
కలినిన్‌గ్రాడ్: ప్రపంచకప్ గెలవగల జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టిన బెల్జియం... అదే స్థాయి ఆటతో లీగ్ దశను అజేయంగా ముగించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి 9 పాయింట్లతో గ్రూప్ ‘జి’లో అగ్రస్థానం సాధించింది. గురువారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 1–0తో నెగ్గింది. జానుజాజ్ (54వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. రెండు జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే నాకౌట్ చేరిన నేపథ్యంలో మ్యాచ్ గణాంకాలు గ్రూప్ టాపర్ ఎవరో తేల్చేందుకే ఉపయోగపడ్డాయి.
పనామాపై ట్యూనీషియా విజయం
గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో పనామాపై ట్యూనీషియా 2–1తో నెగ్గింది. ట్యూనీషియా ఆటగాడు యాసిన్ మెరాయ్ 33వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేయడంతో పనామాకు ఆధిక్యం దక్కింది. అయితే, బెన్ యూసెఫ్ (51వ నిమిషం), ఖజ్రీ (66వ నిమిషం) గోల్స్ చేసి జట్టును గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment