల్ లో విమానం కూలి 18 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన మరువముందే మరో విమానం ప్రమాదానికి గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అయితే ప్రమాద గురైన ఈ విమానం మాత్రం రక్షణ విభాగానికి చెందినది. లిబియన్ మిలటరీ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. టునిషియాకు అత్యంత సమీపంలో సంభవించిన విమాన ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు టునిషియా రక్షణ శాఖ అధికారి ప్రకటించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు రోగులు కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా ప్రమాదానికి జరిగిన కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. ఈ విమానం నుంచి చివరి కాల్ టూనిస్-కార్తేజ్ ఎయిర్ పోర్ట్ కు వచ్చినట్లు నమోదైందన్నారు. -
సిరియాలో 'సెక్స్ జిహాద్'!
తమ దేశ మహిళలు సిరియా వెళ్లి 'సెక్స్ జిహాద్'గా మారి డబ్బులు సంపాదిస్తున్నారని ట్యునీసియా ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి లొట్ఫి బెన్ జెడొవ్ వెల్లడించారు. సిరియా ప్రభుత్వంపై పోరాడుతున్న ఇస్లామిక్ ఉద్యమకారులకు లైంగిక సుఖం అందించడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. 20, 30, 100 మంది తీవ్రవాదులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారని జాతీయ అసెంబ్లీకి తెలిపారు. ఈ విధంగా లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్న మహిళలు జిహాద్ అల్-నిఖా(లైంగిక ధర్మ యుద్ధం-అరబిలో) పేరుతో అక్కడ ఉంటున్నారని వెల్లడించారు. గర్భం ధరించిన తర్వాత స్వదేశానికి తిరిగి వస్తున్నారని తమ ఎంపీలకు లొట్ఫి బెన్ జెడొవ్ తెలిపారు. అయితే ఎంత మంది ట్యునీసియా మహిళలు ఈ విధంగా తిరిగొచ్చారనేది ఆయన వెల్లడించలేదు. వీరు వందల సంఖ్యలో ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది.