FIFA world Cup Qatar 2022: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అందరి కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించిన ఫ్రాన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రపంచ 30వ ర్యాంకర్ ట్యునీషియా 1–0 గోల్‌తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఫ్రాన్స్ జట్టును ఓడించింది.
అయితే ఈ గెలుపు ట్యునీషియాకు నాకౌట్ బెర్త్‌ను అందించలేకపోయింది. ఆట 58వ నిమిషంలో వాహిబి ఖాజ్రి గోల్‌తో ట్యునీషియా విజయాన్ని దక్కించుకుంది. స్టాపేజ్ సమయంలో (90+10వ ని.లో) ఫ్రాన్స్ గ్రీజ్‌మన్ కొట్టిన షాట్ ట్యునీషియా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో స్కోరు సమం అయింది.
అయితే ట్యునీషియా రిఫరీ నిర్ణయాన్ని సమీక్షించడంతో రీప్లేలో ఫ్రాన్స్ గోల్ ఆఫ్‌సైడ్‌గా తేలింది. దాంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. ఫలితంగా 1971 తర్వాత ఫ్రాన్స్‌పై ట్యునీషియాకు రెండో విజయం దక్కింది.
చదవండి: Sanju Samson: పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్ లక్ష్మణ్
టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment