FIFA WC 2022: Mitchell Dukes Goal Takes Australia To 1-0 Win Over Tunisia, Details Inside - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: ట్యునీషియాపై విజయం.. బోణీ కొట్టిన ఆస్ట్రేలియా

Published Sat, Nov 26 2022 6:06 PM | Last Updated on Sat, Nov 26 2022 6:25 PM

FIFA WC: Mitchell Dukes Goal Takes Australia To 1-0 Win Over Tunisia - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ చేతిలో 1-4 తేడాతో దారుణ పరాజయం పొందిన ఆస్ట్రేలియా.. ట్యునీషియాతో మ్యాచ్‌లో మాత్రం ఆకట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ట్యునీషియాను 1-0తో ఓడించింది.

ఆట 23వ నిమిషంలో ఆసీస్‌ స్ట్రైకర్‌ మిచెల్‌ డ్యూక్‌ గోల్‌ అందించాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఇరుజట్ల మరొక గోల్‌ చేయకపోవడంతో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా రౌండ్‌ ఆఫ్‌-16 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు డెన్మార్క్‌తో ఆడిన తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ట్యునీషియా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యి ప్రి క్వార్టర్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement