మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా
సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు.
ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు.
ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్
Comments
Please login to add a commentAdd a comment