
రికార్డులు బద్దలు కొట్టాలని..
ట్యూనిష్: త్వరలోనే ఓ అరుదైన రికార్డు ద్వారా ట్యూనిషియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కబోతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ జెండాను రూపొందించి ఈ ఘనతను సాధించనుంది. ఇందుకోసం ఏకంగా 80 కిలోమీటర్ల వస్త్రాన్ని ఉపయోగించుకుంటూ మొత్తం 104544 స్క్వేర్ మీటర్లమేరకు దీనిని తయారు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీని బరువు ఏకంగా 12.6 టన్నులు ఉండనుంది. మనౌబా అనే క్యాంపస్లో తమ జాతీయ జెండాకు అవమానం జరిగినందుకు ప్రతిగా వారు ఈ పనికి పూనుకున్నారు.
ఓ మతానికి చెందిన విద్యార్థి ట్యూనీషియా జెండాను అవమానించేందుకు ప్రయత్నించడంతోపాటు దానిని అడ్డుకున్న ట్యూనిషియా విద్యార్థినిని కిందపడేశాడు. దీనిని సీరియస్గా తీసుకున్న ట్యూనిషియా ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద జెండాను రూపొందించనుంది. జెండాకు అవమానం జరిగే ఘటనను ప్రతిఘటించిన ఖావోలా రాచిది అనే బాలికకు ఆ దేశ అధ్యక్షుడు సత్కారం కూడా చేయనున్నారు.